Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kantha Rao"
Khaidi Kannayya (1962) Telugu Songs Lyrics Album Cover

Khaidi Kannayya (1962) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Khaidi Kannayya (1962)
Banner : Rajalakshmi Productions
Music : Rajan - Nagendra
Director : B. Vittalacharya
Producer : Pothina Doondeswara Rao
Actors : Kantha Rao, Rajanala, Gummadi, Relangi
Actresses : Rajasulochana, Girija
Release Date : 01 March 1962
MOVIE HIGHLIGHTS

• Khaidi Kannayya (1962) is a super hit crime-thriller directed by the legendary filmmaker B. Vittalacharya, which was based on the story 'Qaidi No. 911'.

• The film features Kantha Rao in a compelling lead role, showcasing a departure from his usual swashbuckling folklore characters to a more serious social role.

• The musical duo Rajan - Nagendra composed a wonderful soundtrack, with songs like "Theeya Theeyani Thenela Matalatho" becoming timeless hits.

• All the lyrics for this album were penned by G. Krishnamurthy, and the film was noted for its engaging screenplay and tight direction.

• Starring a stellar ensemble cast including Rajanala, Gummadi, and Relangi, the film was a major commercial success during its release.

Ee Nijam Telusuko Song Lyrics – Khaidi Kannayya (1962)

'Ee Nijam Telusuko' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. B. Sreenivas and S. Janaki.

SONG INFORMATION
Movie : Khaidi Kannayya (1962)
Lyricist : G. Krishnamurthy
ఈ నిజం తెలుసుకో తెలివిగా నడుచుకో తెలుగుజాతి భావిశాంతి బాలలే సుమా తేనెల తేటరా ముద్దుల మూటరా తెలుగు మాటతో సమానమేది లేదురా ॥యీ నిజం॥ చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసిందీ నీ కలలన్నీ నిజమవుతాయని ఋజువును చేసిందీ చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసిందీ నీ కలలన్నీ నిజమవుతాయని ఋజువును చేసిందీ ఆకలిలేని శోకములేని లోకము కావాలీ అందరు కలసీ ఆనందముతో ముందుకు పోవాలీ అందరు కలసీ ఆనందంతో ముందుకు పోవాలీ ॥యీ నిజం॥ మతములకోసం సతమతమైతే గతియిక ఏముందీ సమ్మత మన్నది మనలోవుంటే శాంతీ సుఖముందీ నాదనుభావం వుంద నరుడే వానరు డౌతాడు సోదరభావం కుదిరిననాడే మానవు డౌతాడు సోదరభావం కుదిరిననాడే మానవు డౌతాడు ॥యీ నిజం॥ మాటలతోటీ బూటకమాడీ దాటుక పోలేరూ నాటకమున ఏనాటికి అయినా తెరదిగియే తీరూ మాటలతోటీ బూటకమాడీ దాటుక పోలేరూ నాటకమున ఏనాటికి అయినా తెరదిగియే తీరూ వంచనచేసీ సంపాదించేదంతా దండుగరా మంచినిపెంచీ ప్రేమను పంచే బ్రతుకే పండుగరా మంచినిపెంచీ ప్రేమను పంచే బ్రతుకే పండుగరా ॥యీ నిజం॥

Chotekkada Chusedeppudu Song Lyrics – Khaidi Kannayya (1962)

'Chotekkada Chusedeppudu' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Khaidi Kannayya (1962)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela
చోటెక్కడ చూసే దెప్పుడు చిన్న మాటంది చెవిలోచెప్పుడెలా ఎక్కడ ఎప్పుడు ఎలా ॥చోటెక్కడ॥ చేమంతి పువ్వు తీసి చేతిలోన చెయ్యివేసి చేస్తున్నావు బాసను నువ్వు బావా॥ ఆ॥ ఓ....ఊ చుక్కల్లో చిక్కా దిక్కు నువ్వే కావా ఒక్కసారి చిరునవ్వు నవ్విరావా ॥చోటెక్కడ॥ కంటి పాప నవ్వన్నావూ కంటికి రెప్ప కావన్నావూ మాటిచ్చావే దాటేసి పోతావా॥ ఆ॥ ఓ...ఊ జోతొడ కూడి పాడి ఆడే గువ్వా గూడు వీడి వచ్చే నేడు చూడరావా ॥చోటెక్కడ॥

Theeya Theeyani Thenela Matalatho Song Lyrics – Khaidi Kannayya (1962)

'Theeya Theeyani Thenela Matalatho' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and R. Rajasri.

SONG INFORMATION
Movie : Khaidi Kannayya (1962)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela, R. Rajasri
తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ తెలియని చీకటి తొలగించీ వెలుగిచ్చేది చదువేసుమా మానవద్దూ దొంగల చేతికి దొరకనిదీ దానము చేసిన తరగనిదీ పదుగురిలోనా పరువును పెంచీ పేరు తెచ్చే పెన్నిధిదీ పాఠాలన్నీ చదివేస్తాను ఫస్టుగ నేను పాసౌతా శభాష్................ అల్లరి చేయుట చెల్లనిదీ ఎల్లపుడాడుట కూడనిదీ ఏమరరాదు ఏమరరాదు వీరుని వలెనే నిలవాలీ బెదరను నేను అదరను నేను ఏ దెదురైనా ఎదిరిస్తా శభాష్................... బ్రతుకను బాటను కడదాకా నడచియె పోవలె ఒంటరిగా యిడుములు రానీ పిడుగులు పడనీ నీ అడుగులు తడబడక పిడుగులు పడినా జడవను నేను వడివడిగానే అడుగేస్తా శభాష్.................. ॥తీయ తీయని॥

Yavvanam Adhi Song Lyrics – Khaidi Kannayya (1962)

'Yavvanam Adhi' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and Chorus.

