Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Varakatnam (1969)




చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, కృష్ణ కుమారి 
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: యన్.త్రివిక్రమరావు
విడుదల తేది: 10.01.1969



Songs List:



ఎందుకీ తొందర పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల, తిలకం 

ఎందుకీ తొందర 




ఇదేనా మన సంప్రదాయమిదేనా పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

ఇదేనా మన సంప్రదాయమిదేనా




ఇల్లు వాకిలిరోసే ఇల్లాలు పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

ఇల్లు వాకిలిరోసే ఇల్లాలు



మల్లిపూల పందిరిలోన చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జమునారాణి

మల్లిపూల పందిరిలోన చందమామ 




అడుగు అడుగులో పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

అడుగు అడుగులో మదమరాళములు తడబడి



గిలకల మంచం ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కె. జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు 

గిలకల మంచం ఉంది చిలకల పందిరి పొందు




పుట్టలోన నాగన్న లేచి పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల, జిక్కి

పుట్టలోన నాగన్న లేచి 



సై సై జోడెడ్ల బండి పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, ఘంటసాల

సై సై జోడెడ్ల బండి 




ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు




మరదల మరదల తమ్ముని పెళ్ళామా పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల,  జిక్కి (పి.జి. కృష్ణవేణి)

మరదల మరదల తమ్ముని పెళ్ళామా ఏమమ్మా



ధరసింహాసనమై పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

ధరసింహాసనమై




ఖగపతి అమృతము తీగ పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

ఖగపతి అమృతము తీగ 




ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం 

ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన తప్పదన్నా



ఇదేనా మన సంప్రదాయమిదేనా (Female) పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

ఇదేనా మన సంప్రదాయమిదేనా



కట్టుకున్న ఆలి గయ్యాళి అయినచో పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

కట్టుకున్న ఆలి గయ్యాళి అయినచో 


Palli Balakrishna Monday, January 31, 2022
Raja Makutam (1960)




చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
నటీనటులు: యన్.టి.రామారావు, రాజ సులోచన
దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
నిర్మాత: బి.యన్.రెడ్డి  
విడుదల తేది: 24.02.1960



Songs List:



అంజలీదే జనని దేవి పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు 
గానం: పి. లీల 

అంజలీదే జనని దేవి 



ఏడనున్నదో ఎక్కడున్నదో పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పి. లీల 

ఏడనున్నదో ఎక్కడున్నదో నా చుక్కల రేడు



యేటివడ్డున మా వూరు పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)

యేటివడ్డున మా వూరు 




జయ జయ మనోజ మంగళ పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

జయ జయ మనోజ మంగళ 




నిను చూసి నీలి పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు 
గానం: ఘంటసాల, పి. లీల 

నిను చూసి నీలి 



సడిసేయకో గాలి పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి. లీల 

ఊ..ఊ ఊ ఊ ఊఊ..ఊ ఊ ఊ ఊ

సడిసేయకో గాలి..సడి సేయబోకే
సడిసేయకో గాలి..సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి..

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే
సడిసేయకో గాలి..

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే..
నిదుర చెదరిందంటే నేనూరుకోను..

సడిసేయకో గాలి..

పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన బూని విసిరి పోరాదే..

సడిసేయకో గాలి..సడి సేయబోకే
సడిసేయకో గాలి..సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి..

ఆ ఆఆఆఆ ఆఆ .. ఊ ఊఊఊ ఊ.. ఊ ఊ ఊ
 



తకిట తకిట ధిమి తబలా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

తకిట తకిట ధిమి తబలా 



కాంత పైన ఆశ పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, మల్లిక్ 

కాంత పైన ఆశ 



జింగన తింగన పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు 
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)

జింగన తింగన




రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, మల్లిక్ 

రారండోయ్  రారండోయ్ ద్రోహుల్లారా



చూడచక్కని చుక్కల రేడు ఎక్కడున్నాడో (Bit) పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

చూడచక్కని చుక్కల రేడు ఎక్కడున్నాడో (Bit)

Palli Balakrishna
Aggi Veerudu (1969)




చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, రాజశ్రీ 
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్ 
నిర్మాత: బి.విఠలాచార్య 
విడుదల తేది: 17.10.1969



Songs List:



లేడి కన్నులు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

లేడి కన్నులు రమ్మంటే 
లేత వలపులు జుమ్మం 
ఓలమ్మీ .... ఓలమ్మీ సై.... 

కన్నె మనసే నీదైతే 
కలికి వెన్నెల తోడైతే 
ఓరబ్బీ .....ఓరబ్బీ పై

వాగులా గలగల ఉరికీ
తీగలా మెలికలు తిరిగి
గుండెలో అల్లుకుపోతే 
గువ్వలా గుసగుస పెడితే...
ఓలమ్మీ పై .... ఓలమ్మీ పై ...

వాలుగా చూపులు చూసే 
పూల బాసలు చేసి
ముదుగా ఉందామంటే
ఇద్దరం ఒక టేనంటే 
ఓరబ్బీ .... ఓరబ్బీ పై .....




సరి సరి మగసిరి పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: గాయనీ గాయకులు బృందం 

సరిసరి మగసిరి నీ అందము 
మరిమరి మనసుకు ఆనందము 
చక ఝణత తక ధిమిత 
రా రా రతిరాజా !

చిలకల కులుకులు చూడు
జిల్ జిల్ జిల్ సొగవే జోడు
వినరా హే సుకుమారా ధీరా 
కౌగిట చేరగ రా ! రా! 
లల్లలా జురా....జుం....జుం ....

ముసిముసి నవ్వుల తీరు 
విసిరే చూపుల జోరు
భళిరా రాజకుమారా రా రా
చల్లని వేళయిదేరా





అలాంటి దాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

అలాంటిదాన్ని గౌనుః యిలాంటిదాన్ని గాను 
ఎలాంటిదాన్నో నేను నీకిపుడె తెలిసిపోను 
లబ్జలకిడి లబ్జలకిడి చక్కని చకెర చక్కని చక్కెరకేళి॥ 

ఒయ్యారం ఒలక చూసే చిన్నదానినోయ్
చూపులతో గాలమేయు సుందరాంగినోయ్ 
ఎవరనుకున్నావు నన్నెరుగవులే నీవు
అబ్జలకిడి.....

కమ్మంగా పాటపాడి కవ్విస్తానోయ్ 
గజ్జెకట్టి ఆటలాడి నవ్విస్తానో య్ 
ఎవరనుకున్నావు నన్నెరగవులే నీవు
అబ్జలకిడి.....




పిలిచింది అందాల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

హాయ్ లల్లలా.... లల్లలా 
లల్లలా.... లల్లలా.. యే యిదిగో నిన్నే... 
నిన్నే నిన్నే ...

పిలిచింది అందాల బాల నిను
వలచింది మందార మాల
హాయ్ రాజ రాజ ఠారా! అందాలే అందుకోరా!!

జాబిలిలేని కలువను నేను
కౌగిలిలేని పరువము నేను 
కలలో నిన్నే కనుగొన్నాను 
హాయ్ రాజ... రాజ...

వేచెను నీకె ఈ మధుమాసం 
పూచెను వీకై నాదరహాసం
దాచితి నీకై ఈ అవకాశం
హాయ్ రాజ... రాజ...





ఎవరో నీవెవరో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఓ ప్రియతమా.. రావేలా... చెలిని చేరగ ఈ వేళ!
ఎవరో... నీవెవరో ఎదలో పిలిచీ
ఎదురుగ నిలిచీ
తీయని ఊహల ఊయల లూపేవు 

చొక్కపు బంగరుమేను: పొగరెక్కిన 
సింగపు నడుము చుక్కల రాయని సోయగమ్ము నెక 
సక్కెములాడే మోము ::
ఏ గంధర్వ లోకాల ఉన్నావో ఏ 
నీలాల గగనాలు దిగినావో
శత వసంతముల ప్రతినిధివీవు 
ప్రతిలేని రతిరాజు ప్రతిరూపమే నీవు

చంద్ర ఖండములు చెక్కిళ్లు
ఇంద్ర నీలములు ముంగురులు 
అ పాలకడలి కెరటాల కరణి 
నాలోన పొంగినవి మరులు
నీ అధరాన చిరునవ్వు విరిసింది 
నా హృదయాన విరిజల్లు కురిసింది.
వనమయూరీవోలె తనువూగినది
ఒక చింత గిలిగింత ఉయ్యాలలూపింది 




రవ్వల నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

రవ్వల నవ్వుల రాజకుమారీ 
నా నవజీవన నాట్యమయూరీః
అందెలు పలుకగ రావే: 
గంధము చిలుకగ రావే!

