Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Puttintiki Raa Chelli (2014)




చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: టిప్పు, సుజాత మోహన్
నటీనటులు: అర్జున్ , మీనా, శ్రీనాథ్ (రమణ), మధురిమ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: ఆర్.ఎస్.గౌడ్, బసవరాజ్
విడుదల తేది: 14.04.2004




Songs List:





గుంతకల్లు గుమ్మచూడరో పాట సాహిత్యం

 

చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: టిప్పు, సుజాత మోహన్

గుంతకల్లు గుమ్మచూడరో
రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో
ఓసారికే వద్దంటే ఎలా
నీ కౌగిలే అయ్యిందే వల
మనమాడాలి ఈ వేళ ఊగాలంట ఊరు వాడ

గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో....

సత్తినపల్లి సెంటర్లలోన చీర కొని తెచ్చాలే
రాజమండ్రి సందులోన రైక నీకు కొన్నాలే
కాపుగారి కోటకాడి మల్లెలన్నీ తెచ్చాలే
భీమవరం రొయ్యతెచ్చి పులుసు వండి ఉంచాలే
సోకుల గంట తెగ మోగాలంటూ
అందినవన్నీ అందాలంటూ
ఆడిగినవన్ని ఇచ్చేసి ఇచ్చినవన్నీ దోచేసి
గుడు గుడు గుంచెం ఆడేసి చెడుగుడు పందెం వేసేసి
అందించు అందం మొత్తం అదిరేలా

పాలకొల్లు పిల్లగాడురో 
గిల్లకుండ గిచ్చుతాడురో
గుంతకల్లు గుమ్మచూడరో 
ఆ రెండు కళ్ళు చాలబోవురో....

రాణిగారి కోటలోన ఓణీలోన చూశాలే
నోరేవురి గోలచేస్తే ఆగలేక వచ్చాలే
ముద్దులన్ని మూటగట్టి దాచిపెట్టి  ఉంచాలే
కండలన్ని చూపుతుంటే ఉండలేక వచ్చాలే
అండా దండా ఉంటానమ్మో
ముందు వెనుకా నువ్వేనయ్యో
ఆశలు పొదలు చూపించి కౌగిలి సేద్యం చేయించి
సొగసులు కారం దంచేసి పలుకులు బెల్లం కలిపేసి
మోగిస్తా కసి కసి దరువేసి

గుంతకల్లు గుమ్మచూడరో
రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో
ఓసారికే వద్దంటే ఎలా
నీ కౌగిలే అయ్యిందే వల
మనమాడాలి ఈ వేళ ఊగాలంట ఊరు వాడ

గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో....



చామంతి పూబంతి పాట సాహిత్యం

 

చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: చిత్ర

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

ఆ కాలం గుచ్చింది కళ్ళల్లో ముళ్ళన్నీ
నే తీస్తా ముళ్ళన్నీ నువ్వేలే నాకన్నీ
కష్టాలు ఎన్నైనా నీకోసం పడతాను
మన అమ్మను తెమ్మంటే ఏ కాళ్ళను పడతాను
అమ్మలేని బ్రహ్మ రాత రాసినాడు
అమ్మనెత్తుకెళ్లి కోత కోసినాడు
నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా
మన కన్న తల్లివి నువ్వమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
ఇందుకే నేను ముందు పుట్టినాను
అమ్మ లా చూసే అన్ననైనాను
నీ ముందు ప్రాణాలెంతమ్మా నను కన్నమ్మా
నీకోసం నేనున్నానమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో



చామంతి పూబంతి పాట సాహిత్యం

చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: మధుబాలకృష్ణన్

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
అమృతాన్ని తాగి అమ్మలాగ రానా
అమృతాన్ని మించే అమ్మప్రేమ తేన
నీకంటే నా కెవరున్నారే నా చెళ్ళమ్మా
ననుగన్నా తల్లివి నువ్వమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

నీ నవ్వు చూడంగా ఉన్నాయి ఈ కళ్ళు
పువల్లే పెంచంగా ఉందమ్మా ఈ వళ్ళు
నీ కాలి చెప్పులుగా అరచేతులు ఇవిగోమ్మ
కలతంటూ రానీను కనులు చెమ్మ కానీను
గోరింటాకు నేనై నీ చేత పండుతాను
గోరువంక చెంత చిలక నిన్ను చేస్తాను
ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లమ్మా
ఈ జన్మే అంతా నీదమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
అమ్మలేని ఆ బ్రహ్మ రాత రాసినాడమ్మా
అమ్మలేని వారిని చేసి కోత కోసినాడమ్మా
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో



