Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nuvvila (2011)
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: హావీష్ , అజయ్ , ప్రసాద్ బార్వే , విజయ్ దేవరకొండ , యామి గౌతమ్, సరయు, రేమ్య నాంబీసన్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
కథ, మాటలు, దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: రామోజీరావు
సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
బ్యానర్: ఉషాకిరన్ మూవీస్
విడుదల తేది: 03.11.2011Songs List:అరచేతిని వదలని పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: కృష్ణ చైతన్య 

అరచేతిని వదలని Are you an angel పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర 

Are you an angel ఏకాకినే అయిపోతున్నానే పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: దీపు 

ఏకాకినే అయిపోతున్నానే 
బేబీ ఆ పోపుల డబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: 
గానం: రేవంత్ , గీతామాధురి

పల్లవి:
బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా
బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని
అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా

వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ ఏదైనా
గుమగుమలాడాలంటే నీలా వండాలే
పోట్లకాయల పప్పెయ్యి చామదుంప కలిపెయ్యి
పప్పుచారు పెట్టావంటే నోరే ఊరి చావాలిలే


బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా
బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని
అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా

చరణం: 1
ముందే కోసి పెట్టుకుందాం ముక్కులు బాగా వేగించేద్దాం
టొమోటోస్ అనియన్స్ అందులో వేసేద్దాం
ఉప్పు కారం బాగా వేద్దాం
అహ బీపీ వస్తది తగ్గించేద్దాం
వంటికి చాలా మంచిది కదా పసుపు చల్లదనం
అరె చింతపండు కొంచం కలుపుకొని 
పావుగంట సేపు మగ్గించేద్దాం
చాలా టైమే ఉంది మరి ఇప్పుడేం చేద్దాం
రావే పక్కకిపోయి గట్టి గట్టిగా వాటేసుకుందాం

బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా

చరణం: 2
బుంగుళూరు వంకాయ్ లో బెండకాయలేద్దాం
కరకర వేపుడు చేద్దాం ఏమంటావ్ ?
హా జీడిపప్పు సెనగ పప్పు అదో కప్పు ఇదో కప్పు వేస్తే స్మెల్ గుప్పుమని ఊరే దాటాలే
ఐదు చంచాలు ఆయిల్ వేద్దాం
రెండే చాలు లావైపోతాం
హెల్త్ కి చాలా మంచిది కాదా అల్లం వెల్లుల్లి
కొత్తిమీర తురిమి పెట్టుకొని
ఫ్రై అవనిద్దాం కొంచం ఫ్రై అవనిద్దాం
ఇంకేం చేద్దాం
 ఇంకేం చేద్దాం
కర్రీ అయ్యేలోగ హర్రీ బర్రీ గా బదులిచ్చుకుందాం

బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా
బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని
అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతాఎన్నో కలలే పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర 

ఎన్నో కలలే I love you soo much పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర 

I love you soo much 
Sugar and Spice పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: దీపు 

Sugar and Spice Why do people fall in love పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర , హర్షిక 

Why do people fall in love కొట్టుకు చద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: దీపు, గీతామాధురి 

కొట్టుకు చద్దాం 

Palli Balakrishna Tuesday, February 27, 2018
SMS (Shiva Manasulo Shruti) (2012)చిత్రం: SMS (2012)
సంగీతం: వి.సెల్వ గణేష్ , యువన్ శంకర్ రాజా (BGM)
సాహిత్యం: చైతన్య కృష్ణ , వనమాలి, అభిమన్యు శ్రీనివాస్
గానం: విజయ్ ప్రకాష్
నటీనటులు: సుధీర్ బాబు , రెజీనా కసండ్ర
కథ: యమ్.రాజేష్
మాటలు (డైలాగ్స్): నంద్యాల రవి
దర్శకత్వం: తాతినేని సత్య
నిర్మాత: విక్రమ్ రాజు
సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు
ఎడిటర్: సతీష్ సూరియా
బ్యానర్: వేగా ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేది: 10.02.2012

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచం సుఖం కొంచం దుఃఖం
పంచేందుకే ప్రేమున్నదా

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో

చరణం: 1
పొగరుకు రూపం నువ్వేనే పొరబడి స్నేహం చేశానే
మారువను మాత్రం మరిచానే
నిప్పని తెలిసినిలువెల్లా చొరవగ నిన్నే తాకానే
మంటలో హాయిగా రగిలానే
ఈ మనిషిని చంపే విషమైనా
కొంతసేపయ్యాకే ప్రాణం తీస్తుందే
ఈ ప్రేమ మాత్రం చిటికెలో చంపుతుందే
ఇంతకన్నా వింత ఎక్కడైనా ఉందా

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో

చరణం: 2
నీ కలగంటూ లేస్తానే నీ మాటోకటే వింటానే
నీతో నీడై వస్తానే
నువ్విక దూరం అయ్యాక మిగిలిన బ్రతుకేం చెయ్యాలే
ఒంటరి వాడినై పోయానే
నీ పెదవులు తెలిపే చిరుమాటే
నా బతుకును నడిపే ఓ బాటే
నీ మౌనం వదిలే ఈ పూటే
ప్రేమంటేనే బాధ తీరే దారే లేదా

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచం సుఖం కొంచం దుఃఖం
పంచేందుకే ప్రేమున్నదా

ఓ..చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో


Palli Balakrishna
Sankalpam (1995)
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
నటీనటులు: జగపతి బాబు, గౌతమి, జయసుధ
కథ, మాటలు (డైలాగ్స్): పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. యమ్. రత్నం
నిర్మాత: ఎ. యమ్. రత్నం
సినిమాటోగ్రఫీ: నవకాంత్
ఎడిటర్: కోలా భాస్కర్
బ్యానర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 22.06.1995Songs List:అచ్చట్లో ముచ్చట్లో పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: చిత్ర, యస్.పి.బాలు & కోరస్

అచ్చట్లో ముచ్చట్లోచిన్నారి మనసుకు పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర, యస్.పి.బాలు

చిన్నారి మనసుకుధీం తనక్కు పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్.పి.బాలు, చిత్ర

ధీం తనక్కు
కురిసింది వానా పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వడ్డేపల్లి కృష్ణ
గానం: యస్.పి.పల్లవి, యస్.పి.బాలు

కురిసింది వానామెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: చిత్ర, యస్.పి.బాలు

పల్లవి:
మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో
లేత చెక్కిళ్ళ నొక్కుళ్ళు కొనగోటి రక్కుళ్ళు
గుమ్మెత్తి పోవాలంటా
చీర కుచ్చిళ్ళ గిచ్చుళ్ళు పరువాల పొత్తిళ్ళు
పిచ్చెక్కి పోవాలంటా
తప్పెట్లు మోగాల తాపాలు తీరాలా ఈ వేళ

మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో

చరణం: 1
సిగ్గు మొగ్గ అల్లాడి పోయిందిరో కౌగిలిమ్మనీ
సాకు చెప్పి తెల్లారి పోనివ్వకు కన్నె రేయినీ
కొంగుదాటు కవ్వింపులో ఉన్నది కొత్త అందమూ
కోక చాటు కేరింతలో పట్టదా పూల గంధమూ
ఏదో ఏదో ఉయ్యాల ఉయ్యాల ఊగాల ఉయ్యాల
ఏదో ఏదో సయ్యాట సాగాల సందేళ
శోధించుకో వేధించుకో అందిట్లో ఇందిట్లో
ఏముందో చూడాల

మత్తుగా హత్తుకో మెత్తగా వత్తుకో

చరణం: 2
కస్సు మంటు రెచ్చింది నా యవ్వనం కోడె నాగులా
వెన్నుపూస కరగాలి కౌగిళ్ళలో వెన్నపూసలా
తేనెలూరు శృంగార తీరాలలో తాళమేసుకో
భగ్గుమన్న అగ్గెల్లి నా వంటిని అంటిపెట్టుకో
తూలే తుళ్ళే వాగల్లే నీ వళ్ళే పొంగాల
మళ్ళీ మళ్ళీ నా వళ్ళే వంకల్లే వంగాలా
ఊరించుకో సాధించుకో
నీ గుట్టు నా బెట్టు నిలబెట్టుకోవాల ఈ వేళ

మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో
లేత చెక్కిళ్ళ నొక్కుళ్ళు కొనగోటి రక్కుళ్ళు
గుమ్మెత్తి పోవాలంటా
చీర కుచ్చిళ్ళ గిచ్చుళ్ళు పరువాల పొత్తిళ్ళు
పిచ్చెక్కి పోవాలంటా
తప్పెట్లు మోగాల తాపాలు తీరాలా ఈ వేళ

Palli Balakrishna
Sadhyam (2010)చిత్రం: సాధ్యం (2010)
సంగీతం: చిన్ని చరణ్
సాహిత్యం:
గానం: నరసన్ కసల , గీతామాధురి
నటీనటులు: జగపతి బాబు, ప్రియమణి
కథ: శ్యామ్ మనోహర్
మాటలు (డైలాగ్స్): మదురూరి మధు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ
నిర్మాతలు: కుమార్ బ్రదర్స్ ( డి.రత్నకుమార్, డి.కర్ణాకర్, డి.సురేష్ బాబు)
సినిమాటోగ్రఫీ: మారో ఫళణి కుమార్
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: కుమార్ బ్రదర్స్ సినిమా
విడుదల తేది: 05.03.2010


అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నేనే
అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నేనే
పైటే జారితె కదలదు గాడి
హీటెక్కిందిరో టోటల్ బాడీ
కిందపడి మీద పడి ఎందుకలా హడావిడి

కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి
కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి

అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నేనే
అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నేనే

ఓ రంగమ్మో హొయ్ హోయ్ రంగమ్మో
నీ యవ్వారం యమా జోరుగుందమ్మో
ఓ చిట్టెమ్మో హొయ్ హోయ్ చిట్టెమ్మో
నీ ఊరేదో పేరేదో చెప్పమ్మో

నా పేరు మాయలేడి నా పాట మెలోడీ
పుట్టిపెరిగినూరు పర్లాకిమిడి
నేనేమొ ఆకు రౌడీ ఐనా బీ రెడీ
మీ వాళ్ళతో మాటాడి అవుతా జోడి

ఏడున్నారో మమ్మీ డాడీ తెలియదు బోడి
కాలం వృధా చెయ్యకురో బేరాలాడి
చింతలపూడి చిలకల్ పూడి అన్నీ తోడి
నీ లాంటి దానికోసమే చూస్తున్నా నిలబడి

కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి
కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి

నే ఖతర్నాక్ లేడీ ఆడొద్దు కబాడ్డీ
మొనగాళ్లే ఓడినారు నాతో ఆడి
ఒంట్లోన ఉంది వాడి వదలొద్దు కిలాడి
వందేళ్ల దాక వేస్తా నీకే బేడీ
చిందెయ్యారా మందెయ్యారా నాతో కూడి
ఇంకా ముందుకు వెళ్లొద్దురా ఆపే గాడి
అగ్గే రేపి బుగ్గెయ్యకే కులుకుల కేడి
అందాలన్నీ ముందే ఉంచి పెంచొద్దే అలజడి

కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి
కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి

అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నీవే
అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నీవే

Palli Balakrishna
Samanyudu (2006)చిత్రం: సామాన్యుడు (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: రాజు
గానం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: జగపతి బాబు, కామ్నా జఠ్మలాని, సాయి కుమార్
కథ, మాటలు (డైలాగ్స్), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చావలి
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్
ఎడిటర్: కె.వి.కృష్ణారెడ్డి
బ్యానర్: ఆర్.ఆర్.మూవీ మేకర్స్
విడుదల తేది: 19.10.2006

పల్లవి:
ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

పొద్దుగల్ల లేవనంటది
దస్ గ్యారా దాక పంటనంటది
కూర బువ్వ వండనంటడి
పక్కింటి రంగు టీవి కాడ ఉంటది
తిడతానంటే పడదంట కొడతానంటే పోతానంటది
నేను ఎట్టాగ వేగేదిరో

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

చరణం: 1
అత్తరేసి మస్తుగుంటడి
ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది
బొడ్డుకింద చీర కడ్తది
పోరి గోల్కొండ పొదమంటడి

అత్తరేసి మస్తుగుంటడి
ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది
బొడ్డుకింద చీర కడ్తది
పోరి గోల్కొండ పొదమంటడి
సరసమంటే రాను అంటది
షికారు కొస్తదంట ఊరించి చంపుతుందిరో నాయనా

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

చరణం: 2
ముద్దులాడ రాను అంటది
ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
దొంగ చూపు చూస్తవుంటది
నన్ను చేరమంటే సిగ్గు అంటది

ముద్దులాడ రాను అంటది
ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
దొంగ చూపు చూస్తవుంటది
నన్ను చేరమంటే సిగ్గు అంటది
ముట్టకుండ పట్టకుండ
ముసుగు పెట్టి పడుకుంటే
నీకు అల్లుడ్ని ఎట్టా ఇస్తారో బామ్మర్థి

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

Palli Balakrishna
Sridevi Kapoor (Actress)
ప్రముఖ నటి శ్రీదేవి 24.02.2018 రాత్రి కన్నుమూశారు. దుబాయ్ లో బంధువుల వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి గుండెపోటు తో తుదిశ్వాస విడిచారు .

1963 ఆగస్టు 13 న తమిళనాడులోని శివకాశి లో ఆమె జన్మించారు. ఆమె తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. 1967 లో శ్రీదేవి 4 సంవత్సరాల వయసులోనే బాలనటిగా తమిళ్ సినిమాలో నటించింది. అలాగే 1970 లో మా నాన్న నిర్దోషి సినిమాతో తెలుగులో బాలనటిగా నటించింది. 1975 లో నటిగా తెరంగేట్రం చేశారు. తెలుగులో "బంగారక్క (1977)" హీరోయిన్ గా తెలుగులో తొలి చిత్రం. రెండవది పదహారేళ్ళ వయసు (1978). తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో 259 సినిమాలలో నటించిన శ్రీదేవి తన అందంతో అభినయంతో అభిమానుల హృదయాలలో నిలిచిపోయింది. భర్త బోనికపూర్ , కూతురు ఖుషి కపూర్ కలిసి ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు శ్రీదేవి దుబాయ్ వెళ్లి శనివారం అర్ధరాత్రి 11:30 సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు.


శ్రీదేవి నటించిన సినిమాలు
తమిళ్ లో 72 సినిమాలు మలయాళం లో 26 సినిమాలు తెలుగులో 83 సినిమాలు కన్నడలో 6 సినిమాలు హిందీలో 72 సినిమాలు శ్రీదేవిగారు యన్. టి.రామారావు గారితో 1972 లో బడిపంతులు సినిమాలో బాలనటిగా నటించి, 1979 లో వేటగాడు సినిమాతో హీరోయిన్ గా యన్. టి.రామారావు సరసన నటించింది. హీరోయిన్ గా యన్. టి.రామారావు తో 13 సినిమాలలో నటించింది. శ్రీదేవిగారు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలలో 33 సినిమాలలో నటించారు, 1979 లో "బుర్రిపాలెం బుల్లోడు" చిత్రం తో తొలిసారిగా కృష్ణ గారితో హీరోయిన్ గా జత కట్టారు.
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)