ఈ వేళలో! ఏమున్నదో 
పలెకెనులోన కల్యాణ వీణ
ఆ రాగ మంజరిలోనా అనురాగ మాధురి లేదా
రవ్వల నవ్వుల రాజకుమారా 
రాజకుమారీ మానసచోరా
నా అణువణువున నీవే: 
నా ప్రాణములన్నీ నీవే.....

నయనాలలో నడిరేలలో 
విరబూసె నాలో నీరూపమాల
ఆ రూప మాలిక నీకై
అందిచు కానుక కాదా ....




కాకి ముక్కుకు దొండపండు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

అత్తరులో మునిగివున్న నవాబూ...ప్యారే నవాబ్ :.
మత్తుగా తూలుతున్న జనాబూ....హాయ్ జనాబ్ :
కలికి వలపే పూలచెండు: మగువ సొగసే దొండపండు।

కాకిముక్కుకు దొండపండు దండగః దండగః
అది రామచిలకకు దొరికితేనే పండగః పండగః
వరహాల మూటలకన్న వజ్రాల కోటలకన్న 
ఖరీదైనది ప్రేమించే దిల్ 
అది వుంటేనే అందుతుంది బుల్ బుల్ 
కడకన్నులతో వేటాడేవా... కను బొమ్మలతో ఆటాడేవా 
చిరునవ్వుల పువ్వుల దోసిలితో వెంటాడేవాః

కన్నెపిల్ల కనబడితే... 
గాజుల గలగల వినబడితే 
అంతలోనే మైమరిచేరు కడకు
అడియాసల పాలౌతారు:

దొరబాబుల తీరు అంతేలే 
నవ్వాబుల జోరు ఇంతేలే..... 
ఆ నాటికి నేటికి మిగిలింది ఈ వింతేలే...

Palli Balakrishna
Oke Oka Jeevitham (2022)




చిత్రం: ఒకే ఒక జీవతం (2022)
సంగీతం: జోక్స్ బిజోయ్
నటీనటులు: శర్వానంద్, రీతువర్మ , అమల
దర్శకత్వం: శ్రీ కార్తీక్
నిర్మాత: S.R.ప్రభు, S. R. ప్రకాష్ బాబు
విడుదల తేది: 2022



Songs List:



అమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఒకే ఒక జీవతం (2022)
సంగీతం: జోక్స్ బిజోయ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సిద్ శ్రీరాం

అమ్మా..! వినమ్మా.. నేనాటి నీ లాలి పదన్నే 
ఓ ఔనమ్మా.. నేనేమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా..
గానమై ఈనాడే మేలుకున్నా..

నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా....
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..

అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే

బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి
నిదర రావాలంటే కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి
ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా..

నువ్వుంటేనే నేనూ నువ్వంటేనే నేనూ
అనుకోలేకపోతే ఏమైపోతాను
నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా

మరి మరి నునునువు మురిపెంగా చూస్తూ ఉంటే చాలమ్మా
పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా..
అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ.. (3)

నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా....
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా.. 
అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే

Palli Balakrishna
Mangamma Sapatham (1965)




చిత్రం: మంగమ్మ శపథం (1965)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాత: డి.వి.ఎస్.రాజు 
విడుదల తేది: 06.03.1965



Songs List:

Palli Balakrishna
Irugu Porugu (1963)




చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు 
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: ఐ.యన్.మూర్తి 
నిర్మాత: చిలంకుర్తి విజయ సారధి 
విడుదల తేది: 11.01.1963



Songs List:



నా మనసంతా తీసుకో పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

నా మనసంతా తీసుకో
ఏమైనా నువు చేసుకో
రంగేళివై శృంగారములో
రాతిరి కలలో కలుసుకో
కనులతో మాటాడే జాణ
నా కొనచూపులే కోటిసరసాల నజరాన
తీయని కాసుక తీసుకువస్తే
ఎందుకు నీకు నిరాదరణ !
నవనవలాడే నా వయసంతా
చేశా నీకు బహూకరణ
మనసుగలవాడె నిజమైన మనిషి!
మమత ఫలియించుకే దిల్ రుషీ !
కమ్మని సొగసు కోరిన వలపు
కలిగించునులే కైపు!
నీవూ నేనూ, ఒకటువుతాము
నేడు కాదేని రేపు 



ముందు చూపుగా నే పోతుంటే పాట సాహిత్యం

 

చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ముందు చూపుగా నే బోతుంట - హూమ్
ముందు చూపుగా నే బోతుంట
వెనక ఊపుగా సురొస్తుంటే!
అందరు గుసగుస లాడికిరో
సైరా నా రాజా !
కిల కిల నవ్వుల్ జూచి - నీ నడకల్ జూచీ
నీళ్ళ రేవుకడ పొంచుకేసుకొని నిలుచున్నావుగా

హుషారుతోటీ పచారుచేస్తూ ఉలికించావురా
మెల్లమెల్లగా కనుసైగలో కవ్వించావురా
తోచనివాళ్ళు ఎన్నో నిందలు వేశారురా

వెనకవాలుగా కళ్లుమూసి నను తెరిపించావురా
వెన్నెలలో సయ్యాటలాడి -బల్ వేధించావురా
తోడుతోడుగా జోడుగ షికారు రమ్మన్నావురా
పాడులోకమూ ఎందుకో ఓర్వలేదాయరా

అదేపనిగ నన్నల్లరి పెడితే ఫలితం లేదుర బావ
అదాటుగా మన మనసులు కలిసిన అందం ఉన్నది 
హాయిహాయిగా ఇద్దరి స్నేహం అల్లుకొనాలిరా
చేయీచేయీ గలిపితే లోకులు సిగ్గుపడా లేరా



జిగి జిగేలుమని పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

జిగి జిగేలుమని మన దొరసాని
సొగసెవ్వరికొరకోగాని వారెవా జోరు హై
పొరుగింటి పుల్లయ్యకోసం
ఈరోజున వేసితి వేషం. వారెవా జోరు హై 
ఇరిగింటెల్లమ్మలు ఇంతేలే పంతానికి కవ్వింతురులే
అనగూడదులే - మన కెందుకులే
మాటంటే చిటపట మందురులే వారెవా జోరు హై

మగవారి ప్రతాపం తెలుసు మా ఆడవారనిన అలుసు
ఇకిలింతురులే- సకిలింతురులే
తమ బడాయి జూపింతురులే వారెవా జోరుహై 
ఎంతయినా మేము మొగాళ్ళ
మా మూతిని ఉన్నది మీసం
జగమిటులైనా యుగమటులైనా
చెల్లునులే మా అధికారం వారెవా జోరు హై 



మబ్బుల చాటున పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

మబ్బులచాటున చంద్రునిలా
పొదమాటున దాగిన చినవాడా
ఎందుకు విందుకురావు
మన సెందుకు తీసుకోవు
ప్రేమించినవారికి భయమేల
మగవారికి ఇంతటి సిగ్గేల
ఎడబాయనిది కడుతీయనిది
మన ప్రేమను తెలుపగ రావేల

నీ హృదయములోని కోరికలు
నా జన్మదినానికి కానుకలు
వసివాడనివి - కుసుమించినవి
నా కురులన విరిసిన మాలికలు




కవ్వించేవే కవ్వించేవే పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత 

కవ్వించేవే - కవ్వించేవే
కలువ రేకుల కన్నుల ధాన
కవ్విస్తే జవ్వనమంతా గంతేయునె చినదాన
నవ్వించేవు నవ్వించేవు
కొంటె నడకల కులాసకాడ
నవ్విస్తే నాజూకంతా నలిగినో వన్నెకాడ

చక్కని నీ రూపు ! ఒలికించు ఓరచూపు 
వన్నెల చిల్కు - వయ్యార మెలుకు
కాదని యనబోకు వాదమాడబోకు

ఎంతటి నగుబాటు - ఎవరైన విన్నలోటు 
వలపుమాటలు - చిలిపి చేష్టలు
అతియైతే చేటు - తగదీ అలవాటు

నీ వాడనుకాదా - నామీద ప్రేమలేదా 
కమ్మని రేయి - గుమ్మయిపోయి
కలుపు చేయి చేయీ కానరాని హాయి
సరసాలు దాచి పెట్టు తెలుసును నీ గుట్టు 

