Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chandra Sekhar Yeleti"
Check (2021)



చిత్రం: చెక్ (2021)
సంగీతం: కళ్యాణి మాలిక్
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వేరియర్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్ 
విడుదల తేది: 26.02.2021



Songs List:



నిన్ను చూడకుండ పాట సాహిత్యం

 
చిత్రం: చెక్ (2021)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: శ్రీమణి
గానం: హరి చరణ్, శక్తి శ్రీ గోపాలన్

పల్లవి:
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగులతో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింక చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాపే లేని లోకం లోన

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను

చరణం: 1
తేది మారని సమయం ఆగని
రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండని
చోటేదో సృష్టించన
కనురెప్పలే మూసుంచినా తీసుంచినా
నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా

చరణం: 2
చూపే ఓ కలిపి మౌనం ఇంకొలిపి
ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో
ఎన్నెన్ని వరసలో
ఏ భాషలో నే పలికినా పలికించినా
ప్రతి మాటలో నీ పేరునే
వినిపించనా

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగులతో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెలుగుల్లో ముంచేస్తాను
అడ్డులకింక చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాపే లేని లోకం లోన

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను


Palli Balakrishna Wednesday, February 17, 2021
Sahasam (2013)


చిత్రం: సాహసం (2013)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్ , గీతామాధురి
నటీనటులు: గోపిచంద్ , తాప్సి
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: బి. వి.యస్. ఎన్.ప్రసాద్
విడుదల తేది: 12.07.2013

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా

రా అంటే రగడాల తీగ లాగుతా
పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడతా
నిప్పు ఉంది లంక ఎక్కడుంది
చప్పుడుంది ఢంకా ఎక్కడుంది

ఆ.. కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్
ఓ.. కొత్తకోణం చూపమన్నాదోయ్ ఓ య్
నీ పనైతే రాత్రికి రాత్రే రాజయోగమోయ్
కాకపోతే చికటిలోన నువ్వో బాగమోయ్
అర్ధమైతె ఆలస్యాన్ని ఆపి అడుగులెయ్ రారా రారా

లే పడితే వదిలేదిలేదు దేనిని
నే దిగితే అది ఎంత లోతని అడగనోన్ని
దమ్ము ఉంది దారి ఎక్కడుంది
సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది

ఆ.. పక్కకొచ్చి పందెమేస్తావా
నీ.. రొక్కమంత పిండుకుంటావా
వేచి ఉంది నీ కోసం అందాల పాచిక
జూదమాడి ఏం కావాలో తీసుకో ఇక
పోగొట్టేనా రాబట్టాల ఎత్తులేసు కోరా రారా

డోలా డోలా డమ్ డమ్ డోలా
సౌఖ్యం లోన అల్లాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
స్వర్గంలోన తారాడాల

నా గురికే తగలాలి పాలపుంతలు
నా దరికే రావాలి అమృత సాగరాలు

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా


******   ******   ******


చిత్రం: సాహసం  (2013)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్ , షర్మిళ

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా

రా అంటే రగడాల తీగ లాగుతా
పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడతా
నిప్పు ఉంది లంక ఎక్కడుంది
చప్పుడుంది ఢంకా ఎక్కడుంది

ఆ.. కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్
ఓ.. కొత్తకోణం చూపమన్నాదోయ్ ఓ య్
నీ పనైతే రాత్రికి రాత్రే రాజయోగమోయ్
కాకపోతే చికటిలోన నువ్వో బాగమోయ్
అర్ధమైతె ఆలస్యాన్ని ఆపి అడుగులెయ్ రారా రారా

లే పడితే వదిలేదిలేదు దేనిని
నే దిగితే అది ఎంత లోతని అడగనోన్ని
దమ్ము ఉంది దారి ఎక్కడుంది
సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది

ఆ.. పక్కకొచ్చి పందెమేస్తావా
నీ.. రొక్కమంత పిండుకుంటావా
వేచి ఉంది నీ కోసం అందాల పాచిక
జూదమాడి ఏం కావాలో తీసుకో ఇక
పోగొట్టేనా రాబట్టాల ఎత్తులేసు కోరా రారా

డోలా డోలా డమ్ డమ్ డోలా
సౌఖ్యం లోన అల్లాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
స్వర్గంలోన తారాడాల

నా గురికే తగలాలి పాలపుంతలు
నా దరికే రావాలి అమృత సాగరాలు

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా



Palli Balakrishna Monday, March 26, 2018
Prayanam (2009)


