Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ramarajyamlo Raktha Patham (1976)




చిత్రం: రామరాజ్యంలో రక్తపాతం (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల 
దర్శకత్వం: పర్వతనేని సాంబశివరావు
నిర్మాత: రామ విజేత ఫిల్మ్స్
విడుదల తేది: 25.06.1976



Songs List:



ఎందుకోసం వచ్చావు తుమ్మెద పాట సాహిత్యం

 
చిత్రం: రామరాజ్యంలో రక్తపాతం (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఎందుకోసం వచ్చావు తుమ్మెద 



కన్నులు రెండు పెదవులు రెండు పాట సాహిత్యం

 
చిత్రం: రామరాజ్యంలో రక్తపాతం (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కన్నులు రెండు పెదవులు రెండు 



ఇవాళ రండి రేపు రండి పాట సాహిత్యం

 
చిత్రం: రామరాజ్యంలో రక్తపాతం (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: యస్.పి.బాలు

ఇవాళ రండి రేపు రండి 




సూదంటు రాయంటి చిన్నోడా పాట సాహిత్యం

 
చిత్రం: రామరాజ్యంలో రక్తపాతం (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

సూదంటు రాయంటి చిన్నోడా 



ఖభర్ధార్ ఖడేరహ్ పాట సాహిత్యం

 
చిత్రం: రామరాజ్యంలో రక్తపాతం (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: యస్.పి.బాలు, వి.రామకృష్ణ 

ఖభర్ధార్  ఖడేరహ్

Palli Balakrishna Monday, July 24, 2023
Kalavari Samsaram (1982)




చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, రాజేంద్రప్రసాద్, సుధాకర్, శుభ, గీత 
దర్శకత్వం: కె.యస్.రామిరెడ్డి 
నిర్మాత: దోనేపూడి బ్రహ్మయ్య
విడుదల తేది: 03.12.1982



Songs List:



ఈ అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

ఈ అనురాగం



ఇద్దరమొకటై పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

ఇద్దరమొకటై



మచ్చలేని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

మచ్చలేని చందమామ మాపటేల కోసుకొచ్చి




రసికుడవని పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: నరాల రామా రెడ్డి
గానం: యస్. జానకి

రసికుడవని



సంకురాత్రి పండగ పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు 

సంకురాత్రి పండగ




కసి కసి కట్నం కౌగిలి కట్నం పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

కసి కసి కట్నం కౌగిలి కట్నం 

Palli Balakrishna
Paramanandayya Sishyula Katha (1966)




చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, కె.ఆర్.విజయ 
దర్శకత్వం: సి.పుల్లారావు
నిర్మాత: తోట సుబ్బారావు 
విడుదల తేది: 07.04.1966



Songs List:



ఓం నమశ్శివాయ పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పట్టాభి, రఘురాం, బద్రం, గోపాల్ రావు, బాబు, సరోజినీ, విజయలక్ష్మి

ఓం నమశ్శివాయ



ఇదిగో వచ్చితి రతిరాజా పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.జానకి 

ఇదిగో వచ్చితి రతిరాజా 



ఎనలేని ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: ఘంటసాల, యస్.జానకి 

ఎనలేని ఆనందం 




ఓ మహాదేవ పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పి.సుశీల 

ఓ మహాదేవ 



నాలోని రాగ పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

నాలోని రాగ 



వనిత తానంతట పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పి.లీల, ఏ.పి.కోమల

వనిత తానంతట 




పరమ గురుడు పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, రాఘవులు, చక్రవర్తి, బద్రం, కృష్ణమూర్తి 

పరమ గురుడు 




కామినీ మధన రారా పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, పి.లీల

కామినీ మధన రారా

Palli Balakrishna
Baby (2023)




చిత్రం: Baby (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్
దర్శకత్వం: సాయి రాజేష్ 
నిర్మాత: SKN
విడుదల తేది: 2023



Songs List:



ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట సాహిత్యం

 
చిత్రం: Baby (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రీరామ్ చంద్ర 

ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మాయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో

ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే మెల్లగా మెల్లగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏ నిజములా ఆ ఆ
సాగిందే దారంతా
చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ

కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్లైనా విడిపోక


ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మాయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో

ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే మెల్లగా మెల్లగా



దేవరాజ పాట సాహిత్యం

 
చిత్రం: Baby (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: ఆర్య దయాల్

తదుమ్ తనిక తకుమ్
తనీయ తకదును తదుమ్
తనిక తదుమ్ తనిక తా

తదుమ్ తనక తధిమ్
తనక తకధిను తదుమ్
తనిక తదుమ్ తనక తా

దేవ రాజ సేవ్య మూర్ధనే
కీర్ణలోచనే, ఆ ఆ
భావ బీజ గణ్య వాహిని
నిత్య నూతనే, ఆ ఆ

మలయజ హాస హాస్య
వినిమయముగ లలిత సాధ్వితే
సరసిజ వీక్ష నాక్ష
విరచిత కావ్య కధన నాయికే

ప్రభవ ప్రభకలిత
విభవ శుభ జలిత
విభుధ సంస్తుత్య భూమికా

మలుపు కనపడని
మునుపు ఎదురవని
జగతి చేరింది తెలియక
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ

నిజమనుకోనే క్రీనీడలే
అడుగడుగున ఉంటాయని
తెలుపదు కదా ఓ పాఠమై, చదువే

నిలకడ అనే ఆ మాటకే
నిలబడమనే అర్ధం అని
అతి సులువుగ అనిపించదే బ్రతుకే

భ్రమలమైకాన భ్రమణమే చేసి
భ్రమరమౌతుంది కాలమే
అడుగు తడబడగ నేర్చుకొను నడక
దాటుకొస్తుంది కాలమే

వెలుగు జిలుగుల్లో వెలిగి పోలేక
వెలిగి వస్తుంది చీకటే
కలుసుకున్నంత కలిసిపోకంటూ
మనకు చూపేను బాసటే

జారే జారే నెర్రలపై
ప్రయాణమే ఈ జీవితం
పరాకనే తెర దాటితే
జయం సదా (సదా)
ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆ ఆఆ ఆ ఆఆ

దేవ రాజ సెవ్య మూర్ధనే
కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ




ప్రేమిస్తున్నా పాట సాహిత్యం

 
చిత్రం: Baby (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గానం: PVNS రోహిత్ 

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే

మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

నువ్వు ఎదురే నిలబడితే
వెలిగెనులే నా కంటి పాపలు
ఒక నిమిషం వదిలెలితే
కురిసేనులే కన్నీటి ధారలు

అపుడెపుడో అల్లుకున్న బంధమిది
చెదరదుగా చెరగదుగా
మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది
కరగదుగా తరగదుగా
మరణము లేనిదొక్కటే
అది మన ప్రేమ పుట్టుకే

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

నను ఎపుడూ మరువనని
పరిచావులే చేతుల్లో చేతిని
నను వదిలి బ్రతకవనీ
తెలిసిందిలే నీ శ్వాస నేనని

నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం
మనసుకదే వరము కదా
అణువణువు నీలో నన్నే నింపుకోడం
పగటికలే అనవు కదా
మలినము లేని ప్రేమకి
నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే

మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ



రిబపప్ప రిబసప్ప పా పాట సాహిత్యం

 
చిత్రం: Baby (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గానం: శ్రీకృష్ణ

ఎదురుగా ఇంతందంగా
కనిపిస్తుంటే నీ చిరునవ్వు
ఎదసడే హద్దులు దాటే
చూడూ చూడూ చూడూ

కుదురుగా ఉందామన్న
ఉంచట్లేదే నన్నే నువ్వు
నిదరకే నిప్పెడతావే
రోజూ రోజూ రోజూ

నీ చూపుల్లోన బాణం
అందంగా తీసే ప్రాణం
నీ మౌనంలోన గానం
ప్రాణాలు పోసే వైనం
అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నా

