Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Paagal (2021)
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: లియోన్ జేమ్స్
నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్, భూమికా చావ్లా
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
విడుదల తేది: 14.08.2021Songs List:పాగళ్ పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: చంద్ర బోస్
గానం: రామ్ మిరియాల, మామా సింగ్

కాలేజీ సందులు తిరిగాడు
కోవెల్లు కేఫులు తిరిగాడు
సినిమా హాళ్లకు వెళ్ళాడు
ప్రతి ఒక సీటును వెతికాడు
అమ్మాయి గాని కనబడగానే
లవ్ యూ అంటాడు
ఆ పిల్ల నుండి రిప్లే రాక మొదటికి వస్తాడు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగళ్ పాగళ్ పాగళ్
ప్రేమ కోసం బతికే పాగళ్
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగళ్ పాగళ్ పాగళ్
ప్రేమ కోసం బతికే పాగళ్

పిల్ల నువ్వు సై అంటే చాలు
రై అని వచ్చేస్తాను
నై అని చెప్పోదే పిల్ల
కై అని ఏడుస్తాను
మేర జేసే ప్రేమికుడు
మళ్ళి నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్ల
పండగే నీకు అమ్మతోడు
ప్రేమించే పాగళ్ పంచిస్తా కాదల్
తోడు లేని సింగిల్ జన్మకెన్నీ బాదల్
నవ్విస్తా నవ్వుల్ రోజిస్తా పువ్వుల్
ఒప్పుకుంటే జిందగీ మొత్తం నీకు జిల్ జిల్
నిను పువ్వులోన పెట్టి చూసుకుంటా రావే ఇల్లా
నీ కోసం కడతా కత్తి లాంటి పాలరాతి ఖిల్లా
నువ్వు ఎట్టా ఉన్న ఏంచేస్తున్నా
పరవలేదే మళ్ళా
నువ్వు ఒప్పుకుంటే మోత మోగి పోతది
మొత్తం జిల్లా…. జిల్లా…

అమ్మాయి కనబడగానే సగం ప్రేమిస్తాడు
అమ్మాయి ఒప్పుకుంటే మన పాగళ్ సారూ
మొత్తం ప్రేమిస్తాడు
ప్రపంచం పెద్దది అంటాడు
ప్రయత్నం చేస్తూ ఉంటాడు
ఈ ఊళ్ళో వర్కౌట్ అవ్వకుంటే
పక్కూరికి పోతానంటాడు
టెలిస్కోపు కన్నులతోటి గాలిస్తుంటాడు
హారోస్కోపు కలవకపోయిన ఆరాధిస్తాడు
అమ్మయిలో అమ్మను చూస్తాడు
ఆ ప్రేమను అన్వేషిస్తాడు
తెగించి ముందుకు పోతాడు
ముగింపు ఈ కథకి ఏనాడూ

సరదాగా కాసేపైనా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కార్తీక్, పూర్ణిమ

ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే
ఇవ్వాళా ఎవ్వరు పంపారే
ఇన్నేళ్ల చీకటి గుండెల్లో…
వర్ణాలా వెన్నెల నింపారే
దారిలో పువ్వులై వేచెనే ఆశలు
దండగా చేర్చెనే నేడు నీ చేతులు
గాలిలో దూదులై ఊగెనే ఊహలు
దిండుగా మార్చెనే ఈడనీ మాటలు
కొత్తగా కొత్తగా పుట్టిన ఇంకోలా
కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా
సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి

చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా
కలలోనే సంతోషం కలిగించే ఊపిరి
ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి
తల నిమిరే వేళా కోసం వెర్రోడినై
వానలకై నేలలాగా వేచా మరి
వందేళ్ల జీవితానికి అందాల కానుక
అందించినావు హాయిగా వారాలలోనే
చుక్కానిలా నువీక్షణం ముందుండి లాగగా
సంద్రాన్ని దాటిననుగా తీరాలలోనే
చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే
ఆకాసం అంచునే తాకనే నించునే

సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనాఈ సింగల్ చిన్నోడే పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: బెన్నీ దయాళ్

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
అరెరే ఈ సింపుల్ చిన్నోడే
తన లవ్వులో డీపుగా మునిగాడే
ఎక్కడ ఉన్న చంటోడై చిందులు వేసాడే
బేబీ గర్ల్ బేబీ గర్ల్
నిద్దరంది లేదులే కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి
ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే
పంపవే మత్తు చూపుల మందిచ్చి
హార్టులో మోగేలే నీదే రింగ్టోన్
ఒక కిస్ ఇచ్చి పోరాదే జాను
స్మైలూతో అవ్వదా లైఫ్ కామ్ డౌన్
పక్కనుంటూనే చూస్తావా నన్ను
చేరావ్ ఇలా నా గుండెకి ఇలా
నా ఫేటే ఇలా మారి తిరిగేనా
చూడే పిల్లా నా కల్లే ఇలా
పైపైన మబ్బులో ఎగిరిన

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
అరెరే ఎటిఎం అయ్యాడే
ఎయి లవ్వులో డీపుగా మునిగాడే
క్యాషు కార్డు నిల్ అయినా పడి పడి నవ్వాడే

కొండల్లా కష్టాలంటే నమ్మనే లేదు చెప్పాలంటే
ఓర్చుకో కాసింత వెయిటే నీ డ్రీములో హాఫె పట్టే బ్యూటే బేబీ
కన్నులు చాలని అలుగుతూ చూపెను కోపమే
గుడ్డిదేరో డౌట్ ఇక తీరేరో
ఈ కాదల్ నీ
క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది
స్పీడ్ ఒద్దు అన్నది ఏం పాపం
ఫాలో మీ అన్నది పోజ్ ఒద్దు అన్నది
స్పేస్ ఇవ్వమన్నది ఎం శాపం
నచ్చేసాడు ఓ స్కెచ్ ఎసాడు
నే వే లోకి బాగానే వచ్చేసాడు
నీ అందం తోనే ఫ్లాట్ అయిపోయాడు
నీ గుండెల్లో జండానే పాతేసాడు
ఆగవే నువ్వాగవే పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరాం, 

ఆగవే నువ్వాగవే
అమ్మ అమ్మా నీ వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరాం, వేద వాగ్దేవి

కనుపాప నువ్వై వెలిగిస్తు
నా కలకు రంగుల మెరిపిస్తు
అడుగుడుగు నీడై నడిపిస్తు
ప్రతి మలుపులో నను గెలిపిస్తు
అండగా ఉండవే ఎప్పుడు నువ్విలా
పండుగై నిండవే లోపల వెలుపల
నువ్వు నాతోడై లేనిదే నేనిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
తలను మురిచె చెయ్యి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలన సాకనా అన్నీ నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవనై నడపదా
నిండు నూరేళ్లు
నా మోదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

