Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tees Maar Khan (2022)




చిత్రం: తీస్ మార్ ఖాన్ (2022)
సంగీతం: సాయి కార్తీక్ 
నటీనటులు:  ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్, సునీల్, పూర్ణ 
దర్శకత్వం:  కళ్యాణ్జీ గోగణ 
నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి 
విడుదల తేది: 2022



Songs List:



పాప ఆగవే ఆగి చూడవే పాట సాహిత్యం

 
చిత్రం: తీస్ మార్ ఖాన్ (2022)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: N.C. కారుణ్య 

పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా
పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా

పాపం కాదటె… పంతం దేనికె
తీగె తెగేదాకా లాగితే ఎలా?
ఎందుకంత కోపం
కొంచం శాంతం శాంతం
ఊపిరి ఉన్నన్నాళ్ళు
నిన్నే నేను మరిచిపోలేనులే

నేనో గాలిపటం… నువ్వే కదా దారం
ప్రాణం నీ చేతుల్లో ఉన్నాదని మరిచిపోకులే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే  నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా ఎట్టా బతకనే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే

నువ్వే నాకు మొదటి జ్ఞాపకం
మదిలో నీదే మొదటి సంతకం
నువ్వే లేని నన్ను ఊహించుకోలేను
అర్ధం చేసుకోవే అలక మానవే
నువ్వే దూరమైతే గాలాడదే నాకు
మారం చెయ్యకుండా మాటలాడవే

మహారాణి లాగ నిన్నే చూసుకుంటా
మహారాజ యోగం పట్టేదాక సమయమీయవే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే  నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా ఎట్టా బతకనే

(వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే)





సమయానికే తగు మాటాడవా పాట సాహిత్యం

 
చిత్రం: తీస్ మార్ ఖాన్ (2022)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: రాకేందు మౌళి 
గానం: యం.ఎల్.శృతి

సమయానికే తగు మాటాడవా
సరసానికి చొరవే చూపవా
ఈ చూపే నావైపే వేసిన ఎరా
ఏదేదో చేసేసెయ్ చంపుతోందిరా

మాటల్లో చెప్పేసెయ్ వీలు లేదురా
పుట్టిందే నీకోసం అంది తొందరా

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
సమయానికే తగు మాటాడవా ఆ ఆ

ఫిదా ఫిదా ఫిదా అయ్యానులే
నేను నీకు ఫిదా… సదా ఇదే కదా
మనం అనే ఏదో లోకం ఇదా

హే నేనే కుడియా హే గుడియ
మై తేరి చుడియా
ఇది మాయ వలయా
ఈ అందాలు నీవేనయా

ఏదైనా ఏమైనా ఏకమవ్వనా
కాదన్నా వద్దన్నా కౌగిలివ్వనా

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
సమయానికే తగు మాటాడవా, ఆ ఆ
సరసానికి చొరవే చూపవా, ఆ ఆ
ఈ చూపే నావైపే వేసిన ఎరా
ఏదేదో చేసేసెయ్ చంపుతోందిరా

Palli Balakrishna Tuesday, March 22, 2022
Sebastian P.C. 524 (2022)




చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం , నువేక్ష, కోమలి ప్రసాద్ 
దర్శకత్వం: బాలాజీ సయ్యపు రెడ్డి 
నిర్మాతలు: బి.సిద్దా రెడ్డి, రాజు, ప్రమోద్ 
విడుదల తేది: 04.03.2022



Songs List:



నా ప్రపంచం హేలి పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: కపిల్ కపిలన్ 

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు
నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే

నా ప్రపంచం హేలి అనే నాకు
అసలేమౌతోందో చుట్టూ తెలియదుగా
నా చిరాకే ఉంది పరారీలో
తెగ సంబరపడుతూ ఉంటా
నువ్వే కనబడగా కదలనుగా
మెదలనుగా వదలనుగా

ఎక్కడిదే ఈ వెలుగంతా నా కళ్ళలో
నీలాలలా మెరిసే నీ నవ్వులందే
ఎప్పటికీ నను బతికించే ఊపిరివే
గాలాడదే క్షణమైనా నువ్వు లేనిదే

నువ్వొచ్చాకనే కదా జీవితం అంటే తెలిసింది
అవస్థ ఉన్నా సరే నా పనికి బాధ్యత పెరిగింది
నువ్వు లేవా… నేనసలు ఏమైపోతానో జీవితము ఏమౌనో
ఎపుడైతే నీతో ఉంటానో సందడిగా ఉంటానే