SONG INFORMATION
Movie : Khaidi Kannayya (1962)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela, Chorus
యవ్వనం అదీ పువ్వు వంటిదీ నవ్వె మంజరీ ఔ....నా....వా.... వా.... నేటి క్షణమది దాటిపోతదీ నోటిముందె వుందీ... ॥యవ్వనం అదీ॥ లేశావ తాగూ ల ల్లి ల్లా చేజారి సాగూ ఊ - హూ హూ - చనిన నిన్నలో కనని రేపులో చూపు నిలపనేలా అహహ చేతిలో వెన్ననూ వేతువేల నేలా ॥యవ్వనం అదీ॥ నిదానించి చూడూ ల ల్లి ల్లా నిరాశేల వీడూ ఊ హూ హూ... సరాగాలలో సదా తూలుతూ హులాసాగ ఆడూ అహహ బాధలా బరువులా ఈదులాడనేలా......... ॥యవ్వనం అదీ॥ చిరునవ్వు లేవీ ల ల్లి ల్లా విరిసంపంగేలా ఊ హూ హూ బ్రతుకు తోటలో పర్వు వెతుకక ముళ్ళ వేట లేలా అహోహో గాలిలో కలలో తేలిపో యివేళా ॥యవ్వనం అదీ॥

Premaku Kanuka Kavalena Song Lyrics – Khaidi Kannayya (1962)

'Premaku Kanuka Kavalena' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and Madhavapeddi Satyam.

SONG INFORMATION
Movie : Khaidi Kannayya (1962)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela, Madhavapeddi Satyam
అ హ హ హ ఓ హో హో హో హో ల ల్లి ల్ల ల ల్లి లా ప్రేమకు కానుక కావలెనా కావలెనా పడతుల వెనకే పడి తిరిగేవొ పడితే మణులు తెగలవు ॥ప్రేమకు॥ ప్రేమకు కానుక కావలెనే కావలెనే పడితే ప్రేమలో దిక్కుతోచదే వగులూ రాత్రి ధ్యానమదే ॥ప్రేమకు॥ గండు కందిరీగల సందడి చేస్తాది సీమనిసింగ్రీ బాబు అదీ చాలులే యీ కోతలూ ఏది చూస్తా ప్రేమన ఏమిటదీ ప్రేమంటే ప్రే ప్రే ప్రే ఏమంటా మే మే మే ప్రేమంటే ప్రే ప్రే ॥ప్రేమకు॥ రసాలందు గ సీ తిరిగే రోడ్డుసైడు రోమియో ప్రేమేనా గాజుల గలగల చెవిని పడితే మజ్నూగానే మారిపోతా పోతావా పో పో పో నాతోచే రా రా రా పోతావా పో పో పో ॥ప్రేమకు॥ రాకెట్లో నిన్ను పైరు తిప్పెదా రాక్రెండో డ్యాన్సు చెప్పెదా గొప్పులు చెపితే నమ్మనూ నువు చెప్పినవన్నీ చెయ్యగలవా నమ్మిస్తా రా రా రా పొమ్మంటా పో పో పో నమ్మిస్తా రా రా రా ॥ప్రేమకు॥ హ హ హ హ హ హొ ఓ హో హో హో హో ల ల్లి ల ల్లి లా

Andhala Kallu Chudu Song Lyrics – Khaidi Kannayya (1962)

'Andhala Kallu Chudu' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Khaidi Kannayya (1962)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela
అందాల కళ్లచూడు ఉందోయి పాలెగూడు చూశావా చూశావా చూశావా ఆ.... దాగిపో దాగిపో బృష్కా బృష్కా ఆ.... నిన్నె కోరియున్నాను యిన్నాళ్ళుగనూ.... ఆ.... ఆ.... ఆ.... కన్నులారా కన్నాను యీనాడు నినూ.... ఆ.... ఆ ... చింత తీరగ నేను చెంత చేరగలేను యింత మాత్రమే సూచన సుమా చికినికిని జంతకుచికినికి జంతక గుర్రా ॥అందాలకళ్ల॥ రాకరాక వచ్చేవూ రేరాజువలే.... ఆ.... ఆ... ఆ.... కట్టుచేయక నీవు గుట్టుగా దాటిపోవా ఒట్టు నాపై వేసినా సుమా చికినికి జంతకు చికినికి జంతకు గుర్రా ॥అందాలకళ్ల॥ గండుబిల్లి పొంచుందీ నీజాడగనా.... ఆ.... ఆ.... ఆ.... గుండెల్లోన నిన్నుంచి నే దాచెదనా... ఆ... ఆ... ఆ... చెరలాటలు మాని మరియాదగ వేగ పారిపోవోయ్ ప్రియతమా ॥అందాలకళ్ల॥

Theeya Theeyani Thenela Matalatho (Pathos) Lyrics – Khaidi Kannayya (1962)

'Theeya Theeyani Thenela Matalatho (Pathos)' version from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and R. Rajasri.

SONG INFORMATION
Movie : Khaidi Kannayya (1962)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela, R. Rajasri
తీయ తీయని తేనెల మాటలతో తీస్తారుసుమా గోతులు నమ్మవద్దూ తెలియని చీకటి తొలగించీ వెలుగిచ్చేది చదువేసుమా మానవద్దూ దొంగల చేతికి దొరకనిదీ దానము చేసిన తరగనిదీ పదుగురిలో నా పరువును పెంచీ పేరుతెచ్చే పెన్నిధిదీ ॥తీయతీయని॥ అల్లరిచేయుట చెల్లనిదీ ఎల్లపుడాడుట కూడనిదీ ఏడువరాదు ఏమరరాదూ వీరునివలె నీ నిలవాలీ ॥తీయతీయని॥ బ్రతుకను బాటను కడదాకా నడచియెపోవలె ఒంటరిగా యిడుములురానీ పిడుగులుపడనీ నీ అడుగుల వడి తడబడనా పిడుగులు పడినా జడవను నేను వడివడిగానే అడుగేస్తా శభాష్.

