చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, క్రిష్ణ కుమారి, శోభన్ బాబు, హేమలత
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు
విడుదల తేది: 10.04.1963
Songs List:
ఒకటే హృదయం కోసము పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
చరణం: 1
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .
ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .
చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
ఓ . . .
చరణం: 2
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
కిలకిల నవ్వులు పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ
కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల
చరణం: 1
రమ్మని మురళీరవమ్ములు పిలిచె
రమ్మని మురళీరవమ్ములు పిలిచె
అణువణువున బృందావని తోచె
తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె
కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ
చరణం: 2
నీవున్న వేరే సింగారములేల
నీవున్న వేరే సింగారములేల
నీ పాదధూళి సింధూరము కాదా
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే
కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల
చరణం: 3
నీ కురులే నన్ను సోకిన వేళ
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ
కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ
కిలకిల నవ్వులు చిలికినా
ఏమండోయ్.. నిదుర లేవండోయ్ పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఆశలత కులకర్ణి
పల్లవి:
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగా ఏల ఈ మగత
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
చరణం: 1
ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట..
ముందు జరుగుట.. చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం: 2
యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం: 3
నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది అర్ధమున్నదీ
మొదటి రోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు
చరణం: 1
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
పడుచువానీ .. ఒహో...
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు
చరణం: 2
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం
చరణం: 3
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
చిలిపికన్నె.. ఉహూ...
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి
నీకో తోడు కావాలి పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి
చరణం: 1
నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని
వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు
చరణం: 2
నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను
దనిస నిదనిప మగదిస దిగమప
నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల
నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ తల్లి దయచేయి కోటిదండాలు
చరణం: 3
సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు
ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి
నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను
ఓహొ చక్కని చిన్నది పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి
పల్లవి:
ఆఅ ఆఅ ఆఅ హా
ఓఓ ఓఓ ఓఓ హో
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది
చరణం: 1
వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం .. తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చరణం: 2
పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరినా ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను జతరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది
చరణం: 3
మనసే దోచిన సుందరి
మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు.. ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నదీ
ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో
ఏమిటి ఈ అవతారం? పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత
పల్లవి:
ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం: 1
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం: 2
ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం
చరణం: 3
దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు
ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
వినిపించని రాగాలే పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...
చరణం: 1
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...
చరణం: 2
వలపే వసంతముల పులకించి పూచినది
వలపే వసంతముల పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
చరణం: 3
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే