Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kokilamma (1983)




చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, పి. బి. శ్రీనివాస్ 
నటీనటులు: రాజీవ్ (నూతన పరిచయం) , సరిత, స్వప్న
కథ, స్క్రీన్ ప్లే; దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: ఆర్.ఎస్.రాజు
విడుదల తేది: 07.05.1983



Songs List:



ఎవ్వరో పాడారు భూపాల రాగంపాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు

పల్లవి:
ఆ....ఆ...
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం

చరణం: 1
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై

చరణం: 2
వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం




కొమ్మమీద కోకిలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయు
గానం: పి.సుశీల

పల్లవి:
కొమ్మమీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నది... ఓహో అన్నది

చరణం: 1
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శ్రుతిచేసి లయకూర్చునో
అని తల్లి అన్నది అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నది కలలు కన్నది

చరణం: 2
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండుమనసే
నేను పాడే ది నీ పాటనే
అని ఎవరు అన్నది అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నది




నీలో వలపుల సుగంధం పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా
 
నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా...గతులుగా
లయలుగా....హొయలుగా

కనులకు వెలుగైనా.. కలలకు విలువైనా
నీవే నా చూపుగా....ఆ....ఆ
కనులకు వెలుగైనా.. కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ...ఆ
తలపులనైనా మరపులనైనా
నీవే నా రూపుగా
తలపులనైనా మరపులనైనా
నీవే నా రూపుగా
వయసుకే.... మనసుగా
మనసుకే...... సొగసుగా

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా
 
మల్లెలజల్లేలా.. వెన్నెల నవ్వేలా
మదిలో నీవుండగా...ఆ ఆ ఆ ...
మల్లెలజల్లేలా.. వెన్నెల నవ్వెలా
మదిలో నీవుండగా...
కోవెల ఏలా... దైవము ఏలా
ఎదటే నీవుండగా...ఆ....ఆ...
కోవెల ఏలా... దైవము ఏలా
ఎదటే నీవుండగా
నేనుగా... నేనుగా
వేరుగా... లేముగా

నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా...గతులుగా
లయలుగా....హొయలుగా

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా





పల్లవించవా నా గొంతులో పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు 

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి. బి. శ్రీనివాస్

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి 

మధురం మధురం నాదం 
అది అమరం అమరం వేదం
నాదం గానం సామం
స్వరకలితం లలితం రమ్యం

శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం 
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
అమితం అమృతం నిరతం
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం మధ్యమదూతం 
త్రైకాల సంచారం
శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం 
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి 
గీతం కవితా హృదయం
సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం
త్రైమూర్తి రూపం

జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
ప్రియురాలి శోకమే తొలికావ్య శ్లోకమై శ్రీరామ చరితై నిలచినది
తీరని దాహం గానం
కడతేర్చే జ్ఞానం గానం
రాగం మోదం మోక్షం సంగీత యోగం
శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం 
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
హాహాహా ఆఆఆహాహాహా ఆఆఆ

ఆఆఆఆ ఆ ఆఆఆఆ ఆ ఆఆఆఆ ఆ ఆఆఆఆ ఆ…ఆ….ఆ…ఆ…ఆ



పోనీ పోతే పోనీ పాట సాహిత్యం

 
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: యం.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయు
గానం: పి.సుశీల

పోనీ పోతే పోనీ పోనీ పోతే పోనీ 
మనసు మారిపోని మమత మాసిపోని 
గురుతు చెరిగిపోని గుండె రగిలి పోనీ

పోనీ పోతే పోనీ పోనీ పోతే పోనీ 

ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు
అది జీవితానికి తుది మొదలు కాదు
ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు
అది జీవితానికి తుది మొదలు కాదు
ప్రేమించ గలనిండు మనసున్న చాలు
అది పంచి ఇచ్చేందుకెందరో గలరు
ప్రేమించ గలనిండు మనసున్న చాలు
అది పంచి ఇచ్చేందుకెందరో గలరు

పోనీ పోతే పోనీ పోనీ పోతే పోనీ 
మనసు మారిపోని మమత మాసిపోని 
గురుతు చెరిగిపోని గుండె రగిలి పోనీ


No comments

Most Recent

Default