లోకాన అమ్మలంతా
అంధించు ప్రేమనంత
ఒక నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు
మమతవు నీవు
నన్నిల పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరు జన్మలు
నాకేదురు పడిన గాని
నీ ఓడి పాపగా నన్నుండనీ అమ్మ
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
ఆ… ఆ… అమ్మా…
ఎన్నో ఎన్నో విన్నాం గాని పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: అంటోని దాసం 

ఎన్నో ఎన్నో విన్నాం గాని 
యు ఆర్ మై లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: సిమ్రాన్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్

యు ఆర్ మై లవ్ 
కనపడవా కనపడవా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: ఆనంద్ అరవిందాక్షన్

వెళ్లిపోతోంది ప్రాణమే
కనబడుతొంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే
వెలివేసింది కాలమే
ఉరి తీసింది ప్రేమనే
ముసిరేసింది మౌనమే
ఒంటరినై మిగిలానే

కనపడవా కనపడవా
కన్నీరై మిగిలేలతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా
కనపడవా కనపడవా
శిథిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై 
కడ దాకా వస్తావా
కనపడవా కనపడవా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: సమీరా భరద్వాజ్

Palli Balakrishna Tuesday, August 31, 2021
Vivaha Bhojanambu (2021)
చిత్రం: వివాహ భోజనంబు (2021
సంగీతం: అని వీ
నటీనటులు: సత్య , ఆర్జవీ
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: కె. యస్. సినిష్ , సందీప్ కిషన్
విడుదల తేది: 27.08.2021Songs List:

Palli Balakrishna Monday, August 30, 2021
Vivaha Bhojanambu (1988)
చిత్రం: వివాహ భోజనంబు (1988)
సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్ , చంద్ర మోహన్
దర్శకత్వం: జంధ్యాల 
నిర్మాతలు: జంధ్యాల , జయ కృష్ణ 
విడుదల తేది: 27.04.1988Songs List:

Palli Balakrishna
Palleturi Pidugu (1983)
చిత్రం: పల్లెటూరి పిడుగు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మోహన్ బాబు, కవిత
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: జి.వి. యస్. రాజు
విడుదల తేది: 1983

Palli Balakrishna
Muchataga Mugguru (1985)
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్, పూర్ణిమ, తులసి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 1985Songs List:ముచ్చటగా ముగ్గురం పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ 

ముచ్చటగా ముగ్గురం చినుకు వచ్చి తాకాల పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చినుకు వచ్చి తాకాల 
ఓహో తారక వయ్యారాల బాలికా పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఓహో తారక వయ్యారాల బాలికా
కొంగ కొంగ పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్, మనో, మంజు, రమోలా

కొంగ కొంగ 

Palli Balakrishna
Moogaku Matosthe (1980)
చిత్రం: మూగకు మాటొస్తే (1980)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: మురళీమోహన్, జయసుధ
దర్శకత్వం: వి. మధుసూధనరావు
నిర్మాత: కె. విజయ కుమార్
విడుదల తేది: 26.12.1980

Palli Balakrishna
Monagadu (1987)
చిత్రం: మొనగాడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: అర్జున్, రజిని
దర్శకత్వం: యన్.బి. చక్రవర్తి
నిర్మాత: సి హెచ్. వి. నరసింహా రెడ్డి
విడుదల తేది: 1987Songs List:కొంచెం ఇంకొంచెం పాట సాహిత్యం

 
చిత్రం: మొనగాడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, సుశీల

కొంచెం ఇంకొంచెం
పాలమీద మీగడ పాట సాహిత్యం

 
చిత్రం: మొనగాడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, సుశీల

పాలమీద మీగడశ్రావణ సంధ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మొనగాడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, సుశీల

శ్రావణ సంధ్యా
చెబుతా వింటే పాట సాహిత్యం

 
చిత్రం: మొనగాడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు

చెబుతా వింటే

Palli Balakrishna
Maa Inti Maharaju (1988)
చిత్రం: మాఇంటి మహరాజు (1988)
సంగీతం: సాలూరి వాసురావు
నటీనటులు: కృష్ణం రాజు, జయసుధ
దర్శకత్వం: విజయబాపనీడు
నిర్మాత: యు.వి. సత్యన్నారాయణ రాజు
విడుదల తేది: 1988

Palli Balakrishna
Kutra (1989)
చిత్రం: కుట్ర (1989)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ (All)
నటీనటులు: అర్జున్ సార్జా, జయంతి, పూర్ణిమ
దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్
నిర్మాత: పింజల నాగేశ్వర రావు
విడుదల తేది: 1989

Palli Balakrishna
Kalikalam (1991)
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: నితిన్ కపూర్
విడుదల తేది: 27.03.1991Songs List:ఏ నాటికీ నీ వడి వీడని పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏ నాటికీ నీ వడి వీడని యేనాటికానాడు పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

యేనాటికానాడుఅచ్చచో అచ్చో పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: నాగూర్ బాబు, చిత్ర

అచ్చచో అచ్చో 
ఆరని ఆకలి కాలం..పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఆరని ఆకలి కాలం..కలికాలం
అవనికి ఆఖరి కాలం..కలికాలం
నీతిని కాల్చే నిప్పుల గోళం
నిలువునా కూల్చే నిష్టుర జాలం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ గాలి ఏ జాలి ఎరుగదు
ఈ నేల ఏ పూలు విరియదు
ఈ మూల ఎకాకి ప్రతి మనిషి
ఈ గోల ఎనాడు అణగదు
ఈ జ్వాల ఏవేళ తరగదు
ఈ నింగి పంచేది కటిక నిశి
కూటికోసమేనా ఇంత చేటు బోను
సాటివారిపైనా కాటు వేయు జోరు
మనిషే మృగమై అడవైపోయే నడివీధిలో
కూరిమి కోరని క్రౌర్యం..యుగసారం
ఓరిమి చేరని వైరం..గ్రహచారం
కత్తులు నూరే కర్మాదానం
నెత్తురు పారే అత్యాచారం
కసికాలం..రక్కసికాలం
కలికాలం ఆఖరి కాలం

వాటాల పోటీల నడుమ వేలాడుతుంటారు మనుషులు
వ్యాపారమే వావి వరసులుగా
వేలాల పాఠం విలువలు వేసారిపోతాయి మనసులు
ఏపాటి స్నేహాలు కనపడక
రాగిపైసతోనే వేగుపాశమైనా
అత్యాశతోనే అయినవాళ్ళ ప్రేమ..
అడిగే వెలనే చెల్లించాలి అడుగు అడుగున
అంగడి సరుకై పోయే మమకారం
అమ్ముడు పొమ్మని తరిమే పరివారం
తీరని నేరం...ఈ వ్యవహారం
తియాని నేరం..ఈ సంసారం
కనికారం కానని కాలం
కలికాలం ఆకలి కాలం

