Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Thimmarusu (2021)




చిత్రం: తిమ్మరుసు (2021)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నటీనటులు: సత్యదేవ్ , ప్రియాంక జ్వాల్కర్
దర్శకత్వం: శరన్ కొప్పిశెట్టి
నిర్మాత: మహేష్ కోనేరు, సృజన్ యారబోలు 
విడుదల తేది: 30.07.2021



Songs List:



తిమ్మరుసూ పాట సాహిత్యం

 
చిత్రం: తిమ్మరుసు (2021)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
గానం: రఘుదీక్షిత్, జ్యోత్న పాకాల, యామిని గంటసాల, అంబిక శశిట్టల్

హే నల్లకోటులోన న్యాయదేవతేన… ప్రాణమొచ్చి నీలా మారిందా
రేటు కట్టలేని రూటులోన నువ్వే సాగగా
హెయ్, దారి తప్పకుండా వ్యూహమేదో రాసి
మంత్రిలాగ ఉంటూ క్షణంలో
రాజుగాని రాజై మాటతోని యుద్ధం చేశాడా, యే

రానే రాదే..!!
ఏం రాదమ్మో..!! రూపాయి రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యాన్వేషణలో
రానే రాదే..!!
ఏం లాభమో… రూపాయి రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యాన్ని శోధించగా

తిమ్మరుసూ… ఒహ్హో, యే
తిమ్మరుసూ… ఒహ్హో, యే యే
తిమ్మరుసూ… ఒహ్హోహో హో, యే యే
తిమ్మరుసూ… ఒహ్హో, యే


ధర్మాన్నే రక్షించే మార్గంలో… హో ఓ
గీతాల్నే దాటింది పురాణం
కర్మయోగులున్న చోట పరిధి దాటి సాగుతున్న
నీతి బాట తప్పుతుంటే కాల గతులు మార్చి
తప్పటడుగు వేసినట్టు తెలివితోటి ఆటలాడి
దారిలోకి తెచ్చుకుంటే తప్పేకాదే

ఏం రాదమ్మో… రూపాయి రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యాన్వేషణలో
రానే రాదే..!!
ఏం లాభమో… రూపాయి రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యాన్ని శోధించగా

తిమ్మరుసూ… ఒహ్హో, యే
తిమ్మరుసూ… ఒహ్హో, యే యే
తిమ్మరుసూ… ఒహ్హోహో హో, యే యే
తిమ్మరుసూ… ఒహ్హో, యే

Palli Balakrishna Thursday, September 30, 2021
Sridevi Soda Center (2021)




చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
నటినటులు: సుధీర్ బాబు, అనంది
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి
విడుదల తేది: 27.08. 2021



Songs List:



నాలోనే ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: అనురాగ్ కులకర్ణి

నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా

నిమిషాలు లేని కాలమేదో… నిరసించలేక నీరసించే
నిశి లేని తెల్ల చీకటేదో… చితి లేక మంటలేఖలే రచించే
ఏ కారాగారం కనలేదీ దూరం… కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం… విధి రాసిన శ్లోకం శోకమా

నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా

వివరించలేని భాష ఏదో… ప్రకటించలేక మూగబోయే
దిగమింగలేని బాధ ఏదో… ఒదిగుండలేక కన్ను దాటి పోయే
ఏ కారాగారం కనలేదీ దూరం… కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం… విధి రాసిన శ్లోకం శోకమా






మందులోడా ఓరి మాయలోడా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాహితి చాగంటి, ధనుంజయ

ఆఆ, అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అయితే…!
సింగపూర్ రంగబాబు ఫ్లైట్ ఎక్కమన్నాడు
ఉంగరాల గంగిరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు
తిక్కరేగి యమబాబు ముహర్తలు పెట్టేసీ
పెద్దూరి నాయుడుతో పెళ్లి చేసినారురో

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా

పెద్దూరి నాయిడుకి నిన్నిచ్చి పెళ్లి చేస్తే
మద్దూరి పెద్దిరెడ్డి మద్దెల వాయించినాడే
సిన్నూరి సిట్టిబాబు సిడతలు కొట్టాడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే

నా మొగుడు నాయుడు. ఏ పనిపాట సేయ్యకుండా మూలికలు ఏర్లు తేత్తానని అడువులు పట్టుపోయి
నన్ను మరిసే పోనాడు..!!
అవునా..! ఏ ఊర్లేల్లాడు..? ఏ ఏర్లు తెచ్చాడు..?

తూరుపు ఎల్లాడు… తుమ్మేరు తెచ్చాడు
పడమర ఎల్లాడు… పల్లేరు తెచ్చాడు
దచ్చినమెల్లాడు… దబ్బెరు తెచ్చాడు
ఉత్తరమెల్లాడు… ఉల్లేరు తెచ్చాడు
మందులు మందులని మాయమై పోయినాడు, ఊఉ

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే

పైటే పట్టమంటే… పల్లేరు తెచ్చాడా
నడుమే గిల్లమంటే… నల్లేరు అల్లాడా, ఆ
ముద్దులు పెట్టమంటే… మూలికలు ఇచ్చాడా
ముచ్చట తీర్చమంటే… మూడుర్లు తిరిగాడా
మేమున్నమే పిల్లా… వద్దు నీకు మందుమాకు

మందులోడా ఓరి మాయలోడా
మామ రాకు మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మళ్ళీ రాకు మందుల సిన్నోడా

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా




నాలో ఇన్నాళ్ళుగా… పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దినకర్, రమ్యా బెహ్రా

నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ
అదో ఇబ్బందిగా అనిపించినా… అది కూడా బానే ఉంది
మరి కన్నెర్రగా కసిరేసినా… చిరునవ్వులా ఉందే
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానే అందేనా
ఎంతో దూరాన ఉండే ఆ తారకా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ

కొంచం గమనించదేం… దరిదాపుల్లోనే తారాడినా
వైనం గురుతించడేం… కనుబొమ్మతోనే కబురంపినా
ఎలా చెప్పాలో వయస్సేమందో… ఎలా చూపాలో రహస్యం ఏదో
ఇదేమి చిక్కో… నువ్వే కనుక్కో
తెగిస్తా, వరిస్తా… మరెందుకని పరాకనీ
లేపే కిరణాల పిలుపే… తొలిమేలు కొలుపై నను గిల్లగా
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ

పోన్లే పాపం అని… దరి దాటి రానా నది హోరుగా
సర్లే కానిమ్మనీ… చుట్టేసుకోనా మహాజోరుగా
అలా కాకుంటే మరో దారుందా
ఇలా రమ్మంటే కలే రానందా
తయారయుందాం… తథాస్తు అందాం
అటైనా, ఇటైనా… చెరె విడే హడావిడీ
తరిమే తొలివాన చినుకో మురిపాల
మునకో నను అల్లగా

తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానేనె తందానే తానే తననానే తానే తననానేనా
తానే తన్నానే తానే తననానే తానే తననానేనా





చుక్కల మేళం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అనురాగ్ కులకర్ణి

ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ
చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం వాసంతం

అక్కరలేక అక్కున చేరే దక్కని చొరవేరా
లెక్కలు వేసి ముక్కలు చేస్తే విలువ మరుగేరా
ఓ ఓఓ..! చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం

బతుకు పదుగురితో అడుగు పడినదనీ
నడక నలుగురితో కలిసి నడవమనీ
ఉన్నతంగా చూడరామరి ఉన్నదే స్నేహం
నమ్మకంగా సాగరా కడదాకా ఓ నేస్తం

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం

కలతలే దాటీ… కలుపు దూరాన్నీ
కొరత ఏపాటీ కొలత వెయ్ దాన్నీ
కష్టమొచ్చి నేర్పిన తొలిముచ్చటీమాట, ఆ ఆ
ఇష్టపడటం నేర్చుకో విలువిచ్చి ప్రతిచోటా, ఆఆ

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఓ ఓఓ, ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం




Love Themeయం

 
Song Details

Palli Balakrishna Wednesday, September 29, 2021
Anarkali (1955)




చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: పి. ఆదినారాయణ
మాటలు, పాటలు: సముద్రాల
నటీనటులు:  నాగేశ్వరరావు, కన్నాంబ, సురభి బాలసరస్వతి, హేమలత
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: పి. ఆదినారాయణ, అంజలీదేవి 
విడుదల తేది: 28.04.1955



Songs List:



జీవితమే సఫలమ పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం: జిక్కీ 

జీవితమే సఫలమూ - రాగ సుధా భరితమూ
ప్రేమకధా మధురమూ

హాయిగా తీయగా ఆలపించు పాటల
వరాల సోయగాల ప్రియుల వలపుగొలుపు మాటల
అనారు పూలతోటల ఆశ దెలుపు ఆటల

వసంత మధురసీమల ప్రశాంత సాంధ్య వేళల
అంతులేని వింతలు అనంత ప్రేమలీలల
వరించు భాగ్యశాలుల - తరించు ప్రేమజీవుల




రావోయి సఖా ! పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  ఏ.ఏమ్. రాజా, జిక్కీ

సిపాయీ! బిరాన రావోయీ!
మన తరాన ప్రేమ పరువు
మాయరాదోయి రావోయి సఖా
రావోయి సఖా ! నీ ప్రియసఖి -- చేరగదోయి
లోకానికి మన ప్రేమ విలువ తెలుపు సిపాయి
పరుప నిలుపు సిపాయి

రారాజునకూ, నీ చెలికీ పడెను లడాయీ
రాజాలవనీ, పొదుషహా - పలికె బడాయీ
రానింతుననీ పంతము నే పలికితినోయీ
లోకానికి మన ప్రేమ విలువ - తెలుపు సహా
పరువు నిలుపు సిపాయీ

మన ప్రేమలు మన బాసలు మరువకుము సఖా!
జన నాధుని జడిపింపుల వెరువకుము సఖా!
పెను గాలివలే పరుగుడి రావోయి సఖా!
లో కానికి మన ప్రేమవిలువ తెలుపు సిపాయీ
పరువు నిలుపు సిపాయీ

కలిగించకు నీ ప్రియతమకూ - పరాభవాలు
కలిగించుము నీ ప్రభువునకు - పరాజయాలు
విస్తుతించును నీ ధీరతనూ ముందుతరాలు
రావోయి సఖా ! రావోయి సఖా !
రావోయి సిపాయీ!- రావోయి సిపాయీ !



నను కనుగొనుమా పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  జిక్కీ

ఓ ప్రియతమా !
మరువకుమా ! ప్రేమా  రావో ప్రియతమా !

నను కనుగొనుమా  కొనుమా
మది మరువకుమా ! ప్రేమా !       ||రావో॥

దరిజేర నేరవా - చెరమాపజాలవా
చే జారెనేని నీవు - చెలి జాడ కానలేవు

వెలలేని నాదుసౌరు - వెలపోయ బూనినారు
బ్రతుకాయె నడిబజారు. ఆయే, మది బేజారు 

అందాలు జాలువారే - మురిపాల పూలబాల.
పసదూలి కటికవానీ - పాదాలు పాలుగానా





సోజా, నా మనోహారీ పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  

సోజా, నా మనోహారీ సోజా,
సోజా, సుకుమారీ సోజా

జోగే పూవులు తీగలాగ
తూగే తుమ్మెద రాగ లాగ
ఆదమరచి హాయిగా

విరిసే వెన్నెల కోటలోన 
మురిసే కన్నుల కాపులోన
రాకుమారి తీరునా

ఎవరూ నీ దరిజేరలేరు 
మనలా వేరు చేయలేరు
ఆదమరచి హాయిగా



ప్రేమా జగాన పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  జిక్కీ

ఓ వరాల సిపాయీ!
కలవోలె మన "ప్రేమ కరిగి పోవునా ! -
మలి చూపులోనే మరిగి మాయమానా!

హా ... ప్రేమా జగాన, వియోగానికేనా!!
ఇల వేల్పు లొసగే వరా లీవిధాల
నులి వేడి కన్నీటి సెలయేటిజాల
హా... ప్రేమాజగాన విషాదాంత మేనా...

