చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్ దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ నిర్మాత: Sony Pictures International Productions & Sandeep Mudda విడుదల తేది: 16.02.2024
Songs List:
వందేమాతరం పాట సాహిత్యం
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కునాల్ కుండు చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు చావునే చండాడు ధీరుడు నిప్పులు కురిసాడు రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో వందేమాతరం వందేమాతరం వందేమాతరం ఎగసే ఎగసే తూఫానై రేగుతున్నది వీరావేశం కరిగే మంచై నీరళ్ళే జారిపోయే శత్రువు ధైర్యం గెలుపే గెలుపే ధ్యేయంగా ఉద్యమించి కదిలే కర్తవ్యం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే వందే వందే వందే వందే రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు ఓటమే చవిచూడని రణ విజేతరా ఇతడూ
గగనాల తేలాను పాట సాహిత్యం
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ గగనాల తేలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తెగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా వేళలేని వెన్నెలా జాలువారింది నీ కన్నులా దాహామే తీరనీ దారలా, ఓ ఓ… దేవిలా… నువ్విలా, ఆ ఆ చేరగా, ఆ ఆ కోవెలాయే నా కలా గగనాల తేలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తెగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా నీవే నలువైపులా చూస్తునే ఉంటా నిన్ను కంటిపాపలా ఏదో రాధా కృష్ణ లీలా నిన్ను నన్నీవేళ వరించిందే బాలా తరగని చీకటైపోనా చెరగని కాటుకైపోనా జగమున కాంతినంతా నీదు కన్నుల కానుకే చేసి రంగుల విల్లునైపోనా నీ పెదవంచుపై రానా ఋతువులు మారని చిరునవ్వునే చిత్రాలుగా గీసి చెరిసగమై నీ సగమై పూర్తైపోయా నీవల్ల ప్రియురాలా దేవిలా… నువ్విలా, ఆ ఆ చేరగా, ఆ ఆ కోవెలాయే నా కలా, ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ
Operation Valentine (2024)
Palli Balakrishna
Saturday, March 30, 2024