నిజము తెలుపనా లేదుగా
మనసు మనసులా
జతపడు అడుగు అడుగునా
కుదురుగా మనసు నిలవదా

విడివిడినే మడగడదాం
వడివడిగా ముడిపడదాం
హా, ముడిపడదాం
విడివిడినే మడగడదాం

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు





కంటిలోని చీకటిని పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: పద్మలత 

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

నిజాలు కన్న కలల్లో
సమాధి నీ గతం
సవాలు ఉన్న కధల్లో
జవాబు జీవితం

నిరాశ ఒడిలోన పారాడక
తీరానికి దారి చూపు
ఆశ మీద దూసుకుపో పారిపోక

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

నీ వంక చూసే మసకబారు లోకం
కనకుండా చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనీకు సారం
నిశ్శబ్దం చేయు నీకోసం

దోబూచులాడే కరుకు మనసు కాలం
కరిగేలా రగులు ఆసాంతం
ఏనాటికైనా నీకు నీవే ఊతం
నీతోనే నీకు పోరాటం

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ




నీ కనులలో దాగుందా పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్

హ్మ్ మ్ మ్ మ్
నీ కనులలో దాగుందా మాయాజాలం
ఏ కదలికా లేకుండా లేదా కాలం

మనసారా మన మాటల్లో మునకేసింది
తనువారా మహదానందం చవిచూసింది
మనపై పనిలో పనిగా కధ రాసింది
మరలా మరల చదివి తెగ మురిసింది

ఎంత ప్రేమగా బిగిసింది
జంట మధ్యలో జారుముడీ

నీ కనులలో దాగుందా
మాయాజాలం
ఏ కదలికా లేకుండా
లేదా కాలం




న్యాయాన్ని కాపాడే పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్ , సాహితి గాలిదేవర 

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది

అన్యాయం వైపుండే
బంధాలే ఉన్నా కాని
సంకెళ్ళు వద్దంటే
నేరం అవుతుంది

లోకం చూడని లోపం బాధిది
లోనుండే ఇజాన్ని మోయకు
ఫ్రెండేరాయని ప్రశ్నే వేయక
సాగించే ప్రయాణమే దులుపు

మేయగా చిమ్మ చీకటి మారదే
నిజాన్ని ఓ కాంతిరేఖలా నీ చూపు
ఏమైనా కాని ధైర్యాన్ని పూని
సత్యాన్ని గెలిపించెయ్ నేడు

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది




The Rage Of Seba పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: గీబ్రాన్
గానం:  దీప్తి సురేష్ 

The Rage Of Seba

Palli Balakrishna Monday, March 21, 2022
RRR (2022)




చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
నటీనటులు: రాంచరణ్, తారక రామారావు, అలియా భట్, ఒలివియా మారిస్ 
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత: డి.వి.వి.దానయ్య 
విడుదల తేది: 07.01.2022



Songs List:



దోస్తీ పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర, యం.యం.కీరవాణి

పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి 
కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

సుమ్మరి యారే యారే యరి యారే
సొరియారి యారి యరి యరి యరె యరె

అనుకోని గాలి దుమారం 
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భూరివై
నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై

ఓ… తొందర పడి పడి ఉరుకలెత్తే 
ఉప్పెన పరుగుల హో
ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులేవో హో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

ఒక చెయ్యి రక్షణ కోసం
ఒక చెయ్యి మృత్యు విలాసం
బిగిశాయి ఒకటై ఇలాగ తూరుపు పడమర
ఒకరేమొ దారుణ శస్త్రం
ఒకరేమొ మారణ శాస్త్రం
తెరతొలగిపోతే ప్రచండ యుద్దమే జరగదా
తప్పని సరియని తరునమొస్తే జరిగే జగడంలో
వాటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ




నాటు నాటు పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడూ నా పాట సూడూ నా పాట సూడూ
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  వీర నాటు 
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు

గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు

భూమి దద్దరిల్లేలా వంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో




జననీ పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం.కీరవాణి
గానం: యం.యం.కీరవాణి & కోరస్

జననీ ప్రియ భారత జనని
జననీ 
మరి మీరు..?
సరోజిని, నేనంటే నా పోరాటం, అందులోను సగం.