Palli Balakrishna Sunday, October 11, 2026



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి.సుశీల, జిక్కీ, పి.బి.శ్రీనివాస్, నాగేంద్ర 
నటీనటులు: కాంతారావు, హరినాథ్, రాజశ్రీ 
దర్శకత్వం: బి.విఠలాచార్య 
నిర్మాత: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జననీ భద్రకరాళ కాళి భగశా పద్యం సాహిత్యం

 

పద్యం: 1

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల

మందారవల్లి:
జననీ భద్రకరాళ కాళి భగశా 
జ్వాలా ముఖీ భైరవీ
తిను నా భావన వాక్కు కర్మల సదా 
నేనమ్మి పూజించితీ
వినవా నా మొర దిక్కు నీవె 
దయతో వీక్షించి రక్షించవా
పెను ఆపత్తున మిత్రుతో బడిన 
నా ప్రాణేశు కాపాడవా



నా కోటి స్వప్నాలు పద్యం సాహిత్యం

 

పద్యం: 2

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

మదనకమరాజు:
నా కోటి స్వప్నాలు నిజముగా చేయగా 
దివినుంచి భువికి ఏతెంచినావె 
వయ్యార మొలికించి వరమాల చూపించి
నారాక కోసమే నిలచినావె 
అరమోడ్పు నేత్రాల ఆనురాగ సుధ జార
నిలువు నిలువున పుల్కలు నింపినావె 
కదలికే లేని నీమధుర అధరాలతో 
మానముగ ఆహ్వాన ముపినావె
వలచి పిలచిన ముద్దార పలుక వేమె 
చెలిమి కోరిన నాపైన అలుక ఏమె 
జాలమాయను చాలనీ వలసినావె 
జాలి చూపించి రావె నన్నేలు కోవే



చిక్కును విప్పవె చినదానా పాట సాహిత్యం

 
పాట: 1

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ, నాగేంద్ర 

తిమ్మరాజు : చిక్కును విప్పవె చినదానా 
చిక్కితి వలపుల వలలో నా 
మొక్కుచు వున్నా ఒట్టు పెట్టినా 
మక్కువ చూపవ్ నామైనా

సుందరి : ముక్కు తెలియదూ, మొగం తెలియదూ
చిక్కెదనా చినవాడా

తిమ్మ : నడుం ఒంపుతో నడక సొంపుతో
గుండెలు గుబ గుబలాడా

సుందరి : ఎక్కడోడవో- టక్కరోడనీ
నక్క జిత్తులూ తెలినే

తిమ్మ :ఉండి పోయనే ఉంగరాల
నీ ముంగురు లందున మనిశే
సుందరి ఒల్లను నే

తిమ్మ : వెళ్ళను నే
సుందరి : ఒల్లనోయి పొమ్మన్నా

ఇద్దరు : హా! హు! హే! చ! 

తిమ్మ : చిక్కును విప్పవె చినదానా 
చిక్కితి వలపుల వలలో నా 
మొక్కుచు వున్నా ఒట్టు పెట్టినా 
మక్కువ చూపవె నామైనా 

సుందరి : ఒంటిదానితో కొంటి చూపులూ 
తుంటరి తనమూ తగదూ
తిమ్మ : ఒప్పుకుంటివా తప్పకుండ 
నీ కాళ్ళకు గజ్జెలు కడుదూ

సుందరి: కల్లకబురులూ కాని మాటలూ 
కన్నెపిల్ల ఎద టేలా!
తిమ్మ : వల్ల కొదనా-వీలు లేదనా- వల్లకాడె బ్రతుకెల్లా!
సుందరి : తగ్గాలి 
తిమ్మ : సిగ్గేలా 
సుందరి : తగ్గవోయి పోతున్నా!
తిమ్మ :చిక్కును విప్పవె చినదానా చిక్కితి వలపుల వలలో నా
వెక్కుచు వున్నా ఒట్టు పెట్టినా మక్కువ చూపవె నామైనా





ప్రేమతో సరియైనదీ పాట సాహిత్యం

 
పాట: 2

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరియైనదీ 
భూమిలో ఏమున్నదీ 
అనుభవించూ అనుభవించూ 
అమర సౌఖ్యమదీ 
పసిడి పొంగుల ప్రాయములో 
పులకరించే వయ్యారమూ 
తళుకు చూపుల భావములో 
తొలికి పోయే శృంగారమూ 
వలపులోని విలువకోరు 
వన్నెలాడిని—వరు డెవ్వరూ

నీవే! నీ వే! నీవే!

కుమిలి పోవుటే నరకమురా 
కులుకుటే సుఖ స్వర్గమ్మురా 
యినుప సంకెల యింకేలరో 
వలపు గొలుసుల బంధింతురా 
మేరులుమీరా-మనసు తీరా 
మేచ్చినానురా - నను చూడరా-





ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
పాట: 3

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 
హృదయము దోచి మది రగిలించీ దాగి పోతావా

ఓ ప్రియతమా!

పూవులు పూయా- కోయల కూయా 
నీవే మనసున మెరిసేవోయీ

కన్నులలోన- వెన్నెలలోనా 
కాంతి కళలు- నీవై కలచేవూ 
వేదన తీరే దారియె లేదా 
బ్రతుకే బరువాయే   

ఓ ప్రియతమా!

శత జన్మాల జత మనదోయీ 
మది మందిరమున నిలచేవోయీ 
నీపై వలపే నాతలపాయే 
తెలిపే రీతి తెలియగద దాయే 
వేయి కన్నులతో వెదకుచు నీ కై 
వేచి యున్నానోయ్-





నీలి మేఘమాలవో పాట సాహిత్యం

 
పాట: 4

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నీలి మేఘమాలవో 
నీలాల తారవో 
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో 

||నీలి మేఘమా!||

నీ మోములోన జాబిలీ దోబూచులాడెనే 
నీకురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే 
నిదురించు వలపు మేల్కొలి దాగిపోదువో

||నీలి మేఘమా!||

నీ కెంపు పెదవి తీయనీ కమనీయ కావ్యమే 
నీవలపు తనివి తీరని మధురాల రావమే. 

