Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nagamalli (1980)




చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: చంద్రమోహన్, దీప, మేనక 
దర్శకత్వం: దేవదాస్ కనకాల
నిర్మాత: భాస్కర వర్మ 
విడుదల తేది: 1980



Songs List:



మల్లీ మల్లీ..నా నాగ మల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల 

పల్లవి: 
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..

చరణం: 1
ఆషాఢ మాసాన మిల మిలమన్నా
మెరుపే చూసి నీవనుకున్నా
కార్తీక దీపాల కాంతులలోనా
కళలే చూసి నీవనుకున్నా
ఆరారు రుతువుల ఆలాపనగా
కనులే తెరచి నే కలలే కన్నా
కాల మేఘములు..కామ దాహములు..
కరిగినా మధుర గీతం
నిను నను కల్పిన నిముషము 
వలపున యుగయుగాల సంగీతం..
తనువు నీ వేణువే... మనసు నీ రాగమే..
మల్లి నీ కోసమే

చరణం: 2
మధుమాసంలో కుహు కుహుమన్నా
పిలుపే విని నీ కబురనుకున్నా
వైశాఖ మాసాన వేసవిలోనా
వడగాలులు నీ ఉసురనుకున్నా
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా
నను నే మరచీ నీ కౌగిట ఉన్నా
మదమరాళి నీ పద నివాళికై 
తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు 
వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై... 
చందమామ నీ వదనమై..
సిరులు మువ్వలై... 
గిరులు నవ్వులై... 
ఝరులు నడకలై..
అల్లన మెల్లన పిల్లన గ్రోవికి
ఆరవ ప్రాణము నీవుగా
కదలిరా శిల్పమై 
సంగీతమై నాట్యమై
కదలిరా శిల్పమై... సంగీతమై..నాట్యమై
కలసిపో నీవుగా... నేను నీ మేనుగా
నీవే... నేనుగా.......




నాగమల్లివో తీగ మల్లివో పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

నాగమల్లివో తీగ మల్లివో 




నిదరోయి నదులన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

నిదరోయి నదులన్ని 




రాగం తీసే కోయిలా.. పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
పిలవని.. పిలుపుగా ..రాకే నీవిలా
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం: 1
జంటని ఎడబాసినా.. ఒంటరి నా బ్రతుకునా
మల్లెల సిరివెన్నెల.. మంటలు రేపగా...
వయసుల నులి వెచ్చని.. వలపుల మనసిచ్చిన
నా చెలి చలి వేణువై.. వేదనలూదగా...
తొలకరీ పాటలే.. తోటలో పాడకే.. పదే పదే పదే పదాలుగా
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం: 2
పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన.. ఆమని పాటగా...
అందమే నా నేరమా.. పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే.. ఆఖరి మాటగా...
గుండెలో మురళిని.. గొంతులో ఊదకే.. పదే పదే పదే పదాలుగా...
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా




వావిలపువ్వు వామన గుంట పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

వావిలపువ్వు వామన గుంట వరసో వరస




మల్లెపూలు పెట్టకుండ పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

మల్లెపూలు పెట్టకుండ





లాహిరిలో లకుముకి పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

లాహిరిలో లకుముకి

No comments

Most Recent

Default