నీ పాదధూళి తిలకంతో
భారం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని

జననీ, ఈ ఈ
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవని
జననీ, ఈ ఈ



కొమరం భీముడో పాట సాహిత్యం

 

చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కాలభైరవ

భీమా నిను గన్న నేలతల్లి 
ఊపిరిపోసిన చెట్టుసేమా 
పెరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా వినబడుతోందా

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో
కొమరం భీముడో కొమరం భీముడో
రగరార సూరీడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో

కాల్ మొక్కుతా బాంచన్ నని వంగీ తూగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను వంచి తోగాల
జుడుము తల్లీ పేగుకు పెరగానట్టేరో
పెరగానట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

చర్మామొలిసే దెబ్బకు అప్పంటోగాలా
చినికే రక్తం చూసి చెదిరి తోగాలా
గుబులేసి కన్నీరు వలికి తోగాలా
భూతల్లి చనుబాలు తాగనట్టేరో
తాగనట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

కాలువై పారే నీ గుండె నెత్తూరు
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు
అమ్మా కాళ్ళ పారాణౌతుంది చూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది చూడు
పుడమితల్లికి జనమ మరణమిస్తివిరో కొమరం భీముడో




రామం రాఘవం పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: విజయప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ
శరపరంపరాహ ధవళీశతం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం
నటరాజం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం




ఎత్తరా జెండా పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విశాల్ మిశ్రా, పృద్వి చంద్ర , యం.యం.కీరవాణి, సాహితి  చాగంటి, హారికా నారాయణ్ 

పరాయి పాలనపై కాలు దువ్వి 
కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ...

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే

హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే కలకత్తా కోడే
ఉజగల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే నిట్టూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే

(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)

పంతమున్న కోడే పంజాబి కోడే
దద్దెనన కోడే దంతూరి కోడే
పౌరుషాల కోడే బల్లాసి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే, హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

Palli Balakrishna Monday, March 14, 2022
Gayapadina Manasu Nadile (2019)




పాట: గాయపడిన మనుసు నాదిలె (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: రామ్-లక్ష్మణ్
గానం: రాము


గాయపడిన మనుసు నాదిలె పాట సాహిత్యం

 
పాట: గాయపడిన మనుసు నాదిలె (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: రామ్-లక్ష్మణ్
గానం: రాము

గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకూ గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే

ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా...
ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా
ఒక్కసారైనా కల్లో నేనొస్తానా...

గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే

మోసం జేస్తివే నన్ను నువ్వు
పిచ్చిగా నమ్మితే నిన్ను నేను
మాటలు చెప్తివే ఎన్నో నువ్వు
నీతిని మరిచవే నిన్ను నీవ్వు

మనసును విరిచింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మానే
గుడ్డిగా నిను ప్రేమించానే

మనసును విరిచింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మానే
గుడ్డిగా నిను ప్రేమించానే

నువ్వేలే...నువ్వేలే...నన్నిట్ఠా ముంచావే!

దారంలా నన్ను నువ్వు తెంపినావే
నా ప్రాణం ఏ నువ్వు తట్టుకోదు
మిగిలిందే ఇలా ఎద కొత
ఏమను కుందునే నా రాత

బంధాన్ని తెప్పించి నువేలే
భారాన్ని వేసింది నువేలే
మౌనం లో ముంచింది నువేలే
మాటల్తో కాల్చింది నన్నెలే

బంధాన్ని తెప్పించి నువేలే
భారాన్ని వేసింది నువేలే
మౌనం లో ముంచింది నువేలే
మాటల్తో కాల్చింది నన్నెలే

నువ్వేలే...నువ్వేలే...నా ప్రాణం నువ్వేలే!

గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకూ గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే

Palli Balakrishna
Nuvvante Pichi Neekosam Sache (2019)




పాట : గుర్తుకొచ్చినప్పుడల్లా (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: లక్ష్మణ్
గానం: రాము


గుర్తుకొచ్చినప్పుడల్లా (నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే) పాట సాహిత్యం

 
పాట : గుర్తుకొచ్చినప్పుడల్లా (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: లక్ష్మణ్
గానం: రాము

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గాయాలు చేశావు ఈ జన్మకు
భారాన్ని వేశావు నా జన్మకు
బంధాన్ని తెంపావు ఈ జన్మకు
మరుపంటు రావమ్మ ఏ జన్మకు

మారిపోయావే ఓ పిల్లా
మరచిపోయావే నన్నిల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

ఏం చేశానే నేనే నేరం
నేనేం చేశానే నీకే ద్రోహం
ఏం చేశానే నేనే నేరం
నేనేం చేశానే నీకే ద్రోహం

