Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Virata Parvam (2022)




చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాతలు: డి. సురేశ్ బాబు,  సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండి
విడుదల తేది: 2022



Songs List:



కోలు కోలో కోలోయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి

కోలు కోలో కోలోయమ్మ
కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో
మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా

కుర్రగాడి చూపులన్ని
కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా

వాడి గూర్చి ఆలోచనే
వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట
పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా

అక్షరాలు వాడివంట
అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా

ప్రాణమంతా వాడేనంటా
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే




వీర తెలంగాణ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర 

వీర తెలంగాణ




నగాదారిలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: ద్యావారి నరేందర్ రెడ్డి, సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: వరం 

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది

కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా

ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో




చలో చలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: జిలుకర శ్రీనివాస్ 
గానం: సురేష్ బొబ్బిలి

మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం, మారదులే
రౌద్రపు శత్రువు దాడిని
ఎదురించే పోరాటం మనదే

చలో చలో చలో చలో
చలో చలో చలో చల్ పరిగెత్తు
అడుగే పిడుగై రాలేలాగా
గుండెల దమ్ముని చూపించు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
శ్రీకాకుళంలో రాలిన పువ్వులను
గుండెకు అద్ది నినదిద్దాం

సిరిగల భూములు చర విడిపించి
నిరుపేదలకు పంచేద్దాం
చలో చలో చలో
చలో చలో చలో

దొరోడి తలుపుకు తాళంలా
ఘడీల ముంగట కుక్కల్లా
ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు
మన బతుకులు మారేదెన్నాళ్ళు

ఆడబిడ్డ రక్షణకై పోరాటం
దళితుడి ఆత్మగౌరవంకై పోరాటం
పేదోడి ఆకలి ముద్దకై పోరాటం
రైతు నాగలి సాలుకై పోరాటం
హ, ఎన్నాళ్ళు… ఇంకెన్నాళ్లు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
చలో చలో చలో చలో
చలో చలో చలో

కనబడలేదా తుక్కిట జాబిలి
వినబడలేదా వేదనాగ్ని రవళి

అమరుల రక్తం
పాతులు గట్టే పాటలు గట్టే
ఎర్రని మల్లెలు నింగిన వెలిగే
వసంత మేఘం మరింత గర్జనై
ఆఖరి సమరం అన్నార్తుల విజయం

ఇదిగో ఇదిగో అరుణ పతాకం
అజేయ గీతం టెన్ టు ఫైవ్
అదిగో అదిగో అదిగో
అదిగో ఎర్రని కిరణం

అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు

Palli Balakrishna Tuesday, June 28, 2022
Thank You (2022)




చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్ 
నటీనటులు: నాగ చైతన్య, రాశిఖన్నా, మాళవిక శర్మ , అవికా గోర్
దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ 
నిర్మాత: దిల్ రాజు, శిరిష్
విడుదల తేది: 08.07.2022



Songs List:



మారో మారో పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: విశ్వా, కిట్టు ప్రాగడ
గానం: దీపు , పృద్వీ చంద్ర 

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

పోరాటం క్రీడా… మీ మతమైతేరా
క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా

ఈ అసుర గనముకే
ఆ అధిపతి ఎవడనే
ఈ తలపడు క్షణమునే
దుర్యోధనో దుశ్శాసనో తేల్చే రగడలో

మారో మారో యుద్ధం మొదలు
తాడో పేడో తేల్చెయ్ ఇపుడు
మారో మారో సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

నా శపథం తెలిసున్న
చెయ్యమాకు తాకిడి
నీ వలయం చిదిమేసి చేస్తా గారడీ

నేనే నాకు సైన్యం
దూసుకుపోయే నైజం
చెల్లించాలి మూల్యం
ఢీ కొడితే తథ్యం

ఈ తరగని తెగువనే
హే విడువని క్షణమునే
ఈ తగిలిన పిడికిలే
ఒకే ఒకా తుఫానులా చుట్టే సుడి కదా

మారో మారో… యుద్ధం మొదలు
తాడో పేడో… తేల్చెయ్ ఇపుడు
మారో మారో… సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో… లెక్కేలేని రచ్చే లేపు

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ




ఏంటో ఏంటేంటో పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: జొనితా గాంధీ 

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో

ఒకసారి చూశాక మళ్ళీ మళ్ళీ
నిను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి
ప్రతిసారి నీమీద వాలే గాలి
నను తాకి పోతుంటే ఏం చెప్పాలి

ఏదైనా నీకు ఇవ్వాలనుంటే
ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో
నీకోసం వేచి చూడాలనుంటే
నాకన్నా నువ్వే ముందుంటావేంటో

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తన
 
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో

సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో
సరిగా గమనిస్తే చాలా ఉందే
చిలిపి బరువేదో మోపింది ప్రాణంలో
అది నీ జతలోనే మోయాలందే

బాబు నీ పేరే బళ్ళో పాఠంలా
బట్టీ కొట్టేది దేనికంటా
అయ్యో నీ మాటే గుళ్లో మంత్రంలా
రోజు పాడాలటా ఆ ఆఆ

