Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manchi Donga (1988)

చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సుహాసిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: దేవి వర ప్రసాద్
విడుదల తేది: 14.01.1988Songs List:బెడ్ లైటు తగ్గించన పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్, జానకి

బెడ్ లైటు తగ్గించన
రెడ్ లైటు వెలిగించన
నీ వొంటి మూన్ లైటూ
నన్నంటుకుంటుంటె
సై అంటు సైలెంటుగా చేరనా
మిడ్నైటు గుడ్నైటు చేసేయనా

బెడ్లైటు తగ్గించుకో
రెడ్ లైటు వెలిగించుకో
నా వొంటి మూన్ లైటూ
నిన్నంటుకుంటుంటె
సై అంటు సైలెంటుగా చేరుకో
మిడ్నైటు గుడ్నైటు చేప్పెసుకో

పండించ్వే ఈ పళ్ళతో
నా ప్రేమ నీ కౌగిల్లలో
సరసాల దొరసానివై
పాలించరా ఈ పాలతో
ఈ రాణినీ మురిపాలతో
రాగాల రా రాజువై
తలవూపి తలుపేసి వలవేసుకో
పురివిప్పి మురిపాల కథ చెప్పుకో
నూరేళ్ళ తిరునాల సాగించుకో

బెడ్లైటు తగ్గించుకో
రెడ్ లైటు వెలిగించనా

కొనగోల్లతో చెక్కిల్లపై
రతిమన్మధ చిత్రాలు వెయ్
నడిరేయి రవివర్మవై
గిలింతతో నా గుండెపై
కిలకిలలతో నాట్యాలు చెయ్
శింగారి సిరిమల్లెవై
విరబూయు విరహాలు వివరించుకో
అరుదైన గంధాలు పూయించుకో
అందాలు అడపోత పోయించుకో

బెడ్లైటు తగ్గించుకో
రెడ్ లైటు వెలిగించుకో
నీ వొంటి మూన్ లైటూ
నన్నంటుకుంటుంటె
సై అంటు సైలెంటుగా చేరుకో
మిడ్నైటు గుడ్నైటు చేప్పెసుకోకడుపులోని బాబుకి పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్, జానకి


కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
ఉదయించె చంద్రునితొ ఊసులాడుకో
మురిపించి నవ్వించి దోబూచులాడుకో

కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా

చలివేల నన్నె వెలివేయబోతె
ముద్దాడుతు నీవె బిగి కౌగిటా
బిగి కౌగిలైన గిలిగింతలైనా
పదవంత నా వొంటికిక మీదటా
ఒకసారి దరిచేరి దయ చూడవే
ఏడాది పైమాట ఇపుడెందుకు
ఇపుడె ఇలాగె ఒకటై హహాహ
చేరమని తీర్చమని నన్ను కోరకు
చేరుకొని చేతలతొ శ్రుతి మించకు విసిగించకు

కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
ఉదయించె చంద్రునితొ ఊసులాడుకో
మురిపించి నవ్వించి దోబూచులాడుకో

నీ పానుపు నీదై నా పానుపు నాదై
నేనేమి కావాలి ఊహించవే
ఇన్నాళ్ళు నన్ను పెనవేసినావు
కొన్నాళ్ళు విశ్రాంతి ఇవ్వాలికా
నీ చెంత ఈ శిక్ష నాకెందుకే
ప్రతి రేయి నా మాట వినందుకే
వద్దు అనొద్దు లాలాలలలల
సరి సరిలె తెలిసెనులే నీ కోరికా
లేదు మరి నాకు ఇక ఆ ఓపిక కవ్వించకా

కడుపులోని బాబుకి కథలు చెప్పనా
ముద్దు ముద్దు పాపకి జోల పాడనా
ఉదయించె చంద్రునితొ ఊసులాడుకో
మురిపించి నవ్వించి దోబూచులాడుకో
లాలలాలలాలలా లాలలాలలా
లాలలాలలాలలా లాలలాలలాకన్ను కొట్టె వాడె పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

కన్ను కొట్టె వాడె కన్నె మొగుడు
కౌగిలించె వాడె జంట మొగుడు
దోచుకెళ్ళె వాడె దొంగ మొగుడు
పొద్దు మరచినోడె చిలిపి మొగుడు
అందాలన్ని దోచె అందగాడు
వయ్యరాలె పెంచె వన్నె కాడు
నా సామిరంగ నా తోడు దొంగ
ముడిపెత్తుకుంట ముద్దె తీరంగ
మొగుడంటె వాడెనమ్మో

