Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Matti Manishinandi Nenu (2019)





పాట: మట్టి మనిషినండి నేను (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: బేబీ పసల


మట్టిమనిషినండి నేను సాహిత్యం

 
పాట: మట్టి మనిషినండి నేను (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: బేబీ పసల

మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను
మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను

పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం

ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో
ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో

చెమటచుక్క చదువులు నాయి కాయాకష్టం పాఠాలు
పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు

ఏతమేసి తోడానండీ నాలోఉన్న రాగాలు
దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు

పచ్చపచ్ఛాని పైరమ్మ పాట
ఏరువాకల్లో నాఎంకిపాట

ముళ్లదారే తీసి, పూలేఏసి మీముందు ఉoచాయీ పుట
ఇది నాబతుకు పాట
తీపిరాగాల తోటి, మావూరు దాటి మీకోసమొచ్చాను

మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను
మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను

పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం

ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో
ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో

Palli Balakrishna Sunday, May 30, 2021
Shivaratri Song (2020)





పాట: శివరాత్రి పాట (2020)
సంగీతం: SK మదీన్
రచన: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లి
దర్శకత్వం: దాము రెడ్డి
విడుదల తేది: 2020


శివరాత్రి పాట (2020) సాహిత్యం

 
పాట: శివరాత్రి పాట (2020)
సంగీతం: SK మదీన్
రచన: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లి


Palli Balakrishna Saturday, May 29, 2021
Sankranthi Song (2019)



పాట: సంక్రాంతి పాట (2019)
సంగీతం: SK.బాజీ
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2019) సాహిత్యం

 
రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు 
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి..
కోడితో పందెం కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

పంతాలతో రగిలిన మన రాయలసీమ. 
ఆనందాలకు సంక్రాంతే చిరునామా
పౌరుషాల వెలివేసిన పండుగ నీవు
ప్రేమలతో  ప్రతి గుండెల పెనవేసావు
తెలతెలవారుతుంటే రాజేసే భోగి మంట 
కొత్త అల్లుళ్ళతో  కోనసీమ మురిసేనంట
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా
ఊరిని తలుచుకొని తన్మయమే చెందేనట

ఆట పాటలకే  పట్టం కట్టి 
సంతోషాలకే శ్రీకారం చుట్టి..
తరలి తరలి వచ్చెనదిగో సంక్రాంతి
ప్రేమల చిరునామా..రాయలసీమ 
అనురాగాల రాగం పాడేనమ్మా
పసిడి కోనసీమ  పంటచేల నడుమ 
పరువాల గోదావరి పారేనమ్మా
పంటలు కానుక ఇచ్చి 
రైతుల కలలను తీర్చి 
పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి
పచ్చి పాలజల్లు పచ్చని పొదరిల్లు
పైరులతో పల్లెలన్నీ విలసిల్లు
మంచు పూలజల్లు పరిమళాలు చల్లు
వేలాది పువ్వుల కల్లాపిని చల్లు

ఏరువాక ఎదల మీద పంటను తీసి 
సంచారజాతికింత దానం చేసి
గోమాత, భూమాతల పూజలు చేసి 
హరిదాసుల కీర్తనలు గానం చేసి
నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణం..
బొమ్మల కొలువులోన కొలువుదీరే పసితనం 
పసుపు కుంకుమలే పడతులకు వాయనం
గగనం తాకునమ్మా గాలిలోన పతంగం
స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం 
ఉత్తర దిక్కున భానుడి  సంచారం 
తెలంగాణ, ఆంధ్రులకు చెరిపెను దూరం

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి
కోడితో పందెం కట్టి. ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే    సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

Palli Balakrishna
Hanuman Chalisa by MS Rama Rao



తెలుగు హనుమాన్ చాలీసా
రచన, సంగీతం: ఎమ్.ఎస్.రామారావు
గానం: డా. పి. శ్రీనివాస్ 
("సుందరదాసు" ఎమ్. ఎస్. రామారావు మనవడు)


తెలుగు హనుమాన్ చాలీసా సాహిత్యం

 
తెలుగు హనుమాన్ చాలీసా
రచన, సంగీతం: ఎమ్.ఎస్.రామారావు
గానం: డా. పి. శ్రీనివాస్ 
("సుందరదాసు" ఎమ్. ఎస్. రామారావు మనవడు)

ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ 

★★★★★★★★★

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత 

రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ

ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన 

కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ  

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి 

జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి 

భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన 

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని 

సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ 

వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి 

హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత 

రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి 

తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము 

ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన 

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి 

అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె

సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం 

రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన 

కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న

రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా 

భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా 

ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర

సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు 

యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల 

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

సోదరభరత సమానా యని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా 

సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా 

అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా 

రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన 

ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు 

ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా 

భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ

తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ 

పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత 

నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత  ఆ ఆ ఆ

ఓం శాంతిః శాంతిః శాంతిః

Palli Balakrishna
Jai Hanumaan (2008)





ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: జె.సత్యదేవ్
గానం: పార్థసారధి



Songs List:



హనుమాన్ చాలీసా పాట సాహిత్యం

 
ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: నిహాల్
గానం: యస్. పి. బాలు

దోహా :
శ్రీ గురు చరన సరోజ రజ నిజమను ముకుర సుధారి |
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ |

బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేశ వికార్ ||

జై హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ || 4 ||

చౌపా ఈ:
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 |

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథ వజ్ర ఔర్ ధ్వజావిరాజై |
కాంథే మూంజ జనేఊ ఛాజై || 5||

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||

భీమ రూపధరి అసుర సంహారే |
రామ చంద్ర కే కాజ సవారే || 10 ||

జై హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్
లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉర లాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాఈ |
కహా భరత సమ తుమ ప్రియ భాఈ || 12 ||

సహస వదన తుమ్హరో యశ గావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||

యమ కుబేర దిగపాల జహాం తే |
కవి కోవిద కహి సకై కహా తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయె సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||

జై హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ || 2 ||

రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైఠారే || 21 ||

సబై సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

ఆపన తేజి సమ్హారో ఆపై |
తీనో లోక హాంక తే కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జప నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకట తే హనుమాన్ ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరధ జో కోఇ లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||

చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధి జగత ఉజియారా || 29 ||

సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||

జై హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ || 2 ||

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుమ్హారే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా || 32 ||

తుమ్హరే భజన రామకో భావై |
జన్మ జన్మ కే దుఖః బిసరావై || 33 ||

అంత కాల రఘువర పురజాఈ |
జహా జన్మ హరిభక్త కహాఈ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరఈ |
హనుమత సేఇ సర్వ సుఖ కరఈ || 35 ||

సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాఈ |
కృపా కరో గురుదేవ కీ నాఈ || 37 ||

యహ శత వార పాఠ కర జోఈ |
ఛూటహి బంది మహా సుఖ హోఈ || 38 ||

జో యహ పడై హనుమాన్ చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

రామ్ లక్ష్మణ్ జానకి జై భోలో హనుమాన్ కి ||

పవన తనయ సంకట హరణ – మంగళ మూరుతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||

|| ఇతి శ్రీ హనుమాన్ చాలీసా||

కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

రామ్ లక్ష్మణ్ జానకి జై భోలో హనుమాన్ కి ||

పవన తనయ సంకట హరణ – మంగళ మూరుతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||

|| ఇతి శ్రీ హనుమాన్ చాలీసా||





దండకం సాహిత్యం

 
ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: జె.సత్యదేవ్
గానం: పార్థసారధి

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం 
భజేహం పవిత్రం  భజే సూర్యమిత్రం 
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ 
ప్రభాతంబు సాయంత్ర నీనామ సంకీర్తనల్ జేసి 
నీ రూపు వర్ణించి నీమీద నేదండకం బొక్కటిన్ 
జేయ నూహించి నీ మూర్తినిన్ గాంచి 
నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై 
నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే 
వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ 
దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే 
దగ్గరంబిల్చితే తొల్లి సుగ్రీవునకు -మంత్రివై 
స్వామి కార్యంబునన్ నుండి శ్రీరామ సౌమిత్రులం జూచి 
వారిన్విచారించి సర్వేశు పూజించి 
యబ్భానుజుం బంటు గావించి 
యవ్వాలినిన్ జంపి కాకుత్థ్స తిలకున్ దయాదృష్టి వీక్షించి 
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై 
లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ 
లంకయున్ గాల్చియున్ భూమిజం జూచి 
యానందముప్పొంగ యాయుంగరంబిచ్చి 
యారత్నమున్ దెచ్చి  శ్రీరామ కున్నిచ్చి సంతోషనున్జేసి 
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి 
యాసేతువున్ దాటి వానరుల్మూకలై దైత్యులన్ ద్రుంచగా
రావణుండంత కాలాగ్ని యుగ్రుండుడై కోరి బ్రహ్మాండ మైనట్టి 
యా శక్తినిన్వేచి యాలక్షణున్ మూర్ఛ నొందింపగా
నప్పుడే పోయి సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి 
ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళి తో పోరాడి ఛండాడి
శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంత 
లోకంబు లానందమై యుండ నవ్వేళనున్ 
నన్వి భీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి 
పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికిన్ దెచ్చి 
శ్రీరాముకున్నిచ్చి న్నయోధ్యాకున్ వచ్చి 
పట్టాభిషేకంబు సంరంభమైయున్న 
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి 
నన్ రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ 
సంకీర్తనల్ చేసితే పాపముల్ల్బాయునే 
భయములున్ దీరునే భాగ్యముల్ కల్గునే 
సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ కల్గునే 
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార 
యోవీర యోశూర నీవే సమస్తంబు నీవే ఫలమ్ముగా వెలసి 
యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ 
స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామయంచున్ మనః పూతమై
ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి 
నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై 
రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై తేజంబునన్ రౌద్రి 
నీజ్వాల కల్లోల హావీర హనుమంత 
ఓంకార హీంకార శబ్దంబులన్
భూత ప్రేత పిశాచంబులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి 
నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ 
రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై  
బ్రహ్మప్రభాభాసితంబైన  నీదివ్య తేజంబునున్ జూచి 
రార నాముద్దు నరసింహ యన్చున్ 
దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి... 
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వాయుపుత్రా నమస్తే 
నమస్తే నమస్తే నమస్తే నమస్తే  నమస్తే నమః