మా మేడలోన చూల్లేని అందం
మీ గూడు చూపింది నాకివ్వాలా
మా నాన్న కోపం మరిచేంత మైకం
నా చుట్టూ కమ్మిందే సంతోషంలా

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన

వెన్నెల జడి ప్రతి మలుపున
వెచ్చని సడి ప్రతి తలపున
విచ్చలవిడి మతి మరుపున
పడిన పడిన పడిన

ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో



ఫేర్వెల్ పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అర్మాన్ మాలిక్ 

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు
హైస్కూల్ మేట్స్ తో ఇంకో అయిదేళ్ళు
ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ అయిదేళ్ళు

చేశామంటా ఎన్నో సందళ్ళు
చూశామంటా ఎన్నో సరదాలు
ఎదలో నిలిచేనంటా
మన ఈనాటి అల్లర్లు
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా, ఆ ఆ ఆ హా

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు

కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో
స్నేహాలు శత్రుత్వాలు తొలిప్రేమలెన్నో
పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో
కాలేజీ స్వప్నాలెన్నో, కన్నీళ్లు ఎన్నో

ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ
పునాదయ్యి కట్టాలి మన కోటనే
ఈ సంతకాలలోని… చిరు అక్షరాలు మనమై
కలిసుండాలి కలకాలమే

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో




ఈ నిమిషం ఈ నిమిషం పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రీకృష్ణ , మనీషా ఈరబత్తిని 

ఈ నిమిషం ఈ నిమిషం
నన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీడై నీతో నడిచిందే

ఈ క్షణమే ఈ క్షణమే
నీలో నన్ను విడిచానే
నా సమయం నా సమయం
నీదై పోతు ఉందే

నువు నాతో అడుగేస్తే
వెలుగేలే ఏవైపైనా
కలలాగే గడిచిందే
నిను చూసే కాసేపైనా

నిదురించే నిమిషాన్న
పెదవుల్లో నీ పేరేనా
ఇకపైనా నను నీకే
వదిలేసా ఏదేమైనా

నీ మాటతో మాట కలిపి
నీ చేయితో చేయి కలిపి
నీకింతగా చేరువౌతాననుకోలేదే
నేను ఎపుడూ టెన్ టు ఫైవ్

నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్న
నమ్మేలా లేదే మనసిపుడు

ఈ నిమిషం ఈ నిమిషం
నన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీడై నీతో నడిచిందే

చిన్ని చిన్ని మాటలే చెప్పుకుంటే నేరమా
వచ్చిపోవా ఒక్కసారైనా
చిట్టి చిట్టి ఊహలే పంచుకుంటే పాపమా
ఉంటావేంటో అంత దూరానా

ఉదయము లేస్తూ లేస్తూనే
కలలను వెంటాడేస్తున్నా
పదమని నేనే నాతోనే
పరుగులు తీస్తున్నా

నాదైనా గగనంలో
సూరీడు చంద్రుడు నేనై
వేచేసే సమరంలో
నా సైన్యం నేనై నేనై

నీ మాటతో మాట కలిపి
నీ చేయితో చేయి కలిపి
నీకింతగా చేరువౌతాననుకోలేదే
నేను ఎపుడూ

నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్న
అయినాగానీ

Palli Balakrishna
Godse (2022)




చిత్రం: GODSE (2022)
సంగీతం: శాండీ అద్దంకి
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, ఐశ్వర్యా లక్ష్మీ
దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి 
నిర్మాత: సి.కళ్యాణ్ 
విడుదల తేది: 17.06.2022



Songs List:



రా రమ్మంది ఊరు పాట సాహిత్యం

 
చిత్రం: GODSE (2022)
సంగీతం: శాండీ అద్దంకి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రామ్ మిరియాల 

రా రమ్మంది ఊరు
రయ్యింది హుషారు
రాగమందుకుంది
జ్ఞాపకాల జోరు

పచ్చనైన చేలు
పల్లె పరిసరాలు
ఎంతకాలమైనా
మరువలేదు నా పేరు

గట్టు పొలిమేరల్లో
మట్టి రాదారుల్లో
అట్టా అడుగు పెట్టగానే
పులకరింతలే

పైరు పంటల గాలి
గుండె తడమంగానే
మళ్ళీ పుట్టినట్టే
ప్రాణం ఊయలూగెనే

అమ్మ ఒడి కోరే చంటిపాపడిలా
నన్ను చేర పిలిచింది ఈ సీమ
కొమ్మా రెమ్మలుగా ఎంత ఎత్తున ఉన్నా
నా పేరు మూలమైనదీ చిరునామా

ఏల ఏల ఏలేలో
ఏల ఏల ఏలేలో
ఏల ఏల ఏలేలో
ఏలో ఏలో

ఇదిగో పెరిగిన ఇల్లు
నేను తిరిగిన వీధి
కన్నా..! క్షేమమేనా
అంటూ పలకరించెనే

అదిగో చదివిన స్కూలు
అది నే గెలిచిన గ్రౌండు
మరల నన్ను చూసి
నేడు పరవసించెనే

ఇక చాల్ చాలు ఈ దూరాలు
కలుసుకుందాం రండీ నేస్తాలు
గిల్లికజ్జాలు కొంటె సరదాలు
అన్నీ గుర్తు చేసుకుందాం
నాటి అనుభవాలు
ఓహో హో ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ



దేశమా మేలుకో... పాట సాహిత్యం

 
చిత్రం: GODSE (2022)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సునీల్ కశ్యప్

ఆకలి చావులే అంతిమ యాత్రకి
అవిసిన గుండెలే ఆఖరి పల్లకి
కొలువులు చూపనీ... చదువులు దేనికి
 
కడుపులు నింపనీ... కలలే కాటికి
తరగని యుద్ధమా... తదినము పాతికి
దురవస్థకు బదులేనాటికి

దేశమా మేలుకో... దేశమా మేలుకో, ఓ ఓ
దేశమా, దేశమా మేలుకో
బలిగా మిగిలే బతుకా నీ కథా

చితిలో రగిలే… పతకమా నీ వ్యధ
తరగతి గదులలో… వెలిగిన రాత
బలమగు భవితగా మారదా యువతా

పదవుల లోపమా... ప్రజలకు శాపమా
సమయము సాక్షిగా... సమాజిక ద్రోహమా
ఇకనైనా క్రాంతి కనగలమా..?




# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Monday, June 27, 2022
Tholi Kodi Koosindi (1981)




చిత్రం: తొలి కోడి కూసింది (1981)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
నటీనటులు: సరిత, సీమ, మాధవి, శరత్ బాబు, మేజర్ సుందర రాజన్, జీవా 
దర్శకత్వం: కె. బాలచందర్ 
నిర్మాత: కానూరి రంజిత్ కుమార్ 
విడుదల తేది: 1981



Songs List:



అందమయిన లోకమని పాట సాహిత్యం

 
చిత్రం: తొలి కోడి కూసింది (1981)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. జానకి

పల్లవి:
అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..
చెల్లెమ్మా.. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా రామ రామా ..
ఆశలకి అంతముందా చెప్పమ్మా .. చెల్లెమ్మా
ఆశలకి అంతముందా చెప్పమ్మా ..

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..
చెల్లెమ్మా.. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

చరణం: 1
గడ్డిమేసి ఆవు పాలిస్తుంది.. పాలు తాగి మనిషి విషమౌతాడు..
గడ్డిమేసి ఆవు పాలిస్తుంది.. పాలు తాగి మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్ప తనమా.. ఇది పాల దోష గుణమా..
అది గడ్డి గొప్ప తనమా.. ఇది పాల దోష గుణమా..
మనిషి చాల దొడ్డాడమ్మా చెల్లెమ్మ..
చెల్లెమ్మా.. తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా..

చరణం: 2
ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి.. మొగలిపువ్వులోన నాగుంటాది..
ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి.. మొగలిపువ్వులోన నాగుంటాది..

ఒక మెరుపు వెంట పిడుగూ.. ఒక మంచిలోన చెడుగు
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా.. లోతుకెళ్తే కథే వేరు పిచ్చమ్మా ..

చరణం: 3
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా.. పేదవాడు నాడే పుట్టాడమ్మా
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా.. పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడూ.. ఈ పేదను తిననివ్వడూ
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా ..
ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా




ఎప్పుడో ఏదో చూసి పాట సాహిత్యం

 
చిత్రం: తొలి కోడి కూసింది (1981)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. పి. బాలు, పి. సుశీల 

ఎప్పుడో ఏదో చూసి 




కుదిరిందా రోగం పాట సాహిత్యం

 
చిత్రం: తొలి కోడి కూసింది (1981)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. జానకి 

కుదిరిందా రోగం 





ఓలమ్మి మడివేలమ్మి పాట సాహిత్యం

 
చిత్రం: తొలి కోడి కూసింది (1981)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఓలమ్మి మడివేలమ్మి 



పోలీస్ వెంకట స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: తొలి కోడి కూసింది (1981)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. పి. బాలు

పోలీస్ వెంకట స్వామి

Palli Balakrishna Sunday, June 26, 2022
Zamindarugari Ammayi (1975)




చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర, దాశరథి, కొసరజు, సినారె, వక్కలంక లక్ష్మీ పతిరావు, కె. కోదండపాణి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, ఎస్.జానకి, వి.రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, రమేష్, పుష్పలత, జె. గిరిజ 
నటీనటులు:  శారద, రంగనాథ్, గుమ్మడి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: నవతా కృష్ణంరాజు
విడుదల తేది: 31.01.1975



Songs List:



ఇంటింటా దీపాలు వెలగాలి పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: నవకాంత్, జె. గిరిజ బృందం

ఇంటింటా దీపాలు వెలగాలి
మన ఊరంతా చీకట్లు తొలగాలి



ఈ లోకపు చదరంగంలో పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: వక్కలంక లక్ష్మీ పతిరావ
గానం: వి.రామకృష్ణ

ఈ లోకపు చదరంగంలో జీవులంతా పావులే




ఇది జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి

This is Love
This is Youth
ఇది జీవితం
ఇది యవ్వనం 





ఓ.. ఓ ఓ కొండపల్లి బొమ్మ నీ కులుకులు చాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఓ.. ఓ ఓ కొండపల్లి బొమ్మ నీ కులుకులు చాలమ్మా 




