Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aadavallu Meeku Johaarlu (2022)
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: శర్వానంద్, రస్మిక మందన్న
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: 25.02.2022Songs List:ఆడాళ్ళు మీకు జోహార్లు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవీశ్రీప్రసాద్

హే లక్ష్మమ్మో పద్మమ్మో
శాంతమ్మో శారదమ్మో
గౌరమ్మో కృష్ణమ్మో
నా బాధే వినవమ్మో

ఈ గోలే ఏందమ్మో
ఈగోలే చాలమ్మో
ఓలమ్మో ప్లీజమ్మో
నా బతుకే బుగ్గయ్యేనమ్మో

నీ మొగుడేమన్నా మహేష్ బాబా
పోనీ అందానికేమైనా బాబా
చైలా..! కాపురం చైలా
కన్లా..! ఇద్దర్ని కన్లా

పోనీ నువ్వేమన్నా కత్రీనా కైఫా
నీ చూపేమన్నా గుచ్చే నైఫా
కానీ, చైలా..! కాపురం చైలా
మీరు కన్లా..! ముగ్గుర్ని కన్లా

మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి
పూలన్నీ జళ్ళోన ముడిసేత్తారా
నాకేమో ఏ పూలు లేకుండా సేసేసి
ఫూల్లాగ మడిసెత్తారా..?

ప్రతి మొగాడి విజయం వెనక
ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని
చెడగొట్టడానికి ఎందరు ఆడాల్లో

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండు
పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నన్నే చూసి
సెల్లమ్మేదని అనడా, మరి అనడా

సాయంత్రమైతే సందు శివర
పువ్వుల కొట్టు సుబ్బన్న
మల్లెలు తీసుకెళ్ళి సెల్లెలుకిమ్మని
వెయ్ డా, జోకులు వెయ్ డా

మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా
సిరునవ్వులొలికించి ఎదురొత్తారా
నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి
ఇవ్వనియ్యకుండా ఆపెత్తారా

ఎదురింట్లోన ఎంకయ్య తాతకి
ఇద్దరు పెళ్ళాలు
అరె, లేనే లేదు నా తలరాతకి
సింగిలు ఇల్లాలు

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దుర లేపే
పెళ్ళాం కావాలని ఉండదా
డిన్నరు పెట్టి డ్రీమ్స్ లోకి
నెట్టే డ్రీమ్ గర్ల్ నాకు కావాలని పించదా

తన ఒళ్ళో వాలి ఓటీటి చూడాలి
అని నాక్కుడా ఉండదా
ఆకలి వేస్తే తనకో ఆమ్లెట్
వేయాలనిపించదా, నాకనిపించదా

మీరేమో మీ మొగుడు పండక్కి
కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేత్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా
నా పెళ్లి హాంఫట్టు సేసేత్తారా

అరె గంతకి తగ్గ బొంతని సామెత
మీరే సెబుతారే..!!
నా రేంజికి తగ్గా పిల్లని తెస్తే
ఓకే చెప్పరే..!!

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు, హ
ఓ మై ఆద్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజిన్ నిజార్

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే 
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా 
ప్యారంటూ పలికేనే

ఓ ఓ ఓ - తేరే జైస కోయి నహీ
ఓ ఓ ఓ - మేరే జైసా దివానా నహీ
ఓ ఓ ఓ - రూటే గీసా ప్రయాణానికి
నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

గూగుల్ మ్యాపుకే దొరకని చోటుకే
నడవని బండినే మనతో
వీక్ డే సాటర్డే‌ బేధమే తెలియని
ప్లేసునే వెతకని నీతో

సరదాగా షికారు అంటూ
కొలంబసే కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే
కనుగొందాం మనమీ జర్నీలో
ఓ లవ్ దేశం..!!

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

వేమన పద్యమే, షేక్స్పియర్ కావ్యమే
నువ్వు ఏం చెప్పిన కవితే
లాస్ట్ బాల్ సిక్సరే, షూర్ షాట్ హిట్టురే
నువ్వు ఏం చేసిన గెలుపే

అందగా ఉంటావంటూ ఎవరెవరో అంటారే
అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె
అసలందం ఇవాళ చూసానే అది నీ నవ్వే

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనేఆసమ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్ 

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

బాగున్నావా అని నువ్వడిగావా
నా బాధలన్నీ పారిపోవడం, ఆసమ్
భోంచేశావా అని ఓ మాటన్నావా
నా ఆకలే మాయమవ్వడం, ఆసమ్

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

ఇంత కాలము… ఇన్ని రాత్రులు
ఎలాగ నువ్వల్లే కబుర్లే లేక
కాలం వ్యర్థమాయనే

ఇన్ని రోజులు… రెండు కళ్ళలో
ఇలాగ కలల్నే కథల్నే
చూసే వీలే లేకపోయెనే

నువ్వు నన్ను కలవమన్న
చోటు ఎక్కడున్నా
ఓ గంట ముందే నేను రావడం, ఆసమ్

ఇంటి వరకు సాగనంపి
వీడుకోలు అన్న వెంటనే
ఫోన్లో కలవడం, ఆసమ్

నాకెంత నచ్చినా… నీ ఇంత నచ్చని
దేన్నైనా ఛీ అంటూ… ఛా అంటూ
నీతోటి ఏవోటి తిట్లు కల్పనా

ఏ పనొచ్చినా… మా అమ్మే చెప్పినా
నాతోటి నీకేదో పనుంది అన్నానో
నీవైపే పరుగు తియ్యనా

నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం, ఆసమ్
తాజ్ మహల్ అందం అంటూ
నువ్వు పొగుడుతుంటే
షాజహాన్ ని నేనే అవ్వడం, ఆసమ్

మేల్కొన్నావా అని నువ్వు అడిగావా
నా నిద్ధరే సారీ చెప్పడం, ఆసమ్
తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా
ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం, ఆసమ్

మాంగల్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: దేవీశ్రీప్రసాద్
గానం: జేస్ప్రీత్ జస్జ్

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా
నా గూడు మొత్తం కూల్చేసినారు
ఏడడుగులు నడవనివ్వకుండా
ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు

రింగులో ఫింగర్ పెట్టనివ్వకుండా
నా లైఫులో ఫింగర్స్ పెట్టేస్తున్నారు
అరుంధతి నక్షత్రం బదులు
చుక్కలు చూపిస్తున్నారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం ఓం
ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

జీలకర్ర బెల్లం బదులు
నా నెత్తి మీద టోపీ పెట్టారు
దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా
నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు

ఫస్ట్ నైటే నాకు లేకుండా
ఫ్రస్ట్రేషన్ నైట్సు గిఫ్టుగిచ్చారు
హనీమూన్ కెళ్ళి డ్యూయెట్ పాడకుండా
ఫుల్ మూన్లో సోలోగా పడుకోబెట్టారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం
కలగా కలగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: మహాలింగం 

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ దరో చేరాలని
మొదలైన ఈ ప్రయాణమే
ఏ ధరి దరిచేరక ఏ వైపు సాగునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ గుండెది ఏ భారమో
ఈ మనసుకే తెలిసేదెలా
ఏ కన్నుది ఏ శోఖమో
ఈ చూపుతో చూసేదెలా

తెలియదు ఏ పదాలు
రెండు ముడిపడునో
ఏ క్షణాన విడిపోవునో
తెలుపవు ఏ స్వరాలూ
తీపి పాటౌనో టెన్ టు ఫైవ్
వేధనల్లే వేధించునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

