Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lahiri Lahiri Lahirilo (2002)
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: హరికృష్ణ , సుమన్, వినీత్, ఆదిత్య ఓం, భానుప్రియ, సంగవి, రచన, అంకిత
దర్శకత్వం: వై.వి.యస్.చౌదరి
నిర్మాత: వై.వి.యస్.చౌదరి
విడుదల తేది: 01.05.2002Songs List:కళ్ళలోకి కళ్ళు పెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర

ఏయ్ ... కలవరమా ఓయ్...పరవశమా...
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా...
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా...
పంచదార ఎంతతిన్నా చేదుగుందండి...
చింతపండు కారమయ్యి చంపుతోందండి...
ఆ. అదేరా ప్రేమంటే కన్నా..
ఎదంతా వ్యాపించి నీదుంపతెంచే ప్రేమా ప్రేమా ప్రేమా ...

చరణం: 1
చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా..
ఎండను చూస్తే చలి వేస్తోందా...
ఎదురుగ నువ్వున్నా విరహం పుడుతోంది
ఏ నిజమైనా కలగా ఉంది..
విసుగేదో కలిగింది ...దిగులేదో పెరిగింది...
అసలేదో జరిగింది... మతికాస్తా పోయింది...
ఆ. అదేరా ప్రేమంటే చిన్నా
ఎదేదో చేసిన నీకొంపముంచే ప్రేమా ప్రేమా ప్రేమా...

చరణం: 2
చిటపట చినుకుల్లో పాడిపాడిగుంటోందా...
చినుకే నీకు గొడుగయ్యిందా..
నిద్దురలో ఉన్నా మెలకువలా ఉంది...
మెలకువలోనే సృహ లేకుంది...
చూపేమో చెదిరింది ... మాటేమో వణికింది..
.అడుగసలే పడనంది ... కుడిఎడమై పోయింది...
ఆ: అదేరా ప్రేమంటే బచ్చా...
అలాగే వేధించి నీ అంతచూసే ప్రేమా ప్రేమా ప్రేమా ...

మన వీరవెంకట సత్యన్నారాయణ పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్. యమ్. కీరవాణి

కాషాయ వస్త్రాల కమండల ధారీ
మోక్షానికి లేదయా అడ్డదారి
పెళ్ళిచేసుకుని ప్లాటు తీసుకుని
ఆనందంలో అంతు తెలుసుకుని
సంసారాన్నే ఈదాలోయ్... సుఖసారాన్నే చాటాలోయ్...
బందుమిత్ర పరివారముతో ... బయలుదేరి పోదాం రారో...
మేళతాళాల సందళ్ళో... పాలు పంచుకుందాం రారో

మన వీరవెంకటసత్యన్నారాయణ పెళ్ళి...
చి॥ సౌ॥ నాగవెంకట రత్తన్నకుమారి తోటి...
ప్రేమ పంచాంగం తిరగేసి వీలు ఉన్నమూర్తంచూసి...
అయినవాళ్ళం అంతావచ్చి ... అంగరంగ వైభోగంగా..
పెళ్ళి చేసి ఓహో అనిపిస్తాం...
కొంగు ముళ్ళు వేసి దీవెన్లందిస్తాం.. 

కామి కాని వాడు మోక్షగామిగానే కాడురా...
కళ్యాణమంటే లోక కళ్యాణమేనురా..
ఉట్టే కొట్టందే... ఓ.. సొర్గం అందేనా..
జంటే కట్టందే.. ఈ.. సృష్టే పుట్టేనా..
ఇంటి దీపం వెలిగించి రంగుల లోకం చూపించి
అర్థభాగం అందించి అనంత భాగ్యం కలిగించి
బ్రహ్మచారి కొంపను కాస్తా బొమ్మల కొలువుగ చేయించి
కాపురంలో కైలాసాన్నే చూపించే ఇల్లాలే కావాలోయ్..
సో..  
 