ముద్దులెన్ని పెట్టిన ముందుకొస్తవమ్మ
అసలు దార పోసిన కొసరు ఎక్కువమ్మ
చీరల్లొ చిగురులేసి పైటల్లొ పరిగలేరు
మగవాడు వీడెనమ్మ
దువ్వి జూదమేసిన దూకుడెక్కువమ్మ
చేత చెయ్యి వేసిన చెంగు వదలడమ్మ
పందిట్లొ మేలమెత్తి పందిట్లొ తాలమెయ్యు
వరుడంటె వాడెనమ్మ
ఎంతో మగధీరుడొ అంత ఘనచోరుడు
నాతొ తొలి ప్రేమలొ దొరికె ఈ కాముడు
వాడు సరి వాడెనమ్మా

కౌగిలించె వాడె జంట మొగుడు
దోచుకెల్లె వాడె దొంగ మొగుడు

సిగ్గులడ్డమొచ్చిన సిక్ష తప్పదమ్మ
చేతుల చరసాలలొ ఖైదు తప్పదమ్మ
బుగ్గల్లొ చిటికడెసి మొగ్గల్నె చిదుము చేయు
మొగుడొస్తె ఇంతేనమ్మా
మనసుదోచుకెళ్ళిన మాటతప్పదమ్మ
చాటు తప్పు చేసిన సాక్ష్యముండదమ్మ
చూపుల్తొ మత్తు జల్లు చేతులతొ మాయ జేయు
మొగుదంటె వీడెనమ్మ
ఏమి మొహమాటమో ప్రేమొ పిలపాటమో
కొట్ట ఇరకాటమో కొంగు చలగాటమొ
తొలిసారి తెలిసిందమ్మా

కన్ను కొట్టె వాడె కన్నె మొగుడు
కౌగిలించె వాడె జంట మొగుడు
దోచుకెళ్ళె వాడె దొంగ మొగుడు
పొద్దు మరచినోడె చిలిపి మొగుడుముద్దు పెట్టమంటావ పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్, జానకి

ఎలగెలగెలగెలగెలగెలగెలగా....
ఇలగిలగిలగిలగిలగిలగిలగే....

ముద్దు పెట్టమంటావ నువ్వే పెట్టుకుంటావా
నన్నే కట్టుకుంటావా కుర్రదానా
నిన్నే పెట్టమంటాను చెయ్యే పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా
ఆహా వయ్యారంగా రావే నా జట్టు
ఏ జాజిపూల అందం చేపట్టు
నీకు నాకు తప్పదింక హాంఫట్
పదనిస నిసనిద ని ద ప

హే మీది మీది కొస్తే ఇలాగ
చాటుమాటు సరసం ఎలాగ
గుట్టుగా బాగా చుట్టుకోరా మెల్ల మెల్లంగా
హో ఒక్కటవ్వమంటే అలాగ
వెక్కిరించ బోకే ఇలాగ
పక్కకే రావే ఒప్పుకోవే పట్టు పట్టంగా
ఏవేవో అడగొద్దు అప్పనంగ
ఇమ్మంటే పోబోకే దూరంగా
ఇవ్వాలన్నా ఇవ్వలేను నీలాగ
పదనిస నిసనిద ని ద ప

ముద్దు పెట్టమంటావ నువ్వే పెట్టుకుంటావా
నన్నే కట్టుకుంటావా కుర్రదానా
నిన్నే పెట్టమంటాను చెయ్యే పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా

బుగ్గగిళ్ళ బోతే ఇలాగ బుంగమూతి పెడితే ఎలాగ
రంభలా రావే రాసుకోవే నన్ను ఇలాగ
గుచ్చి గుచ్చి చూస్తే ఇలాగ గువ్వలాగ వచ్చేదెలాగ
కొంటెగా రారా కోరుకోరా ఒక్కటవ్వంగా
బింకాలు చూపొద్దు బిడియంగా
తాపాలు రేపొద్దు సారంగా
నువ్వునేను అవ్వాలింక ఏకంగా
పదనిస నిసనిద ని ద ప

ముద్దు పెట్టమంటావ నువ్వే పెట్టుకుంటావా
నన్నే కట్టుకుంటావా కుర్రదానా
నిన్నే పెట్టమంటాను చెయ్యే పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా
ఆహా వయ్యారంగా రావే నా జట్టు
ఏ జాజిపూల అందం చేపట్టు
నీకు నాకు తప్పదింక హాంఫట్
పదనిస నిసనిద ని ద పనా రెండు కళ్ళకీ పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, సుశీల

