Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chandoo Mondeti"
Thandel (2025)



చిత్రం: తండేల్ (2025)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి
దర్శకత్వం:  చందు మొండేటి 
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 07.02.2025



Songs List:



బుజ్జితల్లీ… పాట సాహిత్యం

 
చిత్రం: తండేల్ (2025)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జేవేద్ ఆలి 

గాలిలో ఊగిసలాడే దీపంలా…
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం,
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా…
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం

సుడిగాలిలో పడిపడి లేచే
పడవల్లే తడబడుతున్నా, ఆ ఆ ఆ…

నీకోసం… వేచుందే నా ప్రాణం...
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…

నీరు లేని చేపల్లే
తార లేని నింగల్లే
జీవమేది నాలోనా…?
నువ్వు మాటలాడందే
మళ్లీ యాలకొస్తానే
కాళ్లయేళ్ల పడతానే
లెంపలేసుకుంటానే
ఇంక నిన్ను యిడిపోనే…

ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగ దాటే గట్టోన్నే…
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే…

నీకోసం… వేచుందే నా ప్రాణం…
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…

ఇన్నినాళ్ల మన దూరం
తియ్యనైన ఓ విరహం
చేదులాగా మారిందే
అందిరాక నీ గారం…

దేన్ని కానుకియ్యాలే
ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా
లంచమేటి కావాలే..?

గాలివాన జాడే లేదే
రవ్వంతైనా నా చుట్టూ…
అయినా మునిగిపోతున్నానే
దారే చూపెట్టు…

నీకోసం… వేచుందే నా ప్రాణం…
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…



నమో నమః శివాయ పాట సాహిత్యం

 
చిత్రం: తండేల్ (2025)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: అనురాగ్ కులకర్ణి , హరిప్రియ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ…!
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ…!

నమో నమః… నమో నమః
నమో నమః శివాయ
నమో నమః… నమో నమః
నమో నమః శివాయా


హే, ఢమ ఢమ ఢం అదరగొట్టు
ఢమరుకాన్ని దంచికొట్టు
అష్టదిక్కులదిరేటట్టు తాండవేశ్వరా..

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ 

భం భం భం మొదలుపెట్టు
అమృతాన్ని పంచిపెట్టు
గుండె వెండికొండయేట్టు
కుండలేశ్వరా…

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ 

జై శంకర… జై జై జై శంకర
నిప్పు కన్ను ఇప్పి
జనం తప్పును కాల్చేయ్యరా

జై శంకర… శివ శివ శివ శంకర
త్రిశూలం తిప్పి సూపి
మంచి దారి నడపరా…

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ (4)

మ్, తప్పు చేస్తే
బ్రహ్మ తలనే తుంచినావురా
వేడుకుంటె విషాన్నైనా మింగినావురా

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా
సృష్టిలోన మొదటి ప్రేమ కధే నీదిరా

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

రారా శివరాత్రి సుందర…
మా రాత మార్చి ఉద్దరించరా
అనంతమైన నీ ప్రేమలో
రవ్వంత మాకు ఇస్తే
భూమి స్వర్గమౌనురా…

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ (4)

ఆది ప్రేమిక… నీకు పోలిక
లేదు లేదిక జగాన
భక్త కోటికి… ఉన్న కోరిక
తీర్చుతావయా స్వయానా

ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు
లోకాన్నే ఏలు పరమేశ్వరుడా…
ఏ లోటూ రానీవు… ఎపుడు తోడుంటావు
మగడంటే నువ్వే మహేశ్వరుడా

ఆది నువ్వే… అంతం నువ్వే
కాపాడే ఆపద్భాంధవుడా……

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ (4)

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయా

Palli Balakrishna Tuesday, January 14, 2025
Karthikeya 2 (2022)



చిత్రం: కార్తికేయ 2 (2022)
సంగీతం: కాల భైరవ 
నటినటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ 
దర్శకత్వం: చందూ మొండేటి 
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్ , టి.జి.విశ్వప్రసాద్ 
విడుదల తేది: 12.08.2022



Songs List:



అడిగా నన్ను నేను అడిగా పాట సాహిత్యం

 
చిత్రం: కార్తికేయ 2 (2022)
సంగీతం: కాల భైరవ 
సాహిత్యం: కృష్ణ మదినేని 
గానం: ఇన్నో జెంగ 

అడిగా నన్ను నేను అడిగా
నాకెవ్వరు నువ్వని
అడిగా నిన్ను నేను అడిగానే
నిన్నలా లేనని

నవ్వుతో నన్ను కోసినావె
గాయమైన లేఖనే
చూపుతో ఊపిరాపినావే
మార్చిన కధే ఇలా

నువ్వే కదా ప్రతి క్షణం
క్షణం పెదాలపై
నీతో ఇలా ఇలా జగం
సగం నిజం కదా

గాలివోలె తాకినట్టుగా
నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్టుగా
నన్ను ముంచి పోకలా

రాసివున్నదో రాసుకున్నదో నీతో స్నేహం
కాదు అన్నదో అవును అన్నదో ఏదో మౌనం
కురుల గాలి తగిలి నేనే చెడిపోయా
మనసు దాటి రాని మాట నేను వింటున్నా

ఒ హో ఓ హో ఓ ఓ
ప్రశ్న లేని బదులు నీవులే
ఒ హో ఓ హో ఓ ఓ
నిమిషమైన మరుపురావులే

గాలివోలె తాకినట్టుగా
నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్టుగా
నన్ను ముంచి పోకలా

Palli Balakrishna Thursday, August 18, 2022
Savyasachi (2018)



చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
నటీనటులు: నాగచైతన్య, మౌనిమ చంద్రభట్ల
దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, సి.వి.మోహన్, వై. శంకర్
విడుదల తేది: 02.11.2018



Songs List:



వై నాట్ పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: PVNS రోహిత్, మనీషా ఈరబత్తిని 

చాటుగా చాటుగా దాచిన మాటలు
రోజులు రోజులు వేచిన చూపులు
గీతాలు దాటుకుని ఏవైపెళ్ళాయో

చాటుగా చాటుగా దాచిన మాటలు
రోజులు రోజులు వేచిన చూపులు
గీతాలు దాటుకుని ఏవైపెళ్ళాయో

ఓ నేనిక నీకాని నువ్వి నాకని
తేలిన సంతోషం లో పడుతూ
ఏమైపోతున్నాయో

పోనిలే పోనీ చేద్దామా
కానుంది కానించేద్దామా
ప్రాయాన్ని పాలించేద్దామా
ఆఅహ్

వై నాట్
మనకిక్కడ చేదైనా తీపౌతుండోయ్
వై నాట్
మన ఇద్దరి బాధైనా హాయిలుతుందోయ్
వై నాట్
మనకిప్పుడు ఏదైనా వీలౌతుండోయ్

వై నాట్
మనకిక్కడ చేదైనా తీపౌతుండోయ్
వై నాట్
మన ఇద్దరి బాధైనా హాయవుతుందోయ్
వై నాట్
మనకిప్పుడు ఏదైనా వీలౌతుండోయ్

నిన్ను విడిచిన నిమిషం నుంచి
నిన్ను మరచిన క్షణమే లేదు
నువ్వు కలవని తేదీ నుంచి
నిన్ను తలవని రోజే లేదు

తెలుసుగా నీ ప్రేమ బలం
కనుకనే కలిసాం మనం
మనసులో నీ జ్ఞాపకం
చెరిగిపోదన్నది నిజం

దూరాన్ని దూరం చేద్దామా
ఊహల్ని ఊరించేద్దామా
సరదాలో స్వారీ చేద్దామా...