Palli Balakrishna Monday, February 14, 2022
Charitha Kaamakshi (2022)
చిత్రం: చరిత కామాక్షి (2022)
సంగీతం: అబూ
నటీనటులు: అభయ్ బేతగంటి, దివ్య 
దర్శకత్వం: స్త్రీలంక చందు సాయి 
నిర్మాత: 
విడుదల తేది: 2022Songs List:చిరు బిడియం పాట సాహిత్యం

 
చిత్రం: చరిత కామాక్షి (2022)
సంగీతం: అబూ
సాహిత్యం: మనోహర్ పోలిశెట్టి 
గానం: చిన్మయి శ్రీపాద 

చిరు బిడియం మదిలో మోమాటం
చిన్న భయం ఎదలో ఆరాటం
తొందరగా తగదని నెమ్మదిగా
తికమలా త్రోవలో

ఆ వైపుగ… ఈ వైపుగ
అడుగులు పడుతున్నా
ఆ పని అని… ఈ పని అని
తడబడుతున్నా

తన మనిషికి పని తెలుపుట
తప్పేం కాకున్నా
ఏంటిదీ ఈ వింతా, ఆ ఆఆ ఆ

మ్ మ్ మనసంతా ఏదో మోమాటమే
ఎద అంత ఏదో ఓ ఆరాటమే
పదపద అని సాగేనే అతి వేగమే
ఒద్దొద్దని ఆపేనే చిరు బిడియమే

నీ మాటలు లిపి మూటలు నా నవ్వులు
నవ్వులకు తోడాయే చిరు సిగ్గులు
నీ పలుకులు నా కులుకుని పిలిచాయిలా
నాలోని నువ్వే నిండావిలా

నీ మాటలు నా మాటలు
కలిసిన ఈ వేళా
నిండావా నాలోనే
నీ కబురులు నా కబురులు
కట్టిన ఈ కోట… మనదేగా, మనదేగా

Palli Balakrishna
Aakasa Veedhullo (2022)
చిత్రం: ఆకాశ వీధుల్లో (2022)
సంగీతం: జుదా శాండీ
నటీనటులు: గౌతం కృష్ణ , పూజిత పొన్నాడ 
దర్శకత్వం: గౌతం కృష్ణ 
నిర్మాతలు: మనోజ్ జె.డి., డి.జె.మణికంట
విడుదల తేది: 2022Songs List:అయ్యయ్యో అయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశ వీధుల్లో (2022)
సంగీతం: జుదా శాండీ
సాహిత్యం: గౌతం కృష్ణ , రాకేందు మౌళి 
గానం: సిద్ శ్రీరామ్

అయ్యయ్యో అయ్యయ్యో శిలగా ఇలా నేనే మిగిలానుగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశ వీధుల్లో (2022)
సంగీతం: జుదా శాండీ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: కాలభైరవ

శిలగా ఇలా నేనే మిగిలానుగా
జతగా నువ్వే లేని ఏకాకిగా

సిలగా ఇలా నేనే మిగిలానుగా
జతగా నువ్వే లేని ఏకాకిగా
ఎదలో నీవేగా కలలా మరుగైనావా
రావే నా నీవే నీడై తోడై రావా

రేగే విషాదమేదో
నాలో ఎదలో నీ ఊహే
దిగులే పోనేపోదే
మదినే మరచితివేలా
నీడై తోడై రావా

నా చూపే నీకోసం వెతికింది
నా గుండె నీ పేరే పలికింది
నా శ్వాసే నిట్టూర్పై రగిలింది
నా ఆశే శూన్యంగా మిగిలింది

మనసే ఏ వైపో పోతే
బతుకే బరువాయెనే
కనులా నీడైనావా
నీడై తోడై రావా

సిలగా ఇలా నేనే మిగిలానుగా
జతగా నువ్వే లేని ఏకాకిగా

Palli Balakrishna
Jagannatakam (2022)
చిత్రం: జగన్నాటకం (2022)
సంగీతం: వి.కిరణ్ కుమార
నటీనటులు: పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్, అప్రిత లోహి , శ్రీను పెనుమూడి , ప్రసన్న పుష్పమాల 
దర్శకత్వం: రాజ్ అల్తాడ 
నిర్మాత: YVKS క్రియేషన్స్
విడుదల తేది: 2022Songs List:ముడివేసేశావే పాట సాహిత్యం

 
చిత్రం: జగన్నాటకం (2022)
సంగీతం: వి.కిరణ్ కుమార
సాహిత్యం: హరిబాబు కర్రి 
గానం: తేజు .ఆర్

ముడివేసేశావే మెడలోని తాళి
వయసాడుకోలేని ఆటలో

ఎద పరుగాపేవే కధ కదిలేసాకే
మది గది మూసెయ్యాలే

తనలో లేని… తలపే తేని
పనిలో పారే నీరే
బిడియం నేడే బదులైపోయే
విషయం నీలో చేరే

నీలోనే ప్రాణాల పరుగే మొదలాయే
చితి దాకా చెదిరేనా ప్రేమే

పడినే నీ రూపం ఒడిలోనే
భారాలే పోయేలా

గతమే తననే వెతికేమని నీతో
నిమిషం నిమిషం తెలిపే
వెతికే కనులే బతికేదాకా
నా ఊరు పెద్దాపుర పాట సాహిత్యం

 
చిత్రం: జగన్నాటకం (2022)
సంగీతం: వి.కిరణ్ కుమార
సాహిత్యం: కె.శేఖర్ 
గానం: గీతామాధురి 

ఈ గోదావరి జిల్లాల్లో
ఏడ జాతర జరిగినా

మీ కుర్రాళ్లని కిర్రెక్కించే
ఖిలాడిని నేనేగా
 
సర్లేగాని నీ ఊరేంది
నీ పేరేంది
అసలు నీ కదేందే

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరాధారం

నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం

పట్టి మంచము వేసుంచా
పాలు పళ్ళు పెట్టుంచా

పట్టి మంచము వేసుంచా
పాలు పళ్ళు పెట్టుంచా
నా యవ్వారాలు ఎరువిస్తాను రారా

నువ్వొక్కసారి
నువ్వొక్కసారి

నువ్వొక్కసారి వచ్చి
వదిలించుకోరా పిచ్చి
 
నువ్వొక్కసారి
నువ్వొక్కసారి

నువ్వొక్కసారి వచ్చి
వదిలించుకోరా పిచ్చి

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరాధారం

నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం

నా కన్నవారు
ఎపుడో ముసలోడికి కట్టేశారు

నను కట్టుకున్నవాడు
అందరిలో వదిలేసాడు

పాలకొల్లులో పక్కేసా
పర్మనెంటుగా వచ్చేసా

పాలకొల్లులో పక్కేసా
నే పర్మనెంటుగా వచ్చేసా
నా పరువాలన్ని పంచిస్తాను రారా

నువ్వొక్కసారి
నువ్వొక్కసారి

నువ్వొక్కసారి వచ్చి
వదిలించుకోరా పిచ్చి

నువ్వొక్కసారి వచ్చి
వదిలించుకోరా పిచ్చి

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరాధారం

నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం

పుట్టుకతోనే నేను
గోదారికి ముద్దయ్యాను

మా గల్లీ కుర్రవాళ్ళు
నన్ను లిల్లీపువ్వంటారు

ఆ చాటుకొస్తే నా చోటు
నీ మాటమీదే నా రేటు

ఆ చాటుకొస్తే నా చోటు
నీ మాటమీదే నా రేటు
ఆ స్వర్గాలన్నీ చూపిస్తాను రారా

నువ్వొక్కసారి
నువ్వొక్కసారి

నువ్వొక్కసారి వచ్చి
వదిలించరా నా పిచ్చి

నువ్వొక్కసారి వచ్చి
వదిలించరా నా పిచ్చి

నువ్వొక్కసారి
వచ్చి వదిలించుకోరా పిచ్చి

నువ్వొక్కసారి వచ్చి
వదిలించరా నా పిచ్చి

పెద్దాపురం పాప
నీకెందుకంత కాక నేపెట్టిస్తా కేక

అంతా అయినాక నువ్వనకే
ఛీ పోక

ఆ ఆ ఆఆ
హే రాయే ఇకమనిషీ మనిషీ పాట సాహిత్యం

 
చిత్రం: జగన్నాటకం (2022)
సంగీతం: వి.కిరణ్ కుమార
సాహిత్యం: రాంబాబు గోసాల 
గానం: హేమచంద్ర 
 