మ్రోగింది వీణ పదే పదే (Female version) పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే

ఆధరాల మీద ఆడింది నామం
ఆధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన

సిరిమల్లె పువ్వు  కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే



మ్రోగింది వీణ ...పదే పదే (Male version) పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు

మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే

ఆధరాల మీద ఆడింది నామం
ఆధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన

సిరిమల్లె పువ్వు  కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే



మంగమ్మా నువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: కొసరాజు
గానం: రమేష్, పుష్పలత

సాకిరేవు కాడ నీ సోకు చూడగానే జిల్ అంది నాకు 
రాసి పెట్టి ఉన్నాది మనకు  ఇలా రాసి పెట్టి ఉన్నాది  మనకు 

మంగమ్మా నువ్వు  ఉతుకుతుంటే అందం అబ్బా వేశావే బంధం 





అబ్బ నా పాడు బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: కె. కోదండపాణి
గానం: ఎస్. జానకి

అబ్బ నా పాడు బ్రతుకు ఎవరితోటి సెప్పుకొందునే 


Palli Balakrishna
Chuttalunnaru Jagratha (1980)




చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి 
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ
విడుదల తేది: 08.08.1980



Songs List:



అప్పన్న తన మన పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు & బృందం 

అప్పన్న తన మన 



రెక్కలు తొడిగి రెప రెపలాడి పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా

వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసే వెంబడించింది...నిమిషమాగకా...
మనసు వెంబడించిందీ..నిమిషమాగకా...

చరణం: 1
చెంతగా... చేరితే....చెంతగా చేరితే.. వింతగా ఉన్నదా
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా...
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా

నిన్న కలగా ఉన్నది... నేడు నిజమౌతున్నది
నిన్న కలగా ఉన్నది.. నేడు నిజమౌతున్నది
అనుకున్నది అనుభవమైతే అంత కన్న ఏమున్నది

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది...నిమిషమాగకా...
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...

చరణం: 2
కళ్ళతో... నవ్వకు...కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది
గుండెలో చూడకు...గుబులుగా ఉన్నది...
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది

తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది...
తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది...
ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది...

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది...నిమిషమాగకా...
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా

హ..హా...ఆ..ఆ...




బావనే వయ్యారి భామ పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

బావనే వయ్యారి భామ 




అమ్మీ ఓలమ్మి పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

అమ్మీ ఓలమ్మి 




రావయ్యా రామేశం పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

రావయ్యా రామేశం





చిక్కావులేరా నా కొండే పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

చిక్కావులేరా నా కొండే

Palli Balakrishna
Nagamalli (1980)




చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: చంద్రమోహన్, దీప, మేనక 
దర్శకత్వం: దేవదాస్ కనకాల
నిర్మాత: భాస్కర వర్మ 
విడుదల తేది: 1980



Songs List:



మల్లీ మల్లీ..నా నాగ మల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల 

పల్లవి: 
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..

చరణం: 1
ఆషాఢ మాసాన మిల మిలమన్నా
మెరుపే చూసి నీవనుకున్నా
కార్తీక దీపాల కాంతులలోనా
కళలే చూసి నీవనుకున్నా
ఆరారు రుతువుల ఆలాపనగా
కనులే తెరచి నే కలలే కన్నా
కాల మేఘములు..కామ దాహములు..
కరిగినా మధుర గీతం
నిను నను కల్పిన నిముషము 
వలపున యుగయుగాల సంగీతం..
తనువు నీ వేణువే... మనసు నీ రాగమే..
మల్లి నీ కోసమే

చరణం: 2
మధుమాసంలో కుహు కుహుమన్నా
పిలుపే విని నీ కబురనుకున్నా
వైశాఖ మాసాన వేసవిలోనా
వడగాలులు నీ ఉసురనుకున్నా
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా
నను నే మరచీ నీ కౌగిట ఉన్నా
మదమరాళి నీ పద నివాళికై 
తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు 
వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై... 
చందమామ నీ వదనమై..
సిరులు మువ్వలై... 
గిరులు నవ్వులై... 
ఝరులు నడకలై..
అల్లన మెల్లన పిల్లన గ్రోవికి
ఆరవ ప్రాణము నీవుగా
కదలిరా శిల్పమై 
సంగీతమై నాట్యమై
కదలిరా శిల్పమై... సంగీతమై..నాట్యమై
కలసిపో నీవుగా... నేను నీ మేనుగా
నీవే... నేనుగా.......




నాగమల్లివో తీగ మల్లివో పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి

చరణం: 1
వీణల్లే పాడు జాణల్లే ఆడు
రసధునివై నీవు నా లోనా
ఊగాలి రాగ డోలా

నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువులీవెళా
నువ్వేనా రాసలీల
నేను వేణువై నిను వరింపగా
అలిగిన అందెల సందడిలో

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి

చరణం: 2
నువ్వే నా ఈడు నవ్వే నా తోడు
కలిసిన కాపుర మీవేళ
కావాలి నవ్య హేల

నీలో అందాలు ఎన్నో గ్రంధాలు
చదివిన వాడను ఈ వేళా
నువ్వే నా కావ్య మాలా
పువ్వు పువ్వున పులకరింతలే
విరిసెను మన చిరు నవ్వులలో

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
ఓ... నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...





