Search Box

MUSICAL HUNGAMA

Raahu (2020)

చిత్రం: రాహు (2020)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: శ్రీనివాస మౌళి
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: కృతి గార్గ్, అభిరాం వర్మ 
దర్శకత్వం: సుబ్బు వేదుల
నిర్మాత: A.V.R స్వామి, రాజ దేవరకొండ, శ్రీ శక్తి బాబ్జి
విడుదల తేది: 28.02.2020

చరణం: 1
ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూ నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో వున్నటుగా 
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేటు లేదు నీచూపు ఆకట్తగా 
నా లోకి జారింది లే తేనె బొట్టు నమ్మేటుగా లేదుగా ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో

చరణం: 2
నేనేనా ఈవేళ నేనేనా నా లోకి కళ్లారాచూస్తున్న
ఉండుంది ఏ మాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని
విన్నట్టు వున్నావా బాగుందని తేలే దారేదని
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో

చరణం: 3
ఏమైనా బాగుంది ఏమైనా... నా ప్రాణం చేరింది నీ లోన
ఈ చోటే కాలాన్ని ఆపాలని... నీ తోటి సమయ్యని గడపాలని...
నా జన్మే కోరింది నీ తోడుని... గుండె నీదేనని...
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమే ఏమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో

Palli Balakrishna Saturday, October 17, 2020
Jaanu (2020)
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ప్రదీప్ కుమార్
నటీనటులు: శర్వానంద్, సమంత
దర్శకత్వం: సి. ప్రవీణ్ కుమార్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 07.02.2020

ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా
త్రుటిలో కరిగే కలవే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై  నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంట పడి నువ్వింత ఒంటరి 
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ...


ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా
అనగనగా...  అంటూనే ఉంటా
ఎపుడూ పూర్తవనే అవక
తుధి లేని కథ నేనుగా

గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా

యే చిరునామాలేక యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా

నా వెంట పడి నువ్వింత ఒంటరి 
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా 
రాకూడదు ఇంకెవరైనా 

అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఉయాలలూపింది జొలాలిPalli Balakrishna
30 Rojullo Preminchadam Ela (2020)

 

చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2020)
సంగీతం: అనుప్ రూబెన్స్
సాహిత్యం: చంద్ర బోస్ 
గానం: సిద్ శ్రీరామ్, సునీత 
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ 
దర్శకత్వం: మున్నా 
నిర్మాత: S.V బాబు 
విడుదల తేది: 2020

పాట: నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకనుఇద్దామనుకున్నా.. ఓహో ఓహో
నీ నవ్వుకు సరిపోదంటున్నా...

నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

చరణం - 1
ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

చరణం - 2
ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నాPalli Balakrishna

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0