||నీలి మేఘమా!||

నిలచేవదేల సాపిలుపు ఆలకించవో 
రాదేల జాలి ఓ చెలీ యీమౌనమేలనే 
రాగాల తేలిపోదమే జాగేల చాలు నే
రావే యుగాల ప్రేయసీ సన్నాదరించవో

||నీలి మేఘమా!||




నీలి మేఘమాలవో - డ్యూయెట్ పాట సాహిత్యం

 
పాట: 5

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

డ్యూయెట్ సాంగ్ :

మదన : నీలి మేఘమాలవో నీలాల తారవో 
నీసోయగాలతో మదినీ దోచి పోదువో
రత్నావళి : నీలి మేఘమాలనో నీలాల తారనో 
నా సోయగాలతో - మదినీ దోచి పోతినో

మదన: నీరాక కోసమే చెలి నేవేచియుంటినే
రత్నావళి : ఆరాటమేలనో ప్రియా నేచెంత నుంటినే
ఇద్దరు: ఆనంద మధుర గీతములా ఆలపింతమా

||నీలి మేఘ||

రత్నా రళి : చివురించు వలపు తీవెల- విరిపూలు పూయగా
మదన : చిరునవ్వు విరుపులోపల హరివిల్లు విరియగా
ఇద్దరు నెలవంక నావలోన మనమూ కలసి పోదమా

||నీలి మేఘ||

రత్నావళి : మనలోన కలత మాయమై మన ఆశ తీరెగా
మదన : అనురాగ రాగమే యిక మనరాగమాయెగా
ఇద్దరు : మనసార ప్రేమ మాధురులా సాగి పోదమా




తేలిపోదామా-యీహాయిలోనా పాట సాహిత్యం

 
పాట: 6

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

డ్యూయెట్ సాంగ్ :

రత్నావళి : తేలిపోదామా-యీహాయిలోనా
మదన : గాలిలో పూవులై
ఇద్దరూ : తేలిపోదామా యీహాయిలోనా
మదన : కన్నులలోని కాటుక నై- నే
కరుగుచు నీలో కలిసెద నే
రత్నావళి : హృదయములోని కదలిక నై- నే ముదమలరించి మురిసేద నే
మదన : కామిత మీడేరే కొనుకగా మారే 
రత్నావళి : కలయె నిజమాయే

||తేలిపోదామా||

రత్నావళి : వెన్నెలలోని ''వెలుగే మీరూ
మదన : వెలుగున దాగే చలువే నీవూ
ఠత్నా : సుందరమా నా స్వప్నమె నీవూ
మదన : స్వప్నములోని స్వర్గమె నీవూ
రత్నా భూమిని మనసాటి
మదన : ప్రేమికులే లేరు
ఇద్దరూ : బ్రతుకే వలపాయే


Palli Balakrishna Monday, May 4, 2026



చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, దాశరథి, జి.కృష్ణమూర్తి 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, యస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కాంతారావు, రాజనాల, యస్.వరలక్ష్మి, రాజశ్రీ, ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, బాలమణి 
దర్శకత్వం: బి.విఠలాచార్య 
నిర్మాత: సుందర్ లాల్ నహత 
విడుదల తేది: 28.01.1965



Songs List:



అదుగో అదుగో పూదోట పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్. జానకి

అదుగో అదుగో పూదోట
ఎదురై ఆడెను సయ్యాట. 
రారేమె, రారేమె చెలులారా 
ఈరోజు ఆడాలి మనసారా

॥అదుగో అదుగో॥

కొమ్మ కొమ్మలో కోయిల గానం 
"కో"యని సాగినది.
రెమ్మ రెమ్మలో కమ్మని రాగం 
రిమ ఝిమ లాడినది

చిగురులు వేసి, సొగసుగ పూచీ 
జగమే నిగనగ లాడినది

॥అదుగో అదుగో॥

అల్లనసాగే అందెలు తామే ఘల్లున మ్రోగినవీ 
పిల్లగాలిలో ఉల్లము తానే జిల్లున రేగినది -

పరుగులు తీసి పందెము వేసి 
పరువము జలజల పారినది

॥అముగో అదుగో॥




గుర్రమెక్కి పోతున్న పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల 

గుర్రమెక్కి పోతున్న 
ఎర్రబుగ్గల చిన్నోడా
కుర్రదాని సంగతేమిరా 
దాని కోడెవయసు చూడవేమిరా!

మంచినీళ్ళ బావికాడ మాటాడాలనుకొంటి 
మామిళ్ళ తోటలో మనసియ్యా లనుకొంటి 
ముస్తాబై వుంటి - వస్తావనుకుంటి
చుక్కపొడిచేదాకా - చూస్తూనే కూసుంటి

జొన్నకండె లిస్తాను జుంటి తేనె లిస్తాను 
ఎన్నడు వాడిపోని కన్నెవలపు లిస్తాను 
తోడుగ వస్తాను - జోడుగ వస్తాను 
నీ నవ్వుకోసం నా ప్రాణమైన యిస్తాను




మరి మరి రాదూ మదుర క్షణమూ పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: యస్. జానకి 

మరి మరి రాదూ మదుర క్షణమూ 
ఉందోయి నీముందే ఆనందించుము

గాలివీవన నీకోసం పూలవాసన నీకోసం 
తార కులికే నీకోసం కోరవలపే నీకోసం 
దాచిందీ యీ లోకం రా _ దోచుకుందము

మీటవోయ్ వీణ మ్రోగుతందీ 
కోటి స్వరముల తూగుతుందీ 
మోటతనమే మానవోయీ 
పాట నడుమనే ఆగునోయీ 
రంగేళి నా రాజా రాగాల సాగుము 



కోటికి ఒక్కడులే నాబావా! పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి

కోటికి ఒక్కడులే నాబావా! 
చేతికి చిక్కెసులే నాబావా! 
తై తై లాడిస్తా - ఎంతో ఊరిస్తా 
ఏమేమో చేసేస్తా బలే బలే బలేగా

తీయని సన్నాయి పలుకును రేపే 
తీరని కోరిక తీరును రేపే 
మనసున మల్లెలు నవ్వును రేపే 
కిలకిలకిలమని కుషీ కుషీగా