మనిషీ మనిషీ
విసిరావే ఓ చూపే పాట సాహిత్యం

 
చిత్రం: జగన్నాటకం (2022)
సంగీతం: వి.కిరణ్ కుమార
సాహిత్యం: రాంబాబు గోసాల 
గానం: సాయి చరణ్, దివ్యా మాలిక 

విసిరావే ఓ చూపే గుండెల్లో తగిలే
పడిపోయానే నీ వలలో నిజమే
మెరిసేనే నీలాగే కన్నుల్లో కలలే
జత కలిసేనే నీ ప్రేమే వరమే

యదలో మౌనం (యదలో మౌనం)
పిలిచే తరుణం (పిలిచే తరుణం)
బిగిసే బంధం (బిగిసే బంధం)

నా ఊహకే ఊపిరే నువ్వనీ
ఒట్టేసిలా చెప్పనా ఇపుడే
నువు సూటిగా బదులివ్వవే అవుననీ
నీలో సగం నేననే క్షణమే

నా మనసే నీకే సొంతం
నా మనసే నీకే సొంతం
నా మనసే నీకే సొంతం
నీ సొంతం టెన్ టు ఫైవ్

నా మనసే నీకే సొంతం
నా మనసే నీకే సొంతం
నా మనసే నీకే సొంతం
నీ సొంతం టెన్ టు ఫైవ్

నీ హృదయం కడలైతే
నేనేమో నదిలాగ
నీకోసం పరుగవనా ప్రతి నిమిషం
నువ్వే మేఘం అయితే
నీలాకాశంలాగా నిన్నే చూస్తూ ఉన్నా ఆసాంతం

అలజడులేవో నాలో మొదలాయే
కలవరమై నా నిదురే చెదిరేనే
అడుగేసా నీ వెనకే
పయనాలే నీతోనే
కడవరకు నీడల్లే ఉంటానే

నా మనసే నీకే సొంతం
నా మనసే నీకే సొంతం
నా మనసే నీకే సొంతం, నీ సొంతం

Palli Balakrishna
Mr Pregnant (2022)
చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
నటీనటులు: సయ్యుద్ సోహెల్, రూపా కొడువాయుర్, సుహాసిని
దర్శకత్వం: వింజనంపతి శ్రీనివాస్
నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవి రెడ్డి
విడుదల తేది: 2022Songs List:హే చెలీ అడిగానే కౌగిలి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, లలితా కావ్య

ధీం దిన దిననా ధీం దిన దిననా
ధీం దిన దిననా దిన దిననా
ధీం దిన దిననా ధీం దిన దిననా
తానెన నెనెన తానెన నెనెన

హే చెలీ అడిగానె కౌగిలి
తియ్యగా తీరాలి ఈ చలి
హే సఖి విరహాలు దేనికి
చేరవ అడుగేసి చెంతకీ

నీ మాటలో తీపి ఏ తాపమో రేపి
నీ చూపు చేజాపిన చూపునే ఆపి

వర్షం గొడుగూ జంట
దారి అడుగూ జంట
నువ్వు నేనేనంటా ప్రేమ కవితే
ఒకరే ఒకరై మనమే
ఒకటే పయనం మనమే
విడిగా అడుగే పడని జతగా మనమే

ధీం దిన దిననా ధీం దిన దిననా
ధీం దిన దిననా దిన దిననా
ధీం దిన దిననా ధీం దిన దిననా
తానెన నెనెన తానెన నెనెన

ధీం దిన దిననా ధీం దిన దిననా
ధీం దిన దిననా దిన దిననా
ధీం దిన దిననా ధీం దిన దిననా
తానెన నెనెన తానెన నెనెన

నువ్వు విడిచే ఈ క్షణం
నాకు గురుతయ్యే క్షణం
మరుక్షణంకై వీక్షణం
మనదే ఈ కథనం

ప్రళయ కలహం ఓ క్షణం
ప్రణయ విరహం ఓ క్షణం
మన ప్రయాణం ప్రతీ క్షణం
మలుపెరుగని పయనం

హే చెలీ అడిగానె కౌగిలి
తియ్యగా తీరాలి ఈ చలి
హే సఖి విరహాలు దేనికి
చేరవ అడుగేసి చెంతకీ

నీ మాటలో తీపి ఏ తాపమో రేపి
నీ ఊపిరే గుండెసవ్వళ్ళలో నింపి

వర్షం గొడుగూ జంట
దారి అడుగూ జంట
నువ్వు నేనేనంటా ప్రేమ కవితే
ఒకరే ఒకరై మనమే
ఒకటే పయనం మనమే
విడిగా అడుగే పడని జతగా మనమేఏమైనదో తెలిపేదెలా పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: శుభం విశ్వనాధ్
గానం: యాజిన్ నిజార్ 

ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా
నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా
చూసానిలా నీ జతలో

నీ పిలుపు కాదా మధురం
ఈ మలుపు పేరే ప్రణయం
నీ కనులు కంటూ నయనం
నను మరిచిపోయే హృదయం

ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా
నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా
చూసానిలా నీ జతలో

కదిలే కాలాన్నే ఆపానే
ఇదిగో ఈ జన్మ రాసానే
వెతికా నన్నింకా నీలోనే
కలలే కంటాను నీతోనే

నేనిప్పుడే నీ గుండెపై
చేశానుగా తొలి సంతకం
ఇక ఎప్పుడూ నీలో సగం నేనే కదా
కనులెప్పుడూ గుర్తించనీ
నీ కలలనే నేనీ క్షణం

కన్నానులే నీ ధ్యాసలో నాలోకమే నీవై
పుడమిని తాకి మురిసిపోదా
కరిగిన మబ్బు మొదటిసారి
మానసిక తెలిసి కలిసి పోదా
చెరిసగమైన కొత్త దారి

ముడిపడమంటూ సాగిపోదా
త్వరపడుతున్న ప్రేమ కోరి
పరిచయమంతా మారిపోదా
పరిణయమల్లే నిను చేరి

ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా
నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా
చూసానిలా నీ జతలో

నీ పిలుపు కాదా మధురం
ఈ మలుపు పేరే ప్రణయం
నీ కనులు కంటూ నయనం
నను మరిచిపోయే హృదయం
కథ వేరుంటది పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: మోహన్ భోగరాజు 

ఓ సక్కనోడా… నాకు తగ్గ జోడా
నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ
ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ
సందమామ రాతిరేళ ధిష్ఠి కొట్టడా

