-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Indravati Chauhan"



పాట: కొశ్శటి మీసాలోడు (2023)
సంగీతం: SK బాజీ
రచన: కమల్ ఇస్లావత్ 
గానం: ఇంద్రావతి చౌహాన్
ఆర్టిస్ట్స్: ఇంద్రావతి చౌహాన్
కొరియోగ్రాఫర్: యష్ మాస్టర్
డైరెక్టర్: దాము రెడ్డి 
విడుదల: 07.06.2023


కొశ్శటి మీసాలోడు పాట సాహిత్యం

 

పాట: కొశ్శటి మీసాలోడు (2023)
సంగీతం: SK బాజీ
రచన: కమల్ ఇస్లావత్ 
గానం: ఇంద్రావతి చౌహాన్

పల్లవి:
ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ
ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ

కొశ్శటి మీసాలోడు పిలగాడు 
గుచ్చేటి సూపులోడు 
మెచ్చెటి మాటల్తో నచ్చేటి నవ్వుల్తో
నా మనసు దోసినాడు

సరిజొడు కుదిరెటోడు మేనొడు
భలే జోరుదారుంటడు 
మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారమస్సొంటోడు 

వాని రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే 
నా మనసు బొంగరమైl
ముద్దు ముచ్చట తీర్చoగ సిద్ధమైతే చాలు వంకి
పతానపు ఉంగరమై 

తన్లాట వడుతున్నదో పానం
పెల్లాడ గోరుతుందో 
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో 

చరణం: 1
తాప తాప కేమో దూపైనట్టు 
పొల్లగాని రోకు మోపైయ్యిందో
యాదిజేసుకుంటు యాపకుతిన్న
అవ్వతోడు దండి తీపున్నదో 

లేక లేక వాడు సుట్టమయ్యివత్తే
ముచ్చటాడ మనసు కొట్టుకుందో
ఇచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాన్ని
మనువు ఆడే మంకు వెట్టుకుoదో

సాటు సాటుంగ నన్నే సూస్తున్నడనుకోని
సిన్నంగ సిగ్గు వడితీ 
పూట పూటకు వాడు కంట పడాలని 
కోటోక్క దేవుల్ల మొక్కుకుంటి 

తన్లాట వడుతున్నదో పానం 
పెల్లాడ గోరుతుందో 
కళ్ళల్ల తిరుగుతుండో వాడు 
పెదవుల్ల మెదులుతుండో 

చరణం: 2
వాని నెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు
ఎంతటి పున్నెం జేసుకుందో
ఒక్కపారి వాని అంగిలెక్క మారి
గట్టిగ సుట్టుకోవాలనుందో

గుడుగుడు మోటరు సప్పుడింటే సాలు
గుండెల్ల గడబిడ సురువైతదో 
గల గల గాజులు ఘల్లున పట్టీలు 
వాన్నే తలిసినట్టు మోగినాయో

ఇంటి గలుమల్ల గూసోని వాని పరేషానులో
పనులన్నీ ఇడిసవెడితీ 
సాకిరేవు బండోలే వాని దారిగాసి దినమెల్ల రేయల్ల అలసిపోతి

తన్లాట వడుతున్నదో పానం 
పెల్లాడ గోరుతుందో 
కళ్ళల్ల తిరుగుతుండో వాడు 
పెదవుల్ల మెదులుతుండో

Palli Balakrishna Friday, June 9, 2023



పాట: గంధసిరి వనమాలి (2021)
సంగీతం: SK మదీన్ 
సాహిత్యం: సదాచంద్ర
గానం: ఇంద్రావతి చౌహాన్


గంధసిరి వనమాలి పాట సాహిత్యం

 
పాట: గంధసిరి వనమాలి (2021)
సంగీతం: SK మదీన్ 
సాహిత్యం: సదాచంద్ర
గానం: ఇంద్రావతి చౌహాన్

గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

పిండారబోసినట్టు
ఎండీ ఎన్నెల్ల జల్లు, ఊఊ ఊఊ
నిండార నిన్ను సూడ
వద్దామంటే వాళ్ళు వీళ్ళు, ఊఊ ఊ ఊ

పిండారబోసినట్టు
ఎండీ ఎన్నెల్ల జల్లు
నిండార నిన్ను సూడ
వద్దామంటే వాళ్ళు వీళ్ళు, ఊ ఊ

కాపు కాసి ఆపేస్తే రాకుంటినీ
ఓ గంధసిరి వనమాలి
బందిఖాన నన్ను జేస్తే బాధలుంటిని
ఓ గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి

సందులోకి వచ్చినావు
నన్ను మందలించి పోయినావు
సందెకాడ కల్సినావు
కొంటె సైగలేవో జేసినావు

సేను కాడ కల్సినావు
సెయ్యి సైగ జేసినావు
బాయి కాడ కల్సినావు
బంతిపూలు ఇచ్చినావు
పట్టు చీర కట్టి కొప్పులో మల్లెలెట్టి
కోరుకున్న పోరగాడా
ఆశ పడితి నిన్ను చేరా, ఆ ఆ

ఒట్టు పెట్టుకోని
ఎదురు చూస్త ఉంటిని
గంధసిరి వనమాలి
కట్టుబాటు దాటి బయట రాకుంటిని
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి

ఆఆ ఆ ఆ, నా మనసులోన నిండి నీవు
నీ మనసు నాకు తెలిపినావు
నిన్ను మరిసి ఉండలేను
కలుసుకోగా నీవు రావా నన్ను

నాలుగురిట్ల జెయ్యకు
నన్నూ నవ్వుల పాలు
పదుగురిట్ల పందిట్ల పట్టుకో సిటికనేలు
ఒక్కపొద్దులుండి ముడుపులెన్నో గట్టి
జాగారాలు జేసినారా… జల్ది వచ్చి ఏలుకోవా

మా ఇంటి వాళ్ళతో… నువ్వు మాటలాడరా
గంధసిరి వనమాలి
జంట కట్టి సంబురాల్లో తేలుదామురా
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ


Palli Balakrishna Thursday, December 30, 2021

Most Recent

Default