Search Box

MUSICAL HUNGAMA

Julayi (2003)చిత్రం: జులాయి  (2003)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: తుంబలి శివాజి
గానం: ప్రణవి ఆచార్య
నటీనటులు: సంతోష్ , అంకిత
దర్శకత్వం: భార్గవన్
నిర్మాత: సి. హెచ్ .సత్యనారాయణ
విడుదల తేది: 2003

Palli Balakrishna Thursday, February 28, 2019
Bhale Ammayilu (1957)చిత్రం: భలే అమ్మాయిలు (1957)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, సాలూరి హనుమంతరావు
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల
 నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: వి.ఎల్.నరసు
విడుదల తేది: 06.09.1957

గోపాల జాగేలరా
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా
దరిజేర చలమేలరా...ఆ...
దరిజేర చలమేలరా
నన్ను దయజూడ విధియేమిరా
దరిజేర చలమేలరా
నన్ను దయజూడ విధియేమిరా
మొర వినవేల కనవేల
మురళీధర కరుణాకర గిరిధర

గోపాల జాగేలరా

కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనికరించి పలుకరించవేలర
మురళీధర కరుణాకర గిరిధర

గోపాల జాగేలరా

సరిగపద గోపాల జాగేలరా
సదపగరి సరిగపద గోపాల జాగేలరా
పగరిసదా సరిగపద గోపాల జాగేలరా
దాసరి పాదస పా సరిగపద గోపాల
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద గోపాల
సాస దదసాస గపదసాస
రిగపదసాస సరిగపద గోపాల జాగేలరా

రీగ రిగ రీరీ... ఆ...
రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని గోపాల జాగేలరా

నిస్సనినిసా...ఆ...
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని గోపాల జాగేలరా

గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా... ఆ...
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ...ఈ...
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ గోపాల
మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద జాగేలరా

రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ...ఆ...రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని గోపాల జాగేలరా

గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా... గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ...
రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా...రిరిసారిరిదా సదవ గపదా...
గరిసదగరీ...సదపగసదా...సదసపదగా...గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద
గోపాల జాగేలరా...

Palli Balakrishna
Jeevitha Nouka (1977)చిత్రం: జీవిత నౌక (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె (All)
గానం: ఎస్.పి.బాలు, సుశీల
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, జయసుధ, చంద్రకళ,శరత్ బాబు
మాటలు: సముద్రాల జూనియర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 1977

పల్లవి:
చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
చిట్టమ్మి... నీ మీద ఒట్టమ్మి...హహహహహహ

చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... హహహహహహహా

చిలకపచ్చని చీరలోనా....

చరణం: 1
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
నా పెదవులు నిన్నడిగితే... ముడుపుగా ఇచ్చుకో

ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చిన ఆ వేళలో... ఎన్నెన్ని తీపి మెరుపులో

చిలకపచ్చని చీరలోనా చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... లరలరలరలరలర

చిలకపచ్చని చీరలోనా....

చరణం: 2
చల్లని నీ రూపమే...  నా కళ్ళలోనీ కాటుకా
చల్లని నీ రూపమే...  నా కళ్ళలోనీ కాటుకా
పచ్చని నా పరువమే...  నీ దోసిట కానుక

నీ కాటుక కన్నులే...  నా కలలకు పొదరిల్లు
నీ కాటుక కన్నులే...  నా కలలకు పొదరిల్లు
వేసేను ఆ కలలే...  విడిపోని మూడుముళ్ళు

చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
ఎందుకని... ఓరబ్బి ఎవరికని...
ఇందుకని... చిట్టమ్మి ఇందుకేనని


******  *******   ******


చిత్రం: జీవిత నౌక (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: సుశీల

పల్లవి:
వేయి దీపాలు నాలోన వెలిగితే
అది ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
అది ఏ రాగం.. ఆ అనురాగం..

చరణం: 1
ఈ చీకటి కన్నుల వాకిలిలో.. ఓ.. వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
ఆ వెలుగుల మంగళవేదికపై.. నా వేణులోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకూ.. ఎదురుచూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు.. చుట్టూ ఉన్నది పెనుచీకటి..
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం.. ఆ అనురాగం..

చరణం: 2
సుడివడిపోయే జీవితనౌక.. కడలితీరం చేరేదెపుడో
కలగా తోచే ఆశారేఖ.. నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో.. రేపటి ఉదయం మెరిసింది
వేగిపోయే నా గుండెలో.. గతమే స్మృతిగా మిగిలింది..
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం.. ఆ అనురాగం..

Palli Balakrishna
Jeevitha Chakram (1971)చిత్రం: జీవిత చక్రం (1971)
సంగీతం: శంకర్- జైకిషన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: యన్. టి.రామారావు, వాణిశ్రీ, శారద
దర్శకత్వం: సి.ఎస్.రావు
నిర్మాత: పి.గంగాధర్ రావు
విడుదల తేది: 30.04.1971

స్నేహమూ చేయవా.... స్నేహమూ చేయవా....
ఎన్ని సార్లు విన్నా కొత్తగా ఉండే ఘంటసాల పాట..!!
వస్తావా.. మురిపిస్తావా.... !!! వస్తావా.. మురిపిస్తావా.... !!!
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా...
ఆశలు దాచకు.... ఆశలు దాచకు...
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే చక్కనైనవి...
ఆడపిల్లా..ఆ.. పూలతీగె..ఏ...ఏ.. ఒక్కలాగే.. అండకోరుకుంటాయీ... ఆహా..
అందమైన మగవాడు పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు ఓ పిల్లా....

స్నేహమూ చేయవా.... స్నేహమూ చేయవా....

కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
కొమ్మమీద గోరువంక రామచిలుక జోడుగూరే..
కొమ్మమీద గోరువంక రామచిలుక జోడుగూరే...
కొమ్మమీదా..ఆ..ఆ... గోరువంకా...ఆ...ఆ... రామచిలుకా...ఆ...ఆ... ముద్దుపెట్టుకున్నాయి... ఆహా..
మెత్తనైన మనసునీది కొత్తచిగురు వేసింది.. మత్తులోన మునిగింది... ఓ పిల్లా..
మైకమూ పెంచకూ... మైకమూ పెంచకు...
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూసే
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూసే
చెప్పలేని..ఈ..ఈ..వింత వింతా..ఆ..ఆ.. అనుభవాలు ఎదురుచూస్తున్నాయి.... ఆహా..
నువ్వు నన్ను చేరాలి... నేను మనసు ఇవ్వాలి
ఎడమలేక ఉండాలి ..ఓపిల్లా..
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా.... మురిపిస్తావా... వస్తావా..
వస్తావా.... మురిపిస్తావా... వస్తావా.. మురిపిస్తావా.... ఓపిల్లా..


Palli Balakrishna
Seetamalakshmi (1978)చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: తాళ్లూరి రమేశ్వరి, చంద్రమోహన్
దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాతలు: మురారి-నాయుడు
విడుదల తేది: 1978

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం..
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే.. శ్రీలచ్చిమవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..

సీతాలు సింగారం..ఊమ్మ్...

కూసంత నవ్విందంటే పున్నమి కావాల...
ఐతే నవ్వనులే..ఏ..ఏ

కాసంత చూసిందంటే కడలే పొంగాల...
ఇక చూడనులే ..ఏ.. ఏ

కూసంత నవ్విందంటే పున్నమి కావాల..
కాసంత చూసిందంటే కడలే పొంగాల..

ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల..
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల... ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే ..భగవంతుడవతారం
మనసున్న మందారం...

లలల్లలా..లాలాలాలా..లలలాలా..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..
ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాల
నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. ఉండిపోవాలా
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల.. ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..
లలలాల..లలలా..లలలా...******   ******  *******


చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం

ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు

ఏ పాట నే పాడను...
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ

రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ

ఆ.ఆఆ.. ఆ రామలాలికి ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ

ఏ పాట నే పాడనూ
బ్రతుకే పాటైన పసివాడనూ
ఏ పాట నే పాడనూ
చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే

ఎందుకో ఎందుకో
నా మీద అలిగాడు చెలికాడు
కలలు చెదిరినా పాటే
కలత చెందినా పాటే
ఏ పాట నే పాడనూ...Palli Balakrishna
Sravana Sandhya (1986)చిత్రం : శ్రావణ సంధ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, విజయశాంతి
దర్శకత్వం: కొండల రామిరెడ్డి
నిర్మాత:
విడుదల తేది: 1986

రండి శ్రీవారు రాదు ఈ రోజు
కలహాలు  పెంచనేల విరహాన ముంచనేల
పాలు పులు పడుచందాలు మరిగేవేళల్లో
హ హ హ ..ఆ..ఆ..ఆ..

