Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1963"
Chaduvukunna Ammayilu (1963)



చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, క్రిష్ణ కుమారి, శోభన్ బాబు, హేమలత
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు 
విడుదల తేది: 10.04.1963



Songs List:



ఒకటే హృదయం కోసము పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

చరణం: 1
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .

చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
ఓ . . .

చరణం: 2
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ



కిలకిల నవ్వులు పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి: 
కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 
కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల 

చరణం: 1
రమ్మని మురళీరవమ్ములు పిలిచె 
రమ్మని మురళీరవమ్ములు పిలిచె 
అణువణువున బృందావని తోచె 
తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె 

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 

చరణం: 2
నీవున్న వేరే సింగారములేల 
నీవున్న వేరే సింగారములేల 
నీ పాదధూళి సింధూరము కాదా 
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే 

కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల 

చరణం: 3
నీ కురులే నన్ను సోకిన వేళ 
నీ కురులే నన్ను సోకిన వేళ 
హాయిగ రగిలేను తీయని జ్వాల 
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ 

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 
కిలకిల నవ్వులు చిలికినా




ఏమండోయ్.. నిదుర లేవండోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఆశలత కులకర్ణి 

పల్లవి:
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగా ఏల ఈ మగత
ఏమండోయ్.. నిదుర లేవండోయ్

చరణం: 1
ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట..
ముందు జరుగుట.. చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం: 2
యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం: 3
నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్





ఆడవాళ్ళ కోపంలో అందమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి: 
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది 
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది అర్ధమున్నదీ 
మొదటి రోజు కోపం అదో రకం శాపం 
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం 
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు 
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు 

చరణం: 1
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 
పడుచువానీ .. ఒహో... 
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 

వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు 
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు 

చరణం: 2
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 

వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం 
వెంటపడిన వీపు విమానం 

చరణం: 3
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 
చిలిపికన్నె.. ఉహూ... 
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 

ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ 
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి




నీకో తోడు కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం: 1
నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని

వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం: 2
నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప

నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల

నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లి దయచేయి కోటిదండాలు

చరణం: 3
సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు

ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి

నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను




ఓహొ చక్కని చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి 

పల్లవి:
ఆఅ ఆఅ ఆఅ హా
ఓఓ ఓఓ ఓఓ హో

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం: 1
వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం .. తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది

చరణం: 2
పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరినా ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను జతరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు

చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం: 3
మనసే దోచిన సుందరి
మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు.. ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నదీ

ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో




ఏమిటి ఈ అవతారం?  పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత

పల్లవి: 
ఆ...ఏమిటే... 
ఏమిటి ఈ అవతారం? 
ఎందుకు ఈ సింగారం? 
ఏమిటి ఈ అవతారం? 
ఎందుకు ఈ సింగారం? 
పాత రోజులు గుర్తొస్తున్నవి 
ఉన్నది ఏదో వ్యవహారం 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

చరణం: 1
పౌడర్ దెచ్చెను నీకందం 
బాగా వెయ్ వేలెడు మందం 
పౌడర్ దెచ్చెను నీకందం 
బాగా వెయ్ వేలెడు మందం 
తట్టెడు పూలు తలను పెట్టుకుని 
తయారైతివా చిట్టి వర్ధనం 

చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

చరణం: 2
ఆ...ఆ...ఓ...ఓ.... 
వయసులోన నే ముదురుదాననా 
వయ్యారానికి తగనిదాననా 
వయసులోన నే ముదురుదాననా 
వయ్యారానికి తగనిదాననా 
వరుసకాన్పులై వన్నె తగ్గినా 
అందానికి నే తీసిపోదునా 
ఏమిటి నా అపరాధం 
ఎందుకు ఈ అవతారం 


