Search Box

MUSICAL HUNGAMA

Hello Guru Prema Kosame (2018)చిత్రం: హలో గురు ప్రేమకోసమే (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజన్ నిజర్
నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 18.10.2018

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!
అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!

చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు
నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే
పుట్టలోన వేలు పెడితే చీమ కుట్టినట్టు
నన్ను పట్టి కుట్టాయిలే

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

చరణం: 1
ఓ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే
తెలుగులోని ఛందస్సు చదవలేదే
హిందీలో షాయిరి మనకు రాదే
నాలో ఈ కవిత్వాల ఘనత నీదే
ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న
వేటూరి చిలిపిదనం మెచ్చుకున్నా
ఎన్నాళ్ళ నుంచి విన్న పాటలైనా
ఈరోజే నాకు నచ్చి పాడుతున్నా
పాతికకేళ్లకొచ్చాక నడక నేర్పినట్టు
అడుగుకెన్ని తప్పటడుగులో

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

చరణం: 2
భూకంపమంటే భూమి ఊగిపోవడం
సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం
ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం
గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం
ఒంట్లోన వేడి పెరిగితే చలి జ్వరం
నిద్దట్లో ఉలికిపాటు పేరు కలవరం
ఈరెంటికన్నా చాలా వింత లక్షణం
తెల్లార్లు నీ పేరే పలవరించడం
ఇన్ని నాళ్లు నా జంటై ఉన్న ఏకాంతం
నిన్ను చూసి కుళ్లు కుందిలే

పెద్ద పెద్ద  కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!


Palli Balakrishna Friday, November 30, 2018
Devadas (2018)చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య
నటీనటులు: నాగార్జున, నాని, రష్మీక మండన్న, ఆకాంక్ష సింగ్
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: అశ్వనీదత్
విడుదల తేది: 27.09.2018

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దాం అనుకుని
ఏ మాట పైకి రాక
మనసేమో ఊరుకోక
అయినా ఈనాటి దాకా
అస్సలు అలవాటు లేక
ఏదేదో అయిపోతున్నా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా

జాలైనా కలగలేదా
కాస్తైనా కరగరాదా
నీ ముందే తిరుగుతున్నా
గాలైనా వెంటపడినా
వీలైతే తడుముతున్నా
పోనీలే ఊరుకున్నా
సైగలెన్నో చేసినా
తెలియలేదా సూచన
ఇంతకీ నీ యాతన
ఎందుకంటె తెలుసునా
ఇది అనేది అంతు తేలునా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

ఆడ పిల్లో అగ్గిపుల్లో
నిప్పురవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్బుతంలో
ఊయలూపినావు హాయి కైపులో
అష్ట దిక్కుల - ఇలా వలేసి ఉంచినావే
వచ్చి వాలవే వయ్యారి హంసరో
ఇన్ని చిక్కులా - ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్లకే నన్నింత హింసలో
తమాషా తగాదా తెగేదారి
చూపవేమి బాలా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

Palli Balakrishna
Chi La Sow (2018)చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: ప్రశాంత్ ఆర్. విహారి
గానం: చిన్మయి శ్రీపద
నటీనటులు: శుశాంత్, రుషాని శర్మ
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాత: నాగార్జున, జస్వంత్ నడిపల్లి
విడుదల తేది: 03.08.2018

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెడవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

అదేదో జరిగిందే  మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

ఏవయ్యిందో చినుకై ఎదలో మొదలై ఒక అలజడి
పో పొమ్మంటు ఇటు తరిమినదా
నాలో ఏవో ఇదివరకెపుడెరగని తలుపుల జతలో
కాదనలేని కలిసిన ఆనందాన్ని
నిజమని నమ్మాలందా ఈ చెలిమీ..

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

Palli Balakrishna
Aravinda Sametha Veera Raghava (2018)చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: మోహన భోగరాజ్
నటీనటులు: జూ. ఎన్టీఆర్, పూజా హెగ్డే , ఇషా రెబ్బ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
విడుదల తేది: 11.10.2018

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ

నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి..
గుండెలవిసి పోయె గదమ్మా

సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మా
సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి...
సింధూరం బొట్టు పెట్టమ్మా

కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కొలిసీ నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి...
కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా

నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
నల్లాగుడిలొ కోడి కూచే

మేడాలోనా నిదుర లేచే
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా


******  ******  ******


చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల సీత రాం శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్

పల్లవి:

చీకటిలాంటి పగటి పూట కత్తులాంటి పూలతోట
జరిన్గిందోక్క వింతవేట పులి పై పడిన లేడి కధ వింటారా
జాబిలీ రాని రాతిరంతా జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంత గుండెల్లోకి దూరి అది చూస్తారా

చుట్టూ ఎవ్వరు లెరూ... సాయం ఎవ్వరు రారూ...
చుట్టూ ఎవ్వరు లెరూ సాయం ఎవ్వరు రారూ 
నా పై నేనే ప్రకటిస్తున్న ఇదేమి పోరూరు

అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరూ...
అరెరెరే  అటుచూస్తే కర్రలు అసలేమైపోతారు అన్యాయం కదా ఇది అనరు ఎవ్వరు.....(3)

ఏ... ప్రతినిమిషం తన వెంట పడిగాపులే పడుతుంటా ఒకసారి కూడా చూడకుందే క్రీగంతా...
ఏమున్నదో తన చెంత ఇంకెవరికి లేనంత ఐస్కాంతమల్లె లాగుతుంది నన్ను చూస్తూనే ఆకాంత

తను ఎంత  చేరువనున్న... అద్దంలో ఉండే ప్రతిబింబం అందునా
అంత మాయల ఉంది అయినా హాయిగా  ఉంది 

బ్రమల ఉన్న బానే ఉండే ఇదేమి తీరు

మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...
మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...

అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరూ...
అరెరెరే  అటుచూస్తే కర్రలు అసలేమైపోతారు అన్యాయం కదా ఇది అనరు ఎవ్వరు.....(8)

మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...
మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...

Palli Balakrishna
Love Birds (1996)చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ , చిత్ర
నటీనటులు: ప్రభుదేవా, నగ్మా
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత:
విడుదల తేది: 1996

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట

మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం
తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం

మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా...

Palli Balakrishna
Sharada (1973)చిత్రం: శారద (1973)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సినారె
గానం: వి.రామకృష్ణ
నటీనటులు: శారద , శోభన బాబు, జయంతి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
నిర్మాత: పి. రాఘవరావు
విడుదల తేది: 1973

పల్లవి:
శారదా నను చేరగా
శారదా నను చేరగా

ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ....ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

చరణం: 1
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి ఆ హొయలు...!

ఏమి కులుకు సెలయేటి పిలుపు
అది ఏమి అడుగు కలహంస నడుగు
హోయ్...ఏమి ఆ లయలు..!

కలగా కదిలే ఆ అందం
కలగా కదిలే ఆ అందం
కావాలన్నది నా హృదయం
కావాలన్నది నా హృదయం
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

చరణం: 2
నీలి కళ్ళలో  నా నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
నీలి కళ్ళలో  నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
పరిమళించేనా...!

చెండువోలేవిరిదండవోలే..
నిను గుండె కద్దుకొని నిండు ముద్దు గొని
పరవశించేనా..!

అలలై పొంగే అనురాగం అలలై పొంగే అనురాగం
పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా నను చేరగా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

ఓ... శ్రావణ నీరదా శారదా

అహా... ఒహో... అహా...


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం:  వి.రామకృష్ణ, పి.సుశీల 

పల్లవి:
శ్రీమతిగారికి తీరని వేళ.. శ్రీవారి చెంతకు చేరని వేళ
శ్రీమతిగారికి తీరని వేళ.. శ్రీవారి చెంతకు చేరని వేళ
చల్లగాలి యెందుకు?.. చందమామ ఎందుకు?
మల్లెపూలు ఎందుకు?.. మంచి గంథ మెందుకు?
ఎందుకు? .... ఇంకెందుకు?

శ్రీమతిగారికి తీరని వేళ శ్రీవారికెందికీ గోల?
శ్రీమతిగారికి తీరని వేళ శ్రీవారికెందికీ గోల?
చల్లగాలి చెప్పవే  చందమామ చెప్పవే
మల్లె తావి చెప్పవే  మంచి మాట చెప్పవే
చెప్పవే... చెప్పవే...

చరణం: 1
ఓ చందమామా  ఓ చల్లగాలీ
ఓ చందమామా  ఓ చల్లగాలీ
నాపైన మీరైన చూపాలి జాలీ
నాపైన మీరైన చూపాలి జాలీ

లలలలలా.. హహహా..

బెట్టు చేసే అమ్మగారిని
బెట్టు చేసే అమ్మగారిని
గుట్టుగా నా చెంత చేర్చాలి
మీరే చెంత చేర్చాలి

శ్రీమతిగారికి తీరని వేళ  శ్రీవారికెందికీ గోల?
చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే
మల్లె తావి చెప్పవే  మంచి మాట చెప్పవే
చెప్పవే... చెప్పవే...