ఈ విరహాలు ఈ సరదాలు
ఇప్పటికి ఉన్నదింక రేపు




సన్నజాజి చెలిమి కోరి పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

సన్నజాజి చెలిమికోరి - చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానె - జాజిమనసు పూచెను
పడుచుదనము, గడుసుదనము - పరిమెళాలు చిందెనే 
ఆ పరిమెళాల సుమదళాలు పరవషమేచెందెనే

ఒకరినొకరు చేరగానె - ఊహలు చెల రేగెనే 
ఆ ఊహల ఉయ్యాలపైన హృదయాలె ఊగెనే

ఆకసాన మెరుపుతీగె - అరనిముషము వెలుగునే
నా కనులలోన కాంతివగుచు
కలకాలము వెలుగుమా




తోటకు వచ్చిందొక చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి. బి. శ్రీనివాస్, జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

తోటకు వచ్చిందొక చెలియ - దాని
దోరవయసుపై పువ్వులు కోసిందొక చిలుక
నా మనసు
దాని నవ్వుముఖముపై నా మనసు

చెట్టుననెక్కే డొకకోతి - వాడి
చిలిపి చేష్ట పై నా మనసు
కొమ్మల నెక్కే డొకకోతి - వాడి
కోరమీసంపై నా మనసు
...   ....  .... (రాగం)

రావిచెట్టెక్కేవు - రాగాలు తీశావు
రాలిపోతవు రాలుగాయో - ఎంకయ్య
కూలిపోతవు రామ రామ

చిరునవ్వు నవ్వుతో - చేయివేస్తే చాలు
చింతలన్నీ మాయమౌతాయె చంద్రమ్మ
వంతలన్నీ మాయమైనాయె

ఒక్క మనసూతోన - చక్కగా మనముం
పైన సుక్కలు నవ్వుకోవా - ఎంకయ్య
కింద సుక్కలు నడిసిరావా

మాలోణ్ణి పెళ్లాడ మరియాద పోతాది 
మనవు మాటలు ఎత్తరాదె - చంద్రమ్మ
మారుమాటలు ఆడబోకె
మంచి మనసైతేను – మాలోడి మాటేల 
కుల మెన్నుకో లేదురో – ఎంకయ్య
గుణమునే చూశానురో

నీవు నేనూ కలిసి - నీటిలోపల కరిగి
ఏక మైపోదాములే - స్వర్గాన
ఇంపుగా ఉందాములే!

ఎటుచూచిన కురిసే - కన్నీ రే
వికసించిన కలలే - శిలలాయె 
నిర్భాగ్యము నీడగ వెంటాడె
నిట్టూర్పులు మదిలో  బరువాయె
కని పెంచిన హృదయము ఎడబాసి
కనుపించని బాధలు చెరువాయె

తోబుట్టినవాడు కనరాడె
మా త్రోవలు చీలెను - చిననాడె
కరుణించినవారికి శాపమునై
కడుచల్లని తల్లిని బాసితినే

ఈ లోకము కరుణామయమైనా
నా దోసిటనిండెను వేదనలే
ప్రేమించిన మదిలో – గాయాలా
పరమాత్మకు వేడుక కాబోలు




నృత్య రూపకం పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

నృత్య రూపకం 




ఎటు చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

ఎటు చూసినా 

Palli Balakrishna
Kalavari Kodalu (1964)




చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి
నిర్మాత, దర్శకత్వం: కె.హేమాంబరధర రావు 
విడుదల తేది: 14.03.1964



Songs List:



మంచి మనసు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: నార్ల చిరంజీవి 
గానం: యస్. జానకి 

మంచిమనసు తెలిపేదే స్నేహము,
మనిషి విలువ నిలిపేదే స్నేహము
మనసు మనసు కట్టుకున్న,
మరుమల్లెల వంతెనయే స్నేహము
మనిషిలోని మంచికే మారుపేరు స్నేహము

ఆపదలో ఆదుకొనీ ఆనందము పంచునులే స్నేహము
కలిమిలేమి అంతరాలు కానబోదు స్నేహము,
స్నేహమే, స్నేహము

మల్లెకన్న తెల్లని, జాబిల్లికన్న చల్లని
తేనెకన్న తీయని, ఏనాటికైన మాయనిదీ
స్నేహము



ఎందుకే ఎందుకే పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల, సరస్వతి 

ఎందుకే ఎందుకే ఎందుకే ఎందుకే
పొంగి పొంగి లేతవయసు ఛెంగుమన్న దెందుకే

కదిలే పిల్లగాలి కైపు రేపు నెందుకో
మల్లెల పరిమళాలు వత్తుగొలుపు నెందుకే
ఎందుకా ?
ఊఁ
ఎందుకో తెలుపనా ? ఇపుడే తెలుపనా ?

ఎదలో పడుచుదనం ఎదిగిపోయినందుకే
తెలిసెనా, తెలిసెనా, ఎందుకో తెలిసెనా ?
కమ్మని నిదురలో కలవరింత లెందుకే,
మెత్తని పాన్పుపై మేను నిలువదెందుకే ?
ఎందుకా ?
ఎందుకో తెలుపనా ? ఇపుడే తెలుపనా ?

చక్కని ఊహలకే రెక్కలొచ్చినందుకే
తెలిసెనా, తెలిసెనా, ఎందుకో తెలిసెనా ?
ఎన్నడు లేనిరీతి కన్నులదురు నెందుకే
వెన్నెలవానలోన వేడి కలుగునెందుకే ?
ఎందుకా?
ఎందుకో తెలుపనా ? ఇప్పుడే తెలుపనా ?

మనసే మెఱుపువోలె చెణుకులొలికి నందుకే
తెలిసెనా ? తెలిసెనా ? ఎందుకో తెలిసెనా ?




దొంగ చూపులు పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

దొంగ చూపులు చూచి, దోరవయసు దోచి
కొత్తవలపులు చిలికితివా, మత్తుకనులా చినదానా
దొంగచూపులు చూచి, దొరవయసు దోచి
మత్తుమందు చిలికితివా. మనసుపడినా చినవాడా

ముచ్ఛటైన కురులుదువ్వి, మొగలిరేకుల జడను వేసి
మోజుతీర ముస్తాబు చేసి, మోమాటపడ నేల
ఓ చిన్నదానా 

కోరమీసాల మెలేసి, కోటిసరసాల వలేసి
చిలిపిసైగల పిలిచావు కానీ చెప్పేటి కబురేమి
ఓ చిన్నవాడా 

హంసలాగ నడచిరాగా అందమంతా పొంగిపోగా
కోయిలల్లే గొంతెత్తిపాడ, గుండెల్లొ గిలిగింతలయ్యేను
పిల్లా

పూలతావుల చేరదీసి, గాలితీగల ఓడగట్టి
మబ్బుదారుల కేరింతలాడీ మైమరచిపోదాము
ఓ చిన్నవాడా




భలేగా నవ్వితివి పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

బలేగా నవ్వితివి, ఎలాగో చూచితివి, చెలాకీ చూపితివి
మత్తుగా, మెత్తగా మనసు దువ్వితివి

మధువును చిలికే నీ చూపే, మరలెను మెల్లగ నా వైపే
బంగరు వలపులు, రంగుల తలుపులు
తొంగి తొంగి చూచే

గాలికి నీ కురులూగినవి, నాలో వూహలు రేగినవీ
ఱువ్వున నీ నడుమాడినదీ, ఝుమ్మని నామది పాడినదీ
గువ్వల పోలిక కోరికలేవో కువ కువ లాడినవీ

కన్నుల బాసలు విన్నాను, ఎన్నడో నిను కనుగొన్నాను
అందము నాదనుకున్నాను, అందుకె నిను రమ్మన్నాను
డెందములోపల ఎందుకొ తీరని తొందర కలిగేనూ




ఏమిటో ఈ విపరీతం పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

ఏమిటో యీ విపరీతం, విధి కెందుకు నా పై కోపం
తలచేడొకటి జరిగే దొకటి, ఎవరికి ఎవరో ఏమొ
ఆశించుటయే నేరమో ఏమో 
వెతలే మిగిలిన వేమో

ప్రేమగాధలే విషాద కధలా, లోకముతీరు ఇదియేనా
చిరునగవునకూ చోటే లేదా ?
చివరకు ఫలితమిదేనా

జీవితమా యిది కలయా, నిజమా,
చెదరని చీకటి మయమా
ఆరని వెలుగుల ఆశాజ్యోతిని,
ఏనాటికైనా కనలేమా



విరిసిన పూవును పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

విరిసిన పూవునునేనూ, వెన్నెలతీవనునేనూ
మిసమిసలాడే పసిడి యౌవనపు విసురుసైపలేను

ఇన్ని దినాలుగ ఎదలో దాగిన,
కమ్మని ఊహలు కనవేలా
మౌనముగా నామదిలో సాగిన
మంజులగానము వినవేలా

తొలకరి వలపుల చెలినే కాదని
కలలూ కలతలూ నీకేలా
వెన్నెలపందిరి వెచ్చని కౌగలి
రమ్మని పిలువగ రావేలా




నీ సొగసే పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు 

నీ సొగసే లాగుతున్నది, నిను చూస్తూవుంటే
నా మనసే వూగుతున్నదీ
ఓ వలపుల జిలిబిలి వయారి హంసా,
నీ సొగసే లాగుతున్నదీ
నీ నడకజూడ నడకందముజూడ,
నడకకుతగ్గ నాధుడు ఎవరే?
నాకన్నా నాధుడు ఎవరే ?