నీ బ్రతుకు తెల్లారినాకే..
వేరొకరి ఆశలకు వేకువ..
ఈ ఇరుకు లోకాల వాడుక ఇది
ఓ పాడె మేళాల అపశ్రుతి..
ఓ పెళ్ళి కట్నాల ఫలశ్రుతి..
ఏ కరకు ధర్మాల వేడుక ఇది
కాటి కాంతిలోనే బాట చూసుకుంటూ
కాళరాత్రిలోనే చోటు చేసుకుంటూ
బ్రతుకే వెతికే ఏ రాకాసి లోకం ఇది
సంతతి సౌఖ్యం కోసం బలిదానం
అల్లిన ఈ యమ పాశం బహుమానం
ఆశలు అల్లే ఈ విష జాలం
చీకటి పాడే చిచ్చుల గానం
కలికాలం కలతల గాళం
కలికాలం ఆకలి కాలం

ఏనాటి కానాడు నిత్యం వేదించు ఆ పేద గాధకు
ఈనాడు రేటంత పెరిగినది
జీవించినన్నాలు ఎన్నడు
ఊహించలేనంత పెన్నిధి
ఈ వారసత్వానికి ఇచ్చినది
చావుకున్న భీమ..జీవితానికి ఏది
ఊపిరున్న ధీమా..జ్ఞాపకానికి ఏది
కనకే కనకం..కన్నీరేందుకు అంటున్నది
నమ్మినవారికి నష్టం కొనప్రాణం
తప్పక తీరును చస్తే ఋణకాలం
ఆహుతి కాని నిన్నటి రూపం
కంచికి పోని నీ కధ వేగం
అనివార్యం ఈ పరిహారం
కలికాలం ఆకలి కాలం

పైనున్న పున్నామనరకం..
దాటించు పుణ్యాల వరమని..
పుత్రులున్ని కన్న ఫలితమిది
ప్రాణాలు పోయెటిలోపునే..
వెంటాడి వేటాడి నిలువునా..
అంటించి పోతారు తలకొరివి
పాలు పోసి పెంచే..కాల నాగు రూపం.
నోము నోచి పొందే..ఘోరమైన శాపం
బ్రతుకే బరువై..చితినే శరణు వేడే క్షణం
కోరలు చాచిన స్వార్ధం..పరమార్ధం
తీరని కాంక్షల రాజ్యం..ఈ సంఘం
నీతిని కాల్చే..నిప్పుల గోళం
నిలువున కూల్చే..నిష్టుర జాళం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ మాయ భందాలు నమ్మకు
ఈ పరుగు పందాల ఆగకు
నీ బాట నీదేరా కడవరకు
ఏ గాలిని దారి అడగకు
ఏ జాలికి ఎదురు చూడకు
నీ నీడే నీ తోడనుకో
ఓడలాగ నిన్ను..వాడుకున్న వారు
తీరమందగానే..తిరిగి చూడబోరు
పడవై బ్రతికి నది ఓడిలోనే నిలిచి ఉండకు
ఏరయి పారే కాలం ఏమైనా
సాక్షిగ నిలిచిన గట్టు కరిగేనా
వేసవి కాని..వెల్లువ రాని
శాశ్వత స్నేహం అల్లుకుపోని
చెదిరేనా పండిన భంధం
చెరిపేనా ఏ కలికాలం

Palli Balakrishna
Kaboye Alludu (1987)
చిత్రం: కాబోయే అల్లుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, కల్పన, శాంతిప్రియ
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: యన్. చంద్రకుమార్
విడుదల తేది: 1987

Palli Balakrishna Sunday, August 29, 2021
Jeevitha Radham (1981)
చిత్రం: జీవితరధం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, రతి అగ్నహోత్రి, సుమలత
దర్శకత్వం: వి. మధుసూధనరావు
నిర్మాత: 
విడుదల తేది: 1981

Palli Balakrishna
God Father (1995)
చిత్రం: గాడ్ ఫాదర్ (1995)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: సీనారే , వేటూరి, జొన్నవిత్తుల 
నటీనటులు: నాగేశ్వరరావు, వినోద్ కుమార్, కస్తూరి, వాణి విశ్వనాథ్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ప్రత్యూష
విడుదల తేది: 1995

Palli Balakrishna
Garjana (1995)
చిత్రం: గర్జన (1995)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: సుమన్, భానుప్రియ
దర్శకత్వం: అనీల్ కుమార్
నిర్మాత: జి. జగదీష్ చంద్ర ప్రసాద్
విడుదల తేది: 1995

Palli Balakrishna
Edadugula Bandham (1985)
చిత్రం: ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు యస్. జానకి , కె. జె. జేసుదాస్ 
నటీనటులు: మోహన్ బాబు, జయసుధ, రంగనాథ్, బేబీ లక్ష్మీ ప్రసన్న, మాస్టర్ విష్ణు 
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 22.11.1985Songs List:ఎందుకు ఎందుకు పాట సాహిత్యం

 
చిత్రం: ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: కె. జె. జేసుదాస్ 

ఎందుకు ఎందుకుమవయ్యో మావ పాట సాహిత్యం

 
చిత్రం: ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: యస్. జానకి

మవయ్యో మావ ముందెల్లే దాన నీ వెనకాలే రానా పాట సాహిత్యం

 
చిత్రం: ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు 

ముందెల్లే దాన నీ వెనకాలే రానా 
నా ముందెల్లే దాన నీ వెనకాలే రానా 
నీకోసమే నా జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: యస్. జానకి

పల్లవి:
నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం 
స్వరముల వినగా నా ఎద వాకిట వెన్నెల కురిసినది
నాలో మెదిలిన తలపుల సవ్వడి పదమై పలికినది 

నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం 

చరణం: 1
తీగను మీటిన రాగం గుండెను తాకిన నిమిషం 
అలలై కలలై భావాలు విరబూయగా
ఓ..ఓ..ఓ..
తీగను మీటిన రాగం గుండెను తాకిన నిమిషం 
అలలై కలలై భావాలు విరబూయగా

నీ దాపులో నే రాధనై.. నీ దాపులో నే రాధనై
వెదురు పొదల వేణు గీతి వింటే నా గుండె పులకించదా

నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం 
స్వరముల వినగా నా ఎద వాకిట వెన్నెల కురిసినది
నాలో మెదిలిన తలపుల సవ్వడి పదమై పలికినది 

నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం 

చరణం: 2
నీవు నేను కలిసి అన్నిట సగమై నిలచి
తోడై నీడై నూరేళ్ళు సాగాలని 
ఓ..ఓ..ఓ..
నీవు నేను కలిసి అన్నిట సగమై నిలచి
తోడై నీడై నూరేళ్ళు సాగాలని 
నీ కౌగిలే నా సొంతమై.. నీ కౌగిలే నా సొంతమై 
నిమిషమైన కనులు తడవలేక ఈ జన్మ కడతేరని

నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం 
స్వరముల వినగా నా ఎద వాకిట వెన్నెల కురిసినది
నాలో మెదిలిన తలపుల సవ్వడి పదమై పలికినది 

నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం 
సీతమ్మ మాలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు యస్. జానకి

సీతమ్మ మాలక్ష్మి సీతమ్మ మాలక్ష్మి (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు యస్. జానకి

సీతమ్మ మాలక్ష్మి 


Palli Balakrishna
Evandoi Srimathi Garu (1982)
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
గానం: పి.సుశీల, యస్,పి.బాలు, యస్.జానకి, మాదవపెద్ది రమేష్ , వింజమూరి కృష్ణ మూర్తి 
నటీనటులు: చంద్రమోహన్, రాధిక
కథ స్క్రీన్ ప్లే: కాశీ విశ్వనాధ్, రేలంగి నరసింహారావు
మాటలు: కాశీ విశ్వనాధ్
దర్శకత్వ పర్యేక్షణ: దాసరి నారాయణరావు
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: USR మోహనరావు
విడుదల తేది: 05.02.1982Songs List:హే గురు ప్రేమించేయ్ గురు పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్,పి.బాలు, మాదవపెద్ది రమేష్ 

హే గురు ప్రేమించేయ్ గురు బుల్ బుల్ పిల్లా బులాకి పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్,పి.బాలు, పి.సుశీల

బుల్ బుల్ పిల్లా బులాకి పిల్లా 
చల్ చల్ పిల్లా చలాకి పిల్లా ఇల్లరికం ఎంత సుఖం పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్,పి.బాలు, యస్.జానకి, వింజమూరి కృష్ణ మూర్తి 

ఇల్లరికం ఎంత సుఖం 
ముద్దుల రంగా పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల,, మాదవపెద్ది రమేష్ 

ముద్దుల రంగా ఉండూ ఉండుగుండె బండగా మారితే ఎంత బాగుండేది పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్,పి.బాలు

గుండె బండగా మారితే ఎంత బాగుండేది 

Palli Balakrishna
Chakravakam (1974)
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, వాణీశ్రీ, చంద్రకళ, జి.వరలక్ష్మి, అంజలీదేవి, కృష్ణ కుమారి 
దర్శకత్వం: వి. మధుసూధనరావు
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 1974Songs List:ఈ నదిలా నా హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల, వి. రామకృష్ణ 

పల్లవి:
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతూంది   
   
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో.
వెతుకుతు వెళుతూంది వెతుకుతు వెళుతూంది

చరణం: 1
వలపు వాన చల్లదనం తెలియనిది 
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
వలపు వాన చల్లదనం తెలియనిది
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది

కలల కెరటాల గలగలలు రేగనిది
కలల కెరటాల గలగలలు రేగనిది
గట్టు సరిహద్దు కలతపడి దాటనిది
ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో

ఎంతగా మారినది ఎందుకో ఉరికినది
ఎంతగా మారినది ఎందుకో ఉరికినది
     
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతూంది  

చరణం: 2 
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది

మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
ఏ మనిషికి మచ్చికకు రానన్నది

ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది  
       
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో
వెతుకుతు వెళుతూంది వెతుకుతు వెళుతూంది
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల, వి. రామకృష్ణ

పల్లవి:
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి 
పట్టపగలె తొందర పండగుంది ముందర
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి 
పట్టరాని తొందర పట్టుకుంటె బిత్తర 

చరణం: 1
కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు 
కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు
కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు 
కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు

కోరి వలచి వచ్చాను నీ కోసమెన్నొ తెచ్చాను
కోరి వలచి వచ్చాను నీ కోసమెన్నొ తెచ్చాను
గుట్టు చప్పుడు లేక నీ సొంతమే చేసుకో

కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి 
పట్టపగలె తొందర పట్టుకుంటె బిత్తర   
     
చరణం: 2 
నింగి వంగి వచ్చిందీ నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది నీవు నడిచేటందుకు
నింగి వంగి వచ్చిందీ నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది నీవు నడిచేటందుకు

మంచు జల్లు కురిసింది చలి పుట్టేటందుకు
మబ్బు చాటు చేసింది గిలి తీరేటందుకు
మబ్బు చాటు చేసింది గిలి తీరేటందుకు   
     
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి 
పట్టరాని తొందర పండగుంది ముందర

చరణం: 3 
అల్లరి కళ్ళకు నల్లని కాటుక హద్దులే గీచావు ఎందుకూ
కళ్ళకు కాటుకే చల్లదనం హద్దులో ఆడదుంటె చక్కదనం
చీర కట్టులో ఎన్ని గమ్మత్తులు చిగురాకు పెదవుల్లో ఎన్ని మత్తులు
బిగి కౌగిలింతలో కొత్తకొత్తలు ప్రేమ బాటంతా పూలగుత్తులు   

కొత్తగా పెళ్ళైన కుర్రదానికి
పట్టరాని తొందర పట్టుకుంటె బిత్తర      
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి
పట్టపగలె తొందర పండగుంది ముందరవీణలోన తీగలోన పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల 

పల్లవి:
వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనది రాగము
వీణలోనా తీగలోనా

చరణం: 1
మాటలోనా మనసులోనా
ఎక్కడున్నది భావము
అది ఎప్పుడౌను గానము
నాదమునకు స్వరమే రాగము
మనసులోని మాటే భావము
రాగ భావములేకమైనది
రమ్యమైనా గానము

వీణలోన తీగలోనా

చరణం: 2
గతజన్మ శ్రుతి చేసుకున్నది
అది ఈ జన్మ సంగీతమైనది
సరిగమ పదనిసానిదమప గరిగ
రాగాల ఆరోహణవరోహణైనది
అనురాగ హృదయాల అన్వేషణైనది

వీణలోనా తీగలోనా

చరణం: 3
గుండెలోనా గోంతులోనా ఎక్కడున్నది ఆవేదన
అది ఎలాగౌను సాధన
గీతమునకూ బలమే వేదన
రాగమునకూ మెరుగే సాధన
గుండె గొంతుకలేకమైనవి
నిండురాగాలాపన

వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనది రాగము
వీణలోనా తీగలోనా
వీణలేని తీగను (Sad) పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల, వి. రామకృష్ణ 

పల్లవి:
వీణలేని తీగను నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను

వీణలేని తీగను నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను
జీవించలేను మరణించలేను

చరణం: 1
మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది
నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది
మరువలేని మనసుకన్నా నరకమేముంది
ఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది

చరణం: 2
వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది
తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది
తీగ మారినా కొత్త రాగం పలకనంటుంది
పాత స్మృతులే మాసిపోక బాధపడుతుంది
జీవించలేను మరణించలేను

చరణం: 3
బండబారిన గుండె నాది పగిలిపోదు చెదిరిపోదు
నువ్వు పేర్చిన ప్రేమ చితిలో కాలిపోదు బూదికాదు
నిన్ను కలిసే ఆశలేదు
నిజం తెలిసే దారిలేదు
చివరికి నీ జీవితానికి చిటికెడంత విషం లేదు
జీవించలేను మరణించలేనుప్రియతమా నా ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల

పల్లవి:
ప్రియతమా నా ప్రియతమా
ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన
ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన
దిక్కు దిక్కుల మారుమ్రోగే..దీన హృదయావేదన
దిక్కు దిక్కుల మారుమ్రోగే దీన హృదయావేదన

ప్రియతమా నా ప్రియతమా
ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన

చరణం: 1
నిన్ను నేను వంచించగలనా ఈ జన్మ ఎవరికో అర్పించగలనా
నిన్ను నేను వంచించగలనా ఈ జన్మ ఎవరికో అర్పించగలనా
నింద నెటుల నమ్మావు నీవు నింద నెటుల నమ్మావు నీవు
నన్నిదా తెలుసుకున్నావు నన్నిదా తెలుసుకున్నావు

ప్రియతమా నా ప్రియతమా
ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన

చరణం::2
నిన్ను కాదని జీవించగలనా ఈ నిజానికి రుజువు కావలెనా
నిన్ను కాదని జీవించగలనా ఈ నిజానికి రుజువు కావలెనా
గుండె గుడిగా చేసుకున్నాను గుండె గుడిగా చేసుకున్నాను
నీ కొలువుకోసమే కాచుకున్నాను నీ కొలువుకోసమే కాచుకున్నాను
ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన
దిక్కు దిక్కుల మారుమ్రోగే దీన హృదయావేదన

ప్రియతమా నా ప్రియతమా
వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల, వి. రామకృష్ణ

వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ కుళ్ళుమోమొతు పిల్లగా
మళ్ళివచ్చేదాకా నీ కళు కాస్తా ఇచ్చిపో
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
ఉండిపో ఉండిపో వుండాలంటే వుండిపో

ఓ ఒళ్ళుపొగరుపిల్లా వెళ్ళలేని కళ్ళల్లో
నువ్వు వెన్నెలల్లే ఉండిపో
నువ్వు వెన్నెలల్లే ఉండిపో
వెన్నెలతో నన్ను పోల్చకూ
అది సగం రోజులుంటుందీ నెలకు
వెన్నెలతో నన్ను పోల్చకూ
అది సగం రోజులుంటుందీ నెలకు
ఆ మిగితాసగం నేనుంటానులే
ఒద్దికంటే ఇద్దరం పంచుకోవాలిలే

ఉండిపో ఉండిపో ఉండాలంటే ఉండిపో
ఓకుళ్ళుమొతు పిల్లగా
మల్లి వచ్చే దాకా నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
పోతే పో నాకే అన్నావుగా మరి బుంగమూతి పెట్టుకు
కూర్చోన్నావేంటి మరి నీకే నువు టవునుకెలతావు
స్నేహితులని సినిమాలకనీ పగలంతా హాయిగా తిరిగి
రాత్రికి మత్తుగా నిద్రపోతావు నే నొంటరిగా ఎలావుండనూ
మగాడివి నీకేమి పగలంతా తిరుగుతావు
మాపటికి అలసిపోయి మత్తుగా నిదరోతావ్

ఆ... హా... ఆ... ఆ...
మగాడివి నీకేమి పగలంతా తిరుగుతావు
మాపటికి అలసిపోయి మత్తుగా నిదరోతావ్
ఆడపిల్లవు నీకేమి అద్దమెదుట కూర్చోంటావ్
ఆడపిల్లవు నీకేమి అద్దమెదుట కూర్చోంటావ్
రోజు రోజుకో కొత్త పోంగు
చూసుకొంటూ గడిపేస్తావ్

సరే వెళ్ళో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ ఒల్లుపొగరుపిల్లా వెళ్ళలేని కళ్ళల్లోనువు
వెన్నెలల్లే ఉండిపో నువు వెన్నెలల్లే ఉండిపో

నీ జతలో నేనే మగాడినీ
నువు లేకుంటే నాకు నేనే పగాడిని
నీ జతలో నేనే మగాడినీ
నువు లేకుంటే నాకు నేనే గాడిని
పగవాడితో పోరు తెలిసినట్లుంటుంది
పడుచువాడితో పొత్తు ప్రాణాలు తీస్తాది

ఐతే ఉండిపో ఉండిపో ఉండాలంటే వుండిపో
సరే వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ ఒల్లుపొగరు పిల్లా వెళ్ళలేని కళ్ళల్లో
ఓ కుళ్ళుమొతు పిల్లగా మల్లివచ్చేదాకా
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
వీణలోన తీగలోన ఎక్కడున్నది అపశ్రుతి పాట సాహిత్యం

 
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల 

పల్లవి:
ఆ..హా.. ఆ...
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి
అది ఎలాగైనది విషాద గీతి
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి
అది ఎలాగైనది విషాద గీతి వీణలోనా తీగలోనా

చరణం: 1
వెతికి వచ్చిన తీగతో నా వీణనే ముడివేసుకొంటిని
వెతికి వచ్చిన తీగతో నా వీణనే ముడివేసుకొంటిని
వెలితి రాదని కలిసి పాడితిని 
వెలితి రాదని కలిసి పాడితిని
నేడే వికల వీణగా మిగిలిపోతిని
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి

చరణం: 2
రాగమున ఒక స్వరము మారిన
వలపు పాటే కలత పాటగును
రాగమున ఒక స్వరము మారిన
వలపు పాటే కలత పాటగును
అనురాగమున అపశృతి పలికిన
అనురాగమున అపశృతి పలికిన
కన్నీటిలో కల కరిగిపోవును
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి

చరణం: 3
గాలిలోనా గాలినై కలసిపోతాను
నీ గానమై నే నందులోనే నిలిచిపోతాను
మట్టిలోనా మట్టినై మాసిపోతాను
నీ మనసులోని మమతగానే బ్రతికి ఉంటాను
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి

Palli Balakrishna
Anuraga Bandham (1985)
చిత్రం: అనురాగ బంధం (1985)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
నటీనటులు: శరత్ బాబు, జయసుధ, సరిత
దర్శకత్వం: అనీల్ కుమార్
నిర్మాత: యన్. రామలింగేశ్వరరావు
విడుదల తేది: 1985Songs List:ఏ జన్మ బంధమో పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగ బంధం (1985)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఏ జన్మ బంధమో స్వాగతం ప్రేమతో పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగ బంధం (1985)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

స్వాగతం ప్రేమతో రావే చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగ బంధం (1985)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

రావే చందమామ 
నే లాలిపాట పాడనా పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగ బంధం (1985)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.జానకి 

నే లాలిపాట పాడనా 

Palli Balakrishna Saturday, August 28, 2021
Bandham (1986)
చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, లలితా సాగరి, నాగూర్ బాబు 
నటీనటులు: శోభన్ బాబు, రాధిక, బేబీ షాలిని
దర్శకత్వం: రాజా చంద్ర
నిర్మాణ సంస్థ: ఎవిఎమ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 19.07.1986

(శోభన్ బాబు దీనిలో తండ్రీ కొడుకుల గా ద్విపాత్రాభినయం చేశారు)Songs List:తగ్గమ్మా దూరం దూరం పాట సాహిత్యం

 
చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

తగ్గమ్మా దూరం దూరం ఇదో ప్రేమగోపురం పాట సాహిత్యం

 
చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

పల్లవి:
ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం
చిలిపి నవ్వులతోనే
వలపు దీపాలెన్నో పెట్టాలంట తోడునీడా నేనై

ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం

చరణం: 1
పువ్వుతేనై నువ్వు నేనై ముద్దాలాడాలంటా
గాలివానై నీలో నేనై నీళ్ళాడాలంటా
చెదరని కుంకుమ బొట్టు 
చెలిమికి వేకువ పొద్దు
మమతలే మనుగడై కలిపిన వలపుల కౌగిలిలో
నీ నీడలో ఆశలా మేడలే నిలుపనా

ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం

చరణం: 2
మేఘాలల్లే తాకంగానే మెరుపవ్వాలంటా
ఆకాశంలో నక్షత్రాలే నగలవ్వాలంటా
తరగని కాటుక కన్ను
పాపగ చేసెను నన్ను
సిరులనే అడగని 
మరులులో పెరిగిన ప్రేమలలో
నీ పూజకే పూవునై పూయనా రాలనా

ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం
చిలిపి నవ్వులతోనే
వలపు దీపాలెన్నో పెట్టాలంట తోడునీడా నేనై

ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం
లలాలాలలాలలా లలాలాలలాలలా
లలాలాలలాలలా లలాలాలలాలలా
పిల్లా సౌఖ్యమా అంతా క్షేమమా పాట సాహిత్యం

 
చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

పిల్లా సౌఖ్యమా అంతా క్షేమమా 
ఆల్లిబిల్లి అమ్మాయికి పాట సాహిత్యం

 
చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, లలితా సాగరి

ఆల్లిబిల్లి అమ్మాయికినన్ను కన్న ముద్దు పాప పాట సాహిత్యం

 
చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

నన్ను కన్న ముద్దు పాప శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పాట సాహిత్యం

 

చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి. సుశీల, లలితా సాగరి

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥

తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం II పాట సాహిత్యం

 
చిత్రం: బంధం (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: లలితా సాగరి

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥

తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 13 ॥


----------------


శ్రీ వేంకటేశ్వర స్తోత్రం 

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో |
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ||

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ||

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

Palli Balakrishna
Adavi Raja (1986)
చిత్రం: అడవిరాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల (All)
నటీనటులు: శోభన్ బాబు, రాధ
దర్శకత్వం: కె. మురళీమోహన్ రావు
నిర్మాత: కె. నాగేశ్వరరావు
విడుదల తేది: 31.10.1986Songs List:అడవికి వచ్చిన పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాజా (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

అడవికి వచ్చినఉక్కిరి ఉక్కిరి పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాజా (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఉక్కిరి ఉక్కిరిమేనత్త మేనక పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాజా (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మేనత్త మేనక
చిలకమ్మ కిష్టము పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాజా (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చిలకమ్మ కిష్టమునాటు మనిషిని బాబయా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాజా (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

నాటు మనిషిని బాబయాజాజిపూలు జడకు పెట్టనా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాజా (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

జాజిపూలు జడకు పెట్టనా

Palli Balakrishna
Nipputho Chelagatam (1982)
చిత్రం: నిప్పుతో చెలగాటం (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సీనారే , వేటూరి, గోపి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: కృష్ణం రాజు, శారద, జయసుధ, శరత్ బాబు, కవిత, గీత
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: కొమ్మినేని
నిర్మాత: వై. వి. రావు
విడుదల తేది: 26.03.1982Songs List:

Palli Balakrishna
Prema Simhasanam (1981)
చిత్రం: ప్రేమ సింహాసనం (1981)
సంగీతం: కె చక్రవర్తి
నటీనటులు: యన్. టి. రామరావు, రతి అగ్నహోత్రి, మంజు భార్గవి, కె. ఆర్. విజయ, ఎస్. వరలక్ష్మి
దర్శకత్వం: భీరం మస్తాన్ రావు
నిర్మాత: కె. విద్యా సాగర్
విడుదల తేది: 14.01.1981Songs List:హరి ఓం గోవింద పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ సింహాసనం (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

హరి ఓం గోవింద 
అరివీర భయంకర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ సింహాసనం (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, సుశీల 

అరివీర భయంకర లలమ్మ లాలి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ సింహాసనం (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

లాలమ్మ లాలి 
జేజమ్మ చెప్పింది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ సింహాసనం (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

జేజమ్మ చెప్పిందిచందమామ కొండెక్కింది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ సింహాసనం (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

చందమామ కొండెక్కింది ఇది ప్రేమ సింహాసనం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ సింహాసనం (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

ఇది ప్రేమ సింహాసనం 

Palli Balakrishna
Prema Kanuka (1981)
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వర రావు, శ్రీదేవి, మోహన్ బాబు, మధు మాలిని
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 1981Songs List:అయ్యారే తుంటరోడు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కోరస్: 
ఝం ఝం ఝం ఝం
ఝం ఝం ఝం ఝం ఝం ఝం
ఝం ఝం ఝం ఝం
ఝం ఝం ఝం ఝం ఝం ఝం