రండి శ్రీమతిగారు ఎలా ఈ కంగారు
కోపాలు పెంచానేలా
తాపాన ముంచనేల
కళ్ళు ఒళ్ళు నిదరే రాక కుమిలె వేళ్ళల్లో
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

రండి శ్రీవారు రాదు ఈ రోజు
ఎలా ఈ కంగారు

కావేరి లేనిచోట శ్రీరంగమా
కౌగిళ్ళు లేని బ్రతుకు సంసారమా
ముద్దు మురిపాలు ఇక చెల్లించరా
తప్పో మరి ఒప్పో నను మన్నించరా
బెట్టు బింకం తకంతుంటే మాకేంతుండాలి
పట్టు పంతం విడవకపోతే మేమేం చెయ్యాలి
సంసారమంటే సంగీతమమ్మ
శ్రుతి మించిపోతే సుఖముండదమ్మ
వేళాపళా లేనేలేదా వెనకటి గోడవేలా
హా..హా..హా.

రండి శ్రీమతిగారు ...రండి శ్రీవారు ...

అలకోచ్చినమ్మకేంతో అందాలంట
అదికాస్తా తగ్గగానే అందాలంట
చాల్లెండి
నెలలు వెన్నెలలు ఇక పండించవా
చెలిగా నెచ్చెలిగా నను లాలించవా
పెళ్ళామిప్పుడు గుర్తొచ్చిందా
దారికి వచ్చారా ...పోదు
గూట్లో దీపం పెట్టన్గానే గదిలోకోచ్చారా
కయ్యాలు కూడా కవ్వింతలంట
వయ్యరమింకా మీ సొంత మంట
మాట మంచి అన్ని ఉండి మనకీ తగవేలా
ఆ.ఆ.ఆ...హ.. హ

రండి శ్రీవారు రాదు ఈ రోజు
రండి శ్రీమతిగారు ఎలా ఈ కంగారు

Palli Balakrishna
Tata Manavadu (1996)చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం:
గానం:
నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారద
దర్శకత్వం: కె.సదాశివరవు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1996

Palli Balakrishna
Tata Manavadu (1972)చిత్రం: తాత మనవడు (1972)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల
నటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, విజయ నిర్మల, కైకాల సత్యన్నారాయణ, రాజ సులోచన, రాజబాబు, చంద్రమోహన్,  శ్రీవిద్య, చంద్రకళ, రమాప్రభ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణ రావు (తొలి సినిమా)
నిర్మాత: కె.రాఘవ
విడుదల తేది: 23.03.1972

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

చిన్నిబాబు ఎదిగితే కన్నవారికానందం
నెలవంక పెరిగితే నింగికే ఒక అందం
చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు
చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు
తనకోసం విలపించే తనయుడొక్కడు చాలు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే...
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
తనకు తాను సుఖపడితే తప్పుగాకున్న
తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

తండ్రిమాటకై అడవికి తరలిపోయె రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు
తల్లి చరను విడిపించగ తలపడే ఆ గరుడుడు
అందుకె ఆ పక్షి ఇంద్రుడు అంతటి మహనీయుడు
ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి
ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి
భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి
ధ్రువతారగ వెలగాలి

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే...
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు******   ******   ************  *****   ******


చిత్రం: తాతా మనవడు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సుంకర సత్యనారాయణ
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు

పల్లవి:
సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది   

చరణం: 1
పెంచేదెట్లా గంపెడుమంద..
పెట్టలేక మనపని గోవింద.. పెట్టలేక మనపని గోవింద
కలిగిన చాలును వొకరూ ఇద్దరూ..
కాకుంటె ఇంకొక్కరు.. కాకుంటె ఇంకొక్కరూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

చరణం: 2
కాదు.. కాదు.. కాదు.... వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. కనవలసిందే ఎందరైనా
బుద్దుడో.. జవహరో..  గాంధీజీ.. కాకూడదా ఇందెవడైనా
ఔతారౌతారౌతారు.. బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె
ఔతారౌతారౌతారు.. బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు
లౌతారౌతారౌతారు..  తిండికి గుడ్డకు కరువై.. కడుపుమండి విషంతిని చస్తారూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

చరణం: 3
ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
దారి చూపు నందరికీ వాడే.. దారి చూపు నందరికీ వాడే
నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ

ఎవరికివారే ఇట్లనుకుంటే..  ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం..  ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
కనాలందుకే మిత సంతానం.. కావాలిది అందరికి ఆదర్శం

అయ్యా..  అయ్యా.. ఎందుకు గొయ్య.. నాకొక పీడర మీతాతయ్య
చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య

బాబూ..  బాబూ..  నీకెందుకురా ఆ గొయ్య
నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు మనవడేగా.. ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . ఒకటేగా?


******   ******   *******


చిత్రం:  తాతా మనవడు (1973)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం:  వి.రామకృష్ణ

పల్లవి:
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం 

చరణం: 1
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?

కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై.. కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ
అది కాలుతున్నా వెలుగులే - కావాలి అందరికీ. . అందరికీ     

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం: 2
కొడుకంటూ నీకూ వొకడున్నాడూ - వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ
నిన్ను కడసారైనా చూడరాలేదూ - వల్లకాటికైనా వస్తాడను ఆశలేదూ
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ కనగూడదు ఇలాంటి కొడుకునూ

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం: 3
కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ
కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ
చితిమంటల చిటపటలు వినిపించేనా?  . . చితిమంటల చిటపటలు వినిపించేనా? 

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధంPalli Balakrishna
Puttinillu Mettinillu (1973)


చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం:  సుశీల
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు సావిత్రి, లక్ష్మీ, చంద్రకళ,
కథ: ఏ.ఎస్. ప్రకాశం
స్క్రీన్ ప్లే: జి.నారాయణదాస్
దర్శకత్వం: పట్టు
నిర్మాణం: ఏ.వి.యమ్. స్టూడియోస్
విడుదల తేది: 12.07.1973

పల్లవి:
చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు

చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు

చరణం: 1
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
కట్టుకున్న పతికే బరువై కన్నీరై కరిగేను ఎంత కాలమో... ఈ వియోగము
ఇంతేనా ఈ జీవితం... బాబూ.. పంతాలా పాలాయెనా

చిన్నారి కన్నయ్యా...  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు

చరణం: 2
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
చిక్కు ప్రశ్నలెన్నోవేసి చిక్కులలో చిక్కాను
బోసినవ్వుతో బుంగమూతితో మార్చాలీ మీ మామను
బాబూ చేర్చాలి...  మీ నాన్నను

చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు..నీవే కలపాలీ మా మనసులు


******  ******  ******


చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి:
హెహె ఆహా  హేహే
ఆహా  బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఆహా  బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఏమిసిగ్గా ? కందెబుగ్గా తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా

చరణం: 1
ఏటుగాడి వనుకున్నా వోరబ్బా కన్నెజింక చేత తిన్నావు దెబ్బ
ఏటుగాడి వనుకున్నా వోరబ్బా కన్నెజింక చేత తిన్నావు దెబ్బ
కోపమొద్దూ తాపమొద్దూ ఉన్నమాటే ఉలకవద్దూ

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా..  ఓహో
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా..  చెమ్కి తిన్నావు చిన్ని నాయనా

చరణం: 2
సరదాగా అన్నాను చిన్నోడా కలకాలం కావాలి నీ నీడ
సరదాగా అన్నాను చిన్నోడా కలకాలం కావాలి నీ నీడ
కలుపుచేయీ కలుగుహాయీ పోరునష్టం పొందులాభం

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా చెమ్కి తిన్నావు చిన్ని నాయనా ఓహో
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఏమిసిగ్గా ? కందెబుగ్గా తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా


*****  *****  *****


చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి.బాలు

పల్లవి:
హెహె హో హో హేహే ఆహా..
బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా
ఆహా.. బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా


ఇలా చూడు బలే జోడు కోరినోడు కూడినాడు
బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా

చరణం: 1
నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ ఓ..
నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ

ఏమి అలకా ? రామచిలకా.. ఉలికి పడకే వలపు మొలకా

బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా
ఆహా  బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా

చరణం: 2
అందాల నీ నడుమూ ఊగింది..  అమ్మమ్మొ నా గుండె ఆగింది
అందాల నీ నడుమూ ఊగింది..  అమ్మమ్మొ నా గుండె ఆగింది

హల్లో హల్లో.. పడుచు పిల్లో..  పెళ్లి గుళ్లో.. తాళి మెళ్లో
డు డు పి పి రి పి పి డుం డుం పి పి రి పి

బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా
 ఇలా చూడు.. బలే జోడు.. కోరినోడు.. కూడినాడు


******  ******  *****

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి
గానం: ఏ. ఎం. రాజా, సుశీల

పల్లవి:
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ

ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..
నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...

చరణం: 1
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
తనువంత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

చరణం: 2
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు....
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు...

నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ.

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..