రిబపప్ప రిబసప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబసప్ప పా
వరం ఇచ్చుకో

రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్ప రిబసప్ప పా
ఆలకించుకో ఓ ఓ హో

నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడూ
నీలోనే దాచేసుకో ఎప్పుడూ
ఆ మాట నువ్విస్తే నాకిప్పుడూ
ఇంకేది అడగన్లే నిన్నెప్పుడూ

నా చేతి రేఖల్లో నీ రూపురేఖల్ని
ముద్రించుకున్నాను చిలకా
నా నుదుటి రాతల్లో నీ ప్రేమలేఖల్ని
చదివేసుకున్నాను తెలుసా

చెలియ నాపై కొంచం మనసుపెట్టూ
నీ ప్రేమంతా నాకే పంచిపెట్టూ
నా ఊపిరికి నువ్వే ఆయువుపట్టూ
నీతో ఉండే భాగ్యం రాసిపెట్టూ
కుదరదనకు వలపు వెన్నెలా

రిబపప్ప రిబసప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబసప్ప పా
వరం ఇచ్చుకో

రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబసప్ప రిబసప్ప పా
ఆలకించుకో ఓ ఓ

నువుతప్ప నాకేమి కనిపించదు
నువుతప్ప చెవికేది వినిపించదు
నువులేని ఏ హాయి మొదలవ్వదు
నువురాని నా జన్మ పూర్తవ్వదు

నీ కలలతో కనులు ఎరుపెక్కి పోతున్నా
చూస్తూనే ఉంటాను తెలుసా
నీ ఊహతో మనసు బరువెక్కి పోతున్నా
మోస్తూనే ఉంటాను మనసా

నిన్నే ఆలోచిస్తూ మురిసిపోతా
మురిసీ మురిసీ రోజు అలసిపోతా
అలిసీ అలిసీ ఇట్టే వెలిసీపోతా
వెలిసీ వెలిసీ నీలో కలిసిపోతా
తెలుసుకోవె కలల దేవతా

రిబపప్ప రిబసప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబసప్ప పా
వరం ఇచ్చుకో

రిబపప్ప రిబసప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబసప్ప రిబపప్ప పా
ఆలకించుకో ఓ ఓహో




చంటిపిల్లలా పాట సాహిత్యం

 
చిత్రం: Baby (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గానం: అనుదీప్ దేవ్

చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

తనమాటే వినలేని వెర్రిది
మనమాటేం వినిపించుకుంటది
అటుఇటుగా పరుగుల్ని తీస్తది
చోద్యం చూడ్డం మినహా హా
ఇవ్వలేం కదా ఏం సలహా

చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ
ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ
ఆలోచించే తెలివే, అరెరే ఉంటే
దాన్నెవరైనా మనసే అంటే వింతే

రంగు రంగు తారలు
రేపుతుంటే ఆశలు
చూసుకోదు చిక్కులు
చాపుతుంది రెక్కలు

చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

ఆనందంలో ముంచేస్తుందో
ఆవేదనలో ఉంచేస్తుందో
ప్రశ్నేదైనా గానీ..! బదులే రాదే
తీరం ఎక్కడ ఉందో దారే లేదే

ఈ మనస్సు గారడీ అంతుపట్టలేనిది
పక్కవాడి వేదనే దానికర్ధమవ్వదే

ఓ, చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

తనమాటే వినలేని వెర్రిది
మనమాటేం వినిపించుకుంటది
అటుఇటుగా పరుగుల్ని తీస్తది
చోద్యం చూడ్డం మినహా హా
ఇవ్వలేం కదా ఏం సలహా




కలకలమే రేగిందీ కథలో పాట సాహిత్యం

 
చిత్రం: Baby (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గానం: సాహితి చాగంటి 

కలకలమే రేగిందీ కథలో
కలవరమే కమ్మిందీ మదిలో
కలకలమే రేగిందీ కధలో
కలవరమే కమ్మిందీ మదిలో

ఏ లేత హృదయాల మధ్యన
అనుకోని ఒకలాంటి ఉప్పెన
ఆగేనా ఎవరెంత ఏడ్చినా
ప్రేమ ప్రేమా ప్రేమా
ప్రళయమె నీ చిరునామా..?