భుజంగ స్తోత్రం సాహిత్యం

 
ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: నిహాల్
గానం: నిహాల్ , నిత్య శంతోషిని




శ్రీరామ దూతం పాట సాహిత్యం

 
ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: నిహాల్
గానం: నిహాల్ 



శ్రీరామదూత హనుమాన్ పాట సాహిత్యం

 
ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: నిహాల్
గానం: నిహాల్ , నిత్య శంతోషిని



జై హనుమాన్ చాంటింగ్ పాట సాహిత్యం

 
ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: నిహాల్
గానం: నిహాల్ , సాగర్



శ్రీ రామరక్ష స్తోత్రం సాహిత్యం

 
ఆల్బమ్: జై హనుమాన్ (2008)
సంగీతం: జె.సత్యదేవ్
గానం: గానం: యస్. పి. బాలు

Palli Balakrishna
Raba Raba



పాట: రబ రబ
సంగీతం: బాజీ
సాహిత్యం: లక్ష్మణ్
గానం: మంగ్లీ
ర్యాప్: మేఘ్ వాత్
దర్శకత్వం: దాము రెడ్డి
విడుదల తేది: 2020


రబ రబ రబ రబ రబా...పాట సాహిత్యం

 
రబ రబ రబ రబ రబా... యే రబ రబా
రబరబరబరబ రబా... రబ రబా
తక్ తక్ కబ్ తక్ చెలే... యే ఫాస్త్
హట్ హట్ కె జుటుకులే పట్ గయే...

యారో పట్టని రాముడిలా హీరో కావాలే
ఫ్రూటే పట్టని కృష్ణుడిలా ఫ్లాటే చెయ్యాలే
ఆరడుగులు తగ్గకుండా హైటే ఉండాలే
హాలీవుడ్ హీరోలా ఫైటే చెయ్యాలే

నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే...
నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే
నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా

టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని
డుగు డుగు బండెక్కి సిన్నోడా
డుర్రున వస్తున్నావా..?

నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా

టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని
డుగు డుగు బండెక్కి సిన్నోడా
డుర్రున వస్తున్నావా..?

అమ్మల్లే లాలన, నాన్నల్లే పాలనా
అమ్మల్లే లాలన, నాన్నల్లే పాలనా
చూపే ఆ చిన్నవాడు ఏడున్నడో మరి
చూపే చూడాలంటుంది ఎప్పుడొస్తాడో మరి

తీర్చుకునే వాడు అందంగా నా అలక
ఓర్చుకునే వాడు కలనైనా ఏమనకా
చూసుకునే వాడు నను చంటిపాపోలే
కాచుకునే వాడు నను కంటికి రెప్పల్లే

నా ఆశల రంగుల పువ్వుల మాలను
చేతిలో పట్టుకున్న
నా ఊసుల ధ్యాసలో ఉన్న చిన్నోడ
మెళ్ళో వేసుకుంటా

నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా
టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని
డుగు డుగు బండెక్కి సిన్నోడా
డుర్రున వస్తున్నావా..?

హఖ్ హఖ్ సేలక్ నహి సబ్ తక్ గయి
చక్ చక్ దే డక్ నయి రబ్ ధియే

నుదుటిన సింధూరమై సిగలో మందారమై
నుదుటిన సింధూరమై సిగలో మందారమై
ఉండే ఆ వన్నె కాడు ఏడున్నాడో మరి
వాన్నే నా కన్నె ఈడు చూస్తున్నదే మరి

రబ రబ రబ రబ రబా...రబ రబా

వేసుకునే వాడు తనపైనా భారాలు
చేసుకునే వాడు అందంగా గారాలు
చేరనివ్వనోడు మా మధ్యల దూరాలు
చెయ్యి విడవనోడు పట్టుకుంటే వందేళ్లు

నా ఆకలి తీర్చే గోరు ముద్దల చంటి పిల్లోడు
నా గోరింటాకుల ఎర్రగ పండిన సరైన
జోడు

నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా
టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని
డుగు డుగు బండెక్కి సిన్నోడా
ఓ సిన్నోడా డుర్రున వస్తున్నావా,

ఆరో 'పట్టని రాముడిలా హీరో కావాలే
ఫ్రూటే పట్టని కృష్ణుడిలా ఫ్లాటే చెయ్యాలే
ఆరడుగులు తగ్గకుండా హైటే ఉండాలే
హాలీవుడ్ హీరోలా ఫైటే చెయ్యాలే

నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే
నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే

Palli Balakrishna
Nuvvo Rai Neno Shilpi



పాట: నువ్వో రాయి నేనో శిల్పి
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్


నువ్వో రాయి నేనో శిల్పి పాట సాహిత్యం

 
హరి హరా...

నువ్వో రాయి, నేనో శిల్పీ 
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నువ్వో రాయి, నేనో శిల్పీ 
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా 
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నీ గర్భ గుడినే కట్టేటపుడు
నేను పెద్ద మేసిరి
అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే
నన్ను బయటికి తొస్తివి...

నిన్ను మేలు కొలుపగ డోలు సన్నాయి
నేనే వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా
నేనేం పాపం చేస్తినీ

అయ్యో.... ఓ... ఓ...ఓ.... దేవా..ఆ..ఆ..ఆ...

నువ్వు నడిచెప్పుడు
నీ పాదాలు కందకుండా 
చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళోన మోపనీవు
ఏంటయ్యా నా తప్పులూ

సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో
నేసాయి నా చేతులు
కాని నిను చూడ రావాలంటే
నాకో జత బట్టల్ లేవు
ఏంటయ్యా మా రాతలు

నీ మాసిన బట్టలే మా ప్రసాదామని
నేను శుభ్రంచేస్తిని
కాని మలిన పడిన వాడివంటూ
దూరంగా ఉండాలంటివి

నీ ముందు వెలిగే దీపాంటలు
నా చెమట తో చేసినీ
కాని ఎందుకో మా మట్టి బ్రతుకున
ఏదీపం పెట్టవైతివి...

ఏ... ఏ... ఏ...

నోరే లేని మూగ జీవాలను గాయమని
గోసీ వో గొంగలీ ఇస్తివి
ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే
లేవన్నట్లు చులకనగా వెనకబడెస్తివి

తల్లీ పాల వంటి తాటి కల్లు గీసే
నా గోసలు చూడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కళ్ళకు 
నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి

నీ పల్లకీ చేసిన చేతులకు పాచిక
పుల్లయిన ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే
నా బ్రతుకే క్షవరం చేస్తివి

మా పుట్టుక బట్టీ చేసే పని బట్టీ 
ఏవేవో పేర్లు పెడితో
కాని ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి
నీవు కూడా మనిషై పోతివి

Palli Balakrishna
Bathukamma Song (2019)



పాట: రామ రామ రామ ఉయ్యాలో
సంగీతం: 
సాహిత్యం: 
గానం: వరం


రామ రామ రామ ఉయ్యాలో పాట సాహిత్యం

 
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరాదు ఉయ్యాలో

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్యాలో

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తారామాస ఉయ్యాలో
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో

తెల్లతెల్లయి గుళ్లు ఉయ్యాలో
తెల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో
పన్నెండేండ్ల నాడు ఉయ్యాలో
పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో

తెల్లయి ఎములాడ ఉయ్యాలో
రాజన్న గుళ్ళు ఉయ్యాలో
నల్లనల్లయి గుళ్ళు ఉయ్యాలో
నల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో

నల్లయి నల్లగొండ ఉయ్యాలో
నరసింహా గుళ్ళు ఉయ్యాలో
పచ్చపచ్చయి గుళ్ళు ఉయ్యాలో
పచ్చయమ్మా గుళ్ళు ఉయ్యాలో

పచ్చయి పర్వతాల ఉయ్యాలో
మల్లన్న గుళ్ళు ఉయ్యాలో
పర్వతాల మల్లన్న ఉయ్యాలో
పదములు సెలవయ్యా ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీ రామ ఉయ్యాలో 
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీ రామ ఉయ్యాలో 

ఇద్దరక్కా చెల్లెళ్ల ఉయ్యాలో
ఒక్కూరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
సూసన్నా వోడాయే ఉయ్యాలో

ఎట్ల వత్తు చెల్లె ఉయ్యాలో
ఏరు అడ్డమాయే ఉయ్యాలో
ఏరుకు ఎలుపల్ల ఉయ్యాలో
తలుపు అడ్డమాయే ఉయ్యాలో

తలుపులకు తాళాలు ఉయ్యాలో
వెండి సీలలు ఉయ్యాలో
వెండి సీల కింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో

వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో
ఏడు విత్తులపత్తి ఉయ్యాలో
ఏడు గింజల పత్తి ఉయ్యాలో
ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో

ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో
ఏడికి వోయిరి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో
పావురాయి పత్తి ఉయ్యాలో