******  ******  ******


చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు

పల్లవి:
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

చరణం: 1
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము

చరణం: 2
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు
కలిసేవు నను కలిసేవూ

Palli Balakrishna
Rukmini (1997)చిత్రం: రుక్మిణి (1997)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: సుజాత
నటీనటులు: వినీత్, రుక్మిణి విజయ్ కుమార్ (తొలిపిరిచయం)
మాటలు: జి.సత్యమూర్తి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: రమణమూర్తి జొన్నాడ
విడుదల తేది: 1997

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ
పున్నాలు పూయునంట కన్నుల్లో
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట

పాట అంటె నాదెగాని కోయిలమ్మదా ఉట్టి కారుకూతలే..
ఆట అంటె నాదెగాని లేడిపిల్లదా ఉట్టి పిచ్చిగంతులే..
పొలాల వెంట ఛెంగుమంటు సాగుతూ పదాలు పాడితే
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే
ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి
చంద్రుడే సిగ్గుతో మబ్బు చాటు చేరుకోడా

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు....
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె....

నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకీ ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారిలాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే
ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ అనాలి అందరూ
అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ
నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు అ మగాడు
ఇక్కడే ఎక్కడో తపస్సు చేస్తు ఉంటాడు

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ
పున్నాలు పూయునంట కన్నుల్లో
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట


Palli Balakrishna Wednesday, February 27, 2019
Iddaru Ammayilu (1972)చిత్రం:  ఇద్దరు అమ్మాయిలు (1972
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం:  దాశరథి
గానం:  యస్.పి.బాలు 
నటీనటులు: నాగేశ్వరరావు, శోభన్ బాబు, వాణిశ్రీ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.ఆర్.పుత్తన్న కనగల్
నిర్మాణం: యునైటెడ్ ప్రొడ్యూసర్స్
విడుదల తేది: 02.10.1972

పల్లవి:
నా హృదయపు కోవెలలో....  ఆ... ఆ
నా బంగారు లోగిలిలో....  ఆ...  ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...  ఆ ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే
ఆ...ఆ... హా...

నా హృదయపు కోవెలలో...

చరణం: 1
ఆహా.. ఆ..
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో...
సొగసును మించిన సుగుణముతో... నా మనసును నిలువునా దోచితివే

నా హృదయపు కోవెలలో...

చరణం:  2
అహహ...ఆహాహా...ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే...
లక్ష్మి సరస్వతి నీవేలే... నా బ్రతుకున కాపురముందువులే

నా హృదయపు కోవెలలో...

చరణం: 3
ఆహా..ఆ..ఆ...
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో...
వచ్చే పోయే అతిధులతో... మన వాకిలి కళకళలాడునులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో...*****  *****  *****చిత్రం:  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం:  దాశరథి
గానం:   సుశీల

పల్లవి:
ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి...  అనురాగం పండాలి

ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి ... అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో...

చరణం: 1
పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా...
పసుపు కుంకుమ కొల్లలుగా... ఈ పచ్చని ముంగిట కురవాలి

ఈ చల్లని లోగిలిలో ....

చరణం: 2
శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
లక్ష్మి.. సరస్వతి పొందికగా ...  ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి ....

ఈ చల్లని లోగిలిలో ....


చరణం: 3
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో....
వచ్చే పోయే అతిధులతో... మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి


ఈ చల్లని లోగిలిలో....  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి... అనురాగం పండాలిPalli Balakrishna
Pranaya Geetham (1981)చిత్రం: ప్రణయ గీతం (1981)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  సినారె
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: చంద్రమోహన్, సుజాత
దర్శకత్వం: పి.సాంబశివరావు
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 01.01.1981

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం

నీ వదనమే కమలమై పూచెనా
భావనలే రేకులై నాకై వేచెనా

నీ హృదయమే భ్రమరమై దాగెనా
కోరికలే రెక్కలై నాపై మూగెనా

అహహా...  కాలమే లీలగా ఆడెనా
నీలో ఉన్న నాదాలన్ని నాలో పొంగెనా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం

నీ పెదవిఏ మురళిఐ పిలిచెనా
రసధునులే రవుళులై నాలో నిలిచెనా

నీ పదములే హంసలై కదలెనా
లయజతులే హొయలులై నాలో ఒదిగెనా

నందనం చేతికే అందెనా
నాలో ఉన్న అందాలన్ని నీలో పండెనా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా
రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం

Palli Balakrishna
Anubandham (1984)చిత్రం: అనుబంధం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి
నటీనటులు: నాగేశ్వరరావు, రాధిక, సుజాత
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 31.03.1984

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో..జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

నీచిలిపి నవ్వులో ఆనవ్వు వెలుగులో
నాసొగసు ఆరబోసి మెరిసిపోనా
నీఒంటి నునుపులో నీపెదవి ఎరుపులో
నావయసు పొంగు నేను కలుపుకోనా
గంగలాగా ఉరికిరానా
కడలిలాగా కలుపుకోనా
నా ఒడిలో ఉయ్యాలలూగించనా
నాఎదకు నినుచేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంతా ఒకవింత గలిగింత
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
ఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా


నీ ముద్దు ముద్దులు.. మురిపాల సద్దులు
ముప్పొద్దు మునిగితేలి మురిసిపోనా
నీ మెత్త మెత్తని.. సరికొత్త మత్తులో
నే చిత్ర చిత్తరంగా హత్తుకోనా
హోయ్...గుండెలోనా నిండిపోనా
నిండిపొయీ ఉండిపోనా
నీప్రేమ నూరేళ్ళు పండించనా
నీఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా
బంధాలు ముడివేసి అందాల గుడి చేసి
అనురాగ అర్చనలే చేయించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో..బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా


Palli Balakrishna
Chillara Mogudu Allari Koduku (1992)చిత్రం: చిల్లర మొగుడు అల్లరి కొడుకు (1992)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ
నటీనటులు: చంద్రమోహన్, జయసుధ,
మాటలు: శంకరమంచి పార్థసారథి (తొలిపిరిచయం)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: అల్లాడ సత్యనారాయణ
బ్యానర్: శ్రీ సాయిలక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల తేది: 1992

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా
ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా

దొరికారు లేడిలా దొరగారు దొంగలా
పోలీసు ఫోజులే చాలుగా

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా

తప్పో వప్పో పుచ్చుకున్నా అరువు
తియ్యొద్దమ్మో పరువు
అప్పో సప్పోవంటి కథలే పడవు
పద్దే వద్దు బరువు
అయ్యయ్యో అట్టాగంటే ఎట్టా మేడం
తమరు ఇస్తాలెండి షుగరు
అహ ఇట్టా చెప్పే మాటకేది కుదురు
ఇంటా బయటా వినరు
బాకీలే బంధాలు కావా నూరేళ్లు గుర్తుండి పోవా
ఆ మాట రైటండి సారు అహ ఇవ్వండి ఓ వెయ్యి  మీరు
అరె నాకే నామం గీసే తెగువ తగదు మగువ

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - అబ్బా ఇస్తానండి
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా - తీర్చక చస్తానా
దొరికారు లేడిలా దొరగారు దొంగలా
పోలీసు ఫోజులే చాలుగా

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - ఇస్తాను
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా - పోతానండి

అయ్యోపాపం ఎందుకండి అలుపు
చేస్తాలెండి హెల్ప్
ఆబ్బె వద్దు అలవాటే మాకు రోజు చేసే వర్కు
ఇట్టా సాయం చేయబోతే ఇరుగు
పొందాలండి పొరుగు
అహ కాకా పట్టి చెక్కరెగ్గొట్టారో ఖాకీ లాఠీ విరుగు
కోపాలదేముంది లెండి ఆ తీపి గుర్తుండనిండి
ఈ మాటకే వళ్ళు మండు
హస్బెండ్ తీస్తాడు బెండు
అబ్బ ఏదో ఊర్కె అంటే తెగని తగవు తగునా

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - అయ్యో
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా - అమ్మో
దొరికారు లేడిలా దొరగారు దొంగలా
పోలీసు ఫోజులే చాలుగా...