చిత్రం: ప్రయాణం (2009)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: స్మిత, మహేష్ శంకర్, శ్రీరామ చంద్ర
నటీనటులు: మనోజ్ మంచు, పాయల్ గోష్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: సీత యేలేటి
విడుదల తేది: 29.05.2009

నువ్వు ఎంత కాదన్న ఇది నిజం
నింగి కంటె నా ప్రేమ శాశ్వతము
రుజువెలా చూపగలను ఈ క్షణము

నా మాట తడబాటుగ మారింద
ఈ చోట ఎం తోచక తిరిగింద
ఏమయింది ఏమయింది నా మాట ఆగింది
నా మౌనంలొ తడబాటె దాగుంద
నె చూసె నిజం ముందు కల ఏదొ మిగిలుందా
కలిగింద ఆశ నాకైన తెలియకుండ
కదిలింద ఊహ నన్నైన అడగకుండ
నె చెప్పె బదులుకై నా హృదయం వేచిందంటా


Palli Balakrishna Saturday, August 19, 2017
Anukokunda Oka Roju (2005)


చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: స్మిత
నటీనటులు: జగపతిబాబు, ఛార్మి కౌర్, శశాంక్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: గంగరాజు గుణ్ణం
విడుదల తేది: 30.06.2005

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని (2)

నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం: 1
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంటే
అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం: 2
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని



*********  *********  ***********



చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు, మారుతి
గానం: సునిధి చౌహన్, డొమినిక్యూ సీర్జీయో

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground
తరచి కొలవకు కొలవకు కాలాన్ని
గుర్తుంచుకునేంతగ ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లో
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground

చరణం: 1
సాయంత్రం మనది ఒంటరి ఒంటరి జీవితం
ఈ మంత్రం చెరుపుతున్నది దూరము దూరము
If you wanna sing నాతో గీతం
If you wanna do నాతో నాట్యం
If you wanna spend నాతో సమయం
This is the moment
If you wanna do ఏదైనా కొంచెం
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground

చరణం: 2
చూస్తావా సరిగమ విరిచిన హరివిల్లుని
గీస్తావా అసలు హద్దుకి అవతల హద్దుని
If you wanna sleep పరిగెడుతూనే
If you wanna fly నిలబడుతూనే
If you wanna live చనిపోతూనే
Its not a big deal, you have got it down ఇంకో డ్రింకోటి

Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round

and round and round and round and round



*********  *********  *********



చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు, మారుతి
గానం: సునిధి చౌహన్, డొమినిక్యూ సీర్జీయో

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)

చరణం: 1
ముఖ ముఖాన పరిచయం అసలు లేదు అవసరం
తనువుకి తెలుసు తనువు అవసరం
పెదవి నుంచి పెదవికి తరుగుతుంటె దూరము
ఇంతకు మించి ఎలా పయనము
సోకార్డ్ సోల్ మేట్ కోసమేల నీ వేట
బ్రాండ్ న్యూ దొరుకుతుంటే ప్రతి పూట

షైన న న న న న న న (6)

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)

చరణం: 2
మసక మసక ఎండలో మంచులాగా కరగక
శాశ్వత బంధం మనకెందుకు
అనుభవాల కొలనులో చేపలాగ ఈదక
పసిఫిక్ సంద్రం గొడవెందుకు
హృదయం లోతులన్ని తెరచి చూస్తే టైం వేస్ట్
పరువం ఎత్తులెక్కు అందుతుంది ఎవరెస్ట్

షైన న న న న న న న (6)

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)


*********  *********  ***********



చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు
గానం: శ్రేయా గోషల్

నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండి
స్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటై
దిక్కుల్లొ శూన్యమై శూన్యమై

చరణం: 1
నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

చరణం: 2
ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా
ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో


*********  *********  ***********


చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు
గానం: శ్రేయా గోషల్

రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

చరణం: 1
చేలియో చెల్లకో ఇట్స్ ఇట్స్ నో నో నో నో
చేరియో చేరకో యు గో గో గో గో
రాముడో భీముడో ఇంకేవ్వడో
120 చాలదమ్మా ఇట్స్ సో సో సో సో స్లో

చరణం: 2
చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం
అక్కడ కాదు ఇక్కడే
ముద్దిస్తేనే స్పీడొస్తుందా
అయితే అయితే అయితే

Palli Balakrishna Wednesday, August 16, 2017
Okkadunnadu (2007)



చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: గోపిచంద్ , నేహా జుల్కా
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: చెర్రీ
విడుదల తేది: 03.03.2007



చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: శ్రేయ ఘోషల్

పల్లవి:
ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...