కోరస్: 
సౌందర్యం మదగజగమనం
సౌందర్యం వరఘనజఘనం
సౌందర్యం నరసిజ నయనం
సౌందర్యం మధుమయ అధరం
సౌందర్యం సురుచిర వదనం
సౌందర్యం సుమమయ నదనం

చందమామ వస్తేగాని నింగి కందం లేదురా
చైత్రమాసం వచ్చేదాకా తోటకర్థం లేదురా
వేసవిగాలుల్లో... హే.. మల్లెల తాపుల్లా
తొలకరి చినుకల్లో.. హాయ్.. మట్టి సుగంధంలా
ఒంటరైన గుండెల్లో జంట గువ్వై చేరాలి
బ్రహ్మచారి కన్నుల్లో భామనవ్వులు వెలగాలి
అమ్మలాగ లాలించేలా రాణి లాగ పాలించేలా
నేస్తమల్లే నడిపించేలా చెంతచేరే తోడే కావాలోయ్..
సో..   
లాహిరి లాహిరి లాహిరిలో పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్నికృష్ణన్, సునీత 

అఆఇఈఉఊఎఏఐ
ఒఓఔ
అం అః

అఆఇఈఉఊఎఏఐ ఒఓఔ అం అః
అను అక్షరాలే 
పడమర ఎరుగని సూర్యుడు నాన్న 
పున్నమి జాబిలి మా అమ్మ 
ముచ్చట తీర ముగ్గురు అన్నల ముద్దుల చెల్లిగా పెరిగిన మన కథ 

లాహిరి లాహిరి లాహిరిలో
మన అందరి గుండెల సందడిలో (2)

చరణం: 1
చందురుడ్నేదారం కట్టి 
దించుకుందాం ఎంచక్కా...
దీపమల్లే పెట్టడానికి...
తారలన్ని హరం కట్టి 
తెచ్చుకుందాం సరదాగా...
బొమ్మరింటి తోరణానికి...
పండుగ సందళ్ళే నిండిన మా ఇల్లే రంగుల హరివిల్లే
కోవెల గంటల్లే కోయిల పాటల్లే సరదాల అల్లరే
కళ్ళల్లో కాంతులే దీపావళి...
కల్లలూ ఎల్లలూ కనివిని ఎరుగని
లాహిరి ... లాహిరి... లాహిరిలో...
చిరునవ్వుల మువ్వల సవ్వడిలో..

చరణం: 2
ఏం వయస్సో ఏమోగానీ 
చెప్పకుండా వస్తుంది...
తేనెటీగ ముల్లు మాదిరి...
ఏం మనస్సోఏమోగానీ 
గుర్తు చేస్తూ ఉంటుంది...
నిప్పులాంటి ఈడు అల్లరి...
ఒంటరి వేళల్లో తుంటరి ఊహల్తో 
వేదిస్తూ ఉంటుంది...
తోచిన దారుల్లో దూసుకుపోతుంటే 
ఆపేదెలా మరి..
ఎవ్వరో ఎక్కడో ఉన్నారని
గువ్వలా గాలిలో ఎగిరిన మది కధ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
అని ఆగనంటూ సాగదా
మనసును చిలిపిగ పిలిచిన ప్రేమ
వయసుని తరిమిన ఆ ప్రేమ 
కోరిన జంటను చేరేదాకా ఒక క్షణమైనా నిలువని పరుగులు
లాహిరి...లాహిరి తొలివలపులు పలికిన సరిగమలో

నేస్తమా... ఓ ప్రియ నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సోను నిగం, సునీత

నేస్తమా... ఓ ప్రియ నేస్తమా
ప్రియతమా... నాలో ప్రాణమా
నీలో వున్న నన్నే చూడనంటూ పంతమా

తెరచాటు దాటి దరిచేరుమా
ఎడబాటు దూరం కరిగించుమా

నేస్తమా... ఓ ప్రియ నేస్తమా

నీ గుండెల్లో చూడమ్మా నేను లేనా ఏమూలో
నీ ఊపిరిలో వెతుకమ్మా చేరుకున్నా ఏనాడో

మనసిచ్చావు నాకే కదా
అది వదిలేసి పోతే ఎలా
ఎక్కడున్నా చెలీ నీ ఎద
నిన్ను నావైపు నడిపించదా

