Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

State Rowdy (1989)



చిత్రం: స్టేట్ రౌడీ (1989)
సంగీతం: బప్పి లహరి
నటీనటులు: చిరంజీవి , రాధ , భానుప్రియ
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 23.03.1989



Songs List:



మూతిమిద మీసమున్న పాట సాహిత్యం

 

చిత్రం: స్టేట్ రౌడీ (1989)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

మూతిమిద మీసమున్న రోషమున్న
జబర్దస్తి గబ్బర్నిరా
రౌడిలైనా కేడిలైనా సాహో అంటు
సలాం కొట్టే సర్దార్నిరా
యముడికి నే మొగుడినిరా
మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల 
నటుడినిరా అడుగులివే
సెంటర్లో నా జండా ఎగరేస్తె ఎదురేది బాయీ
నా కులుకు చూడు నానడక చూడూ
నా దరువు చూడరా

యముడికి నే మొగుడినిరా
మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల
నటుడినిరా అడుగులివే

గరలాన్నే మింగాక శివుడూ తడబడగా
శివ శివ శివ శివ
సుధలెత్తుకొచ్చారు సురులూ గడబిడగా
హర హర హర హర
ఈ దోపిడీలూ ఆ నాటివి
ఇక చెల్లబోవూ ముమ్మాటికీ
ఈ స్తేటు రౌడీని నేనై కలబడతా
కలబడి నిలబడి
మీ వీధి కొచ్చానులేరా పని పడగా
అరె దింత తంత తాం

యముడికి నే మొగుడినిరా
మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల
నటుడినిరా అడుగులివే

కాళింగి మడుగున కృష్నుడూ అడుగుడగా
గోపికలే ఆడారు హాయిగా భయపడకా
ఈ నాడు ఆడేను కన్నయ్యరా
ఆడాల్ల తోడున్న అన్నయ్యరా
అందరికి ఇస్తున్న హామీ ఉమ్మడిగా
యమ యమ యమ యమ
నేనుటె భయమింక ఏమీ విడవనుగా
అరె దింత తంత తాం

మూతిమిద మీసమున్న రోషమున్న
జబర్దస్తి గబ్బర్నిరా
రౌడిలైనా కేడిలైనా సాహో అంటు
సలాం కొట్టే సర్దార్నిరా
యముడికి నే మొగుడినిరా
మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల 
నటుడినిరా అడుగులివే



తదిగినతోం తప్పదమ్మ..పాట సాహిత్యం

 
చిత్రం: స్టేట్ రౌడీ (1989)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
తదిగినతోం తప్పదమ్మ..హేయ్... తడితాళం
తడబడినా..హేయ్... దక్కనీవే తొలి అందం
హేయ్.. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా
అరె..మాటా మాటా.. హహ.. మల్లేతోట... హెహె
అయితే జంట.. హహ.. నీతో ఉంటా

అదిరింది నాకు జోడి కుదిరింది
ముదిరింది  ముద్దు కాస్త ముదిరింది
హే ఎంత జోలా పాడుతున్నా గిల్లుతాడే గోలా
హేయ్.. మాటా మాటా.. హెహె..మల్లెతోటా 
అయితే జంట...హహ.. నీతో ఉంటా

తదిగినతోం తప్పదమ్మ  తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది  హా

చరణం: 1
జాలీ జానీ  నా లవ్లీ రాణి నీ కొంగుకు ముడిపడిపోనీ
పోతేపోనీ  ఏమైనా కానీ వయసుకు ఉడుకులు రానీ
నీదే రోజా  నా సుప్రీం రాజా  నీ కౌగిట తలబడిపోనీ
తాజాతాజా నా కౌగిలి లేజా పెదవికి మధువులు రానీ
అరే.. కన్ను కన్నూ వేటాడాలా 
నువ్వూ నేను ముద్దాడాలా
ఈడు జోడు పెళ్ళాడాలా రావే
అంతో ఇంతో కవ్వించాలా
అందాలన్నీ నవ్వించాలా
ఆపుసోకు పండించాలా... రారా 

తదిగినతోం తప్పదమ్మ..హేయ్... తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది... హా... 

చరణం: 2
డీడీడిక్కి.. నా చెంపే నొక్కి నా ఒంటికి అంటుకుపోరా
నీ వేడికి నా గోడే దూకి వలపులు వలుచుకుపోరా
నక్కి నక్కి నీ పండే దక్కి  నా ఆకలి తీరుచుకుపోనా
ఎంతో లక్కీ  నీ జోడే దక్కి తళుకులు తడుముకుపోనా
ఉండీ ఉండీ ఊ కొట్టాలా  ఉయ్యాలూపి జోకొట్టాలా
వయ్యారాలే ఆకట్టాలా.. రారా
ముద్దుముద్దు ముట్టించాలా  రెచ్చిరేగి రెట్టించాలా
ఒళ్ళో ఇల్లే కట్టించాలా.. రావే...