చరణం: 3
దేవకన్య ఇటు ఓహో... 
దేవకన్య ఇటు దిగివచ్చిందని 
భ్రమసి పోదునా కలనైనా 
మహంకాళి నా పక్కనున్నదని 
మరచిపోదునా ఎపుడైనా 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

నీళ్ళు కలపని పాలవంటిది 
పిండి కలపని వెన్న వంటిది 
నీళ్ళు కలపని పాలవంటిది 
పిండి కలపని వెన్న వంటిది 
నిఖారుసైనది నా మనసు 
ఊరూవాడకు ఇది తెలుసు 
ఏమిటి ఈ అవతారం? 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం





వినిపించని రాగాలే పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం: 1
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం: 2
వలపే వసంతముల పులకించి పూచినది
వలపే వసంతముల పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే...

చరణం: 3
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే


Palli Balakrishna Sunday, August 14, 2022
Sri Tirupatamma Katha (1963)



చిత్రం: తిరుపతమ్మ కథ (1963)
సంగీతం: పామర్తి 
నటీనటులు: యన్ టీ రామరావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ 
నిర్మాత: డి.కృష్ణమూర్తి
విడుదల తేది: 04.10.1963



Songs List:



# పాట సాహిత్యం

 
Song Details



పూవై విరిసిన పాట సాహిత్యం

 
చిత్రం:  తిరుపతమ్మ కథ 
సంగీతం: పామర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల  

పూవై విరిసిన పున్నమి వేళా
బిడియము నీకేలా బేలా
చల్లని గాలులు సందడి చేసే 
తొలి తొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలి ముసుగులో
తలను వాల్తువేలా బేలా

మొదట మూగినవి మొలక నవ్వులు 
పిదప సాగినవి బెదురు చూపులు 
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపోదు వేలా బాలా

తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి
ఇరువురమొకటై పరవశింపగా
ఇంకా జాగేలా బేలా




# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Saturday, July 2, 2022
Aapta Mitrulu (1963)



చిత్రం: ఆప్త మిత్రులు (1963)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి, కాంతారావు
నిర్మాత, దర్శకత్వం: కడారు నాగభూషణం
విడుదల తేది: 29.05.1963



Songs List:

Palli Balakrishna Tuesday, February 1, 2022
Irugu Porugu (1963)



చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు 
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: ఐ.యన్.మూర్తి 
నిర్మాత: చిలంకుర్తి విజయ సారధి 
విడుదల తేది: 11.01.1963



Songs List:



నా మనసంతా తీసుకో పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

నా మనసంతా తీసుకో
ఏమైనా నువు చేసుకో
రంగేళివై శృంగారములో
రాతిరి కలలో కలుసుకో
కనులతో మాటాడే జాణ
నా కొనచూపులే కోటిసరసాల నజరాన
తీయని కాసుక తీసుకువస్తే
ఎందుకు నీకు నిరాదరణ !
నవనవలాడే నా వయసంతా
చేశా నీకు బహూకరణ
మనసుగలవాడె నిజమైన మనిషి!
మమత ఫలియించుకే దిల్ రుషీ !
కమ్మని సొగసు కోరిన వలపు
కలిగించునులే కైపు!
నీవూ నేనూ, ఒకటువుతాము
నేడు కాదేని రేపు 



ముందు చూపుగా నే పోతుంటే పాట సాహిత్యం

 

చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ముందు చూపుగా నే బోతుంట - హూమ్
ముందు చూపుగా నే బోతుంట
వెనక ఊపుగా సురొస్తుంటే!
అందరు గుసగుస లాడికిరో
సైరా నా రాజా !
కిల కిల నవ్వుల్ జూచి - నీ నడకల్ జూచీ
నీళ్ళ రేవుకడ పొంచుకేసుకొని నిలుచున్నావుగా

హుషారుతోటీ పచారుచేస్తూ ఉలికించావురా
మెల్లమెల్లగా కనుసైగలో కవ్వించావురా
తోచనివాళ్ళు ఎన్నో నిందలు వేశారురా