గోపాలా గోపాలా పాట సాహిత్యం

 

చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్

గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల (2)

ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో
వంపులు దాచి నన్ను చంపమాకు
అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో
ఇట్టా సందులోకి లాగమాకు

వయ్యారి ఓ సారి వచ్చిపోవే
స్వర్గాన్నే నీ ముందు దించుతానే (2)

గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల 

ఎర్రని పెదవుల్లో మత్తున్నాదే
కోడె వయసే ఊగిందే (2)

తడిమే నీ చెయ్యే మహా వాటంగా ఉన్నది
ఎగసే పొంగులతో తెగ కసి రేపుతున్నది
నలత నడుము మడత  నువ్వు అందుకో ఇక
దడక దడక దడక దడక  మరి ఆగలేనిక

అందాల విందుంది సందకాడ 
అందింది దోచేయి అండగాడా (2)

హేయ్ గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల

కౌగిలికొస్తావా కాంతామణి
చెక్కిలి ఇస్తావా చింతామణి (2)

బాణీ చూపించు ఈ పూబోణి నీదిరా
రాణీ చేసేయ్నా నా శృంగార సీమకి
చిలుకు చిలుకు చిలుకు నాసోకు చిలకరా
తళుకు తళుకు తళుకు నాజూకు మొలకరా

ఆకాశం అదరాలి అల్లరోడా
పాతాళం పొంగాలి సక్కనోడా (2)

గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల (2)

హో ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో
వంపులు దాచి నన్ను చంపమాకు
అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో
ఇట్టా సందులోకి లాగమాకు

వయ్యారి ఓ సారి వచ్చిపోవే
స్వర్గాన్నే నీ ముందు దించుతానే (2)



అన్నా అన్నా పుట్టింటికి పాట సాహిత్యం

 

చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: ఎస్. పి.బాలు, చిత్ర

అన్నా అన్నా అన్నా....
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత
తలరాతే గా నన్ను చేర్చెను నరకం
చెడు నిందను మాపేసి వస్తే న్యాయం

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి

వేసవికైనా నీరుంది ఓర్పుకు అయినా హద్దుంది
పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా
చీర సారె సిరులిచ్చి మెట్టినింటికి నన్నిస్తే
పుట్టెడు నిందను కొంగున కట్టుకు
పుట్టింటికి వచ్చేదా
కాపుకాయనే లేనా కనులదాచుకొనా
తప్పుతో రాలేనన్నా నిప్పుతో వస్తా
ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను
పేగు అదురుతోందమ్మ ప్రాణమొనుకు తోందమ్మ
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి

కట్టిన తాలే కాదన్న ఈ కాకుల లోకం ఏదన్నా
మెట్టిన నరకం మంటలోంచి ఈ పుట్టింటికి స్వర్గానికి రా
ప్రేమే అంతటి విలువైంది పుట్టిన ఇల్లే చలువైంది
తప్పని అరిచే ఈ ఆచారం మెట్టింట్లో ఇరుకైంది
అన్న నీడ కాదంటూ బలిపశువవుతావా
గుండె పైన రాయల్లే బరువు పెంచరావా
నింగిలాగ నేనున్నా ఉరుము భయము నీకొద్దు
ఉరుము టారుముకొస్తున్నా జడుపు భయము ఇకలేదు
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత
తలరాతే గా నన్ను చేర్చెను నరకం
చెడు నిందను మాపేసి వస్తే న్యాయం

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి




అనురాగము చేసే పాట సాహిత్యం


చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: ఎస్. ఏ. రాజ్ కుమార్, చిత్ర

అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము

కళ్లకి కాటుక పెడతా ఈ చల్లని చూపులకి
బాషికమే నే కడతా ఈ నుదుటన ఆశలకి
ఈ పచ్చని నూరేళ్ళకు నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు

అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము

పగలే చుక్కలు పొడుచుకు వచ్చి నేలకు చేరెనురా
చాపకు రెక్కలు మొలుచుకువచ్చి నింగికి ఎగెరెను రా
పెళ్లంటే అయో వప్పని వాడు అరె పల్లకి ఎక్కి ముచ్చట చూసి