కాకపోవచ్చే నేను అందగాడిని
లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే
కాకపోవచ్చే నేను అందగాడిని
లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే

నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే
ప్రాణమే నాది కాదా...
ఊరంచు వాగుల్లో అలల నడుమ
నేనీదుతుండంగా ఈత
వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళుతుంటే
నను చూసి పెట్టిన కూత

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

ఎందుకే అంతలా ప్రేమ చూపినావలా
అందుకే ఇంతలా నొప్పి గుండెలోపల
ఎందుకే అంతలా ప్రేమ చూపినావలా
అందుకే ఇంతలా నొప్పి గుండెలోపల
నిన్ను చూసినప్పుడే ఛీ అంటే పోవునే
బాధనే వుండపోవునే

నా పేరు నీ చేతిమీద చూసి
మీ నాన్న పెట్టంగ వాత
అమ్మా అనే అరుపే మరచి
నా పేరు వచ్చే నీ నోట

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

Palli Balakrishna
Laire Lallaire (2021)




పాట : లాయిరే లల్లాయిరే 
సంగీతం: మదీన్ S. K
సాహిత్యం: తిరుపతి మట్ల 
గానం: మంగ్లీ


లాయిరే లల్లాయిరే పాట సాహిత్యం

 
పాట : లాయిరే లల్లాయిరే 
సంగీతం: మదీన్ S. K
సాహిత్యం: తిరుపతి మట్ల 
గానం: మంగ్లీ

వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు
వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు

చీరకట్టులోన ముద్దా మందారాలు
చీరకట్టులోన ముద్దా మందారాలు 
ముగ్దులైపోయేనమ్మా చూసే కళ్ళు
వలపులొలుకుతున్నయే  వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే  సింగారాలు

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

సింగిడిని తొలచి  రంగు చీరలుగా మలిచి
బంగారు మేనికి  సొగసులద్దుకున్నరే, హంగులు దిద్దుకున్నరే
సీతాకోకచిలుకలు  ఆ చిన్ని లేడీ పిల్లలు
అందాల బామలయ్యి  కనువిందు చేసిరే, ముస్తాబు చూడరే
కంచిపట్టు చీర కట్టి కన్నెపిల్లలు  అర్రే, కంచిపట్టు చీర కట్టి కన్నెపిల్లలు
అబ్బా..! ఆడనెమలి తీరు ఆటలాడుతున్నరూ

వలపులొలుకుతున్నయే… వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే… సింగారాలు (2)

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

పుట్టింటా పట్టుచీర  మెట్టినింటా అడుగుపెట్టి
నట్టింటా తిరుగుతుంటే సందడులాయే  తియ్యని సంబురమాయే
ముగ్ధా చీరాల చాటున  దాగిన ముచ్చటలెన్నో
చిరునవ్వుల తెరచాటున  మదినే దోచే, మనసైనోళ్ళను గెలిచే
జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు  జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు
అందాలు ఆరబోసుకున్న సుందరాంగులు

వలపులొలుకుతున్నయే… వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే… సింగారాలు (2)

లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయి లాయి లాయిరే

Palli Balakrishna
Lachimi Naa Chinni Lachimi (2019)




పాట: లచ్చిమి నా చిన్ని లచ్చిమి  (2019)
సంగీతం: 
సాహిత్యం: పత్తిపాటి రమనాకర్
గానం: శంకర్ బాబు 


లచ్చిమి నా చిన్ని లచ్చిమి పాట సాహిత్యం

 
పాట: లచ్చిమి నా చిన్ని లచ్చిమి  (2019)
సంగీతం: 
సాహిత్యం: పత్తిపాటి రమనాకర్
గానం: శంకర్ బాబ

అబ్బబ్బా లచ్చిమి నా చిన్ని లచ్చిమి
రాయే రాయే  జర రాయే రాయే

హోయ్ లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

హోయ్ లాయి లాయి లబ్బరు బొమ్మావే
లవ్ సక్కాదనమోలే ఉన్నావే

లచ్చిమి... లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నీ దొండపండు పెదవులు రమ్మన్నయే
నీ దోర వయసు దోచుకోమ్మన్నయే
నీ దొండపండు పెదవులు రమ్మన్నాయే
లచ్చిమి
నీ దోర వయసు దోచుకోమ్మన్నయే

నీ హంస నడకలో అందమున్నదే
నిన్ను చూస్తే పాణం జివ్వమంటున్నాదే
నీ హంస నడకలో అందమున్నదే
నిన్ను చూస్తే పాణం జివ్వమంటున్నాదే