వెళ్ళేదారులన్నీ నన్ను చూపే వేళలో
కనుమూసుకుంటే కనిపించనా
ఎదలోని పాటై వినిపించనా

నేస్తమా... ఓ ప్రియ నేస్తమా

నా గుండెల్లో ఈ భారం దాటనంది ఈదూరం
నా ఊపిరిలో ఈమౌనం పాడనంది ప్రియగానం

అన్ని తెలిసున్న అనురాగమా
నన్ను వెంటాడటం న్యాయమా
రెప్ప వెనకాల తొలి స్వప్నమా
ఉప్పునీరై ఉబికి రాకుమా

కమ్మని ఙ్ఞాపకంలా ఊహాలో నిదురించుమా
మనసందుకున్న మమకారమా
మరపించు వరమై దీవించుమా

నేస్తమా... ఓప్రియ నేస్తమా
ఆగుమా... ఆశల వేగమా
మానని గాయమింక రేపుతావా స్నేహమా

ఈ జన్మకింతే మన్నించుమా
మరుజన్మ వుంటే నీదే సుమా

నేస్తమా ఇద్దరి మధ్య
కొన్ని అడుగుల దూరం వుంది
అది ఏడడుగులు అవ్వాలి
నీ పేరే పలకమంది
నీ ఊసులే వినమంది
నిన్నే చూడమంది

నేస్తమా ఓ ప్రియ నేస్తమా
మనసే (Bit-1) పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్. యమ్. కీరవాణి, గంగ 

మనసే ఒక పున్నమి జాబిలై
ప్రవహించెను ఊహల వెన్నెల లాహిరి 
మదిలోపలి ఆశను పైకి లేపి 
మొగమాటపు అంచున తూలిన లాహిరి 
మాటలు నేర్చిన చూపుల లాహిరి
లాహిరి
అమ్రము కోరిన మమతల లాహిరి
లాహిరి
మత్తులో కొత్త మెలుకవై లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
మంత్ర మేదో వేసింది పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, చిత్ర

మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తాపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఊపింది ప్రేమ లాహిరి
ఏవైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి
ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి

ఓహొ హొ.. అలవాటే లేని ఆరాటం ఏంటయ్యో
ఈవేగం ఎటుపోతుందో ఏమో ...
ఓ హ్హో హ్హో ... పొరబాటే కానీ ఏం చేస్తాం లేవమ్మో
ఈ మైకం మననేరం కాదేమో...
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సందళ్ళు
గుప్పుమంటే గుట్టంత ఏంగానూ...
చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు
తట్టుకుంటదా చెప్పు నీ మేను...
ఎలా మరీ ... ఏం చేయాలి..ఈ ఆవిరి...
ఊపిరిలో తొలిప్రేమ తుఫానుగ వీచే వింత లాహిరి

ఓ హ్హొ హ్హొ ..యమ బాధే అయినా బాగానే ఉందమ్మో
ఓహొ హొ ... చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర

ఓహొ హొ ... చిలకమ్మా
పలికే ఓ పంచదార చిలకమ్మా
కొంటెగుట్టు విప్పవమ్మా ఉన్నమాట చెప్పవమ్మా చిలకమ్మా
అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా
ఎవ్వరికీ కంటికి ఎదురుగ కనిపించని ఈప్రేమ
అందరికీ తెలుసని తనకే తెలుసో లేదోనమ్మా...

చరణం: 1
నూరేళ్ళ పయనాన విడిపోక క్షణమైన నీడ తానై వెంటవుంది
వెయ్యేళ్ళ వరమైన అనురాగ బంధాన తోడు తానై అల్లుకుంది
తానే నా కలలు కన్నది ... నాకే అవి కానుకన్నది
ఎపుడూ ఈ చెలిమి పెన్నిది తరగనిది తీరని ఋణమైనది

చరణం: 2
ఇప్పుడో ఎప్పుడో ఇక్కడో ఎక్కడో
నన్ను కలవక తప్పదన్నది ప్రేమా
ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది
నన్ను వెతుకుతు చేరువైనది ప్రేమా
వయస్సెంత చెప్పమంటూ అడగనన్నది
మనస్సింట చోటువుంటే చాలునన్నది
ఎలాగైనా చేరుకుంటా చూడమన్నది
ఎలా ఎప్పుడంటే మాత్రం
చెప్పనంటూ నవ్వుతుంది ప్రేమా..