వై నాట్
మన చేరువ లోకాన్నే మరిపిస్తుండోయ్
వై నాట్
మన కౌగిలి కాలాన్నే కరిగిస్తుండోయ్
వై నాట్
మనకిప్పుడూ ఏదైనా వీలుస్తుండోయ్

మనకిక్కడ చేదైనా తీపౌతుండోయ్
మన ఇద్దరి బాధైనా హాయిలుతుందోయ్
మనకిప్పుడూ ఏదైనా వీలుస్తుండోయ్



నిన్ను రోడ్డు మీద పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: పృధ్వి చంద్ర

(ఈ పాట నాగర్జున గారు నటించిన అల్లరి అల్లుడు (1993) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు)

నూనూగు మీసాల నూత్న యవ్వనమున
మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో
మొదలైంది  ప్రేమ కహాని
ఆ క్యాంటీన్  లో సొల్లు కబ్బుర్లు 
నైటంత ఆ బైక్ షీకారులు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
రిపీటే
మరపురావు కాలేజీ రోజులు

యో యు రాకెడ్ ఇట్ బ్రో

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు
నేను రోమియోగ మారినది లగాయత్తు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు
నేను రోమియోగ మారినది లగాయత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయత్తు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

ఇట్స్  గెట్టింగ్ హాటర్ లగ్గాయతు
మై హార్ట్ ఇస్ బౌన్సీన్గ్ న్ ఫాలింగ్ ఎట్ యు

ఓసి ఓసి ఓసి రాక్షసి
కాస్త నువ్వు చూడు నాకేసి
నువ్వోడొద్దు నాకు  ప్రేయసి
లాగ్ లాగ్ లగ్ లగ్గాయతు

నిన్ను నన్ను చూసేటోల్ల
కళ్ళు మొత్తం కుళ్లిపోను
నిన్ను నేను కొంచమైనా
చూడకుండా ఉండలేను
నువ్వు నన్ను ఆగామన్న
నేను  అసలు ఆగలేను
నీకు నేను ఎపుడైనా
కచ్చితంగా మొగుడవుతాను
నువ్వు  నేను కలిసి మోత
దునియా మొత్తం దున్నయెద్దము

లైలా మజ్ను
లగ్గాయతు లగ్గాయతు
దేవి పారు
లగ్గాయతు లగ్గాయతు
మెయిన్  దీవాని తూ దీవానా

హలో పిల్లో ఇన్ ఆర్బిట్ మాల్ లో
థియేటర్ లో చీకటి కార్నెర్ లో
చెయ్యి చెయ్యి తగిలేలా
గురుతుందా రాసలీలా

లేట్ నైట్ లో , లైవ్ చాట్ లో 
ఎన్ని పాటల్లో, హార్ట్ బీటులో 
అల్లరి ఊసులు, చిల్లరి ఊహాలు
ఎన్నని చెప్పను, పిల్లో మహాతల్లో

నిన్ను క్లాసులోన చూసినది లగాయత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు
నేను రోమియోగ మారినది లగాయత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయత్తు
అది భామ కాదు బాతు



ఒక్కరంటే ఒక్కరు పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీనిధి తిరుమల 

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక తనువును ఎదిగిన కవలలు
ఒక తీరున కదలని తలపులు
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకదే పదివేలు

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు

విడి విడి కుడి ఎడమలుగా
కలవనంటు ఎందుకలా
చేరి సగమున కలివిడిగా
ఒదగమంది అమ్మ కల
చెరో చెయ్యి మీదిగా
చంప నిమిరితే చాలు
మరో వరమే లేదనుకుంటూ
మెరిసిపోవా నా చిరు నవ్వులు

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు

అన్న వెంట అడవులకేగిన
లక్ష్మణుడి ఆదర్శం
ఆరమరికలు దాటి సాగితే
అడుగడుగు మధుమాసం
నా కలలకు రెక్కలు మీరు
నా ఎనిమిది దిక్కులు మీరు
సంబరాల మీ సహవాసమే 
మేం కోరిన సంతోషం
మీ ఇద్దరి వృద్ధిక చూస్తూ
గడవాలి నా ప్రతి నిమిషం
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకదే పదివేలు

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు





టిక్ టిక్ టిక్ పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: హైమత్, శ్రేయా గోపరాజు 

కోపం... అపార్థం
నువ్వింకా ఇంకా పెంచిందే నీ అందం
రోషం....ఆవేశ
నాలో కొంచెం పెంచిందే ఎదో పంతం
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
కదిలిన ముల్లే గుండెల్లోన గుచ్చే
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
నువ్విక నాకే ఆఖరి మజిలీవి
నీడగ ఉంటానే ప్రతిసారి
I am very sorry లేదు వేరే దారి