ముసల్ది వడికింది ఉయ్యాలో
ముద్దుల పత్తి ఉయ్యాలో
వయస్సుది వడికింది ఉయ్యాలో
వన్నెల పత్తి ఉయ్యాలో

చిన్నది వడికింది ఉయ్యాలో
చిన్నెల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలె చింతల పత్తి ఉయ్యాలో

సాలె చింతలగాడ ఉయ్యాలో
సంగడి సారన్న ఉయ్యాలో
సంగడి సారన్న ఉయ్యాలో
సాగదీయ్యవట్టే ఉయ్యాలో

సాగదీయ్యవట్టే ఉయ్యాలో
ఆ పత్తి వడికి ఉయ్యాలో
ఆ పత్తి వడికిన ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో

దీవెనె ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో

నీళ్లకంటూ పోతే ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
హంసల బావికి ఉయ్యాలో

హంసలన్నీ చేరి ఉయ్యాలో
అంచునంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
పట్నంబు బోతిని ఉయ్యాలో

పట్నంబు పారిని ఉయ్యాలో
కొంగు బంగారమే ఉయ్యాలో
కొంగు బంగారంబు ఉయ్యాలో
ఈ చీరలున్నాయా ఉయ్యాలో

గొప్పగా సాలెళ్ళు ఉయ్యాలో
నేసినారు ఈ చీర ఉయ్యాలో
దిగినే ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో

అన్నల ఓయన్నా ఉయ్యాలో
అన్నలో పెద్దన్న ఉయ్యాలో
ఏడాదికోసారి ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో

ఆడపిల్లలనన్నా ఉయ్యాలో
నేను ఉన్న జూడు ఉయ్యాలో
కలిగేను పెద్దమ్మ ఉయ్యాలో
కన్నెతల్లున్నదా ఉయ్యాలో

ఏడంత్రాల ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో

వారిద్దరొత్తురా ఉయ్యాలో
వీరిద్దరొత్తురా ఉయ్యాలో
సంవత్సరానికి ఉయ్యాలో
ఒక్కసారే తల్లే ఉయ్యాలో

తంగేడు పూలనే ఉయ్యాలో
రాశిగా తెచ్చిరి ఉయ్యాలో
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ ఏడాదికి ఉయ్యాలో

మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో

Palli Balakrishna
Lali Muddula Gummadi



పాట: లాలి ముద్దుల గుమ్మడి
సంగీతం: జిఎల్ నాందేవ్
సాహిత్యం: శ్రీ పాల్ బొల్లెద్దు
గానం: శిరీష
విడుదల తేది: 20.09.2020


లాలి ముద్దుల గుమ్మడి పాట సాహిత్యం

 
పాట: లాలి ముద్దుల గుమ్మడి
సంగీతం: జిఎల్ నాందేవ్
సాహిత్యం: శ్రీ పాల్ బొల్లెద్దు
గానం: శిరీష

అహ లాలి లాలి లాలి లాలి
లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

లాలి ముద్దుల గుమ్మాడి
ఓ లాలి ముద్దుల గుమ్మాడి
నాకేదో గాలి తాకినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

పైరగాలి తాకినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి
నన్నెటో పరుగు పెట్టిస్తుంది
లాలి ముద్దుల గుమ్మాడి

లాలి లాలి...అహ లాలి లాలి లాలి లాలి
లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

మరి నిన్నాగాక మొన్నానేమో
లాలి ముద్దుల గుమ్మాడి
నాకు నిండుకున్నాయి పదారేళ్లు
లాలి ముద్దుల గుమ్మాడి

గా సిరిమల్లె పువ్వులు నాకు
లాలి ముద్దుల గుమ్మాడి
నా సిగన వాలుతంటున్నాయి
లాలి ముద్దుల గుమ్మాడి

సిగన వాలుతంటున్నాయి
లాలి ముద్దుల గుమ్మాడి
నాకు చెక్కిలిగింతలు పెడుతున్నాయి
లాలి ముద్దుల గుమ్మాడి

లాలి లాలి... 
అబ్బ లాలి లాలి లాలి లాలి
లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

గా నిండు సందమామ కూడ
లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను నిమ్మాలంగ రమ్మంటుంది
లాలి ముద్దుల గుమ్మాడి

అమ్మో సందామామ పిలుపులకి
లాలి ముద్దుల గుమ్మాడి
నాలో వలపు కులుకు మొదలయ్యింది
లాలి ముద్దుల గుమ్మాడి

జామురాతిరి జాబిలమ్మ
లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను జాగు చెయ్యకంటున్నాది
లాలి ముద్దుల గుమ్మాడి

లాలి లాలి... 
అబ్బ లాలి లాలి లాలి లాలి
లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

అబ్బో పొద్దూ పొడుపు ముద్దూ సూరీడు
లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను ముద్దూ పెట్టుకున్నట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

ఇగా ఎండా పొద్దు ఎక్కిన కొద్దీ
లాలి ముద్దుల గుమ్మాడి
నాకు వెచ్చనైన గుబులు రేగే
లాలి ముద్దుల గుమ్మాడి

వెచ్చానైనా కోరికతోటి
లాలి ముద్దుల గుమ్మాడి
పొద్దు మచ్చిక చేసుకున్నట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

లాలి లాలి... 
అబ్బ లాలి లాలి లాలి లాలి
లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

హొయ్ హొయ్... 
వానా జల్లు అల్లుకుంది
లాలి ముద్దుల గుమ్మాడి
ఆ ప్రేమ ముళ్ళు గుచ్చుకుంది
లాలి ముద్దుల గుమ్మాడి

ఈ ప్రకృతమ్మ పరవశించే
లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను పరితపింప జేస్తున్నాది
లాలి ముద్దుల గుమ్మాడి

ప్రేమ గాలి తాకిందేమో
లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను పెళ్లి చేసుకోమ్మంటుంది
లాలి ముద్దుల గుమ్మాడి

లాలి లాలి... 
అహా లాలి లాలి లాలి లాలి
లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

లాలి ముద్దుల గుమ్మాడి
ఓ లాలి ముద్దుల గుమ్మాడి
నాకు ప్రేమ గాలి తాకినట్టుంది
లాలి ముద్దుల గుమ్మాడి

Palli Balakrishna
Yogi Tatwam



పాట: యోగితత్వం
సంగీతం: SK బాజీ
సాహిత్యం: శ్రీ మల్కిదాస్ గారు
గానం: మంగ్లీ
దర్శకత్వం: దాము రెడ్డి


నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే సాహిత్యం

 
సంగీతం: SK బాజీ
సాహిత్యం: శ్రీ మల్కిదాస్ గారు
గానం: మంగ్లీ

పల్లవి:
నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....(2)
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా
యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే....

నా గురుడు నన్నింక త్యాగి గమ్మనెనే....
త్యాగి గమ్మనెనే....జ్ఞాని గమ్మనెనే..

చరణం: 1
మొట్టమొదటా నీవు పుట్టాలేదనెనే...
మొట్టమొదటా నీవు పుట్టాలేదనెనే... 
పుట్టుగిట్టులులేని బట్టబయలయెనే...

నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా
యోగి గమ్మనెనే.....భోగి గమ్మనెనే...

చరణం 2:
మూలామించుక లేని కీలెరుగుమనెనే...
మూలామించుక లేని కీలెరుగుమనెనే...
కాలకాలములెల్ల కల్లా జగమనెనే...

నా గురుడు నన్నింక యోగి గమ్మనె
యోగి గమ్మనెనే....త్యాగి గమ్మనెనే...

చరణం 3:
మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....
మాయా లేని చోటు మరుగెరుగుమనెనే....
మరుగు నెరుగితే నీవు తిరిగిరావనెనే..

నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....
యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే...

చరణం 1:
ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..
ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..
సున్నా జేసియు దాని యెన్నాగవలెననే...

నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా......
యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే...

చరణం 5:
మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట మహదేవుపేట మలికి దాసనెనే...

నా గురుడు నన్నింక యోగి గమ్మనె
యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా...
త్యాగి గమ్మనెనే....జ్ఞాని గమ్మనెనే

Palli Balakrishna Friday, May 28, 2021
Saani



పాట: సాని.. (ఒక వేశ్యా గానం) పాట (2020)
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మౌనికా రెడ్డి, నల్గొండ గద్దర్ నర్సన్న
నటీనటులు: స్వర్ణ గణేష్ అరెడ్డి,నిసార్, ఉదయ్, బంగార్రాజు
దర్శకత్వం: మహేష్ నందు
నిర్మాణం: మల్లేష్ కొండేటి
విడుదల తేది: 15.08.2020


సాని.. (ఒక వేశ్యా గానం) సాహిత్యం

 
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మౌనికా రెడ్డి, నల్గొండ గద్దర్ నర్సన్న

నల్లంచు తెల్లచీర కట్టాను గానీ...
తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ...
కనురెప్పలకేమో కాటుక రుద్దాను గానీ...
పెదవులకు రంగులు ఏవో అద్దాను గానీ...

నా ముఖమే చూస్తే మీకు సుఖమిచ్చేదాన్ని..
ఎనకున్న నరకం ఎవరు గుర్తించరు గానీ.

సూపులకేమో నేను దొరసాని ఓ... ఓ...
లో లోపల మాత్రం నా పేరు సాని ఓ... ఓ...

నల్లంచు తెల్లచీర కట్టాను గానీ
తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ
సూపులకేమో నేను దొరసాని - రేల రేలా.. రా...
లో లోపల మాత్రం నా పేరు సానీ -  ఆ..అ ఆ...ఆ..