నీ గుట్టు లాగేట్టు… నా చుట్టు చేరేట్టు
సోగకళ్ళ సోకుతోటి గాలమెయ్యనా
నీ పక్క కూసింత చోటుంటే చాలంటు
కన్నవాళ్ళు ఇంటి పేరు మార్చి పంపరా

ఓ సక్కనోడా… నాకు తగ్గ జోడా
నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ
ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ
సందమామ రాతిరేళ ధిష్ఠి కొట్టడా

మాసు లుక్కులోడా
నువ్వు ఊ అంటే చాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే చాలు
కథ వేరుంటది

మాసు లుక్కులోడా
నువ్వు ఊ అంటే చాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే చాలు
కథ వేరుంటది

ఊపిరాడకుంటది ఉక్కపోతగుంటది
నిన్ను సూడకుండా గడిపే రోజు
గుండె సాలకున్నది దాచలేను అన్నది
వంద రెట్లు ఉన్న నీపై మోజు

మాట దాటలేక దాగి ఉన్నది
పైకి చెప్పలేని భాష ప్రేమది
పరాయిదాని లాగ నన్ను చూడబోకని
ఈ గాలిపైన లేఖ రాసి నీకు పంపనీ

ఓ సక్కనోడా… నాకు తగ్గ జోడా
నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ
ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ
సందమామ రాతిరేళ ధిష్ఠి కొట్టడా

మాసు లుక్కులోడా
నువ్వు ఊ అంటే చాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే చాలు
కథ వేరుంటది

మాసు లుక్కులోడా
నువ్వు ఊ అంటే చాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే చాలు
కథ వేరుంటది


Palli Balakrishna Sunday, February 13, 2022
Gurthunda Seethakalam (2022)
చిత్రం: గుర్తుందా శీతాకాలం (2022)
సంగీతం: కాలభైరవ
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, 
నిర్మాత, దర్శకత్వం: నాగశేఖర్. ఆర్
విడుదల తేది: 2022Songs List:గురుతుందా శీతాకాలం పాట సాహిత్యం

 
చిత్రం: గుర్తుందా శీతాకాలం (2022)
సంగీతం: కాలభైరవ
సాహిత్యం: శ్రీమణి
గానం: సంజిత్ హెగ్డే

క్యాచ్ పడితే ఔటంటారే
బైట పడితే సిక్సంటారే
వెంటపడితే ప్రేమంటారే
కంటపడితే తిడుతుంటారే

ఓ డిసెంబర్ పువ్వుని కలిశా
ఈ తుషారం తనలో చూశా
మ్యాజికంటె ఏంటో తెలుసా
మనము కలిసిన డేటే బహుశా

గురుతుందా శీతాకాలం
గురుతుందా సీతాకాలం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం

చిలిపి ప్రేమకు పాటొకటుంటే
హుక్కు లైనే నువ్వేనా
మనసు బుక్కుకి లుక్కొకటుంటే
కవరు పేజే నీదేనా

హే... అందమా అందమా అందుమా
హే... హే.. ఆనందమే అందాలమ్మా
ఆశే ఆకాశమా శ్వాసే నీకోసమా
కోసే వయ్యారమా దిల్సే సంతోషమా

గురుతుందా శీతాకాలం
గురుతుందా సీతాకాలం

సెకను సెకనొక ప్రేమకు గురుతే
ఇష్టపడిన హృదయానా
సెకము సెకమొక సెకనవుతోందే
కలిసి నడిచే పయనాన

హే... వేసవే వేసవే పూసెనా
హే... హే.. చలిమాసమే నీ శ్వాసనా
పేరే జపించనా నీకై తపించనా
ప్రేమే సాధించనా ప్రాణం నీ పంచనా

గురుతుందా శీతాకాలం
గురుతుందా సీతాకాలం
గురుతుందా శీతాకాలం
గురుతుందా... శీతాకాలం


Palli Balakrishna
DJ Tillu (2022)
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి
దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
విడుదల తేది: 2022Songs List:టిల్లు అన్న డీజే పెడితే పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల

లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా

మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

అరె, చమ్కీ షర్టు - ఆహ
వీని గుంగురు జుట్టు - ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ - ఆహ
అత్తరే జల్లినట్టు - ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు - అది

అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే - ఓ

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

పటాసు పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కిట్టు విస్స ప్రగడ
గానం: అనిరుధ్ రవిచంద్రన్

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
లేజీ లేజీ గుండెల్లోనా
డీజే డీజే కొట్టేసిందా

మైండే అటు ఇటు అని ఊగిందిగా
గుండే తెగ ఎగబడి ఆడిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా

కలిసే నడిచే దారుల్లో
రంగే చేరే నీడల్లో
జాతరలోన పులి వేషంలాగ
నడుం చూసే వేళా నరం ఆనేసిందే
మనసే కాలే జారెనే

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
పైటే అటు ఇటు అని ఊగిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా
నువ్వలా వెన్నెలా (Male) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: సిద్దు జొన్నలగడ్డ

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా (Female) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: యామిని గంటసాల 

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

Palli Balakrishna
Ghani (2022)
చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: వరుణ్ తేజ్, సైయి మంజీర్కర్
దర్శకత్వం: కిరణ్ కొర్రపాతి
నిర్మాత: సిధు ముద్ద, అల్లు బాబి
విడుదల తేది: 08.04.2022Songs List:Ghani Anthem పాట సాహిత్యం

 
చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఆదిత్య అయ్యంగార్, శ్రీ కృష్ణ, ప్రుద్వి చంద్ర , సాయి చరణ్ 

నీ జగజగడం… వదలకురా కడవరకు
ఈ కదన గుణం… అవసరమే ప్రతి కళకు

హే, నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
ఇవ్వాలె నీకు మైదానం
హే, నీ చూపు ఏ వైపు మల్లించకు
ఏకాగ్రతేరా సోపానం

పడ్డావో లేచావో నువ్వాగకు
కొనసాగాలి క్రీడాప్రస్థానం
హే, తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆటే నీకు సన్మానం

ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ
ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ

దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని

హే, రేపు మనదిరా… గెలుపు మనదిరా
రేయి చివరలో… వెలుతురుందిరా
రేపు మనదిరా… గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా

దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని

నేమ్ ఈజ్… గ ఘ ఘనీ
నేమ్ ఈజ్… గ ఘ ఘనీ
కోడ్తే కోడ్తే పాట సాహిత్యం

 
చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హారికా నారాయణ్

లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా

రింగారె రింగ రింగ
రింగ రింగా
రింగ్ ఆఫ్ ద డెస్టినీ కి
రారా సింఘా

దిల్ మాంగే స్పోర్టే నీకు
ఈ బాక్సింగా
తు ఆజారే అమీ తుమీ సన్నాహంగా

పిడికిల్లై పదివేళ్ళు వంగనీ వంగనీ
వరదల్లె అడ్రినాలిన్ పొంగనీ పొంగనీ
నీ పదునేంటో పవరేంటో
పంచుల్లో కనిపించనీ

కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తే

లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా

సో కాల్డ్ ప్లేయర్స్ సో మెనీ
ఎవ్వడి ఫోర్స్ ఎంతనీ
లెగ్గెడితే నెగ్గాలని
నువ్వాడాలి ఆటని

