Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sri Manjunatha (2001)చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
నటీనటులు: చిరంజీవి , మీనా, అర్జున్ , సౌందర్య
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: నారా జయశ్రీదేవి
విడుదల తేది: 22.06.2001Songs List:
ఈ పాదం పుణ్యపాదం పాట సాహిత్యం

   
చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ... కరమేలా ఈ... కరమేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం

చరణం: 1
మార్కండేయ రక్షపాదం మహాపాదం... ఆ... ఆ...
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా....
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనీడినా అయ్యో...
అందనీ అనాధనైతీ మంజునాథా...

ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ....
ఈ... శిరమేలా ఈ... బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం

చరణం: 2
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ... ఆ... ఆ...
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం...
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
అన్నదాత విశ్వనాథా....
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో...
ఛీ పొమ్మంటినే పాపినైతినే...

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
తెలుసుకోలేనీ నా ఈ...తెలివేలా ఈ తనువేలా
ఈ పాదం పుణ్యపాదం... ఈ పాదం దివ్య పాదంఒక్కడే... ఒక్కడే... పాట సాహిత్యం

   
చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జె. కె.భారవి
గానం: యస్.పి. బాలు

ఒక్కడే... ఒక్కడే... మంజునాధుడొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

శక్తికి రక్తికి ఒక్కడే
భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను
మంజునాధ మంజునాధ
దర్శించే మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు
లోకాల దొరకాదు దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా...
జయ జయ శంభో జయ జయ చంద్రకరా...

నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు

నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాధ మంజునాధ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా...
జయ జయ శంభో జయ జయ చంద్రకరా...

శంకర మురహర శంభో హర హరా
మంజునాధ మంజునాధ
మంజునాధ మంజునాధఓం మహాప్రాణ దీపం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు

ఓం మహాప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాథం

ఓం ఓం ఓం నమః శంకరాయచ 
మయస్కరాయచ నమః శివాయచ
శివతరాయచ బవహరాయచ

మహాప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
హృదశ హృదయంగమం చతురుధది సంగమం పంచభూతాత్మకం శత్శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం అష్టసిద్దీశ్వరం
నవరస మనోహరం దశదిశాసువిమలం

మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం
ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం తకధిమిత కారకం
భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం
 
ఈశం సురేశం ఋషేశం పరేశం
నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్రమార్షం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం… నమో హరాయచ స్మరహరాయచ
పురహరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాదం శివం శివం

ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ
ఢక్కా నినాద నవతాండవాడంబరమ్
తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి
సంగీత సాహిత్య సుమకమల భంబరం
ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార
మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం
సామ ప్రగీతం అధర్వప్రభాతం
పురాణేతిహాసం ప్రసీద్దం విశుద్ధం
ప్రపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం

నకారం మకారం శికారం వకారం
యకారం నిరాకార సాకార సారం
మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం

ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం
జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాశం మహా భానులింగం...
మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం...

సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం
వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం వామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం ఘృష్మేశ్వరం
త్రయంబకేశ్వరం నాగలింగేశ్వరం..
శ్రీ... కేదార లింగేశ్వరం

అప్లిలిగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం...

అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం...
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం...
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం...

ఓం..........ఓం...నమః 
సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ
భాగ్యాయచ శాంతయచ శౌర్యాయచ
యోగాయచ భోగాయచ కాలాయచ
కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ
ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ


ఆనందా పరమానందా పాట సాహిత్యం

   
చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు

ఆనందా పరమానందా పరమానందా
ఆనందా పరమానందా పరమానందా
జగతి నీవే జన్మ నీవే జగదానందా
ఆట నీదే పాట నీదే ఆత్మానందా

నిసరి... సరిగ....
మమరిస నిసరిస గనిపమ గమరిస

ఆనందా పరమానందా పరమానందా

మాయల వలలోన జీవుల బంధించి
మురియుట ఒక ఆట ధర్మానందా
ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి
నవ్వించుటొక ఆట మోహానందా

పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
ప్రాణ దాత బ్రహ్మరాత నీ మాయేరా
ఆది నీదే అంతు నీదే అమరానందా

నిసరి... సరిగ...
మమరిస నిసనిస గనిపమ గమరిస

ఆనందా పరమానందా పరమానందా

గంగను తల దాల్చి ధరణికి మరలించి
స్వర్గంగ మార్చావు మధురానందా
పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని
లేకుండ చేస్తావు స్వర్గానందా

దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
కన్న వాళ్ళ కర్మలేద పుణ్యానందా
కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా

నిసరి... సరిగ...
మమరిస నిసనిస గనిపమ గమరిస

ఆనందా పరమానందా పరమానందాఓహో గరళ కంఠ పాట సాహిత్యం

  
చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్.పి. బాలు, అనురాధ శ్రీరాం

ఆ హ హ హ... రుద్రా... వీరభద్ర
కైలాసానా నీకు సుభిక్షిం సుభిక్షిం
నిన్ను నమ్మిన భక్తులకి దుర్బిక్షిం
దుర్బిక్షిం హు హు దుర్బిక్షిం

రుద్రా ఏయ్ వీరాభద్ర
ఈ నమ్మనివాడి చేత చిక్కితే నిన్ను 

చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు
రుద్రా..చిత్తు చిత్తు చిత్తు చిత్తు చేస్తా... (2)

ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంట యట్టపుట్టావో చెప్పమంట
ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంట యట్టపుట్టావో చెప్పమంట

దొంగశివ.. భంగశివ.. ద్రుష్టశివా.. భ్రష్టశివా...

దొంగశివ దొంగశివ భంగశివ భంగశివ
ద్రుష్టశివా ద్రుష్టశివా భ్రష్టశివా...

హే...ఈశ్వరా....సర్వా లోకేశ్వరా..
గంగధరా...గౌరివరా...శ్రీమంజునాద నమెః

ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంట యట్టపుట్టావో చెప్పమంట

ఓయ్ తనానననననన తనాననన తనాననన ఓయ్

ఓహో నుదుటే ఉన్నదంటా
ధగ ధగ మండే ఒక కన్ను
ఈడ మగువ బతుకవుతోంది మన్ను

హే....హే లయకారా జననం మరణం
నీకోక ఆటా లీలా.. లోలా..లోలా...

ఓహో భుతనాధా నీ చేతా
ఏందుకంటా ఇంతా బారు తిరుశుాళం
నిన్ను నమ్మినోడికి పోగాలం

హే....హే త్రిగునేసా త్రికాల కారకమే ఆ శూలం 
చూస్తే ధన్యం...ధన్యం....

బిల్వపత్రమంటే మోజ నీకు రుద్రా
అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్రా

తిరుపమెత్తి తిరిగెటోడా కాటీ రుద్రా
నీదిీ యోగమసలె కానేకాదు దొంగ నిద్రా

యోగేశ్వరా... సర్వలోకేశ్వరా...
సాకారుడా... నిరాకారుడా...శ్రీమంజునాద నమో

ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంట యట్టపుట్టావో చెప్పమంట

సకలం స్వాహా చేస్తావు
గుర్రుకొట్టి కాట్లో తొంగుతావు
నువ్వు నిద్ర లేచేదేనాడు

హే..చిత్రుప నువ్వే నిదుర లేచిన వేలా
అంతమే అనంతం...

శవగన భుతగన వాసనలతో కులికేటోడ
నీతో పార్వతెట్ట ఉంటదో
గంగ ఏంతో మొత్తుకుంటు తెర్లుతుంటదో...హే

హే...నీలీకంఠా..హాాలహలమును
బ్రోవెదవయ్యా తియ్యగా అమృతం..

