Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




సాంగ్: మా గల్లీలో ఒక్కడు పోరడు (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: జోగుల వెంకటేష్ 
సింగర్: మౌనిక యాదవ్ మామిండ్ల
డైరెక్టర్: హరీష్ వేల్పుల 
విడుదల తేది: 03.11.2022



మా గల్లీలో ఒక్కడు పోరడు పాట సాహిత్యం

 
సాంగ్: మా గల్లీలో ఒక్కడు పోరడు (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: జోగుల వెంకటేష్ 
సింగర్: మౌనిక యాదవ్ మామిండ్ల
డైరెక్టర్: హరీష్ వేల్పుల 
విడుదల తేది: 03.11.2022

మా గల్లీలో ఒక్కడు పోరడు
అందగాడడు నన్ను జూత్తడు
నన్ను జూసిన జూడనట్టుంటడు
నవ్వుతుంటడు కన్నుగొడతడు
సైగ జేత్తడు…

వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు
తెలివిగల్లోడు తెల్లగుంటడు
నన్ను సాటుకిలిసి ముచ్చటంటడు
ముద్దులంటడు సరసమంటడు
లొల్లి జేత్తడు…

యే.. పొద్దున్నే మా వాడ కత్తడు
కావలుంటడు అడ్డమొత్తడు
నన్ను కాలేజికే బోనీయడు
బండి దెత్తడు ఎక్క మంటడు
పోదామంటడు…

నాకు ఊరు వాడ జూపిత్తడు
జాతరంటడు తొల్కవోతడు
నేనడిగింది నాకు గొనిత్తడు
రాణివంటడు, రాజునంటడు
మురిసిపోతడు…

వాడు సక్కని మనసున్న పోరడు
ఊరినిడవడు ఊళ్ళో ఉంటాడు
ఈ ఊరంతా నా వోళ్లే అంటాడు
తోడుగుంటడు సాయమైతడు
సాగిపోతడు..

వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు
కాని లేనోడు అన్నట్టుంటడు
అందరితోని గలిసి మెలిసుంటాడు
బుద్ధిమంతుడు సదువుకున్నోడు
సక్కనైనోడు..

వాడు సుక్కల్లో మెరిసేటి సంద్రుడు
కలవ కళ్ళోడు కాంతి నవ్వోడు
పారాయి అమ్మాయిలని జూడడు
దారి ఇస్తడు పక్కకెలతడు
పారిపోతడు..

మరి నేనంటే పడి సచ్చిపోతడు
నన్ను ఇడవడు కలవరిత్తడు
వాడు పడుకున్నా నా పేరేనంతడు
మొండి గుణమోడు మాయజేశాడు
మనసు దోశాడు..

నా మేనత్త ముద్దుల కొడుకాడూ
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు ఏలుకుంటాడు
తోడుగుంటాడు..

నా మేనత్త ముద్దుల కొడుకాడూ
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు ఏలుకుంటాడు
తోడుగుంటాడు..

No comments

Most Recent

Default