ఆకాశాల అంచున
నీ మీదున్న అంచనా
నిజమయ్యే లెక్కన
ధమ్ లగాకే ఖేలోనా

ఒప్పొనెంట్ ఎంతోడైనా
ఉస్కో నాకౌట్ కర్ధేనా
హమ్ హై రాజా రేంజ్ లో
తుమ్ ట్రోఫీ లేలోనా

జో జీత ఓ హి
సికందర్ హోతా హై నా
కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తేరోమియోకి జూలియటులా పాట సాహిత్యం

 
చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హారికా నారాయణ్

రోమియోకి జూలియట్ లా
రేడియోకి శాటిలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోన నీకు నేనిలా

చూపులేమో చాక్లెట్ లా
నవ్వులేమో మాగ్నెట్ లా - లా
నచ్చినావు అన్నివేళలా
మస్తుగున్న చందమామలా

న్యూటన్ చెప్పిన సూత్రమేదో
గుండెనే లాగెనా
యూటర్న్ తిరిగే నీడలాగా
వెంటనే సాగనా

వేటూరిలా నండూరిలా
వర్ణించమంటే నీపై ప్రేమే
బాషలన్ని చాలవే మరి

రోమియోకి జూలియట్ లా - లా
రేడియోకి శాటిలైట్ లా - లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోన నీకు నేనిలా

ఆ మేఘమే వానలా మారి
నా కోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి
నా సొంతమే అవ్వగా

ఎప్పుడైన నాకునేను నిన్నదాకా
నచ్చనైన నచ్చలేదు ఇంతలాగ
ఊపిరే ఊయలై ఊగుతోంది ఉన్నపాటుగా

రోమియోకి జూలియట్ లా - లా
రేడియోకి శాటిలైట్ లా - లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోన నీకు నేనిలా

పై పై… స్వీటీ పై
పై పై… స్వీటీ పై


Palli Balakrishna Saturday, February 12, 2022
Bhala Thandanana (2022)
చిత్రం: భళా తందనాన (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: శ్రీ విష్ణు , కేథరీన్ థెరిసా
దర్శకత్వం: చైతన్య దంతులూరి 
నిర్మాత: రజిని కొర్రపాటి 
విడుదల తేది: 2022Songs List:మీనాచ్చి మీనాచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: భళా తందనాన (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి 
గానం: ధనుంజయ్ సేపాన 

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

మీనాచ్చీ మీనాచ్చి
ముసుగేసావే మనస్సాచ్చి
నచ్చిందే ఈ పిచ్చి
నమ్మకపోతే నీ స్సాచ్చి

తిరిగాననీ నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా
నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయె

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

సిగురులా సింత ఇగురులా
నీలో పులుపే ఇలా పలుపైనదే
సెరుకులా నను కొరికితే బాలా
కసికందినా కసి తీరదే

సప్పగా సంకటే మారినా
నీ సుట్టు నే సుట్టడం మారదే
సుక్కలే రేయిలో ఆరినా
నిన్ను నే సూడటం ఆగదే

నాలొ గుంజేసి ఊపిరి నంజేసుకోమరి
నన్నింక నాంచారి చేరి సేయి జారిపోకె

మీనాచ్చీ మీనాచ్చి
దయలేదంటే పిల్లాచి
ముసిముసిగా ఎసరేసి
నను తాగేసావే వడకాచి

సిగలతో నువ్వు సిగినెలే ఇస్తే
వచ్చిపొమ్మనా సచ్చిపొమ్మనా
బొమ్మ సూడని బ్రహ్మచారిని
నన్నే నమ్మలేననా సొమ్ములేదనా

పోకిరీ గాడనీ ఎంచకే
పూటుగా పుట్టినే ముంచకే
కోపమే కొంగుకే కట్టకే
పాపమే కంటితో కొట్టకే

అంట గట్టేసి సురకలు
సూదంటు కులుకులు
సేదైన సెణుకులు
ఓసి ఆశ తీరదాయే

మీనాచ్చీ మీనాచ్చి
కొరుకుడు పడని కొరకంచి
నీ పైటంచూ ఎరవేసి
చేసావే నన్ను సన్నాసి

తిరిగానని నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా
నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయే

మీనాచ్చీ మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి
రాసానిలా కనబడనీ పాట సాహిత్యం

 
చిత్రం: భళా తందనాన (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా

రాసానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖ
చూసానిలా కదలననీ వదలననీ మౌనరేఖ

రాసానిలా కనబడనీ
వినబడనీ ప్రేమలేఖ

నింగిలోని నీరులా
నీటిపైన పేరులా
కానరాని ప్రేమలేఖా రాసానిలా

మీటలేని వీణలా
మాటరాని పాపలా
అందమైన మౌనరేఖ చూసానిలా

పుస్తకంలో దాచుకున్న
నెమలికన్ను జ్ఞాపకంలా
మనసు దాటలేని
మొదటి కవితలా

అల్లుకున్న పంజరానే
తేలుతున్న పావురంలా
గీసుకున్న గీతే దాటలేనెలా

తనని నాతో కలపగలిగే
పిలుపు ఏదో తెలియక
తెలుపలేక నిలుపలేక
అలసిపోయా…నికా

దాచానిలా నిజమిదనీ
ఋజువుదనీ చూపలేకా
చేరానిలా ఇరువురిదీ
ఒకటి అనీ తీరారేఖ

నడి ఎడారిదారిలో మౌన బాటసారిలా
ఒంటరల్లే సాగానే నాకు నేనే
ఎండమావి గుండెలో మండుతున్న ఎండనే
వెన్నెలల్లే కాచావే నీవు నన్నే

కలిసి ఉన్న వేళలోన
వీలుకాని మాటలన్నీ
మనసుతోటి నేడే మాటలాడనా
ఊపిరాగి ఆగమన్నా గుండెచప్పుడాపుతున్నా
దాచుకున్న ప్రేమే నీకు చూపనా

తెగిన గాయం తగదు అన్నా
ఆగిపోదే మన కధా
చివరి క్షణమే మధురకావ్యం
ప్రేమకెపుడూ కదా

Palli Balakrishna Friday, February 11, 2022
Khiladi (2022)
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: రవి తేజా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి
దర్శకత్వం: రమేష్ వర్మ 
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, రమేష్ వర్మ 
విడుదల తేది: 11.02. 2022Songs List:ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిప్రియ 

చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ… రెండు జల్లు అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం

కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువు పడే కష్టం

తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే… స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు… అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం… ఆహా ఓహో అంటే ఇష్టం

గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం

రెప్పల తలుపు మూసి… కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే… కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే… చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే… కొత్త కబురులంటే ఇష్టం

ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం

ఖిలాడీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: రామ్ మిరియాల

హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్
హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్
వీడు ఎదురయ్యే టైమింగు
డేంజర్ తో డేటింగు
యు గాట్ టు రన్ ఫాస్టర్

హి ఈజ్ ఏ స్పెల్ మాస్టర్
మనీ మోన్స్టర్
వీడితో నీకు మీటింగు
హెల్ తోటి గ్రీటింగు
లైఫే రోలర్ కోస్టర్

స్మెల్ చూసి నోట్ నేమ్ చెప్పగలడు సాల
వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాల
రాబరీకి పాఠశాల మనీ హెయిస్ట్ కె ఇవ్వాళ
కొత్త హైట్ చూపిన హవాలా

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

లోకం యాడున్నా లిక్విడ్ మనీ
ట్రాకర్ లా లాగే వాలా
లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్నీ
హ్యకర్ లా పట్టే వాలా

