Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aaropranam (1997)



చిత్రం: ఆరోప్రాణం (1997)
సంగీతం: వీరు. కె
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, జిక్కి
నటీనటులు: వినీత్ , సౌందర్య
దర్శకత్వం: వీరి. కె
నిర్మాత: వి. శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 1977

ఓహో ఓహోహొ ఓహో
ఆహాహా ఆహాహ ఆహాహాహా
విన్నావంట్రా అబ్బాయి నీ అబ్బాయికి పాపం లవ్వయిందంట
నువ్వూ నీ ఇల్లాలు కలిసి ఓకే అంటే చాలు పెళ్ళవుతుందంటా
ఓహో ఓహోహొ ఓహో
ఆహాహా ఆహాహ ఆహాహాహా
పేరెంట్స్ అంటే పెళ్ళికి పిలిచే పేరంటాలా ఏమిటి నువ్వే చెప్పమ్మా
మాక్కాబోయే కోడలు ఎవరో ఊరు పేరు గట్రా వివరాలేంటమ్మా
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా
చూడ చక్కనిది నేనెంతో మెచ్చినది
నన్ను దోచినది నాకెంతో నచ్చినది
రంభ రోజా మీనా లాగ మురిసి మురిపించి మరిపించేలాగుంది
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా

మనీషా టాబు లాంటి వాళ్ళు కోడలైతే నీకిష్టమా
మమ్మీ వినవే పవిత్ర బంధం సౌందర్యలాగ ఉంటే సరే
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా
ఆడపడుచే అర్ధమొగుడని మోటు సామెత ఒకటుంది
నీ అన్న పెళ్ళాం ఎట్టా ఉంటే నీకు ఇష్టమే సిస్టర్ ది
నాకు వచ్చే వదినకు ఇట్టాగుంటే నీకే నష్టం నానమ్మా
అందం చందం చెప్పే వయసు నీది కాదే ముసలమ్మ
చేతికి చెంబు మెడలో మాల కాశి శివకాశి నీకు తప్పదే నానమ్మా

సుప్రీం కోర్టు జడ్జిమెంటు నీదే కాదా భార్యామణి
అయితే ఇంక ఆర్గుమెంట్సు ఎందుకండి నాకిష్టమే
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా
ఇంతమంది చెప్పినవన్నీ విన్నావ్ కదరా ఓ మై సన్
పాసయ్యిందో లేదో చెప్పి చప్పున తీర్చేయ్ మా టెన్షన్
అన్ని విదాలా నేను కూడా అమ్మ పోలికే కాబట్టి
అచ్చంగా మీరనుకున్నట్టే ఉంటుందని నా గ్యారంటీ
చూశారంటే మా మ్యారేజికి మీరే నా కన్నా తొందర పడతారండి
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా


********   *********   ********


చిత్రం: ఆరోప్రాణం (1997)
సంగీతం: వీరు. కె
సాహిత్యం: సత్యవేంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓ ఆశా నా ఆశా
చెలి చెంత లేదు చెరలో ప్రియ చింత కలిగె మదిలో
దడదడ గుండె పిలిచె నిన్నే ఓ ప్రియా
విధి రాత ఇట్టిదేమో తరరాత తప్పదేమో
ఇది ప్రేమ శాపమేమో ఓ ప్రియా ఓ ఓ
చెలి చెంత లేదు చెరలో ప్రియ చింత కలిగె మదిలో
దడదడ గుండె పిలిచె నిన్నే ఓ ప్రియా

సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి

నీవు తోడులేని ఈ ఒంటరి బ్రతుకున ఊపిరి మిగిలుంటుందా
నేను పాడే పాట ఓ ప్రణయం ప్రళయం ఆరోప్రాణం కాగా
ఊపిరేమో ఊహల ఊసల ఊచల ఒడి చేర్చె నీవు కనవా
ప్రాణమేమో విలవిల గిలగిల దడదడలాడేనే చేరుకోవా ఓ ఓ

ఓ ప్రియతమా నీవు కనరావా
నీ ప్రియ భామ పెళ్ళి కూతురాయె
ఈ పెళ్ళి మేళం నిన్ను నన్ను కలిపె
తరుణమే ఈ శుభఘడియలు తొందర చేసెనులె
కొండల నడుమ కోనొకొటున్నది
కోనల నడుమ కొలనొకటున్నది
కొలను గట్టున కోవెల ఉన్నది
కోవెల లోపల దేవత ఉన్నది
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
ఈ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ

నన్ను కన్నవారే నా కలలకు తీరని కలతను మిగిలించారే
నేను కన్న కలలే నా కనులకు చీకటి వెలుగును శాసించాయే
గుండె నేడు గుబులై దిగులై సెగలై రగిలేనే ఎందుకోసమో
ఊపిరంతా క్షణమే యుగమై జగమే విషమయ్యె నీకోసమే ఓ ఓ


********   *********   ********


చిత్రం: ఆరోప్రాణం (1997)
సంగీతం: వీరు. కె
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో

పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు
మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు
చలి దోపిడి ఈ ముద్దు తొలి అలజడి ఈ ముద్దు
ఎద సందడి ఈ ముద్దు యమ సంబరమీ ముద్దు
మాట దాటొద్దు మారాం చెయ్యొదు
ఘాటు ముద్దిచ్చి నాలో నిన్నే కలిపేట్టు
పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు
మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు

మెడలో చేరే ఓ ముద్దు ముత్యాల ముద్దు
ముడికే జారే ఆ ముద్దు వరహాల ముద్దు
చెవినే తాకే ఓ ముద్దు సన్నాయి ముద్దు
చేతికి అందే ఓ ముద్దు చేసింది సద్దు
పాపిట చెదిరే ఓ ముద్దు పడకింటి ఆ ముద్దు
నడుమును తడిమే ఓ ముద్దు తుడుచేసె సరిహద్దు
గాలి మువ్వల్లో కానుక ఓ ముద్దు
అన్ని ముద్దుల్లో వద్దు మాకు మునకేద్దు

పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు
మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు

పొద్దున ఇచ్చే ఓ ముద్దు పొరపాటు ముద్దు
చీకటి పడితే ఆ ముద్దు అలవాటు ముద్దు
నిద్దుర చంపే ఓ ముద్దు నిజమైన ముద్దు
వద్దని ఇచ్చే ఆ ముద్దు అసలైన ముద్దు
చెక్కెర పంచే ఓ ముద్దు చెలికాడి తొలిముద్దు
చుక్కలు చుపే ఓ ముద్దు మణి కోరే మలి ముద్దు
నన్ను ఆపొద్దు నిమిషం నిలవద్దు
తేనె ముద్దిచ్చి తోడు నీడై గడిపేయ్

పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు
మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు
చలి దోపిడి ఈ ముద్దు తొలి అలజడి ఈ ముద్దు
ఎద సందడి ఈ ముద్దు యమ సంబరమీ ముద్దు
మాట దాటొద్దు మారాం చెయ్యొదు
ఘాటు ముద్దిచ్చి నాలో నిన్నే కలిపేట్టు


********   *********   ********


చిత్రం: ఆరోప్రాణం (1997)
సంగీతం: వీరు. కె
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర,అనుపమ

ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా
వరమియ్యనా ఒడి చేర్చనా నీ మారాం మానమ్మా
జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా
ఓ పూల బాణమా నా ఆరో ప్రాణమా
ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా

నీ కనుపాపలలోన ఓ కలనై రాలేనా
నీ తలపులు క్షణమైనా నన్ను నిదరోనిస్తేనా
ఒంటరి వేళలలోన నీ ఊహను కాలేనా
తుంటరి తొందరలోన ఏమైనా తోచేనా
అన్నీ మరిచి నిన్నే తలిచి ఏమైపోతున్నా
ఏమో ఈ యాతన నాకైనా తెలుసునా

ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా

గాలుల గుసగుసలోన నీ ఊసులు వింటున్నా
పువ్వుల మిసమిసలోన నీ నవ్వులు చూస్తున్నా
నిలబడనీవే నన్ను ఒక నిమిషం పాటైనా
కాలం కదలక నేను తెగ సతమతమౌతున్నా
చిలిపిగా అల్లిన ఇంతటి అల్లరి ఏంటిది ప్రేమేనా
ఔనేమో ప్రియతమా నా ఆరో ప్రాణమా

ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా
వరమియ్యనా ఒడి చేర్చనా నీ మారాం మానమ్మా
జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా
ఓ పూల బాణమా నా ఆరో ప్రాణమా


********   *********   ********


చిత్రం: ఆరోప్రాణం (1997)
సంగీతం: వీరు. కె
సాహిత్యం: సత్యవేంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

నిన్ను చూసి నన్ను నేను మరిచిపోతినే
నిన్ను తలచి నేను ఇలా మారిపోతెనే
నీలోన నేనుండనా నీకు నూరేళ్ళు తోడుండనా
నీడల్లే నేనుండనా నీ గుండెల్లో దాగుండనా
గుప్పెడైన గుండెలోన గూడు కట్టి ఉండనా
సయ్యారే సయ్యా సందేళ మామయ్య వచ్చాడే
ఈ వయ్యారి ఒళ్ళోన తెల్లారి ఉయ్యాలలూగాడే

పెదవులపైన మురిపెంగ మురిపెంగ
మురిపాలు చల్లి చల్లంగ చల్లంగ
హృదయాలు మీటి మధురంగా మధురంగా
సరసాల తోటి సారంగ సారంగ
కంటిలోని కాగితాలు కబురు పంపెనే
ఒంటిలోని ఓనమాలు ఒడికి చేర్చెనే
ఏ పూజ పుణ్యానివో నువ్వు ఏ పూల గంధానివో
ఏ చంద్రబింబానివో నువ్వు ఏ సూర్య కిరణానివో
అందరాని కొమ్మలోని ఆమని చామంతివో

సయ్యారే సయ్యా సందేళ మామయ్య వచ్చాడే
ఈ వయ్యారి ఒళ్ళోన తెల్లారి ఉయ్యాలలూగాడే

వెన్నెలపైన వెచ్చంగ వెచ్చంగ
వేదాలు చదివి వేదంగ వేదంగ
పందిళ్ళలోన సంపెంగ సంపెంగ
పీటలు వేసి పిలవంగా పిలవంగా
దాచుకున్న దరహాసం దాసి కోసమా
పొంచి ఉన్న మధుమాసం ప్రేమ కోసమా
ఏ తీపి రాగానివో నువ్వు ఏ పూల బాణానివో
ఏ వర్ణ చిత్రానివో నువ్వు ఎల్లోరా శిల్పానివో
నిదురరాని హృదయమందు చెదరని స్వప్నానివో
సయ్యారే సయ్యా సందేళ మామయ్య వచ్చాడే
ఈ వయ్యారి ఒళ్ళోన తెల్లారి ఉయ్యాలలూగాడే

నిన్ను చూసి నన్ను నేను మరిచిపోతినే
నిన్ను తలచి నేను ఇలా మారిపోతెనే
నీలోన నేనుండనా నీకు నూరేళ్ళు తోడుండనా
నీడల్లే నేనుండనా నీ గుండెల్లో దాగుండనా
గుప్పెడైన గుండెలోన గూడు కట్టి ఉండనా

Most Recent

Default