నీది నాదీ.. కాదు తల్లీ
ఇది పైవాడి ఆటనే సెల్లీ
దేవాన దేవుళ్లన్నాడే
ఈ సిత్రాలు ఉన్నాయ్ తలచి సూడే

నాన్న కానీ నాన్న పడమటి అర్రలో
నన్ను తోసే బతుకు పోరులో
అమ్మ నుండి నాకు దక్కిన వరము
అమ్మితేనే ఒళ్ళు అన్నమూ...

ఎముకల గూడు నేను ఎనకాల గోడ నేను,
నీ మొరటు చేతుల్లోన నలిగిపోనూ...
నీ ఆనందాల కోసం చేస్తా ఏదేదో శబ్దం,
వినగలిగే మగవాడెవడు ఎద చప్పుడూ

చూపులకేమో నేను దొరసాని ఏహే.. ఏహే..
లో లోపల మాత్రం నా పేరు సానీ.. ఏహే..ఏహే..

ఎవ్వరికి ఎవ్వరే ఈ లోకానా
అరిగోశాలిస్తున్నావో కూనా
కాగడవెలుగే చూస్తారే పైనా
కాలే గాయాలే కనిపించేనా

ఆట పాట ప్రేమ పెళ్లి పేరంటం
అన్ని ఆశలున్నా నలుసునీ
నల్ల మబ్బులోకి వెళ్ళిపొమ్మని
దాచినారు చందమామనీ

డబ్బున్న మగమహరాజు నా ఇంటికి వస్తూపోతే,
మా గొప్ప రసికుడు అంటూ పొగిడేస్తారు...
మీ కామ దాహం తీర్చి తరిగిన బ్రతుకును మాత్రం
హీనంగా చూస్తూ ఎందుకు చీ కొడతారు...

సూపులకేమో నేను దొరసాని ఓ.. ఓ...
లో లోపల మాత్రం నా పేరు సాని ఓ...

అందరిలోతెంతో ఉంటది ఈడా
సందర్భం చూపును దాని జాడ
ఎవరెవరి గుట్టుందో నీ కాడా
నేనైతే గా ముచ్చట మాట్లాడా

Palli Balakrishna
Sankranthi Song (2018)



పాట: సంక్రాంతి పాట (2018)
సంగీతం: నందన్ బొబ్బిలి
సాహిత్యం: కందికొండ
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2018) సాహిత్యం

 
భోగిమంటలు, సంక్రాంతులు
కనుమ పూజలు, సరదాలు
హరిదాసులు, బసవడాటలు
భోగిపండ్లతో దీవెనలు
ఇది మూడు రోజుల సందడులు 
ప్రతి రైతు గుండెకు పండుగలు
ఇటు పిండి వంటల ఘుమఘుమలు
అటు బొమ్మల కొలువుల సరిగమలు

హే రంగు పతంగి వచ్చింది
నింగి సింగిడి అయ్యింది
హే. చల్ చరక్ తెచ్చింది
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే పాత బస్తీకి జావో
హే దూళ్ పేటకు భాగో
ఇటు మాంజా లేజా
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోకి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే

చెట్లు పూలను పూసేలే పండ్లు నిండుగా కాసేలే
ఇంట్లో పంటలు నిండే పశువులు పాడిని చిందే
బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే
సంక్రాంతి ఇంటికి వచ్చేసే
గుండె వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే
జ్ఞాపకాల ముద్దరలేసే

హే చిచ్చా లచ్చా మారేంగే
హే గోల్కొండకు జాయేంగే
హే మచ్చా డీల్ మారేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే మేరా ప్లాస్టిక్ మాంజా
హే తేరా నైలాన్ మాంజా
హే మామ పేంచ్ కి ఆజా
కీంచ్ కాంట్ ఆఫా కరేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం
మకరరాశి తొంగి చూసి ఆయుష్షు పోసే
కనుమనాటి యోగం గోవులకు స్నానం
పశువుల పాదాలు మొక్కి రైతు తరించే
కడప వీధులు కనుమకు కదం తోక్కెగా
ఒంగోలు లో గిత్తలు పోటికురిగేగా

పల్లెల్లో ముగ్గుల పందెం
భూమికే అద్దెను అందం
గొబ్బెమ్మలు చుట్టూ గానం 
ఆడబిడ్డలు చేసే దైవమిచ్చే దీవేనలీనాదేలే
కష్టం మరిచి కళ్ళు మెరిశాయే
ఇండ్లు ఇంధ్రధనస్సులయ్యాయే

హే చల్ డబీర్ పుర
హే నడువ్ దూద్ బౌళి
హే మంచి పతంగి తెద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే చల్ పోటీకి పోదాం
హే దిల్ జీతాయిద్దాం
హే దమ్ము చూపించొద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం
కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం
సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం

పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చేగా
రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చేగా
మంచుతో కప్పిన చెట్లు అందాల ముగ్గుల మెట్లు 
కన్నతల్లి పిలిచినట్టు రా రమ్మని పిలిచే

గుండె ఎగిరి పుట్టినింట వాలేలే
పుట్టిన ఊరు చూసి నయనాలే
కృష్ణా గోదావరి నదులాయే
కృష్ణా గోదావరి నదులాయే

ఆ...దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోకి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే


Palli Balakrishna
Lopali Manishi





పాట: లోపలి మనిషి
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్
కోరస్: సాయి దీవెన్, అరుణ్ రవి
నటీనటులు: నిసార్, సంజయ్ మహేష్ వర్మ
దర్శకత్వం: మహేష్ నందు
నిర్మాణం: మల్లేష్ కొండేటి
విడుదల తేది: 13.09.2020


లోపలి మనిషి పాట సాహిత్యం

 
పాట: లోపలి మనిషి
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్

వేదాంతం వేధికెక్కితే
వెధవ పనులు వెనకకు వెళితే
వెధవ పనులు వెనకకు వెళితే
ధర్మం ఎదుటోడి కోసమే
తన బతుకంతా అధర్మమే
తన బతుకంతా అధర్మమే

పైకే పత్తిత్తు రూపమే
లోపలా ఆణువణువూ లోపమే
గురువిందా గింజ సందమే
గురితించదు పిచ్చి లోకమే
సుట్టూ అందరు సాత్వికులే
ఎటుపాయే కోడిపిల్లే

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి  ఎంత తేడ మీ ఇద్దరికీ

వేదాంతం వేధికెక్కితే
వెధవ పనులు వెనకకు వెళితే
వెధవ పనులు వెనకకు వెళితే
ధర్మం ఎదుటోడి కోసమే
తన బతుకంతా అధర్మమే
తన బతుకంతా అధర్మమే!

నీ చెల్లెను ఎవడేమన్నంటే చెంప షెల్లు ఎంబడే
ఎవడి శెల్లో ఎదురుగ వస్తుంటే నీ కళ్ళే మిటమిటే
కొలువు కాడ హక్కుల కోసం బాసు తోటి వాదన
నీ ఇంట్లో పనిమనిషంటే నీకు ఎంత ఏలనా

మంది పోరలు హేమంది పోరలు
దేశం కోసం అమరులవ్వాలంట
మన పిల్లలు ఫారిన్ లోన సల్లగ సదవాలంట
ఎరగనోడు ఎదిగితే వాడిని ఉదాహరిస్తారంట
తెలిసినోడు ఎదిగాడంటే ఎంత కడుపుల మంట

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ

సిటికడంత సాయం చేసి శింపుతావు పబ్లిసిటీ
సీక్రెట్టుగ దోసిన సొమ్ముకు లెక్క చెప్పవేమిటి
బతికి ఉన్న మనుషులనేమో నేలకు పడ దోస్తరు
పోయినాక పల్లకి మోస్తూ నింగికి ఆనిస్తరు

రాజ్య నేతలు హేయ్ రాజ్య నేతలు
నీతిమంతులై నిన్ను పాలించాలి
నువ్వు మాత్రం ఓటు అడిగితే
నోటుకు సెయ్యి సాపాలే
ఇల్లు దాటి బయటికొస్తే కృష్ణుడవతారాలు
ఇంటిలోని ఇల్లాలేమో సీతలా ఉండాలే

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ

వేదాంతం వేధికెక్కితే
వెధవ పనులు వెనకకు వెళితే
వెధవ పనులు వెనకకు వెళితే
ధర్మం ఎదుటోడి కోసమే
తన బతుకంతా అధర్మమే
తన బతుకంతా అధర్మమే

మాటలు సీరంగా నీతులే మాపటికి సాని కొంపలే
మంచైతే నీ గొప్పలే శెడు ఇతరుల ఖాతలేసుడే
సుట్టూ అందరు సాత్వికులే ఎటుపాయే కోడిపిల్లే

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ

Palli Balakrishna
Shivaratri Song (2019)





పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి
దర్శకత్వం: దాము రెడ్డి
విడుదల తేది: 2019


శివరాత్రి పాట (2019) సాహిత్యం

 
పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి

పల్లవి:
ఎండి కొండాలు ఏలేటోడా 
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా 
జగాలనుగాసే జంగముడా

కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపే టొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మండాలు నిండినోడా

నాగభరణుడా నందివాహనుడా
కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 1
పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే 
కోరస్: పలారాలు పంచేరే 

గండా దీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు బాపమని పబ్బాతులు పట్టేరే
కోరస్: పబ్బాతులు పట్టేరే

లింగనా రూపాయి..తంబాన కోడేను
కట్టినా వారికి సుట్టానీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ  దిక్కు నీవేలే

వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే 
కోరస్: పలికేటి దేవుడావే

కోరితే కోడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 2
నీ యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలు చిత్రాలులే
కోరస్: లీలలు చిత్రాలులే

కొప్పులో గంగామ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే
కోరస్: ముక్కంటిశ్వరుడావే

నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడ కరుణాలాదేవుడ
కరునించామని నిన్నూ వెడుకుంటామే

త్రీలోక పూజ్యూడా త్రిశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
కోరస్: అధిపతివి నీవూరా

శరణని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినోడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందివొడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా నీవు
అత్మాలింగనివిరా మాయలోడా

కోటి లింగాల దర్శనమిచ్చేటోడా 
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటోడా
నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా

నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా 
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర

||ఎండి కొండాలు ఏలేటోడా||

Palli Balakrishna
Magic of Mangli Vol -1





Album: Magic of Mangli Vol -1 



Songs List:



భోగి మంటలు సంక్రాంతులు పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: Nandan Bobbili
Singer: Mangli

భోగిమంటలు, సంక్రాంతులు
కనుమ పూజలు, సరదాలు
హరిదాసులు, బసవడాటలు
భోగిపండ్లతో దీవెనలు
ఇది మూడు రోజుల సందడులు 
ప్రతి రైతు గుండెకు పండుగలు
ఇటు పిండి వంటల ఘుమఘుమలు
అటు బొమ్మల కొలువుల సరిగమలు

హే రంగు పతంగి వచ్చింది
నింగి సింగిడి అయ్యింది
హే. చల్ చరక్ తెచ్చింది
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే పాత బస్తీకి జావో
హే దూళ్ పేటకు భాగో
ఇటు మాంజా లేజా
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోకి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే

చెట్లు పూలను పూసేలే పండ్లు నిండుగా కాసేలే
ఇంట్లో పంటలు నిండే పశువులు పాడిని చిందే
బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే
సంక్రాంతి ఇంటికి వచ్చేసే
గుండె వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే
జ్ఞాపకాల ముద్దరలేసే

హే చిచ్చా లచ్చా మారేంగే
హే గోల్కొండకు జాయేంగే
హే మచ్చా డీల్ మారేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే మేరా ప్లాస్టిక్ మాంజా
హే తేరా నైలాన్ మాంజా
హే మామ పేంచ్ కి ఆజా
కీంచ్ కాంట్ ఆఫా కరేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం
మకరరాశి తొంగి చూసి ఆయుష్షు పోసే
కనుమనాటి యోగం గోవులకు స్నానం
పశువుల పాదాలు మొక్కి రైతు తరించే
కడప వీధులు కనుమకు కదం తోక్కెగా
ఒంగోలు లో గిత్తలు పోటికురిగేగా

పల్లెల్లో ముగ్గుల పందెం
భూమికే అద్దెను అందం
గొబ్బెమ్మలు చుట్టూ గానం 
ఆడబిడ్డలు చేసే దైవమిచ్చే దీవేనలీనాదేలే
కష్టం మరిచి కళ్ళు మెరిశాయే
ఇండ్లు ఇంధ్రధనస్సులయ్యాయే

హే చల్ డబీర్ పుర
హే నడువ్ దూద్ బౌళి
హే మంచి పతంగి తెద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే చల్ పోటీకి పోదాం
హే దిల్ జీతాయిద్దాం
హే దమ్ము చూపించొద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం
కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం
సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం

పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చేగా
రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చేగా
మంచుతో కప్పిన చెట్లు అందాల ముగ్గుల మెట్లు 
కన్నతల్లి పిలిచినట్టు రా రమ్మని పిలిచే

గుండె ఎగిరి పుట్టినింట వాలేలే
పుట్టిన ఊరు చూసి నయనాలే
కృష్ణా గోదావరి నదులాయే
కృష్ణా గోదావరి నదులాయే

ఆ...దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోకి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే




మేడారం జాతర పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: Charan Arjun
Singer: Mangli, Kanakavva



సిగమూగుతున్నది పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: SK Baji
Singer: Mangli



ఎండికొండలు ఏలేటోడ పాట సాహిత్యం

 

సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి

పల్లవి:
ఎండి కొండాలు ఏలేటోడా 
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా 
జగాలనుగాసే జంగముడా

కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపే టొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మండాలు నిండినోడా

నాగభరణుడా నందివాహనుడా
కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 1
పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే 
కోరస్: పలారాలు పంచేరే 

గండా దీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు బాపమని పబ్బాతులు పట్టేరే
కోరస్: పబ్బాతులు పట్టేరే

లింగనా రూపాయి..తంబాన కోడేను
కట్టినా వారికి సుట్టానీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ  దిక్కు నీవేలే

వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే 
కోరస్: పలికేటి దేవుడావే

కోరితే కోడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 2
నీ యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలు చిత్రాలులే
కోరస్: లీలలు చిత్రాలులే

కొప్పులో గంగామ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే
కోరస్: ముక్కంటిశ్వరుడావే

నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడ కరుణాలాదేవుడ
కరునించామని నిన్నూ వెడుకుంటామే

త్రీలోక పూజ్యూడా త్రిశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
కోరస్: అధిపతివి నీవూరా

శరణని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినోడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందివొడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా నీవు
అత్మాలింగనివిరా మాయలోడా

కోటి లింగాల దర్శనమిచ్చేటోడా 
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటోడా
నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా

నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా 
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర

||ఎండి కొండాలు ఏలేటోడా||




జాగో జాగో జాగో బంజార పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: Indrajit
Singer: Mangli



ఊరు వాడ ఉత్సాహంగా వెలుగులు పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: SK Baji
Singer: Mangli, Shishira



తెలంగాణాలో పుట్టి పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: Suresh Bobbili
Singer: Mangli, Saketh




మబ్బుల్లా మబ్బుల్లా లేసి రావే పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: Nandan Bobbili
Singer: Mangli, Lipsika



మంగ్లీ దేవి స్తోత్రం పాట సాహిత్యం

 




డిల్లెం బల్లెం బోణం పాట సాహిత్యం

 
Album: Magic of Mangli Vol -1
Nusic: Charan Arjun
Singer: Mangli, Relare Teja vardhan

Palli Balakrishna
Bathukamma Song (2020)





పాట: బతుకమ్మ పాట (2020)
సంగీతం: SK బాజీ, సురేష్ బొబ్బిలి
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ
దర్శకత్వం: దాము రెడ్డి


బతుకమ్మ పాట (2020) సాహిత్యం

 
సేను సెలక మురిసేటి వేళ
రామ చిలుక పలికేటి వేళ… 
ఊరే తెల్లారే… ఏ ఏ
వాడంత రంగు రంగుల సింగిడాయే
పళ్ళెంత పండుగొస్తే సందడాయే…
కొమ్మల్లో పూల గుత్తులు ఊయలూగే
గాలుల్లో అగరబత్తుల పోగలె సాగే

సేను సెలక మురిసేటి వేళ
రామ చిలుక పలికేటి వేళ

చెరువులో తేలే తామరలోలే
చెల్లెలు చేరేనే… ఓ ఓ ఓ
అక్కలు బావలు అన్నలు తమ్ములు
అమ్మలూ మురిసేలే

తళతళలాడే తంగెడులూ
మరదలు వదినెల అల్లరులు
గులుగు మోదుగు గుమ్మడులు
అవ్వల నవ్వులురా ఓ ఓఓ

చిన్నారి చిట్టి బొడ్డెమ్మల్ని పెట్టు
జాబిల్లి సుట్టు సుక్కలు చేరినట్టు
సందేళ తుల్లుతుంది వానగట్టు
నీలాలా నింగి నేలకొచ్చినట్టు

ఏలో ఏలెలో ఏలో ఏలెలో
ఏలో ఏలెలో ఏలో
ఏలో ఏలెలో ఏలో ఏలెలో
ఏలో ఏలెలో ఏలో

పూసల పేరు అల్లిన తీరు
పువ్వులు పెర్సెనే… ఓ ఓ ఓ
మనసున కోరే ఆ‌శలు తీరే
పూజలు చేసేను

సీతజడల సంబరము
కళకళల కనకాంబరము
సీరెలు సారేలు వాయినం
ఎనకటి వంతనరా… ఓఓ ఓ ఓ

తేనెల్ల వాగులన్నీ పారినట్టు
కోయిల్ల గుంపుకట్టి పాడినట్టు
సేతుల్ల డోలుభాజ మోగినట్టు
గుండ్రంగా ఆడుతారు కట్టినట్టు

జగములో ఏ చోటున
లేదే ఈ ముచ్చట
పూలనే దేవుళ్ళుగా
చేసేటి మెక్కట

చెట్టుచేమ కోండకోన
సుట్టూ మనకు సుట్టాలు
నిండు తొమ్మిదొద్దుల్లల
కలుసుకుంటే నేస్తాలు

గంగ ఒడిలో బతుకమ్మ ఓ ఓ ఓ
గంగ ఒడిలో బతుకమ్మ
పాలపిట్టై చేరగా… ఓ ఓ ఓ ఓ

ఊరంతా రంగు రంగుల సింగిడాయే
వాడంతా పండగొస్తే సందడాయే
అందాలే కొత్త విందు చేసినాయే
బందాలే చేరువయిన రోజులాయే

Palli Balakrishna
Sankranthi Song (2020)





పాట: సంక్రాంతి పాట (2020)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2020) సాహిత్యం

 
సంక్రాంతి పాట (2020)