వెనకవాలుగా కళ్లుమూసి నను తెరిపించావురా
వెన్నెలలో సయ్యాటలాడి -బల్ వేధించావురా
తోడుతోడుగా జోడుగ షికారు రమ్మన్నావురా
పాడులోకమూ ఎందుకో ఓర్వలేదాయరా

అదేపనిగ నన్నల్లరి పెడితే ఫలితం లేదుర బావ
అదాటుగా మన మనసులు కలిసిన అందం ఉన్నది 
హాయిహాయిగా ఇద్దరి స్నేహం అల్లుకొనాలిరా
చేయీచేయీ గలిపితే లోకులు సిగ్గుపడా లేరా



జిగి జిగేలుమని పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

జిగి జిగేలుమని మన దొరసాని
సొగసెవ్వరికొరకోగాని వారెవా జోరు హై
పొరుగింటి పుల్లయ్యకోసం
ఈరోజున వేసితి వేషం. వారెవా జోరు హై 
ఇరిగింటెల్లమ్మలు ఇంతేలే పంతానికి కవ్వింతురులే
అనగూడదులే - మన కెందుకులే
మాటంటే చిటపట మందురులే వారెవా జోరు హై

మగవారి ప్రతాపం తెలుసు మా ఆడవారనిన అలుసు
ఇకిలింతురులే- సకిలింతురులే
తమ బడాయి జూపింతురులే వారెవా జోరుహై 
ఎంతయినా మేము మొగాళ్ళ
మా మూతిని ఉన్నది మీసం
జగమిటులైనా యుగమటులైనా
చెల్లునులే మా అధికారం వారెవా జోరు హై 



మబ్బుల చాటున పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

మబ్బులచాటున చంద్రునిలా
పొదమాటున దాగిన చినవాడా
ఎందుకు విందుకురావు
మన సెందుకు తీసుకోవు
ప్రేమించినవారికి భయమేల
మగవారికి ఇంతటి సిగ్గేల
ఎడబాయనిది కడుతీయనిది
మన ప్రేమను తెలుపగ రావేల

నీ హృదయములోని కోరికలు
నా జన్మదినానికి కానుకలు
వసివాడనివి - కుసుమించినవి
నా కురులన విరిసిన మాలికలు




కవ్వించేవే కవ్వించేవే పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత 

కవ్వించేవే - కవ్వించేవే
కలువ రేకుల కన్నుల ధాన
కవ్విస్తే జవ్వనమంతా గంతేయునె చినదాన
నవ్వించేవు నవ్వించేవు
కొంటె నడకల కులాసకాడ
నవ్విస్తే నాజూకంతా నలిగినో వన్నెకాడ

చక్కని నీ రూపు ! ఒలికించు ఓరచూపు 
వన్నెల చిల్కు - వయ్యార మెలుకు
కాదని యనబోకు వాదమాడబోకు

ఎంతటి నగుబాటు - ఎవరైన విన్నలోటు 
వలపుమాటలు - చిలిపి చేష్టలు
అతియైతే చేటు - తగదీ అలవాటు

నీ వాడనుకాదా - నామీద ప్రేమలేదా 
కమ్మని రేయి - గుమ్మయిపోయి
కలుపు చేయి చేయీ కానరాని హాయి
సరసాలు దాచి పెట్టు తెలుసును నీ గుట్టు 

ఈ విరహాలు ఈ సరదాలు
ఇప్పటికి ఉన్నదింక రేపు




సన్నజాజి చెలిమి కోరి పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

సన్నజాజి చెలిమికోరి - చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానె - జాజిమనసు పూచెను
పడుచుదనము, గడుసుదనము - పరిమెళాలు చిందెనే 
ఆ పరిమెళాల సుమదళాలు పరవషమేచెందెనే

ఒకరినొకరు చేరగానె - ఊహలు చెల రేగెనే 
ఆ ఊహల ఉయ్యాలపైన హృదయాలె ఊగెనే

ఆకసాన మెరుపుతీగె - అరనిముషము వెలుగునే
నా కనులలోన కాంతివగుచు
కలకాలము వెలుగుమా




తోటకు వచ్చిందొక చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి. బి. శ్రీనివాస్, జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