నిదరోయి నదులన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

నిదరోయి నదులన్ని 




రాగం తీసే కోయిలా.. పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
పిలవని.. పిలుపుగా ..రాకే నీవిలా
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం: 1
జంటని ఎడబాసినా.. ఒంటరి నా బ్రతుకునా
మల్లెల సిరివెన్నెల.. మంటలు రేపగా...
వయసుల నులి వెచ్చని.. వలపుల మనసిచ్చిన
నా చెలి చలి వేణువై.. వేదనలూదగా...
తొలకరీ పాటలే.. తోటలో పాడకే.. పదే పదే పదే పదాలుగా
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం: 2
పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన.. ఆమని పాటగా...
అందమే నా నేరమా.. పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే.. ఆఖరి మాటగా...
గుండెలో మురళిని.. గొంతులో ఊదకే.. పదే పదే పదే పదాలుగా...
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా




వావిలపువ్వు వామన గుంట పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

వావిలపువ్వు వామన గుంట వరసో వరస




మల్లెపూలు పెట్టకుండ పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

మల్లెపూలు పెట్టకుండ





లాహిరిలో లకుముకి పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

లాహిరిలో లకుముకి

Palli Balakrishna
Aame Evaru? (1966)




చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి (All)
నటీనటులు: జగ్గయ్య, జయలలిత, వాణిశ్రీ 
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ 
నిర్మాత: పి.ఎస్.వీరప్ప 
విడుదల తేది: 22.07.1966



Songs List:



టిక్కిరికి టిక్కిరికి టట్టటా పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి 

టిక్కిరికి టిక్కిరికి టట్టటా 



నీవు చూసే చూపులో పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి 

నీవు చూసే చూపులో 




కన్నె మనసు దోచుకున్న మామయ్య పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

కన్నె మనసు దోచుకున్న మామయ్య
ఈ చిన్నదాన్ని కనికరించవేమయ్య




అందాల ఈ రేయి పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందాల ఈ రేయి 




ఓ నా రాజా రావా రావా... పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

ఓ నా రాజా రావా రావా...
ఓ నా రాజా రావా రావా... 
చెలినే మరిచేవా...

ఓ నా రాజా రావా రావా
ఓ నా రాజా రావా రావా

నీ రూపే ఆశ రేపేను 
నీ మాటే వీణ మీటేను
ఓ... ఓ... ఓ...
నీ రూపే ఆశ రేపేను 
నీ మాటే వీణ మీటేను
గతాలే నన్ను పిలిచాయి 
ఆ హాయే నేడు లేదోయి
కలగ కరిగిందంతా జగమే యెంతో వింత
రేయి పగలు నిన్నే వెతికేనూ....

ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా రావా
వృధాగ కాలమేగెను... 
నిరాశే పొంగివచ్చేను
ఓ... ఓ... ఓ...
వృధాగ కాలమేగెను నిరాశే పొంగి వచ్చేను
తరంగంలాగ రావోయి ప్రియా నన్నాదుకోవోయి
యేదో తీరని బాధ కన్నీరొలికే గాధ
రేయి పగలు నిన్నే వెతికేనూ...

ఓ నా రాజా... రావా రావా
ఓ నా రాజా... రావా రావా
నీ కోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపమైనాను

నీ కోసం నేనే వచ్చను నీ ఇంటికి దీపమైనాను
నా తోని ఆడు కోవేల ఈ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేను నా కన్నులలో నీవు
నాలో నీవు... నీలో నేనేలే....

ఓ నా రాజా రావా రావా
చెలినే మరిచేవా....

ఓ నా రాజా రావా రావా
ఓ నా రాజా రావా రావా

వరించిన మంచి వధువునులే 
రుచించే తీపి మధువునులే
ప్రియా నీ ప్రేమ కథనోయి 
సదా నీ నీలినీడనులే
ఏనాటిదో అనుబంధం 
ఎన్నడు తెగదీ బంధం...
రేయి పగలు నిన్నే వెతికేనూ....

ఓ నా రాజా... రావా రావా
ఓ నా రాజా... రావా రావా




నీ కన్నులలోన కన్నీరా పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

నీ కన్నులలోన కన్నీరా





అందచందాల పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందచందాల


Palli Balakrishna
Subhodayam (1980)




చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: చంద్రమోహన్, సులక్షణ
మాటలు: జంధ్యాల 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విశ్వనాథ్ 
నిర్మాత: సి.హెచ్. నరసింహా రావు 
విడుదల తేది: 01.11.1980



Songs List:



అసతోమ సద్గమయా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు 

అసతోమ సద్గమయా



గంధం పుయ్యురుగా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

గంధం పుయ్యురుగా 
పన్నీరు గంధం పుయ్యురుగా



కంచికి పోతావా కృష్ణమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

కంచికి పోతావా కృష్ణమ్మా




మందార మకరంద పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: పోతన 
గానం: పి. సుశీల  

పల్లవి:
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు పోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకు...

