Search Box

MUSICAL HUNGAMA

Devatha (1982)


చిత్రం: దేవత (1982)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి, మోహన్ బాబు
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 04.09.1982

(గమనిక: ఎల్లువచ్చి గోదారమ్మ పాట ని వరుణ్ తేజ్ నటించన గద్దలకొండ గణేష్ సినిమాలో రీమేక్ చేశారు)

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో...రావయ్యో
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో...రావమ్మో
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు

ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన
అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట
వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గ
చెంగావి గన్నేరు మొగ్గ
చెయ్యేస్తే చేమంతి బుగ్గ
చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే
ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను చూడు
ఆకలికుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు

నీ కళ్ళు సోక నా తెల్ల
కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు
పైట పాడిందిలే గాలి పాట
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
నే కోరిన మూడు ముళ్ళు
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
నే కోరిన మూడు ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే
కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ ఏరు తోడు
ఏరెండినా ఉరు తోడు
నీ తోడులో ఊపిరాడు

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో...రావమ్మో
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడాPalli Balakrishna Wednesday, January 15, 2020
Sarileru Neekevvaru (2020)


 చిత్రం : సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: బ్లెజ్, రనీనా రెడ్డి

ఎప్పుడూ ప్యాంటేసే వాడు...
ఇప్పుడు లుంగీ కట్టాడు... వావ్
ఎప్పుడూ షర్టేసే వాడు... వావ్
ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా
చేతికేమో మల్లెపూలు కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు
ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్

బాబూ నువ్ సెప్సు.. ఏంటీ
ఆన్ని కొట్టమని డప్పు.. హూమ్ నువ్ కొట్టరా
మూన్ వాకు.. మూన్ వాకు..
పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకు
అర్త్ క్వేకు.. అర్త్ క్వేకు..
పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్ క్వేకు
నీ లిప్పు లోన ఉంది కప్పు కేకు..కేకు...
మాటలోనా ఉంది మిల్క్ షేక్.. షేకు.
సోకులోనా ఉంది కొత్తస్టాకు  స్టాక్
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
నువ్ హాట్ హాట్ గున్న పూత రేకు.. రేకు.
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు
మనసునెర్రజేసే తమలపాకు...పాకు
అమ్మా అమ్మా హబ్బ హబ్బా

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు

బాబూ నువ్ సూపియ్. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ.. హుమ్ నువ్ ఊదరా
నువ్ ఉండరా
నువ్వు చీరకట్టుకుంటే... జారుతుందే గుండె
ఓరకంట చూపే.. భగ్గుమంటు మండే.
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందో
నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే

అట్టా నువ్ చూస్తుంటే.. నా వొళ్లంతా
గిలిగింత పుడతాందే
నీ కళ్లలోన ఉంది.. కళ్లు ముంత.. ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంత.. పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు

బాబూ తూ బోలే... క్యారే
ఆన్నీ దంచమనీ ఢోలే.. హుమ్ నువ్
దంచెహే
హా.. బాబూ ఇటు సూడూ.. ఏంటీ
ఆన్నీ పెంచమను స్పీడూ.. హుమ్ నువ్
పెంచరా
నీ ముద్దు ముట్టకుండా... ముద్ద ఎక్కదంట హగ్గు అందకుండా నిద్దరట్టదంటా
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా
నీ టచ్ లో కరెంటే నన్ను గుచ్చెనంటా
మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా
అయితే నిన్ను టచ్ చేస్తా... నిన్ను ఏదేదో
మైకంలో ముంచేస్తా.

నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
నీ నడుములోన ఉంది పూల నావా నావా...
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకుPalli Balakrishna Saturday, January 11, 2020
Ruler (2019)


చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: బాలకృష్ణ , వేదిక, చొనాల్ చౌహాన్
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాతలు: సి.కళ్యాణ్
విడుదల తేది: 20.12.2019

Palli Balakrishna

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0