Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhadra (2005)చిత్రం: భద్ర (2005)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: రవి వర్మ
నటీనటులు: రవితేజ, మీరాజాస్మిన్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 12.05 2005

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం
వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం
కరిగే కలలే తరిమే మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
*********   *******   ********చిత్రం: భద్ర (2005)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: కులశేఖర్
గానం: మల్లికార్జున్, సుమంగళి

హే మబ్బులోన దాగి ఉన్న చందమామ
నిన్ను మించే అందముంది చూడవమ్మా
కళ్ళు చూసి కుళ్ళుకోదా కలువభామ
ఆమె ముందు ఎవ్వరైనా నిలవరమ్మా ఓయ్

ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది
ఆనందం అంచులు దాటింది
మరుమల్లెగ మారి నీకోసం పల్లవి పాడింది
నా గుండెలో ఈ ఊపిరి నీ పేరులే అడిగింది
నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది
పరిచయమెరుగని తొలి తొలి వయసుని పిలిచి మనసుపడని
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా
ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది

నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో
అలజడి రేగింది పులకలు రేపింది
ఎంత చెప్పినా వినకుండా ఏరులాగ నా మనసంతా
గల గల పారింది ఉరకలు వేసింది
నీ ఊసులే నాతో ఇలా చెప్పిందిలే చిరుగాలి
నాతో మరి దోబూచులా రావే ఇలా ఒకసారి
వివరములడగక ఎదురుగ నిలబడు కలల తెరలు వదిలి
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా
హే.. ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది

ఏలేలో ఏలేలో రామసక్కని కుర్రాడే
ఏ ఊరి పిల్లాడో రాసలీలకు వచ్చాడే
పచ్చని పంటల్లో ఎన్నో ముచ్చటలాడాడే
చల్లని గుండెల్లో ఆడే చిచ్చునే రేపాడే
నాకోసం పుట్టాడొయమ్మా ఈ అల్లరి వాడు
మనసంతా దోచాడోయమ్మా..

హే.. వానవిల్లులో మెరుపంతా నీ ఒంపుసొంపులో గమనించా
తళుకుల చిరునామా నువ్వేలే మైనా
సంధ్య పొద్దులో ఎరుపంతా నీ పాల బుగ్గలో చిటికంతా
తెలియని బిడియాలే ఒదిగెను నీలోనా
నీ నవ్వుతో పున్నాగమే పూచిందిలే సుకుమారి
నీ రాకతో నా జన్మకే వెలుగొచ్చనే తెలవారి
ఉరుకుల పరుగుల పరువపు వయసుని చెలియ వెంటపడని
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా********   *******   *******

చిత్రం: భద్ర (2005)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి

తిరుమల వాసా
తిరుమల వాస సుమధుర హాస
ఈ హారతి గొనవయ్యా
శ్రితజన పోష జయ జగదీష
మా ఆర్తిని కనవయ్యా

అడుగె పడని పయనాన
అడుగె పడని పయనాన
వెలుగై నడిపె నీ కరుణా
ఆ వరాన్ని ఈ దోసిలిలోన
నిలుపుకొందుకె తపములు చెసా

తిరుమల వాస సుమధుర హాస
ఈ హారతి గొనవయ్యా
శ్రితజన పోష జయ జగదీష
మా ఆర్తిని కనవయ్యా

Most Recent

Default