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - ఇస్తానండి
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా
పరువు తీయకండి ఇస్తానండి

Palli Balakrishna
K. Raghava (Producer)తెలుగు చలన చిత్రసీమలో ఓ శకం ముగిసింది. ప్రముఖ నిర్మాత కె. రాఘవ (105) నిన్న రాత్రి (31.07.2018) కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవ 1913లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో జన్మించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినిమా రంగానికి ‘కష్టేఫలి’ అనే మాట బాగా వర్తిస్తుందనడానికి రాఘవనే నిదర్శనం. బీదరికం కారణంగా తన 9 వ ఏట ఇంట్లోంచి పారిపోయి దొంగల బండి ఎక్కి కలకత్తా చేరుకున్నారు. కలకత్తాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో ఆఫీస్ బోయ్ గా పనిచేశారు రాఘవ. ఆ తర్వాత ముంబైలో కొద్దికాలం ఫిల్మ్ ప్రోసెసింగ్ యూనిట్ లో వర్క్ చేశారు. విజయవాడ మారుతీ టాకీస్ లో కస్తూరి శివరావు దగ్గరా పనిచేశారు. చెన్నపట్నం చేరి కెమెరా ట్రాలీ బోయ్ గా, స్టంట్స్ నేర్చుకుని  స్టంట్ మాస్టర్ గా మారారు 'పాతాళ భైరవి' సినిమాకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తూ సినిమాలకు మౌత్ పబ్లిసిటీ చేసే వ్యక్తిగా కూడా పనిచేశారు డూప్ గా కూడా చేశారు… బతకడం కోసం రకరకాల పనులు చేస్తూ… చివరకు ప్రొడక్షన్ మేనేజర్ అవతారం ఎత్తారు, వివిధ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల తొమ్మిది భాషలు తెలిసిన కారణంగా ఎంజిఎం వారికి  'టార్జాన్ గోస్ టు ఇండియా' చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్ గా విదేశాల్లో షూటింగ్ నిర్వహించే సామర్ధ్యం ఏర్పరుచుకున్నారు. వారు ఇచ్చిన పది లక్షల రూపాయల పారితోషకంతో  'సుఖ దుఃఖాలు' చిత్రానికి ఒక నిర్మాత అయ్యారు,  ఆ తర్వాత మిత్రుల సహకారంతో ‘జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, జగత్ జెట్టీలు’ సినిమాలు నిర్మించారు.

తరువాత ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి. ఎస్.వి.రంగారావుతో ఉన్న పరిచయం ఉపయోగించుకొని   ‘తాతా మనవడు’ చిత్రాన్ని నిర్మిస్తూ  దాసరి నారాయణరావుకు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించారు, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో కోడి రామకృష్ణను దర్శకులుగా పరిచయం చేశారు. ఈ సినిమాలో చిత్రకధా రచయిత , మాటల రచయితగా కొనసాగే గొల్లపూడి మారుతీ రావుని నటునిగా పరిచయం చేశారు. దాసరి నారాయణరావు,  కోడి రామకృష్ణ ఇద్దరూ శతాధిక చిత్రాల దర్శకులు కావడం గొప్ప విశేషం. ‘సంసారం సాగరం’, ‘చదువు-సంస్కారం’, ‘తూర్పు-పడమర’, ‘అంతులేని వింత కథ’, ‘ఈ ప్రశ్నకు బదులేదీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రాఘవ నిర్మించారు. ఆయన తెలుగుతో పాటు తమిళంలో ‘మైనర్ మా పిళ్ళై’, హిందీలో ‘ఇత్నీ సీ బాత్’ సినిమాలను కె. రాఘవ నిర్మించారు. సినిమా రంగానికి కొత్తవారిని పరిచయం చేయడంలో ముందుండే వారు.దాదాపు 30 చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు, అంతేకాదు ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు కూడా. కె. రాఘవ కు 2009లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందించింది.


Palli Balakrishna
Thoorpu Padamara (1976)చిత్రం: తూర్పూ పడమర (1976)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: సినారె (All)
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: మాధవి (తొలి పరిచయం), మురళీమోహన్, నరసింహ రాజు, శ్రీవిద్య, మంజుభార్గవి
కథ: కె.బాలచందర్
దర్శకత్వం: దాసరి నారాయణరావు
అసోసియేట్ డైరెక్టర్: రేలంగి నరసింహారావు
నిర్మాత: కె. రాఘవ
విడుదల తేది: 1976

శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని
ఆఆఆఆఆ...ఆఆఆఆ...
శివరంజని నవరాగిణీ.. ఆఆఆ...

రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
సరస హృదయ వీణా వాణివీ

శివరంజని నవరాగిణి.. ఆఆఆఆ..

ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం...

శివరంజని నవరాగిణీ...ఆఆఆఆ..

జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
రావే...ఏఏఏ.. రావే నా శివరంజని..
మనోరంజని.. రంజని నా రంజని
నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ
నా దానివి నీవే నాదానివీ
Palli Balakrishna
Urvasi Neeve Naa Preyasi (1979)చిత్రం: ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All)
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: మురళీమోహన్, శరత్ బాబు, నగేష్ బాబు, లత, సుభాషిణి, సుధ, జయశ్రీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి.వి.శ్రీధర్
నిర్మాత: బి.భరణి రెడ్డి
విడుదల తేది: 10.08.1979

చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసి
చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసి
పూవై విరిసే నీ అందమే రూపసి
ప్రేయసి ఊర్వశీ ఊర్వశీ  ప్రేయసి

చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసి
పూవై విరిసే నీ అందమే రూపసి
ప్రేయసి ఊర్వశీ ఊర్వశీ  ప్రేయసి

Palli Balakrishna Tuesday, February 26, 2019
Akka Mogudu (1992)చిత్రం: అక్కమొగుడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, మినీ మినీ, ఎస్.పి.బాలు
నటీనటులు: రాజశేఖర్, సుహాసిని మణిరత్నం
దర్శకత్వం: క్రాంతి కుమార్
నిర్మాత: సి.హెచ్.వి.అప్పారావు
విడుదల తేది: 1992

కోరస్:
పసుపు కుంకుమల పడతి గంగకిది
చిలకపచ్చని సీమంతం
మగని ప్రేమలకు మగువ నోములకు
నేడే పేరంటం

పల్లవి:
సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చల్లరే యదజల్లరే ముత్తైదువులీవేళ

సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం

చరణం: 1
అందంతో తానే అరవిచ్చిన అరవిందం
అనురాగంలోన మనసిచ్చిన మకరందం
సీతా... గౌరీ... కలిశారే నీలోనే
నెలవంక లేత పొడుపుల్లో
వెలిశారే నీలోనే తొలిశూలు మొగ్గ  ఎరుపుల్లో
ఈయరే శుభ హారతి సుమతీమనులీవేళ

సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం

చరణం: 2
ఎవరు నీవు ఎదలేని నీవు
మము వేటలాడుటే నీ క్రీడా
బ్రహ్మ రాతలని బొమ్మలాడుకొను వేడుక నీదేగా
పాపం నీరూపం ఈ ప్రళయం నీ దీపం
శిలకే ప్రతిరూపం నీ బ్రతుకే మా శాపం
ప్రేమా... బంధం...
మనసుంటే మీరాల మరణాలులేని మమతల్లో
వికసిస్తూ రాలాల చితిమంటవేగు గుండెల్లో
పాడన మది కీర్తన విదివంచిత రాగంలో

సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చల్లరే యదజల్లరే ముత్తైదువులీవేళPalli Balakrishna
Thulasi (1974)చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, భారతి, కల్పన
దర్శకత్వం: కె.బాబురావు
నిర్మాత: కె.ఎ. ప్రభాకర్
బ్యానర్: రమావిజేత ఫిలిమ్స్
విడుదల తేది: 1974

పల్లవి:
లలలలాలలలా...అహా...
లలలలాలలలా...అహా...

అహహహా...హా..అహహహా...హా...
సెలయేటి గలగల... ఆ...
చిరుగాలి కిలకిలా..ఆ..
సెలయేటి గలగల చిరుగాలి కిలకిల
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ

చరణం: 1
చందమామ కన్నా నీ చెలిమి చల్లన
సన్నజాజి కన్నా నీ మనసు తెల్లన
నిన్ను కౌగిలించ గుండే ఝల్లన
ఆ...నిన్ను కౌగిలించ గుండే ఝల్లన
నిలువెల్ల పులకించె మెల్లమెల్లన

సెలయేటి గలగల...ఆ...
చిరుగాలి కిలకిల..ఆ...
సెలయేటి గలగల చిరుగాలి కిలకిలా
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ

చరణం: 2
పసి నిమ్మపండు కన్న నీవు పచ్చన
ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చన
అనురాగం ఏదేదో అమరభావన
అనురాగం ఏదేదో అమరభావన
అది నీవు దయచేసిన గొప్ప దీవెన

సెలయేటి గలగల...ఆ...
చిరుగాలి కిలకిల..ఆ...
సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల....
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ

అహా...అ...అ.. .అహా...
అహహహా...హా..అహహహా...హా...


******  ******  ******


చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి

చరణం: 1
చీకటి ఇంట వెన్నెలపంట..పండేనోయి ఈరేయీ
ఎన్ని ఆశలో నాలో..కన్నెకలువలై విరిసాయి

లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి

చరణం: 2
నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం
నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం
పెరిగి పెద్దవై నీవే..తోడు నీడగా నిలవాలి

లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి


*****  ******  ******


చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:
గానం: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి

పల్లవి:
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...

ఆడబిడ్దంటే అర్ధమొగుడని అన్నావే... ఏ..ఏ..
మరి తీరా వస్తే... చల్లగా జారుకున్నావే..

మాట వరసకు అన్నాను గానీ ఓయమ్మో...
నువు అన్నంత చేస్తావనుకోలేదే గున్నమ్మో...
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...