చాలా చాలా చేశానిప్పటికే
Please don't mind
చూసి చూసి చూడనట్టోదిలేసేయ్
Love is blind
కోపం that's the part of game
ఆటే రాక చేస్త dream
నీలో ప్రేమ ఎంతుందో
నాలో కూడా same to same

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడవదు కాలం నీతో పాటే ఉంటే
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారానికి సంకెళ్ళేసి మరీ
ఓ... హనీ... ఓ
ఆపేస్తాగా ఆ సమయాన్ని
చుట్టూ లోకం ఏమైనా అయిపోని

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్




1980, 81, 82 పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో
ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో
ఏవి అంది అందకుండా పోయాయో
We are gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో ఇదిగిదిగో
ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప
చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర
ఎప్ప ఎప్ప ఎప్పప్పప్పప్పప్ప 

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో
ఏవి అంది అందకుండా పోయాయో

చూసుకో చూసుకో
VCR లో అమ్మ నాన్నల పెళ్లి
వెళ్ళిపో వెళ్ళిపో
అంబాసిడర్ ఎక్కి అమ్మమ్మ ఇంటికి మల్లి
చేతులు వీడని వీడియో గేమ్ లు
బాటరీ లైట్లు హవాయి చెప్పులు
బూమెర్ బబుల్ గమ్ములు ఊదిన బుడగలతో
లైఫ్ రీవైండ్ చేద్దామా
హార్ట్ ని రీబూట్ చేద్దామా
హాయి ని రీ కాల్ చేద్దామా

We are gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో ఇదిగిదిగో...
ఇదిగిదిగో ఇదిగిదిగో...
ఎప్ప ఎప్ప ఎప్పప్పప్పప్పప్ప

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో




ఊపిరి ఉక్కిరి బిక్కిరి పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: శ్రీ సౌమ్యా, శ్రీ కృష్ణ , మోహన భోగరాజు 

ఊపిరి ఉక్కిరి బిక్కిరి 





సవ్యసాచి పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా, రామక్రిష్ణ కోడూరి 
గానం: దీపు, రమ్యా, రాహుల్, హైమత్, మౌనిమ. సిహెచ్, రేవంత్, ప్రణతి, ఉమా నేహా, మోహన భోగరాజు, శ్రీ సౌమ్యా, లోకేశ్వర్, PVNS రోహిత్, ఆదిత్య, కౌశిక్ కళ్యాణ్, సోనీ 

చండ మార్తాండ భామండలీ మండితా
ఖండాలా దండ దా రా హతి
కాద్రవే యాగ్ర జోదగ్ర దంష్ట్రాకరాలాగ్ని
భీభత్స కీలార్భటి
యక్షర గణాధ్యక్షా హేమాక్ష భీతాక్ష
మా రక్షణా దక్ష ధీ:

సవ్యసాచి
జంభ దంభారి దోర్దాండ
మండిత ప్రచండ హేతి

సవ్యసాచి
ఆగ్రహో దగ్ర దొస్తంభ
గర్భ సంభవ ప్రఘాతి

సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి

భండన ప్రచండ భేరి కాహళీ ప్రహార
ముక్త ఢమ ఢమ ఢమ ఢమ ధ్వని
ప్రవర్తితాశ్వ చరన రింఖ
ట ట ట ట టట్ట టకట టాక్
తురంగ హేష సాంగ భట
సమూహ ఘోష భాతి

సవ్యసాచి సవ్యసాచి
జంభ దంభారి దోర్దాండ
మండిత ప్రచండ హేతి

సవ్యసాచి 
ఆగ్రహో దగ్ర దొస్తంభ
గర్భ సంభవ ప్రఘాతి

సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి


Palli Balakrishna Saturday, March 23, 2019
Premam (2016)


చిత్రం: ప్రేమమ్ (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: పూర్ణా చారి
గానం: కార్తిక్
నటీనటులు: నాగ చైతన్య , శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్
దర్శకత్వం: చందు మొండేటి
నిర్మాతలు: యస్.రాధా కృష్ణ , పి.డి.వి.ప్రసాద్, యస్.నాగవంశీ
విడుదల తేది: 07.10.2017

ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్
రెక్కలన్ని రాలిపోయనోయ్
ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్
రెక్కలన్ని రాలిపోయనోయ్
పువ్వు చాటు ముల్లులా
మెల్లంగ గుచ్చినాది
నొప్పి కూడ చెప్పుకోని తీరు భాదపెట్టెనోయ్
ఈ తేనె పరిమళం తియ్యంగలేదురోయ్
ఆ చేదు మాట వింటే ప్రాణం ఆగిపోయరొయ్

ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్
రెక్కలన్ని రాలిపోయనోయ్
ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్
రెక్కలన్ని రాలిపోయనోయ్

రెక్కలన్ని తెచ్చి అకసాన్ని ఊపిననే
లెక్కలేని పూల చుక్కలెన్నొ తెంచినానే
ముల్లు గుచ్చుతున్న గుండే నొచ్చుకున్న
బాదింత అంతకాదే
అద్దంలో నన్ను నేను చూసుకుంటే

నా గుండే బుజ్జిగించినట్టు ఉందే
ఎంత చెప్పుకున్న ఓటమొప్పుకున్న
నా ఏడుపాగదాయే హా
చూసి చూసి నన్ను పావులా
బలేగ వాడుకున్న తీరు చూడరా
నా చుట్టు ఇందరున్న నవ్వింది నన్ను చూసి
ఈ వింతగున్న ఆటలేంటి ఓరి దేవుడా
ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్
రెక్కలన్ని రాలిపోయనోయ్

ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్
రెక్కలన్ని రాలిపోయనోయ్


********   *********   ********


చిత్రం: ప్రేమమ్ (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: పూర్ణా చారి
గానం: కార్తిక్

నిన్న లేని కంటి చూపులేవో
నన్ను చంపుతున్నాయ్ ఇవాలనే
నిన్న లేని చిన్నీ నవ్వులేవో
నన్ను తాకుతున్నాయ్ ఈవేలనే

ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే
ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో
ఓ దేవతలాంటి అందం తరగదిగదిలో
పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే
తానే ఉంటే ఈ జీవితమంత
ఓ రోజులాగ కరిగిపోదా హ హ హ హహ హహ హ

నిన్న లేని కంటి చూపులేవో
నన్ను చంపుతున్నాయ్ ఇవాలనే
నిన్న లేని చిన్నీ నవ్వులేవో
నన్ను తాకుతున్నాయ్ ఈవేలనే



*******   *******   *******


చిత్రం: ప్రేమమ్ (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: రంజిత్

హేయ్ హేయ్ ఎవడు ఎవడు ఎదురుపడేదెవడు ఎవడు
దరువుపడి మెరుపుజడి పిడుగురెడీ
హేయ్ హేయ్ ఎవడు ఎవడు మిడిసిపడేదెవడు ఎవడు

అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి
వాంగ్రా దంచి కొట్టే ఆంధ్రా మిర్చి కొట్టేయ్
తీన్మార్ తీసికొట్టే చిటపటసే
చిటపట చినుకు పడి లటపిట లైటు పడి
ఘడి ఘడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి
హేయ్ మచి మచి మచి మచి
బీ రెడి రెడి పడి పడి
హేయ్ మచి మచి మచి
కొత్త కుర్రాల్లాం వస్తున్నాం గుర్రాలెక్కి

హేయ్ మచి మచి మచి మచి
బీ రెడి రెడి పడి పడి
హేయ్ మచి మచి మచి
నిన్ను తలదన్నే సరికొత్త సత్తతోటి

హేయ్ హేయ్ ఎవడు ఎవడు ఎదురుపడేదెవడు ఎవడు
దరువుపడి మెరుపుజడి పిడుగురెడీ
హేయ్ హేయ్ ఎవడు ఎవడు మిడిసిపడేదెవడు ఎవడు

అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి

ఘిర ఘిర ఘింగిరాలు తిరిగేవులే నాతో
బొగరమల్లే చిదులేయిచింది
మిల మిల మెరుపులోనా మెలికే మెల్లిగా నాతో
స్నేకు స్టేప్పు సేకు చేయించింది
సిల్లిగా చూసే ఆ ఫుల్ మూనే
నాకు కూలు మూను వాకు నేర్పిందిలా
మేఘాల్లో వానే నాకు రెయిన్ డాన్సే నేర్పే
ఆ భూమి మేఘం రెయిన్ అన్ని మూన్ అన్ని నువ్వే
హేయ్ మచి మచి మచి మచి
అదరకొట్టు కొట్టు కొట్ట్ కొట్టు
హేయ్ మచి మచి మచి
ఈచప్పట్లా డ్రప్పేట్లు మ్రోగేటట్లు
హేయ్ మచి మచి మచి మచి
వడిసిపట్టు పట్టు పట్టు పట్టు
హేయ్ మచి మచి మచి
ఈ బ్యుటీలా హ్రుదయాలు క్యాచేపట్టు

యస్ యం యస్ లోకి మాయం అయ్యే క్లాసే
సినిమా తియేటర్లో జల్సా చేసేయ్
చక్కర్లేసే పేపరాకెట్టుల్లొ దాగే
రూమర్సన్ని మాకు టైంపాసేలే
లంచు బాక్సులాగా మా బుర్రలు భొంచేసే
ఆకలేసి క్లాసు లెక్చరర్లుఇలా
లాబుల్లో చేసేటి లవ్వు ప్రాక్టికల్సేలే
చలో హలో హలో చలో హల్చలో
హేయ్ మచి మచి మచి మచి
బీ రెడి రెడి పడిపడి
హేయ్ మచి మచి మచి
కొత్త కుర్రాల్లాం వస్తూన్నాం గుర్రాలెక్కీ
హేయ్ మచి మచి మచి మచి
బీ రెడి రెడి పడి పడి
నిన్ను తలదన్నేసరికొత్త సత్తాతోటి



*******   *******   *******


చిత్రం: ప్రేమమ్ (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: పూర్ణా చారి
గానం: నరేష్ అయ్యర్

అగరొత్తులా కురులె వలగా విసిరేసావే
కనికట్టుల చూపులు జల్లి పొతున్నవే
కసరత్తులు చెస్తూ వెనకె వస్తునానే
చెలి మత్తుల సైగలు గుండెను దొచేసాయే యే యే యే
అగొరొత్తుల కురులే వలగా విసిరెసావే
కనికట్టుల చుపులు జల్లి పొతున్నావే
కసరొత్తులు చెస్తూ వెనకే వస్తున్నానే
చెలిమత్తుల సైగలు గుండెను దొచేసాయే యే యే యే
పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే
చుక్కలకె మెరుపులనద్దే జాబిల్లివే ఏ ఏ ఏ
అందెలెలొ అందము దాచిన సిరిమువ్వవే ఏ ఏ ఏ
నిద్దురలో నను కవ్వించినా నెరజానవే ఏ ఏ
పువ్వులకె రంగులనిచ్చే హరివిల్లువే
చుక్కలకే మెరుపులనద్దే జబిల్లివే ఏ ఏ
అందెలలొ అందము దాచిన సిరిమువ్వవే ఏ ఏ ఏ
నిద్దురలో నను కవ్వించిన నెరజానవే ఏ ఏ


అగొరొత్తుల కురులే వలగా విసిరెసావే
కనికట్టుల చూపులు జల్లి పొతున్నవే
కసరొత్తులు చేస్తు వెనకే వస్తున్ననే
చెలి మత్తుల సైగలు గుండెను దొచెసాయే యే యే యే
ఈగల్లా ముసిరేస్తుంతే నలువిపులా
సాపాలు తగిలయంట ప్రతిసారిలా ఆ
నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్ల ఆ ఆ
నీ చుట్టు తెరలె కట్టి దాచేయ్యలా ఆ ఆ
ఈగల్ల ముసిరేస్తుంటే నలువైపులా
సాపాలు తగిలయంటా ప్రతిసారిలా ఆ
నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్లా ఆ ఆ
నీ చుట్టు తెరలే కట్టి దాచేయ్యలా