తోటకు వచ్చిందొక చెలియ - దాని
దోరవయసుపై పువ్వులు కోసిందొక చిలుక
నా మనసు
దాని నవ్వుముఖముపై నా మనసు

చెట్టుననెక్కే డొకకోతి - వాడి
చిలిపి చేష్ట పై నా మనసు
కొమ్మల నెక్కే డొకకోతి - వాడి
కోరమీసంపై నా మనసు
...   ....  .... (రాగం)

రావిచెట్టెక్కేవు - రాగాలు తీశావు
రాలిపోతవు రాలుగాయో - ఎంకయ్య
కూలిపోతవు రామ రామ

చిరునవ్వు నవ్వుతో - చేయివేస్తే చాలు
చింతలన్నీ మాయమౌతాయె చంద్రమ్మ
వంతలన్నీ మాయమైనాయె

ఒక్క మనసూతోన - చక్కగా మనముం
పైన సుక్కలు నవ్వుకోవా - ఎంకయ్య
కింద సుక్కలు నడిసిరావా

మాలోణ్ణి పెళ్లాడ మరియాద పోతాది 
మనవు మాటలు ఎత్తరాదె - చంద్రమ్మ
మారుమాటలు ఆడబోకె
మంచి మనసైతేను – మాలోడి మాటేల 
కుల మెన్నుకో లేదురో – ఎంకయ్య
గుణమునే చూశానురో

నీవు నేనూ కలిసి - నీటిలోపల కరిగి
ఏక మైపోదాములే - స్వర్గాన
ఇంపుగా ఉందాములే!

ఎటుచూచిన కురిసే - కన్నీ రే
వికసించిన కలలే - శిలలాయె 
నిర్భాగ్యము నీడగ వెంటాడె
నిట్టూర్పులు మదిలో  బరువాయె
కని పెంచిన హృదయము ఎడబాసి
కనుపించని బాధలు చెరువాయె

తోబుట్టినవాడు కనరాడె
మా త్రోవలు చీలెను - చిననాడె
కరుణించినవారికి శాపమునై
కడుచల్లని తల్లిని బాసితినే

ఈ లోకము కరుణామయమైనా
నా దోసిటనిండెను వేదనలే
ప్రేమించిన మదిలో – గాయాలా
పరమాత్మకు వేడుక కాబోలు




నృత్య రూపకం పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

నృత్య రూపకం 




ఎటు చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

ఎటు చూసినా 

Palli Balakrishna Monday, January 31, 2022
Eedu Jodu (1963)



చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: కొంగర జగ్గయ్య, కాంచన, మణిమాల
నిర్మాత, దర్శకత్వం: కె.బి.తిలక్
విడుదల తేది: 17.05.1963



Songs List:



ఇదేమి లాహిరి పాట సాహిత్యం

 
చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, ఘంటసాల 

ఇదేమి లాహిరి ఇదేమి గారడి 
ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరి ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరి

కోరుకున్న చిన్న దాని నవ్వు
కోటి కోటి పరిమళాల పువ్వు
చిన్ననాటి సన్నజాజి చెలిమి
కన్నులందు దాచుకున్న కలిమి
ఆనాటి కూరిమి చలువలోన వేడిమి
అనురాగపు మేలిమి

ఇదేమి లాహిరి ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరి

రామచిలుక ప్రేమమాట పలికి
రాజహంసలాగ నడిచి కులికే
గోరువంక చిలుక చెంతవాలె
కొసరి కొసరి కన్నెమనసు నేలె
కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి
అది ఆరని హారతి

