Search Box

Brochevarevarura (2019)చిత్రం: బ్రోచేవారెవరురా (2019)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: హసిత్ గోలి
గానం: వివేక్ సాగర్, బాలాజీ దాకే, రామ్ మిరియాల, మనీషా ఈరబత్తిని
నటీనటులు: శ్రీ విష్ణు, నివేద థామస్, నివేత పేతురాజ్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత:
విడుదల తేది: 2019

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
పొద్దెక్కి నాదిక పలుకులాపమని
అంటావేంటే వయ్యారి
సురుక్కు మంటూ కుర్రమూకతో ఏంటో ఈ రంగేళి

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ

హే  హల హల
హే  హల హల

ససస సరికొత్తైన తమాషా
చవి చూసేద్దాం మరింత
సరిపోతుందా ముకుందా కవి శారదా

ఆ అంతో ఇంతో గురుందా
అంతేలేని కల ఉందా
సింగారించేయ్ సమంగా ఓ నారద హల

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి

మీరంతా గుంపు కట్టి
వెంటనే సూటిగొచ్చి పోయిన
రానురా నేను రానురా
హే పాత లెక్కలన్ని ఇప్పి చూపే పనిలే
నాకంత ఓపీకింక లేదురా

హే పలికినాదిలే చిలక జోశ్యమే
పనికిరామని మేమే
తెలిసి పిలిసే చిలకవు నువ్వే
కాస్త అలుసిక ఇవ్వే
అరె అప్పనంగా మోగే జాతరే
నువు ఒప్పుకుంటే వెలుగే ఊరే
అది సరికాదంటే వెనక్కి రాదే
మత్తెక్కి జారిన నోరే

వగలాడి  వగలాడి (8)

కలుపు తోటలా తోటమాలినే
కులుకులాపిటు చూడే
ఈ కవితలన్ని కలిపి పాడితే
కనుక పటిక రాదే
మనకొచ్చినంత భాషే చాలులే
మరి కచ్చితంగా అది నీకేలే
నువు జతకానంటే మరొక్కమారే
వెనక్కి రాధిక పోవే

వగలాడి  వగలాడి
వగలా... డి

వేటకెళ్లి సేతుపతిను
తప్పిపోతే అధోగతి
చింతపండేరో భూపతి
అంగడే నీ సంగతి (2)

వగలాడి  వగలాడి
వగలా... డిPalli Balakrishna Sunday, June 30, 2019
iSmart Shankar (2019)చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా
నటీనటులు: రామ్ పోతినేని, నబా నటేష్, నిధి అగర్వాల్, సత్య దేవ్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్
విడుదల తేది: 12.07. 2019

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా
ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా
ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయే నా జీవితం
వదిలేసి వెల్లనంది ఏ జ్ఞాపకం

మనసే మొయ్యలేనంతగా పట్టి కొలవలేనంతలా
విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటుందిగా
ఏదో చంటి పిల్లడిలా నేనే తప్పిపోయానుగా
నన్నే వెతుకుతూవుండగా నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా

సరికొత్త తడబాటే మారింది అలవాటు లాగ
ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా
మెడవంక తాకుతుంటే మునివేళ్ళతో
బిడియాలు పారిపోవా ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా సన్నజాజిలా నవ్వగా
ప్రాణం లేచివచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా కాటుక కళ్లనే తిప్పగా
నేనో రంగులరాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా

తల నిమిరి చనుబాత నువుగాని పొలమారుతుంటే
అమాటే నిజమైతే ప్రతిసారి పొలమారి పోతా
అడగాలిగాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా
ప్రాణం నీదని నాదని రెండూ వేరుగా లేవుగా
ఎపుడో కలుపుకున్నాంకదా
విడిపోయి ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
నిండా ప్రేమలో గల గల
బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మనకథPalli Balakrishna
Sita (2019)చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్
దర్శకత్వం: తేజ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 24.05.2019

కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఓ ఓ కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఆ నవ్వులో సిరిమల్లెలై
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకి ఆరాటమే చేరాలని జడ కుచ్చిళ్ళలో
ఓ ఇంద్ర దనస్సే వర్ణాల వానై
కురిసెను జల జల చిటపట చినుకులుగా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపూవై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి (2)

సెలయేరు పైన జలతారు వీణ
పలికెను గల గల సరిగమ పదనిసగ

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

నీలాల నింగి చుక్కల్ని తెచ్చి
నక్షత్రమాలే వెయ్యాలి
నీకంటి నీరు వర్షించకుండా
దోసిల్ల గొడుగే పట్టాలి (2)

ఏ కష్టమైనా ఉంటాను తోడై
తడబడు అడుగున జతపడి నేనున్నా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
Palli Balakrishna Thursday, June 27, 2019

Most Recent

Default