అయ్యారే తుంటరోడు - ఒయ్యారం సంతకాడ
వియ్యాలు సెయ్యమన్నాడే - అరే ఒలీ ఒలీ ఒలీ ఒలీ -
ఉయ్యాలే ఊగాలో – జంపాలే పాడాలో

అయ్యారే కొంటెపిల్ల ఒయ్యారం సంతకెల్లి
వియ్యాలు సెయ్యమన్నాదే - అరె ఒలీ ఒలీ ఒలీ ఒలీ
ఉయ్యాలే ఊగాలో, జంపాలే పాడాలో

చిటికినేలితో చీకటితీసి కాటుక పెట్టాడే
బొటన వేలుతో బుగ్గనుగిల్లి బొట్టుగ దిద్దాడే
వచ్చే ఎన్నెల పెదవులతోటి నొక్కి పెట్టిందే
అది ఎర్రని దొండపండై చిలకను రమ్మందే

సిలకా సిలకా కూడబలికి ....
ఆహో ఒయ్ ఆహా ....
సిటుకూ సిటుకని జాడ తెలిసి
ఊహూ ఒయ్ ఉహూ
గూడుచేరి గుస గుస లాడేయి - కోడికూసే ఏళకు లేశాయి
అరె తస్సాదియ్య కోడి కూసేఏళకులేశాయి

చిక్కని నడుముకి దారం కట్టి బొంగరమాడాలీ
చక్కెర పెదవికి బేరం పెట్టి సారం చూడాలీ
చూడాలన్నా కుర్రగాడి సత్తా చూడాలి
సుడిగాలల్లే సుట్టి సుట్టి సొమ్మ సిల్లాలి
మల్లె తీగకు సెమటలు బడితే
ఆహా
మంచే అనుకుని బ్రమలోపడితే
ఏకువ ఎలుగులు కితకిత లెట్టాలి
రేకుల రెక్కలు కిటికీ తీయాలి
అరె తస్సాదియ్య - ఏకువ ఎలుగులు కితకిత లెట్టాలి. ॥అయ్యారే ॥చెమ్మ చెక్క పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చెమ్మా చెక్కా సక్కనోడు జిమ్మా దియ్యా సిక్కనోడు
సుక్కలలో మంచమేనేనే ఓలమ్మో
పక్క చేరి మంతరించెనే 
చెమ్మా చెక్కా పక్కనమ్మ జిమ్మా దియ్యా సుక్కలమ్మ
మంచమెక్కి లంచమిచ్చేనే - ఓలమ్మో
కంచెనంట చేను మేసేనే

ఎన్నెలోడు బలేసల్లనోడు ఒంటిగుంటె కొంటెవాడు అల్లరోడు
ఎంట వుంటె ఒంటి నిండ ఎచ్చనోడు
పల్లె పిల్లా ఒట్టి పిచ్చి పిల్ల ఒప్పకుంటే రాజుకున్న అగ్గిపుల్ల
ఒప్పుకుంటె అచ్చమైన తెలుగు పిల్ల
తెలుగులోని తీపంతా తెచ్చుకున్నది
ఎలుగుతోనె రేపులా విచ్చుకున్నది
రేపటికి మాపటికి వంతెనె నాది
రెండు కలిపి సందెకాడ సొంతమై నాది 
మోజు చూడు దానిపోజు చూడు
ముద్దబంతి పువ్వులాంటి మోముచూడు
మూట గట్టి తెచ్చుకున్న ముద్దు చూడు

చూసి చూసి వాణ్ణి కాపుకాసి
కన్నెవయసు తెచ్చినాను గడియతీసి
కాపురాని కొచ్చినాను ఏళజూసి
ఏళ పాళ లేని ప్రాయమెగిరి పడ్డది
తాళమంటే తాళనని గొడవపడ్డది
గొడవపడ్డ గాలిగాడ్ని జాలి పడ్డది
జాలిపడ్డ మనసులోకి జారిపడ్డది ॥చెమ్మా చెక్కా॥మనసుల ముడి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మనసులు ముడి పెదవులు తడి
మధువుల జడి ఎద తడబడి కోటిరాగాలు పాడే
ఆ.... తనువుల వడి తపనల
తలపుల సడి ఎద అలజడి శతకోటిరాగాలు పాడే

లతవై నా జతవై గత స్మృతివై నా శృతివై
స్వరజతివై లయగతివై నను పాలించవా.....
ఒడిపై చారపడిపై నా బడిపై వరవడిపై |
నా గుడివె దేవుడివె నను లాలించవా
వలపు మెరుపు మెరిసీ – తలపు తలుపు తెరిచీ
సిరి ముగ్గులు వేయించి చిరు దివ్వెలు వెలిగించి
తొలిసారి పలికాను పలుకై
అది నువ్వే అనుకున్నా - నీ నవ్వే వెలుగన్నా
నీవు నా తోడు వన్నా
అహొహొహో నేను నీ నీడనన్నా

చెలివై నెచ్చెలివై చిరుచలివై కౌగిలివై
లోగిలో జాబిలివై నను మురిపించవా
వరమై సుందరమై - శుభకరమై ఆదరమై
సంబరమై సాగరమై నన్ను ముంచేయనా

కనులు తెరచి చూసీ కలలు నిజము చేసే
చిరునవ్వులు నవ్వించీ సిరి మువ్వలు మోగించీ
తొలిసారి పలికాను పలుకై
ఆ పలుకే ఉసిగొలిపీ పరువముతో నను కలిసి
సామగావాలు పాడే
అహాహాహో సోమగానాలు చేసే


ఈ కొండ కోనల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఈ కొండకోనల్లో నీ రెండ ఛాయల్లో - ఈ ఎండిమబ్బుల్లో నీవే
ఈ వాగువంకల్లో ఈ ఏటి తరగల్లో - తెల్లాటి నురగల్లో నేవే
ఎలుతురు నేనె అహ ఎండవు నీవే
సినుకులు నేనై అహా సిగురులు నీవై
ఎన్నాళ్ల ఎన్నేళ్ల సావాసమో ...హోయ్
ఏర్రాని సందెమ్మవో పచ్చాని సిలకమ్మవో
ఎచ్చని సలిమంటవో ఎదలోని గుడిగంటవో
రాతిరివో వలపు జాతరవో
సందడివో వయసు పందిరివో
పందిట్లో చిందేసే చిన్నారివో
చిందుల్లో చిన్నారీ కన్నయ్యవో
చిగురు కొమ్మ కోకిలమ్మ
పూలరెమ్మా కులుకులమ్మా
ఈ కొమ్మ నా సొమ్మురో
ఈ బొమ్మ పై డమ్మరో -

నేరేళ్ల తోటుందిలే సీకట్ల పాటుందిలే
నీ కళ్ల తోడుందిలే నా ఒళో సోటుందిలే
చిన్నదిలే నడుము సన్నదిలే