చరణం: 1
కోటేరు ముక్కుంది... కోటంత ఎత్తుంది...
మీసమంటు లేదు గానీ... పౌరుషం భలేగుందీ...
అందుకే నిను మెచ్చాను... ఒంటిగా ఇటు వచ్చాను...
హరి హరి నారాయణా... చచ్చాను... బాబోయ్ చచ్చాను...

కలికి ముత్యాల కొలికి... పడకమ్మ ఉలికి ఉలికి...
కలికి ముత్యాల కొలికి... రాకమ్మ ఉరికి ఉరికి..


చరణం: 2
ఆనాడు రాధగా నీ మేను తాకగా...
నిలువెల్ల కలిగింది గిలిగింత వెచ్చగా...
నిదరే రాదాయే....గుండెలో బాధాయే...
శివ శివ ... నీ వాలకం శృతిమించిపోయే....మించిపోయే...

కలికి ముత్యాల కొలికి...పడకమ్మ ఉలికి ఉలికి...
ఆడబిడ్దంటే అర్ధమొగుడని అన్నావే...ఏ..ఏ..
మరి తీరా వస్తే...చల్లగా జారుకున్నావే ...

మాటవరసకు అన్నాను కానీ ఓయమ్మో...ఓ...
నువు అన్నంత చేస్తావనుకోలేదు గున్నమ్మో...

కలికి ముత్యాల కొలికి...పడకమ్మ ఉలికి ఉలికి...
పడకమ్మ ఉలికి ఉలికి....రాకమ్మ ఉరికి ఉరికి...

Palli Balakrishna
Sivaranjani (1978)చిత్రం: శివరంజని (1978)
సంగీతం:  రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: దాసం గోపాల కృష్ణ
గానం: సుశీల
నటీనటులు: జయసుధ , హరి ప్రసాద్, మోహన్ బాబు, మురళి మోహన్
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాత: దాసరి పద్మ
విడుదల తేది: 1978

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా
మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కుట్టావు తుమ్మెదా
ఒత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
ఆ ... ఆ...  ఆ...  ఆ...  ఆ
పక్కవేసుంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

Palli Balakrishna Monday, February 25, 2019
Muddula Koduku (1979)చిత్రం: ముద్దుల కొడుకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు,  సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, మురళీమోహన్, జయసుధ, శ్రీదేవి
నిర్మాత, దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 04.05.1979

పల్లవి:
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం

అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం: 1
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ఇద్దరమా ఒక్కదనం ఇచ్చిపుచ్చుకుంటుంటే
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం: 2
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు హాయ్
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు
వయసున్న వాళ్ళకే.. వల్లమాలిన జబ్బులు

తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
ఆ ఆ చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం: 3
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
మన కోసం ప్రతి మాసం.. మాఘమాసమై పోతుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
ఈ వద్దుకు అర్ధం మారి మన హద్దులు రద్దౌతుంటే

తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరుమీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

Palli Balakrishna
Kodi Ramakrishna
కోడి రామకృష్ణ  (తెలుగు సినిమా దర్శకుడు )
( జులై 23 - ఫిబ్రవరి 22, 2019 )
రామకృష్ణ పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశాడు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించాడు.

తలకట్టు: 
కోడి రామకృష్ణ గారి రెండవ సినిమా తరంగణి  టైంలో కోవలం బీచ్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో యన్.టి.రామారావు గారి కాస్ట్యూమ్ డిజైనర్‌ ‘మోకా రామారావు’ నా దగ్గరకు వచ్చి.. “మీ నుదిటి భాగం చాలా పెద్దది.అసలే ఇది వేసవి కాలం. ఎండలో ఇలా మాడిపోకూడదు’ అని చెప్పి కర్చీఫ్ తో ఇలా కట్టాడు.. ఆ తర్వాత ఒక బ్యాండ్ తెచ్చి కట్టాడు.
అప్పట్నుంచి బాగుందని అలా మైంటైన్ చేస్తున్నా అని చెప్పారు.


బాల్యం, విద్యాభ్యాసం:
కోడి రామకృష్ణ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. ఆయన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తినీ చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫొటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి - "మన వంశంలో డిగ్రీ వరకూ చదువుకున్న వారే లేరు. నువ్వు డిగ్రీ పూర్తిచేస్తే చూడాలనివుంది. డిగ్రీ చదివాకా నీకేది చెయ్యాలని తోస్తే ఆ పనే చేసుకో" అని కోరారు. దాంతో అప్పటి నుంచీ సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తిచేశారు.

నాటకరంగం:
పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలితకళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుంచీ రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తివుండేది. అత్యంత చిన్నవయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాల్లో ప్రయత్నించేవారు. ఉన్నత పాఠశాల రోజుల నుంచీ చదువుతో పాటు నాటకాలు ఆడేవారు. ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు రప్పించేవారు. రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మ్యానరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకుతగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు. రామకృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉపన్యాసకుడిగా మంచి ప్రఖ్యాతి ఉండేది. ఆయన ఉపన్యాసం ఉన్న ప్రతిచోటకూ అభిమానంగా రామకృష్ణను కూడా తీసుకువెళ్లేవారు. అక్కడ ప్రిన్సిపాల్ ఉపన్యాసానికి ముందు రామకృష్ణతో సుడిగుండాలు సినిమాలోని కోర్టుసీనులో అక్కినేని నాగేశ్వరరావు వాదించే సన్నివేశాన్ని స్వీకరించి చేసే ఏకపాత్రను ప్రదర్శించేవారు.

దర్శకత్వ విభాగంలో:
దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్థశతదినోత్సవం పాలకొల్లులోని మారుతీ టాకీస్ లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులూ పాల్గొనడంతో, కార్యక్రమం ముగిశాకా ఆయన నిర్మాత రాఘవ, దర్శకుడు నారాయణరావులకు వారి తరఫున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు.
దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూన్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకునిణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి-రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు.

దర్శకునిగా:
కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలిచిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే.


వివాహం:
రంగుల పులి అనే సినిమాలో మారుతీ రావు గారి కూతురు క్యారెక్టర్  చేసిన ఆమె కోడి రామకృష్ణ గారి భార్య ఆ సినిమాకు దర్శకత్వం కోడి రామకృష్ణ.


నటునిగా:
రామకృష్ణ మొట్టమొదట దర్శకునిగా కాక సినీనటునిగానే చేద్దామని ప్రయత్నించారు. డిగ్రీ పూర్తికాకుండానే పలు సినిమా దర్శకులకు తన ఫోటోలు పంపేవారు. అయితే తాత మనవడు సినిమా చూశాకా, దాసరి నారాయణరావులా దర్శకుడు కావాలన్న ఆలోచన బలపడింది. కానీ తొలి నుంచీ నటనపై ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. దర్శకత్వ శాఖలో పనిచేయడానికి ముందే డిగ్రీ విద్యార్థిగా ఉండగానే రాధమ్మ పెళ్లి అన్న సినిమాలో దాసరి నారాయణరావు ఆయనకు కథానాయికకు అసిస్టెంటుగా ఓ పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ప్యాచ్ వర్క్ ఎవరో డూప్ తో జరుగుతూండగా అప్పుడే కోడి రామకృష్ణ మద్రాసు రావడంతో ఆయనకే మేకప్ వేసి నటింపజేశారు. దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాల్లో చిన్నాపెద్దా పాత్రల్లో నటిస్తూండేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారంభించి ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు. రాజశ్రీ దర్శకత్వంలో, రాఘవ నిర్మాతగా తీస్తున్న చదువు సంస్కారం సినిమాలో ఓ విద్యార్థి నాయకుని పాత్ర ఉంటే అందుకు రామకృష్ణను విద్యార్థి నాయకునిగా పాలకొల్లులో చూసిన రాఘవ ఆయనతోనే నటింపజేశారు.
అలా మద్రాసు వచ్చిన తొలిరోజే మేకప్ వేసుకుని నటించినట్టు అయింది. దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా 'మా ఇంటికి రండి' అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఐతే చిత్రం విజయవంతం కాలేదు. తర్వాత కొద్ది సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు ధరించారు.

అవార్డులు:
పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి. ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు.


మరణం:
టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఫిబ్రవరి 22 న (శుక్రవారం) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడిన కోడి రామకృష్ణ గురువారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 సంవత్సరాలు.

శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌చాంబర్‌లో ఉంచారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి ఆయన కూతురు దివ్య దీప్తి అంతిమ సంస్కారాలను నిర్వహించి చితికి నిప్పుపెట్టారు. కోడి రామకృష్ణ కడసారి చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.


Palli Balakrishna
Dongaata (1997)చిత్రం: దొంగాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య, సురేష్ , రీతూ శివపురి
మాటలు: దివాకర్ బాబు
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: డా. కె.ఎల్.నారాయణ
విడుదల తేది: 1997

కోరస్:
తస్స చెక్క తద్దినక చిందెనుగా సందడిగా
చెంగుమనే రంగ రంగేళి
చెమ్మచెక్క చూడ చుక్క తుళ్ళేనుగ అల్లరిగా
కంగుమనే కుర్ర కవాళి
పాపాలు సవాలంటరా
బావలు సత్తా చూస్తరా
గోడమీద బల్లి ఏమంది పడుచు బుల్లి
పాత ప్రశ్నలెందుకన్నది

పల్లవి:
చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
జడ్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆట
ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి
కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి...
ఓ..ఓ..ఓ.. మేము రెడీ
ఓ..ఓ..ఓ.. కానీ మరి

చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట

చరణం: 1
కొమ్మంటు ఎరుగని పూలెన్నో ఉన్నవి వాటిని ఏవంటారు
ఏనాడు చెరగని చిరునవ్వులే అవి కాదని ఎవరంటారు

కోరస్:
పక్కుమంటూ నవ్వి వప్పుకుంటాం
చెప్పమంటూ ఇంకో చిక్కు వేస్తాం

దేవుడికి పువ్వులిచ్చి ముల్లివ్వమంటూ అడిగేవాలెవ్వరుంటారు
పెళ్లీడు మీద పడ్డ కన్నెపిల్లలంతా ఆ మూడు ముళ్ళు కోరతారు
బాగానే సెలవిచ్చారు మీ మగవాళ్ళింకేస్తారు
మీ నోచే నోముల ఫలితం మేమంటారు
ఓ..ఓ..ఓ.. ఎం పొగరు
ఓ..ఓ..ఓ.. తగ్గిందా జోరు

చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట

చరణం: 2
ఏటిలో తను ఈతాడుతున్న తడవనే తడవదేది
నీటిలో పడు నీ నీడ కన్న ఇంక వేరేముంది

కోరస్:
అమ్మలాల ఇట్టే చెప్పినాడే
అప్పుడేనా ఇంకావుంది చూడే

కన్నుల్ని మూసి చూస్తే కనిపించుతుంది ఆ చిత్రం ఏమిటైయుంటుంది
నీలాల కన్నుపాప నిదురించ గానే కలవచ్చి కనబడుతుంది
నీ కమ్మని కల ఏమంది ఏ కబుర్లు చెబుతూ ఉంది
ఇవ్వాలో రేపో నిజమై వస్తానంది

ఓ..ఓ..ఓ.. ఇంకేమ్మరి
ఓ..ఓ..ఓ.. రానీ మరి

చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి
కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి
ఓ..ఓ..ఓ.. మేము రెడీ
ఓ..ఓ..ఓ.. కానీ మరీ

చిలిపి చిరుగాలి - పాడాలి కొత్త పాట
ఆడాలి కొంటె ఆట - పాడాలి కొత్త పాటPalli Balakrishna Saturday, February 23, 2019
ABCD (2019)చిత్రం: ABCD (2019)
సంగీతం: జుదా శాండీ
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్, అదితి భావరాజు
నటీనటులు: అల్లూ శిరీష్ , రుక్షర్ ధిల్లోన్
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాత: .మధురా శ్రీధర్ రెడ్డి
విడుదల తేది: 01.03.2019

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే
కలా నిజం ఒకే క్షణం అయోమయం దాగుందే
చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

నీతో చేరుతూ ఏదో కొత్తగా
మరో నేనులా మారానే
పదా రమ్మని అలా వేలితో
కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందులేదే ఈ హాయి
సందడేమో అల్లుతూనే నీ వైపోయే
ప్రతీ క్షణం సంతోషమే నేనెప్పుడూ చూడందే
ప్రపంచమే చూశానులే నీలా ఏదీ లేదంటే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

మెరిసే లోపలే మనసే
మురిసే నిన్నిలా కలిసే
నిమిషాలు రోజులై
నిలిచేను చేతిలో
నేనుంటా నీడలా ఇలా
నీతోనే అన్ని వేళలా

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే అల్లారేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

Palli Balakrishna
Swapna (1980)చిత్రం: స్వప్న (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: స్వప్న, రాజా, రాంజి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
విడుదల తేది: 14.11.1980

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

మెరుపనీ పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం..
పూవనీ పిలావాలంటే..ఆ సొగసు ఒక్క దినం..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ!!
తెలిసింది ఒక్కటే.. నువ్వు నా ప్రాణమనీ!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

తారవని అందామంటే.. నింగిలో మెరిసేవూ..
ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవూ..
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
తెలిసింది ఒక్కటే..నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

Palli Balakrishna Thursday, February 21, 2019
Premalu Pellillu (1974)చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: వి.రామకృష్ణ, సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, జయలలిత, శారద
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: డి.భాస్కరరావు
విడుదల తేది: 15.01.1974

పల్లవి:
మనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే... కనులకెందుకో నీరిచ్చాడు..
కనులకెందుకో నీరిచ్చాడు
మనసులేని దేవుడు... మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం: 1
మనిషికీ.. దైవానికీ ఏనాటి నుంచో వైరము
మనిషికీ.. దైవానికీ ఏనాటి నుంచో వైరము
వీడి కోరిక వాడు తీర్చడు... వాడి దారికి వీడు వెళ్లడు....
వాడి దారికి వీడు వెళ్లడు
మనసులేని దేవుడు... మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం: 2
ప్రేమనేది ఉన్నదా.. అది మానవులకే ఉన్నదా ?
ప్రేమనేది ఉన్నదా ?..  అది మానవులకే ఉన్నదా ?
హృదయముంటే తప్పదా.. అది బ్రతుకు కన్నా గొప్పదా..
అది బ్రతుకు కన్నా గొప్పదా......
మనసులేని దేవుడు ... మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం: 3
ఏమిటో ఈ ప్రేమ తత్వం ?...  ఎక్కడుందో మానవత్వం
ఏమిటో ఈ ప్రేమ తత్వం?... ఎక్కడుందో మానవత్వం
ఏది సత్యం.. ఏది నిత్యం..  ఏది సత్యం.. ఏది నిత్యం
చివరికంతా శూన్యం.. శూన్యం..
చివరికంతా శూన్యం.. శూన్యం....

మనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే... కనులకెందుకో నీరిచ్చాడు
కనులకెందుకో నీరిచ్చాడు ... కనులకెందుకో నీరిచ్చాడు


******  ******  ******


చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం:  సినారె
గానం:  రామకృష్ణ, సుశీల

పల్లవి:
మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ.. వేళ యిది....  ఆ.. వేళ యిది

చరణం: 1
లలలల ....లల లాలల... లలలల ....లల లాలల
లలలల ....లల లాలల.. లలలల ....లల లాలల

తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి

సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది...
పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి

నీలాల నీ కళ్ళలో...  నీ రూపమే వున్నది
నీలాల నీ కళ్ళలో...  నీ రూపమే వున్నది
ఆశలే .. పెంచుకో ... మోజులే ... పంచుకో

మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది... పువ్వై విరిసే వేళ యిది

చరణం: 2
ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో.. ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం
ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో... ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం

నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
మన జంట చూసి ఈ లోకమంత పులకించి పోవులే

నిండైన మన ప్రేమలు నిలిచేను కలకాలము
తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో

మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ... వేళ యిది ఆ... వేళ యిది...  పువ్వై విరిసే వేళ యిది


******  ******  ******


చిత్రం: ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం:  సినారె
గానం:  రామకృష్ణ, సుశీల

పల్లవి:
చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు... పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

హే.. ఓహో.. అహహా.. హా.. అ..
ఆహా.. హా.. ఆ.. ఒహోహో.. ఓ..

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

చరణం: 1
పొంగే కెరటం.. తీరం కోసం.. పరుగులు తీస్తుంది..ఈ..
పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. దారులు కాస్తుంది
పొంగే కెరటం తీరం కోసం.. పరుగులు తీస్తుంది..ఈ..
పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. దారులు కాస్తుంది

అందమంతా.. జంట కోసం...
అందమంతా జంట కోసం.. ఆరాట పడుతుంది..ఈ..
ఆరాట పడుతుంది

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

చరణం: 2
తుంటరి పెదవి.. జంటను కోరి.. తొందర చేస్తుంది..ఈ..
దాచిన తేనెలు దోచే దాక.. ఓపనంటుంది
తుంటరి పెదవి.. జంటను కోరి.. తొందర చేస్తుంది..ఈ..
దాచిన తేనెలు దోచే దాక.. ఓపనంటుంది

రోజు రోజు.. కొత్త మోజు..
రోజు రోజు.. కొత్త మోజు.. రుచులేవో ఇస్తుంది..ఈ..
రుచులేవో ఇస్తుంది..

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది..ఈ..
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి ఔతుంది..

హే.. ఏహే.. ఒహోహో.. ఓ..
ఆ.. ఆహహా.. హాహహా.. ఆహహా.. హాహహా..


******  ******  ******


చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ

నేనని వేరే లేనేలేనని...
నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ
మీకెలా తెలిపేదీ..