చరణం: 3
రెప్పలు మూసినా నిన్నే చూపెడుతోంది
చెప్పక పోయినా నీ ప్రతిమాట వింది
ఒంటరి ఊహలో ఎంత దగ్గరయింది
చెంతకు చేరినా దూరంగానే ఉంది
నువ్వూ నేనంటూ కధ మొదలెడుతుంది
ఇద్దరు లేరంటూ నువ్వే నేనంది
ప్రతీజత ఇదే కధ
మొదలేగాని చివరంటూ లేనిదీ ప్రేమా

చరణం: 4
చెప్పుకుంటు ఉండగా విన్నాను గాని భామా
ఇప్పుడిప్పుడిప్పుడే చూసాను తొలిప్రేమా..
చూపులలో చేరగానే ఈ ప్రేమ
మొత్తంగా లోకమే మారిందమ్మా
చూసుకోదుకద ఎదరేమి ఉంటుందో
ఊసుపోని కధ ఎదకేమి చెపుతుందో
తొలి ఉధయం తానై పిలిచే ప్రేమా
 ఓహొ హొ చిలకమ్మా
పలికే ఓ పంచదార చిలకమ్మా
చక్కెరంటి మాటచెప్పి చిక్కులన్నీ తీర్చినావే చిలకమ్మా

కిలిమిరే కిలిమిరే పాట సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుఖ్విందర్ సింగ్, చిత్ర

నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే
గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే
ఒప్పుల కుప్పలో ఉప్పెన తగ్గేలా
పోకిరి గిత్తలో దూకుడు ఆగేలా
జడివానలా ఈడు చెలరేగితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే

చరణం: 1
అందాల అమ్మకూచి హొయ్ హొయ్ హొయ్
నకరాల నంగనాచి
ఆరు బయటే ఊరేగించే జారు పైటే ఆడే దోబూచీ
కోణంగి కొండముచ్చి హొయ్ హొయ్ హొయ్
కరువార తొంగిచూచి
కైపు రెచ్చి కంగారొచ్చి పాడు పేచీ పెంచకు శృతి మించీ
కాస్త వుంచి మరికాస్త దాచి కవ్వించి నవ్వుతుంటే
అంతా దోచి అంతే చూసే కొంటె ఊపు రేపితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే

చరణం: 2
తొలిసారి మితిమీరి హొయ్ హొయ్ హొయ్
తరువాత బ్రతిమాలి
జాలివేసే దాకా ఎన్ని కాళ్ళ బేరాలైనా చేస్తారు
మొదటేమో బెట్టు చేసి హొయ్ హొయ్ హొయ్
వదిలేస్తే సైగ చేసి
ముంది కాళ్ళకి బంధాలేసి అందకుండా ఆటాడిస్తారు
పట్టు పట్టి జత కట్టమంటూ బతిమాలు వేటగాళ్ళు
వెంట వెంట తిప్పించుకుంటూ ఆటాడు మాయలేళ్ళు
తాడో పేడో తేలే దాకా గిల్లికయ్య మాడితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే
మనసే (Bit -2) పాట సాహిత్యం

 

చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణ్ కోడూరి, గంగ 

మనసే ఒక పున్నమి జాబిలై
ప్రవహించెను ఊహల వెన్నెల లాహిరి 
మదిలోపలి ఆశను పైకి లేపి 
మొగమాటపు అంచున తూలిన లాహిరి 
మాటలు నేర్చిన చూపుల లాహిరి
లాహిరి
అమ్రము కోరిన మమతల లాహిరి
లాహిరి
మత్తులో కొత్త మెలుకవై లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
లాహిరి
శ్లోకం సాహిత్యం

 
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: గంగ 

ఓం సత్యరూప మిదం దేవం 
బ్రహ్మ విష్ణు శివాత్మకం 
సత్యనారాయణం వందే 
సాత్వికం తం సుఖంకరం 


Most Recent

Default