Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: కార్తికేయ 2 (2022)
సంగీతం: కాల భైరవ 
నటినటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ 
దర్శకత్వం: చందూ మొండేటి 
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్ , టి.జి.విశ్వప్రసాద్ 
విడుదల తేది: 12.08.2022



Songs List:



అడిగా నన్ను నేను అడిగా పాట సాహిత్యం

 
చిత్రం: కార్తికేయ 2 (2022)
సంగీతం: కాల భైరవ 
సాహిత్యం: కృష్ణ మదినేని 
గానం: ఇన్నో జెంగ 

అడిగా నన్ను నేను అడిగా
నాకెవ్వరు నువ్వని
అడిగా నిన్ను నేను అడిగానే
నిన్నలా లేనని

నవ్వుతో నన్ను కోసినావె
గాయమైన లేఖనే
చూపుతో ఊపిరాపినావే
మార్చిన కధే ఇలా

నువ్వే కదా ప్రతి క్షణం
క్షణం పెదాలపై
నీతో ఇలా ఇలా జగం
సగం నిజం కదా

గాలివోలె తాకినట్టుగా
నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్టుగా
నన్ను ముంచి పోకలా

రాసివున్నదో రాసుకున్నదో నీతో స్నేహం
కాదు అన్నదో అవును అన్నదో ఏదో మౌనం
కురుల గాలి తగిలి నేనే చెడిపోయా
మనసు దాటి రాని మాట నేను వింటున్నా

ఒ హో ఓ హో ఓ ఓ
ప్రశ్న లేని బదులు నీవులే
ఒ హో ఓ హో ఓ ఓ
నిమిషమైన మరుపురావులే

గాలివోలె తాకినట్టుగా
నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్టుగా
నన్ను ముంచి పోకలా

No comments

Most Recent

Default