ప్రేమాజగాన వియోగాని కేనా
ప్రేమగాధ విషాద ంత మేనా
హా... ప్రేమగాధ విషాదాంత మే నా
కధమారిపోయె, కలలు మాసిపోయె
ఆకాశ సౌధాలు యిలకూలిపోయె
గతిలేని యీ పేద బ్రతుకారిపోయె

ప్రేమాజగా నా వియోగానికేనా
హా ... ప్రేమ గాధ విషాదాంత మేనా
జగమేలు జాలు మహారాజు పెన
పగయేల యీ లీల బాధింప నేల
బలి సేయుదానా ప్రాణాలనై నా
బతికించు షహజాదనూ! ఐ ఖుదా
నీకో సలామో ఖుదా ఐ ఖుదా



ఖులాసాల సరసాల పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  జిక్కీ

ఖులాసాల సరసాల కురిపింతురా!
ఖుషీ గా విలాసాల మురిపింతురా !
హమేషా తమాషాల అలరింతురా!
అందచందాలుగనీ ఆదరించు నారాజా !
అందాల ఆనందం అందుకో నారాజా!

రంగారు సింగారముల రాసలీల
పొంగారు సంగీతముల రాగమాల
చెంగుచెంగని యాడు నాట్యాలమాల

ఉంగరంగేలిగా లాలింపరా
కొంగుబంగారుగా కులికింపరా
జగన్మోహనాంగ దరిజేరరా




రాజ శేఖరా! పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం: ఘంటసాల , జిక్కీ

మదన మనోహర సుందర నారీ !
మధుర దరస్మిత నయన చకోరీ !
మందగమన జిత రాజమరాళీ
నాట్యమయూరీ ! అనార్ కలీ ! అనార్ కలీ ! ఆనార్ కలీ ! .

రాజ శేఖరా! నీపై మోజు తీరలేదురా
రాజసాన యేలరా!

మనసు నిలువ నీదురా!
మమత మాసిపోనుకా!
మధురమైన బాధరా !
మరపురాదుగా!

కాని దానకానురా !
కనుల నైన కానరా!
జాగు సేయ నేలరా !
వేగ చేరదీయరా!
చేరరార! 
చేరరార!
చేరరార!





కలిసే నెలరాజు పాట సాహిత్యం

 
Song Details




కలవారి హృదయాలు పాట సాహిత్యం

 
Song Details




ఆనందమే అందాలు పాట సాహిత్యం

 
Song Details




మా కథలే పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Tuesday, September 28, 2021
Nindu Noorellu (1979)




చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్  జయసుధ, మోహన్ బాబు
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: మిద్దే రామారావు
విడుదల తేది: 14.11.1979



Songs List:



చిన్న పొన్నీ చిలకల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: సుశీల, యస్.పి బాలు, శైలజ

చిన్న పొన్నీ చిలకల్లారా చిట్టిపొట్టి జింకల్లారా
మా నాన్న వచ్చిన రోజు మా అమ్మ నవ్వినరోజు
నాకిది పండుగరోజు నిండు నూరేళ్ళ పండగరోజు
హాపీ డే, జాలీ డే - కమాన్ సింగ్ డాడ్
గూట్లో పిల్లల కువకువలు గువ్వల జంటల గుసగుసలు
ఎందుకు మమ్మీ పిల్లల అల్లరి ఏమిటి గువ్వల సందడి...

అమ్మా ఆకలి అన్నం పెట్టమనీ పిల్లలుచేసే అల్లరులు
తల్లీ పిల్లలు ముద్దులతో అవి చల్లగ రేగిన సందడులు
అవునా డాడీ...

పిల్లల పిలుపుల కువకువలు కన్నవారికి వేకువులు
ఆ పిల్లల అల్లరి కిలకిలలే మళ్ళీ చూడని వెన్నెలలు
యస్ డాడీ యువార్ రైట్....

కొమ్మల రెమ్మల పువ్వులలో తుమ్మెద పాపలు కెవ్వుమనే
ఎందుకు మమ్మీ తుమ్మెద అల్లరి ఏమిటి కొమ్మల సందడి
అమ్మా తీయగా జోల పాడనుని తుమ్మెద తీసేరాగాలు
కొమ్మ రెమ్ముల ఊయెలలో అవి పువ్వులలాలిపాటలు
అవునా డాడీ

తెలిసీ తెలియని పువ్వులలో కొన్ని మాత్రమే తుమ్మెదవి
ఆ విరిసీ విరియని పువ్వులలో కొన్ని పువ్వులా దేవుడివి
యస్ డాడీ యస్ యువార్ రైట్





కొండంత దేవుడవు నీవు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. శైలజ

కృష్ణా .... .... కృష్ణా....

కొండంత దేవుడవు నీవు - గోరంత దీపాన్ని నేను
దీపాలకు దీపమే నీవు - అందుకే నా దైవమైనావు
నిన్ను చూడాలని కన్నులే చూపులై చూడలేక కన్నీటి చుక్కలై
యమునగా పొంగినా పదములే కడిగినా -
నిరు పేద హారతి నీవందుకోవా
నీ ఆలయ జ్యోతిగా ననుచేసుకోవా

ఈ దీపమింక వెలిగేది ఎన్నాళ్లో 
నీ రూపమింక చూసేది ఎన్నడో!
దీపమె వెలిగినా నీడఏ మిగిలినా 
వెలిగేది నీ కాంతి రూపం  మిగిలేది కన్నయ్యా నీ నీలవర్థం




కొండంత దేవుడవు నీవు 2 పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్. పి. శైలజ

కృష్ణా .... కృష్ణా....

కొండంత దేవుడవు నీవు - గోరంత దీపాన్ని నేను
దీపాలకు దీపమే నీవు - అందుకే నా దైవమైనావు
నిన్ను చూడాలని కన్నులే చూపులై చూడలేక కన్నీటి చుక్కలై
యమునగా పొంగినా పదములే కడిగినా -
నిరు పేద హారతి నీవందుకోవా
నీ ఆలయ జ్యోతిగా ననుచేసుకోవా

ఈ దీపమింక వెలిగేది ఎన్నాళ్లో 
నీ రూపమింక చూసేది ఎన్నడో!
దీపమె వెలిగినా నీడఏ మిగిలినా 
వెలిగేది నీ కాంతి రూపం  మిగిలేది కన్నయ్యా నీ నీలవర్థం




అందాల సీతమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్. పి. బాలు

అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే
ఈ పెళ్లికళ చూసి మురిసిపో ... నీ తీపి కన్నీళ్లు తుడుచుకో...