ఇదేమి లాహిరి ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూచి ఎంత
సందడి



చిరుగాలి వంటిది పాట సాహిత్యం

 
చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి.సుశీల 

చిరుగాలి వంటిది ఆరుదైన చిన్నది
చెలగాటమాడి కనరాకదాగి కదలాడుచున్నది ॥చిరు॥

పూలకన్న సుకుమారపు మదిలో
జ్వాలలు దాచిన కోమలి
వేచిన ప్రియులకు వివరహపు కానుక
ఇచ్చే వెచ్చని జాబిలి చిరు 
వేడిన కొలది వేధన పెంచే
అడనైజము వీడనిది
వియోగ గీతిక వినోదమనుకొని 
వీనుల విందుగ కోరునది
ఆశ పెట్టి తానందీ అందక - బాసలు తీర్చని భామిని
ఆలాహలము అమృతరసము - అందించేనవ మోహిని 



పంచరు పంచరు పాట సాహిత్యం

 
చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.బి.శ్రీనివాస్ & పార్టీ

పంచరు పంచరు పంచరు పంచరు తలకోన మోస్తరు
పంచమందున ప్రతి విషయం పంచరగుట గమనించరు
పంచరు పంచరు పంచరు పంచరు తలకోన మోస్తరు
బస్సు తీసుకెళ్లే అబ్బాయిగారు బలాదూరుగా తిరిగితే
పల్లె పట్టున తల్లిదండ్రులు బంగారు కలలే పంచరు
ఆడపిల్లలకు ప్రేమలేఖలు అందించును నవ యువకుడు
పెద్దవాళ్లకు రిపోర్ట్ ఇస్తే ప్రేమా గీమా పంచరు
ప్రజల మేలుకై పన్నుల పెంచి ప్లానులు వేయును ప్రభుత్వం

కాంట్రాక్టర్ల కైంకర్యంచే కమ్మని ప్లానులు పంచరు
ఎన్నికలందున ఎన్నో చెప్పి నిలిచిన గెలిచిన మెంబరు
రాజధాని లో మోజులు మరిగితే ప్రజా జీవితం పంచరు
అడుగడుగునా రిపేరొచ్చిన ఆగదు మానవ జీవితం
ఆశ్యాలకల మంచి మనస్సు 
అవనే అవదు పంచరు




విష్ణు పాదము పాట సాహిత్యం

 
చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది రమేష్ & పార్టీ

విష్ణు పాదము మేము విడువము మరి
వేరే ఒక్కరి పేరు నుడువము
వెర్రిగ తీర్థాలు చుట్టను ఖలుల
విత్తము కొంగున గట్టము
పాపఖర్ముల గడప మెట్టము పతిక
పావనుడే మాకు చుట్టము
గోపబాలుని భజనె దిట్టము యముని
గొడవెందు కిది వేరే ఘట్టము

రక్షించమని రవ్వ సేతుము ఎదుట
రాకుంటే ఒక చెయ్యి చూతుము 

పక్షివాహన యని కూతుము మారు
బలకకుంటె - సిగ్గుదీతుము

తత్త తరి కిటకక
తక్క ధిక్కు తకఝణుత దిగిత
తద్దితరికిట - తకతళాంగుతక
ధిత్తోంతా ధిగ్తోం...
తా-ధీ-గీ-ణా తోం-తా...
తధిగిణతోం - తధిగణతోం...



సూర్యుని చుట్టు పాట సాహిత్యం

 
చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: వసంత, పి.బి.శ్రీనివాస్

సూర్యుని చుట్టు తిరుగుతుంది భూగోళం
ఈ సుందరి చుట్టూ తిరుగుతుంది నా హృదయం
ఏయ్ తనలో తానే తిరుగుతుంది భూగోళం
తలలో తిరగను ఏదో తెలియని గందరగోళం 

యవ్వనమందున ఎవరైనా కమ్మని కలలే కంటారు
ఆఁ....
కన్న కలలే ఫలించక పోతే కలవరపడతారు
ఆలయమైనది నీ హృదయం అంకితమైనది నా రూపం
ఆలయాన అడుగడు హక్కు లేదు నీకు పాపం
కోరిన కోరిక తీరనిచో ధారున ప్రాణము పోయెను
అయ్యో..
పెద్దవాళ్లు ప్రాణం పోయని పిండి బొమ్మను నేను