Palli Balakrishna
Gnani Sugnani Song





పాట: జ్ఞాని సుజ్ఞాని పాట
సంగీతం: బాజి
సాహిత్య సేకరణ: గుడిమె స్వాతి
గానం: మంగ్లీ
దర్శకత్వం: దాము రెడ్డి
నిర్మాణం: శివ శంకర్ మాటూరి
విడుదల తేది: 19.09.2020


జ్ఞాని సుజ్ఞాని పాట సాహిత్యం

 
పాట: జ్ఞాని సుజ్ఞాని పాట
సంగీతం: బాజి
సాహిత్య సేకరణ: గుడిమె స్వాతి
గానం: మంగ్లీ

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా... వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
అజ్ఞానికి ఏమెరుకా... వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు

నానాక రుచులన్నీ నాల్కకు ఎరుక
నానాక రుచులన్నీ నాల్కకు ఎరుక
ఇట్లా కుండలెంబడి తిరిగే... తెడ్డుకేమెరుకా

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు

వనము సింగారంబు కోయిలకు ఎరుక
వనము సింగారంబు కోయిలకు ఎరుక
ఇట్లా కంపాలెంబడి తిరిగే కాకికేమెరుకా

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు

బాటసింగారంబు అశ్వానికెరుకా
బాటసింగారంబు అశ్వానికెరుకా
ఇట్లా గరికా తుట్టెలు తినే గాడిదాకేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు

నాగస్వరము మోత నాగుపాముకెరుకా
నాగస్వరము మోత... నాగుపాముకెరుకా
ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్ట్యాకేమెరుకా

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు

మడుగు సింగారంబు మత్స్యానీకెరుకా
మడుగు సింగారంబు మత్స్యానీకెరుకా
ఇట్లా కడల కడలా తిరిగే కప్పాకేమెరుకా

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
సద్గురుడుండే మరుగు
సద్గురుడుండే మరుగు

ఓఓఓఓఓ... ఓఓఓఓఓ...







Palli Balakrishna Thursday, May 27, 2021
Shivaratri Song (2021)





పాట: శివరాత్రి పాట (2021)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: మంగ్లీ జయశ్రీ
దర్శకత్వం: దాము రెడ్డి
నిర్మాణం: నూతనపాటి రామకృష్ణ
విడుదల తేది: 07.03.2021


శివరాత్రి పాట సాహిత్యం

 
పాట: శివరాత్రి పాట (2021)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: మంగ్లీ జయశ్రీ

హరహర మహాదేవ శంకరా
హరహర మహాదేవ శంకరా

ఓ ఓ... సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవే
ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే

అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో... పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా

ఓ  ఓ...గిరీ సుర సుతా గౌరీ సఖీయై నీ తోడుండా
శంఖ జోలె శంఖు పుర్రె నీకు పూదండ
రంగు లేని నాగమణిమెడలోన వెలుగుచుండ
ఏమీ లేని భైరాగోలే యాచించుచుండ
వెన్నెలనే తలపై కొలువై చిందులాడ
ఎందుకురా బూడిద నీ నొసట
గిరిజనమే నీకు బంధువులైరిరా
సిరులున్నా మురువవు సిత్రమురా
కలిమి లేమి కష్టము సుఖము
ఓ ఓ... నీతూకములో అంతా ఒకటే

అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళపు సంద్రము నీవే
ఒహో...ఉండీ లేనట్టుండే ఉనికివి నీవే
ప్రళయ విలయ తాళాలకు కర్తవు నీవే

సాధు జంగమా ఆది దేవుడా
హరహర మహాదేవ శంకరా

ఓ ఓ...బిలువమాల సుగంధాల పూసిన పూల పల్లకి నేల
తలపించేను కమనీయంగా శివుడా నీ లీల
సద్గురు వేదం శంభుని నాదం...
అందాల ఈ సుందర ధామం
నింగీ నేలకు నిచ్చెనలు వేసే పావన పీఠము

ఈ దినమే గానం ప్రణవ నాదముగా
ఢమరుకమే ధిమిధిమి మోగెనురా
భువి నుంచి గంగ దివికే పొంగెనురా
నటరాజై శివుడే ఆడెనురా
నమః శివాయ సిద్ధనమాయ
ఓ ఓ...సిద్దనమాయ అభిశుద్ధ నమాయ

పంచాక్షరీ జపమంత్రమే పరమశివాయ
కైవల్యం కైలాసం నమః శివాయ
ఒహో అద్వైతం శివతత్వం సదాశివాయ
పూర్ణం పరిపూర్ణం గురుపూర్ణనమాయ

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా

అండము నీవే పిండము నీవే
ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో...పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
హరహర మహాదేవ శంకరా

Palli Balakrishna
Ganapathi Song (2020)





పాట: గణపతి పాట (2020)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: ఆనంద్ గుర్రం 
గానం: మంగ్లీ


గణపతి పాట (2020) సాహిత్యం

 
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి

లంబోదరా నేను ఏమివ్వనురా
ఈసారికి ఎలాగోలా మన్నించరా
లంబోదరా నేను ఏమివ్వనురా
ఈసారికి ఎలాగోలా మన్నించరా

ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి

భాజాభజంత్రీలు లేవు
భారీగా సెట్టేసే బడ్జెట్టు లేదు
పట్టుబట్టలా ఊసేలేదు సామి
పంచభక్ష పరమాన్నాల్లేవు
కోటి దీపాల్లేవు - కోటి దీపాల్లేవు
కొబ్బరి ముక్కా లేదు -  కొబ్బరి ముక్కా లేదు
కోటి దీపాల్లేవు కొబ్బరి ముక్కా లేదు
అరటి పండు కరువే హారతి బిల్లా బరువే

ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి

లంబోదరా ఎట్టాగయ్యా 
గట్టెక్కే దారేదో సూపించయ్యా
లంబోదరా ఎట్టాగయ్యా
గట్టెక్కే దారేదో సూపించయ్యా

ముక్కు మూతి మూసుకోని
మనసులో తెలిసిందేదో మొక్కుకుంటాం
కాళు బయటాబెట్టాకుండా సామి 
మట్టితో నిన్ను చేసుకుంటాం

ఆశా పడకూ సామీ - ఆశా పడకూ సామీ
అలిగీ పోకు సామి - అలిగీ పోకు సామి
ఆశా పడకూ సామీ అలిగీ పోకు సామి
వచ్చే ఏడు బూందీ లడ్డూ పెట్టనా ఏమి

ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి


Palli Balakrishna
Aada Nemali





పాట: ఆడ నెమలి
సంగీతం: ఎస్.కె.మదీన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కనకవ్వ, మంగ్లీ
సేకరణ:కనకవ్వ


ఆడ నెమలి ( నర్సపేల్లే గండిలోన గంగధారి ) పాట సాహిత్యం

 
పాట: ఆడనెమలి
సంగీతం: ఎస్.కె.మదీన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కనకవ్వ, మంగ్లీ
సేకరణ:కనకవ్వ 

నర్సపేల్లే  గండిలోన  గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి (2)
ఇద్దరాము గూడు దాము గంగధారి
ఒద్దిమాను కొరుగుదాము గంగధారి (2)

నిన్ను నన్ను చూసినంక 
మంది క౦ట్లే మంటలాయే 
ముద్ధు ముచ్చట ఓర్వలేక 
ముక్కు మూతి  తిప్పుడాయే 
పట్టుకోర నువ్వు పిట్టలోల ఎగిరి బుంగ చేయ్యి

నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే..

నర్సపేల్లే  గండిలోన గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి (2)

ఇద్దరిది కంటి  నీరు గంగధారి
ఒద్దిమాను కుంటే నిండే గంగధారి (2)
ఒద్దిమాను కుంట ఏనుక గంగధారి
ఇద్ధుమిరుస  సన్న వడ్లు గంగధారి (2)
ఇద్ధుమిరుస  సన్న వడ్లు గంగధారి
ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి  (2)

కస్సు బుస్సు మనకు రయ్య 
పాల పొంగు లెక్క నువ్వు
నీళ్ళు సళ్లీ నట్టు జల్లి 
సల్లబడినవంటే సాలు 
ఏలు పట్టుకోని తిరుగు 
ఎంటి లెక్క చూసుకుంటా 

నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే..

నర్సపేల్లే  గండిలోన గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి (2)

నువ్వు నేను కూడినప్పుడు గంగధారి 
కొత్త కుండల తేనె వోలె  గంగధారి  (2)
కొత్త కుండల తేనె వోలె  గంగధారి 
పాత కుండల పాశమోలే గంగధారి  (2)
పాత కుండల పాశమోలే గంగధారి 
పాలనేతుల బాసలాయే గంగధారి  (2)
పాలనేతుల బాసలాయే గంగధారి 
పాసిపోయే దీనమచ్చే గంగధారి (2)

 పాసిపోతే పాయే ఆశ సావకున్నదాయే 
గోస లాన్ని తీరిపోయే మాస మచ్చే చూడరయ్యో 
రాసముప్పడైనను తీగలెక్క అల్లుకుంట 

నర్సపేల్లే.. నర్స .. నర్సపేల్లే..