సిరివెన్నెల కన్నెకు సిరిగల సీతమ్మకు
చినవాడు దొరికాడు శ్రీరామ చంద్రుడు
తానే కట్నమై తరగని కానుకై
తరలి వచ్చె సీతమ్మ కళ్యాణ వేళ

పెళ్లి మంత్రాలతో మేళతాళాలతో....
జరుగుతోంది సీతాకల్యాణం 
అమ్మకన్న ఎవరమ్మా దీవించే దేవత ....?
ఆమ్మ కన్న లేదమ్మా దీవించే మమత
కన్నీటితో కడుగు కన్నతల్లి పాదాలు 
అత్తింటి కోడలుగా అవేనీకు వేదాలు

నీనుదుటి బొట్టేకే బిడ్డనై పుట్టాను
పారాణీ పాపనై తరలి వెళుతున్నాను
నీ దీవెనే చాలు నిండు నూరేళ్ళకి
దీవించి పంపవే అత్త వారింటికి 



కుందేలు పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్. పి. బాలు

అల్లి బిల్లి కుందేలు పెళ్లి కొడుకు
జాబిలి కుందేలు పెళ్లి కూతురు
అందాల కుందేళ్ల కల్యాణము
అడివంత కల్యాణ వైభోగము
హంసక్కా ఎంచక్క పేరంటమాడగా
నెమలక్క పురివిప్పి తైతక్కలాడగా
గోరవంక ఒకవంక మంత్రాలు చదవగా -
చిలకమ్మ చిగురాకు సన్నాయి పాడగా
చిట్టి ఊపిరి బుడగలు చిన్ని వెన్నెల బుడుగులు 
అభముశుభము ఎరుగని బడుగు ప్రాణులు పాపము

ఏమి నేరము చేసినాయని ఇంత ఘోరము జరిగెనో
ఎవరిశాపము తగిలేనో,

కుందేలు: 
అగండి
చంద్రుడి అంశనుపుట్టినవాళ్లం
వెన్నెల మడుగున పెరిగిన వాళ్లం
వెనక్కి తిరిగి వెళ్లకపోతే చంద్రుడు వస్తాడు 
మా చంద్రుడువస్తాడు. మీ భరతం పడతాడు

ఏనుగు: 
చంద్రుడు లేడు - గింద్రుడు లేడు 
కోతలు కొయ్యొద్దు నీ గొప్పలు చెప్పొద్దు 
ఉంటే రమ్మను వెంటనే రమ్మను
చంద్రుణ్ణి పొద్దు

కుందేలు: 
ఓ చందమామా మా మేనమామా
ఇలవంక దిగిరారా నెలవంకమామా
నీలో వున్నది మేమే అన్నది నిజమే అయితే దిగిరా
వెన్నెల వెలుగులు కురిపించు
చీకటి కళ్లను తెరిపించు 
నీవున్నావని నిరూపించు




సీతారాముల ప్రేమకధా పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. శైలజ, పుష్పలత

వినరయ్యా యీ రామకధా
సీతారాముల ప్రేమకధా
తండ్రిమాట పాలించంగా
రాముడు అడవికి చేరంగా
సీత లేడిని కోరంగా రాముడు వేటకు వెడలంగా
భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాం దేహి

లక్ష్మణ యిది స్వామీ రక్షణ రేఖ యిది
రక్షదాటి నే భిక్షను వేయను ఆర్యుల ఆజ్ఞ ఇది. స్వామీ
షట్కాల శివపూజా నిరతుడ
ధిక్కాల ఆనపధ్య చరిత్రుడ
అతి పవిత్రుడను - అఘలవిత్రుడను
అతివా సన్మతివా కులసతివా....ఆయ్ 
అయితే తక్షణ లక్ష్మణ రేఖా అతిక్రమణమే నీ ధర్మం 

భవతీ భికందేహి స్వామీ
సతీమ తల్లిని సీతా సాధ్విని
పతిత రావణుడు అపహరించగా
సీతను బాసిన రామచంద్రుడు వియోగమున విలపించగా

ఓ సుప్రభాతమా ఓవసంతమా ఓ హరిణీలలామా
నా సీత కనిపించెన తన జాడ మీకైన తెలిపెనా...
రామా రామనియేవు, రాముని తలచేవు
ఇంకా ఎక్కడిరాముడే భామరో
రావణుడే రాముడే యీ రావణుడే దేవుడే
శ్రీ రాంరాం జయరాంసీతారాం మాతా సీతా పూత చరిత 
హనుమనేనే వినుమా రాముని దూతను రావణ ఘాతను 
ఆంగుళీయకము గొనుమా అమ్మా అమ్మా
జయజయ రాం సీతారాం


Palli Balakrishna
Bharathamlo Shankaravam (1984)




చిత్రం: భారతంలో శంఖారావం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి, గోపి.. డాII. నెల్లుట్ల
గానం:  ఎస్.ఫై.బాలు, కె. జె. ఏసుదాసు, సుశీల , వాణి జయరాం,  శైలజ
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ 
దర్శకత్వం: బి.భాస్కరరావు
నిర్మాత: ఆర్. కేతినేని
విడుదల తేది: 01.01. 1984

Palli Balakrishna
Mande Gundelu (1979)




చిత్రం: మండే గుండెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్యా అత్రేయ (All)
గానం: పి.సుశీల, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: కృష్ణ, జయప్రద, శోభన్ బాబు, జయసుధ, చంద్రమోహన్, మాధవి
మాటలు: జంధ్యాల
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 05.10.1979



Songs List:



ఇది ప్రేమ సామ్రాజ్యం పాట సాహిత్యం

 
చిత్రం: మండే గుండెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్యా అత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఇది ప్రేమ సామ్రాజ్యం
ఇది మన్మధ సామ్రాజ్యం
ప్రతి హృదయం ఒక సింహాసనం
ఒక రాజు రాణి పట్టాభి షేకం
|| ఇది ప్రేమ॥

ఈ జంటలలో మనమొక జంటై
ఒక గంట ముంచే నాలు
ఆ మండల
మనముంటాము. పది కాలాలు
|| ఈ జంటలలో॥

అందుకే వున్నవి పొదరిళ్ళు
పొదరిళ్ళకు వున్నవి పోకిరి కళ్ళు || ఇది ప్రేమ॥

ఈ పువ్వులలో జత పువ్వుల మై
చిరు నవ్వులమై వుందాము
ఈ పచ్చికలో మన మచ్చికలో
నులి వెచ్చదనం చూదాము
వెచ్చదనాన్నే తెచ్చాము
అది యిచ్చుకునేందుకే వచ్చాము
|| ఇది ప్రేమ

చిగురాకులలో విరి రేకులలో
ఎరుపై నునుపై పుందాము చిగురాకులలో
బిగి కౌగిలిలో తొలి మైకములో
సగము సగమై పోదాము
అందుకె వున్నది యవ్వనమూ
ఈ యవ్వనమందే అనుభవమూ
|| ఇది ప్రేమ॥



వీడే ధీర పంజర భీమ్ సేనుడు పాట సాహిత్యం

 
చిత్రం: మండే గుండెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్యా అత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

వీడే ధీర పంజర భీమ్ సేనుడు
వీడిదెబ్బ కెవడైనా దిమ్మతిరిగిపోతాడు
భలే రోసగాడు మహా మోసగాడు
సూదల్లే వచ్చాడు దబ్బనమై తేలాడు
ఒక్క మాటలో రేపావు పౌరుషాన్ని
ఒక్క చూపుతో కదిపావు హృదయాన్ని 
|| ఒక్కమాటతో॥

అది ఆగనంటుందా యిది పోరు పెడుతుందా ||అది ఆగనం॥
రెంటికీ వెయ్యనా కౌగలింత కళ్ళాన్ని
|| వీడే॥

ఎగరేసుకు పోతాను బంతిలాగ
ముద్దు చేసుకుంటాను ముద్ద బంతిలాగ
|| ఎగరేసుకు॥

చూచుకుంటాలె నిన్ను పై టలాగ
||చూచుకుంటాలె||
దాచుకుంటా లే తాళి బొట్టులాగ
|| వీడే॥

“ ఊ” అంటె ఊపుతా లోకాన్ని
నువ్వు “సై” అంటె దింపుతా స్వర్గాన్ని
నీలోకం నాతోనే నాస్వర్గం నీలోనే
రెండు కలిసి వున్నవి రెండు జతల కళ్ళలోనే



బంగారానికి సింగారానికి పాట సాహిత్యం

 
చిత్రం: మండే గుండెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్యా అత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

బంగారానికి సింగారానికి
కుదిరింది. ఈనాడు బేరం
అసలిచ్చేసి వడ్డీకోసం
పడుతూంది పడరాని గారాం
కాచే చెట్టును కాచే వాడికి కాయలు దక్కాలి
కన్నె బెట్టును గట్టుకు చేర్చిన కాళ్ళకు మొక్కాలి
చేసిన మేలుకు చెమ్మగిల్లిన కళ్ళను చూడాలి
అది చెప్పలేని పెదవులు పెట్టిన ముద్దులు
పండాలి

చీరల రంగులు ఎన్నైనా దారంతోటే నేచేది
తీరని కోరిక ఏదైనా మారం చేసి గెలిచేది
వయసే గారాం  పొయ్యేది మనసే మారాం చేసేది
గాజులచేతుల తాళంతోనే కళ్యాణ మేళం మోగేది
చిటపటలాడె చినుకులు కలిసే వరదై వచ్చేది 
చిరుబురులాడే చిలిపితనాలె వలపుగ మారేది
కొండకు పక్కన కోనుంటేనే నిండుగ వుండేది
ఒకటికి పక్కన ఒకటుంటేనే రొండొకటయ్యేది 




స్నానాల గదిలో సంగీత మొస్తుంది పాట సాహిత్యం

 
చిత్రం: మండే గుండెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్యా అత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

స్నానాల గదిలో సంగీత మొస్తుంది ఎవడికైనా
చన్నీళు, పడగానే సంగతులు పలుకుతాయి ఏ చవటకైనా

జిలు జిలు మన్నాయ నీళ్ళు
చలి చలి అంటుంది వళ్ళు
ఎవరొచ్చి యిచ్చారు యిన్నాళ్ళు
చెలి వచ్చి ఇవ్వాలి కౌగిళ్ళు
నులివెచ్చ నౌతాయి చన్నీళ్ళు
ఆమె ; జిలు జిలు మన్నాయా నీళ్ళు
చలి చలి అంటుందా వళ్ళు
ఎవరొచ్చి యిచ్చారు యిన్నాళ్ళు
నులివెచ్చ నయ్యేటి కౌగిళ్ళు

తలదాక మునిగాక చలి తీరిపోతుందిగానీ
తలుపవతలే వున్న చెలివచ్చి ముంచేసిపోనీ
మునిగేది గంగని ముంచేది రంభని అనుకొని
మునిగి చూడు అంటావు చలి వట్టి గిలిలాంటి దేనని

సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను కళ్ళు
చెంబెక్కడున్నదో చెప్పేసి తలుపేసి వెళ్ళు
మంటెత్తితే వున్న మత్తంత దిగుతుంది నీకు
తిక్కా ! గిక్కా పోయి చక్కంగ వస్తుంది చూపు



చల్లచల్లని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: మండే గుండెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్యా అత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

చల్లచల్లని చందమామ
ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మ
అత్త మీద కోపం దుత్త మీద చూపేది
అన్యాయం అన్యాయం చల్లారమ్మా

దిబ్బరొట్టి వున్నాది తీసుకోను
చేప పులుసున్నాది నంజుకోను
తినిచూడు ఒక సారి రవ్వంత
దెబ్బకు దిగుతుంది వేడంత