చిరంజీవితో 8 సినిమాలు లో నటించారు. బాలక్రిష్ణ తో 4 సినిమాలు లో నటించింది (అయితే ఈ సినిమాలు యన్. టి.రామారావు బాలక్రిష్ణ కలిసి నటించిన సినిమాలు) ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని వేడుకుందాం.
శ్రీదేవి మరణం గురించి తోటి నటులు, నిర్మాతలు వారి మాటల్లో:
'అతిలోక సుందరి' నుంచి నేనెంతో నేర్చుకున్నా: చిరంజీవి
నా పుట్టినరోజున చివరిసారి కలిశా, మా అతిలోక సుందరి ఇక లేదు. ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. అందం, అద్భుతమైన అభినయం కలగలసిన నటి శ్రీదేవి. అలాంటి నటిని నేనుప్పుడూ చూడలేదు.తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో.. దేవకన్య పాత్రలో శ్రీదేవి అలవోకగా నటించడం చూసి ఆశ్చర్యపోయాను. తను మా కుటుంబానికి చాలా సన్నిహితురాలు. చివరిసారిగా నా 60వ పుట్టినరోజున తనను కలిశాను. ఆమె లేదంటే నమ్మలేకపోతున్నాను. ఆమె కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకొంది. మా హృదయాల్లో ఇంకా జీవించి ఉంది. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకూ తను జీవించే ఉంటుంది. ఇది దేశానికి, సినిమా పరిశ్రమకు ఇది తీరని లోటు.
'ఇది నాకు షాక్..! : వెంకటేష్
ఇది నాకు షాక్..! ఇది ఓ దురదృష్టమైన రోజు. గొప్ప నటిని కోల్పోయాం. క్షణ క్షణం సినిమాలో ఆమె పలికించిన హావభావాలు మన మనసుల్లో చెదిరిపోని ముద్ర వేశాయి. చాలా చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, చాలా వినమ్రతగా ఉండేది. సినిమాల్లోకి రావాలనుకునే వారికి శ్రీదేవి ఓ ఉదాహరణ. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
ఇల్లాలు సినిమాలో మా పాత్రలు మార్చుకున్నాం : జయసుధ
నేను ఒక స్నేహితురాలిని కోల్పోయా. దేశం ఒక గొప్ప నటిని కోల్పోయింది. నటన విషయంలో ఎవ్వరూ శ్రీదేవికి సాటి రారు. శ్రీదేవి లేదంటే.. నమ్మలేకపోతున్నాను. తను ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. శ్రీదేవిని మొదటిసారి కలిసినపుడు నాకు పదేళ్లు, తనకు ఐదేళ్లు. అప్పుడు విజయనిర్మల గారితో కలిసి శ్రీదేవి నటిస్తుండేది. తర్వాతి కాలంలో క్రిష్ణ గారితో కూడా నటించింది. ప్రేమాభిషేకం, ఇల్లాలు సినిమాల్లో ఇద్దరం కలిసి నటించాం. నాకు ఓ విషయం గుర్తుకు వస్తోంది.. ‘ఇల్లాలు’ సినిమాలో నాది కాస్త సీరియస్‌గా ఉండే పాత్ర. శ్రీదేవిది గ్లామరస్ రోల్. కానీ శ్రీదేవికి అది ఇష్టం లేదు. నా పాత్రను చేస్తానని అడిగింది. ‘ఎప్పుడూ గ్లామరస్ పాత్రలు చేస్తున్నా. ఇప్పుడు నీ పాత్రలో నటిస్తాను’ అని అడిగింది. అప్పుడు మా పాత్రలను మార్చుకున్నాం. నటన అంటే ఆమెకు అంత ఇష్టం. శ్రీదేవి డైరెక్టర్స్ యాక్టర్. తెలుగు, హిందీ సినిమాల నటనలో చాలా వైరుధ్యం కనిపిస్తుంది. తనను తాను అంత బాగా మలుచుకోగలదు. సూపర్ స్టార్ అనే గర్వం ఆమెకు ఉండదు. చాలా వినయంగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. తన క్యాస్టూమ్స్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటుంది. శ్రీదేవి ఒక పర్ఫెక్షనిస్ట్! ఈమధ్య శ్రీదేవితో మాట్లాడినపుడు.. నాకు జుట్టుకు రంగు వేసుకుంటే అలర్జీ వస్తోందని, రంగు వేయడం మానేస్తానని అంటే.. ‘మనం సెలబ్రిటీలం. చూడతగ్గట్టుగా ఉండాలి. జుట్టు తెల్లగా ఉన్నా ఫర్వాలేదు. నువ్వు నీలాగే ఉండు. కానీ ప్రజాజీవితంలో ఉన్నామని మాత్రం గుర్తుపెట్టుకో!’ అంది. చివరిసారిగా పెద్దమ్మాయి జాహ్నవి గురించి మాట్లాడుకున్నాం. జాహ్నవి సినిమా విడుదలవబోతోంది. ''సూపర్ స్టార్ కూతురు సినిమా అంటే జాహ్నవి పట్ల అంచనాలు భారీగానే ఉంటాయి. కానీ.. నేను సూపర్ స్టార్‌గా కాదు.. జాహ్నవి తల్లిగానే ఆలోచిస్తున్నా'' అంది. శ్రీదేవి లేదన్న వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా.
మా ఇంట్లో ఆడుకునేది : క్రిష్ణ
శ్రీదేవి చిన్నతనంలో మా పక్కింట్లోనే ఉండేవాళ్లు. తను మా ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండేది. శ్రీదేవితో కలిసి 34 సినిమాలు చేశాను. కానీ.. చిన్న వయసులోనే ఇలా జరగడం బాధగా ఉంది.
నేను కుంగి పోయాను: కోట శ్రీనివాస రావు
నేను మాట్లాడలేకపోతున్నాను. శ్రీదేవి మరణ వార్తతో కుంగిపోయి ఉన్నా. ఇంత చిన్న వయసులో తనకెందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. ఆమెకు శాంతి చేకూర్చాలని, ఆ నటరాజ స్వామిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నా.
‘మహానటి’ సినిమా శ్రీదేవికి అంకితం ఇస్తున్నాం : అశ్వినీదత్
ఇది నా జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజు. ఈ రోజును ఎప్పటికీ మరువలేను. మాకు, వైజయంతీ మూవీస్ కుటుంబానికి ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది. నా భార్యకు, నా పిల్లలకు శ్రీదేవి మంచి ఫ్రెండ్. మా బ్యానర్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గోవిందా గోవిందా, ఆఖరి పోరాటంతో పాటు..మొత్తం 6 సినిమాలలో శ్రీదేవి పని చేసింది. మా బ్యానర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. సినిమాల్లోకి రాక ముందు సావిత్రి గురించి వినేవాడిని. కానీ సినిమాల్లోకి వచ్చాక మళ్లీ ఓ మహానటిని శ్రీదేవి రూపంలో చూశా. శ్రీదేవి లేని వైజయంతీ మూవీస్‌ను ఊహించుకోలేక పోతున్నా. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తీస్తున్న 'మహానటి' సినిమాను శ్రీదేవికి అంకితమిస్తున్నాను.
బోనీ కపూర్‌ పట్ల శ్రీదేవి ఎలా ఆకర్షితురాలయ్యారు?
(ఈ మేటర్ BBC.COM వెబ్సైట్ నుండి కాపీ చేయబడినది) తన 51 ఏళ్ల సుదీర్ఘ సినీ కేరీర్‌లో శ్రీదేవి ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక దశలో తీవ్రమైన చిక్కు సమస్యలు ఎదుర్కొన్నారు. శ్రీదేవి తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్న సమయంలోనే, తెర వెనుక ఆమె వ్యక్తిగత జీవితంలో ఓ ప్రేమ కథ పురుడు పోసుకుంది. 90వ దశకంలో ఆమె బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే బోనీ వివాహితుడు. వీరివురి ప్రేమకు 1980వ దశకంలోనే పునాది పడింది. ఆ సమయంలో బోనీ కపూర్ నిర్మాతగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 'మిస్టర్ ఇండియా' కథ ఇదీ! సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సమీక్షకుడు జయప్రకాశ్ చౌక్సే బీబీసీ ప్రతినిధి సుప్రియా సోగ్లేతో మాట్లాడుతూ, "మిస్టర్ ఇండియా సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత రచయిత జావేద్ అఖ్తర్, బోనీ కపూర్ ఇద్దరూ శ్రీదేవికి ఈ సినిమా ఆఫర్ ఇవ్వడం కోసం చెన్నైకి వెళ్లారు" అని చెప్పారు. "శ్రీదేవి తల్లి ఫోన్ చేసి వారిద్దరూ కొద్దిరోజులు వేచి ఉండాలని కోరారు. ఆ సమయంలో శ్రీదేవి చాలా బిజీగా ఉండేవారు. దాదాపు 3-4 రోజుల వరకు ఆమె నుంచి ఫోన్ ఏదీ రాలేదు." "పని ముందుకు సాగేలా కనిపించకపోవడంతో జావేద్ విచారంలో పడిపోయారు. బోనీ కపూర్ కూడా విచారంలో పడ్డారు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు." "బోనీ కపూర్ రోజూ శ్రీదేవి బంగ్లా చుట్టూ చక్కర్లు కొట్టసాగారు. 10 రోజుల తర్వాత శ్రీదేవి ఆయనకు కలిసేందుకు సమయం ఇచ్చారు. బోనీ చెప్పిన కథ ఆమెకు నచ్చింది. సినిమాలో పని చేసేందుకు ఆమె సిద్ధపడ్డారు."
తెరపై తొలిచూపులోనే ప్రేమ: బోనీ కపూర్ 
దాదాపు ఐదేళ్ల క్రితం 'ఇండియా టుడే' నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బోనీ కపూర్ తన ప్రేమ కథ గురించి ఇలా చెప్పారు - "నేను శ్రీదేవిని మొట్టమొదటిసారి తెరపై చూసినపుడే ఆమెపై ప్రేమ మొదలైంది." "70వ దశకంలో నేను ఆమెను ఓ తమిళ సినిమాలో చూశాను. వెంటనే ఆమెతో నా ఫిల్మ్‌లో సైన్ చేయించుకోవడం కోసం చెన్నైకు వెళ్లాను." "అయితే ఆమె ఆ సమయంలో చెన్నైలో లేరు. ఆ తర్వాత ఆమెను 'సోల్‌వా సావన్‌'లో చూశాను. నా మనసులోంచి ఆమె రూపు అప్పటికీ చెదిరిపోలేదు. చివరకు ఎలాగోలా ఆమెతో 'మిస్టర్ ఇండియా' సినిమా కోసం సైన్ చేయించగలిగాను." "అప్పుడు శ్రీదేవి తల్లిగారే ఆమె తరఫున నిర్ణయాలు తీసుకునే వారు. నేను శ్రీదేవితో సైన్ చేయించడం కోసం ముందుగా వాళ్ల అమ్మగారిని కలిశాను. ఆ రోజుల్లో శ్రీదేవి చాలా ఖరీదైన నటి." "వాళ్లమ్మ గారు బహుశా నన్ను బెదరగొట్టడానికి 10 లక్షల ఫీజు ఇవ్వాలని అన్నారు. నేను 11 లక్షలిస్తానని అన్నాను." "వాళ్లమ్మ గారితో నాకు దోస్తీ కుదిరింది. సెట్‌పై శ్రీదేవి కోసం నేను అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేవాడిని. మంచి మేకప్ రూమ్, మంచి బట్టలు వగైరా. నిజానికి నేను అప్పటికే ఆమెతో ప్రేమలో పడ్డాను." "ఆ రోజుల్లో ఆమె 'చాంద్‌నీ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నేను ఏదో ఒక సాకుతో ఆమెను కలిసేందుకు స్విట్జర్లాండ్‌కు వెళుతుండేవాడిని. ఆ క్రమం అలా కొనసాగింది." "నేను ఆమె ప్రతి అడుగులో తోడుగా ఉంటానని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించాను. క్రమంగా శ్రీదేవికి కూడా విషయం అర్థమైంది. నేను ఆమెను ప్రేమిస్తున్నానని."
శ్రీదేవి తల్లి అనారోగ్యం
శ్రీదేవి తల్లి జబ్బు పడ్డ సమయంలో, ఆ తర్వాత ఆమె మృతి చెందినప్పుడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని చెబుతారు. "శ్రీదేవి తల్లిగారు అనారోగ్యం పాలయ్యారు. ఆమెకి బ్రెయిన్ సర్జరీ చేయించాల్సి ఉండింది. బోనీ కపూర్‌కు ఈ విషయం తెలియడంతో ఆయన చెన్నైకి వెళ్లారు" అని జయప్రకాశ్ చౌక్సే చెప్పారు. "డాక్టర్ సలహాపై సర్జరీ కోసం ఆమెను అమెరికా తీసుకెళ్లారు. ఆ ట్రిప్‌లో బోనీ కపూర్ వెంటే ఉన్నారు. అయితే డాక్టర్లు శ్రీదేవి తల్లికి తప్పుడు సర్జరీ చేశారు." "ఆసుపత్రి యాజమాన్యంపై శ్రీదేవి కేసు పెట్టారు. వారితో ఆఖరుకు సెటిల్‌మెంట్ జరగడంతో నష్టపరిహారం కింద రూ. 16 కోట్లు ఇచ్చారు." "ఈ కష్ట సమయంలో బోనీ కపూర్ తన వెంట ఉంటూ తన తల్లికి సేవలు అందించడం.. ఇవన్నీ శ్రీదేవి గమనించారు." "శ్రీదేవి తండ్రి ముందే మరణించారు. తల్లి మరణం తర్వాత ఆమెకు సానుభూతి తెలపడానికి బోనీ కపూర్ ఒక్కరే ఆమెకు తోడుగా ఉన్నారు. అలా సానుభూతితో మొదలైన వారి బంధం ప్రేమ బంధంగా మారిపోయింది."
దక్షిణాది నుంచి ఉత్తరం వైపు...
బోనీతో శ్రీదేవి 'మిస్టర్ ఇండియా', 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా', 'మామ్' వంటి సినిమాలు చేశారు. అయితే వీరిద్దరి బంధం అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఎందుకంటే అప్పటికే బోనీకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లల తండ్రి. చివరకు 1990వ దశకంలో శ్రీదేవి, బోనీల వివాహం జరిగింది. ఇద్దరి కుటుంబ నేపథ్యాలు పూర్తిగా భిన్నమైనవి. శ్రీదేవిది దక్షిణాదికి చెందిన కుటుంబం కాగా, బోనీ కపూర్‌ది పంజాబీ కుటుంబం. "పెళ్లి తర్వాత శ్రీదేవి పంజాబీ ఆచారవ్యవహారాలను బాగా నేర్చుకున్నారు. ఆమె తనను తాను పంజాబీ కుటుంబానికి అనుగుణంగా మల్చుకునే ప్రయత్నం చేశారు" అని జయప్రకాశ్ చౌక్సే తెలిపారు. "బోనీ కపూర్ కుటుంబం అంటే ఆయన సోదరులు, వాళ్ల పిల్లలతో కూడిన విశాల కుటుంబానికి శ్రీదేవి అంకితమైపోయారు." "తన మామగారైన సురిందర్ కపూర్ 75వ జయంతి సందర్భంగా చెన్నైలో ఆమె ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. చెన్నైలోని తన బంగ్లాలో పూజలు నిర్వహించారు. పార్టీ ఇచ్చారు." "ఆ పార్టీకి కమల్ హాసన్, రజినీకాంత్‌లు అతిథులుగా వచ్చారు. వారికి శ్రీదేవి స్వయంగా స్నాక్స్ సర్వ్ చేశారు. వారికి శ్రీదేవి అంటే ఎంతో అభిమానం." "శ్రీదేవి తన ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ బోనీ కపూర్‌ మాత్రం తన ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధగా ఉంటుంటారు. ఈ విషయంపై ఆమె తరచుగా ఆయనతో వాదులాడేవారు."
శ్రీదేవి ఫ్యామిలీతో బంధుత్వం.. అంబానీ జెట్ పంపింది అందుకే! బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే హోటల్ గదిలో ప్రాణాలు వదిలారు. శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు తలెత్తినప్పటికీ.. చివరకు ఆమె బాత్‌టబ్‌లో పడిపోయి, స్పృహ కోల్పోవడం వల్లే చనిపోయారని దుబాయ్ అధికారులు తేల్చారు. శనివారం రాత్రి ఆమె మరణించగా.. మంగళవారం రాత్రి ఆమె భౌతిక కాయాన్ని ప్రయివేట్ జెట్‌లో ముంబై తీసుకొచ్చారు. 13 మంది కూర్చోగల సామర్థ్యం ఉన్న ఈ జెట్‌ను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సమకూర్చారు. శ్రీదేవి భౌతికకాయం తరలింపు కోసం అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ముఖ్య కారణం ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటమే. బోనీ కపూర్ మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లి వేడుకల్లో పాల్గొనడం కోసం శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమారుడైన మోహిత్.. అంతరా మోతివాలాను పెళ్లాడారు. అంతర.. అనిల్ అంబానీ భార్య టీనాకు స్వయానా అక్క కూతురు. వీరి పెళ్లితో అంబానీలకు బోనీ కపూర్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధం ఏర్పడింది. శ్రీదేవి పార్థీవ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై తీసుకు రావడానికి అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ఇది కూడా ఓ కారణమే.