లచ్చిమి.. లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నీ కందిరీగ నడుము కవ్వించెనే
నీ కనుసైగలు కైపె ఎక్కించెనే లచ్చిమి
నీ కందిరీగ నడుము కవ్వించెనే
నీ కనుసైగలు కైపె ఎక్కించెనే
నీ వాలు జడ వయ్యారం చూస్తనే
నా మనసంతా ఐసై పాయేనే లచ్చిమి
నీ వాలు జడ వయ్యారం చూస్తనే
నా మనసంతా ఐసై పాయేనే

ఓ లచ్చిమి... లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నీ సొగసులిస్తనంటే పిల్లా నాకు
నా ఆస్తి పాస్తి రాసిస్తా నీకు లచ్చిమి
నీ సొగసులిస్తనంటే పిల్లా నాకు - లచ్చిమి 
నా ఆస్తి పాస్తి రాసిస్తా నీకు

నీకు నాకు ఒకటే తమలపాకు
నువు లేచొస్తే తాళి కడతా నీకు నీకు నీకు
నీకు నాకు ఒకటే తమలపాకు
నువు లేచొస్తే తాళి కడతా నీకు

ఒరేయ్...ఒరేయ్...
లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నువ్వు చీర కట్లో సూపరుగున్నావే
ఓర చూపుల్తో చంపేస్తున్నావే
నువ్వు చీర కట్లో సూపరుగున్నావే
ఓర చూపుల్తో చంపేస్తున్నావే
నీ కిలకిల నవ్వులు మస్తుగున్నయే
నా కలలకస్తే ఖతర్నాక్ గున్నావే లచ్చిమి
నీ కిలకిల నవ్వులు మస్తుగున్నాయే - లచ్చిమి
నా కలలకస్తే ఖతర్నాక్ గున్నావే

అరెరెయ్...లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

అబ్బా... ప్లీజే.... 

లచ్చిమి నా చిన్ని లచ్చిమి 
ప్లీజే....
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ
లాయి లాయి లబ్బరు బొమ్మావే
లవ్ సక్కదనమోలే ఉన్నావే
లాయి లాయి లబ్బరు బొమ్మావే
లవ్ సక్కదనమోలే ఉన్నావే
ఓ లచ్చిమీ...

Palli Balakrishna Sunday, March 13, 2022
Naadi Aada Janme (1965)




చిత్రం:  నాదీ ఆడజన్మే (1965)
సంగీతం:  ఆర్. సుదర్శనం 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు 
దర్శకత్వం: ఏ.సి.త్రిలోక్ చందర్ 
నిర్మాత: ఎస్.వి.రంగారావు 
విడుదల తేది: 07.01.1965



Songs List:

Palli Balakrishna Sunday, March 6, 2022
Vali Sugriva (1950)




చిత్రం: వాలి సుగ్రీవ  (1950)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి, శ్రీరంజని, రావు బాలసరస్వతి దేవి, చిలకలపూడి సీతారామాంజనేయులు, గరికపాటి రాజారావు, కాళ్ళకూరి సదాశివరావు, ఎ.వి.సుబ్బారావు,
దర్శకత్వం: జంపన చంద్రశేఖరరావు
నిర్మాత: ఎస్.భావనారాయణ
విడుదల తేది: 02.04.1950



Songs List:



కళావిలసమే ప్రేమ పాట సాహిత్యం

 

చిత్రం: వాలి సుగ్రీవ  (1950)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖరరావు
గానం: ఘంటసాల, ఎస్.వరలక్ష్మి

కళావిలసమే ప్రేమ



బ్రతుకే నిరాశ పాట సాహిత్యం

 
చిత్రం: వాలి సుగ్రీవ  (1950)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జంపన చంద్రశేఖరరావు
గానం: ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి,

బ్రతుకే నిరాశ

Palli Balakrishna
Parvathi Kalyanam (1958)




చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం:ఘంటసాల
గానం: ఘంటసాల, పి.లీల, పి.సుశీల 
నటీనటులు: టి.కృష్ణ కుమారి, చిత్తూరు వి.నాగయ్య 
నిర్మాత, దర్శకత్వం: కోవెలమూడి భాస్కరరావు 
విడుదల తేది: 26.12.1958



Songs List:



కరకుతనమున కాలికి పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: పి.సుశీల 

కరకుతనమున  కాలికి




జయ జయ సుందర నటరాజా పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: పి.లీల