చిరుగాలి వంటిది పాట సాహిత్యం

 
చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల 

చిరుగాలి వంటిది అరుదైన చిన్నది
చెలగాటమాడి కనరాకదాగి కదలాడుచున్నది
పూలకన్న సుకుమారపు మదిలో
జ్వాలలు దాచిన కోమలి
వేచిన ప్రియునకు విరహపు కానుక
ఇచ్చే వెచ్చని జాబిలి

ఆశ పెట్టి తానందీ అందక - బాసలు తీర్చని భామినీ
హాలాహలము అమృతరసము
అందించే నవమోహిని 




లావొక్కింతయు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: ఈడు జోడు (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

లావొక్కింతయు లేదు 

Palli Balakrishna Tuesday, March 5, 2019
Paruvu Prathista (1963)


చిత్రం: పరువు ప్రతిష్ట (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి
దర్శకత్వం: మనపురం అప్పారావు
నిర్మాత: జూపూడి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 09.05.1963

పల్లవి:
ఆ మబ్బు ...తెరలలోన... దాగుంది... చందమామ...
ఈ సిగ్గుపొరలలోన...బాగుంది... సత్యభామ...
ఏమంది... సత్యభామ...

ఏమందో... ఏమో కాని...పరిహాసాలే... చాలునంది...
శ్రీవారిని... ఐదారడుగుల...దూరాన... ఆగమంది...
దూరాన... ఆగమంది...

చరణం: 1
ఈ గాలి... ఊయలా... ఊగించు...పయ్యెదా...
ఈ గాలి... ఊయలా... ఊగించు...పయ్యెదా...
ఊరించే ...సైగలతోనే ...ఏమంది.... తియ్యగా...

పరువాల... తొందరా...నెలరాజు... ముందరా...
పరువాల... తొందరా...నెలరాజు... ముందరా...
మర్యాదా... కాదని కాదా....పలికింది ...చల్లగా...
పలికింది. ...మెల్లగా...

ఆ మబ్బు.... తెరలలోనా... దాగుంది... చందమామ...
ఈ సిగ్గుపొరలలోనా... బాగుంది... సత్యభామ...
ఏమంది... సత్యభామ...

ఏమందో ..ఏమో కాని...పరిహాసాలే... చాలునంది...
శ్రీవారిని... ఐదారడుగుల...దూరాన... ఆగమంది...
దూరాన... ఆగమంది...

చరణం: 2
సిగలోని... పువ్వులు... చిలికించే నవ్వులు...
సిగలోని... పువ్వులు ...చిలికించే నవ్వులు...
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
మనకోసం... ఏ సందేశం... అందించే ప్రేయసీ...

ఆనంద సీమలా... అనురాగ డోలలా...
ఆనంద సీమలా....అనురాగ డోలలా...
కలకాలం... తేలీసోలీ...ఆడాలి హాయిగా...
అన్నాయి... తియ్యగా...

ఆ మబ్బు....తెరలే తొలగి...ఆగింది... చందమామ...
ప్రేమికుల ...హృదయము తెలిసి...పాడింది.... చందమామ...
పాడింది.... చందమామ...

ఆహా..హా..ఆ...ఆ...ఆ....