చరణం: 1
కొంచెం తీపి  కొంచెం పులుపు
పంచే ఆ ఉల్లాసమూ
కొంచెం కారం  కొంచెం ఉప్పు
పంచే ఆ ఆవేశమూ
చేదు వగరు చేసే మేలు
సమంగా ఆస్వాదించమనీ ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...
ఇవ్వాళ నా పిలుపు

చరణం: 2
ప్రతి క్షణము ఒక్కో వరమై
సుఖాలే తేవాలని
ప్రతి మనసు ఒక్కో స్వరమై
సంగీతం అవ్వాలని
పల్లవించే పరిచయాలే
స్నేహాలై వికసించాలి అని ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...





చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ
గానం: దేవి శ్రీ ప్రసాద్

పల్లవి:
మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్,  క్లియర్, ఎవర్...
అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా
ఇధర్,  ఉధర్, బ్రదర్...

మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్,  క్లియర్, ఎవర్...

చరణం: 1
వందో  వెయ్యో  లక్షో  గిక్షో రేటు ఉంటుంది తప్పుకి
పర్లెధు చేసి పారేయ్
రింగో చైనో బైకో గియ్కో పోతే పోని ఎంటిలే
నీ స్వేచ్ఛ అగరాదోయ్
మనసెక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండుంటేనే
లైఫ్ లోన అంతో ఇంతో కిక్ ఉంది లేరోయ్

మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్,  క్లియర్, ఎవర్...
అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా
ఇధర్,  ఉధర్, బ్రదర్...

చరణం: 2
ఫుల్లో హాఫో ఎన్నో రౌండో ఆలోచిస్తూ చూడకోయ్
కావాల్సినంత వేసేయ్
గంటో పూటో రాత్రో పగలో  వేస్టే  ఐపోని కాలమే
ఏమంత లాస్ లేదోయయ్
మన కళ్ళకు నచ్చిందల్ల మన సొంతం అవుతుంటేనే
భూమ్మిద పుట్టామంటె అర్ధముందిలేరోయ్





చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్.యమ్.కీరవాణి

పల్లవి:
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా...

చరణం: 1
ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవేం నిరీక్షణమా
నే వెతుకుతున్నా ఎదుటపడవే తొలి వెలుగు తీరమా
అడుగడుగునా ప్రతి మలుపునా రోజూ నా వెంటే పడకు
విడవని పంతముగా నా ప్రాణం తినకు

చరణం: 2
నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా
అయోమయమా
నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా

అడుగడుగునా - అడుగడుగునా
పడిపోయినా - పడిపోయినా
ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా...


Palli Balakrishna Tuesday, August 8, 2017
Aithe (2003)


చిత్రం: ఐతే (2003)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్
నటీనటులు: శశాంక్, జనార్ధన్, మోహిత్, చద్దా, అభిషేక్, సింధూతులని
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: గంగరాజు గుణ్ణం
విడుదల తేది: 11.04.2003

చిటపట చినుకులు అరచేతులలొ ముత్యాలైతె ఐతె
తరగని సిరులతొ తల రాతలనె మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె
అడ్డు చెప్పదె అంబ్రెల్లా ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటె
నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా ఉంటె
అడిగిన తరుణమె పరుగులు తీసె అల్లావుద్దీన్ జీని ఉంటె
చూపద మరి ఆ మాయా దీపం మన ఫేటె  ఫ్లైటయ్యె రన్వె

నడి రాత్రె వస్తావె స్వప్నమ
పగలంత ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినె ఊరిస్తె న్యాయమ
సరదాగ నిజమైతె నష్టమా
మోనాలీసా మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా

వేకువనె మురిపించె ఆశలు
వేను వెంటనె అంత నిట్టూర్పులూ
లోకంలొ లేవ ఏ రంగులు
నలుపొకటె చూపాల కన్నులూ
ఇలాగేనా ప్రతి రోజూ ఎలాగైనా ఏదొ రోజూ మనదై రాదా

చిటపట చినుకులు అరచేతులలొ ముత్యాలైతె ఐతె
తరగని సిరులతొ తల రాతలనె మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె






Palli Balakrishna Saturday, July 29, 2017

Most Recent

Default