Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kshana Kshanam (1991)




చిత్రం: క్షణ క్షణం (1991)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల, వెన్నెలకంటి
నటీనటులు: వెంకటేష్, శ్రీదేవి
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాతలు: కె.ఎల్.నారాయణ, వై. లక్ష్మణచౌదరి, యస్.గోపాల రెడ్డి
విడుదల తేది: 09.10.1991



Songs List:



జాము రాతిరి..జాబిలమ్మ.. పాట సాహిత్యం

 
చిత్రం: క్షణ క్షణం (1991)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

జాము రాతిరి..జాబిలమ్మ.. 
జోల పాడనా ఇలా.. 
జోరు గాలిలో..జాజి కొమ్మ.. 
జారనీయకే కలా.. 
వయ్యారి వాలు కళ్ళలోన.. 
వరాల వెండి పూల వాన.. 
స్వరాల ఊయలూగు వేళ..

చరణం: 1 
కుహు కుహు సరాగాలే శ్రుతులుగా.. 
కుశలమా అనే స్నేహం పిలువగా.. 
కిల కిల సమీపించే సడులతో.. 
ప్రతి పొద పదాలేవో పలుకగా.. 
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని.. 
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ..

చరణం: 2 
మనసులో భయాలన్నీ మరిచిపో.. 
మగతలో మరో లోకం తెరుచుకో.. 
కలలతో ఉషా తీరం వెతుకుతూ.. 
నిద్రతో నిషా రాణి నడిచిపో.. 
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి.. 
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి..



జుంబాహె ఆగుంబహె పాట సాహిత్యం

 
చిత్రం: క్షణ క్షణం (1991)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: చిత్ర, మనో

జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె
జుంబాహె ఆగుంబహె హైబు హైబు హైబుహె

జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె
జుంబాహె ఆగుంబహె హైబు హైబు హైబుహె

చలిచంపుత్తున్నా చమ్మక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె
చెలి చెంతకొచ్చె తలుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె
వయసాగనిది వేగినది సరసములోన
చలిదాగనిది రేగినది సరసకు రానా
కలతీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి

చలిచంపుత్తున్నా చమ్మక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాహె ఆగుంబహె
చెలి చెంతకొచ్చె తలుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాహె ఆగుంబహె

అందిస్తున్నా వగరే చిరు చిగురే తొడిగే
చిందుస్తున్నా సిరులే వగసిరులే అడిగే
రమ్మంటున్నా యెదలో తుమ్మెదలే పలికే
జుమ్మంటున్నా కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని తరగని కలకదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే
సెలువనిగని కలువల సెలువులుగని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే

చలిచంపుత్తున్నా చమ్మక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాహె ఆగుంబహె
చెలి చెంతకొచ్చె తలుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాహె ఆగుంబహె

ఊకొట్టింది అడవే మనగొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులేకంటూ
ఇమ్మంటుందీ ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుందీ ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపులు కురిసెను కల కలిసిన
మనసులలో
పురివిరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల
మలపులలో
ఎద కొసరగ విసిరెను మధువుల వల
అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలికిన పలుకులు
చిలికిన చినుకులలొ తొలకరి చిరుజల్లులలొ

చలిచంపుత్తున్నా చమ్మక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె
చెలి చెంతకొచ్చె తలుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె
వయసాగనిది వేగినది సరసములోన
చలిదాగనిది రేగినది సరసకు రానా
కలతీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి

చలిచంపుత్తున్నా చమ్మక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాహె ఆగుంబహె
చెలి చెంతకొచ్చె తలుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాహె ఆగుంబహె



అమ్మాయి ముద్దు ఇవ్వందే పాట సాహిత్యం

 
చిత్రం: క్షణ క్షణం (1991)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి: 
త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త

త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త

అమ్మాయి ముద్దు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే
అమ్మమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా

ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆగేదెట్ట హద్దూ పద్దు వద్దా

చరణం: 1 
మోజు లేదనకు..
ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకూ
చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో

చూడదా సహించని వెన్నెల 
దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హయిగా

అమ్మాయి ముద్దు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే
అమ్మమ్మమ్మమ్మో గొడవలే

చరణం: 2 
పారిపోను కదా
అది సరే అసలు కథ అవ్వాలి కదా
ఏది ఆ సరదా
అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా

అందుకే అటు ఇటు చూడకు
సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆగేదెట్ట హద్దూ పద్దు వద్దా

అమ్మాయి ముద్దు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే
అమ్మమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆగేదెట్ట హద్దూ పద్దు వద్దా 




అందనంత ఎత్తా పాట సాహిత్యం

 
చిత్రం: క్షణ క్షణం (1991)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం రా 
ఆ అందమంత కొత్త తాళం తీస్తే సందె విందు సొంతం కాదా 
అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం రా 
ఆ అందమంత కొత్త తాళం తీస్తే సందె విందు సొంతం కాదా 
చిందే సరదా పొంగే వరద స్వర్గం మన సమీపం అయ్యేంత 

చరణం: 1 
గువ్వ నీడలో గూడు కట్టుకో 
కుర్ర వేడిలో కు కూ కూతపెట్టుకో 
దిక్కులన్ని తెగించే వేగంతో 
రెక్క విప్పు నిశాలెన్నో 
గుప్పెడంత కులాసా గుండెల్లో 
గుప్పుమన్న ఖుషీలెన్నో 
తోటమాలి చూడకుంటే ఏటవాలు పాతమెంట 
మొగ్గ నవ్వు చేరుకుంటె 
చుక్కలింట పండగంట 

చరణం: 2 
కొంటె కొనలో కోట కట్టుకో 
కొత్త కోకలో కో కో..కోరికందుకో 
కోల కళ్ళ గులాబీ గుమ్మల్లో, 
కాచుకున్న కబురులెన్నో 
కమ్ముకున్న కిలాడీ కొమ్మల్లో 
గుచ్చుకున్న గుణాలెన్నో 
లాగుతున్న గాలివెంట సాకుతున్న పూలమంట 
తాకుతుంటె దాగదంట ఆకసాన పాలపుంత




కో అంటే కోటి పాట సాహిత్యం

 
చిత్రం: క్షణ క్షణం (1991)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, శ్రీదేవి

(ఈ పాట శ్రీదేవి గారే స్వయంగా పాడారు)

కింగ్  లా కనిపిస్తున్నాడు
మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా గమ్మత్తుగ లేదా ఏమా సరదా
రాజైనా రారాజైనా మనీ ఉన్న మనముందు సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే
పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా
కో అంటే ... కోటి
దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి

ఓయబ్బో మయసభలా యమాగ ఉంది ఏమి మాయలోకమిది
అచ్చతెలుగులో ఐదు తారల పూటకూళ్ళ ఇల్లు
మేకప్ ఏసి మరో భాషలో  ఫైవ్ స్టార్ హోటల్  అంటారు
Yes, do you have any reservation? - అయ్యయ్యో లేదే
Welcome sir, welcome lady
We are glad to have you here
To serve you is our pleasure
రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది
దేవుళ్ళైనా దేవుల్లాడే అంత మహత్మ్యం ఏముంది
శ్రీ ... లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం
ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం
చెక్ అంటారు దీన్ని
కో అంటే ... కోటి
దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి

Wow ... అయ్యయ్యో హ హ హ I can't believe it
అయ్యబాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది
పైసాల్లో పవరిరిది పన్నీటి షవరిది
కాసు ముందు గాలైనా కండిషన్ లో ఉంటుంది
పైకంతో ప్రపంచమంతా పడగ్గదికి వస్తుంది
మబ్బులతో పరుపును కుట్టి పాల నురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ

Most Recent

Default