Palli Balakrishna Sunday, February 25, 2018
Devudu Lanti Manishi (1975)
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సినారె, కొసరాజు
గానం: సుశీల, బాలు, వసంత, మాధవపెద్ది సత్యం, రమేష్, రఘురాం
నటీనటులు: కృష్ణ , మంజుల, చంద్రమోహన్, షావుకారు జానకి , రాజాబాబు, కుమారి శ్రీదేవి 
దర్శకత్వం: సి. యస్.రావు
నిర్మాత: డి.యన్. రాజు
బ్యానర్: పూర్ణిమా పిక్చర్స్
విడుదల తేది: 22.11.1975సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)Songs List:నవ్వు నవ్వించు పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

నవ్వు నవ్వించు రా రా నా స్వామి రంగ పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

రా రా నా స్వామి రంగకండలు కరిగిస్తే పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

కండలు కరిగిస్తే 
జగములెల్ల పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి.బాలు , రండి రమేష్ , మాదవపెద్ది సత్యం , పి.సుశీల

జగములెల్ల చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

పల్లవి:
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
చూచుకున్న అందమేమి చేసుకుంటావూ.. కాటుకలా రంగరించి పూసుకుంటానూ
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ

సింగారి సింగారి పిల్లా.. బంగారు బంగారు మామా
సింగారి సింగారి పిల్లా.. బంగారు బంగారు మామా

చరణం: 1
ఏటికి ఎదురీదే గండుమీనులా.. ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ
ఏటికి ఎదురీదే గండుమీనులా.. ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ

తగినోడు కాదగినోడూ.. తగినోడు కాదగినోడూ
నే జిక్కేది ఎప్పుడని చూస్తున్నానూ
చేజిక్కితే వాణేమి చేసుకుంటావూ?
నా కొప్పులో గుప్పున ముడిచేసుకుంటానూ

చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ

చరణం: 2
పట్టు దొరకని పరువంలాగా.. పడవెళ్ళిపొతుందే పడుచుదానా
వీలు చూసీ వాలు చూసీ.. వీలు చూసీ వాలు చూసీ.. ఎత్తరా తెరచాప బుల్లిరాయడా
ఓ నా బుజ్జి నాయనా.. నేను బుజ్జోణ్ణయితే ఎమిచేసుకుంటావూ
పాల బువ్వెట్టి ఎదలో దాచేసుకుంటానూ

చరణం: 3
పంట చేనిపై పైర గాలిలా.. ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ
పంట చేనిపై పైర గాలిలా.. ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ

మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా.. మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా
మూడు ముళ్ళు ఎప్పుడని అడుగుతున్నానూ
ఆ మూడు ముళ్ళు వేసి ఏమి చేసుకుంటావూ
నిన్ను ప్రతి జన్మకు నా దానిగ చేసుకుంటానూ

చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
సింగారి సింగారి పిల్ల.. బంగారు బంగారు మామా
సింగారి సింగారి పిల్ల.. బంగారు బంగారు మామా..
ద్రాక్ష పండు పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: రండి రమేష్, బి.వసంత 

ద్రాక్ష పండు తియ్యన 
పల్లె సీమ పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి.బాలు , మాదవపెద్ది సత్యం

పల్లె సీమ 

Palli Balakrishna
Krishnavataram (1982)
చిత్రం: కృష్ణావతారం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, విజయశాంతి 
దర్శకత్వం: బాపు 
నిర్మాత: ముళ్ళపూడి వెంకటరమణ 
విడుదల తేది: 22.09.1982Songs List:ఇంట్లో ఈగల మోత పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణావతారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఇంట్లో ఈగల మోతకొండగోగు చెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణావతారం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కొండగోగు చెట్టుసిన్నారి నవ్వు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణావతారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
గానం: యస్.పి.బాలు, శైలజ 

పల్లవి:
సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు
సెరువంత చీకటిని సుక్కంత వెలుగు
సుక్కంత ఎలుగేమొ సూరీడు గావాల
సిన్నారి సిరునవ్వు బతుకంత పండాల...