సుచి రుచి ఉన్న చోట వుండవంటా
నీకు పచ్చిమద్య మాంసాలంటే ఇష్టమంట.. వహెయ్

గన గన గంట కొడితె వస్తావంట
ఇటు రా నిన్ను విరిచి నంజుకుంటా

ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంట యట్టపుట్టావో చెప్పమంట

దొంగశివ.. భంగశివ.. ద్రుష్టశివా.. భ్రష్టశివా - హు..
దొంగశివ దొంగశివ భంగశివ భంగశివ
ద్రుష్టశివ ద్రుష్టశివ భ్రష్టశివ

హే...ఈశ్వరా....సర్వా లోకేశ్వరా...
హే...ఈశ్వరా....సర్వా లోకేశ్వరా...
హే హే బిత్తిరి పాట సాహిత్యం

   
చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: చంద్ర బోస్
గానం: హేమంత్ కుమార్, నందిత
 
అక్షరాయ నమః పాట సాహిత్యం


  
చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జె. కె.భారవి
గానం: హేమంత్ కుమార్, చిత్ర

ఓం 
అక్షరాయనమః
ఆద్యంత రహితాయ నమః ఇందీవరదళశ్యామాయనమః
ఈశ్వరాయ నమః
ఉపకారప్రియాయ నమః 
ఊర్ధ్వలింగాయ నమః
ఋగ్య యజుస్సామ సంభూతాయ నమః
ౠకార మాతృకావర్ణ రూపాయ నమః
ఋఌగ్వతాయ నమః

ఓం అక్షరాయనమః

ౠౡనితాఖిలదైత్యాయ నమః
ఎఏజితాఖిల సంశ్రయాయ నమః
ఐహితామూషికా 
ఒరదాయ నమః
ఓజస్సుతే నమః
ఔదార్యనిధయే నమః 
అంబికాపతయే నమః
కపర్తినే నమః
ఖట్వాంగినే నమః
గణనాథాయ నమః 

ఓం అక్షరాయనమః

ఘనానందాయ నమః 
ఙశ్శేవితాయ నమః
చంద్రశేఖరాయ నమః
ఛందోవ్యాకరణసారాయ నమః
జనప్రియాయ నమః 
ఝంజానిల మహావేదాయ నమః
ఞబంజితాయ నమః 
టంకార నృత్య విభవాయ నమః
ఠంశబ్దప్రియాయ నమః 

ఓం అక్షరాయ నమః

డం డం డం డం డం డంబాయ నమః
ఢక్కా నినాద ముదితాయ నమః
ణరిసని దాపమ గణధ్రంజితాయ నమః
తత్వమసి తత్వాయ నమః
థ...థస్వరూపాయ నమః
దక్షిణామూర్తయే నమః,
ధరణీధరాయ నమః
ధర్మస్థల నివాసాయ నమః
నంది ప్రియాయ నమః


బ్రహ్మమురారి పాట సాహిత్యం


చిత్రం: శ్రీ మంజునాథ (2001) సంగీతం: హంసలేఖ సాహిత్యం: భక్త ఋషి గానం: రమేష్ చంద్ర, నందిత బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్య్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే


ఓలమ్మో గౌరమ్మో పాట సాహిత్యం

చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జె. కె.భారవి
గానం: యస్.పి. బాలు, స్వర్ణలత

ఓలమ్మో గౌరామ్మో బలే జోరమ్మో చూడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
ఓరయ్యో జంగమ్మ గుండే నిండిపో గుమ్ ఘుమ
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే

జనక జనక జనక జనక
లయల హొయలు సోలే దాకా
కులుకులొలుక మేళమాడి
పొద్దుపొడిచి పోయెదాక
జాగరణ పండగే పండునమ్మో గౌరామ్మో
కోరికల కొలువే తీరునమ్మో కొండమ్మ

ఓలమ్మో గౌరామ్మో బలే జోరమ్మో చూడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే

సత్యమృతి అమ్మొ సల్లా సల్లనిరేడు
సయ్యంటు వచ్చేసిండు 
యమకే దాసుడై పిల్ల మనసు దోచిండు
ఈశాన్య దిక్కుకాడ పుట్టిన చలిగాలినంత పార్వోతి పడక దిక్కుకే
శివ శివ అంటూ ఉరికించి పట్టిన చెమటలు 
ఆర్చిండు
మహా శివరాత్రిని జోడు తాళాలు కొట్టి
ఆరు నాట్య శాస్త్రాలను ఒక్క గజ్జకొసకు గట్టి

కొండకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే
కొండకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే
మదన కామరాజా తీరు కోరి కోరి కులుకుతాడే
పిట్టకన్ను చెదిరేటట్టు లోట్టలేసి కూడుతాడే
పిట్టకన్ను చెదిరేటట్టు లోట్టలేసి కూడుతాడే
ఈడు ఆట వీడిలాగ ఇంకా ఎవడు ఆడలేదే
తోలుబోమ్మలాటలోన వీడికెవడు సాటిరాడే జంగమా

ఓలమ్మో గౌరామ్మో బలే జోరమ్మో చుడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
ధింతక్క జంగమ్మ గుండే నిండిపో డిం డిమ

ఏడేడు లోకాలను ఏలే దొర వీడేలే
పిసరంత బిల్వపత్రికే లొంగునే పొంగూనే
తీరని మొక్కులు తీర్చునే 
సతీమతి సిరిమతి ఆదిశక్తిని కలిసి
ఆనందమూర్తి సిందులే
వేసెలే వెచ్చని అంగన ముంగిట మగ్గులే
ఎనక ముందు మాటలేక బకుపికి పొంగిపోయి
అసురులకు వరాలు ఇస్తాడు రెచ్చిపోయి

తుంబురినికి నారదునికి లాలాపోసి లాగుతాడే
తుంబురినికి నారదునికి లాలాపోసి లాగుతాడే
జీవతంతు నాట్యతంతు మీటుతాడే మిడుకుతాడే
సందు చుసి సామలీల పాడుతాడె పలుకు తాడే
సందు చుసి సామలీల పాడుతాడె పలుకు తాడే
ప్రణయవిందు ప్రణవమంటు సాటిచల్లు చిలుకుతాడే 
ఓనమాల జీవాలే ఓంకారమంటడే జంగమ్మ

ఆకాశమే ఆకారమై - శ్రీ మంజునాథ చరితం పాట సాహిత్యం

చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎస్.పి. బాలు, అనురాధ శ్రీరాం

ఆకాశమే ఆకారమై
భూమియే విభూతిదై
అగ్నియే త్రినేత్రమై
వాయువే చలనమై
జలమే జగమేలు మందహాసమై

పంచభూతాధార ప్రపంచేశ్వర
విధాత విశ్వనాథ
భువి వెగసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై

శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం

మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం (3)

అమృతం కోరి క్షీర కడలిని చిలుక 
ఆవిర్భవించింది హాలాహలం

శంకరుని శంఖమున సుభకర తీర్దమైనది విషం
జీవరాసుల రక్షకే శివుడాయే విషానికి అంకుశం

ఓం నమః శివాయ (2)

పితురుల ఆత్మకు శాంతిని కుర్చగా
గంగను ధరకే తరల్చిన 
తపసును బూణే భగీరదుడు
సురగంగ వరగంగ ప్రలయంగ 
ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తితే
అధిరి అల్లాడెను భూమి
కాపాడ రావయ్య స్వామి

కనులు మూడని నీకు ఓ శివయ్య
గంగనాపగ గర్వపడి రాకయ్య
తుల్లిపడకే చాలు చెల్లవింకా
గంగా వెర్రులు తెలుసు దూకు ఇంకా
కాసుకో కైలాస లింగా
దూకవే అకాశగంగా

ప్రియగంగ కనులేల పొంగే
నిను ముడితే నా మనసూగిపోయే
అహ్వనం - అహ్లాదం 
శివగంగ ప్రేమానుబంధం
రావే శివ సిరచారిని
ధన్యోస్మి ధన్యోస్మి స్వామి

హరా... వరా... యేలరా
సదా...శివా... బ్రోవరా
సఖి...సతి... పార్వతి
ప్రియే... ఇదే... సమ్మతి

శాంతించరా శంకరా అగన్మధుని బ్రోవరా
లోక కల్యాణమును కోరి శివుడు
పార్వతి కళ్యాణ వరుడాయెను
సతికి తన తనువులో సగభాగమొసగి అర్ధనారీశ్వరుడాయెను
నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు

ఎన్ని జన్మల ఫలమిది పాట సాహిత్యం

చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: కోరస్

ఎన్ని జన్మల ఫలమిది
ఎన్ని తపస్సుల వరమిది
అన్నపూర్ణా దేవి ప్రియముగా
ఆర ముద్దలు చేసి పెడితే ఆరగించే
ఆది భిక్షువు ఆడుకొను ఆటే ఇది
ఆడుకొను ఆటే ఇది
భక్తుడే ఆడించినట్టు ఆడుతున్న ఆటిది
ఆడుతున్న ఆటిది


స్వాగతమయ్య పాట సాహిత్యం

చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జె. కె.భారవి
గానం: యస్.పి. బాలు
  
ప్రాణాలనే... పంచభక్ష్యాలుగా
అర్పించెదర యమరాజా.....హా శివ...

స్వాగతమయ్య ఓ యమరాజ
ఓ యమరాజ ఓ యమరాజ 
స్వాగతమయ్య ఓ యమరాజ 
ఓ యమరాజ ఓ యమరాజ
ఈ మాయ తెరా.... దీంపేయగా... రారా

స్వాశ నువ్వే శాంతినువ్వే
స్వర్గమిచ్చే సకుడునువ్వే మృత్యుదేవా....
ఎందరున్న ఎన్నిఉన్న
వెంట వచ్చే చివరి తోడు మరణమేర
లేనిదే పోదురా పోనిదే రాదురా
ఆలించరా... పరిపాలించరా...
కొనిపోరా యమరాజా.... ఆ హ రా...

తనువొక మాయ ఓ జవరాయ
ఓ జవరాయ ఓ జవరాయ
ఈ మాయ తెరా.... దీంపేయగా రారా

ముద్ధు చేసి ముడిని తెంచి
యదను చేర్చి ఎత్తుకెల్లే.... తండ్రి నువ్వే....
లాలిపాడి నిదుర పుచ్చే
వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే....
లెక్కలే చెల్లెరా బంధమే తీరెరా
పాలించరా... పంట పండింధిరా....
కరుణామయా కడతేర్చరా... హ ఈశ్వరా...

స్వాగతమయ్య ఓ యమరాజ 
ఓ యమరాజ ఓ యమరాజ 
స్వాగతమయ్య ఓ యమరాజ 
ఓ యమరాజ ఓ యమరాజ  

శ్రీ మహం మంజునాథ పాట సాహిత్యం


చిత్రం: శ్రీ మంజునాథ (2001) సంగీతం: హంసలేఖ సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస గానం: కోరస్ శ్రీ మన్మహా మంజునాథ నమో భూతనాథ నమః ప్రాణనాథ నమః ప్రమదనాథ నమో విశ్వరూప నమో వేదదీప నమో నవ్యకల్ప నమో నిర్వికల్ప నమః సగుడదిగుడ నమః సర్వధమన నమః సమితమధన నమః శాంతి సదన శ్రీచరణ సంసారం సంతాపహరణ వాత్సల్యవరణ కాలద్వియతారన సృష్ఠి స్థితి ప్రళయకారన పంచముఖ సకల ప్రపంచ సుగుసుముఖ విషాదాంత వినుత ప్రదైవతత్ ప్రముఖ నమో ధర్మతిలక నమో నందహస్త నమో నందనేత్ర నమో భవ్యశస్త్ర నవ చిత్రగాత్ర నమో దివ్య ధర్మస్థల క్షేత్రనాథ మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ నమః ప్రాణి భవబంధ మోక్షప్రదాత నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ

ఒక్కడే... ఒక్కడే...(Bit) పాట సాహిత్యం

చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జె. కె.భారవి
గానం: యస్.పి. బాలు

ఒక్కడే... ఒక్కడే... మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శక్తి కి రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి ఒక్కడే దిక్కొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే


మంగళ శ్లోకం - ధర్మస్థల పాట సాహిత్యం

చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస
గానం: హేమంత్ కుమార్

Most Recent

Default