పాట: కొశ్శటి మీసాలోడు (2023) సంగీతం: SK బాజీ రచన: కమల్ ఇస్లావత్ గానం: ఇంద్రావతి చౌహాన్ ఆర్టిస్ట్స్: ఇంద్రావతి చౌహాన్ కొరియోగ్రాఫర్: యష్ మాస్టర్ డైరెక్టర్: దాము రెడ్డి విడుదల: 07.06.2023
కొశ్శటి మీసాలోడు పాట సాహిత్యం
పాట: కొశ్శటి మీసాలోడు (2023) సంగీతం: SK బాజీ రచన: కమల్ ఇస్లావత్ గానం: ఇంద్రావతి చౌహాన్ పల్లవి: ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ కొశ్శటి మీసాలోడు పిలగాడు గుచ్చేటి సూపులోడు మెచ్చెటి మాటల్తో నచ్చేటి నవ్వుల్తో నా మనసు దోసినాడు సరిజొడు కుదిరెటోడు మేనొడు భలే జోరుదారుంటడు మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారమస్సొంటోడు వాని రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమైl ముద్దు ముచ్చట తీర్చoగ సిద్ధమైతే చాలు వంకి పతానపు ఉంగరమై తన్లాట వడుతున్నదో పానం పెల్లాడ గోరుతుందో కళ్ళల్ల తిరుగుతుండో వాడు పెదవుల్ల మెదులుతుండో చరణం: 1 తాప తాప కేమో దూపైనట్టు పొల్లగాని రోకు మోపైయ్యిందో యాదిజేసుకుంటు యాపకుతిన్న అవ్వతోడు దండి తీపున్నదో లేక లేక వాడు సుట్టమయ్యివత్తే ముచ్చటాడ మనసు కొట్టుకుందో ఇచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాన్ని మనువు ఆడే మంకు వెట్టుకుoదో సాటు సాటుంగ నన్నే సూస్తున్నడనుకోని సిన్నంగ సిగ్గు వడితీ పూట పూటకు వాడు కంట పడాలని కోటోక్క దేవుల్ల మొక్కుకుంటి తన్లాట వడుతున్నదో పానం పెల్లాడ గోరుతుందో కళ్ళల్ల తిరుగుతుండో వాడు పెదవుల్ల మెదులుతుండో చరణం: 2 వాని నెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు ఎంతటి పున్నెం జేసుకుందో ఒక్కపారి వాని అంగిలెక్క మారి గట్టిగ సుట్టుకోవాలనుందో గుడుగుడు మోటరు సప్పుడింటే సాలు గుండెల్ల గడబిడ సురువైతదో గల గల గాజులు ఘల్లున పట్టీలు వాన్నే తలిసినట్టు మోగినాయో ఇంటి గలుమల్ల గూసోని వాని పరేషానులో పనులన్నీ ఇడిసవెడితీ సాకిరేవు బండోలే వాని దారిగాసి దినమెల్ల రేయల్ల అలసిపోతి తన్లాట వడుతున్నదో పానం పెల్లాడ గోరుతుందో కళ్ళల్ల తిరుగుతుండో వాడు పెదవుల్ల మెదులుతుండో
Song: Koshati Meesalodu (2023)
Palli Balakrishna
Friday, June 9, 2023