చరణం: 1
పువ్వులో పువ్వుంది బంగారు తల్లి
పువ్వులెంటే ముళ్ళు పొంచి ఉన్నాయి
మనసున్న మడిసొకడు ఈడనున్నాడు
ఈడు రాకుండాను తోడుండగలడు

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు

చరణం: 2
ఓ కంట కన్నీరు ఉరికేను చూడు
ఓ కంట పన్నీరు కురిసేను నేడు
కన్నతల్లి మనసు మురిపాలవెల్లి
కళ్ళలో మెరిసేను అనురాగవల్లి...
ఒంటిపైన లేని మనసంతవోయి
ఒడిలోని పాపాయి వటపత్ర శాయి

చరణం: 3
హాయి.. హాయి.. హాయి..ఆపదలూ గాయీ
హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి
హాయి ..హాయి.. హాయి.. ఆపదలూగాయీ

హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి
హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి

అత్తరూ లేదురా పన్నీరు లేదు
ఉడుకు నీరే చాలు మనకూ పదివేలు
సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ
నీ అగులు సుక్క సోగసు అద్దానికీసు
కన్నతల్లికి కంటి పాపవే గాని
కడవాళ్లకే కంటి నలుసు వయ్యావు
నేలపై పారాడు బాల కిట్టమ్మా
నెమలీకన్నేదిరా నాకు సూపమ్మా
నేలాపై పారాడు బాలా కిట్టమ్మా
నెమలీకన్నేదిరా నాకూ సూపమ్మా

మేలు కోరాద పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణావతారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, శైలజ 

మేలు కోరాద స్వాగతం గురు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణావతారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

స్వాగతం గురు 

Palli Balakrishna
Gharana Donga (1980)
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి , మోహన్ బాబు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సురేష్ వర్మ
బ్యానర్: విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 29.03.1980Songs List:ఓ ముద్దు కృష్ణా నా బుజ్జి కృష్ణా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఓ ముద్దు కృష్ణా నా బుజ్జి కృష్ణా
మురిపాల కృష్ణా గోపాల కృష్ణా
నీ జపమే చేస్తున్నా - నీ భజనే చేస్తున్నా
నీ తపనే చేస్తున్నా నా మనసే ఇస్తున్నా
నీకోసం నిద్రాహారం సర్వం మాని నే పడి చూస్తున్నా

నీ జపమే చేస్తున్నా నీ తపమే చేస్తున్నా
నీ మనసే వరమడిగి నా మనసే యిస్తున్నా
నీ కోసం నిద్రాహారం సర్వం మాని నే పడి చస్తున్నా
చక్క చకచా చక చక చా చక చక చా

చరణం: 1
గుండెల్లో గుబులుగా వుంది కృష్ణా, కృష్ణా.
ప్రతి రేయి పగలపుకుంది కృష్ణా, కృష్ణా...
వళ్ళంతా వగలై పోయి వయసంతా దిగులవుతుంది.
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా....
నేనంటే కన్నెలకిష్టం రామా రామా
నాకేమో నువ్వే ఇష్టం రామా రామా
వెన్నలాంటి కన్నెను చూస్తే వెన్నెల్లే నవ్వుతువుంటే
ఏ అందమో ఒక బంధమై నా కోసమే వచ్చినట్టున్నది

చరణం: 2
కలలోన దగ్గరకొచ్చి కృష్ణా కృష్ణా
తెరచాటు ముద్దులు పెడితే కృష్ణా కృష్ణా
యీడంతా కోడై కూసే తెల్లారి చుక్కలు పొడిచే
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా...
నాకేమో చలిగా వుంది రామా రామా
నా చెలికి ఎటుందో మరి రామా రామా
వెచ్చంగా తోడై వుంటే వెయ్యేళ్ళు వెన్నెల రాత్రే
ఏ ఊర్వశో నా ప్రేయసై కౌగిట్లో చిందేసినట్టుంది
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందగత్తె చూస్తుంటే... అందమంత ఇస్తుంటే...
అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా... అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందమైన ఈడుంటే... అందగాడు తోడుంటే...
చందమామ నిదరోయేదెట్టాగా... చందమామ నిదరోయేదెట్టాగా

చరణం: 1
కౌగిట్లో కాలాలు కరగాలని... తప్పెట్లు తాళాలు మోగాలని
వలపుల్ని దాచేసి ఒంటరిగుంటే... చెలి తోడు లేకుంటే ఎట్టాగా
ఎట్టాగా... ఎట్టాగా..

ఆ కౌగిళ్లే మన ఇల్లు కావాలని... మల్లె పొదరిళ్లే పడకిళ్లు కావాలని
కలగంటే కాదంటే ఎట్టాగా... చలి తీరి పోతుంటే ఎట్టాగా

ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా..

గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. అబ్బా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా

చరణం: 2
వానల్లే నువ్వొచ్చి తడపాలని... వరదల్లే నే పొంగిపోవాలని
చినుకుల్లో ఇల్లేసి ఒణుకుతు ఉంటే... చెలికాడు రాకుంటే ఎట్టాగా
ఎట్టాగా.. ఎట్టాగా

చుక్కల్లో పక్కేసుకోవాలని... రెండు దిక్కుల్ని కలిపేసుకోవాలని
అనుకుంటే తప్పైతే ఎట్టాగా.. ఈ ఆపలేని పులకింతలెట్టాగా

ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా..
గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా 

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందగత్తె చూస్తుంటే... అందమంత ఇస్తుంటే...
అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా... అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందమైన ఈడుంటే... అందగాడు తోడుంటే...
చందమామ నిదరోయేదెట్టాగా... చందమామ నిదరోయేదెట్టాగా
వాన వెలిసిన వేళ.. పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ... మనసు కలిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

చరణం: 1
చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో
చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో
ఉరిమి పిలిచే నీ ఒడి కోసం... ఉలికిపడి నే చూస్తుంటే
కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
ఓ..కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
నలిగిపోయిన ఆకాశం... పగలు వెన్నెల కాస్తుంటే
చూపూ చూపూ మాటాడాలా... మాటామాటా మానెయ్యాలా
వలపు వలపు వాటెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 

చరణం: 2
చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో
చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో
ముద్దులడిగే ముచ్చట కోసం... పొద్దు గడవక చస్తుంటే
చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
ఓ..ఓ.. చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
హద్దు చెరిపే ఇద్దరి కోసం... మబ్బులెండను మూస్తుంటే

సిగ్గుల మొగ్గ తుంచెయ్యాలా... వెన్నెల పక్క పరిచెయ్యాలా
వేగుల చుక్క దాచెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ... మనసు కలిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..
చిటికెల మొటికెల తాళాలంట పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చిటికెల మొటికెల తాళాలంట
చిరుచిరు నవ్వుల పందిట్లో సిరికీ, హరికీ పెళ్ళంట
ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు

చరణం: 1 
అతను పాల కడలినే పాన్పు చేసుకొని
పండువెన్నెలా పైట చేసుకొని
మల్లె పువ్వులా వచ్చిందంటే మా దేవి
వచ్చి ఏమి యిచ్చిందంట శ్రీదేవి
యిద్దరి మధ్య ఎప్పుకున్నదే యిచ్చిపుచ్చుకోడం
వున్నది కప్పి పుచ్చుకోడం

బుడి బుడి మనసుల బులపాటం చెరిసగమైతే చెలగాటం 
అది చెప్పాలంటే మొగమాటం వద్దంటే అడగొద్దంట

చరణం: 2 
నీలాకాశం ఒళ్ళు చేసుకొని -
నీటి తామరలు కళ్ళు చేసుకొని
చిలిపి నవ్వులా వచ్చాడంట శ్రీహరి
వచ్చి ఏమి ఇచ్చాడంట కృష్ణహరి
యిద్దరి మధ్య ఎప్పుడు లేదు ముద్దులిచ్చుకోడం
హాయిగా పొదు పుచ్చుకోడం
చెడుగుడు వయసుల చెరలాటం
చెప్పలేనిదా యిరకాటం అది ఆపాలంటే ఆరాటం
వదంటే అడగొద్దంట
అలకల పులకల మేళాలంటధిమికిట ధిమికిట పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ధిమికిట ధిమికిట అన్నది అందం
తిదికిట తిరిగిట అన్నది పరువం
తెల్లారిపోవాలయ్యో అల్లరి బుల్లోడా
చల్లారి పోరాదయ్యో టక్కరి పిల్లోడా

చరణం: 1
నువ్వు మల్లెపూలిస్తే నీ పక్కకొచ్చేస్తా
నువ్వు తెల్ల చీరిస్తే నేను సోకు చేసేస్తా
నీ మల్లెపూల మంచం నేను దులిపేస్తా
నీ తెల్ల చీరె అంచుకాస్తా నలిపేస్తా
మిట మిటలాడే నా రాణీ, చిటపటలాడే చిన్నోణ్ణి
చిందులెందుకే, విందులియ్యవే అందమెక్కువ
అలివేణి, అలివేణి, అలివేణి