ఓ వలపుల జిలిబిలి వయారి హంసా
నా వరాల హంసా నీ సొగసే లాగుతున్నదీ
కాశీపట్నం చూపిస్తా, గంగాస్నానం చేయిస్తా
గోవిందా, గోవిందా, కొంగుపట్టుకుని గోవిందాయని
ఏడుకొండలూ ఎక్కేస్తా,
చంద్రమండలు చెక్కేస్తా

కొండలు పిండిగ కొడతానే,
ఆ పిండితో మేడలు కడతానే
మేడలో నిన్ను కూర్చో బెట్టి, ఊయలగట్టి ఊగిస్తానే
ఉయ్యాలో, జంపాలో

నీకోసం నే పాడతా, నీకంటే బాగా పాడతా
మరి చెప్పలేదేం ?
ఇప్పుడు చెప్పానుగా !
సానిస దనిపా మసగా మాపాదనిసా దనిసరి సనిదపగని
సానీసా, దనిసరి, ససనిప, పమగరి, సనిపమ, మమగగ
దిదినని సానిసా

మామా, మా మామా - మా మామ నూటికి సర్దార్
అత్తా మా అత్తా - మా అత్తంటేనే కబడ్డార్
ఇక కట్టి పెట్టవోయ్ నీ జోరూ
ఇక మూసి పెట్టవోయ్ నీ నోరూ.
డో. చి.
వి. వి. మో.

Palli Balakrishna
Bhagya Chakramu (1968)




చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
నటీనటులు: యన్.టి.రామారావు, బి.సరోజాదేవి
నిర్మాత, దర్శకత్వం: కె.వి.రెడ్డి 
విడుదల తేది: 13.09.1968



Songs List:



నీతోని వేగలేను పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

నీ తోటి వేగలేను పోపోరా
నీ ప్రేమ మానలేను రారారా
చేరగా దీసి మాలిమీ చేసి
జారి పోయేవురా ॥
ఎన్నెన్నొ మోహాలు చూపించేవు
ఎన్నైనా దాహాలు కలిగించేవు
కానీ లాలించగా పోనీ తేలించగా
కోరవు చేరవు ॥

ఎన్నెన్నొ చిందులు వేయించేవు
ఎన్నైనా విందులు గావించేవు
కానీ సయ్యాటకు పోనీ కై లాటకు
చిక్కవు దక్కవు ॥




వాన కాదు వాన కాదు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పి. సుశీల 

వానకాదు వానకాదు వరదరాజా
పూలవాన కురియాలి వరదరాజా ॥

వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరినేలు బాలరాజు చేరరాగా
కోకిలమ్మ పాటపాడ నెమిలిపిట్ట ఆటలాడ
సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లు మనగ ॥

కొండలోన కోనలోన తిరిగే వేళ
అండదండనీకు నేనే ఉండాలంటూ
పండువంటి చిన్నవాడు నిండుగుండె వన్నెకాడు.
చేరరాగ కాలియందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగ ॥

కొండపైన నల్లమబ్బు పందిరికాగా
కోనలోన మెరుపుతీగె తోరణకాగా
మల్లెపూల తేరుపైన పెళ్ళికొడుకు రాగానే
వాని చూచి నామనసు వలె వలె వలె యనగ ..




నీవులేక నిముషమైన పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల, పి. సుశీల 

నీవులేక నిముసమైన నిలువజాలనే
నీవేకాదా ప్రేమ నాలో విరియచేసినది ॥
లోకమంతా నీవుగానే నాకు తోచెనుగా
మరువరాని మమతలేవో మదిని పూసెనుగా ॥
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
వీడిపోని నీడవోలె కూడి ఉందుముగా ॥




కుండకాదు కుండకాదు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

కుండకాదు కుండకాదు చిన్నదానా
నా గుండెలదర గొటినావే చిన్నదానా ॥

పరుగిడితే అందాలన్నీ ఒలికిపోయెనే
తిరిగిచూడ కన్నులలోన మెరుపు మెరిసెనే
ఒలికిన అందాలతో మెరిసిన నీ చూపులతో
ఎంత కలచినావో నన్ను ఎరుగవే తివే - ఓ హో హో ||

మొదటి చూపులోనే మనసు దోచుకుంటివే
ఎదుటపడిన నీ వలపు దాచుకొంటివే
దోచుకున్న నా మనసు దాచుకున్న నీ వలపు
అల్లిబిల్లి అయినాగానీ తెలియవైతివే ఓ హో హో ||

నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా
నిన్ను చూచు ఆశతోనే వేచినానుగా
పచ్చినట్టి నీ నెపము వేచినట్టి నా తపము
ఫలమునిలుపు కొందమన్న నిలువపై తివే - ఓ హో హో |



ఆశ నిరాశను చేస్తివిరా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

ఆశనిరాశను చేసితివా
రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా ॥
తోడుగనడిచేవనీ - నా నీడగనిలచేవనీ
జీవితమే ఒక స్వర్గముగా - ఇక చేసెదవని నే తలచితినే 
ప్రాణము నీవేయనీ - నా రాణివి నీవేయనీ
రాగముతో అనురాగముతో - నను ఏలెదవని నేనమ్మితినే 



రాజ కుమారి పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత 

రాజకుమారి బల్ సుకుమారి
నీసరి ఏరిధరన్
రాజకుమార బిరబిరా
నాసరి నీవెధరన్

సుందరమగునీ వదనము ముందర
చందురుడెందుకే బాలికా
పొందుగ పొగడిన నామదిపొంగి
చిందులు వేసెను బాలకా 
ఛెళుకున నీవొక కులుకు కులికితే
ఖలుకనె గుండెలు మోహినీ

ఏలా బెదరగ కొంచముగానే
కులికెదలేరా మోహనా ॥
బంగారముతో సింగారముకని
కంగారాయెనే సుందరీ
దొంగవుకావుగ కంగారెందుకు
చెంగున రారా సుందరా
తళుకు బెళుకులా చిలుకలకొలికివి
కళయన నీదే భామరో
నాలో అందము నీకే తెలిసెను
తెలివననీదే బావరో ॥
ఏమీ ? జడయా ?- పామేమోయని
నా మది బెదరెను కాంతరో
పాము మంత్రములు మా మామకు తెలియును
ఏమీ బెదరకు కౌంతుడా
నిన్నుచూచి నీ తీరునుచూచి
ఏమనవలెనో నాయికా
రాణి రాణీ నా రాణీయని
నను వెంటాడుము నాయకా




మనస్వామి నామం పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం 

మనస్వామి నామం పాడండీ
మనస్వామి రూపం చూడండీ ||
మనస్వామి భజనే చేయండీ
మనస్వామి మహిమే తెలియండీ
మానవ మాత్రుడు కాడండీ
మనస్వామి సాక్షాతు హరుడండీ ॥

వేదాలు మనకింక వద్దండీ 
అర్ధాలు తెలియక బెడదండీ
మనస్వామి మాటే మాటండీ
పరమపదానికి బాటండీ ॥

ఆషాడభూతి :
హరి : హారిలోరంగహారి హారిలో రంగహారి హారిలోరంగహారి
వాడు వీడూ ఎవడేకానీ
చూడ నీకడ మేడాలోన
చూడ చక్కని చిన్నదాని
కూడి మాడిన గురుస్వామండీ ॥

మనస్వామి నామం పాడండీ
మనస్వామి రూపం చూడండీ
మనస్వామి నామం - మనస్వామి రూపం
నామం రూపం - నామం రూపం
రహితం రహితం ||