చరణం: 1
నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో
నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో
నిదురేరాని కనులను కమ్మని.. కలలతో నింపిన కరుణవు నీవో

పూజకు తెచ్చిన పూవును నేను ఊ... ఊ... ఊ...
పూజకు తెచ్చిన పూవును నేను.. సేవకు వచ్చిన చెలిమిని నేను
వసివాడే ఆ పసిపాపలకై..
వసివాడే ఆ పసిపాపలకై.. దేవుడు పంపిన దాసిని నేను

నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ.. మీకెలా తెలిపేదీ..
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ

చరణం: 2
చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు..
చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు

వడగాడ్పులలో వడలిన తీగకు..చిగురులు తొడిగిన చినుకే మీరు
చిగురులు తొడిగిన చినుకే మీరు...

కోరిక లేక కోవెలలోన.. వెలుగై కరిగే దీపం నీవు
దీపంలోని తాపం తెలిసి..
దీపంలోని తాపం తెలిసి.. ధన్యను చేసే దైవం మీరు
దైవం మీరు..
అహా హా అహా హా.. ఓహోహో ఓహోహో..
ఊహూహూ ఊహూహూ..Palli Balakrishna
Vamsodharakudu (1972)చిత్రం: వంశోద్దారకుడు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల
నటీనటులు: శోభన్ బాబు, యస్. వి.రంగారావు, కాంచన
దర్శకత్వం: పి.సాంబశివరావు
నిర్మాత: ఎ. ఎస్.ఆర్. ఆంజనేయులు
విడుదల తేది: 21.04.1972

పల్లవి:
గుమ్మా గుమ్మన్నల్లారా
గుమ్మాన్న లారో నారాస గుమ్మాడి

చరణం: 1
నల్ల నల్లనివాడు
సల్లంగ వచ్చినాడు
కొకల్లు కొల్లగొట్టి
కొమ్మెక్కి కుకున్నాడు
సిగ్గిడిసి చీరకోసం
చేతులెత్తి దండమెడితే
వంగి వంగి సుశినాడు వగలమారి గుమ్మడు

చరణం: 2
తెల్లారే చల్ల చిలికి
తీస్తున్నా ఎన్నముద్ద
ఎనకన్నే వచ్చి వచ్చి
ముందున్న ముంతపట్టి
ముద్దంతా తిన్నాడు
నా మూతికింత రాశాడు
అంతా నేనే తిన్నానని
మా అత్తతో చెబుతానన్నాడు

చరణం: 3
కంటికి కాటుకెట్టి
గంపా నెత్తిన పెట్టి
చల్లమ్మ చల్లోయంటూ
ఈదంట వెళుతుంటే
ఎదురొచ్చి చల్ల చూస్తా
దింపు దింపు గంపంటే
నీ తిక్కా గిక్కా దింపేసి
గంపేకెత్తుతానన్నాను
Palli Balakrishna
Sankalpam (1957)చిత్రం: సంకల్పం (1957)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: అనిశెట్టి
గానం: పిఠాపురం
నటీనటులు: యన్.టి.రామారావు, కుసుమ
దర్శకత్వం: సి.వి.రంగనాథ దాస్
నిర్మాత: సి.వి.రంగనాథ దాస్
విడుదల తేది: 16.5.1957

ఆలికి మగడే వశమయ్యే
ఆమోఘమైన మంత్రమిదే
ఆచరించిన ఆడువారికి
కన్నుల పండుగ సంసారం
కలుగును చక్కని సంతానం
ఈ వినయాలు సేవలు పూజలు
ఈ మగవారికి నచ్చకపోతే
అత్తరు పౌడర్ స్నోలు సోపులు
మత్తులో పడవేయాలి

వయ్యారపు సయ్యటలలోన
వళ్ళే జిగేలనిపించాలి
షోకులు జోకులు నాజుకులలో
కళ్లే జిగేలనిపించాలి
తళుకు బెళుకూ సిగ్గుల మెలుకూ
చూపిన గుమ్మయిపోదురులే

మగువలు ఫ్యాషన్ నేర్చిన నాడు
మగవారంతా బానిసలే
భర్తను కొంగును ముడివేసే
సూత్రమిదేనని తెలియండి

గాజుల మోజుల పడని మగాడు
ఈ కాలంలో లేరండి
పూర్వపు ఋషులే బోల్తాపడిరే
ఈ పురుషులు ఒక లెక్కా పక్కా
మన పురుషులు ఒక లెక్కా పక్కా


Palli Balakrishna
Jarigina Katha (1969)చిత్రం: జరిగినకథ (1969)
సంగీతం: గంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: గంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , నాగయ్య, కాంచన , జయలలిత, బేబీ రోజారమణి
దర్శకత్వం: కె.బాబురావు
నిర్మాత: కె.ఎ. ప్రభాకర్
విడుదల తేది:  04.07.1969

లవ్ లవ్ లవ్ మీ నిరజాన
నౌ నౌ కిస్ మీ చినదాన
సుఖములు సొగసులు అందించే ఖజానా

లవ్ లవ్ లవ్ మీ మోనగాడ
నౌ నౌ కిస్ మీ చిన్నోడా
సుఖములు సొగసులు నీవేరా రారాజా

కమాన్ నా ఆశ రమ్మంటే
గెటప్ నీ వలపు లెమ్మంది
మగసిరితో మక్కువతో మనసారా నను లాలించు

ఓహో రంగేళి నీవైతే
ఓహో రంగేళి నీవైతే
భలే కిలాడి  నేనేలే
నీ పొగరు నానెవారు
నేడే ఉదయం ఊగించుPalli Balakrishna
Oorantha Sankranthi (1983)చిత్రం: ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి.బాలు, జానకి, సుశీల
నటీనటులు: కృష్ణ , నాగేశ్వరరావు, జయసుధ శ్రీదేవి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: కొడాలి బోసు బాబు, కోటగిరి గోపాలరావు
విడుదల తేది: 12.02.1983

సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

సంబరాలా సంకురాత్రి..ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

తన తనెతాన తానాన తానా
తన తననాన తానె తానా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ

అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి... గంధాలు పూసేను

అ రె రె రె రె...
లోగిళ్ళలోన సిగ్గులన్ని వెల్లలేసే.. ప్రేమ రంగులేసే
కన్నెపిల్లలో సోకు పండిందనీ
కాపు కావాలనీ... తోడురావాలనీ..హోయ్

అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
గారాలే ముడులువేసి... గంధాలు పూసేను
ఆ ఆ ఆ ఆ ఆ..

అల్లీ అల్లని పందిట్లో... అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో... ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే... మ్రోగాలనీ

హోయ్... సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

ఓఓ ఓహో... తానా తానా తానా తానా తానా ఆ తాననా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను.. హా

కళ్ళల్లోని ఆశలన్ని కొండా కొచ్చే... ముడుపులిచ్చీ
గుండెచాటు కలలన్ని తీరాలనీ...
వలపు సాగాలనీ... రేవు చేరాలనీ

హోయ్..వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను

ఆహా హా..నవ్వీ నవ్వని నవ్వుల్లో..
తెలిసీ తెలియని పరవళ్ళు
కలసీ కలవని కళ్ళల్లో... తీరీ తీరని ఆకళ్లు
తీరే రోజు రేపో మాపో రావాలనీ..హోయ్

సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా


Palli Balakrishna
Ammayi Pelli (1974)


చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: త్యాగరాజ - కృతి
గానం: భానుమతి రామకృష్ణ
నటీనటులు: యన్.టి.రామారావు, చంద్రమోహన్, శ్రీకాంత్, భానుమతి రామకృష్ణ, లత సేతుపతి
నిర్మాత , దర్శకత్వం: భానుమతి రామకృష్ణ
విడుదల తేది: 07.03.1974


చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  దాశరథి
గానం: ఎస్.పి. బాలు, జానకి

పల్లవి:
పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి?
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది?..ఈ..ఈ..

నెలరాజులోనా...వలరాజులోన నీ...వలపెక్కడిది?
నెలరాజులోన నీ చలువెక్కడిది?
వలరాజులోన నీ వలపెక్కడిది?...ఈ..ఈ..

పాలరాతి బొమ్మకు...పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..

చరణం: 1
కలువపూలు తెల్లవారితే...కమిలిపోవును...
నీ కనులైతే కలకాలం వెలుగుచిందును....
కలువపూలు తెల్లవారితే...కమిలిపోవును...
నీ కనులైతే కలకాలం వెలుగుచిందును....

ఆ..ఆ..మధువు తీపి అంతలోనే...మాసిపోవును...
నీ పలుకు తీపి బ్రతుకంతా నిలిచియుండును....

పాలరాతి బొమ్మకు.. వగలెక్కడివి
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..ఈ..
నెలరాజులోనా... వలరాజులోన.. నీ వలపెక్కడిది....

చరణం: 2
నీలినీలి మేఘాలు గాలికి చెదిరేను నీ...
కురుల నీడ ఎల్లప్పుడు...నాకే దక్కేను...
నీలినీలి మేఘాలు గాలికి చెదిరేను...
కురుల నీడ ఎల్లప్పుడు...నాకే దక్కేను...