చరణం: 2 
నువ్వు మబ్బుల్లో వుంటే నేను మెరుపు ముద్దిస్తా
నువ్వు నీటిలో వుంటే నీకు చేప ముద్దిస్తా
నీ మెరుపులోన వురుములన్నీ లాగేస్తా
నీ చేప వగలు కంట నిలిపి ఆడిస్తా
పటమట దేశం పడుచోడా పిటపిటలాడే పిలదాన్ని
పందెమెందుకు సందెవేళకు తొందరెక్కువ 
అబ్బాయి అబ్బాయి అబ్బాయి.
పంపర పనస పండురో పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
పంపర పనస పండురో
పంపర పంపర పంపర పంపర
జంపర మల్లె చెందురో
జంపర జంపర
పడకే కుదరని రాతిరిలో పండగ వెన్నెల దిండురో
పంపర పనస పండురో
పంపర పంపర పంపర పంపర
జంపర జంపర జంపర జంపర
జంపర మల్లె చెండురో
జంపర జంపర జంపర జంపర
చలులే ముదిరిన రాతిరిలో వెచ్చగ వచ్చిన తోడురో

చరణం: 1
ముద్దుకు ముద్దీ పిల్లదిరో సోటకు సోకీ చిన్నదిరో
ముడి వెయ్యాలని ముడితో కాముడి గుడి కట్టాలని వున్నదిరో

కంటికీ చూపీ గుంటడురో. ఒంటరి గుంటే వదలడులో
పురి విప్పాలని నాతో సయసుకు పురిపెట్టాలని వున్నదిరో
తొలకరి మోజుల తొందరలో
కలిసి మెలిసి కౌగిట బిగిసి అలిసే కమ్మని జాతరలో

చరణం: 2
చుక్కకు తళుకీ చూపులురో, చక్కెరకందని తీపులురో
మక్కువ తీరని నులైలపొదలో చక్కని చిక్కని జాజులు రో
మాటల చాటున మాటలురో ఎదలో తుమ్మెద పాటలురో
మాపడివేళకు అల్లరి కధలో ఊపిరికెగిరిన పైటలురో

ఉలిపిరి గాలుల యీలలలో
వలపో, పిలువని పిలుపో తెలియక యిదే యీ తలుపో ....


Palli Balakrishna
Ganga Manga (1973)
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, వాణిశ్రీ , గరికపాటి వరలక్ష్మి
కథ : జలిమ్-జెవేద్
మాటలు (డైలాగ్స్): డి. వి.నరసరాజు
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
బ్యానర్: విజయా ప్రొడక్షన్స్
విడుదల తేది: 30.11.1973Songs List:గాలిలో పైరగాలిలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై వలపు పంటలై
పొదామా... సాగి పోదామా...
పొదామా... సాగి పోదామా 
అలా అలా అలా అలా నింగిలో నీలి నింగిలో

ఎగిరిపోదామా అందాల హంసలై రాజ హంసలై
పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా 

చరణం: 1 
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా... హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా... ఎగిరి పోదామా    

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 
అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం

అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా... జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా
తొలి వలపులలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను ..
అది కవుల పైత్యమనుకున్నాను ..
నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను ..
నీ చెలిమి కోరుతూ ఉన్నాను..

మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..
ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు..
ఆ అలకే వలపనుకుంటారు ..

చరణం: 1
కోరినవాణ్ని కొంగు ముడేసి తిప్పదలచుకుంటారు..
మరో మగువతో మాటాడగనే మూతి ముడుచుకుంటారు..
మొగము తిప్పుకుంటారు..

సేవ పేరుతో చేకిలి నొక్కి సరసం మాడుతుంటారు..
నిజం తెలిస్తే బుజం తడుముకొని నీతులు పలుకుతు ఉంటారు..
సాకులు చెబుతూ ఉంటారు

తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను
మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..

చరణం: 2
ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు
లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు
కుత కుత లాడుతూ ఉంటారు

తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి
వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి
పెడదారి పట్టుతూ ఉంటాయి...

చరణం: 3
కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం
నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం
జీవించడమే నా గమ్యం

కోరినవారు దూరమవుదురని గుబులుపడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగ ఉందని తెలుసు
అది పొంగుతున్నదని తెలుసు...
ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ
ల.ల.లా..ఉ..ఊ..ఉ..హుషారు కావాలంటే పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా 

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే... మందురా  

చరణం: 1
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
అహ అహ ఆ... ఏది?....  మందొక్కటే మందురా       

చరణం: 2
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా 

నిన్నా రేపని తన్నుకోకురా...  ఉన్నది నేడే మరువబోకురా
అహ .... అహ....  అహా..ఆ   

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే....  మందురా 

చరణం: 3
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా

తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ...  చొ..తోకాడించే నీవే తోడురా  

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా...

గడసాని దొరసాని పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్. పి.బాలు, పి. సుశీల

పల్లవి:
గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ బాబు...  ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ..దాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని..

చరణం: 1 
అరెరెరె నడకంటె నడక కాదు
చలాకి నడక.. బల్ కిలాడి నడక
నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ...   అది వడిసెల రువ్వ 

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

వగలంటే వగలు కాదు వలపుల సెగలు
చూపంటే చూపు కాదు మదనుడి తూపు
ఆ నడక...  ఆ నవ్వు...  ఆ వగలు...  ఆ చూపు
అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి
   
గడసాని..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి... ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ... దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..

చరణం: 2
మాటలతోటే నన్ను మురిపించకురా
ఏమేమో పొగిడేసి బులిపించకురా
మాటలతోటే నన్ను... మురిపించకురా
ఏమేమో పొగిడేసి... బులిపించకురా

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

కవ్వించాలని నువ్వు కలలు కనకురా
కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా
గడ ఎక్కి...  తాడెక్కి...  గంతేసి...  చిందేసి
అందరు మెచ్చేలాగా ఆడీ చూపాలిరా 

గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని...    

చరణం: 3
తళుకు బెళుకు చూపిస్తా..
గజ్జె ఘల్లుమనిపిస్తా..

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ తళుకు...  ఆ బెళుకు... ఆ బిగువు...  ఆ బింకం
అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ

గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..
అలా అలా అలా పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి. రామకృష్ణ, పి. సుశీల 

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో ... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై ... వలపు పంటలై
పొదామా...  సాగి పోదామా... 
పొదామా...  సాగి పోదామా 

అలా అలా అలా అలా నింగిలో....  నీలి నింగిలో
ఎగిరిపోదామా....  అందాల హంసలై ...  రాజ హంసలై.... 
పోదామా ... ఎగిరి పోదామా
పోదామా ... ఎగిరి పోదామా 

చరణం: 1
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా...  హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 

అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం
అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా     
తాగాను నేను తాగాను పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

పల్లవి:
తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను..తాగాను 
భలే నిశాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను   
చరణం: 1
కైపులో ఉన్నాను కలలుకంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను
కైపులో వున్నాను కలలు కంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను

మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను
వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను
నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను

తాగాను...  నేను తాగాను...  బాగా నేను తాగాను....  తాగాను    

చరణం: 2
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి 

మ్మ్ హూ మ్మ్ హూ
ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను
నీ దారిలో నుండి తొలగిపోతాను
మన్నించమన్నాను....  మరచిపొమ్మంటాను


Palli Balakrishna
Moodu Puvvulu Aaru Kayalu (1979)
చిత్రం:మూడు పువ్వులు-ఆరుకాయలు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: కృష్ణ, విజయనిర్మల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయనిర్మల
నిర్మాత: యమ్.చంద్ర కుమార్
బ్యానర్: యస్. వి.యస్.ఫిలింస్
విడుదల తేది: 05.01.1979Songs List:

Palli Balakrishna Saturday, February 24, 2018
Samajaniki Saval (1979)
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, సుమలత
దర్శకత్వం: యస్.పి.రాజారాం
నిర్మాత: యస్.పి.వెంకన్నబాబు
బ్యానర్: శ్రీ ఉదయ్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 28.12.1979Songs List:నడిచే ఓ అందమా.. పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
నడిచే ఓ అందమా.. పరుగే నీ పందెమా
పండగంటి పడుచువాణ్ణి.. ఎండకంటి చూపువాణ్ణి
అంటుకోవు.. జంటకావు.. పంతమా
నడిచే ఓ అందమా..

నడకే నా అందము... పరుగే నీ కోసము
మల్లెపూల మనసుదాన్ని... వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే అంతులేని తాపము
నడకే నా అందము...