Palli Balakrishna Saturday, March 2, 2019
Lakshadhikari (1963)


చిత్రం: లక్షాధికారి (1963)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: వి.మధుసూధన రావు
నిర్మాతలు: సి. తమ్మారెడ్డి కృష్ణమూర్తి, డి.వెంకటపతి రెడ్డి
విడుదల తేది: 27.09.1963

పల్లవి:
ఆ.. ఆ.. ఆ..
ఓ...ఓ.. ఓ..
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది
ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది

చరణం: 1
చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను
చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను

చేయి చేయి కలపగానే మెరుపు మెరిసెను
ఆ మెరుపులోన నా మేను జలదరించెను

ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది

చరణం: 2
కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి
కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి

మధురమైన మైకమేదో కలుగుచున్నది
ఆ మైక మందు నేనేదో మారిపోతిని

ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది

చరణం: 3
చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది
చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది

కన్నెవలపు అతని చుట్టు తిరుగుతున్నది
ఆ వన్నెకాణ్ణి విడిచి తాను రానన్నది

ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది


******   ******  ******



చిత్రం:  లక్షాధికారి (1963)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల,  పి.సుశీల

సాకీ:
హాయ్.. హాయ్.. హాయ్
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో

నాపైన నీకు కోపమా.. కాదేమి విరహతాపమా
నాపైన నీకు కోపమా విరహతాపమా
పలుకగా రాదా... అలుక మరియాదా
నీ పదునౌ చూపుల అదిరింపులకే బెదరను బెదరను బెదరనులే

పల్లవి:
దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే

చరణం: 1
నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె
నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె

అయ్యారే మేని అందము.. బంగారు తీగ చందము
అయ్యారే మేని అందము.. తీగ చందము
మరులుగొలిపేనూ.. మనసు దోచేనూ
ఈ కమ్మని రాతిరి కరిగేదాకా.. కదలను కదలను కదలనులే

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే

చరణం: 2
నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను
నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను

నువు లేకపోతే ఓ చెలీ.. ఈ లోకమంతా చలి చలి
నువు లేకపోతే ఓ చెలీ.. లోకమే చలి
ఏమి చేసేనే..  ఎటుల సైచేనే
నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా.. విడువను విడువను విడువనులే

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే


******   ******  ******


చిత్రం: లక్షాధికారి (1963)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

పల్లవి:
దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే

చరణం: 1
నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది
నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది
నీ ఓర చూపులను గని.. బంగారు తూపులనుకొని
నీ ఓర చూపులను గని..  తూపులనుకొని మురిసిపోతానూ.. పరవసించేనూ
 నీ కన్నులు రమ్మని పిలిచేదాక కదలను..కదలను..కదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను..వదలను..వదలనులే

చరణం: 2
పొదలలోన వున్నా పూల గంధాలు దాగలేవు
మట్టిలోన వున్నా.. మణుల అందాలు మాసిపోవు
నీలోని రూపమును గని.. రతనాల దీపమనుకొని
నీలోని రూపమును గని.. దీపమనుకొని
మదిని నిలిపేను.. జగము మరచేనూ
నీ పెదవుల నవ్వులు విరిసే దాక విడువను..విడువను..విడువనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే


******   ******  ******


చిత్రం: లక్షాధికారి (1963)
సంగీతం:  టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల,  సుశీల

పల్లవి:
మబ్బులో ఏముంది...
నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?
మబ్బులో కన్నీరు..

నీ మనసులో పన్నిరు.. నీ మనసులో పన్నీరు..
అవునా..ఉహు..ఊ..ఊ....

చరణం: 1
తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
తోటలో మల్లియలు.. నీ మాటలో తేనియలు.. నీ మాటలో తేనియలు ..
ఉహు..ఊ..ఊ..ఊ..
ఊహు..ఊ..ఊ..ఊ..

చరణం: 2
చేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?
చేనులో బంగారం.. నీ మేనులో సింగారం... నీ మేనులో సింగారం

ఏటిలో ఏముంది?.. నా పాటలో ఏముంది?... నా పాటలో ఏముంది?
ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు... నీ పాటలో సరిగమలు

నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?... నీవులో ఏముంది?
నేనులో నీవుంది... నీవులో నేనుంది... నీవులో నేనుంది

నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేనులో నీవుంది...
అహ..ఆ..అహ..ఆ..
అహ..ఆ..అహ..ఆ..


Palli Balakrishna Thursday, February 7, 2019

Most Recent

Default