ఆ..ఆ..గలగలమని సెలయేరు కదలిపోవునూ...
కానీ...నీలోని అనురాగం నిలిచి ఉండును....


పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి..
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..ఈ..
నెలరాజులోనా...వలరాజులోన.. నీ వలపెక్కడిది....

నెలరాజులోన నీ చలువెక్కడిది...
వలరాజులోన నీ వలపెక్కడిది...ఈ..ఈ..
పాలరాతి బొమ్మకు...పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..ఈ..


Palli Balakrishna
Eenati Bandham Yenatido (1977)చిత్రం: ఈనాటిబంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఎం. బాలయ్య
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాతలు: ఆలపాటి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు
విడుదల తేది: 02.06.1977

పల్లవి:
శిలనొక్క ప్రతిమగా...మలచింది నీవే...
ఆ ప్రతిమనీ.. దైవముగా...కొలిచింది నీవే...
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం....

మదినొక్క గుడివోలే...మలచింది నీవే...
ఆ గుడిలోనే కరుణతో...వెలసింది నీవే....

నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా... జాబిల్లి అనుబంధం....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...

చరణం: 1
నీ చెంతగ ఎన్నాళ్ళున్నా...నిన్ను చేరుకోలేదు...
ఎదుట ఉన్న పారిజాతం ..ఎదను చేర్చుకోలేదు...

అపరంజి కోవెల ఉన్నా..అలరారు దైవం ఉన్నా...
ఆ గుడితలుపులు ఈనాడే తెరచుకున్నాయి...లోనికి పిలుచుకున్నాయి....

నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...

చరణం: 2
కడలి నిండ నీరున్నా..కదలలేని నావను నేను..
అడగాలని మదిలో ఉన్నా.. పెదవి కదపలేకున్నాను..
నావకు తెరచాపనై...నడిపే చిరుగాలినై...
కలలో.. ఇలలో ..నీ కోసం పలవరించేనూ...నీలో కలిసిపోయేనూ...

నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం....ఉమ్మ్...ఉమ్మ్..
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...


******  ******  ******


చిత్రం: ఈనాటిబంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: సుశీల

పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు ...ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..

చరణం: 1
కొలువైతివా దేవి నాకోసము...కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ....తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు... ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...

చరణం: 2
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు...
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల....
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....

ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్...ఉమ్మ్....ఉమ్మ్...ఉమ్మ్


*******   *******  *******


చిత్రం: ఈనాటిబంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఎం. బాలయ్య
గానం: సుశీల

పల్లవి:
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా.. చిరుగాలికా..
ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం: 1
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నన్నే తలచి మదిలో వలచి
నన్నే తలచి మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ...
కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం: 2
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
పొందు కోరి పొంచిన పరువం
పొందు కోరి పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ..
ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా చిరుగాలికా
ఉరకలు వేసే నీటికా సెలయేటికా..
లాల లలల లలాలల
లాల లలల లలాలల

Palli Balakrishna
Maa Daivam (1976)చిత్రం: మా దైవం (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు
నటీనటులు: యన్.టి.ఆర్, జయచిత్ర
స్క్రీన్ ప్లే: డి.వి.నారా రాజు
దర్శకత్వం: ఎస్. ఎస్.బాలన్
నిర్మాత: మణియన్ విద్యాస్ లక్ష్మణ్
విడుదల తేది: 17.09.1976

పల్లవి:
కాలాత్మా సర్వభూతాత్మా!
వేదాత్మా విశ్వతో ముఖ: !!
దీనబంధూ దయాసింధో !
దివ్యాత్మా నమో నమ: !!

ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే
అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి

ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే
అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి

ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే

చరణం: 1
భగవంతుని ప్రతిరూపం కరుణయందురు.. ఆ కరుణతో భగవంతుని చూడమందురు
భగవంతుని ప్రతిరూపం కరుణయందురు.. ఆ కరుణతో భగవంతుని చూడమందురు

కరుణయే మనిషికి దేవుని వరము..
అది పరులయెడల చూపినపుడే బ్రతుకు ధన్యము
ఒకే కులం...  ఒకే మతం....  అందరు ఒకటే

చరణం: 2
పాపాలకు వేనవేలు దారులున్నవి.. ధర్మగోపురాని కొక్కటే ద్వారమున్నది
పాపాలకు వేనవేలు దారులున్నవి.. ధర్మగోపురాని కొక్కటే ద్వారమున్నది

నీతియే ఊపిరిగా నిలపాలి.. న్యాయమే బాటగా సాగాలి

ఒకే కులం...  ఒకే మతం...  అందరు ఒకటే

చరణం: 3
చెడుపనులు చేయకు.. చెడును చూడకు.. చెడుమాటలు.. నీ నోటను మాటలాడకు
చెడుపనులు చేయకు.. చెడును చూడకు.. చెడుమాటలు.. నీ నోటను మాటలాడకు

పగయే నీ శత్రువనే నిజము తెలుసుకో..
ప్రేమతో పగను గెలిచి బ్రతుకు దిద్దుకో... మన బాపూజీ మాట నిలుపుకో

ఒకే కులం.. ఒకే మతం.. అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే
అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి

Palli Balakrishna
Kannayya Kittayya (1993)చిత్రం: కన్నయ్య కిట్టయ్య (1993)
సంగీతం: వంశీ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, శోభన, ఆమని
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: గంగుల ఇందిర
విడుదల తేది: 1993

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమా

ఏమీ విరహ గోల ఆగవా
అబ్బ ఏంటీ ప్రణయ లీల ఆపవా
వద్దు చిన్ని కన్న హద్దు దాటకన్నా
నీపై ప్రేమ వెన్న నాలో నిండు సున్న

కృష్ణా నీకు ఇది న్యాయమా
ముద్దు కృష్ణా నీకు ఇది న్యాయమా
సత్యభామను వీడి రుక్మిణి చెలిని వీడి
మాయాలాడిని కూడు మమ్మే మరిచిపోవ
కృష్ణా నీకు ఇది న్యాయమా

ఆపండీ పితలాటకం మీ ఆటా పాటా బూటకం
విశాఖపట్నం కేసనీ తెలిసిందమ్మో ఆల్రెడీ
ఇద్దరు కలిసి పైబడీ చెయ్యొద్దు శీలం దోపిడీ

బుంగమూతిలో దాగె బృందావనం
పెదవుల మాటున దాగె మధురానగరం
ఈ కోమలాంగి కోపమంతా పైపైనే
ఈ శోభనాంగి ఆరాధన నాపైనే

ఆరాధనా ఆలాపనా గోంగూరా
పోజు ఆపరా పొగడబోకురా పోపోరా
నీ విరహ గోలా ఈ మదన జ్వాలా
అంటించకు నాకూ సారీ సారీ ఆపు
ప్రేమించమంటూ పేట్రేగి పోకు
షంటేయకూ నన్నూ సారీ సారీ స్టాపు

ఇంత మాయ చేస్తావా ఓ ప్రాణనాథా
మాకేల నీవలన సంసార బాధా
ద్వారకను వదిలేసి సత్యా రుక్మిణిని
భువికి చేరి కలిసావా ఆ టక్కులాడినీ

అమ్మో బాబో నాకేం తెలీదూ
కుయ్యో మొర్రో ఇది ఏం వెర్రో
ఓ గుమ్మలారా వెంకమ్మలారా
మీ మొగుణ్ణి కానే నేను
నాకింకా పెళ్ళే కాలేదు
వెళ్ళండి తల్లీ వెళ్ళండీ
కోటి దండాలే మీకూ

ముద్దులోన పలికించు మురళీరవం
అమృతం చిలికించు ఆలింగనం
ఈ సుందరాంగి పొందులోని శృంగారం
రతి మదన సామ్రాజ్య పట్టాభిషేకం

నీకోతలూ లాలింపులూ చాలించేయ్
బుజ్జగింపులూ బ్రతిమిలాటలూ మానేసేయ్
నీ చెక్కభజనా ఈ మాయనటనా
నమ్మేందుకు ఇపుడూ ఎవరూ లేరు గురువా
నీ బుట్టలోనా నే పడనులేరా
ఓ చిట్టికన్నా వస్తా ఇకపై శలవా

సుఖపెట్టలేదా నిను ఓ సుందరాంగా
మొహం మొత్తెనా నీకు ఓ మోహనాంగా
పదహారు వేల మంది పసలేని వారమా
ఈ సవితి బాధేల ఓ కోమలాంగా

రంగా లింగా ఒకటే బెంగా
ఏంటీ మాయా యమ ఘోరంగా
లవ్ సెంటిమెంటు ప్లేచేయవద్దు
ఇక చికాకు తెప్పించద్దు
దయచేయండి ఛీపొండి
వచ్చిందపుడే క్లైమాక్స్
తప్పదు మీకు పేథాసు..

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమాPalli Balakrishna

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0