ఆ..ఆ..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా..

సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
ఆ చింత నీకేలరా

చరణం: 1 
సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి
సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి...
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా....
ఆ..ఆ..ఆ..ఆ  

చరణం: 2 
ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
యే వంక లేని నెలవంక నేనమ్మా...
నీకింక అలకెందుకమ్మా

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర
మరుగునే సాంద్రనీహారములకు
వినుత గుణశీల మాటలు వేయునేలా




నటనం ఆడెనే పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

నటనం ఆడెనే 



రాయైతే నేమిరా దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

రాయైతే నేమిరా దేవుడు హాయిగుంటాడు జీవుడు 





కస్తూరి రంగ రంగ (శ్లోకం ) పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల

కస్తూరి రంగ రంగ 


Palli Balakrishna Saturday, June 25, 2022
Punyasthree (1986)




చిత్రం: పుణ్యస్త్రీ (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: రాజేంద్రప్రసాద్, కార్తీక్, భవ్య, సంయుక్త
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.బెనర్జీ
విడుదల తేది: 28.03.1986



Songs List:



మౌనమా కోపమా పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యస్త్రీ (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు 

మౌనమా కోపమా మౌనమా కోపమా..
నా కౌగిలింతలో కలవరమా 
ప్రణయ కలహమా నా ప్రియతమా ..

దూరమేల ఈవేళా నేరమెంచగా ఏలా
ప్రాణములన్నీ నీకై వేణువులూదే వేళా
ఈ ఒడి విడిచి బతకగలనా
ఈ ముడి యముడు తెంచగలడా
పాదాల పారాణినై విధిని గెలవలేనా

శివుడు పార్వతుల జంటా 
ఇలను వెలిసె మనఇంటా
నీడను నేనై లేనా బిడ్డను నేనై రానా
నీజత నేను వీడగలనా
నీ వ్యధ నేను చూడగలనా
ఈ జన్మలో సంగమం పసుపు కడలిగా మారి




ముంజేతికి పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యస్త్రీ (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. జానకి 

ముంజేతికి 



గడపు సరి గారపు పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యస్త్రీ (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి 

గడపు సరి గారపు



పువ్వులలో పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యస్త్రీ (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి 

పువ్వులలో 

Palli Balakrishna
Bangaru Thimmaraju (1964)




చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
నటీనటులు: కాంతారావు, కృష్ణ కుమారి 
దర్శకత్వం: జి.విశ్వనాధం
నిర్మాత: యస్.భావనారాయణ
విడుదల తేది: 28.02.1964



Songs List:



కోడె కారు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: 
గానం:

కోడె కారు 



ఈ వింత పులకింత పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్. జానకి 

ఈ వింత పులకింత 




నాగమల్లి కోనలోన... పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: జమునారాణి

పల్లవి:
నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....

చరణం: 1
చూపుల్లో కైపుంది ... సొగసైన రూపుంది
వయ్యారం ఒలికిస్తుంది... వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది... మావోయ్...

చరణం: 2
నడకల్లో హొయలుంది ... నాట్యంలో నేర్పుంది ....
మలిసందె చీకట్లోన.. నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే.. దగా చేస్తది... మావోయ్





ఓ నిండు చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: కె. జె. యేసుదాస్ 

ఓ నిండు చందమామ 

Palli Balakrishna
Mooga Prema (1971)




చిత్రం: మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, సి.వి. రమణ 
గానం: పి.సుశీల , ఎల్.ఆర్.ఈశ్వరి,  జమునా రాణి,  వసంత,  యస్.పి.బాలు 
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ
మాటలు: ఆచార్య ఆత్రేయ
కథ: కె. బాలచందర్ 
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: ఎన్. ఎన్. భట్ 
విడుదల తేది: 06.03.1971



Songs List:



ఈ సంజలో..కెంజాయలో.. పాట సాహిత్యం

 
చిత్రం:  మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల,  యస్ పి బాలు 

ఈ సంజలో..కెంజాయలో..
ఈ సంజలో..కెంజాయలో..చిరుగాలులా కెరటాలలో
ఈ సంజలో..కెంజాయలో..చిరుగాలులా కెరటాలలో
ఏ మల్లి..మరులెల్ల ఎగదోసెనో..
ఏ రాజు ఎదలోతు చవి చూచెనో
హహ్హహ్హ..హ్హ..ఈ సంజలో..

ఆఆఆ..అ ఆహా..
ఓఓఓ..ఊఒ..ఓహో..
ఈ మేఘమేరాగ స్వరమో..
ఆ..ఆఆ..ఆఆఆ..
ఆ రాగమేమూగ పదమో
ఆఆఆ
ఆఆఆ..అ ఆహా..
ఓఓఓ..ఊఒ..ఓహో..
ఈ మేఘమేరాగ స్వరమో..
ఆ..ఆఆ..ఆఆఆ..
ఆ రాగమేమూగ పదమో
ఆఆఆ

ఓ..ఓఓ..ఓఓఓ..చిలికింది అది లేత కవిత
ఆఆఆ..ఆఆ
తొలికింది తనలోని మమత
మదిలో..మమతలో..రిమ ఝిమ రిమ ఝిమ రిమ ఝిమ


ఓ..ఓ..ఓ.. ఈ చెంగు ఏ వయసు పొంగో
ఆ..ఆఆ..ఆఆఆ..
ఆ పొంగు ఆపేది ఎవరో..అదెవరో..రెప రెప రెప రెప
ఈ సంజలో..