దిగకుంటె నీ మీద ఒట్టేను
తినకుంటె నేనీడె చస్తాను
అల్లరల్లారి సత్యభామ అసలే
వేడిక్కి వున్నాను ఊరుకోవమ్మా 

అత్తమీద కోపం చూపేందుకు
నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా 

దిబ్బరొట్టెకన్న నీ బుగ్గలున్నవి
చేప పులుసుకన్న నీ పెదవులున్నవి
రెండిట్లో చల్లార్చే గుణమున్నది
ఊర్కుంటే ఉసిగొల్పే దుడుకున్నది
చవి చూడమంటావా రవ్వంత
నెమరేసుకుంటావు రాత్రంత



ఒరే కారా వీరయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మండే గుండెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్యా అత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవ పెద్ది రమేష్

ఒరే కారా వీరయ్యా
ఏరా సారా సాంబయ్యా
ఊరిముందర చేను కాకుల్లపాలు
ఊరిలో వియ్యమూ కయ్యాలపాలు

తెలిసి ఈ సంబంధం చేసుకున్నాము
చేసుకుని చెంపలు వేసుకున్నాము
ఒరే బావగారూ ఏం కూశారూ?
తమరేం మొరిగారు?
మొరిగేది కుక్కరా!
తమలా ఎంచక్కా కూసేది గాడిదరా!
కాదని ఎవరన్నార్రా
కానిదేఁటో చెప్పరా
మీ అబ్బాయి మగవాడె కాదు గడ్డాలు మీసాలు లేవు
మీ అమ్మాయి ఆడ దేకాదు ఇంతవరకు బిడ్డనే కనలేదు
నీకు తల్లయిన కోడలు కావాలని తెలియక పిల్లను ఇచ్చానురా
నువు గడ్డాలు మీసాలె చూస్తావని తెలియకే గొరిగించి తెచ్చాను

మా పెద్దాళ్ళ జగడాలు పిల్లోళ్ళ కడ్డాలు
వెళ్తాము గదిలోకి వేసుకుంటాం తలుపులు
తలుపులకు వున్నాయి సందులు
సందులకు వున్నాయి కళ్ళు
మా కొద్దు మా కొద్దు పడకటిళ్ళ
ఈ పట్టె మంచాలు
మనలాంటి ముసలాళ్ళు కారు వాళ్ళు
తెలుసులేవోయ్!
ఒరే సాంబయ్యా అంతేనంటావా?
అంతేరా అంతే వీరిగా

సరే అయితే
వివాహ భోజనమ్ము వింతైన పాయసమ్ము
వియ్యాలవారి విందు తిందామురాగ ముందు
విందెందుకయ్యా మనకు మందుంటె గొంతుతడుపు 
మందేసి నువ్వు దొర్లు మర్ధించు తాను ఒళ్ళు

Palli Balakrishna Monday, September 27, 2021
Niluvu Dopidi (1968)




చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ , దేవిక, జయలలిత 
దర్శకత్వం: C.S.రావు
నిర్మాత: U. విశ్వేశ్వర రావు 
విడుదల తేది: 25.01.1968



Songs List:



లోకం ఇది లోకం పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల

లోకం ఇది లోకం



ఆడపిల్లలంటే హోయ్ హోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల

ఆడపిల్లలంటే హోయ్ హోయ్ 




చుక్కమ్మ అత్తమ్మరో పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: యు. విశ్వేశ్వర రావు 
గానం: ఘంటసాల 

చుక్కమ్మ అత్తమ్మరో 




అయ్యలారో ఓ అమ్మలారో పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: నజార్ వల్లం నరసింహం 

అయ్యలారో ఓ అమ్మలారో 




నీ బండారం పైన పటారం పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు , ఎల్.ఆర్.ఈశ్వరి 

నీ బండారం పైన పటారం 




నేనే ధనలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, ఎల్.ఆర్.ఈశ్వరి 

నేనే ధనలక్ష్మి 




జీవులెనుబది నాల్గులక్షల పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం 

జీవులెనుబది నాల్గులక్షల చవుపుట్టుక లిక్కడ 





అయ్యింది అయ్యింది అనుకున్నది పాట సాహిత్యం

 
చిత్రం: నిలువుదోపిడి (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

అయ్యింది అయ్యింది అనుకున్నది 

Palli Balakrishna Thursday, September 16, 2021
Ramula O Ramula






పాట: రాములో రాములా  
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: మౌనిక యాదవ్ 


రాములో రాములా సాహిత్యం

 
పాట: రాములో రాములా  
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: మౌనిక యాదవ్ 

మందు పెట్టినావురో  రాములో రాములా  
ఏం  మాయ చేసినావురో  రాములో రాములా  
మందు పెట్టినావురో  రాములో రాములా  
ఏం  మాయ చేసినావురో  రాములో రాములా

నీ వలలొ  చిక్కిన   సేప పిల్లలా
కొట్టుకుంటున్నా  గిల గిల గిల
మందు పెట్టినావురో  రాములో రాములా  
ఏం  మాయ చేసినావురో రాములో రాములా

నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా  తింటినా
పల్లెత్తూ మాట అంటినా పది మందిలొ నిన్నూ   సూత్తినా 
కనికట్టేదో చేసీ రాములో రాములా 
సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా  
కనికట్టేదో చేసీ రాములో రాములా 
సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా
 
బడె బడె బద్మాషు గాళ్ళకీ  దొరకాలేదు  ఇరకాలేదు  
ఎవ్వడన్న  నా ఎంబడి  పడితె  
బొక్కాలిరిసి సేతిల పెడితీ 
నువ్వు కలిసిన నుండీ  రాములో రాములా 
నా కతే మారెరో  రాములో రాములా 
నువ్వు కలిసిన నుండీ  రాములో రాములా 
నా కతే మారెరో  రాములో రాములా 
 
మా ఊరి పోరగాండ్లు గడ గడ గడ వణికేటోళ్లు 
నా దిక్కు సూడాలన్న నాతో మాట్లాడాలన్నా 
ఏం మంత్రమేస్తివిరో రాములో  రాములా 
కంత్రోని వున్నవురో రాములో  రాములా  
ఏం మంత్రమేస్తివిరో రాములో  రాములా 
కంత్రోని వున్నవురో రాములో  రాములా

