-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "D. B. Narayana"



చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి 
పద్యాలు: చెర్వు ఆంజనేయ శాస్త్రి 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది సత్యం , ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ , గీతాంజలి, జ్యోతి లక్ష్మి 
దర్శకత్వం: వి. రామచంద్ర రావు 
నిర్మాత: డి. బి. నారాయణ 
విడుదల తేది: 31.08.1972



Songs List:



తొలి చూపు దోచింది పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
తొలిచూపు చూసింది హృదయాన్ని
మరుచూపు వేసింది బంధాన్ని
ప్రతి చూపు చెరిపింది మధ్య దూరాన్ని
ఇక పెళ్ళిచూపులే కలపాలి ఇద్దరిని

చరణం: 1
ఒక చూపు తూపులా గాయాన్ని చేసింది 
వే రొక చూపు వెన్నెల మావులా మెరిసింది 
ఒక చూపు చిలిపిగా గిలిగింతలు పెట్టింది 
నే రాక చూపు నిలువునా గెలుచుకొని వెళ్ళింది 

చరణం: 2
చూపు లున్నందుకు చూసుకోవాలి 
చూచుకున్నది తనది చేసుకోవాలి 
వలపు మొలకెత్తేది ఒక చూపులోనే 
మనసు మనసయ్యేది ఆ చూపుతోనే 

చరణం: 3
ఈడు జోడుగ మనమిద్దరం వెళుతుంటే 
ఎన్నెన్ని చూపులో ఈసుతో చూస్తాయి 
తోడు నీడగ మన మేకమైనామంటే
దేవతల చూపులే దీవెనలు అవుతాయి




నా మీద దయరాదా పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం

నామీద దయరాదా ఇక నైన
నన్ను మైవెయ్యరాదా
నమ్ముకొన్నవాణ్ణి - నీ
నామ జపం చేయువాణి

ఆటిన్ రాణిఅమ్మా
హారతి చెల్లిస్తాను 
జోకరు బొమ్మా నీకూ
జోహారులు చేస్తాను
సెట్టులోకి రావాలి
చేరులోనె కావాలి
పేకాటలో రామదాసు
పేరుమోగి పోవాలి

ఏలాగో చాన్సుతగిలి
ఇల్లరికం వచ్చాను
బావగారి డబ్బంతా క్లబ్బుల్లో పోశాను

పోయిన డబ్బంత తిరిగి 
జేబులోకి రాకుంటె
అప్పుల్లో  మునిగిపోయి
అల్లరిపాలవుతాను




అలాటిలంటి ఆడదాన్ని కాదు పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

అలాటిలాంటి ఆడదాన్ని కాను అబ్బాయో 
ఎలాటిదాన్నొ నా తడాఖ సూపుతానయో 
సాయిత్రీ యేసమేస్తే  యముడు అదిరిపోవాలా 
శిత్తరాంగి ఎత్తులేస్తే  రాజే సిత్తవ్వాలా

వా శిత్తరాంగి మేడలోకి
పావరాయిని పట్టుకోను సారంగయ్యేస్తే
రాజులేనప్పుడు సారంగో - 
నువ్వు రారాదా పోరాదా సారంగో
అంటే
మొగాళ్ళందరూ గుటకలు మింగాలా అమ్మమ్మో
ఈలలు గొట్టి గంతులు యెయ్యాలా అమ్మమ్మో

నా కులుకు సూసినోడూ
నా తళుకు సూసినోదూ
నా సుట్టూతా తిరక్కుండ ఇంటికెల్లలేడూ... 
అలాటిలాంటి.

కత్తి రొణి లావోస్తే  కన్ను సెదిరిపోవాలా
నన్ను గుర్రంపై సూసినోళ్ళ గుండె జారిపోవాలా

ఆ సందున యిలనుగాడొచ్చి 
రావే సెలీ యిలా రావే సెలీ 
నా ప్రాణాలన్నిగూడ నీకే బలీ 
అని మీసం దిప్పితే
మీసాలూ రొయ్యకు లేవంట్రా ఓ సచ్చినోడ
నీ నెత్తురు కళ్ళసూత్తారా - రా - రా డిష్ డిష్ డిష్ డిష్
ఇలా సిత్ర యిసిత్రంగా నే టేజీ ఎక్కానంటే
బస్తీ మీద సవాల్ - గోలుకొండ జమాల్
టీకాసులమ్మ దెబ్బంటె. కాసుకోర బుల్ బుల్ 
అలాటిలాంటి




అమ్మాయిగోరు పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

అమ్మాయ్గారు ... ఓహో .... అమ్మాయిగోరూ 
అవుతారు త్వరలోనే అమ్మగారూ తమరు అమ్మగారు
ఉంగా ఉంగా సంగీతాలే వింటారు.... అహ
ఉయ్యాల జంపాల అంటారు
ఉళ ఉళ హాయీ పాడతారు 
నా ఉబలాటాన్ని జో జో జోల కొడతారు

రాని విద్యలే నేర్పుకుంటారు 
అవి నాని గాడికే నేర్పుకుంటారు 
ముదులన్నీ బాబుకే అంటారు 
నే వద్దకొస్తే వద్దు వద్దు పొమ్మంటారు 

అలసి సొలసి ఒడిలోన వాలేరు 
మన అనురాగ కెరటాల తేలేడు
ఉళ ఉళ హాయీ హాయీ హాయీ పాడుతాను 
మీ ఉబలాటాన్నే జో జో జో కొడతాను.