పోకర్ లో కింగంటి నీ ఫేట్ ని
జోకర్ లా మార్చేవాలా
గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని
స్ట్రైకర్ లా కొట్టేవాలా

బాడీ మొత్తం బ్రెయిన్ దోచేసినా
ఏకైక హ్యూమన్ వీడే
హార్ట్ కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా
స్కెచ్ ల్తో నింపేశాడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

అకౌంట్ బుక్కులో టాలీ కానీ… లెక్కలకే బ్యాలన్సరు
ఫైనాన్స్ సబ్జెక్టులో పట్టా ఉన్నా… సరికొత్త ఫ్రీలన్సరు
కంట్రీకే అప్పుంది కోట్లల్లోనా… మనకుంటే తప్పేంటి
సలహాలు ఇస్తూనే సర్వం దోచే… అరుదైన అడ్వైజరు

సొంత బాడీనంటి ఉంటోందని
నీడలకే రెంట్ ఏస్తాడే
సెంటీమీటర్ సెంటిమెంటే లేని
సెల్ఫ్ మేడ్ సెల్ఫిష్ వీడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
అట్టా సూడకే పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: దేవీశ్రీప్రసాద్, సమీరా భరద్వాజ్

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నీలో స్పీడుకే… ఊపెక్తాంది మూడుకే
సిగ్గే సైడ్కే… అటకేక్తాంది చోడ్కే

మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా
నా గుండె గోడకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఓ బాటిల్ లోన సముద్రం
ఒక బాడీ లోన ఇంతందం
ప్యాకింగ్ చేయడం అసాధ్యం
ఆ గాడ్ కి వందనం

సూపర్ హీరో ఇమేజు
నీకిచ్చారేమో ప్యాకేజు
నీ వల్లే నాకీకరేజు
నువ్వే నా ఇంధనం

దూరం పెంచకే
మెంట్లెక్తాంది మైండుకే
నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే
ఒక డీజే మిక్సే మొదలయ్యిందే
నాలో మాస్సు గాడికే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఏ, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నువు స్విచ్చే లేని కరెంటు
ఐపోయా నీకే కనెక్టు
నీకే ఇచ్చా నా రిమోటు
నీ ఇష్టం ఆడుకో

నీ పిక్చర్ కాముడి కటౌటు
నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు
నీ రేంజికి తగ్గ కంటెంటు
నా గ్లామర్ చూసుకో

రావే ట్రేడుకే
ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే
నువ్వెక్కడికెల్తే ఆడికే
మన సీనేగాని చూస్తే
షాకే సెన్సారు బోర్డుకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఫుల్ కిక్కు పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: సాగర్, మమతా శర్మ 

ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి
మాస్ సాంగ్ అన్న
అయ్యబాబోయ్ మాసే
అః మాస్ మహారాజ్ ఇక్కడ
అంతేనంటవా
అదిగో క్యూట్ చిక్కు
నువ్వు పెట్టెయ్ టిక్కు
ఇంక ఫుల్ కిక్కు

నీ లిప్ లోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు
ఓ నిప్పులాగా నన్ను తాకే పెంచెను పల్సు
అది వంటిలొని చేసిన అల్లరి నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు
నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్ వన్ రేస్
ఆ బ్రేకుల్లేని బ్రేక్ డాన్స్ నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్సు
నువ్వు వాడేసి ఆరేసిన టవల్స్
అవి నాకంట పడుతుంటే 
ఆ మంట నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్
కెలికేసిన దానితోటి నా ఛానెల్సు
నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ కండలోన దాచావు ఓ డంబెల్సు
అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు
ఇక రాతిరెన్నో జాతరలో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

ఇద్దరి బడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు
ఇక తీసేయ్ మద్యల డిస్టెన్స్ దేనికి న్యూసెన్స్
నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్స్
కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్స్
అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాక్ అయ్యే అట్ట్రాక్షన్స్
మన మధ్య మొదలు పెట్టాయి నీ యాక్షన్స్
మన లవ్ కింకా లోకంలో నో ఆప్షన్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్
సంథింగ్ సొమెథింగ్స్యూ
మన ఇద్దరి మధ్యన లిరిక్స్
ఫుల్ అఫ్ రొమాన్స్
ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
క్యాచ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: నేహా బాసిన్, జస్ప్రీత్ జస్జ్

హలో మిస్టర్ మాచో మ్యాన్
నాతో కొంచెం నాచో మ్యాన్
నాటీ డేటే పూచో మ్యాన్
మిస్సయితే రాదు సోచో మ్యాన్

రైటు లేదు రాంగు లేదు
రంగే లేని నైటే లేదు
రంగంలోకి రాబిన్ హుడ్డై
రారా సూపర్ మ్యాన్

హే, విస్కే లేని గ్లాసే లేదు
రిస్కే లేని రేసే లేదు
మాస్కే లేని ఫేసే లేదు
కాస్కో స్పైడర్ మ్యాన్

క్యాచ్ మీ, క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ, టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హే పార్టీ మ్యాన్
నా డీజే మిక్సే నీకు నచ్చిందా
సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన
ఫెవరెట్ మ్యూజిక్ తో
నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా

హేయ్, బేబీ గర్ల్
నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే
నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక
ఉండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాంరా

హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా
ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా
ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హేయ్, ఖిల్లాడి
నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి
బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన
రెచ్చిపోయే నాట్యంతోన
లేడి నెమలై నీతో నా బాడీ

హేయ్ అమ్మాడి..!
నీ అందం ఆయుధమల్లే వెంటాడి
కత్తుల్నే దించుతుంది సోకుల వాడి
దంచుతుందే నాపై దాడి
పెంచుతుందే రక్తంలో వేడి

హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా
నీలోని రొమాన్స్ ని తీయింకా
నీ షైని షైని మెరుపుల మోజింక
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

Palli Balakrishna Wednesday, February 9, 2022
Kotha Kothaga (2022)
Movie DetailsSongs List:డైమండు రాణి పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త కొత్తగా (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి

వాలు కన్నుల్లో మాగ్నెట్టు దాగుందే
సూదిలా నన్ను గుంజేస్తాందే
హంస నడకల్లో ఏం మాయ దాగుందో
హింస పెట్టేసి లాగేస్తాందే

గుండెలో ఏదో గడియారం ముళ్ళుందే
రోజు నీ చుట్టు తిరిగేస్తాందే
నన్ను వదిలేసి నా నీడ
నీ రెడ్డు చున్నీ పట్టుకొని వేలాడిందే

పోకే, నన్నొదిలి వెళ్ళిపోకే
నా మనసునే గిల్లిపోకే
నీ దారిలో పువ్వులే నేను చల్లానులే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

నా డైమండు రాణి నువ్వే
నా గర్ల్ ఫ్రెండు అయిపోవే
పిల్ల నీ మాట ఇస్తే
నిలబెట్టుకుంటా నీతోనే ఉంటానే

నీ చేతిలోని ఓ బుక్కునైతే
నా లైఫ్ ధన్యంలే
నీ వేళ్ళు తాకి ఓ రెక్కలొచ్చి
లోకాన్ని చుడతాలే

బైకుకున్న బ్యాకు సీటు నీకై
మైకు పట్టి పిలుస్తున్నదే
వీపునంటి నువ్వు కూర్చుంటే
గాల్లోన ఎగిరిపోతదే

రావేమే నా రాజే
నాతో పడరాదే నువ్ రాజే
నువ్ ఒప్పుకుంటే మన జంటకొస్తది
ఊళ్ళోన యమ క్రేజే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