నీ సూపులల్ల  సుర  కత్తులు రా నీ  
మాటలల్ల  మత్తు రవ్వలు రాముల 
నాకున్న దాన్ని ముంగటేస్తివి రా 
నీ అది లోన ముంచవెడితివి రా 
నీ మాయల పడితిరో రాములో  రాములా 
మడిసెట్ల ఉందురో రాములో రాములా
నీ మాయల పడితిరో రాములో  రాములా 
మడిసెట్ల ఉందురో రాములో రాములా

ఎన్నడు లేనిది మొండిగుండెకూ 
నీ  మీద మనసాయెరా 
నిన్ను సూడ బుద్ధాయెరా నిదురే  కరువాయెరా 
కళ్ళు మూసుకుంటె  సాలురో  రాములో రాములా 
కలలోకి వస్తివిరో రాములో రాములా
కళ్ళు మూసుకుంటె  సాలురో  రాములో రాములా 
కలలోకి వస్తివిరో రాములో రాములా

Palli Balakrishna Thursday, September 9, 2021
Thinna Thiram Paduthale






పాట: తిన్నా తిరం పడుతలే 
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: లక్ష్మి


తిన్నా తిరం పడుతలే సాహిత్యం

 
పాట: తిన్నా తిరం పడుతలే 
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: లక్ష్మి

తిన్నా తిరం పడుతలే కూసున్న తిరం పడుతలే
ఏడున్న తిరం పడుతలే ఎవలున్న తిరం పడుతలే
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

నువ్వు సిర్రా సిటుక బట్టి డప్పుల్లా దరువులేస్తే
తనువంత తాట కలిసే ప్రేమ ఇత్తునాలు మొలిసే
గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయెనులే

మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

నువ్వు నేను దూరమాయి ఏడాదినరుదమోయి
పొదుమాపు ఎదురుసూపు జాడన్న తెలువదోయి
గిట్ల గోసలు పెట్టా నీకు ఎట్లా మనసాయే పిలగా

బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

రవ్వంత గోసులాట అలె రాసుకుంది
ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసు ఇరిగే
కొవ్వత్తివోలె కరిగే కోపాలు ఎందుకోయి పిలగా

బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

పసిదాన్ని కాదా నేను పగవట్టబోకు నన్ను
పంతాలు ఇడుసబెట్టు ఇకనన్న సేయి బట్టు
నా గుండెల భాధ నీ గుండెకు గురుతోస్తలేదా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

Palli Balakrishna
Yeme Pilla Annappudalla






పాట: ఏమే పిల్ల అన్నప్పుడల్లా 
గానం: శిరీష
మ్యూజిక్, లిరిక్స్ & దర్శకత్వం: తిరుపతి మట్ల


ఏమే పిల్ల అన్నప్పుడల్లా సాహిత్యం

 
పాట: ఏమే పిల్ల అన్నప్పుడల్లా 
గానం: శిరీష
మ్యూజిక్, లిరిక్స్ & దర్శకత్వం: తిరుపతి మట్ల

ఏమే పిల్ల అన్నప్పుడల్లా 
గుచ్చే పువ్వుల బాణాలు
గుచ్చే పువ్వుల బాణాలు 
అవి తేనె సుక్కల తానాలు
గుచ్చే పువ్వుల బాణాలు 
అవి తేనె సుక్కల తానాలు
నువ్వు పిలిసే పిలుపులు 
తెరిసెనే గుండె తలుపులు

నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో 
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో 
నీ దానివని పేరు పెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్వు దూరం దూరం ఉన్నావంటే 
మోయాలేని భారాలు
మోయాలేని భారాలు 
అవి దాటాలేని తీరాలు
మోయాలేని భారాలు 
అవి దాటాలేని తీరాలు
నూరేళ్లు నువ్వు సోపతి 
లేకుంటె సిమ్మా సీకటి

నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో 
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో 
నీ దానివని పేరు పెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్ల

లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లా

నువ్వు కస్సూ బస్సూ మంటే 
అవి తియ్యా తియ్యని గాయాలు
తియ్యా తియ్యని గాయాలు 
మరువాలేనీ జ్ఞాపకాలు

తియ్యా తియ్యని గాయాలు 
మరువాలే నీ జ్ఞాపకాలు
నువ్వు చూస్తే సుక్కల మెరుపులు 
నీ ఎదలు మల్లె పరుపులు

నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో  
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో 
నీ దానివని పేరు పెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్వు రాయే పోయే అంటుంటే 
సెప్పాలేని సంబురాలు
సెప్పలేని సంబురాలు 
పట్టరాని సంతోషాలు
సెప్పలేని సంబురాలు 
పట్టరాని సంతోషాలు
నీ కొరకు కట్టిన ముడుపులు 
ఎపుడైతవు పిలగా మూడుముళ్లు

నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో 
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో 
నీ దానివని పేరు పెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్వు కండ్లకింది కేలి సూసినవంటే 
సిగ్గూ సింగారాలు
సిగ్గూ సింగారాలు 
పోతయ్ పంచ ప్రాణాలు
సిగ్గూ సింగారాలు 
పోతయ్ పంచ ప్రాణాలు
వేల్పుల ఇంటి పిలగ
మనసు దోచినవోయ్ పొలగ

నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సేయి పట్టుకో
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సేయి పట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో 
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

Palli Balakrishna
Andala Na Mogudu (2019)






పాట: అందాల నా మొగుడు (2019)
సంగీతం: జి.యల్.నాందేవ్
సాహిత్యం: పొద్దుపొడుపు శంకర్
గానం: లక్ష్మి


అందాల నా మొగుడు సాహిత్యం

 
పాట: అందాల నా మొగుడు (2019)
సంగీతం: జి.యల్.నాందేవ్
సాహిత్యం: పొద్దుపొడుపు శంకర్
గానం: లక్ష్మి