చరణం: 1
నీ అడుగుల్లో హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ ఏక తాళమైనది
నీ అడుగుల్లో హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ ఏక తాళమైనది

నీ పలుకుల్లో పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో వలపు వెల్లువైనది
నీ పలుకుల్లో పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో వలపు వెల్లువైనది

చూపుల సుడివడి... అడుగులు తడవడి
చూపుల సుడివడి... అడుగులు తడవడి
మనసులు ముడిపడితే అందమూ.. రాగబంధము

నడిచే ఓ అందమా..ఆ.. ఆ.. నడకే నా అందము

చరణం: 2
నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి..
నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి
నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి..
నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి

నీ చూపులలో వెన్నెల మునిమాపులున్నవి
అవి ఎండలలో విరివెన్నెల దండలైనవి
నీ చూపులలో వెన్నెల మునిమాపులున్నవి
అవి ఎండలలో విరివెన్నెల దండలైనవి

అడుగులు దూరమై.. ఎడదలు చేరువై..
అడుగులు దూరమై.. ఎడదలు చేరువై..
వయసులు గుడికడితే అందమూ.. ప్రేమబంధము

నడిచే ఓ అందమా.. పరుగే నీ పందెమా

మల్లెపూల మనసుదాన్ని... వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే అంతులేని తాపము...
ఆనంద మానంద మాయెనే పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఆనంద మానంద మాయెనే
మా సీతమ్మ పెళ్ళికూతురాయెనే

మా రామయ్య పెళిళకొడు కాయెనే
ఆచూపు ఈచూపు చుట్టాలు కాగా
ఆ చూపు ఈ చూపు చుట్టాలు కాగా
ఆకంటి కీ కన్నె కట్నాలు తేగా
కల్యాణమే వై థోగమే –
మురిపాల ముంగిళ్ల లోన
ఇరువురి సరసాల వందిళ్ళలోన
కనుచూపు కౌగిళ్ళలోన
సడిలేని సరసాల సందెళ్ళలోన
ఆమేను యీ మేను మేళులుగా
ఆ తాకీ తాకని వలపు తాళాలుగా

కల్యాణమే వైభోగమే
సీతకు ప్రాణం రామయ్య
దశరథ రాముని బాణం సీతమ్మ
లంకకు చేటు సీతమ్మ
రక్కసి మూకలకే పోటు రామయ్య
సీతమ్మ రామయ్య కల్యాణమే
లోకానికే నిత్య కల్యాణమే
కల్యాణమే పై భోగమేవద్దు వద్దంటున్నా వయసొచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.శైలజ 

వద్దు వద్దంటున్నా వయసొచ్చింది
పడుచోళ్ళతో పెద్ద బెడదొచ్చింది
ఏం చేయను ఏడ చావను
ఓయ్ బావలు ఓయ్ మావలు
పచ్చగడ్డి కొయ్యబోతే పాలేరు కన్నుకొట్టే
సరుకులు కొనబోతే షావుకారు కొంగుబట్టే
గుళ్ళో పూజారి నా కళ్ళల్లోకి చూడబట్టే
ఇంట్లో నా అక్క మొగుడు ఏదో వంకతో తాకబట్టే

ఏం చేయను అబ్బ ఏడ చావను
ఓయ్ దావల ఓయ్ మావలూ

పడుచోడు కనబడితే
పాడు మనసు ఆగదాయె
పదిమందిలో వున్నా పైటకొంగు నిలవదాయె
వుండుండి వళ్ళంతా
వులుకేదో మొదలాయె
ఎందుకొచ్చిన పీడ వయసు
ఏమేమో చేసి పోయే
చీరలమ్మా చీరెలు పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

చీరలమ్మా చీరెలు వన్నె వన్నెల చీరెలు
వెంకటగిరి చీరెలు ధర్మవరం చీరలు కంచి పట్టు చీరెలు గద్వాలు చీరలు
కన్నెలకైనా, అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు
ఆవ్వైనా ఈ చీర కట్టుకుంటే పదహారేళ్ళ పడుచల్లే వుంటుంది
కన్నె పిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తయిదువల్లె వుంటుంది
అకతాయి భామలను ఆదుపున పెట్టే చీర ఇది
ఒళ్లు తెలియని పడుచులకు ఒదుగులు నేర్పే చీర ఇది
ప్రేయసికి చీర నందించు ప్రియుడు తీయని ప్రేమకు సూచనగా
చెల్లాయికీ చీర నందించు అన్నయ్య చల్లని మమతకు దీవెనగా
పుట్టిన రోజైనా, తాళి కట్టిన రోజైనా ప్రతి వనిత కొత్త చీరకడుతుంతి - మనసారా

Palli Balakrishna
Khatarnak (2006)
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజా , ఇలియానా
కథ, మాటలు: అమ్మా రాజశేఖర్ , మరుదూరి రాజా
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాతలు: బి.వి.యస్. యన్. ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శ్రీనివాస్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేది: 14.12.2006Songs List:మాటంటే మాటేరా పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: టిప్పు 

మాటంటే మాటేరా 
ఆ గగనంలోన పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: గీతామాధురి , నాని, నోయల్ (RAP)

ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా
స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం
గగనం భూమికి బహుదూరం
పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం
అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం

చరణం: 1
చలివేణువు నేను చెలివయ్యావు నువ్వు
రవలించే పదమై రాలేవా ఓహో
కరిమబ్బువు నువ్వు గిరికొనను నేను
నన్ను ముంచే వారదై రాలేవా ఓహో
బ్రతుకంటే కవితే కాదు
పతివుంటే కవితే రాదు
ఆ మాటే వలదు వలదు వలదు వలచితివా
కుదరదురా కలలకురా కలపకురా

ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా

చరణం: 2
ఔనంటే కాదు కాదంటే అవును
నీ మాటల సరసం రమ్మంటే విరసం
ఏనాడో తేలదు నీ విషయం ఓహో
నువేగా ఊహిస్తున్న మౌనంగా చూస్తూ ఉన్నా
మౌనాలే అంగీకారం తెలిపెనురా
చెదరనురా వదలదురా తెలిపెనురా

ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం
గగనం భూమికి బహుదూరం
పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం
అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం
దోమ కుడితే పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదవన్, కె.యస్.చిత్ర 

దోమ కుడితే 
బుజ్జి బుజ్జి పాప పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: జొన్నిత్తుల 
గానం: శంకర్ మహదవన్, ఆర్. గాయత్రి, నోయల్ (RAP)

బుజ్జి బుజ్జి పాప లవ్ చేసే వాళ్ళకి పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భాషా శ్రీ 
గానం: ఉలగ నాథన్, వేణుమాధవ్ 

లవ్ చేసే వాళ్ళకి వేస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: కె. శివదత్తా 
గానం: శంకర్ మహదవన్, కె.యస్.చిత్ర 

వేస్తావా

Palli Balakrishna Friday, February 23, 2018
Radha Gopalam (2005)
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: శ్రీకాంత్, స్నేహ, సునీల్, కె.విశ్వనాధ్ 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు (డైలాగ్స్): ముళ్ళపూడి వెంకట రమణ
దర్శకత్వం: బాపు
అసిస్టెంట్ డైరెక్టర్: నాని (హీరో)
నిర్మాతలు: కె.అనిల్ కుమార్, కె.నాగేంద్ర బాబు
బ్యానర్స్: అంజనా ప్రొడక్షన్స్ , శ్రీ క్రియేషన్స్
విడుదల తేది: 29.04.2005Songs List:శతమానం భవతి పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

శతమానం భవతి నీ వాలు జడ పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట

పల్లవి:
చందమామ లాంటి మోము
నువ్వు పూవ్వు లాంటి ముక్కు
దొండ పండు లాంటి పెదవి
కలువపూల వంటి కళ్ళు
జామపండులాంటి బుగ్గ
బెల్ల ముక్క లాంటి గడ్డం
వలపు శంఖమంటి కంఠం
ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో
యవ్వనాల నవనిధులు
కవ్వించి ఊరించి చంపేవన్నీ
ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివే
వెనకనెందుకు ఉన్నావే జడా?

ఆ...ఆ బుగ్గలు సాగదీస్తావ్
ముక్కుని పిండుతావ్
పెదవులు జుర్రుకుంటావ్
గడ్డాన్ని కొరుకుతావ్
ముద్దులు గుద్దులు గిచ్చుళ్లు నొక్కుళ్లు
అదేమిటంటే ఆరళ్లు గీరళ్ళు
శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావనే
ఇలా.. వెనకాల ఉన్నా
నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్క కనిపెడుతున్నా
అవసరమైతే పని పడుతున్నా

ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా
నువలిగితే...నాకు దడా
ఓ పట్టు జడా రసపట్టు జడా
బుసకొట్టు జడా నసపెట్టు జడా
ఇప్పుడేందుకే ఈ రగడా....

ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా

చరణం: 1
వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడా
ఈ తగవులేలనే జడా
కులుకుల నడుముకి వెనకన తిరుగుతు కళకళలాడే జడా
నను కనికరించవే జడా
పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా
నా పొరపాటేమే జడా
అత్తరి ఇత్తర అనుమానాల తత్తర బిత్తర జడా
ఎద కత్తిరించకే జడా..ఆ ..ఆ

కనికట్టు జడా కనిపెట్టు జడా
పనిపట్టు జడా..ఆ..పనిపెట్టు జడా
నిను విడువని ప్రేమికుడా....