ఊగకురోయ్ మావ పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఊగకురోయ్ మాఁవా ఊగకురోయ్
ఊగుచు తూగుచు చచ్చేటట్టు తాగకురోయ్
తప్ప తాగకురోయ్
కొప్పు లాగకురోయ్

నడివీధిలో అవ్వ! నన్ను ముట్టకు 
పుచ్చపువ్వులాంటిదాని రెచ్చగొట్టకు 
రైకలిస్తానంటివి కోకలిస్తానంటివి 
చీకటిపడగానే కల్లుపాక వెంటబడితివి 
ఆ కల్లుతోనే బాసలన్నీ గడగడ తాగేస్తిని 

తిమ్మిరి తలకెక్కేదాకా తీసుకుంటావు 
ఆ తీసుకుంది దిగితే చెంపలేసుకుంటావు 
ఈ తాగుళ్ళు మానేసి ఈ తందానాలు తగ్గిస్తే 
ఇద్దరమూ జోడుకట్టి ఒద్దికగా వుందాము
యెన్నాలకే యే డెక్కించి ఉహుఁ ఉహుఁ ఉహూ 




నవ్వరా నువ్వైనా నవ్వరా పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల

నవ్వరా నువై నా నవ్వరా బాబూ 
ఆ నవ్వే నిను పెంచు పాలబువ్వరా బాబూ 

మొలకగా పుట్టావు ఒక తల్లి కడుపులో 
మొగ్గగా పెరిగేవు ఒక కన్నె చేతిలో
ఎందుకు పుట్టావో - ఎందుకు పెరిగేవో 
బదులైనా జెప్పలేని పరమాత్ముని తలచుకొని - నవ్వరా 

మీయమ్మ ఏవని ఎవరైనా అడిగితే
కన్నీరు నింపక నన్నే చూపించరా 
కన్నంత మాత్రాన అమ్మలు కారురా 
కమ్మని మనసున్న ప్రతి ఆడది అమ్మేరా

Palli Balakrishna Tuesday, December 6, 2022



చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యన్. టి.రామారావు, బి.సరోజాదేవి
కథ: ముళ్ళపూడి వెంకటరమణ
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.బి.నారాయణ
విడుదల తేది: 21.08.1964



Songs List:



డివ్వి డివ్వి డివ్విట్టం పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పిఠాపురం, స్వర్ణలత 

పల్లవి:
డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం
డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం

డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం
డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

బాజాలతో బాకాలతో పందిట్లో ఇద్దరం ఒకటౌదాం
బాజాలతో బాకాలతో పందిట్లో ఇద్దరం ఒకటౌదాం

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

చరణం: 1
అందరు చుట్టాలు వస్తారు ఆనందమానందమంటారు
అందరు చుట్టాలు వస్తారు ఆనందమానందమంటారు

అబ్బాయి తొందర చూస్తారు తాము అటుతిరిగి పకపకా నవ్వేరు
అబ్బాయి తొందర చూస్తారు తాము అటుతిరిగి పకపకా నవ్వేరు

ఒహో..డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

చరణం: 2
కవ్వించి సిరులన్ని కలిసొచ్చినా కాబోవు పెళ్ళామే కడు పచ్చన
కొండకు వేశాను ఒక నిచ్చెనా నీ కొంగు తగిలితే ఒళ్ళు నులివెచ్చనా

డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం
డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం

చరణం: 3
బుక్కావసంతాలు జల్లుకొంటాం ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం
బుక్కావసంతాలు జల్లుకొంటాం ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం

దీవించివేస్తారు అక్షంతలూ ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ
దీవించివేస్తారు అక్షంతలూ ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం
 



అందలం ఎక్కాడమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
అందలం ఎక్కాడమ్మ అందకుండా పోయాడమ్మ
ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మ
అందలం ఎక్కాడమ్మ అందకుండా పోయాడమ్మ
ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మ

చరణం: 1
నిన్న రేతిరి తానూ పొన్నచెట్టు నీడా
నిన్న రేతిరి తానూ పొన్నచెట్టు నీడా
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఒడిలోనా ఒదిగినాడమ్మా ఆ ఆ
నా ఎదనిండా నిండినాడమ్మా ఆ ఆ ఆ ఆ

చరణం: 2
ఆ మాటలకు నేనూ మైమరచిపోయానూ
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగానూ
ఆ మాటలకు నేనూ మైమరచిపోయానూ
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగానూ
భళ్లునా తెల్లారిపోయెనమ్మా ఆ ఓ ఓ ఓ..
ఒళ్లు ఝళ్లునా చల్లారిపోయెనమ్మా

అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా

అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా

చరణం: 3
వెన్నెపూసవంటీ కన్నెపిల్ల ఉంటే
వెన్నెపూసవంటీ కన్నెపిల్ల ఉంటే
సన్నజాజులే సిరులూ మల్లెపువ్వులే మణులు
సన్నజాజులే సిరులూ మల్లెపువ్వులే మణులు
నువు లేక కలిమిలేదమ్మా ఆ ఆ
నీకన్నా కలిమి ఏదమ్మా

అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా




మెల్ల మెల్ల మెల్లగా పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి: 
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా 
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా 
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా 
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా 
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా 

చరణం: 1
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో 
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో 
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో 
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో 
ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో 
హా... 

చరణం: 2
నిన్ను చూచి నన్ను నేను మరచినాను 
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను 
నిన్ను చూచి నన్ను నేను మరచినాను 
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను 
దోచుకుందమనే నేను చూచినాను 
దోచుకుందమనే నేను చూచినాను 
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు 

చరణం: 3
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు 
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు 
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు 
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు 
దొరికినాము చివరకు తోడు దొంగలం 
దొరికినాము చివరకు తోడు దొంగలం 
దొరలమై ఏలుదాము వలపు సీమను 
హా...





దేవుడనేవాడున్నాడా పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం 

మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం 

చరణం: 1
మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం 

చరణం: 2 
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు 

బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక
నరుడే ఈ నరలోకం నరకం చేశాడు 
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం 

చరణం: 3
తాము నవ్వుతూ నవ్విస్తారు... కొందరు అందరినీ
తాము నవ్వుతూ నవ్విస్తారు... కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ 
నేను నవ్వితే ఈ లోకం... చూడలేక ఏడ్చింది
నేనేడిస్తే ఈ లోకం... చూసి చూసి నవ్వింది 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం 

మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 
దేవుడనేవాడున్నాడా.... 




గోరొంకగూటికే చేరావు చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి:
గోరొంకగూటికే చేరావు చిలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా

గోరొంకగూటికే చేరావు చిలకా

చరణం: 1
ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు
అలసివుంటావు మనసు చెదరివుంటావు
ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు
అలసివుంటావు మనసు చెదరివుంటావు
మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే
మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే
ఆదమరిచి ఈ రేయి హాయిగా నిదురపో

చరణం: 2
నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ... అబ్బ! ఉండన్నాయీ
నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ... అబ్బ! ఉండన్నాయీ
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా

గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా

గోరొంకగూటికే చేరావు చిలకా




గోరంకకెందుకో కొండంత అలక పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల

పల్లవి:
గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకాగోరంకకెందుకో కొండంత అలక 
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంకకెందుకో కొండంత అలక

చరణం: 1
కోపాలలో ఏదో కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
కోపాలలో ఏదో కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే

చరణం: 2
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో



ఎంకొచ్చిందోయి పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

పల్లవి:
ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్

ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్

చరణం: 1
గళ్ళకోక నువ్విస్తే కట్టుకొన్నదోయ్
నువ్వు కళ్ళతోను కవ్విస్తే నవ్వుకొన్నదోయ్

నవ్వులన్ని నాగమల్లి పూవులన్నదోయ్
నవ్వులన్ని నాగమల్లి పూవులన్నదోయ్
ఈ నచ్చినోడికే మనసు ఇచ్చుకొన్నదోయ్ మావా

ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్

చరణం: 2
మావకూతురనుకొంటూ మనసుపడితివోయ్
నువ్వు మనసుపడ్డ ఏకమే తానుకట్టేనోయ్
మావకూతురనుకొంటూ మనసుపడితివోయ్
నువ్వు మనసుపడ్డ  ఏకమే తానుకట్టేనోయ్

దోసలితో వలపు నువ్వు దోచుకొంటివోయ్
దోసలితో వలపు నువ్వు దోచుకొంటివోయ్
నీ ఆసికాలు నమ్ముకొని ఆశపడ్డదోయ్ మావోయ్

ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్

చరణం: 3
తగువులాడినా చాలు తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ నగలవంటివోయ్
తగువులాడినా చాలు తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ నగలవంటివోయ్ 

తాళిబొట్టు మాత్రమే తక్కువన్నదోయ్
తాళిబొట్టు మాత్రమే తక్కువన్నదోయ్
నీ తల్లో నాలుకమల్లే తానుమెలుగునోయ్ మావా

ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్ మావోయ్

ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్





అడగక ఇచ్చిన మనసే ముద్దు పాట సాహిత్యం

 
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ అందని అందమె ముద్దు

విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం: 1
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం: 2
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు

చరణం: 3
పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు నువ్వు నేను ఊహుహు.హూహు
చెట్టు చేమా జగతికి ముద్దు నువ్వు నేను ముద్దుకు ముద్దు



Palli Balakrishna Friday, March 15, 2019

Most Recent

Default