*******   *******   *******


చిత్రం: ప్రేమమ్ (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిచరన్

హె హె ఏమయ్యింది... ప్రేమయ్యింది
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా
నను చూసె నలుగురిలోనా
అదోలాంటి చిన్ని అసూయా
ఎగరేసె కాలరునయ్య
హో యా  నాకు నేన్నె తాలియా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  లైఫే ఓ యూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా

కాలం ఆగీపోయింది  నమ్మలేని సంగతేందో జరిగిపోతోంది
ప్రాణం నాతో లేనంది  పైలట్ లేని ఫ్లైటై గాల్లో తేలిపోతోంది
నేనే ఓ దీవిలాగ సంతోషం నా చుట్టూ చేరింది..
నేడే ఆ క్యాలండర్ లో పండగలన్నీ వచ్చినట్టుందీ
ఓ మై గాడ్ ఏందీ ఇది గుండె సడీ... స్పీడైనదీ
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  లైఫే ఒయూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా


హే మ్యాన్ హూ ఆర్ యూ అంటె
ఈ బార్బీ డాల్ లవర్ నంటూ చెప్పుకుంటాను
వేరే పనేదీ లేదంటూ
రౌండ్ ద క్లాక్ ఈ పిల్ల కళ్ళల్లో ఉండిపోతాను
సీనే అరె చేంజయ్యింది చిటికెల్లోనా చాలా టేస్టీగా
లైఫే నా బాల్కనీలో రోజాలా నవ్వింది క్రేజీగా
ఓ మై గాడ్ ఏందీ సుడీ హోరోస్కోపే థ్రిల్లయ్యింది
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  లైఫే ఓ యూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా



*******   *******   *******

చిత్రం: ప్రేమమ్ (2016)
సంగీతం: రాజేష్ మురగేషన్
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ యేసుదాసు

తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది

ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మదురోహల హరివిల్లు నింపే
తియతీయని నిమిషాలే నీలొన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు
నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు
నువు లేక నే లేననీ
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే ఎవరే

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది

Palli Balakrishna Tuesday, August 15, 2017
Karthikeya (2014)



చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: నిఖిల్ , స్వాతి
దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: వెంకట్ శ్రీనివాస్
విడుదల తేది: 24.10.2014



Songs List:



ప్రశ్నంటే నింగినే పాట సాహిత్యం

 
చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల 
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా 
బదులంటే ఎక్కడో ఏ చోటో లేదురా 
శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంట 
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి 
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ 
ప్రశ్నంటే.... ప్రశ్నంటే నింగినే నిలదీసే అల 
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా 

పలు రంగులు దాగి లేవా పైక్కనిపించే తెలుపులోన 
చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా 
అడగనిదే ఏ జవాబు తనకై తానెదురుకాదు 
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించారా 
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి 
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ 

ప్రశ్నంటే నింగినే ... నిలదీసే అల 
ప్రశ్నించే లక్షణం ... లేకుంటే ఎలా 

ఎపుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట 
ఎదిగే ప్రతి మలుపుతోను మార్చలేదా మనిషి బాట 
తెలియని తనమే పునాది... తెలిసిన క్షణమే ఉగాది 
తెలివికి గిరిగీత ఏది... ప్రయత్నించరా 
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా... బ్రతుకును లాగటం బరువేగా మనసుకి 
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా... అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ 
ప్రశ్నంటే నింగినే నిలదీసే అల 
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా



సరిపోవు కోటి కనులైనా పాట సాహిత్యం

 
చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: వనమాలి
గానం: చిన్ని చరణ్

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా 
నిను దర్శించి దరి చేరి వలచేందుకు 
సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా 

నిను వర్ణించి ఒకసారి పిలిచేందుకు 
చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం 
కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే 
స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా 
స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా 
స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా 
ను... స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా 
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా 

నిను దర్శించి దరి చేరి వలచేందుకు 

ఏంటా నవ్వడం చూడడం గుండెనే కోయడం 
దూరమే పెంచడం ఎందుకూ ఈ ఎడం 
మనసుకు తెలిసిన మాట పలకదు పెదవుల జంట