తాళలేని తాపమై పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పి. సుశీల 

తాళలేని తాపమాయె సామీ నా సామీ
వొళ్ళు కంపరమెత్తిపోయె సామీ నా సామీ 
సింగార రూపము కనగా - నీ రంగు హంగులు వినగా
మది చెదరే - యెద అదిరే అబ్బబ్బా
అబ్బబ్బ నా తల తిరిగెనురా ॥

చాటైన మారుని శరము - గాటైనగాయముశాయ
అసువులకే మోసముగా అబ్బబ్బా -
అబ్బబ్బ నిన్నిక విడువనురా



ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
కంఠాన గరళమ్ము కానరాని శివుండు
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
తలకొక్క తెలివిగా వెలిగేటి శేషుడె
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
ఇంతవాడంతయె ఎదిగిన హనుమంతు
డితడు కాకున్నచో ఎవడు వీడు
వాడె వీడని ఎలరు గోడు సేయ
వజ్ర, శివుడును, శేషుడు, వటుకపియును
వీడె వీడని చాటింప వెడలినాడ
వాసి కనువాడ నినుగొల్చి ఓసుతండ్రీ ॥



అవతారమెత్తినావ స్వామిరాజా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

భజన

అవతారమెత్తినావ స్వామిరాజా
మమ్మాదరింప వచ్చినావ స్వామిరాజా ॥

ఆడమగ బేధాలు స్వామిరాజా నీకు
అంటనే అంటవయ్యా స్వామిరాజా
అందరికీ చిక్కబోదు స్వామిరాజా నీది
ఆనంద యోగమయ్య స్వామిరాజా ॥

ముక్తి కాంతలో నీవు స్వామిరాజా ఎన్నో
ముచ్చటలు సేతువట స్వామిరాజా
ఎంత వేదాంతులకు స్వామిరాజా - సుంత
అంతుదొరకని తంతునీది స్వామిరాజా ॥

అందరొకే జాతైన స్వామిరాజా - అదే
చిదానంద మన్నావు స్వామిరాజా
అందరినీ అందలాలు స్వామిరాజా - నీవు
ఎక్కించ పుట్టినావు స్వామిరాజా ॥

Palli Balakrishna
Pokiri (2006)






చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, ఇలియానా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్ , మంజుల ఘట్టమనేని
విడుదల తేది: 28.06.2006



Songs List:



దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: ఎన్.ఎస్.నవీన్ మాధవ్

నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే
పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే
అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో...

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)

అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో
చిచ్చు పెట్టీ చంపుతోంది...

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)

కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే జలగలా పట్టుకోకే
బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే
దేవుడా... నా మతి చెడిపోయెను పూర్తిగా
అయినా... బాగుంది హాయిగా
రాతిరంతా కునుకులేదు ఏదోటి చెయ్యాలిరో

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)

మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నాదిరో
కొట్టి కొట్టి దంచుతోంది...

ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమనీ ఎవ్వరూ చెప్పలేదే
యేటిలో మునిగినా ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడా...ఈ తెలియని తికమక దేనికో
అరెెరే... ఈ తడబాటేమిటో
రాతిరంతా కునుకులేదు ఫుల్లోటి కొట్టాలిరో

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)

ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతోంది...

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)




డోలె డోలె దిల్ జర జరా పాట సాహిత్యం

 
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వ
గానం: రంజిత్, సుచిత్ర

డోలె డోలె దిల్ జర జరా
నిను ఓర ఓర గని నరవరా
జాగు మాని చెయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందలకడనే రా రా
ఒడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా

చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన

అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా
పొదుగుతూ కుదురుగా నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిల్ బర్ దేఖో నా
మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వలపన్నీ
నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా యా... 
బరిలో కరగా యా...
ఒడికి త్వరగా యా... 
బరిలో కరగా

చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా
తళుకుతో తెగబడి నీపైన
చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా
సుందర దీవానా
తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
తరలి దరికే యా... 
ఎగసి ఎదకే యా...
తరలి దరకే యా... 
ఎగసి ఎదకే

జర జల్ది జల్ది పెందలకడనే రా రా
ఒడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా

చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన




గల గల పారుతున్న గోదారిలా పాట సాహిత్యం

 
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ
గానం: నిహాల్

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన
ఊ...ఓ...ఈ అల్లరి, ఊ...ఓ...
ఊ...ఓ...బాగున్నది, ఊ...ఓ...

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
ఊ...ఓ...ఈ లాహిరి, ఊ...ఓ...
ఊ...ఓ...నీ ప్రేమది, ఊ...ఓ...

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా




ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే పాట సాహిత్యం

 
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: మురళి, సుచిత్ర

ఆ...అ...ఆ... నా మాటే వింటారా
ఆ...అ...ఆ... నే నడిగిందిస్తారా
ఆ...అ...ఆ... నా మాటే వింటారా

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే
ఈడు ఝుమ్మంది తోడెవ్వరే...

జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురుగా ఈ ఊరొచ్చాలే

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలే
బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే
వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి
టైటానిక్కు గిఫ్టివ్వాలి...

జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది
జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే

పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే
చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి
తలంటి నీవు రుద్దాలె నైటంత కాళ్ళు పట్టాలి
నిదురోతుంటే జోకొట్టాలే...

జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా ఆగు తల్లే రంభలా ఫోజే కొట్టకులే
జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే



జగడమే... జగడమే...పాట సాహిత్యం

 
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ
గానం: కునాల్

జగడమే... జగడమే...
నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే
నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే
సమరమే... సమరమే...
నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా
ఆకాశమే తెగి పడుతున్నా బిన్లాడిన్ ఎదుటే నిలుచున్నా

ఎక్కడైన నా తీరింతే ఏ సెంటరైనా నా స్పీడింతే
హే టైము చెప్పు వస్తానంతే 
జగడమే...
నువ్వో నేనో మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే
వైలెన్స్ జరగాలంతే జగడమే...

నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం
నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం

బోలో బోలో గణపతి బప్పా బోలియ (4)

ఎప్పుడైనా నా రూటింతే ఈ రాంగు రూటు నా స్టైలంతే
హే నచ్చకుంటే నీ కర్మంతే జగడమే...
ఏయ్ రాజీ గీజీ పడలేనంతే మరి చావోరేవో తేలాలంతే
గళ్ళ పట్టి కొడతానంతే జగడమే...
నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లర తాళం
నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం




చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా పాట సాహిత్యం

 
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక మనకేల
వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...

సడియో సడియో సడియో నేనే వస్తానుగా
సడియో సడియో సడియో నీతో ఉంటానుగా
సడియో సడియో సడియో నువ్వే కావాలిగా
సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా
కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా
పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా
నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా
ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా

ఎవ్రీ డే ఓసారైనా కన్ఫ్యూజ్  అవుతుంటా
చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా
నువులేని లైఫే బోరని ఫీలైపోతుంటా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...

సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా
నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా
నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా
నీ కన్నా విలువైంది నాకేదీ లేదంటా
నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...

హా సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

Palli Balakrishna Tuesday, January 25, 2022
Swamy (2004)




చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
నటీనటులు: హరికృష్ణ, మీనా, ఆమని, ఉమాశంకరి,  రాజీవ్ కనకాల , ఆశా షైనీ, ముమైత్ ఖాన్ 
దర్శకత్వం: వి.అర్.ప్రతాప్ 
నిర్మాతలు: ఆర్.కె.బగవాన్, తేజ 
విడుదల తేది: 16.07.2004



Songs List:



చిలకా ఓ చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: E.S.మూర్తి 
గానం: మనో, ఉష, రామమని

చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
చెబుతా ఓ కథని మా ఇంటికి వస్తావా
నీలాగే మాకు ఉంది ఓ పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు

ఆకలి అంటూ అడిగిన రోజే గుర్తే లేదమ్మా
అడగక ముందే తినిపించే అమ్మేలే వదినమ్మా
అల్లరిచేస్తే తిట్టనివాడిని ఏమంటారమ్మా
నాన్నై చూసే అన్నని దేవుడు మకిచ్చాడమ్మ
చదివింది మేమైనా అలసట మా అన్నదిలే
నలతంటు పడుకుంటే వదినకి నిద్దర రాదు
ఈ ఇల్లే మా ఇద్దరి ప్రాణం
ఇంకెందుకు వేరే స్వర్గం

నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు
 
సంతోషానికి ఇంకో పేరై పూసిన రోజాలు
శ్రీరాముడి కల పండే వరమై పుట్టిన లవకుశులు
ఒక నిమిషం ఈ సీతని వదలని వానర సైన్యాలు
తమకోసం అసలేది కోరని కోవెల దీపాలు
ప్రతి రోజు పండగలా ఇల్లంతా సందడులే
అమ్మా అని పిలిచారా ఒళ్లంతా పులకింతే
మీరే గా మీరే గా ఈ తీయని స్వప్నం 
ఏ జన్మదో ఈ తీయని అనుభందం

నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు
 
చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
నువ్వూ మా జతగా ఉంటావా మా ఇంట
మా అన్నా వదిన ఉండే పువ్వుల పువ్వుల పొదరింట
కలతే రాదమ్మా నవ్వులే పండే ఈ చోట




ఆనాటి నీ కళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: వేటూరి 
గానం: యం.యం..కీరవాణి 

ఆనాటి నీ కళ్ళు 



అందం చందం పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: యం.యం..కీరవాణి , సునీత ఉపద్రష్ట

అందం చందం 





నా పేరు రంభ పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: శ్రేయా ఘోషల్

నా పేరు రంభ 



తమిళనాడు బోర్డర్ పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో,  సునీత ఉపద్రష్ట

తమిళనాడు బోర్డర్ 

Palli Balakrishna Friday, January 21, 2022
Samanyudu (2022)




చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: విశాల్, డింపుల్ హయాతి
దర్శకత్వం: సరవనన్ 
నిర్మాత: విశాల్
విడుదల తేది: 2022



Songs List:



మత్తెక్కించే కళ్ళే పాట సాహిత్యం

 
చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రీమణి 
గానం: యువన్ శంకర్ రాజా 

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
నేనేం చెయ్యాలి

నీతో అడుగే పడితే
నాలో ఒంటరితనమొక సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి
కల నిజమే చేద్దాం పదవే

కనుసైగ తోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

ఉదయాన్నే హాయిగా
ఒళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని
నన్నే నిన్ను గిల్లుకుని

ఎటు పక్క నేనున్నా
నాతో నిన్నే పక్కన చూసి
ఏం చక్కని జంటని చెప్పి
లోకం కుళ్ళి చావని

ప్రాణం విడువని జతగా
మన ప్రేమ ప్రయాణం మొదలవ్వని
కాలం మరువని కధగా
మన ప్రేమని చరితే చదివేయ్ని

నీ బుగ్గల్లోని సిగ్గే
చీకట్లో వెన్నెల
అది అడిగే తీయని ముద్దే
నా పెదవికి వెన్నెల

కనుసైగతోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
ఏం చెయ్యాలి

Palli Balakrishna Wednesday, January 19, 2022
Stand Up Rahul (2022)




చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బోల్లమ్మ 
దర్శకత్వం: సంతూ మోహన్ వీరంకి 
నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
విడుదల తేది: 2022



Songs List:



అలా ఇలా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: సత్య యామిని , స్వీకర ఆగస్తి 

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే
పెదవులపైనా మెరిసే ఈ నవ్వులే
ఇది వరకైతే ఎపుడు కనిపించలే
ఇన్నాళ్ళీ వెన్నెల్లన్నీ లోలోపలే

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నే నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే

పని తెలియని పసితమట నాది
అది తెలిసిన పెద మనసట నీది
అనువుగ మరి జరగదు కద ఏది
అనుకువగల మగువకు తిరుగేదీ

నీ వలనే అవుతుందేమో నేనెపుడూ కోరే పని
నీ జతగా ఉండె గుండె అంటుందే ఇంతే చాలని
వందేళ్ళీ వర్ణాలన్నీ తోడుండనీ

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నీ నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే




పదా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: యాజిన్ నిజార్

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

ఆగే వీల్లేదు కదా
నా… కలా నిజాల మెలకువలోన
నిన్ను చూపే వేళ
పాడెలే పెదాలు కదలక పాటలే

నా అడుగులు ఉరుకులు
పరుగులు తీస్తుంటే
మైమరపులు మెరుపులు
ఎ హే హేహే హే

ఆ వలపులు తలపులు
తపనలు పెంచేస్తుంటే ఆశలే

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

బయటికి రాకున్నా
నీవేనా లోలోన
ఎదురుగ నువ్వున్న
జారేనా ఓ మాటైనా

అనుమానం లేదింకా
అనుకోని ఏదో వైఖరి
మార్చిందే ఈరోజే కధలన్నీ
సందేహం బంధించి పెంచిందే
లోలో అలజడి
వివరించే దారేదో మరీ

ఏమిటో క్షణాలు కదలక
ఆగిపోయే ఆరాదీస్తే
ఊపిరే తపించి అడిగెను నీ జతే

ఈ పలుకులు పదములు
మెలికలు వేస్తుంటే
ముందెనకలు మునకలు
ఈ చొరవలు చనువులు
కబురులు ఊపేస్తుంటే ఊగెలే



తప్పా..? పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రఘురాం 
గానం: బెన్నీ దయాల్ 

మా ఇంటి గేటు పక్కన
ఎవడో స్పోర్ట్స్ కారు పార్కు చేస్తే
ఫోజులిచ్చి సెల్ఫీ కోసం దానికానుకుంటే
ఇంతలోనే డ్రైవరొచ్చి గేరు వేసి తొక్కితే
నా తప్పా..?

అమాయకంగా రెండు పెగ్గులేసి
సొంత స్ట్రీటు బైటే
చిన్ననాటి దోస్తు తోటి బైక్ రైడుకెల్తే
పట్టపగటి పూట డ్రంకన్ డ్రైవ్ పెట్టి
దొరికిపోతే తప్పా..?

వెకేషనే వచ్చేసినా
లొకేషనే చేంజ్ అవ్వని
పోసిషనే శపించనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
డెస్టినీ తప్పా..?

జాలీగా బ్యాచ్ తోటి మేడ మీద
పార్టీ ప్లాన్ చేస్తే టెన్ టు ఫైవ్
డీజే పెట్టి మస్తు మస్తు స్వింగులోన ఉంటే
వేళకాని వేళలోన వర్షమొచ్చి వెక్కిరిస్తే
తప్పా..?

ఆన్లైన్ లో ఆఫర్ ఏదో చూసి
నేను టెంప్ట్ అయిపోయి
బెస్ట్ ప్రైస్ తోటి కొత్త స్మార్టు ఫోన్ కొంటే
జస్ట్ ఎ వీక్ గ్యాప్ లోనే
నెక్స్ట్ మోడల్ వస్తే నాది తప్పా..?

పిల్ల నాకు నచ్చి లవ్వు చెప్పబోతే
బెస్ట్ ఫ్రెండే వచ్చి
వాడి గర్ల్ ఫ్రెండంటే తప్పా, తప్పా..??

సెల్ ఫోన్ నుంచు పేటిఎం చేస్తూ
బిల్లు కట్టే లోపు స్విఛాప్ ఐపోతే
తప్పా, నా తప్పా..?

రెంటు కట్టలేక పెంట్ హౌస్ వదిలి
టెంటు వేసుకుంటే నా తప్పా..?
జంట అంటూ లేక మెంటలెక్కి పోయి
కంటనీరు వస్తే నా తప్పా..?

ప్రమోషనే కొట్టేసిన
ఎమోషనే చేంజ్ అవ్వని
కండిషనే వచ్చేసెనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
ట్రాజెడీ తప్పా..?

జూమ్ కాల్ లోనా ఫేసు కాస్త చూపి
నచ్చినట్టే నాకు కింద నిక్కరేస్తే
నా తప్పా, తప్పా..?
రివ్యూలన్నీ చూసి సినిమాకి వెళ్తే
రేటింగ్ ఉన్నా గాని రొట్టలాగ ఉంటే
తప్పా, నా తప్పా..?