జయ జయ సుందర నటరాజా




నీ మనోహరుడైన హరుడే పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: పి.లీల

నీ మనోహరుడైన హరుడే





వివరించుమా విభుడాలించగా పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: పి.లీల

వివరించుమా విభుడాలించగా




కైలాసపతి రూపు (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల

కైలాసపతి రూపు  (పద్యం)




నమస్తే శరణ్యే శివ పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల

నమస్తే శరణ్యే శివ 




మేలుకోవయ్యా కరుణా నన్నేలుకోవయ్య పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం:  

మేలుకోవయ్యా కరుణా నన్నేలుకోవయ్య 





లోకవిరోదుల సృజియించి పాట సాహిత్యం

 
చిత్రం: పార్వతి కళ్యాణం (1958)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల

లోకవిరోదుల సృజియించి 

Palli Balakrishna
Anantha Ragalu (1982)




చిత్రం: అనంత రాగాలు (1982)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల, శైలజా
నటీనటులు: రాజ్యలక్ష్మి , పూర్ణిమ , రోహిణి , మోహన్ 
దర్శకత్వం: ప్రభాకర్ 
నిర్మాతలు: కె.ఆర్.యన్.రెడ్డి , బి.యన్.జి.నాయుడు 
విడుదల తేది: 1982



Songs List:



తారాడే సిరి జాబిల్లి తళుకే పాట సాహిత్యం

 
చిత్రం: అనంత రాగాలు (1982)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  శైలజా

తారాడే సిరి జాబిల్లి తళుకే 




తొలి కోడి పలికింది పాట సాహిత్యం

 
చిత్రం: అనంత రాగాలు (1982)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల

తొలి కోడి పలికింది 




అనంత రాగం పాట సాహిత్యం

 
చిత్రం: అనంత రాగాలు (1982)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

అనంత రాగం 




జోలాలి రామ జోలాలి పాట సాహిత్యం

 
చిత్రం: అనంత రాగాలు (1982)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల

జోలాలి రామ జోలాలి 



లోకమే సందేహము పాట సాహిత్యం

 
చిత్రం: అనంత రాగాలు (1982)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

లోకమే సందేహము 




తారాడే సిరి జాబిల్లి తళుకే పాట సాహిత్యం

 
చిత్రం: అనంత రాగాలు (1982)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  శైలజా

తారాడే సిరి జాబిల్లి తళుకే 

Palli Balakrishna
Akka Mogudu Chelleli Kapuram (1983)




చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర , సహాయకులు: సోమరాజు, కోటి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
గానం: యస్.పి.బాలు, సుశీల, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: చంద్రమోహన్,  ప్రభ , జయమాలిని 
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: యు.యస్.ఆర్.మోహనరావు
విడుదల తేది: 14.01.1983



Songs List:



దాసుడి తప్పులు పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, సుశీల

దాసుడి తప్పులు 




మరచిపో నీ గతాన్ని పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: సుశీల

మరచిపో నీ గతాన్ని 




పిలచి పిల్లనిస్తానంటే పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, సుశీల

పిలచి పిల్లనిస్తానంటే 




సారాయి తాగితే పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

సారాయి తాగితే 



వస్తావా ఒక నిమిషం నాతో పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, సుశీల

వస్తావా ఒక నిమిషం నాతో 

Palli Balakrishna
Agni Poolu (1981)




చిత్రం: అగ్ని పూలు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ (All)
నటీనటులు: కృష్ణం రాజు, జయప్రద, జయసుధ, 
దర్శకత్వం: కె.బాపయ్య 
నిర్మాత: డి.రామానాయుడు 
విడుదల తేది: 12..03.1981



Songs List:



అబ్బాయి అబ్బాయి నువ్వెంత పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని పూలు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, సుశీల 

అబ్బాయి అబ్బాయి నువ్వెంత 




ప్రియుడా పరాకా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని పూలు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం:  సుశీల 

ప్రియుడా పరాకా 



వయసు కోతివంటిది పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని పూలు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం:  యస్.పి.బాలు, సుశీల 

వయసు కోతివంటిది 



యమునానది తీర పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని పూలు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం:  సుశీల 

యమునానది తీర 



ఇది విస్కీ అది బ్రాందీ పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని పూలు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం:  యస్.పి.బాలు 

ఇది విస్కీ అది బ్రాందీ



బృందావని గోపిక పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని పూలు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం:  సుశీల 

బృందావని గోపిక

Palli Balakrishna

Most Recent

Default