ఊఊఊ..ఊఊఊ..ఊహూ..
ఆఆఆ..అ ఆహా..

పులకించి ఒక కన్నెమనసు
ఆ..ఆఆ..ఆఆఆ..
పలికింది తొలి తీపిపలుకు
పులకించి ఒక కన్నెమనసు
ఆ..ఆఆ..ఆఆఆ..
పలికింది తొలి తీపిపలుకు
ఈ సంజలో..

ఆఆఆ..అ ఆహా..
ఓఓఓ..ఊఒ..ఓహో..

నా కళ్ళలో ఇల్లరికము
ఆఆఆ..ఆఆ..ఆ
నా గుండెలో రాచరికము
ఆఆఆ..ఆఆ..
నా కళ్ళలో ఇల్లరికము
ఆఆఆ..ఆఆ..ఆ
నా గుండెలో రాచరికము

ఓ..ఓఓ..ఓఓఓ..ఈ వేళ నీవేలే నిజము
నేనుంది నీలోన సగము
సగమే జగముగా..కల కల కల..కిల కిల కిల

ఈ సంజలో..కెంజాయలో..చిరుగాలులా కెరటాలలో
ఏ మల్లి..మరులెల్ల ఎగదోసెనో..
ఏ రాజు ఎదలోతు చవి చూచెనో
హహ్హహ్హ..హ్హ..ఈ సంజలో..



జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం:  మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం:
గానం: 

జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు 




మొయిలు చూచి మురిసిపోయి పాట సాహిత్యం

 
చిత్రం:  మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: 
గానం: పి.సుశీల 

మొయిలు చూచి మురిసిపోయి నటనమాడు నెమలిలో




నాగులేటి వాగులోన పాట సాహిత్యం

 
చిత్రం:  మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: 
గానం: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి : సి.వి. రమణ

నాగులేటి వాగులోన



పోనివ్వం పోనివ్వం పాట సాహిత్యం

 
చిత్రం: మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: 
గానం: వసంత, కె. జమునారాణి, యస్.పి. బాలు  బృందం

పోనివ్వం పోనివ్వం




వెయ్ వెయ్ చేతిలోన చేయి వెయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం:
గానం: 

వెయ్ వెయ్ వెయ్ వెయ్ చేతిలోన చేయి వెయ్




ఏమీ ఎరుగని దాననా పసిపాపనా పాట సాహిత్యం

 
చిత్రం: మూగ ప్రేమ (1971)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: 
గానం: పి. సుశీల , ఎల్. ఆర్. ఈశ్వరి

ఏమీ ఎరుగని దాననా పసిపాపనా

Palli Balakrishna Wednesday, June 22, 2022
Nirdoshi (1967)




చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల 
నటీనటులు: యన్. టి. రామారావు , సావిత్రి 
దర్శకత్వం: దాదా మిరాసి 
నిర్మాత: యన్. రామబ్రహ్మం 
విడుదల తేది: 02.02.1967



Songs List:



సుకు సుకు సితారు బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

సుకు సుకు సితారు బొమ్మ



సింగారి చెకుముకు రవ్వ పాట సాహిత్యం

 
చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల 

సింగారి చెకుముకు రవ్వ ఏమంటున్నాది



మల్లియలారా మాలికలారా పాట సాహిత్యం

 
చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

పల్లవి:
మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా

మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా

చరణం: 1
జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెలలోనే చీకటి మూగే
జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెలలోనే చీకటి మూగే

పలుకగ లేక పదములు రాక
పలుకగ లేక పదములు రాక
బ్రతుకే తానే బరువై సాగే

మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా

చరణం: 2
చెదరిన వీణ రవళించేనా
జీవన రాగం చివురించేనా
చెదరిన వీణ రవళించేనా
జీవన రాగం చివురించేనా

కలతలు పోయి వలపులు పొంగి
కలతలే పోయి వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా

మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా





ఈ పాట నీకోసమే పాట సాహిత్యం

 
చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఈ పాట నీకోసమే 




చిన్నారి కృష్ణయ్య పాట సాహిత్యం

 
చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల 

చిన్నారి కృష్ణయ్య 




ఔనన్నా కాదన్నా పాట సాహిత్యం

 
చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, ఎల్. ఆర్. ఈశ్వరి 

ఔనన్నా కాదన్నా 


Palli Balakrishna Tuesday, June 21, 2022
Nippulanti Manishi (1974)




చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర , డా॥ సి. నారాయణరెడ్డి, కొసరాజు
గానం: పి. సుశీల, యస్.జానకి,  ఎల్. ఆర్. ఈశ్వరి, యస్ పి బాలు
నటీనటులు: యన్. టి. రామారావు, లత , దేవిక
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం:  యస్.డి.లాల్ 
నిర్మాత: వై. వి. రావు 
విడుదల తేది: 25.10.1974



