చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: మహేష్ బాబు, అల్లరి నరేష్ ,పూజా హెగ్డే
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వర ప్రసాద్
విడుదల తేది: 09.05.2019
Songs List:
పదర పదర పదరా పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదవన్
భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే
పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
నీ కథ ఇదిరా నీ మొదలిది రా
ఈ పథమున మొదటడుగేయిరా
నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా
పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
ఓ భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే
కదిలే ఈ కాలం తన రగిలే వేదనకీ
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకీ
వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా
పదర పదర పదరా
ఈ హలమును భుజము కెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా
పదర పదర పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక
మెతుకులిచ్చు కదరా
నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలయి ఉప్పెన కాదా ఈ కథనం
నీలో ఈ జడికి చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలయి చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని
తమకోసమనీ తెలిసాకా
నువ్వు లక్ష్యమని తమ రక్షవనీ
నినదించేలా
పదర పదర పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది
గది తలుపు తెరిచి పదరా
పదర పదర పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు
సాగుబడికి బడిరా
తనను తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని రుషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో
చోటి చోటి బాతే పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవి శ్రీ ప్రసాద్
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే (2)
ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే
ఈ చెలిమికే కాలమే చాలదే
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు (2)
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
ఓ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
హో యే
ఆటలాగ పాటలాగ నేర్చుకుంటే రానిదంట
స్నేహమంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్లదంట
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా
ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం
నీలో ప్రతి వంటరి తరుణం చెరిపేస్తూ...
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే
గుర్తులేవి లేనినాడు బ్రతికినట్టు గుర్తురాదే
తియ్యనైన జ్ఞాపకాల్లా
గుండెలోన అచ్చ ఏమి సావాసాలే
బాధలేవి లేనినాడు నవ్వుకైనా విలువుండదే
కళ్ళలోన కన్నీళ్ళున్నా
పెదవుల్లో నవ్వు చెరగదు స్నేహం వల్లే
నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగ కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే
నువ్వే సమస్తం పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యజిన్ నజీర్
నువ్వే సమస్తం
ఎవరెస్ట్ అంచున పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: వేదాల హేమచంద్ర , విష్ణుప్రియ రవి
కల గనే కలలకే కనులనే ఇవ్వనా
ఇది కలే కాదని రుజువు నే చూపనా
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే
ఓ చిరునవ్వే విసిరిందే
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
నాలో నుంచి నన్నే తెంచి
మేఘంలోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే
ఓ ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే
ఓ చిరునవ్వే విసిరిందే
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
కలగనే కనులకే కనులనే ఇవ్వనా
ఇది కలే కాదని రుజువునే చూపనా
హు వజ్రాలుండే ఘనిలో
ఎగబడు వెలుతురులేవో
ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే
కనబడునా కళ్ళల్లో
వర్ణాలుండే గదిలో - గదిలో
కురిసే రంగులు ఏవో - ఏవో
పక్కన నువ్వే నిలబడి ఉంటే మెరిసే
నా చెంపల్లో - ఎల్లో
నోబెల్ ప్రైజ్ ఉంటే నీకై ఫ్రీజ్ అంటే వలపుల సబ్జెక్ట్ లో
ఓ ఎవరెస్ట్ అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
కలగనే కనులకే కనులనే ఇవ్వనా
ఇది కలే కాదని రుజువునే చూపనా
ఫిర్ షురు పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: బెన్నీ దయాల్
ఫిర్ షురు
పాల పిట్టలో వలపు పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎమ్. ఎమ్. మనసి, రాహుల్ సిప్లిగంజ్
ఏవో గుస గుసలే నాలో
వలసి విడిసి వలపే విరిసే ఎదలో...
హొయ్ పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే
కొండలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దిన పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి నా మనసిట్ఠా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్ని ఎల్లా గొట్టేసినావే
విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
నా మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కళలు బాగా
పిల్లా నా గుండెల్లోన ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే
పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్ని ఎల్లా గొట్టేసినావే
ఇదే కదా ఇదే కదా నీ కథ పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ ప్రకాష్
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
నీ కంటి రెప్పలంచునా
మనస్సు నిండి పొంగిన..
ఓ నీటి బిందువే కదా
నువు వెతుకుతున్న సంపద..
ఒకొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వెచెనో
అవన్నీ వెతుకుతూ... పదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
నిస్వార్థమెంత గోప్పదో
ఈ పధము రుజువు కట్టదా
సిరాలు లక్ష ఒంపదా
చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో
నీ కంటి చూపు చెప్పదా
నీ లోని వెలుగు పంచగ
విశాల నింగి చాలదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
నువ్వని ఇది నీదని పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తీక్
నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది
ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా
కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది
ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే
ఒంటరిగా నేర్చాడా ఎవడైనా
ఓ సాయం అందుకొని సాగేదె బ్రతుకంటె
ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా
పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా
నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా
నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది
ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా
కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువడిగినది
ఓ....ఓ....ఓ....ఓ....
ఓ ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా
నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలయ్యిందా
ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా
ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా
గెలుపై ఓ గెలుపై నీ పరుగే పూర్తైనా
గమ్యం మిగిలే ఉందా
రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందా
ఎన్నడూ నిను మరువనిది
ఎప్పుడూ నిను విడువనిది
ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా
గుండెలో గురుతైనదీ గాయమై మరి వేచినది
లోకాలే తలవంచి నిన్నే కీర్తిస్తున్నా
నువు కోరే విజయం వేరే ఉందా
నీ గుండె చప్పుడుకే చిరునామా ఏదంటే
నువు మొదలయిన చోటును చూపిస్తోందా
నువ్వొదిలెసిన నిన్నలలోకి అడుగె సాగేనా
నువు సాధించిన సంతోషానికి అర్థం తెలిసేనా