ముక్కుకు తాడేసీ నాతో నడిపిస్తా 
టక్కరి బావను దారికి తెచ్చేస్తా 
చెబితే వినకుంటే చెళ్ళున వడ్డిస్తా
వలపులు చిలికిస్తా అలా అలా అలాగా



రమ్మన్నావని రాలేదు పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

రమ్మన్నావని రాలేదు 
పొమ్మన్నావని పోలేను 
కలలో ఎందుకు కనపడలేదని 
అడగాలనుకున్నాను

కత్తులు విసిరిన చేయి 
కండలు తిరిగిన చేయి 
మెత్తని పువ్వుల గుత్తులు నాపై 
మెల్ల మెల్లగా విసురుతువుంటే 
చూడాలనుకున్నాను

పచ్చిక పానుపుపైన 
విచ్చిన వెన్నెలలోన 
ముచ్చటలెన్నో మురిపాలెన్నో 
ముద్దు ముద్దుగా తెలుపుతువుంటే 
విందామనుకున్నాను



ఔననవు కాదనవు పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి  
గానం: పి. బి. శ్రీనివాస్

ఔననవు కాదనవు 
మౌనమేలనే చెలి 
ఏమను. ఏమనను 
ఎదుట నిలిచె జాబిలి

తొందర నడకలు చాలు 
కందును నీపాదాలు 
ఎదిగిన వలపులు 
ఎదలో కదలగ -ఏదో చక్కిలిగిలి

సిగ్గుల భరిణవు నీవు 
నాచేతికి అందకపోవు 
అందము నీ కనువిందుల 
సేయగ_ఎందుకులే కౌగిలి




పండగ చేతము రారమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి 

పండగ చేతము రారమ్మా 
మన చిట్టి పుట్టినరోజమ్మా 
రేపోమాపో కల్యాణం 
రాణీ కాగల శుభయోగం

నిన్న మొన్న దాక చిన్నారి రెమ్మ 
నేడు నిండైన బంగారు బొమ్మ 
వయసు, సొగసుగల చిలకమ్మా

వాలు చూపులతో బాణాలు వేయు 
కొంటినవ్వులతో ప్రాణాలుతీయు 
అవునే, అవునే, అది నిజమమ్మా

ఎంత వన్నెలాడి వే 
ఎంత చిలిపిదానివే 
నీదేలే, నీదేలే భాగ్యమూ

కనువిందైన అందాలరాజు 
నిను చేపట్టితే బిలేమోజు 
వారెవా, వారెవా, వారెవాహ్వ!

నీ చెలికాని మనసున మెలిగి 
నిమ్మపండంటి పిల్లలు కలిగి 
కలిసి, మెలిసీ, వర్ధిల్లమ్మా

మము మరచిపోదువో 
ఇక మురిసిపోదువో 
నీదెలే, నీదెలే భాగ్యము

Palli Balakrishna Sunday, May 3, 2026



చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కాంతారావు, రామకృష్ణ, రాజనాల, విజయలలిత, అనిత, రాజబాబు
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాత: టి.వి.రాజు
విడుదల తేది: 19.02.1971



Songs List:



అనురాగ తీరాలలో పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

అనురాగ తీరాలలో
నీ కనుపాప దీపాలలో
చిన్నారిని, నే నున్నాననీ
దరిచేరరావా ప్రియా 

అనురాగ తీరాలలో
నా కనుపాప దీపాలలో
చిన్నారివి, నీవున్నావసీ
దరిచేర లేదా సఖీ 

కడగంట నిను చూసి
కొనకొంగు ముడి వేసి
జత చేరుకోవాలనీ
వేచేనులే వెయ్యేళ్ళైననూ
వేచేనులే వెయ్యేళ్ళైనసూ

ఆరోజు రావాలనీ
ఆరోజు తలపోసి
ఈ వేళ నను చూసి
నునుసిగ్గు నీ కేలనే
జవరాలివి, నా ప్రియురాలివీ
తొలిరేయి నేడే చెలీ



చెంగున దూకే పరువాలు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.జానకి

చెంగునదూకే పరువాలు కో అన్నవి !
పొంగులు వారే హృదయాలు సై అన్నవి
విరిసే ఈ వేళలో
వీచే ఈ గాలిలో

ఎన్నడులేదే ఈ పులకింత
ఎదలో ఏదో తీయని వింత

ఏ మరుడో ! భూపరుడై
దాగ న్నాడో ఏ పొదరింట

జిల్లునసోకే చల్లనినీట
అల్లరిచేసే జల్లుల ఆట
ఈ అలలే ! ఊయలలై
ఆడించేనా ఈ సయ్యాట





మేఘమాల నీవైతే మెరుపు కన్నె నేనే పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి, యస్.పి.బాలు, 

మేఘమాల నీవైతే మెరుపుకన్నె నేనే
స్వాతివాన నేనైతే - జాతిముత్యం నీదే
కురియునోయి వలపువాన - మురిసేను మనసే
ఓ ప్రియురాలా
నా జతగాడా !

నల్లనల్ల మబ్బు - తెల్ల తెల్ల అంచు
ఒళ్ళఝల్లుమనగ కురిసె జలు
ఒళ్ళుఝల్లు మజ్జిగ కురిసె జల్లు
చినుకులందు తడిసి మేను కనువిందులు చేసే
చూసితి సొగసు నిలువదు మనసు
చూసితి సొగసు నిలువదు మనసు
నిలువదు మనసు
నిలువదు మనసు

బయట ఇంతవాన - లోన ఎంత వేడి
మనసులోని తాప మాప మి
మనసులోని తాప మాపవేమి
పండును వలపు
పండును వలపు
తనివితీర చెలియ నీదు ఒడిలోనవాలి
ముచ్చటగొలుపు - పండును వలవు
ముచ్చటగొలుపు పండును వలపు





చూడచక్కని చిన్నోడా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం:  యస్.జానకి

చూడచక్కని చిన్నోడా
ఈడు జోడుగ వున్నోడా
దొంగచూపులు చూచి వలపు
దోచుకున్నోడా నా వాడా
రార మొనగాడా నా వాడా
రార మొనగాడా