నీ నోట రాలే ముత్యాల కోసం
బెగ్గర్ ని అయ్యానే, ఓ తల్లే
నీ నవ్వులోని రత్నాల కోసం
దొంగల్లె చూశానే

అంటరాని మనిషినేం కాదే
అంత దూరం ఎందుకుంటవే
సెంటీమీటర్ ప్లేసు ఇచ్చి చూడే
అంటుకుంటే నిన్ను వదలనే

ఏవంటవే రాజే, ఓ రాజే
నువ్ రాసెయ్యే లవ్ పేజే
నువ్ తలుసుకుంటే
ఏమంత కష్టం ఎగ్జామ్స్ కంటే ఈజే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త కొత్తగా (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: సిద్ శ్రీరాం 

మౌనమే మేఘమై గుండెలో చేరెనే
ప్రాణమే వానల కంటిపై జారెనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో దూరంగా నాకే నే భారంగా
మారాక నేనేందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

కాలం సెగలకు గతమంతా కరిగెనే
శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
ఏ కారణాన్నో ఏకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే

నీదాకా పోలేని పాదాన్ని దూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
జీవించి ఏం లాభం అన్నాయే

ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకు, ఏ ఏఏ

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

Palli Balakrishna Friday, February 4, 2022
Bazaar Rowdy (1988)
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్-కోటి 
నటీనటులు: రమేష్ బాబు, మహేష్ బాబు, నదియా, గౌతమి, సీత
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: యు.సూర్యనారాయణ బాబు 
విడుదల తేది: 12.08.1988Songs List:చెక్కిలిగిలి చిక్కులముడి పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

చెక్కిలిగిలి చిక్కులముడి 
సింగారక్కో సిగ్గెందుకే పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

సింగారక్కో సిగ్గెందుకే 
ఓ ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

ఓ ప్రేమ 
తాకమాక తగ్గమాక పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

తాకమాక తగ్గమాక కొత్త పెళ్లి కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

కొత్త పెళ్లి కూతురా 

Palli Balakrishna Wednesday, February 2, 2022
Kanchu Kota (1967)
చిత్రం: కంచుకోటం (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, దేవిక 
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: యు.విశ్వేశ్వర రావు 
విడుదల తేది: 22.03.1967Songs List:ఉలికి ఉలికి పడుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

ఉలికులికి పడుతుంది
గిలిగింత పెడుతుంది
ఎందుకో ఏమో నామనసు
ఏ సంగతి నాకేమి తెలుసు
ఇన్నాళ్ళ వలెకాదు ఎట్లాగొ అవుతుంది
చన్నీళ్ళ తాకిడికే ఒళ్ళు జిల్లు మంటుంది
చేపల్లే తాకెనో చూపులే సోకెనో
చెప్పలేనయ్యయ్యో సిగ్గుముంచు కొస్తుంది.....
నీటిలో అలలేమొ నిలిచి పొమ్మన్నాయి
తోటలో పూలేమొ లేచిరమ్మన్నాయి
నీటిలో నిలవనా తోటనే పిలవనా
ఉన్నపాటున లేస్తె ఊరంతనవుతుంది....

సిగ్గెందుకే చెలి పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్రిపురనేని మహరధి 
గానం: పి.సుశీల, ఎస్.జానకి

సిగ్గెందుకే చెలీ సిగ్గెందుకే
అందాలకే నువ్వు అందానివీ
సిగ్గెందుకే భామ సిగ్గెందుకే.....

సిగ్గులేని కొమ్మ పూలులేని రెమ్మ
సిగ్గులోని సిరులు పాలమీది తరగ
సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే 
రంభైన అతిలోక చతియైన
సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే ....
నీరాజు నినుచేరి సరసాలు సాగించ
సిగ్గేమి చేతువే ఏ చోటు దాతువే
విరిసే పెదవులలో మురిసే హృదయములో
దాచుకొందునె సిగ్గు దోచుకొందునే మనసు....
మనసులోని మమత మనసులోనే దాచ
మనసెట్లు తీరునే మనువెట్లు సాగునే
మనసైన నారాజు మనసార నన్నేల
మమతలు తీరునులే మనువే సాగునులే....
లేదు లేదని పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 1
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

చరణం: 2
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కలలోకొచ్చి కబురులు చెప్పే.. జతగాడైనా లేడు.. జతగాడైనా లేడు
ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 3
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
మొగలి రేకుల సొగసు ఉంది.. మొన కన్నులలో పదును ఉంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
అద్దంలో నా అందం చూస్తే.. నిద్దర రానే రాదు.. నిద్దర రానే రాదు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దొస్తావు
ఈ పుట్టిన రోజు పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల

పల్లవి:
ఈ పుట్టినరోజు నీ నోముల పండిన రోజు
దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు

చరణం: 1
తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ (2)
మీలో విరిసే లేత వెలుగులు మా చెలి కన్నుల నింపండి
ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలీ

చరణం: 2
అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా (2)
మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా
ఆ వయ్యారం చూసి చూసి ఆమె ప్రియుడు మురియాలి

చరణం: 3
పురివిప్పి నటియించు నీలాల నెమలి (2)
మీలోని హొయలంత చెలికియ్యరాదా
అందాల చెలి నాట్యమాడేటి వేళ
చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు... ఆ...
ఈడొచ్చిన పిల్లను పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఈడొచ్చిన పిల్లనోయ్ హొయ్ హొయ్
నిన్ను ఆడించే పిల్లనోయ్ సై సై

నువ్వేసే సుక్కకన్న ఎచ్చనైన దాననోయ్
కవ్విస్తే కరగేదాకా కదలనోయ్ హాయ్ హాయ్
కండలున్న మావయ్యకు గుండేలేదట
గుండెలున్న బావయ్యకు గుణమే లేదట
కండలున్నా గుండెలున్నా కన్నెపిల్ల రమ్మంటే
కత్తిలాంటి మగరాయుడు మెత్తనౌనట....
ఇంపుచూసి నా సొంపుచూసి నువు యీల వేయకోయ్
సెంపమీద అబ్బ నొక్కి నొక్కి నువు చిటికె ఏయకోయ్
పట్టుపట్టీ పంతగించి పైట లాగకోయ్
నా పైట లాగితే మనసు పట్టజాలనోయ్....భం భం భం పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, జమునా రాణి 

భం భం భం భం పట పట పట పట భజగోవిందం
ఏమిటో యీ అనుబంధం
ఎందుకో ఈ ఆనందం....
జం జం జం జం బలె బలె బలె బలె చిటపట బంగారం.
ఏనాటిదో యీ అనుబంధం
చూడవే బ్రహ్మానందం....

అయ్యను మోసంచేశావు
బావయ్యను మడుగులో దోశాపూ
అమ్మ బాబో నిను నమ్మినందుకు
నట్టనడేటను ముంచేస్తావూ....
సందేహంలో పడతావేలా ఏల
అందరిలా నన్ననకే బాల
పూలలోన నీవోలలాడగా
జోల పాడెదనె యిలా యిలా
జోజోజో జోజో జో....
ప్రేమ ఒలక బోస్తున్నావా
నాటకాలు వేస్తున్నావా
అసలు సంగతి బైటికి వస్తే
అయ్యా అపుడేమౌతావూ
ఏమౌతానా? విను 
ఇంటికి అల్లుడనౌతానే నీకు
ఎదురుగానె కూర్చుంటానే
మళ్ళీ మళ్ళీ మాట్లాడావా
భజన చేస్తు కూర్చుంటానే - రామ
భజన చేస్తు కూర్చుంటానే

హరి హరీలరంగ హరి
వైకుంఠవాస హరి
మనయిద్దరికి సరి
మాటాడబోకు మరి
శ్రీమద్రమారమణ గోవిందో హరి సరిలేరు నీకెవ్వరూ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, ఎస్.జానకి

పల్లవి:
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సురవైభవాన భాసుర కీర్తిలోనా
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 1
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ....