చరణం: 2
ఓ దేవదేవా! ఓ దీన బంధో!
ఓ దేవదేవా! ఓ దీన బంధో!
ఒకసారి మా వారి ఈ బాధ చూడు
ఒకసారి మా వారి ఈ బాధ చూడు
ఆఆ.. ఉం..ఉమ్మ్..

అలకలోనే అలసి పోతే
అలకలోనే అలసి పోతే
ఇంత రేయి నవ్విపోయేను
ఎంతో చిన్న బోయెను...

శ్రీమతిగారికి తీరిన వేళా..
శ్రీవారి చెంతకు చేరిన వేళా
చల్లగాలి యెందుకు?
చందమామ ఎందుకు?
మల్లెపూలు ఎందుకు?
మంచి గంథమెందుకు?

ఎందుకు? ఇంకెందుకు?


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం:  పి.సుశీల 

పల్లవి:
రాధాలోలా! గోపాలా!గాన విలోలా..  యదుబాలా
నందకిషోరా! నవనీత చోరా!
నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార..
రాధాలోలా! గోపాల...గాన విలోలా..  యదుబాలా

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
ఎన్నాళ్లు చేశాను ఆరాధనా..
ఎన్నాళ్లు చేశాను ఆరాధనా..
దాని ఫలితమా నాకీ ఆవేదనా

రాధాలోలా! గోపాలా!గాన విలోలా..  యదుబాలా
నందకిషోరా! నవనీత చోరా!
నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార..
రాధాలోలా! గోపాల...గాన విలోలా..  యదుబాలా

చరణం: 1
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?

మనసులు పెనవేసి.. మమతలు ముడివేసి
మగువకు పతి మనసే.. కోవెలగా చేసి
ఆ కోవెల తలుపులు మూశావా?
ఆ కోవెల తలుపులు మూశావా?
నువు హాయిగ కులుకుతు చూస్తున్నావా?

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి

చరణం: 2
నీ గుడిలో గంటలు మోగాలంటే...
నీ మెడలో మాలలు నిలవాలంటే...
నీ సన్నిధి దీపం వెలగాలంటే...
నే నమ్మిన దైవం నీవే అయితే...
నా గుండెల మంటలు ఆర్పాలి...
నా స్వామి చెంతకు చేర్చాలి...

రాధాలోలా! గోపాలా!
గాన విలోలా..  యదుబాలా!
రాధాలోలా! గోపాలా!
గాన విలోలా..  యదుబాలా!
రాధాలోలా.. గోపాలా.. గోపాలా.. గోపాలా..


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  సినారె
గానం:  సుశీల

పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ..

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ

వనమెల్ల వేచేనురా.....

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా...

రావేలా...  రావేలా

చరణం: 1
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని...

కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని

ఆ...... ఆ....... ఆ.....  ఆ..
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది...

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా

చరణం: 2
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని

నా నీడ తానన్నదీ రాడు రాడేమని

ఆ......  ఆ......  ఆ.....  ఆ.....

రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల...  చిరుజల్లుగా

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా


*****   ******   ******


చిత్రం:  శారద (1973)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి
కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి
ఆ..ఆ.. వధువు వలపే విరిసేది.. ఈనాడే తొలిసారి

అందుకే.. అందుకే తొలి రేయి
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...

చరణం: 1
వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని
వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని
ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము జాబిలి దేనికని
అల్లరి చూపులతోనే  నను అల్లుకు పోయేవెందుకని
అల్లరి చూపులతోనే. నను అల్లుకు పోయేవెందుకని
ఆ..ఆ.. అల్లికలోనే తీయని  విడదీయని బంధం ఉన్నదని

అందుకే.. అందుకే తొలి రేయి
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...

చరణం: 2
నీ పెదవి కనగానే  నా పెదవి పులకించింది ఎందుకని
నీ పెదవి కనగానే  నా పెదవి పులకించింది ఎందుకని
విడివిడిగా ఉండలేక
విడివిడిగా ఉండలేక  పెదవులు రెండూ...
అందుకని..
ఎదురు చూసే పూల పానుపు  ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని
ఇద్దరిని తన కౌగిలో  ముద్దు ముద్దుగా..
అందుకని..

అందుకే.. అందుకే తొలి రేయి
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...

Palli Balakrishna Tuesday, November 27, 2018

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0