Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rakshana (1993)





చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, శోభన, రోజా
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 18.02.1993



Songs List:



గుప్పు గుప్పు పాట సాహిత్యం

 
చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర

పల్లవి:
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

అమ్మో అంతటా వింతటా... ఒక్కటే చిచ్చటా
పాపం.. లేత వయసకు లోతు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులట

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా 

చరణం: 1
చెలి తాకిన సుఖానికీ ఇలా రేగి పోవాలా
కొయ్యబారిన క్షణనికే కులాశాలు కావాలా
నిలువునా... పిలవనా
వదలదీ ఖర్మం తలబడే కథా
కసరకే పాపం పసితనం కదా
ఐతే మహత్తు కలిగిన ముహూర్త బలమున
రహస్యమడిగితె వలదని అననట

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా
అమ్మో అంతటా వింతటా ఒక్కటే చిచ్చటా
పాపం లేత వయసకు లోతు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులట

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

చరణం: 2 
ఆడగాలికి అటూ ఇటూ చెడిందేమి ఆరోగ్యం
కన్నెతీగల కరెంటులో పడిందేమొ వైరాగ్యం
నర నరం... కలవరం...
కనకనే కంట్లో...  కునుకు ఉండదే
కౌగిలే ఉంటే కలత ఉండదే
ఇంకేం తథాస్తు అనుకొని తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా



కన్నెపాపా అందుకో పాట సాహిత్యం

 
చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర

పల్లవి :
Hands up
You are under arrest
Don't move
I want to dance with you

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో

చరణం: 1
నా కదం రిధం జతే పడే దూకుల్లో
ఓ...మేడం సలాం వశం అనే కుర్రాల్లూ
సిగ్గులు విడిచీ పెట్టుకు వస్తే లగ్గం
సాధనలోనే చూపెడతాలే ఓ స్వర్గం
దిక్కులు కలిసే చోటుకి వేస్తా పాదం
చుక్కలు కళ్ళకి చూపిస్తాడే ఈ జాక్సన్

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో

చరణం: 2 
చూపకూ నిగ్గూ నీ దమ్ములోన వేడీ
ఆపకూ అలా కులాశ కూచిపూడీ
లాఫరు ఫోజుల కథకెళి చెయ్యకు బద్రం
చూపుల భరతం పట్టేస్తుందీ చ్హూ మంత్రం
ఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం
పాపము చేస్తా ఆవిరి ముక్కుల ఆరంగేట్రం

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో



గల్ల్లుమంది పాట సాహిత్యం

 
చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

గల్ల్లుమంది బాసు గలాసు
త్రిల్లు మంది డోసు పటాసు
పాతికేల్ల ఫోర్సు ఫినిష్ 
బట్లర్ బూజు మటాషు
వయాసూ ఇచ్చెయ్ మంది మిస్సు ఓ కిస్స్ 

గల్ల్లుమంది బాసు గలాసు
త్రిల్లు మంది డోసు పటాసు
పాతికేల్ల ఫోర్సు ఫినిష్ 
బట్లర్ బూజు మటాషు
వయాసూ ఇచ్చెయ్ మంది మిస్సు ఓ కిస్స్ 
గల్ల్లుమంది బాసు గలాసు
త్రిల్లు మంది డోసు పటాసు

మహ ఘాటుగ మోటుగ నాటుగ లేదూ న్యూ టేస్ట్ 
హో మహ ఘాటుగ మోటుగ నాటుగ లేదూ న్యూ టేస్ట్ 
యమ కొత్తగ చిత్తుగ మత్తుగా యేదొ చేసేస్తు
తడిపేసెయ్ లిప్ప్సు దులిపేసెయ్ తుప్ప్సు
దడపించేయ్ జడిపించెయ్ నడి జాము రాత్రులూ
విసిల్సు గజల్సు స్రుతి లయా తెగించే బజన కానీ
వయస్సు మనస్సు మతిచెడె విదంగా అదిరిపోనీ
గలాట గోల చెయ్