వాలుగన్నుల చిన్నదిరా ఇది
వరసలాడుతు - వున్నదిరా
చెంత జేరి - రారమ్మంటే
సిగ్గుపడతా వేమిరా
రార మొనగాడా - నా వాడా
రార మొనగాడా

అద్దమంటీ మనసున్నదిరా
అందమైన వయసున్నదిరా
ముద్దుగుమ్మా పక్కనుంటే
మూతిముడిచే వేమిరా
రార మొనగాడా 'నా వాడా
రార మొనగాడా



గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: అప్పలాచార్య
గానం: పి.బి. శ్రీనివాస్, బి. వసంత

ఓ హెూ హెూయ్...
ఓ హెూ హెయ్
గప్పాం గప్పాం కత్తులు - గమ్మత్తైన కత్తులు
చురకత్తులు దొరకత్తులు
సరి కొత్త కొత్త కత్తులు
బంగారు పిడి చూడు
రంగేళి వరచూడు

ఈలోపల కత్తి పెట్టిచూడు - నీకు
పోరాటం చేతనైతె వాడు

గప్పాం గప్పాం పోరాటం
గప్పాం గప్పాం పోరాటం
చేతనైతె వాడు

పల్నాటి వీరకోళ్ళ పందాలకు వాడినదీ
గోలుకొండనవ్వాబుకు - గొప్ప తెచ్చి పెట్టినవీ పల్నాటి
చేతులెయ్యకండి గుచ్చుకుంటాయండి

గొంతుకోసి చూసుకోండి - తెగకుంటే ఒట్టండీ
ప్రతిరోజు వాడుతుంటే-పదును పెరుగుతాయండీ
ఒకరోజు వాడకున్న మెరుగుతరగబోవండీ
ఎంత దెబ్బ కైనా- ఇవి ఎదురుతిరుగుతాయండీ
డబ్బులిచ్చి తీసుకోండి. దెబ్బ వేసిచూడండీ




దైవం లేదా దైవం లేదా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: అప్పలాచార్య
గానం:  యస్.జానకి

దైవం లేదా, దైవం లేదా!
రగి లేగుండెల సెగలే-కనబడలేదా !

దైవం లేదా
రగిలే గుండెల సెగలే కనబడలేదా
దైవం లేదా
బుసకొట్టే విషవలయంలో
పసిపాపడు బలియౌనా

శిరసొగని వీరకిశోరం
చెఱపాలె కుమి లేనా !
కన్నీళ్ళకు విలు వేలేదా
కన్నీళ్ళకు విలు వే లేదా
కరుణామయు డే లేదా

ఆ దేవుని దీవెనలుంటే
నా దేవుడు రాకుంటాడా !

విషనాగుల కోఱలు విరిచే
పసికందును కొనిపోలేదా !
వికటించిన చీకటిపోదా |
వికటించిన చీకటి పోదా
వేకువ రానేరాదా

దైవం లేదా !
దైవం లేదా !
దైవం లేదా !

Palli Balakrishna Wednesday, November 29, 2023



చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: కాంతారావు, కృష్ణకుమారి, చలం, టి.కృష్ణకుమారి, విజయలలిత, విజయనిర్మల, వాణిశ్రీ, హేమలత
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
నిర్మాతలు: గుత్తికొండ వెంకటరత్నం, సె.హెచ్.ఎల్.ఎన్.రావు
విడుదల తేది: 14.04.1971



Songs List:



ఈ కన్నెగులాబీ విరిసినదోయి పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: దాశరథి 
గానం: ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ 

ఈ కన్నెగులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి 




ఎదురు చూచే నయనాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను ఇన్నాళ్ళు



పదిమందిలో పాటపాడినా.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే...... !!పది!!

చరణం 1:
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..||2||
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే ||2||
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ||2||
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......





రానీ రానీ మైకం రానీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్. ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది 

రానీ రానీ మైకం రానీ పోనీ పోనీ బిడియం పోని 



గూటిలోని పిల్లకు పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: కె.జి. ఆర్. శర్మ
గానం: పి.సుశీల 

గూటిలోని పిల్లకు గుండె ఝల్లుమన్నది 

Palli Balakrishna Tuesday, November 28, 2023



చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి,  కొసరాజు, దాసం గోపాలకృష్ణ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, వసంత 
నటీనటులు: మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కాంతారావు, ప్రభ, జయలక్ష్మి, రమాప్రభ 
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జి. జగదీష్ చంద్ర ప్రసాద్ 
విడుదల తేది: 12.01.1979



Songs List:



కోరికలే గుర్రాలైతే (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
అదుపేలేని మనసునకు - అందని స్వర్గం ఏముంది

తన యింట సిరితోట పూచేనని - తనదారి విరిబాట అయ్యేనని
దినదినము తియ్యన్ని పాటేనని - తాగన్న కలలన్ని పండేనని

సరదాలన్నీ చని చూడాలని సంబర పడుతుంది.
సంపదలన్నీ తనకే గలవని పండుగ చేస్తుంది.
జాబిల్లి తనకున్న విడిదిల్లని వెన్నెల్లు పన్నీటి జలకాలని
హరివిల్లు రతనాల జడబిళ్ళని తారకలు మెడలోని హారాలని
ఆకాశాన్ని దాటేయాలని నిచ్చెన వేస్తుంది 
ఈ లోకాలన్ని గెలిచేయాలని ముచ్చటపడుతుంది



రే రే రేక్కాయలో పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.జానకి

రే రే రేక్కాయలో - ఆ రే రే రేక్కాయలో
సందకాడ సిన్నోడు సందుకాశాడే
సంతసేసి వస్తావుంటే సరసమాడాడే 
బటానీల కోకమీద సిన్న సిటిక వేశాడే
సింతపువ్వ రైకమీద సెయ్యేశాడే.