ఛాన్స్ వస్తే తప్పా
డాన్స్ వస్తే తప్పా
ఫాన్స్ ఉంటే తప్పా, నా తప్పా
బ్యాండ్ ఉంటె తప్పా
బ్రాండ్ ఉంటే తప్పా
డిమాండ్ ఉంటే తప్పా, నా తప్పా





షాలో కలల వ్యాలీలో పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: షాన్

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే నీతో
జంటవ్వాలని ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో

మౌనం పలికిందా తానె మాటలే మలిచి
ప్రాణం నిండా సంగీతం కురిసేలా
తీరం వచ్చిందా తానే వద్దకే నడిచి
నీతో అడుగేస్తే హాయిగా ఇలా

నిదురెరుగని మదిలోన
గతిచెదిరిన గమనములోన
శృతికుదిరిన సమయాన
నీతో సాగే సావాసానా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో




ఉండి లేనట్టుండి పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఉండి లేనట్టుండి అందంగా
ఎదురైన బంధం నాకడ్డంగా
వెంటే వెంటే ఉండి ఏ దారి
పోయిందో అర్ధం కానట్టుందా

ఉన్నన్నాళ్ళు ఎన్నో ఆశల్ని చూపించి
సొంతం కానంటుందా
గాయాలెన్నో నిండి నీ లోకం
నీ నుండి దూరం అయినట్టుందా

సందేహంగా సాగే దారంతటా
సంతోషంగా ఉండే వీలంటూ లేదట

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ప్రేమ జాడనీ

పొందేనేదో పోయెనేదో తేలిందా నీకీనాడైనా
పోనీ నీలో మిగిలేదేదో తెలిసిందా కొంతైనా

ఆగేదేనా ఆలోచనా ఆపేయ్
నీ పంతంనే అంటున్నా
తీరేదేనా ఈ వేదన
దూరంగా ఉంటూ ఏ తీరం చేరినా

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ఆ క్షణాలనీ

Palli Balakrishna
Rowdy Boys (2022)




చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నటీనటులు: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: హర్ష కోనుగంటి
నిర్మాతలు: దిల్ రాజు
విడుదల తేది: 14.01.2022



Songs List:



రౌడీ బాయ్స్… పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: రోల్ రిడా
గానం: రోల్ రిడా

యో ఎవ్రీబడీ… ద బాయ్స్ ఆర్ ఆన్ ద వే
లెట్స్ లిసన్ అప్… వాట్ దే గాట్ ఆ సే

మా బాయ్స్ తోటి ఎంట్రీ ఇస్తే
అల్లకల్లోలం జరా ముట్టుకుంటే
అంటుకుంటాం అగ్గి పుల్లలం
ఏం లేకపోయినా మస్తుగా ఉంటాం, చాల ఉన్నోల్లం
మరి లొల్లికొస్తే… దడ పుట్టిస్తాం అసలే కుర్రాళ్ళం

మా బైక్ సౌండు… బిందాసు
డ్రిఫ్ట్ రేసు… బిందాసు
రోడ్డు రాషు… బిందాసు, ఫుల్ టూ బిందాసు
మా హెడ్డు వెయిటు… కిక్కాసు
గ్యాంగ్ వారు… కిక్కాసు
థగ్గు లైఫు… కిక్కాసు, ఫుల్ టూ కిక్కాసులు

రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్

మేం కాలేజీకొస్తే… కలర్ ఫుల్ ఉంటది ప్రతిక్షణం
ఒక చూప్తోనే వయస్సు మొత్తం బ్యాంగాన్ చేద్దాం
మా మనస్సు ఏమో… సాఫ్ట్ గా ఉంటది నాజూక్ నరం
కాని గడబడ చేస్తే గెంటేసి తొక్కేసి తెప్పిస్తాం జ్వరం
మా రేవ్ పార్టీ ఇస్టైలు… స్టంట్ లుక్స్ ఇస్టయిలు
డోప్ స్వాగు ఇస్టయిలు… ఫుల్ టూ ఇస్టయిలు
మా టిండర్ డేట్స్ ఇస్టయిలు… డర్టీ టాక్స్ ఇస్టయిలు
లవ్ బైట్స్ ఇస్టయిలు… ఫుల్ టూ ఇస్టయిలు

రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్… వి అర్ ద రౌడీ బాయ్స్, రౌడీ బాయ్స్





ప్రేమే ఆకాశమైతే… పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జష్ప్రీత్ జస్జ్


ప్రేమే ఆకాశమైతే… ఓ మై జాను
అందులో ఎగిరే పక్షులంట… నువ్వు నేను
ప్రేమే పుస్తకం ఐతే… ఓ మై జాను
మధ్యనుండే పేజీ అంట… నువ్వు నేను

భూమే గుండ్రము… ఆకాశం నీలము
అంత పెద్ద నిజమంట… నువ్వంటే నాకు ప్రాణము
ఎంతో ఇష్టము… దాచాలంటే కష్టము
నువ్వెక్కడుంటే అక్కడేగా స్వర్గమూ

అలలే అలలే… అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే

ఓ, తెలతెలవారే వేళల్లో
కళు తెరచి చూస్తుంటే
నా కౌగిట్లో నువ్వుంటే వరమే
ఇదివరకెపుడూ కన్నుల్లో కనబడని రంగుల్లో
కొత్త ప్రపంచం చూసేద్దాం మనమే

దూరాల దారాలు తెంపెయ్యనా
కాలాన్ని చింపెయ్యనా
తేదీలు వారాలు లేవింకా
మన మధ్యనా, హా హా హా హా

అలలే అలలే… అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే

లేత గులాబీ పెదవులతో
నువు రాసే కవితలకే
నా పెదవే ఓ కాగితమయ్యిందే
అర్ధంకాని చదువంటే… మనకసలే పడదంతే
నీ సైగలనే చదివితే బాగుంతే

ఎన్నెన్నో పేజీల కావ్యాలుగా
మారాయి నా ఊహలే
ఎన్నున్నా నిజమైన
నీ ముద్దుకే తూగవే, హే హే హే

అలలే అలలే… అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే

ఓ, అలలే అలలే… అలలే అలల్లే అలల్లలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే




బృందావనం నుంచి పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మంగ్లీ

ధీం దినకుదిన ధీం అ ఆ ఆ
ధీం దినకుదిన ధీం ఆఆ
ధీం దినకుదిన ధీం హా ఆ ఆ
ధీం దినకుదిన ధీం హా హ హా

బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే, రాధను చూశాడే

ఫ్లూటు లేని గోపాలుడే
సూటు వేసే భూపాలుడే
మీసమొచ్చిన బాలుడే
మాట వింటే పడిపోవుడే

కటిక చీకటిలో కన్ను కొడతడే
వెన్న ముద్దలని వెంట పడతడే
గోల చేస్తడే గాలమేస్తడే
మాయలోన వీడే

హోయ్, బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
అరెరెరె, యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే, రాధను చూశాడే

రోమియోలా క్యాపు పెట్టి
రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే
కాస్త సందు (కాస్త సందు)
ఇచ్చామంటే (ఇచ్చామంటే)
సూది లాగా గుండెలోకి దూరిపోతాడే

రంగురంగులా టింగు రంగడే
బొంగరమోలే తిరుగుతుంటడే
ఓరచూపులా గాలి పోరడే
పగటి దొంగ వీడే

హోయ్, బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే, హెయ్
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే, రాధను చూశాడే

హే, తిక్కలోన్ని (తిక్కలోన్ని)
తిట్టాలంటూ (తిట్టాలంటూ)
ముద్దు పెదవికి ముచ్చటేసి
మూడు వస్తుందే

అయ్యబాబోయ్ (అయ్యబాబోయ్)
అంతలోనే (అంతలోనే)
వద్దు పోనీ అంటూ
మనసే అడ్డు పడుతుందే

అనగనగా మొదలైన ఈ కధ
కంచె దాటి ఏ కంచికెళ్తదో
ఏమౌతుందో ఏం చేస్తాడో
జాదూ గాడు వీడే

హమ్మో, బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
హా ఆ ఆ, యమునా తీరాన ఉన్న
రాధను చూసేసాడే
చూశాడే, రాధను చూశాడే





డేట్ నైట్ పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: రోల్ రైడ
గానం: రంజిత్ గోవింద్, సమీరా భరద్వాజ్ 

హే గర్ల్స్ ఆర్ యూ సింగిల్
వి ఆర్ రెడీ టు మింగిల్

హలో హలో హలో హలో హలో హలో
వెల్కమ్ టు ద డేట్ నైట్, ఓ మై పిల్లో
క్రేజీ పనులు చేసేద్దాం ఈ నైటులో
లెట్స్ రాక్ అండ్ రోల్ చెమ్మక్ చల్లో

హలో హలో హలో హలో హలో హలో
వెల్కమ్ టు ద డేట్ నైట్, ఓ మై పిల్లో
క్రేజీ పనులు చేసేద్దాం ఈ నైటులో
లెట్స్ రాక్ అండ్ రోల్ చెమ్మక్ చల్లో

హే ట్రై ట్రై ట్రై ట్రై ట్రై
ఈ మై క్యూటీ ఫై
డోంట్ బి డోంట్ బి షై
లెట్ మీ బి యువర్ గయ్

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్ 

అనుకున్నంత ఈజీ కాదులే
మా స్టాండర్డు వేరే లెవెల్ లే
చాలా ఎఫర్ట్స్ పెట్టాలే
ఇంకాస్త ఇంప్రెస్స్ చెయ్యాలె