గల్ల్లుమంది బాసు గలాసు
త్రిల్లు మంది డోసు పటాసు
గల్లుమంది బాసూ

మును ముందర చిందర వందర చేసె  డ్రై డేస్ 
హ హ హ మును ముందర చిందర వందర చేసె డ్రై డేస్ 
తిరకాసులు కేసులు  రేసులు  రాసే డైరీసు
ప్రతి పూట ఫైటింగ్  ప్రతి  చోట షూటింగ్ 
ప్రతి బాట ప్రతి మాట పోలీసు సిలబస్
సవాల్సు శెవాల్సు కనపడె టుమారో మనది బాసూ
కలర్స్  కబుర్సు అనబడె కులాస లేని  కోర్స్
చలాకీ చిందులెయ్ దినకు దిన

గల్ల్లుమంది బాసు గలాసు
త్రిల్లు మంది డోసు పటాసు
పాతికేల్ల ఫోర్సు ఫినిస్స్
బట్లర్ బూజు మటాషు
వయాసూ ఇచ్చెయ్ మంది మిస్సు ఓ కిస్స్ 

గల్ల్లుమంది బాసు గలాసు
త్రిల్లు మంది డోసు పటాసు
పాతికేల్ల ఫోర్సు ఫినిష్ 
బట్లర్ బూజు ....



ఏ జన్మదో పాట సాహిత్యం

 
చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యమ్. యమ్.కీరవాణి, చిత్ర

పల్లవి:
ఆహహా లాలలా
లల లల లల లల లలలా
ఆహహా లాలలా
లల లల లల లల లా హా

ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ

మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం...  ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ

చరణం: 1 
ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం

పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించె ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ

చరణం: 2 
లతలు రెండూ విరులు ఆరై విరిసె బృందావనీ
కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ

వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికీ కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో

ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం...  ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ



నీకు నాకు పాట సాహిత్యం

 
చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మాల్గాడి శుభ 

నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను
ఆడనో సెప్పలేను ఏడనో సెప్పలేను రా
గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ
పోకిరీ పోరగాడ జల్ది నా జంట కూడరా
సంజైతలే నీ సంగతేంటో
ఈ సందులో నీవుందువో మల్ల తెల్వలే

నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను
ఆడనో సెప్పలేను ఏడనో సెప్పలేను రా
గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ
పోకిరీ పోరగాడ జల్ది నా జంట కూడరా

బెకారుగానే ఫిర్కాలన్ని ఎక్కెక్కి చూస్త ఉన్నా
రస్టు తీరెనా ఎంత ఇస్కి పోయినా
ఏ పోరగనికో ఈ సరుకంతా ఉరకే ఇస్తనన్నా
తీస్కపాయెనా ఇట్టె తీస్కపాయెనా
ఏమాయే నా పుంజు ఎటు పాయే
జోడాయే కోడె గాడు రాడాయే
ఎండ్లాల్లిలా ఈ కన్నె సర్లే
అందాలిలా ఉండాలి ఏండాలె తెల్వలే

నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను
ఆడనో సెప్పలేను ఏడనో సెప్పలేను రా
గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ
పోకిరీ పోరగాడ జల్ది నా జంట కూడరా

ఆ పోరి ఎంకే జారే వంకో ఎనకెనక రాలేనా
ఊరుకుందునా పత్తా పట్టుకుందునా
చెజారగానే బేజారయ్యె మామూలు లడకీనా
చేరకుందునా సత్తా చుపకుందునా
దునియాలో గల్లి గల్లి గాలిస్తా
ఎనకాలే లొల్లిలొల్లి చేసెస్తా
సిర్రెక్కదా సింగారమంతా
సీకట్లకే సోకిచ్చుకోవాలా తెల్వలే

నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను
ఆడనో చెప్పలేను ఏడనో చెప్పలేను రా
గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ
పోకిరీ పోరగాడ జల్ది నా జంట కూడరా

Most Recent

Default