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

చరణం: 2
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
యవ్వనవీణనూ కవ్వించినావూ...

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 3
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్

అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్

జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ..సరిలేరు నీకెవ్వరూ.....

ఏచటనో గల పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

ఎచటనోగల స్వర్గమ్ము నిచట దింపి
నన్ను మురిపించి మరపించినావు చెలియ
నీవె జీవితాధారము నీవె దిక్కు
నీదు పాదాల సాక్షిగా నీవె రక్ష

అర్ధరేతిరి కాడ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: యు. విశ్వేశ్వర రావు 
గానం: చక్రవర్తి, ఎల్. అర్. ఈశ్వరి 

అర్ధరేతిరికాడ అత్తయ్య నాకు
కలలోకి వచ్చింది మామో

ఎట్టా ? మాయమ్మా ?
ఆ కలలోన నన్ను అనరాని మాటలతో
అదరగొట్టేసింది మామో నన్ను
బెదరగొట్టేసింది మామో
కొట్టదూ మరి ?
నీయబ్బ నువ్వున్ను నాకన్న బాబునీ
నట్టేట ముంచారు అందీ
నిలువునా ముంచారు గందే 
ఆ ఉసురు ఫలితంగ నా దేవుడూ
నాకు దక్కనే దక్కడందీ
పీడా పొయె 
నాదేవుడూ నాకు దూరమయ్యాడంటే
నాకు దిక్కెవరయ్య మామో
నే ఉళ్లా..?
కడసారి చూపుగా ఒకసారి చూసొస్తా 
నీ దయా నాకుంటె మామో - నువ్వు
తలుపులూ తీయించు మా మో ....

Palli Balakrishna
Bhama Vijayam (1967)
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, దేవిక 
దర్శకత్వం: సి.పుల్లయ్య 
నిర్మాతలు: సోమశేఖర్, రాధాక్రిష్ణ
విడుదల తేది: 29.06.1967Songs List:పైరుగాలి వీచింది పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల

పైరుగాలి వీచింది 
ఓహో యువరాణి పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: ఘంటసాల 

ఓహో యువరాణి 
రెండు చందమామలు పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: ఘంటసాల, శోభారాణి

రెండు చందమామలు 
రారా సుందరా పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: పి. సుశీల 

రారా సుందరా ఒక్కసారి నన్ను చూడు పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత 

ఒక్కసారి నన్ను చూడు రావే చెలి ఓ జాబిలి పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

రావే చెలి ఓ జాబిలి 
భువన మోహిని పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: ఘంటసాల

భువన మోహిని 
నిప్పులాంటి సీతమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల

నిప్పులాంటి సీతమ్మ 
కోరిన వాడే చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

కోరిన వాడే చెలీ 
మగరాయ పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

మగరాయ 


Palli Balakrishna
Subhavartha (1998)
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: అర్జున్, సౌందర్య
దర్శకత్వం: P. N రామచంద్ర రావు
నిర్మాత: M. Y. మహర్షి
విడుదల తేది: 1998Songs List:అరె బాప్ రే పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అరె బాప్ రే
అచ్చమైన పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అచ్చమైనజాబిలమ్మ ఆగవమ్మ (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవా ఈ శుభవార్త
జంట ప్రేమ చాటెనమ్మ వేలవన్నెల ఈ శుభవార్త
కలే తీయ్యగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని
ఈ కనివిని ఎరుగని కళ్యాణం అపురూపం అని

రతిమదనులు తొలి అతిధులుగా కదిలొచ్చే కాలమని
శ్రుతిముదిరిన తహతహలన్ని ఆహ్వానం పాడని
మన కలయిక కలలకు కలగా అనిపించే సమయమని
కునుకెరుగక ప్రతి నిమిషాన్ని కౌగిల్లో సాగని
చెరోసగమయే సరాగాలతో ఒకే ప్రాణమై ఉందాం రమ్మని
ఎడబాటే లేని ఏకాంతన్ని అందించని

కలతెరుగని తలపుల హ్రుదయం తను కోరిన కోవ్వెలని
కళతరగని వలపుల దీపం మన ఎదలో చేరని
ఏ ఋతువున చేదరని స్నేహం మన బ్రతుకున ఉన్నదని
మన పెదవుల నిలిచిన చైత్రం చిరునవ్వులు పూయని
సదా ఈ జత..ఇదే తీరుగా ప్రతి ఊహని నిజం చెయ్యగా
నీ తీయని చెలిమే తీరని రునమై జీవించని
కుళుకు బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

కుళుకు బేబీజాబిలమ్మ ఆగవమ్మ (Sad)మ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.ఓ.

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నా బ్రతుకున బ్రతుకై 
ముడిపడిపోయిన ఓ ప్రియతమా
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నీ మనసుని తన కొలువంటూ నిను చేరిన నా మది
అనురాగపు మని దీపముగా ఆ గుడిలో ఉన్నదీ
ఏ కలతలు సుడి గాలులకి ఆరని వెలుగే అది
నువు వెలివేయాలనుకున్న నీ నీడై ఉన్నదీ

ప్రాణమే ఇలా నిన్ను చేరగా
తనువు మాత్రము శిలై ఉన్నదీ
ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

కనివిని ఎరుగని కలయికగా అనిపించిన జీవితం
ఎడబాటును జరిగిన గతమై చినబోయెను ఈ క్షణం
విష జ్వాలలు విసిరినా అహమే మసి చేసెను కాపురం
ఏ మసకల ముసుగులు లేని మమకారమే శాశ్వతం

ప్రణయమన్నది ఇదేనా అని
మనని అడగదా లోకమన్నది
బదులియకపోతే ప్రేమకి

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా
నా బ్రతుకున బ్రతుకై
ముడిపడిపోయిన ఓ ప్రియతమా

Palli Balakrishna
Ankusham (1989)
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల (All)
గానం: యస్.పి. బాలు, జానకి (All)
నటీనటులు: రాజశేఖర్, జీవిత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: యమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 13.07.1989Songs List:ఇది చెరగని ప్రేమకు శ్రీకారం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు, జానకి 

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాశల చిలిపి చేతలు
పసిడి బుగ్గల పలకరింపులు
పడుచు జంటకే తెలుసు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు

ముగ్గులే తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
నింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం
జన్మ జన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే
ఆలు మగలకు అందం

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు
గోరంత దీపం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: జానకి 

గోరంత దీపం 
అయ్యలో జగరత పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు

అయ్యలో జగరత 
చిన్నారి కసిగందు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు

చిన్నారి కసిగందు నేను తప్పు చేయలేదు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు

నేను తప్పు చేయలేదు చట్టాలను దిక్కరిస్తూ పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు

చట్టాలను దిక్కరిస్తూ అమ్మ పిలుపుని నోచనివాడు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు

అమ్మ పిలుపుని నోచనివాడు 

Palli Balakrishna

Most Recent

Default