చరణం: 2
వడిసేలల్లే తిప్పితే జడా గుండెలోన దడదడా
ఏ గుబులు రేపకే జడా
నడుము తిప్పుడూ నాగస్వరానికి నాగుపామువే జడా
నగుమోము చూపవే జడా
జెడ కోలాటం సరసమె కానీ జగడము కాదే జడా
నను సరసకు రానీ జడా
జెడని దువ్వని పొగడని మొగుడు జఢపదార్ధమే జడా
నిను దువ్వనీయవే జడా...ఆ..ఆ

కనువిందు జడా నను పొందు జడా
సరసాల జడా ఇక చాలు జడా
ఏనాటికి నీవాడా....జజడాం జగడ జఝడాం...
ఆగడాలు పాగడాలు పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, కల్పన

ఆగడాలు పాగడాలు జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే

ఆగడాలు పాగడాలు జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు

చరణం: 1
భార్య వేచి ఉండడాలు మొగుడు రాకవోపడాలు
కోపగించు కోవడాలు కారణాలు చెప్పటాలు
గొంతుచించు కోవటాలు సమర్ధించు వాదాలు
గోడవపెంచుకోవడాలు గోల చేసుకోవడాలు
అరవడాలు ఉరమడాలు కసరడాలు విసరడాలు
చిలిపి చిలికి గాలి వానల ఆవడలు
వాయుగుండం పడటాలు పొంపుదుండం ఆవడాలు
తెల్లవారుజామునే తీరని తాకడాలు
సోరిలు చెప్పటాలు సరే అనుకోవటాలు
అసలు ఏం జరగనట్టు తెల్లారిపోవడలు

చరణం: 2
ఫోను ఏదో రావడాలు నవ్వుతూ మాట్లాడడాలు
అనుమానం రావడాలు తిరుగుటం అవడాలు
ఆరాలు తీయడాలు కారాలే నూరడాలు
ఏనాటికావాదాలు ఏకరువులు పెట్టడాలు
తిట్టడాలు నెట్టడాలు ఒకరినొకరు కట్టడాలు
రోజు రోజు మాటలాగిపోవడాలు
తిక్క తిక్కగా ఉండడాలు పక్క మంది చేయటాలు
బ్రహ్మయ్య ఉండటాలు మన్మధుని తిట్టడాలు
సోరి అని అనుకోవటాలు సర్దిచెప్పుకోవటాలు

చరణం: 3
చీరకట్టుకోవడాలు తెమరకుండపోవడాలు
మొగుడు ముట్టుకోవడాలు టైందాటిపోవడాలు
రైలు వెళ్లిపోవడాలు రోడ్ మీద ఎగరడాలు
తెల్లముఖం వేయడాలు ఇంటిముఖం పట్టడాలు
గంటసేపు తిప్పడాలు కంటినీళ్లు కార్చడాలు
అలగడాలు తలగడాలు తలవాదాలు
అర్ధరాత్రి దాటడాలు భద్రకాళి అవడాలు
నిద్రమానుకోవడాలు నిప్పుమీద చిమడాలు
సారీలు చెప్పడాలు చల్లబడి పోవడాలు
గుద్దులాట నవ్వులాటై ముద్దులాట ఆడుకోవడాలు

ఆగడాలు పాగడాలు జగడాలు
ఐ యామ్ సారీ...
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఐ యామ్ సారీ.. ఐ యామ్ సారీ..
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సారీ సారీ...
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సో సారీ...

మా ముద్దు రాధమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట

పల్లవి:
మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీమువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ...

మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ

మా ముద్దు రాధమ్మ రాగాలే...

చరణం: 1
నువ్వందం నీ నవ్వందం
తల్లో మల్లె పువ్వందం
కట్టందం నీ బొట్టందం
నువు తిట్టే తిట్టే మకరందం

సూరీడు చుట్టూ భూగోళం
రాధమ్మ చుట్టూ గోపాళం
సూరీడు చుట్టూ భూగోళం...
రాధమ్మ చుట్టూ గోపాళం...

నడుము ఆడితే కధాకళి
జడే ఆడితే కూచిపూడి
నువ్వే ఆడితే ఫలానా తతిమ్మాది తిల్లానా

మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ

చరణం: 2
కూరలు తరిగే కూరిమి ఇష్టం
చేతులు తెగితే మూతులకిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం
ముద్దులదాకా వెడితే...

వలచిన వారి పరాకు అందం
గెలిచిన సతిపై చిరాకు అందం
కొపతాపముల కోలాటంలో మనసు ఒక్కటే మంగల్యం
కస్సుబుస్సుల కామాటంలో కౌగిలిగింతే కళ్యాణం

ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార మీరూ
ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జలధిలో
ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార నేడూ...తొలి కోడి కూసేను పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ముళ్ళపూడి వెంకట రమణ
గానం: మురళీధర్, చిత్ర 

పల్లవి:
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
నాదు మొరకాస్త ఆలించి నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

చరణం: 1
ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి
ముగ్గులు పెట్టాలి గోపాలుడా
కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి
చెంగు విడిచిపెట్టు గోపాలుడా
చెంగు విడిచిపెట్టి సెలవిచ్చి పంపితే
మాపటేళకు మళ్లీ వస్తాను
తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి
గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను
గుండెలో వలపంతా గుమ్మరిస్తాను
చెంగు వదలర సామి గోపాలుడా
సరుసుడ నా సామి గోపాలుడా

తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

చరణం: 2
సుప్పనాతి సూరీడొచ్చెను
వెన్నెలంతా ఎర్రాబారెను
మల్లెలన్నీ నల్లాబోయెను కలువకన్నియ
కందీపోయెను కమిలిపోయెను కానుకో
కంటినిండా నిదురకోసం
కాచి ఉన్నది చూసుకో రసికరాజ నిదురపో
ధిక్తన ధిక్తన ధిక్తన ధిన ధిక్తన ధిక్తన ధిక్తన
మూడు జాములు తిరగాలేదు
నాలుగోది పొడవాలేదు
తొందరెందుకు సూరీడా ఎందుకొస్తివి సూరీడా
నిన్నెవరు పిలిచారు సూరీడా
నీకిక్కడేమి పని సూరీడా
నీకెప్పుడేమి పని సూరీడా...
పోరా పోరా సూరీడా రారా రారా సూరీడా
పోరా పోరా...

గ్రహణం పట్టని పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు

గ్రహణం పట్టని 

Palli Balakrishna Thursday, February 22, 2018
Bejawada (2011)
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
నటీనటులు: నాగచైతన్య , అమలా పాల్
కథ: రాంగోపాల్ వర్మ
దర్శకత్వం: వివేక్ కృష్ణ
నిర్మాతలు: రాంగోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్
బ్యానర్: శ్రేయ ప్రొడక్షన్
విడుదల తేది: 01.12.2011Songs List:దుర్గమ్మ కృష్ణమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: విక్రమ్ నేగి 
సాహిత్యం: రెహ్మాన్
గానం: జోజో నతానియల్ 

దుర్గమ్మ కృష్ణమ్మ 
అడగకు నన్నేమి పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: బాపి తుతుల్ 
సాహిత్యం: కలువ సాయి 
గానం: జావేద్ ఆలీ, చంద్రీయ భట్టాచార్య

అడగకు నన్నేమి నిన్ను చూసిన పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
సాహిత్యం: కలువ సాయి
గానం: జావేద్ ఆలీ, శ్వేతా పండిట్ 

నిన్ను చూసిన 
కొంటె చూపులాపి పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
సాహిత్యం: రెహ్మాన్
గానం: హేమచంద్ర , గీతామాధురి

చుక్కలన్ని ఒక్కచోట చేరుతుంటే
చందమామ చంతకొచ్చి ఆడుతుంటే
కొంటె చూపులాపి ఉన్న సొగసెంతో చెప్పవే
కన్నెపిల్ల కంటిబాష తెలియకుంటే తప్పులే
మీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టా
మగువంటే అందనంత మనసిచ్చి గెలవాలంట

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)

అందినట్టే అందుతారే అంతలోనే అలుగుతారే
అందమంటు పొగుడుతారే చేరువైతే బెదురుతారే
తీగనడుమే ఎరగా వేసి మనసునే లాగేస్తారే
సరదాలు సరసాలు మా హక్కు అంటారే

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)

చెలిమి కోరే చిలిపి ప్రాయం బదులు ఏమంది
తనువు లోతే తపన నీదే మనసు
ఊగిందీ హేయ్ తెలుసుకోమంది
సిగ్గుతోటి ముగ్గులేసి ముగ్గులోకి దించుతారే
ముందుకళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే
వాలుజడనే మెడకే విసిరి ఊపిరి ఆపేస్తారే 
జగడాలు ఆడాళ్ళు అని నిందలే వేస్తారే

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)
రమ్ము జిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: ప్రదీప్ కోనేరు 
సాహిత్యం: ప్రదీప్ కోనేరు 
గానం: దీప్తి చారి 

రమ్ము జిన్ను అయిగిరి నందిని పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: ప్రదీప్ కోనేరు 
సాహిత్యం: శ్రీ ఆది శంకరాచార్యుల 
గానం: రవిశంకర్ 

అయిగిరి నందిని 
బెజ బెజ పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: జోజో నతానియల్ 

బెజ బెజలే లెగరా పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: ప్రేమ్ 
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: శ్రీకాంత్ 

లే లెగరా 

Palli Balakrishna

Most Recent

Default