తల్లోకి మల్లెపూల దండంపాడే
మెళ్ళోకి సెంద్రహారం గొలుసంపాడే
పట్టెమంచం పై కెమొ పరుపంపాడే
గదిలోకి అగరొత్తుల కట్టంపాడే

వంటకెమొ సన్నబియ్యం సంచులంపాడే
కూరకేమొ కొర్రమీను సేపలంపాడే
మంగళగిరి తిరణాళ్ళకి నన్ను తీసికెళ్ళాడే
రంగులరాట్నం ఎక్కించి రంగు సేశాడే




మనసే మన ఆకాశం పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

మనసే మన ఆకాశం - మనమే రవి చంద్రులం
ఇటు రేయి అటు పగలు - ఒకటై వెలిగే ప్రేమికులం
చందమామ నువ్వంట - వెన్నెల్లే నువ్వంట
సూరేడి వెచ్చనీ నీరెండె నువ్వంట
నీ మాట అనుకుంటె మాటలే రావంట
మాటల కందని మనిషివి నువ్వంట
మనుషుల కందని మమతే నువ్వంట
నీకు నీ వారుంటె నా కోసం నువ్వంట
ఏ ఏటి ఒడునా ఇల్లేల మనకంట
ఈ ఒంటివానికి నీ జంట ఇల్లంట 
ఆ యింట గోరంత దీపమై నేనుంట
గోరంత దీపానికి ఇల్లంత వెలుగంట
కొండంత దేవుడికి కోవేలే నేనంట





సలామలేకుం రాణి పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

సలాం లేకుం రాణి | నీ
గులాము నౌతాను 
ముత్యాల పల్లకిలోన నిను
మోసు కెళుతాను

సలాం లేకుం రాజా ! నీ
గులాము నౌతానునువు
మోసుకెళితే నిన్నే : ఎగ
రేసు కెళుతాను !
మరుమల్లె లెందుకులే - నీ
చిరునవ్వులే వుంటే
కరిమబ్బు లెందుకులే - నీ
కురుల నీడలే వుంటె
నీ - జడలోన ఒదిగున్న విరజాజిని
ఓ - జవరాలా నీ ప్రేమ పూజారిని

బృందావనినే వలవుల
ముంగిట నాటాలనీ 
స్వర్గ సుఖాలన్ని ప్రియుని
సందిట చూడాలని
నా కనులార కలగంటి ఇన్నాళ్ళుగా
ఆవి కనుగొంటి ఈనాడు నీ తోడుగా




ఏమి వేషం ఏమి రూపం పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు,  వసంత 

ఏమి వేషం - ఏమి రూపం
ఆహా కథానాయకీ
సావిత్రీ ఐ లవ్వూ !
నచ్చినానా - మెచ్చినావా
ఓహో ఆశదీర్చలేవా
ధర్మరాజా ! ఐ లవ్వూ

నిన్నటి నాటుపిల్ల 
యీ-నాడు బలే రసగుల్లా 
ఒక్క ఛాన్సు యిచ్చిచూడూ
దులిపేస్తా నీతోడూ
సరి సరి - నాకు తెలుసు

నీలో వున్న సరుకు
యిక - పెరుగులే మార్కెట్టు
సావిత్రీ  ఐ లవ్యూ 
ఒకసారి పై కిదెస్తే 
జన్మంతా రుణపడి వుంటా
రేయి పగలు కృషి చేస్తా
ఒకదారి నీకు చూపిస్తా
చూడు చూడు కోతి మూకల్ని
నవ్వు తుండే ఆ వెధవల్ని
ఏవరెటు చస్తే మనకేమీ
లవ్యూ - సావిత్రి ఒహో





కోరికలే గుర్రాలైతే (Male Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

కోరికలే గుర్రాలయితే
ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతిపోతుంది
బ్రతుకే శృతి తప్పుతుంది

నేలవిడిచి సాము చేస్తే
మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తి కొచ్చాయంటే
కాళ్ళు కొట్టు కుంటాయి
గాలి కోటలు కట్టాపు
అవి కూలి తలపై పడ్డాయి
చివరి మెట్టు పైకెక్కావు
చచ్చినట్టు దిగమన్నాయి

పులినిచూచి నక్కలాగ వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడోచూసి మొగుడికి పెట్టినావు వంకలు
అప్పు చేసిన పప్పుకూడు అరగదమ్మా వంటికి
జుట్టు కొద్ది పెట్టిన కొప్పె అందం ఆడదానికి

Palli Balakrishna Monday, October 30, 2023



చిత్రం: కంచుకోటం (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, దేవిక 
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: యు.విశ్వేశ్వర రావు 
విడుదల తేది: 22.03.1967



Songs List:



ఉలికి ఉలికి పడుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

ఉలికులికి పడుతుంది
గిలిగింత పెడుతుంది
ఎందుకో ఏమో నామనసు
ఏ సంగతి నాకేమి తెలుసు
ఇన్నాళ్ళ వలెకాదు ఎట్లాగొ అవుతుంది
చన్నీళ్ళ తాకిడికే ఒళ్ళు జిల్లు మంటుంది
చేపల్లే తాకెనో చూపులే సోకెనో
చెప్పలేనయ్యయ్యో సిగ్గుముంచు కొస్తుంది.....
నీటిలో అలలేమొ నిలిచి పొమ్మన్నాయి
తోటలో పూలేమొ లేచిరమ్మన్నాయి
నీటిలో నిలవనా తోటనే పిలవనా
ఉన్నపాటున లేస్తె ఊరంతనవుతుంది....





సిగ్గెందుకే చెలి పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్రిపురనేని మహరధి 
గానం: పి.సుశీల, ఎస్.జానకి

సిగ్గెందుకే చెలీ సిగ్గెందుకే
అందాలకే నువ్వు అందానివీ
సిగ్గెందుకే భామ సిగ్గెందుకే.....