Songs List:



కత్తికి సాన పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  యస్ పి బాలు

కత్తికి సాన




వెల్కమ్ స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  ఎల్. ఆర్. ఈశ్వరి 

వెల్కమ్ స్వాగతం 




ఓరబ్బి ఓరబ్బి పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  యస్ పి బాలు, పి. సుశీల 

ఓరబ్బి ఓరబ్బి 




ఏదో అనుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి 
గానం:  పి. సుశీల 

ఏదో అనుకున్నాను 




స్నేహమే నాజీవితం పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  యస్ పి బాలు

పల్లవి :
అల్లాయేదిగి వచ్చి (2)
ఆయ్ మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దూ..
పెద్దలిక్కేగద్దెలొద్దంటాను
ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను
ఒక్క నేస్తం కావాలంటాను
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి
స్నేహమే హోయ్...
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం (2)
 
చరణం: 1
గుండెనే పలికించితే (2)
కోటి పాటలు పలుకుతాయ్
మమతనే పండించితే
మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ..
లేదు అంతకు మించి హాయి
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం (2)

చరణం: 2
కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు (2)
ఏమిటో ఈ బాధ (2)
నాకైనా చెప్పు భాయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి (2)
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి  (2)
చుక్కలను కోసుకుని తెమ్మంటావా
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా (2)
ఆ చంద్రుణ్ణి
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను (2)
దోస్తీకి నజరానా
దోస్తీకి నజరానా  చిరునవ్వురా నాన్న (2)
ఒక్క నవ్వేచాలు వద్దులే వరహాలు
నవ్వరా..
నవ్వరా మావాడు నవ్వరా నిండుగా (2)
నవ్వరా నాముందు రంజాను పండుగా
స్నేహమే హోయ్...
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం (2)

Palli Balakrishna
Velugu Needalu (1961)




చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం  శ్రీ శ్రీ , కొసరాజు 
నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి, రాజ సులోచన (అతిధి పాత్రలో) 
మాటలు: ఆచార్య ఆత్రేయ
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి. మధుసూధన రావు 
విడుదల తేది: 01.01.1961



Songs List:



హాయి హాయిగా జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం  శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల 

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో




పాడవోయి భారతీయుడా పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల 

పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా...

నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ ఓ ఓ

పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా

ఓ ఓఓ ఓఓ ఓఓ…
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి

ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా...
ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా...
ఆగకోయి భారతీయుడా

ఆకాశమందుకునే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
ఆకాశమందుకునే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
అవినీతి, బంధుప్రీతి… చీకటి బజారూ
అలముకున్న నీ దేశమెటు దిగజారూ

కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి...
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి...
కాంచవోయి నేటి దుస్థితి

పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే ఏ ఏ ఏ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే

స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయకం...
స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయక...
స్వార్థమే అనర్థకారణం

సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం

ఏకదీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం

లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం




చల్లని వెన్నెల సోనలు పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: జిక్కీ, పి. సుశీల 

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు

పిడికిలి మూసిన చేతులు లేత గులాబీ
రేకులు పిడికిలి
మూసిన చేతులు లేత గులాబీ రేకులు పిడికిలి
చెంపకు చారెడు సోగకన్నులే
సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు 

ఇంటను వెలసిన దైవము - కంటను మెరిసిన దీపం
మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము 

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు
నోచిన నోముల పంటగ అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్టలె నీ పెన్నిధిగా
నూరేళ్ళాయువు పొందుమా





ఓ రంగయో పూలరంగయో పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో



కల కానిది విలువైనది పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: ఘంటసాల 

కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ..ఓ..ఓ...ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా 
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ..ఓ..ఓ...ఓ.. సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో 
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే 
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే 
ఏదీ తనంతతానై నీదరికి రాదూ సోదించి సాదించాలి అదియే ధీరగుణం  
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు




సరిగంచు చీరకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల, పి.సుశీల

సరిగంచు చీరకట్టి 





భలే భలే పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: ఘంటసాల , మాధవపెద్ది సత్యం

భలే భలే 





చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: పి. సుశీల , స్వర్ణలత 

చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు






శివ గోవింద గోవింద పాట సాహిత్యం

 
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం:  కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, ఉడుత సరోజినీ 

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి
శ్రీమతే రామానుజాయ నమ

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

తమ బాగు కోసమై తంటాలు పడలేరు
ఎదుటి కొంపకు ఎసరు పెడతారయా
పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి
శ్రీమతే రామానుజాయ నమ

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి
శ్రీమద్రమారమణ గోవిందో

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

కలిమి లేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు
కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు
కలిమి పెంచే కాయ కష్ట జీవుల పని
శ్రీమతే రామానుజాయ నమ

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా
ఆ నాడి శ్రీ యోగి వీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా
ఈనాడు కొడసరి వెంగళప్ప మాట
అక్షరాలా జరిగి తీరేనయా

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద


Palli Balakrishna Thursday, June 16, 2022

Most Recent

Default