అదిరింది నాకు జోడి కుదిరింది...
ముదిరింది ముద్దు కాస్త ముదిరింది
హో ఎంత జోలా పాడుతున్నా  గిల్లుతాడే గోలా
అరె.. మాటా మాటా.. హహ.. మల్లెతోటా...హెహె
అయితే జంట...హహ.. నీతో ఉంటా

తదిగినతోం తప్పదమ్మ..హేయ్... తడితాళం
తడబడినా..హేయ్... దక్కనీవే తొలి అందం

హేయ్.. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా
అరె..మాటా మాటా.. హహ.. మల్లేతోట... హెహె
అయితే జంట.. హహ.. నీతో ఉంటా




రాధా రాధా మదిలోన పాట సాహిత్యం

 
చిత్రం:  స్టేట్ రౌడీ (1989)
సంగీతం:  బప్పిలహరి
సాహిత్యం:వేటూరి
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే

ఓ ఓ ఓ ఓ ఓ .....

రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు.. నే నాడితే నువ్వాగవూ

ఆ.... ఆ... ఆ.... ఆ..

రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాజా రాజా మనసైన మన్మధ రాజా

చరణం: 1
స్వరాలు జివ్వుమంటే...  నరాలు కెవ్వుమంటే
సంపంగి సన్నాయి వాయించనా
పెదాలే అంటుకొంటే...  పొదల్లో అల్లుకుంటే
నా లవ్వు లల్లాయి పండించనా
బుసకొట్టే పిలుపుల్లో...  కసిపుట్టే వలపుల్లో
కైపెక్కి ఊగాలిలే

ఓ ఓ ఓ ఓ...
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ


చరణం: 2
పూబంతి కూతకొచ్చి...  చేబంతి చేతికిచ్చి
పులకింత గంధాలు చిందించనా
కవ్వింత చీర కట్టి...  కసిమల్లె పూలు పెట్టి
జడ నాగు మెడకేసి బంధించనా
నడిరేయి నాట్యంలో తొడగొట్టే లాస్యంలో
చెలరేగిపోవాలిలే
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే

హోయ్ హోయ్ హోయ్..
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు.. నే నాడితే నువ్వాగవూ

ఓ..ఓ..ఓ..ఓ...
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాజా రాజా మనసైన మన్మధ రాజా



చుక్కల పల్లకిలో పాట సాహిత్యం

 
చిత్రం:  స్టేట్ రౌడీ (1989)
సంగీతం:  బప్పిలహరి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
అనురాగాలే...ఆలపించనా...
ఆకాశమే...మౌన వీణగా...ఆ.. ఆ... ఆ.. ఆ
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో

చరణం: 1
నీ చిరునడమున వేచిన సిగ్గులు దోసిట దోచాలనీ
ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలనీ
హే.. పడుచుదనం చెప్పిందిలే..
పానుపు మెచ్చిందిలే...హో

చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో

చరణం: 2
తలపులు ముదిగిన తొలకరి వయసుకు
తొలి ముడి విప్పాలనీ
పెరిగే దాహం జరిపే తపనం పెదవికి చెప్పలనీ
హే తనువెల్లా కోరిందిలే...
తరుణం కుదిరిందిలే...హో

చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
అనురాగాలే...ఆలపించనా...
ఆకాశమే...మౌన వీణగా...ఆ...ఆ...ఆ...ఆ

చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో



వన్ టు త్రీ ఫొర్ పాట సాహిత్యం

 
చిత్రం:  స్టేట్ రౌడీ (1989)
సంగీతం:  బప్పిలహరి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం:  యస్.పి.బాలు, జానకి

వన్ టు త్రీ ఫొర్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
వన్ టు త్రీ ఫొర్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
జత కుదిరే ఇద్దరికి...కసి ముదిరే పెదవులకీ
ఓ ఓ ఓ ఓ ఓ లవ్లి నా డార్లింగ్ డార్లింగ్
మతి చెదిరే తపనలకి...రుచితెలిసే సొగసులకీ
ఓ ఓ ఓ ఓ ఓ సుప్రిం నా రాజా

వన్ టు త్రీ ఫొర్.....డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్

నడుము భలే కొలత సరే
సమయమిదే పసి పువ్వా పువ్వా
నడుము భలే కొలత సరే
సమయమిదే పసి పువ్వా పువ్వా
జివ్వుమనే యవ్వనమే ఇవ్వమనే కసి తారా జువ్వా
ఓ ఓ ఓ ఓ ఓ లవ్లి నా నా డార్లింగ్ డార్లింగ్
ఓ ఓ ఓ ఓ ఓ సుప్రిం నా రాజా

వన్ టు త్రీ ఫొర్......డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్

రాతిరికీ జాతరలో సోకులకియ్యన షాకు షేకు
రాతిరికీ జాతరలో సోకులకియ్యన షాకు షేకు
కొత్తరకం కౌగిలిలో మధన జ్వరం ఇక నీకు నాకు
ఓ ఓ ఓ ఓ ఓ సుప్రిం నా రాజా
ఓ ఓ ఓ ఓ ఓ లవ్లి నా డార్లింగ్ డార్లింగ్

వన్ టు త్రీ ఫొర్......డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
జత కుదిరే ఇద్దరికి...కసి ముదిరే పెదవులకీ
ఓ ఓ ఓ ఓ ఓ లవ్లి నా నా నా నా డార్లింగ్ డార్లింగ్
మతి చెదిరే తపనలకి...రుచితెలిసే సొగసులకీ
ఓ ఓ ఓ ఓ ఓ సుప్రిం నా రాజా

వన్ టు త్రీ ఫొర్......

Most Recent

Default