కలకలమే రేగిందీ కధలో
కలవరమే కమ్మిందీ మదిలో

కన్నీరంతా కడలై పొంగి
కల్లోలంలా మార్చేసింది
సుడిగుండంలో పడవై బ్రతుకే మారే
బయటే పడదామన్నా, లేదే దారి

కన్నీరంతా కడలై పొంగి
కల్లోలంలా మార్చేసింది
సుడిగుండంలో పడవై, బ్రతుకే మారే
బయటే పడదామన్నా, లేదే దారీ

పోరుగాలి తీరుగా
జీవితాలు మారగా
దేవుడైన జాలిగా
దారి చూపలేదుగా

కధ ఒకటే రాసిందీ కాలం
ఆ కధలో ఊహించని గాయం
కధ ఒకటే రాసిందీ కాలం
ఆ కధలో ఊహించని గాయం

విధి ఆడే వింత ఆటలో
ఎదచాటు ఎన్నెన్ని కుదుపులో
ఎడబాటే ప్రతిమలుపు మలుపులో
కలతే నిండిన కనులు
కనలేమింకేం కలలు

Palli Balakrishna Sunday, July 23, 2023
Bhola Shankar (2023)




చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ 
దర్శకత్వం: మెహర్ రమేష్ 
నిర్మాత: సుంకర రామబ్రహం 
విడుదల తేది: 11.08.2023



Songs List:



భోళా శంకర్ మేనియా పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఎల్.వి.రేవంత్, మహతి స్వర సాగర్ 

ఏ అదిరే స్టైలయ్యా
పగిలే స్వాగయ్యా
యుఫోరియా నా ఏరియా

ఎయ్ భోళా మానియా
భోళా భోళా భోళా
భోళా మానియా
భోళా భోళా భోళా

యెహ ఎగస్ట్రాలొదయ్య
కొలెస్ట్రాలొదయ్య
ఎవ్వడైన గూబ గుయ్యా

ఎయ్ భోళా మానియా
భోళా భోళా భోళా
భోళా మానియా
భోళా భోళా భోళా

యే గరము గరము ఇరానీ చాయ్
గుటక దిగితే ఎనర్జీ
ఉస్మానియా బిస్కెట్ చాలు
ఉడుకులేసుద్ధి

ధడకు ధడకు గుండె సరకు
ఫైరు బ్రాండ్ ఎమోజి
టచ్ చేస్తే తాట రేగుద్ది

వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
యెయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే స్విచ్ఛాను గోలా
భోళా భోళా భోళా
హమర ఎంట్రీ భీభత్స మేళా

భోళా శంకర్
జై బోలో భోళా శంకర్

ఏ ఎంచుకున్న ఏ పనైనా
ఎక్సలెంట్ గా సెయ్యాలా
ఎత్తుకున్న మన జెండాని
పీక్స్ లో ఎగరెయ్యాలా

ఎయ్ ధనాధన్ పటాసే
మన ఫైరింగు
హే ఘనాఘన్ తూటార
మన వార్నింగు
ఎయ్ ఫటాఫట్ ఫినిషే ప్రతి డీలింగు
దందాలో టాప్ రేటింగు

ఏ అదిరే స్టైలయ్యా
పగిలే స్వాగయ్యా
యుఫోరియా నా ఏరియా
ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా

లగాయించి ఎస్కో
ఫుల్లు రొమాంటిక్ ఈలా
జమాయించమందీ
చాంగ్ జపనీ మసాలా

నీకు నాకు నడి మధ్య
లేదే ఏల పాల
తగేడి రాజాల
ఆజా మేరా భోళా
భోళా భోళా భోళా భోళా

ఏ మరణమాసు తిరనాల్లేరా
మనమట్టా ఓ చిటికేస్తే
గండ్ర గత్తరా గల్లాటేగా
మన ఇస్టైల్లో స్టెప్పేస్తే

బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ
కొద్దిగ పద్ధతి తప్పితే ఏమైంది
దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి
అరె ఎంజయ్మెంట్ ఎవ్వడాపేది

వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
యెయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే స్విచ్ఛాను గోలా
భోళా భోళా భోళా
హమర ఎంట్రీ భీభత్స మేళా

జై బోలో భోళా శంకర్
భోళా శంకర్
జై బోలో భోళా శంకర్



జామ్ జామ్ జజ్జనక పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ

అరె డప్పేస్కో దరువేస్కో
వవ్వారే అదిరే పాటేస్కో
అరె ఈలేస్కో ఇగ జూస్కో
ఇయ్యాళ డాన్సు ఇరగేస్కో

ధనా ధనా గంతేసుకో
సయ్యారే సయ్యంటూ చిందేసుకో
గణా గణా ఊపేసుకో
నీ స్టెప్పు తోటి టాపు లేపేసుకో

ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క

ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్కా
జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క

తమ్ముళ్ళు
మనకు కొంచెం చేంజ్ కావాలమ్మ
దరువు మార్చి కొత్త సౌండ్ ఏస్కోండి

ఓయ్ నరసపెల్లే నరసపెల్లే
నరసపెల్లే గండిలోన గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి

నరసపెల్లే గండిలోన గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి
కలిసినాది గంగధారి కలిసినాది గంగధారి

నాటు పిల్లా మాటలకు గంగధారి
పోటుగాడు రెచ్చిపోయే గంగధారి

నరసపెల్లె గండిలోని గంగధారి
మాసు మాసు నచ్చినాడు గంగధారి
మాసు మాసు నచ్చినాక పిల్లదారి
మనసు నేనే ఇచ్చినాను గంగధారి

ఖోలోరే ఖోలోరే దిల్లు
నువు నాచోరే నాచోరే ఫుల్లు
నీ అల్లర్ల అత్తర్లు చుట్టూరా నువ్ జల్లూ

ఇది నశాల నిశాల త్రిళ్ళు
ఎక్కు పెట్టెయ్యి కుషీలా విల్లు
చల్ నీ సౌండు రీ సౌండు వచ్చేంతలా తుళ్లు

ఓ ఏ ఏ ఏ కొ కొ కొ ఆడేసుకో
వేలాది వేడుకల్ని చేస్కో
అరె కొ కొ కొ వాడేసుకో
ఈ టైము పోతే రాదు దా దా దా

జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క హెయ్

హోయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
అరె అరె అరె జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క



మిల్కీ బ్యూటీ పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సంజన కల్మాంజి, విజయ్ ప్రకాష్ 

అచ్చ తెలుగు పచ్చి మిర్చి
మొగాడు వీడు
భోంబాటు గాటు హాటుగున్నాడే
కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో
సూది గుచ్చి పిల్లా
నీ ముచ్చటేంది అన్నాడే

పంచదార చిలకలాంటి
ప్యారీ సుకుమారి
నీ చమకు చూసి దుముకుతున్న
చిలిపిగ నోరూరి

వారెవ్వా అల్లరి విజిలేసి
యురేకా అన్నా నిన్ను చూసీ
అంతలేసి గ్లామరేందే
అందాల రాశి

అలా నా హార్టుని తిరగేసి
నీ బొమ్మని టాటుగా వేసీ
మైండు మొత్తం మార్చినావే
మ్యాజిక్ చేసేసి

ఆ, మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ
అరె నీకు నాకు డేటింగు పార్టీ

ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు డేటింగు పార్టీ

ఆ, మనసులోకి మ్యాన్లీగా దూసుకొచ్చావే
సొగసు జారే హరికేన్లే తీసుకొచ్చావే

ఓ ఓ, కలర్ఫుల్లు కలలెన్నో మోసుకొచ్చావే
నీ పేరు చివర నా పేరే రాసుకొచ్చావే

నీ ఊపిరి సెగలే చాల్లే
యమహాగా ఉందే ఫీలే
ఆ వేడికి మెల్టౌతాయే
ఐరోపా హిమశిఖరాలే

చిరు చిటికేసావో చాల్లే
పరువాలకు భూకంపాలే
సీతచిలుకల్లా వాలె
నీ చూపుల బాణాలే

ఆ, మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ
అరె నీకు నాకు డేటింగు పార్టీ

ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు డేటింగు పార్టీ




కొట్టర కొట్టు తీనుమారో పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె చోలె చోలె చోలో నాచి
బాబు మోషల్ చోలో నాచి
చోలె చోలె చోలె చోలో నాచి
బాబు మోషల్ చోలో నాచి

జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే

జోషు నింపు బేటా
నువ్ ఉన్న ప్రతీ చోటా
ఖుషీ ఉండాలంటా
నువ్వు చెప్పేలోగా టాటా

కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే

బ్లాకండు వైటులోన
నీ రెండు కళ్ళే ఉన్నా
రంగు రంగుల్లోన
నువు కలలు కనర కన్నా

కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

లైఫంటే లయను సఫారి
అందులో నువ్వే షికారి
సూటిగా దూసుకెళ్లి చెయ్ స్వారీ

నువ్వు సాగేటి నీ దారి
స్పీడు బ్రేకర్ల సవారి
నవ్వు నిన్ను మోసుకెళ్ళే ఫెర్రారీ

అరె సంతోషాల డోలీ
(అరె సంతోషాల డోలీ)
ఎక్కి సుట్టూ ఊరేగాలి
(ఎక్కి సుట్టూ ఊరేగాలి)

బతుకంటే రంగుల హోళీ
ప్రతిక్షణం ఓ దివాళి
నిలువెల్లా ఫైరే
నీలో నిండి ఉండాలి

కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే
జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే



Rage Of Bhola పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: ఫిరోజ్ఇజ్రాయిల్, మెహర్ రమేష్ 
గానం: అసుర, ఫిరోజ్ఇజ్రాయిల్

హే, ఒకటి రెండు మూడు
వచ్చాడు అన్న సూడు, హుయ్ హుయ్
స్టేటంత ఎతికి సూడు
ఎదురొచ్చెటోడే లేడు

హే, మెగా మాసు మావోడే
భగ భగ భగ భోళా
దడ దడ దడ ధడా ధడా
దెబ్బ అదిరిపోలా
లక్కిగోడ లాంటోడే
భగ భగ భగ భోళా
గడ గడ గడ గడగడా
గుండెలదిరిపోలా

భగ భగ భగ భోళా
భగ భగ భగ భోళా
భగ భగ భగ భోళా
భగ భగ భగ భోళా

సలాం కొట్టి సైడైతే బతికిపోతరు
సరాసరి ఎదురైతే సితికిపోతరు
హే, తనామనా సూసాడో మిగిలిపోతరు
ఘరానాగ దూకారో నలిగిపోతరు

ఏ, అన్నతోనే పెట్టుకుంటే ఆగమౌతరు
లొల్లిగిల్లి చేశిర్రో హాఫు మర్డరు

ఏయ్, సైకైతే సావేజ్
భగ భగ భగ భోళా
ఫైటైతే రాంపేజ్
భగ భగ భగ భోళా
హే, ఎత్తుకుంటే వోల్టాజ్
భగ భగ భగ భోళా
అరె ఎవ్వడైనా డామేజే, హే

ఏయ్, సైకైతే సావేజ్
భగ భగ భగ భోళా
ఫైటైతే రాంపేజ్
భగ భగ భగ భోళా
హే, ఎత్తుకుంటే వోల్టాజ్
భగ భగ భగ భోళా
అరె ఎవ్వడైనా డామేజే, హే

Palli Balakrishna Saturday, July 22, 2023

Most Recent

Default