నర్సపేల్లే  గండిలోన గంగధారి
ఆడి  నెమలీ ఆటలకు గంగధారి  (2)

ఆడి  నెమలీ ఆటలకు గంగధారి
మొగ నెమలి మోస పాయే గంగధారి

Palli Balakrishna
Pandugadi Photo Studio (2019)



చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019)
సంగీతం: వినోద్ యాజమాన్య
నటీనటులు: ఆలి, భవ్య శ్రీ
దర్శకత్వం: దిలీప్ రాజా
నిర్మాత: గుదిబండి. వెంకట సాంబిరెడ్డి
విడుదల తేది: 21.09.2019







చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019) సంగీతం: వినోద్ యాజమాన్య సాహిత్యం: రాంబాబు గోశాల గానం: వినోద్ యాజమాన్య, శ్రేయా ఘోషల్ సాకీ: నిన్నే తలచి తలచి నా గుండె కొట్టుకుంటుందే పల్లవి: నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని నువు అవునన్నా కాదన్నా నీలోనే సగమవన నువ్వే ప్రాణమే అని మరువనులే కలనైనా విడువనులే ఏమైనా జతగుంటా చితినైనా మనదొక జగమవనీ పెదవుల దాటిన మౌనము ఈ క్షణమే మరి మరి ప్రేమగ పిలిచెనులే నిను కోరి కోరి కోరి చేరుకున్నా... ప్రియా నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని చరణం: 1 ఇది ప్రేమ అని తెలుసు ఇక ఆగదే మనసు నన్ను నన్నుగా ఉండనీయదే మాట విననంటుందా మాయలో పడుతున్నా లోకమే నేనందా నమ్మవన్నదా మన కలయే నిజము అని మన కదయే ఋజువివని ఊహాలకే ఉపిరిలా నీ నవ్వే వరమాయే ఇన్నాళ్ళుగా మనమిద్దరం ఇపుడవ్వుదాము ఒకరికొకరులా నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని చరణం: 2 కలలాంటి నన్ను ఇలా కడలల్లే దోచేవా ప్రాణబంధమై నన్ను అల్లవా కంటి రెప్పైనిన్ను కాచుకుంటా నేను గుండె చప్పుడల్లే ఉండిపోనా గడియైనా విడిపోనీ పయణమిలా మొదలవని నేనుందే నీకోసం అణువణువు నీ సొంతం నీతో ఇలా నడిపించిన మన ప్రేమ అమరమఖిలమేనులే నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని








చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019)
సంగీతం: వినోద్ యాజమాన్య
సాహిత్యం: రాంబాబు గోశాల
గానం: వినోద్ యాజమాన్య, 

పల్లవి
ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి
నీ ప్రేమనే నా గుండెల్లోన దాచి
నా ప్రాణమే ఇన్నాళ్లు ఉంది వేచి
మనసు మనసు మరి మురిసేనా
కనులు కనులు ఇక కలిసేనా
కలల వాన జడి కురిసేనా
యదన లయల సడి ఎగసేనా

మాయ నేదేనా ఈ మాయ నీదేనా
హాయి నీదేనా ఈ హాయి నీదేనా

ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి

చరణం: 1
ఎన్నెన్నో వర్ణాల హరివిల్లై నా సొగసే
మీకోసం ఈ క్షణమే విరబూసే
నీ చిన్ని చిన్ని చిన్ని చిన్ని పలుకులే
నా చిట్టి చిట్టి మనసుని తాకగా
తొలి తొలి తొలి తొలి ప్రేమలే
ఈ చలి గిలి అలజడి రేపగా

అడుగు అడుగు పడు పయనాన
అడగలేనులే మౌనాన
మొదటి సారి ఈ ధింతననా
మురలైంది నీ వలనేనా

మాయ నేదేనా ఈ మాయ నీదేనా
హాయి నీదేనా ఈ హాయి నీదేనా

ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి

చరణం: 2
నిన్నే చూడకుంటేనే ఊపిరాగేలావుంది
నువ్వెదురే వస్తుంటే బాగుందే
నా మది నది పరుగులు తీసెలే
నీ జతకది సులువుగా చేరెలే

పరువపు పదనిస మోగెలే
నా తలపులు ఊగిసలాడెలే

ఆశ ఆశ పడి పిలిచేను
నిన్ను చూసి తపియించేను
ఎంతో ఇష్టపడు తున్నాను
ఇపుడే నాకు ఇది తెలిసేను

మాయ నేదేనా ఈ మాయ నీదేనా
హాయి నీదేనా ఈ హాయి నీదేనా

ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి



Palli Balakrishna Friday, May 21, 2021
Galli Rowdy (2021)




చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీసింహా, రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: యమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది:17.09. 2021



Songs List:



పుట్టెనే ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: రామ్ మిరియాల

పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా...
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటో చెప్పు కొంచం ఒట్టేసుకుంట
నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంట
సెల్లు నెంబర్ని చెప్పు రింగు ఇచ్చేసుకుంట
మంచి డేటుంటే చెప్పు పెళ్లి చేసేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా

కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగ మెరిసావే ఓ...
మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడవాసనిపుడే చూపావే
నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంట
నీ టేస్ట్ ఏంటో చెప్పు నేను వంట నేర్చేసుకుంట
నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంట
నాన్నకప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంట

పుట్టెనే.... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టేనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా

దోమ తెరలాగా ఉస్సూరని ఉండే నా లైఫు
వెండితెరచేసావే ఓ...
ఒక్క నవ్వుతోనే కుండీ లాంటి బుజ్జి గుండెలోన
ప్రేమవిత్తనాలే జల్లేసావే
నీ ఇష్టాలు జెప్పు లిస్టు రాసేసుకుంట
నీ కష్టాలు జెప్పు నెత్తిమీదేసుకుంట
ఏమి కావాలో జెప్పు గిఫ్టు ఇచ్చేసుకుంట
నువ్వు కాదంటే జెప్పు నేను ఉరేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా





చాంగురే ఐటెం సాంగురే పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: మంగ్లీ, సాయి కార్తీక్ , దత్తు 

లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లబ్బ లల్లాయిలే
లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లాయ్ లబ్బ లల్లాయిలే

ఏ, చాంగురే చాంగురే ఐటమ్ సాంగురే
రాతిరంత పాడుకుంటే రాదు నిద్దరే
(నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే)

ఏ, ఎప్పుడంటె అప్పుడే… ఎక్కడంటె అక్కడే
నన్ను చూస్తే ఎవ్వడైనా పూలరంగడే
(రంగడే రంగడే రంగడే రంగడే రంగడే రంగడే)
హబబ్బా ఇంతందంతో ఎట్టా సచ్చేది
హబబ్బా మీ కుర్రాళ్ళని ఎట్టా ఆపేది

ధవళేశ్వరం ఆనకట్ట తెంచినట్టు
నాపై జనం దూకుతుంటరే
పిఠాపురం పీటసెక్క లాగ
నేను మహాదిట్టం అంటూ ఉంటరే

రాజాధిరాజా రౌడీ రాజా
మీసం తిప్పిన మార్తాండకేయ
రాజాధిరాజా రౌడీ రాజా
ఇరగదీద్దాం ఆయుధ పూజ

కత్తులకైనా అధరవులేరా… ఒంపులకైనా బెదరవులేరా
తాతకి తగ్గా మనవడివేరా… రా రాజా రాజా

నా నడుం మడతలిస్తిరి చేసేటోడు
కత్తిలాంటోడు నాకు దొరికినాడు
ఆ గాజువాక నుంచి మధురవాడ దాకా
నీ పేరు చెప్పగానే కెవ్వు కేక

ఏం చెప్పావే గ్రీకు సుందరీ
స్వర్గంలో వేస్కో మల్లె పందిరి
ఏ, అందరికన్నా పెద్ద కంతిరీ
తీర్చేస్తా నీ తిమ్మిరీ

హబబ్బా నీ ఘనకార్యం సూడాలని ఉందే
నీతో కొత్త యవహారం నడపాలని ఉందే
సీకాకుళం అడ్డరోడ్డు దాటగానే
సీతాఫలం బుట్టలిస్తనే
భీమునిపట్నం బీచ్ కాడ
సిత్తరాల సోకుల పొట్లం చేతికిస్తనే




విశాఖపట్నంలో రౌడీ గాడు పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

పిల్ల పిల్ల పిల్ల పిల్ల కోసం
పిల్లగాడు వేసే కొత్త వేషం
ఇంతలోనే ఎంత అట్టహాసం
కదిలేను కదా… వీడి ప్రేమ కథ

చెయ్యలేదు వీడు ఒక్క యుద్ధం
చూడ లేడు వీడు కోడి రక్తం
రాడు పట్టినాడు ప్రేమ కోసం
ముదిరెను కదా వీడి ప్రేమ కథ
వీడేమో పడుచోడు… వీడెనక ముసలోల్లు
ఓఎల్ఎక్స్ పీసులతోటి ఏం సాధిస్తాడు

ముందెనకా చూడకుండా… ఫైటింగ్ కే దిగినాడు
ఈ కత్తుల కొట్లాటల్లో ఏమైపోతాడు

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ

టిప్పు టాపుగా ఉండేటోడు… ఎంత రఫ్ గా అయిపోయాడు
రచ్చబండ మీద పంచాయితీ చేస్తున్నాడు
కీ బోర్డు మీదా మనసైనోడు… కీళ్లు విరవడం మొదలెట్టాడు
మౌసు పక్కనేటి మీసం తిప్పి… ధూకేశాడు

సెంటు కొట్టుకునే డీసెంటు పిల్లగాడే
బెల్టు పట్టుకొని సెటిల్‌మెంట్ చేస్తాడే
ప్యారు పుట్టగానే వీడు గేర్ మార్చినాడే
అమ్మో అమ్మో ఆగడే..!!

