Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manasu Maata Vinadu (2005)చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుఖ్విందర్ సింగ్
నటీనటులు: నవదీప్, అంకిత
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాతలు: పొట్లూరి ఫనేంద్ర బాబు, పుల్లారావు
విడుదల తేది: 12.02.2005

సరదాగా ఉంటాం, నో టెన్షన్ అంటాం
సాఫీగా లైఫే సాగేలా
కలలెన్నో కంటాం, కలలే అనుకుంటాం
వెంటాడం బాటని పట్టేలా
అంతా మనమెవరో గుర్తించే లోగా
కనిపెడితే ఆ జెండా లాగా
మనకు మరి ఈ ఫ్రీడం కూడా మిగలదుగా

సినిమా చూసి బాగుంటే మస్త్ అని ఏక్ సీఠీ మారో
స్క్రీనెక్కేసి స్టారైతే బెస్టని టెంప్టేషన్ వద్దురో
పొమ్మని.. వెళ్లిపొమ్మని ప్రాబ్లెంస్ అన్నీ పంపించేస్తాం
పన్లు గిన్లు పక్కకి తోస్తాం…
రమ్మని వెల్‌కమ్మని మాతో వస్తే చెయ్యందిస్తాం
అడ్డనుకుంటే సైడిచ్చేస్తాం
తధిగిణతోం అంటూ రాసేస్తా
కథకళితో కట్టేస్తే ఎట్టా
తలపులతో ఈ కాలం అంతా తడబడదా
సరదాగా ఉంటాం నో టెన్షన్ అంటాం
సాఫీగా లైఫే సాగేలా
టెండుల్కర్లా టెన్నిస్ ఎల్బో వచ్చే ఆటాడం
టీవీ చూస్తూ జాలే అనుకుంటాం
అంతా మనమెవరో గుర్తించే లోగా
కనిపెడితే ఆ జెండా లాగా
మనకు మరి ఈ ఫ్రీడం కూడా మిగలదుగా


ఇష్క్ అన్నది చాలా రిస్కన్నది గుర్తుంచుకోరా
ఇంకేముంది తేలేదెలాగాని తెలియాలి సోదరా
తీరమే చేరక అట్లాంటిక్లో టైటానిక్లా మునిగే దాకా పయనించాలా
ప్రాణమే అరిపించెగా..కాదల్ అంటే కార్గిల్లాగా చచ్చే దాకా ప్రేమించాలా
మన వెనకే ఇలా వస్తే ఓకే, తన వెనకే రమ్మంటే షాకే
మతి చెడితే మన మనసే మాట వినదు కదా*********   ********   *********


చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్, జాన్నియ రాయ్

నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా
మది వినేలాగా అను
నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా
ఇది వెయ్యోసారి విను
మనసు తపన అదే.. తలపు అదే
తెరవిడి రాదేం త్వరగా
కలలుగనే కలను కనే కల అనుకుంటే కుదరదుగా
నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని
ఉరిమిన మేఘం తొలకరి శృతిలో పలికిందా
ముదిరిన దాహం మధువుల నదిలో మునిగిందా
నిన్ను తలపై నిలిపే చొరవిస్తే శివుడైపోనా దివి చినుకా
దిగివస్తాలే సొగసిస్తాలే
నీ పెదవేలే పదవే చాలే
నీకదే మోక్షమను సరే కాదనను

చిలిపి దుమారం చెలిమికి ద్వారం తెరిచిందా
వయసు విహారం వెతికిన తీరం దొరికిందా
నా గెలుపే తెలిపే చిరునవ్వై మహ మెరిశావే మణితునక
సఖి సావాసం..ఇక నీ కోసం
ప్రతి ఏకాంతం నాకే సొంతం
ఈ అల్లరే ఇష్టపడి వరించాను నిన్ను*********   *********   *********


చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్, సునీత

నువ్వు నిజం .. నీ నవ్వు నిజం .. నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు .. ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం .. నా ప్రేమ నిజం .. ఇది పిచ్చితనం అనకు
అన్నా మనసు మాట వినదు..విన్నా అవును కాదు అనదు

నీలో నా సంతకం ..చెరిపే వీల్లేదుగా ..నాలో నీ జ్ఞాపకం ..కరిగే కల కాదుగా

నువ్వూ నేనూ రెండక్షరాలుగా..మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా..పిలిపించుకోగా

ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్ఠపదులు..వెంటే పడవా అష్ఠదిశలూ
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంట లేని ఎదలో మనకే తగులుతుంది ఉసురు

చెబితే వినవే ఎలా..ఎగసే నిట్టూర్పులూ
చలితో అణిచేదెలా..రగిలే చిరుగాలులూ

నువ్వూ నేనూ రెండక్షరాలుగా..మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా..పిలిపించుకోగా

ఎప్పటికీ నను తప్పుకునే వీలివ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు..కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవే నల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు..చూస్తూ మేలుకోవు కనులు

మనసే దోస్తే ఎలా..
కనకే ఈ సంకెలా..
వొడిలో పడితే ఎలా..అడుగే కదిలేదెలా

నువ్వూ నేనూ రెండక్షరాలుగా మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా పిలిపించుకోగా


********   *********   ********


చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్, సునీత

నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చిదనం అనకు
అన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా
నాలో నీ ఙాపకం కరిగే కల కాదుగా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్టపదులు వెంటే పడవ అష్టదిశలు
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులు
చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

ఎప్పటికీ నను తప్పుకునేవీ ఇవ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవేనల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు చూస్తూ మేలుకోవు కనులు
మనసే దోస్తే ఎలా తనకే ఈ సంకెలా
ఒడిలో పడితే ఎలా అడుగే కదిలేదెలా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

Most Recent

Default