సిగ్గులేని కొమ్మ పూలులేని రెమ్మ
సిగ్గులోని సిరులు పాలమీది తరగ
సిగ్గందమే  స్త్రీకి సిగ్గందమే 
రంభైన అతిలోక చతియైన
సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే ....
నీరాజు నినుచేరి సరసాలు సాగించ
సిగ్గేమి చేతువే ఏ చోటు దాతువే
విరిసే పెదవులలో మురిసే హృదయములో
దాచుకొందునె సిగ్గు దోచుకొందునే మనసు....
మనసులోని మమత మనసులోనే దాచ
మనసెట్లు తీరునే మనువెట్లు సాగునే
మనసైన నారాజు మనసార నన్నేల
మమతలు తీరునులే మనువే సాగునులే....




లేదు లేదని పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 1
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

చరణం: 2
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కలలోకొచ్చి కబురులు చెప్పే.. జతగాడైనా లేడు.. జతగాడైనా లేడు
ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 3
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
మొగలి రేకుల సొగసు ఉంది.. మొన కన్నులలో పదును ఉంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
అద్దంలో నా అందం చూస్తే.. నిద్దర రానే రాదు.. నిద్దర రానే రాదు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దొస్తావు




ఈ పుట్టిన రోజు పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల

పల్లవి:
ఈ పుట్టినరోజు నీ నోముల పండిన రోజు
దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు

చరణం: 1
తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ (2)
మీలో విరిసే లేత వెలుగులు మా చెలి కన్నుల నింపండి
ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలీ

చరణం: 2
అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా (2)
మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా
ఆ వయ్యారం చూసి చూసి ఆమె ప్రియుడు మురియాలి

చరణం: 3
పురివిప్పి నటియించు నీలాల నెమలి (2)
మీలోని హొయలంత చెలికియ్యరాదా
అందాల చెలి నాట్యమాడేటి వేళ
చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు... ఆ...




ఈడొచ్చిన పిల్లను పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఈడొచ్చిన పిల్లనోయ్ హొయ్ హొయ్
నిన్ను ఆడించే పిల్లనోయ్ సై సై

నువ్వేసే సుక్కకన్న ఎచ్చనైన దాననోయ్
కవ్విస్తే కరగేదాకా కదలనోయ్ హాయ్ హాయ్
కండలున్న మావయ్యకు గుండేలేదట
గుండెలున్న బావయ్యకు గుణమే లేదట
కండలున్నా గుండెలున్నా కన్నెపిల్ల రమ్మంటే
కత్తిలాంటి మగరాయుడు మెత్తనౌనట....
ఇంపుచూసి నా సొంపుచూసి నువు యీల వేయకోయ్
సెంపమీద అబ్బ నొక్కి నొక్కి నువు చిటికె ఏయకోయ్
పట్టుపట్టీ పంతగించి పైట లాగకోయ్
నా పైట లాగితే మనసు పట్టజాలనోయ్....



భం భం భం పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, జమునా రాణి 

భం భం భం భం పట పట పట పట భజగోవిందం
ఏమిటో యీ అనుబంధం
ఎందుకో ఈ ఆనందం....
జం జం జం జం బలె బలె బలె బలె చిటపట బంగారం.
ఏనాటిదో యీ అనుబంధం
చూడవే బ్రహ్మానందం....

అయ్యను మోసంచేశావు
బావయ్యను మడుగులో దోశాపూ
అమ్మ బాబో నిను నమ్మినందుకు
నట్టనడేటను ముంచేస్తావూ....
సందేహంలో పడతావేలా ఏల
అందరిలా నన్ననకే బాల
పూలలోన నీవోలలాడగా
జోల పాడెదనె యిలా యిలా
జోజోజో జోజో జో....
ప్రేమ ఒలక బోస్తున్నావా
నాటకాలు వేస్తున్నావా
అసలు సంగతి బైటికి వస్తే
అయ్యా అపుడేమౌతావూ
ఏమౌతానా? విను 
ఇంటికి అల్లుడనౌతానే నీకు
ఎదురుగానె కూర్చుంటానే
మళ్ళీ మళ్ళీ మాట్లాడావా
భజన చేస్తు కూర్చుంటానే - రామ
భజన చేస్తు కూర్చుంటానే

హరి హరీలరంగ హరి
వైకుంఠవాస హరి
మనయిద్దరికి సరి
మాటాడబోకు మరి
శ్రీమద్రమారమణ గోవిందో హరి 



సరిలేరు నీకెవ్వరూ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, ఎస్.జానకి

పల్లవి:
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సురవైభవాన భాసుర కీర్తిలోనా
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 1
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ....

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

చరణం: 2
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
యవ్వనవీణనూ కవ్వించినావూ...

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 3
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్

అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్

జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ..సరిలేరు నీకెవ్వరూ.....





ఏచటనో గల పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం:  దాశరథి
గానం: ఘంటసాల

ఎచటనోగల స్వర్గమ్ము నిచట దింపి
నన్ను మురిపించి మరపించినావు చెలియ
నీవె జీవితాధారము నీవె దిక్కు
నీదు పాదాల సాక్షిగా నీవె రక్ష





అర్ధరేతిరి కాడ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: యు. విశ్వేశ్వర రావు 
గానం: చక్రవర్తి, ఎల్. అర్. ఈశ్వరి 

అర్ధరేతిరికాడ అత్తయ్య నాకు
కలలోకి వచ్చింది మామో

ఎట్టా ? మాయమ్మా ?
ఆ కలలోన నన్ను అనరాని మాటలతో
అదరగొట్టేసింది మామో నన్ను
బెదరగొట్టేసింది మామో
కొట్టదూ మరి ?
నీయబ్బ నువ్వున్ను నాకన్న బాబునీ
నట్టేట ముంచారు అందీ
నిలువునా ముంచారు గందే 
ఆ ఉసురు ఫలితంగ నా దేవుడూ
నాకు దక్కనే దక్కడందీ
పీడా పొయె 
నాదేవుడూ నాకు దూరమయ్యాడంటే
నాకు దిక్కెవరయ్య మామో
నే ఉళ్లా..?
కడసారి చూపుగా ఒకసారి చూసొస్తా 
నీ దయా నాకుంటె మామో - నువ్వు
తలుపులూ తీయించు మా మో ....

Palli Balakrishna Wednesday, February 2, 2022

Most Recent

Default