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ, ఓ మై గాడూ





అడ్డంగా బుక్కైపోయా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఘోరంగా ఎలకల నోటికి
దొరికిన పుస్తకమైపోయా
హే, హరహర మహాదేవ దేవా
విడుదల ఇక లేదా లేదా
మలమల మల ఎండల్లోన
పులుసే కారి పోతోందయ్యా

ఏంటో నా రాత రాత
ఈ మలుపున మోత మోత
వీడేమో యముడికి దూత
వదిలేస్తే నేనింటికి పోతా
పులిహోరే పులిహోరే

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఏ, అచ్చంగా బ్లేడుకి దొరికిన
పెన్సిలు ముక్కను అయిపోయా

ఏ సరదా లేక లేకా… నిదరేమో రాక రాకా
పెడుతున్నా నే పొలికేక
బతికేస్తున్నా రేపటి దాకా
పెంచాలట బాడీ బాడీ
అవ్వాలట రౌడీ రౌడీ
ప్రాణాలే తోడి తోడి
ఆడేస్తున్నరు కబడ్డీ కబడ్డీ
పులిహోరే పులిహోరే
బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి




తల్లడిల్లిపోద పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Tuesday, May 18, 2021
Alludochadu (1976)





చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతి రావు
నటీనటులు: రామకృష్ణ , రాజబాబు, నాగభూషణం, జయసుధ, ప్రభ, కృష్ణ కుమారి
కథ: భమిడిపాటి రాధాకృష్ణ
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
నిర్మాత: ఎ. వి. సుబ్బారావు
విడుదల తేది: 10.06.1976



Songs List:



లేత కొబ్బరి నీళ్ళల్లే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
లేత కొబ్బరి నీళ్ళల్లే
పూత మామిడి పిందల్లే
లేత కొబ్బరి నీళ్ళల్లే 
పూత మామిడి పిందల్లే
చెప్పకుండా వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసూ

చరణం: 1 
పొంగువస్తుంది నీ బాల అంగాలకు ఏహే
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు

కోక కడతావు మొలకెత్తు అందాలకు ఏహే
కొంగు చాటేసి గుట్టంత దాచేందుకు
దాగలేనివి ఆగలేనివి
దారులేవో వెతుకుతుంటవి

చరణం: 2 
కోటి అర్ధాలు చూసేవు నా మాటలో ఓ...
కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో
నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు
ఆడుకుంటాయి నాతోటి దోబూచులు

చూచుకొమ్మని దోచుకొమ్మని
చూచుకొమ్మని దోచుకొమ్మని
దాచుకున్నవి పిలుస్తుంటవి

చరణం: 3 
ఓ...వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచీలను ఏహే...
మనసు తానొల్లనంటుంది రాజీలను

ఆహా...పగలు సెగబెట్టి వెడుతుంది లోలోపల...ఓహో
రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు
రేపు ఉందని తీపి ఉందని
ఆశలన్నీ మేలుకుంటవి




మా తెలుగు తల్లికీ మల్లె పూదండ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం:  
గానం: సుశీల

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు

కడుపులో బంగారు కినుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు పొరలించు మా తల్లి 

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు

గలగలా గోదారి కదిలి పోతుంటేనూ
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
దింగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి 

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కన్న కలములో తీయందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి వుండేదాక 

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు



కొడితే పులినే కొట్టాలి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

కొడితే పులినే కొట్టాలి
పడితే చెలినే పటాలి
ఆ చెలి కౌగిలిలో
చలిమంటలు పుట్టాలి
గిలిగింతలు పెట్టాలి

కొడితే పులినే కొట్టాలి.
పడితే చెలినే పట్టాలి.

ఆరె చెలి కౌగిలి కై
పది జన్మలు కావాలి
పడిగాపులు కాయాలి

నీలాటి రేవుకాడ నీలాంటి చిన్నది
నీళ్ళల్లో రగిలే నిప్పల్లే వున్నది
చూపు చూసింది చురక వేసింది
మేను కదిలింది. మెరుపు మెరిసింది
పిల్లనుకౌనూ పిడుగే నన్నది
పడితే ఆ పిడుగు నేపట్టాలి...పట్టాలి...పట్టాలి....

కొడితే పులినే కొట్టాలి

కోటప్ప కొండమీద కోలాటమాడుతుంటే
కొవ్వెక్కి కోడెగిత నా వెకి దూకుతుంటే
గడుసైన చినవాడే తొడగొటి నిలిచాడే
కొమ్ములు విరిచేశాడే కోడెను తరిమేశాడే
ఈలవేసి నే రమ్మంటే ఎటో జారిపోయాడే

పడితే ఆ గడుసోన్నే పట్టాలి... పట్టాలి...పటాలి...

కొడితే పులినే కొట్టాలి

గోల్కొండ ఖిల్లా పైన గొంతెత్తి పాడితే
ఆకాశం అంచులదాకా నా పాటే మోగితే
మోగితే ఏమయింది?
ఆకాశం కూలిందా,
పాతాళం పేలిందా,
కాకమ్మ మెచ్చిందా ?
కోకిలమ్మ చచ్చిందా ?
కాదు; కాదు-
కాలేజీ పిల్లికూన కౌగిట్లో వాలింది
పడితే ఆ పిల్లికూననే పట్టాలి...పట్టాలి... పట్టాలి...

కొదితే పులినే కొట్టాలి




వేళా పాళా ఉండాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా 
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా
కోరిక నీలో ఎంతవున్నా
తీర్చే మొనగా డెదుట వున్నా
వేడి ఎక్కడో పుట్టాలి
నీ వేడుక అప్పుడు తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా 
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా

పొదలో తుమ్మెద రొద పెడితే
మొగ్గకు తేనె వచ్చేనా
ఎదలో ఏదో సొదపెడితే
ఎంకి పాటగా పలికేనా
పెదవులూ రెండూ కలవాలి
నీ ఎదలోని కుతి తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా


పదహారేళ్ళ ప్రాయంలోన పైటజారక నిలిచేనా
ఎదిగే పొంగు ఏనాడైనా అదిమిపట్టితే ఆగేనా !
ఆగని వన్నీ రేగాలి
అప్పుడు మన కథ సాగాలి....

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా 
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా




ఉరకల పరుగుల పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీనిదుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం

వద్దు వద్దు వద్దు వయస్సు పోనీయొద్దూ
ఇంత వాటంగా నీకు నాకు మళ్ళీ మళ్ళీ దొరకదు

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం

కోడె వయసుకున్నవీ కొండగుర్తులు
ఎన్నో కొండగురులు
ఏమిటవి?
కోర్కె పుట్టేది గుండె చెదిరేది
తోడు వెతికేది దుడుకు పెరిగేది
ఆ వయసుకే వస్తాయి కొంటెచేష్టలు
ఎన్నో కొంటెచేష్టలు
ఏమిటవి ,
కళ్ళు కలిపేది నీళ్ళు నమిలేది
వొళ్ళు విరిచేది తల్లడిల్లేది...

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం

ప్రేమకే వస్తాయి పిచ్చి ఊహలు
ఎన్నో పిచ్చి ఊహలు
ఏమిటవి?
పంటి నొక్కుల్లో పెడవి కాటుల్లో
కంటిపాపల్లో కలలమాపుల్లో
ఆ ఊహలకొస్తాయి రూపు రేఖలు
ఎన్నో రూపురేఖలు
ఏమిటవి?
జగమే మనదని సగమూ సగమని
జన్మజన్మ లకు మనదే జంటని

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో నష్టం
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం




ఎలా చెప్పేదెలా చెప్పేది పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల

ఎలా చెప్పేదెలా చెప్పేది
చల్ మోహన రంగా
చెప్పబో తే సిగ్గు ముంచుకు వస్తుంది
చాటు చాటుగా చెబుదామంటే
మాయదారి చంద్రుడున్నాడు
చల్లచల్లగా చెప్పాలంటే
అల్లరిగాలి వింటున్నాడు
తిక్క రేగుతుంది. వేడెక్కిపోతుంది
వళ్ళు తెలియకుంది గుండెల్లో గుబులుంది
ఊపిరాడదయ్యో అయ్యో
ఉక్కిరి బిక్కిరి అవుతుంది

ఎలా చెప్పేదెలా చెప్పేది
చల్ మోహన రంగా

పక పక నువ్వు నవ్వితే
నా చెక్కిలి ఎరుపెక్కుతుంది
చిలిపిగ నువ్వు చూస్తే
నా కళ్ళకు కై పెక్కుతుంది.

నువ్వంటే పిచ్చి నీమాటంటే పిచ్చి
నువ్వుంటేను పిచ్చి లేకుంటేను పిచ్చి
నీ పాటంటే అబ్బో అబ్బో
మరీ మరీ పిచ్చి

ఎలా చెప్పేదెలా చెప్పేది
చల్ మోహన రంగా




అంతే నాకు చాలు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు
నే నేదింక కోరేదిక లేదు
అందరివోలె అడిగేదాన్ని కాను
కొందరివోలె కొసరేదాన్ని కాను
ఓహో బంగారు మావా ఓహో బంగారు మావా
ముక్కుకు ముక్కెర లేక
ముక్కు చిన్నబోయినాది
ముద్దుటుంగరం కుదువబెట్టి
ముక్కుకు చక్కని ముక్కెర తేరా...మావా 

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

నడుమా వడ్డాణం లేక
నడుము చిన్నబోయినాది
నాణ్యమైన ధాన్యం అమ్మీ
నడుముకు వడ్డాణం తేరా.....మావా
|
అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

కాళ్ళకు కడియాలు లేక
కాళ్ళు చిన్నబోయినాయి
కోడి ఎద్దుల నమ్ముకోని
కాళ్ళకు కడియాలు తేరా....మావా 

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

పట్టెమంచం పరుపు లేక
మనసూ చిన్నబోయినాది
పంట భూములమ్ముకోని
పట్టెమంచం పరుపూ తేరా... మావా

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

Palli Balakrishna

Most Recent

Default