రోజు మార్నింగ్ పికప్ చేస్తాం
షాపింగ్ తో డే స్టార్ట్ చేస్తాం
ఫైవ్ స్టార్ హోటల్ లంచ్ చేద్దాం
డిస్కోలో ఫ్రీకౌట్ అయిపోదాం

పార్లర్ లో గ్లో తెప్పిస్తాం
బోలెడు ఫొటోస్ తీసేస్తాం
ఇంస్టాగ్రామే నింపేస్తాం
సూపర్ మోడల్ గా సెట్ చేస్తాం

మీ పేరు టాటూ కొట్టించేస్తాం
మూడ్ స్వింగ్ లో కర్లింగ్ చేసేస్తాం
ఆల్ ద టైం పాంపర్ చేస్తాం
ప్రిన్సెస్ లాగా చూసుకుంటాం

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్ 

కొద్దిగా ఇంప్రెస్స్ అయ్యాములే
నెక్స్ట్ ఏంటని మీరే చెప్పాలే
ఇంటేషన్స్ మాకు తెల్వాలె
ఇంకొంచం ఓపెన్ అవ్వాలే

హే బేబీ ఏదో మొదలుపెడదాం
క్లాస్ రూమ్ లో కౌగిలిద్దాం
పెదవికి ఊపిరి పంచుకుందాం
బాయ్స్ టు మెన్ గా ఎదిగిపోదాం

కారులో రొమాన్స్ చేసేద్దాం
ప్రైవేట్ పిక్సే పంపిద్దాం
పువ్వుల తుమ్మెద అయిపోదాం
సెన్సార్ పనులే చేసేద్దాం

యోయో అంటూ ఫుల్ తిరిగేద్దాం
మిక్కీస్ తో పెయింటింగ్ ఏద్దాం
కాటర్పిల్లర్ కి వింగ్స్ ఇద్దాం
బట్టర్ఫ్లై లా విహరిద్దాం

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్ 



ఈ జిందగీ పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: రామ్ మిరియాల

ఈ జిందగీ ఓ యూనివర్సిటీ
ఈ దోస్తీ లేదంటే చీకటి
వర్షం వస్తే రెయిన్బో… ఎండే వస్తే స్నో
మస్తీ దోస్తీ కాంబో… ఈ ఫ్రెండురా
అనాటమీ గర్ల్సు… బి.టెక్ రౌడీ బాయ్స్
అయిపోయారు మిక్సు
పదండిరా ఫ్రెండ్షిప్ పవర్ అదిరా

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి
జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ

హ్మ్ హ్మ్, హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ
అంటూ అంటాడు ప్రతొక్కడు
జవాబు వినేది మాత్రం ఫ్రెండొక్కడే
సో కాల్డ్ సొసైటీ మొత్తం
గెటౌట్ అన్నప్పుడు
గేటుల్ని తెరిచేది మాత్రం ఫ్రెండొక్కడే

కాలేజీ బంకైనా… నీ ఫస్ట్ డ్రింకైనా
నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే
మార్నింగ్ మూడైన… డ్రంక్ అండ్ డ్రైవ్ కేసైనా
నీ వెంట ఉండేది ఫ్రెండొక్కడే

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి
జా జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ

హూ ఆర్ యూ హూ ఆర్ యూ
అంటూ జనాలు అన్నప్పుడు
విఐపి లా చూసేవాడు ఫ్రెండొక్కడే
ఫెయిల్ అయితే లూజర్ ని చేసే
నమూనా గాళ్ళందరూ
రాబోయే సక్సెస్ ని చూసేది ఫ్రెండొక్కడే

బ్రేకప్ లో డంపైన… గర్ల్ ఫ్రెండ్ తో జంపైన
నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే
పబ్జీలో టీమైనా… బెట్టింగు గేమైనా
నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి
జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ




నువ్వే నా ధైర్యం పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి, అనంత శ్రీరాం
గానం: కార్తీక్ 

నేనేంటో నాకే తెలిపి
నను నడిపిన వెలుగే నువ్వే
నా కల ఒక నిజముగ చూసిన
స్నేహమే నువ్వే

నా అడుగులు ఎటు వెయ్యాలో
చూపించిన దారే నువ్వే
నా గెలుపుని ముందే చూసిన
ప్రేమవే నువ్వే

నా గుండెలో నీ మాటలన్నీ
పాటలాగా మార్చింది నువ్వే
ఏ అర్ధం లేని పుస్తకాన్ని
నాకంటూ అర్ధం ఉందని చెప్పింది నువ్వే

నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ

నీ పరిచయం
పరిచయం చేసింది నాకు చిరునవ్వుని
నీ మనసుతో
మనిషిగా చిక్కింది నన్ను మారమని

ఆ తగువులే చదువులై
నేర్పాయి నాకు పాఠాలని
ఆ క్షణములే స్వరములై
పాడాయి ప్రేమ పాటలని

ఏ గీతలేని కాగితంపై
ఈరోజీరాత రాసింది నువ్వే
ఏ రంగు లేని జీవితంపై
వర్షంలా వర్ణాలెన్నో చల్లేసెళ్ళావే

నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ





వేశానే ఓ నిచ్చెనా పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: కపిల్ కపిలన్, సమీరా భరద్వాజ్

వేశానే ఓ నిచ్చెనా
మన ఇద్దరీ మధ్యన
ఆ నిచ్చెనెక్కి నిను చేరుకున్న

నువ్వేసి వదిలేసినా
అడుగుల్ని వెంటాడిలా
నీ పక్కనుంటా నువ్వెక్కడున్నా

దూరాలు తీరాలు
దాటేసి నువ్వెళ్ళినా
నువ్వుండే ఏ చోటైనా
నీకంటే ముందుండనా, ఆ ఆ

వేశానే ఓ నిచ్చెనా
మన ఇద్దరీ మధ్యన
ఆ నిచ్చెనెక్కి నిను చేరుకున్న

నువ్వేసి వదిలేసినా
అడుగుల్ని వెంటాడిలా
నీ పక్కనుంటా నువ్వెక్కడున్నా




వదిలేస్తుంటే మొదలవుతుందే పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: దేవిశ్రీప్రసాద్

వదిలేస్తుంటే మొదలవుతుందే ఈ కధా
వద్దంటుంటే ముందుంటుందే ఆగదా

చెరిపేస్తుంటే తిరిగొస్తుందే నీ కధా
పరిగెడుతుంటే ఎదురొస్తుందే ఆగదా

దూరాల ముళ్ళు తెంచేదెలా
నీ జ్ఞాపకాల్ని మరిచేదెలా

కోపాల కిందే దాచాను బాధే
పైపైన సాగిపోయే అల
లోతెంతో చూడు నా లోపల

కన్నీరు నిండే… గుండేమో ఎండే
కౌగిళ్ళల్లో చిక్కుకున్న రెక్కల్నే
నే వేరు చేశానులే

పెదాలపై నవ్వే
తలొంచిపోతుంటే
చూస్తుండి పోయానులే



Break Up (Rock) పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: యాజిన్ నిజార్

Break Up (Rock)




లడ్డన్ పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ బాయ్స్ (2022)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: కుంబాల గోకుల్ 
గానం: 

అరె ఎల్లిండు సూడరా
ఎదురులేని వీరుడు
వహ్ వా లడ్డన్న
వారెవ్వా లడ్డన్న

జిట్టబోయిన పెంటయ్య
యాదమన్న తనయుడు
వహ్ వా లడ్డన్న
వారెవ్వా లడ్డన్న

వహ్ వా లడ్డన్న
వారెవ్వా లడ్డన్నా
ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు
ఎల్లిండు ఎల్లిండు సూడరా
ఎదురులేని వీరుడు

హేయ్, ఏడాదికి ఒక్కసారి, లడ్డన్న
గిద్దెల పండుగ తెల్లారి, లడ్డన్న
ఖద్దరు బట్టలు ఏసుకోని, లడ్డన్న
సొమ్ములతో సోకుజేసుకోని, లడ్డన్న
దున్నపోతులతోని ధూమ్ ధామ్ చెయ్యంగా

ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు సూడు
ఎల్లిండు సూడరా ఎదురులేని వీరుడు

వహ్ వా లడ్డన్న
వారెవ్వా లడ్డన్న
ఆ, జిట్టబోయిన పెంటయ్య
యాదమన్న తనయుడు
వహ్ వా లడ్డన్న
వారెవ్వా లడ్డన్న


Palli Balakrishna Friday, January 14, 2022

Most Recent

Default