ఎదురుగ నువు రాగానే నాకేదో అవుతోందట 
కనుల ముందు నువ్వు నించున్నా నే కళ్ళు మూసి కలగంటున్నా 
అందులోనే తేలిపోతూ నీడలాగా నీతో ఉన్నా 
స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా 
ను... స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా 
స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా 
ను... స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా 
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా 

నిను దర్శించి దరి చేరి వలచేందుకు 

నింగే పిడుగులే వదిలినా పూవులే తడిమినా 
ఉరుములే పంచినా స్వరములే దోచినా 
కలవని అపశకునాలే శుభ తరుణములుగ తేలే 
వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే 
ఎన్ని ఆపదలు వస్తున్నా అవి నన్ను ఆదుకొని కాచేనా 
కలిసి వచ్చే వింతలన్నీ ఖచ్చితంగా నీ మహిమేనా 
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ... 
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ... 
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ... 
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ... 
నిను దర్శించి దరి చేరి వలచేందుకు




ఇంతలో ఎన్నెన్ని వింతలో పాట సాహిత్యం

 
చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నరేష్ అయ్యర్

ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో 
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో తెరచాటుగా నిను చూసానో 
ఆయువో నువు ఆశవో నువు వీడని తుది శ్వాసవో 
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా 
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో 

చిరునవ్వే నీ కోసం పుట్టిదనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో గమ్యం అనిపిస్తుంది 
పడిపోయా నేనే నీకికా 
నువు ఎవరవరైతే అరె ఎంటికా 
ఉందో లేదో తీరిక ఈ రేయి ఆగాలికా ...ఓఓఒ 
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో 

పైకెంతో అణకువగా సౌమ్యంగా ఉంటుంది 
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది 
వ్రాసుందో లేదో ముందుగా నువు కలిసావో ఇక పండుగ 

ఉన్నావే నువే నిండుగా నా కలలకే రంగుగా..ఓఒ 
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో 
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో తెరచాటుగా నిను చూసానో 
ఆయువో నువు ఆశవో నువు వీడని తుది శ్వాసవో 
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో 





పున్నమి వెన్నెలకే పాట సాహిత్యం

 
చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిచరన్

పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ 
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ 
నిజమును ముసిరిన నివురది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి 
నిదురను చెరిపిన కలవరమేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి 
వెలుగుకు వెనుకన వివరము ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి 
వేలుకు కొలువున విలయమదేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
 పలు ప్రశ్నలకొక బదులది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి 
తలపును తొలిచెను తరగని చీకటి చీకటి చీకటి 
నరుడా గురుడా ఎవరా మూలము 
కాలుని పాశమై కదిలెను కాలము 
జరిగెటిదిదియే దైవ మహత్యము 
కానిచొ ఇదియే మానవ యత్నము 
తెలియునదెప్పుడీ మాయ రహస్యము 
తెలియుట మాత్రమ-వశ్యమ-వశ్యము 
బ్రతుకొక తపముగా పరుగిడు పయనము 
తలవని మలుపుగ కనుగొను విజయము 
ఆఆఆఆఆఅ.... 
ఆఆఆఆఅఆ... 

పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ 
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ 




ఇంతలో ఎన్నెన్ని వింతలో పాట సాహిత్యం

 
చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: చిన్మయి

ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో 
సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసాను 
మాయవో నువు ఆశవో  నువు వీడనీ తుది శ్వాసవో 
రాయని ఓ గేయమో  నువు ఎవరివో హలా... 
ఇంతలో ఎన్నెన్ని వింతలో  అలవాటులో పొరపాటులెన్నెన్నో 

పరిచయమే పరవశమై నిన్ను నాతో కలిపింది 
వ్రాసిందే జరిగింది అయినా కలలా ఉంది 
ఒకటయ్యాక మీలో ఇక  నీతో ఉంటామరి నేనిక 
లేనే లేదిక తీరిక ఇది మనసులో కలయిక 
ఇంతలో ఎన్నెన్ని వింతలో  అలవాటులో పొరపాటులెన్నెన్నో

Palli Balakrishna

Most Recent

Default