నా రెండు కళ్ళకీ
నా రెండు కళ్ళకీ పువ్వుల పిచ్
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ
నా రెండు చేతులకీ భజనల పిచ్చ
నా వయసు దూకుడుకీ సోకుల పిచ్చ
నాకేమో అంతులేని వలపుల పిచ్చీ
వలపుల పిచ్చీ

నా సోకు వంటికీ
నా సోకు వంటికీ చీరల పిచ్చీ
నా ఒంపు సొంపులకీ రైకల పిచ్చీ
నా లేత నడుముకీ కులుకుల పిచ్చీ
నువ్వంటే లోలోనా ఒకటే పిచ్చీ
ముద్దంటే నీ కన్నా నాకే పిచ్చీ
నాకే పిచ్చీ

నా చీరా కుచ్చిళ్ళూ
చలిగాలీ సంకెళ్ళూ
నా చీరా కుచ్చిళ్ళూ
చలిగాలీ సంకెళ్ళూ
తగిలించనా నీకు వెనకనుంచీ
కౌగిళ్ళా చిట్టాలూ
పడకింటి చట్టాలూ
అరే.కౌగిళ్ళా చిట్టాలూ
పడకింటి చట్టాలూ
నీ ఒళ్ళో చదివించు బుజ్జగించీ
వెన్నెలంటి ఒంటిమీద వాలిపో ఒప్పించీ
వెన్నెలంటి ఒంటిమీద వాలిపో ఒప్పించీ
సొగసు మీద పన్ను వేసి తీసుకో మెప్పించీ
రాగాలే తీయించరా
రాజ్యాలే దక్కించవే

నా సోకు వంటికీ చీరల పిచ్చీ
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ

ఆర్రెర్రెరెరెర్రెరే... నడిరేయి కష్టాలూ
నా కెంతో ఇష్టాలూ
నడిరేయి కష్టాలూ నా కెంతో ఇష్టాలూ
తప్పించుకోబోకే పక్కనుంచీ
సరసాల చెడుగుడులూ
పట్టాలా తొడిగుడులూ
అహా.. సరసాల చెడుగుడులూ
పట్టాలా తొడిగుడులూ
కులికించీ పలికించూ పులకరించీ

అడ్డెవరూ లేనిచోట అందవే మురిపించీ
అడ్డెవరూ లేనిచోట అందవే మురిపించీ
పాలపుంత అందనంత ఏలుకో ఇకనుంచీ
తేనె వాన కురిపించవే
ప్రేమలోన కరిగించరా

నా రెండు కళ్ళకీ
నా రెండు కళ్ళకీ పువ్వుల పిచ్చీ
నా రెండు పెదవులకీ ముద్దుల పిచ్చీ
నా లేత నడుముకీ కులుకుల పిచ్చీ
నువ్వంటే లోలోనా ఒకటే పిచ్చీ
నాకేమో అంతులేని వలపుల పిచ్చీ
వలపుల పిచ్చీరే చుక్కల అందం చూస్తా పాట సాహిత్యం

 
చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా
రొమాంటిక్ హీరోని
జైజాంటిక్ డ్యాన్సర్ ని
శివతాండవం ఆడగలను
ఇలను తాళరాగ చెవులు రేగిపోగ

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా

టిక్కు టక్కు కదిలి
చక్కనమ్మ నడుమె
తక్కిట తకదిమి
చక్కిలి గింతల తగిలి రగిలె వలపే
వయ్యారంలో వాట నాకే
యవ్వారంలో లాభం నీకే
ఈడు కూడి రుచి ఇట్ట చూస్త
జోడి లేడి వడికిట్ట వస్త
చెలికత్తెల మెత్తనైన సొగసు
వలిసి వంపు సొంపు ముద్దు లిడగ

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా

బ్రేకు డ్యన్సు బెడుకో
షేకు డ్యాన్సు చెడుకో
చీకటి కదకళి
మాయల మణిపురి కిటుకు తెలిసె పదర
శ్రుంగారంలో వాట నాదే
బంగారంలో వాట నీదే
కన్నుకొట్టుకొని కౌగిలిస్త
చాటు చూసుకొని సంకెళ్ళెస్తా
నవమన్మధ నాట్యమాదగలను
ఇలను మతులు శ్రుతులు మించిపోగా

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా
రొమాంటిక్ హీరోని
జైజాంటిక్ డ్యాన్సర్ ని
శివతాండవం ఆడగలను
ఇలను తాళరాగ చెవులు రేగిపోగ

రే చుక్కల అందం చూస్తా
తైతక్కల తాళం వేస్తా

Most Recent

Default