ఉన్నాదిలే ఉడుకుతున్నదిలే
ఉడికించి ఊరించి రమ్మన్నాడే
వచ్చాక నచ్చింది ఇమ్మన్నాడే
విచ్చుకున్న ముద్దు గుమ్మ
మెచ్చుకున్న పిచ్చిదమ్మ
ఈ బొమ్మ సీతమ్మరో
నా సొమ్ము రావయ్యరోజంతర్ మంతర్ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మాలకడి దుమ్మురేగాలి
ఓసూపు సూడాలి నీ అంతు తేలాలి
కిటుకులు సెప్పమ్మా సిటికెలసిటెమ్మా

దాసిందీ ఎన్నాళ్లు దాగుంటది – అది
కళ్లున్న మొనగాడి కంటపడతది

నీ కంట పడ్డాక నీ ఎంటే వస్తాది, – అది.
వద్దన్నా ముద్దన్నా నీ జంటే అవుతాది
తీ గట్టి లాగితే డొంకూగి పోతాది
ఏ గట్టుకెళ్ళినా నీరట్టే వుంటాది
సనుగుడు సంగయ్యా గొణుగుడు పాలయ్యా
అ గజిబిజి గంగమ్మా - గడిబిడి చెయ్యకమ్మా
తోడుంటే యాడైనా గూడుంటది
ఆ గూడేమో మనకోసం కాసుకుంటది
ఈ పూటే ఎడదామా మాపంతా వుందామా
కుదిరొస్తే ఆగూడే సొంతంగా కొందామా
సెయ్యెట్టి లాగితే గాజూడి పోతాది
చేసేది సెబితే సీకాకు పుడతాది
నసనస నరసమ్మా నకరాలాడొద్దమ్మా
నిరనిర ఈరయ్యా నికరం సేయవయ్యా
వంటచేసి చూపిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ 

వంట చేసి చూపిస్తా - పీట వేసి తినిపిస్తా
అడాళ్ల కంటే మగాళ్ల వంటే అబ్బో గొప్పది అనిపిస్తా
వంకాయ కూర, బెండకాయ పులుసు తోటకూర పప్పు
ఏది కావాలి చెప్పు ఏమి చేయాలి?
వంకాయ కూర చెయ్ బాబూ చూద్దాం....
తే తే తేతే కత్తి పీట - ఇదిగో ఇదిగో కత్తి పీట

కత్తి పీట తోటి వంకాయ కోసి ముక్కలన్ని గిన్నెలో వేసుకో
కుళాయి నీళ్లతో సుబ్బరంగ కడిగీ కండెక్కకుండా చూసుకో
పాయ్యి మీద పెట్టాలి – కింద మంట పెట్టాలి
ఆ తర్వాత ....?
చెప్తా - గ గ గ గ గరం మసాలా

మ మ మ మ మంచినూనే 
మ మ మ మ మపదపపా
కలబోసేసి కలబెట్టీసి దోర దోరగా వేపుకో
మాడకుండా చూసుకో -

ఓం నలాయ నమః ఓం భీమాయ నమః
ఓం వంటాయ మమః ఓం కూరాయ నమః
ఇదిగో వంకాయ కూర 
ఆహా

చారు కావాలి పప్పుచారు కావాలి
తే తే తే తే కందిపప్పు
ఇదిగో ఇదిగో కందిపప్పు
పప్పులోని రాళ్లు తీసి నీళ్లలోన పోలెడేసి
ఉడకేస్తే అప్పుడది ముద్దపప్పు
చింతపండు పిసికేసి పప్పు కాస్త కలిపేసి
కుత కుత లాడేట్టు మరగబెట్టు 
ఉప్పు చూసి వేయాలి పసుపు కాస్త కలపాలి
ఆ తర్వాత ....?

ప ప ప ప పచ్చి మిరపకాయ 
గ గ గ గ గపగరి గాగా
ఉ ఉ ఉ ఉ ఉల్లిపాయ 
మ మ మ మ మపదపపా
గారిమగా గపగా  మపదా దనిసా 
సానీదప మగరిస బాబూ 
కొత్తిమిరి వేసి తాళింపు వేసి మూత పెట్టి కాసుకో
పొంగకుండా చూసుకో 
ఓం నలాయనమః ఓం భీమాయ నమః
ఓం పప్పాయ నమః ఓం చారాయ నమః
ఓ నవ మధన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఓ నవ మదనా రారా నా ప్రియ వదనా రారా
సుమతరా మధుకరా- కళాసాగరా రాగసుధాకర రారా ॥ఓ వన ॥

నా నులివెచ్చని తొలి ఊపిరివి నా సుతిమెత్తని రసమాధురివి
నీ రంగులలో శృంగారాన్నీ శృంగారంలో సంగీతాన్ని
చిత్తంలో చిత్రంగా చిత్రంలో చైత్రంగా
రావే సురగంగా - రా సరళంగా
గంగాభంగ మృదంగరవంగా - భృంగీ భృంగ అభంగ స్వరంగా
ఓ ఋతు సుందరి, రావే, నా సుమ మంజరి రావే
రస ఝరీ, మాదురీ
నయన మనోహరి నటన మయూరీ రావే ఆమె ॥ఓ నవ॥

నా వాణి వీణవు కావా నా బాణికి రాణిగరావా
హా ప్రేయసి ఊర్వశి కానా
నీ వాసికి దాసిగ రావా ||నీ ప్రేయసి||

పలుకు పలుకులో వెణుకు వెణుకుతో
మినుకు మినుకులై పోమా
సానిసగా - గారిగపా
పామపసా - సానిసగా
గారిమ గరిసా సానిని పనిదస సామదసమగిరి గారిమ గరిసా
నా అంగ అంగమొక అసంగ రంగము
సాససగాగగ మామమమా
ఈ యవ్వన మొక క్షణ భంగురము
ససస నినిని దదద మమమ
ఈ అమని యామిని నీసిగ చండుగ
మదనిస నిసనిద మదమా
నీ కన్నుల నిండుగ కాముని పండుగ
మద మద దనిదమ దనిదమ దనిసా
ప్రియసఖీ శశిముఖీ నవరతీ మధుమతీ
నేనే .... - ఆ....
ప్రణయ కావ్యమై - కావ్య నాం
విరహ గీతికై - అపరి మేనకై
నిను వరించి చెలించి నీవై మోహము మించి
నాలో తాపము పెంచి నన్నే నీకర్పించి
కర్పూరాన్నై కరిగి పోనీ
కన్నెను నేటితో సతినై పోనీ
నా ఈ జన్మము ధన్యము కానీ
అన్యము లేదని ఐక్యము కానీ

Palli Balakrishna

Most Recent

Default