పల్లవి
అందాల నా మొగుడు భూమి కేమో జానెడు
వాడు చేసే చేష్టలకు చస్తున్నానక్కో 
ఏమని చెప్పు కొందునో
వడియాల రామ ఉండలేను ఉండలేను
ఏమని చెప్పు కొందునో
ఓల సందమామ ఉండలేనుండలేను

దువ్వనేమో నా ఇంట్ల దూసుడేమో  దానింట్ల
నా పెనిమిటి దానింట్లో ఉంటాడాటక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేను ఉండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

విరసాలు నా ఇంట్ల సరసాలు దానింట్ల
సూటు బూటు వేసుకొని తిరుగుతుంటడక్కో 
ఒక్క దానొక్క దాన్ని
ఓల సందమామ ఉండలేనుండలేను

మనిషేమో నా ఇంట్ల మనసేమో  దానింట్ల
కలలో కూడా దాని పేరు కలవరిస్తడక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఓల సందమామ ఉండలేనుండలేను

కష్టాలు నా ఇంట్ల ఇష్టాలు దానింట్ల
ముద్దు ముచ్చట కేమో కరువైతినక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

పచ్చిపులుసు నా ఇంట్ల చాపల కూర దానింట్ల
నానా రుచులు వాడు కోరుతుంటడక్కో
ఒక్క దానొక్క దాన్ని
ఓల సందమామ ఉండలేను ఉండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

నా మాట ఓకారం దాని మాట బంగారం
నా సవతి మాటలేమో జవదాటడక్కో
ఒక్క దానొక్క దాన్ని
ఓలా సందమామ ఉండలేనుండలేను

పగలంతా నా ఇంట్ల రేయంత  దానింట్ల
మందు పెట్టి నా మొగుడ్ని మలుపుకున్నదక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

ఏగ లేనే ఇక నేను మా ఇంటికి నేను పోతా
కాళ్ల ఏల్ల పడ్డ గాని నేను రానక్కో
ఒక్క దానొక్క దాన్ని
ఓల సందమామ ఉండలేనుండలేను

Palli Balakrishna
Koduku Diddina Kapuram (1989)




చిత్రం: కొడుకు దిద్దిన కాపురం  (1989)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: కృష్ణ , మహేష్ బాబు, విజయ శాంతి, మోహన్ బాబు, అశ్విని  
దర్శక నిర్మాత: కృష్ణ ఘట్టమనేని
విడుదల తేది: 21.09.1989



Songs List:



ఓం నమ నటరాజుకే పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు దిద్దిన కాపురం  (1989)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: చిత్ర 

ఓం నమ నటరాజుకే



ఝామ్ చకా చకా పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు దిద్దిన కాపురం  (1989)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఝామ్ చకా చకా



బహు పరాక్ ఓ మహారాణి పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు దిద్దిన కాపురం  (1989)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: మనో, పి.సుశీల 

బహు పరాక్ ఓ మహారాణి




హే మామా పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు దిద్దిన కాపురం  (1989)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి 

హే మామా



ఆలు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు దిద్దిన కాపురం  (1989)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: మనో

ఆలు లేదు



శివ శివ పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు దిద్దిన కాపురం  (1989)
సంగీతం: రాజ్- కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి 

శివ శివ

Palli Balakrishna Wednesday, September 8, 2021
Kanabadutaledu (2021)




చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్
నటీనటులు: సునీల్, సుక్రాంత్ వీరెల్ల,  వైశాలి రాజ్,ససిత కోన, హిమజ
దర్శకత్వం: యమ్. బాలరాజు
నిర్మాతలు: సుదీర్ తలసిల, దేవీప్రసాద్  బలివాడ , సతీష్ రాజు 
విడుదల తేది: 19.08.2021



Songs List:



మామా పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: మధు నందన్ 
గానం: రాహుల్ నంబియర్

మామా




ఎదకేమై ఉంటుందే పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: పూర్ణ చారి 
గానం: కార్తీక్

ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే
ఎపుడు లేదే మాయే నీదే
కథ మారేపోయిందే మధనం మొదలయ్యిందే
ఈ ఆలోచన ఎంతో బాగుందే
అది ప్రతిసారి నీవైపోస్తుందే
ఒక నిముషం చూసేలోగా సమయానికి ఈ పరుగేలా
ఇక ఆగే వీలే లేదే
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కలలే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా…

ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే
ఎపుడు లేదే మాయే నీదే

వెనకాలె నీ వెనకాలే అడుగే సాగిందే
మునకేసే తాను మునకేసే
నీ ఊహల్లె ఉందే దాచే మాటె నీదని
నిన్నే ధాటి పోనని నీతో ఉన్నానంటే నాకో వరమే
పిలిచే నీ పలకుల మధురం
తెగ మురిసెను ఆధారం
ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలు గుండె లోతుల్లో పదిలం
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కలలే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా…

వయసే… తన తొలకరి అలజడి తెలిసిన
పరువపు కదలిన అలలుగా ఎగిసెను మాయాలోన తేలి
అది మోయలేని హాయి
మారులోకం చూసే ఆశే తీరే మార్గం ఉండే వెళదామా ఇపుడే




ప్రేమే లేదు పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: మధు నందన్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ , రవి ప్రకాష్ చోడిమల్ల 

ప్రేమే లేదు 




తొలిసారి నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరణ్

తొలిసారి నిన్నే 

Palli Balakrishna Wednesday, September 1, 2021
90ML (2019)




చిత్రం: 90ML (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: కార్తికేయ రెడ్డి,నేహ సలోంకి
దర్శకత్వం: ఎర్ర శేకర్ రెడ్డి 
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ 
విడుదల తేది: 06.12.2019



Songs List:

Palli Balakrishna
Prematho Mee Karthik (2017)




చిత్రం: ప్రేమతో మీ కార్తీక్ (2017)
సంగీతం: షాన్ రెహమాన్
నటీనటులు: కార్తికేయ, సిమ్రత్ కౌర్
దర్శకత్వం: రిషి, రిషి రాజ్ 
నిర్మాత: రామశ్రీ గుమ్మకొండ, రవీంద్ర గుమ్మకొండ 
విడుదల తేది: 17.11.2017

Palli Balakrishna

Most Recent

Default