పసిపాపే ముత్తైదై కనుపాపే కన్నమ్మై
ఈ అన్నకి పెళ్లే చేసే పేరంటాలైయ్యిందా
అనురాగం అన్నయ్యై మమకారం చెల్లెమ్మై
ఈ బంధం వందెళ్ళయ్యే వదినమ్మే చేరిందా
ఈ పందిట్లోనే మహారాణిని మీ అన్నయ్య పదాల పారాణి ని
స్వర్గమొచ్చి మనవాకిట్లో ఈనాడు వాలేనమ్మ
ఒక రెమ్మకి విరిసే పువ్వులం ఒక పెదవిపై మురిసే నవ్వులం

అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము

నన్ను నువ్వూ మరచినా వదిన నెపుడూ మరవకు
ఇంటి ఆలిని మరచినా కంటి వెలుగును మరవకు
రెండు కళ్ళు మీరు నాకు రెప్పనేనని మరవకు

ఈ ఇల్లే వెయ్యిల్లై ఈ బ్రతుకే వేయ్యేళ్లై
అనందం విందులు చేసి ఆకాశం అందేను
గతజన్మల పుణ్యాల వరమల్లే వచ్చావో
ఉగ్గుపాలు తాగిన గిన్నెకు నువు పెళ్లి పెద్దైనావు
నువ్వు చుక్క పెడితే చాలు నా బుగ్గన
అరుంధతి చుక్కే ఇచ్చు శుభ దీవెన
అమ్మలేని ఈ ఇంట్లో మా వదినమ్మే అమ్మవుతుంది
ఈ జంటకు శతమానము 
ఈ జన్మకు మా జత మానము

అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము

మంగళ హారతులిస్తా ఈ గువ్వల జంటకి
చెడు కన్నుల దిస్టిని తీస్తా మా అన్నా వదినలకి
ఈ పచ్చని నూరేళ్ళకి నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు




సీతాకోక చిలుకల చెల్లి పాట సాహిత్యం



చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: మనో, చిత్ర

గాజులు బావా గాజులు బావా రంగులు గాజుల తెచ్చావా
రంగులు గాజులు తెచ్చావా
రాజానగరం రంగంపేట మల్లెలు గాజులు తెచ్చావా
మల్లెలు గాజులు తెచ్చావా
ఈ గోరింటాకు పండిన చేతికి ఎర్రని గాజులు వేస్తావా

సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
సీతాకోక చిలుకల పెళ్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి

ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకి
తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు

సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి

ముద్దుల మూటలు కట్టి బాబే చల్లగ నవ్వాలి
అన్నకు బంగరు పాపే పుట్టి కోడలు అవ్వాలి
అన్నా చెల్లి అనుబంధాల చుట్టరికం
కోటి కోటి జన్మలు దాటి వరమవనీ

వడిని నింపుకోవమ్మ పసుపు కుంకుమా
నోము పండునోయమ్మ అన్న ప్రాణమా
కనుల విందు చేసేటి బుజ్జి బాబుకి
దిస్టి చుక్క నేనౌతా జన్మ జన్మకి
వెన్నెల తోటే పందిల్లేసే వైకుంఠపు వైభోగం
వాత్సల్యాలే వాయణమిచ్చే శోభనిచ్చు సౌభాగ్యం
అల్లారు ముద్దమ్మాయి అక్షింతలు
ఇక త్వరలోనే ఈ ఇంట్లోన కేరింతలు

ఊయాలలో ఉపానమ్మా నిన్నపుడు
ఆ ఉయ్యాలే బాబుకి అవుతా నేనిపుడు
ఊయాలలో ఉపానమ్మా నిన్నపుడు
ఆ ఉయ్యాలే బాబుకి అవుతా నేనిపుడు

సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి

సూర్యుడేమొ ఊయలందు పూలబంతిగా
మచ్చలేని చందమామ ఆటబొమ్మగా
తారలొచ్చి హారమేసి హారతియ్యగా 
నీలి మబ్బు జోల పాడే నీకు లాలిగా

వియ్యపురాలు వియ్యంకులమై రేపు మేము వస్తాము
పిల్లని ఇచ్చే వాళ్ళము అయినా పెత్తనాలు చేస్తాము
భయమొద్దు లేవమ్మా ఇవి బెదిరింపులే
నా మేనల్లుడు పెళ్లికి కూడా నే పెద్దలే

మన అమ్మ చలువై పుట్టావు నువ్వపుడు
నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుందిపుడు
మన అమ్మ చలువై పుట్టావు నువ్వపుడు
నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుందిపుడు

సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి

ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకి
తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు


Most Recent

Default