Search Box

Mister Pellam (1993)చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, ఆమని
దర్శకత్వం: బాపు
నిర్మాత: గవర పార్థసారథి
విడుదల తేది: 05.09.1993

సొగసు చూడ తరమా
హా హా హా హా
సొగసు చూడ తరమా
హ హ హ హ
నీ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు
ఎర్రన్ని కొపాలు ఎన్నెన్నో దీపాలు
అందమే సుమా
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

అరుగు మీద నిలబడి
నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వెన్నకు
బేజారుగ వంగినప్పుడు
చిరు కోపం చీర గట్టి
సిగ్గును చెంగున దాచి
ఫక్కుమన్న చక్కదనం
పరుగో పరుగెట్టినప్పుడు

ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

పెట్టీ పెట్టని ముద్దులు
ఇట్టే విదిలించి కొట్టి
గుమ్మెత్తే సోయగాల
గుమ్మాలను దాటు వేళ
చెంగు పట్టి రా రమ్మని
చలగాటకు దిగుతుంటే
తడి వారిన కన్నులతో
విడు విడు మంటున్నప్పుడు
విడు విడు మంటున్నప్పుడు

ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

పసిపాపకు పాలిస్తూ
పరవశించి వున్నప్పుడూ
పెద పాపడు పాకివచ్చి
మరి నాకో అన్నప్పుడు
మొట్టి కాయ వేసి
ఛీ పొండి అన్నప్పుడు
నా ఏడుపూ హహహ
హహహ నీ నవ్వులూ
హరివిల్లై వెలిసి నప్పుడు
ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

సిరి మల్లెలు హరి నీలపు
జడలో తురిమీ
క్షణమే యుగమై వేచీ వేచీ
చలి పొంగులు తొలి కోకల
ముడిలో అదిమీ
మనసే సొలసీ కన్నులు వాచి
నిట్టూర్పులా నిశి రాత్రి తో
నిదరోవు అందాలతో
త్యగరాజ కృతిలో
సీతాకృతి గల ఇటువంటీ

సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా*********  *********   ********


చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో
అలా అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో
అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో

చరణం: 1
పదునాలుగు భువనాలన్నీ పలిస్తున్నాను పరిపాలిస్తున్నాను
ఆ భువనాలను దివనాలను నేను పోషిస్తున్నాను నేనే పోషిస్తున్నాను
సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి
నేను అలిగి వెళ్ళానా తనకు లేదు టికానా
ఓహో ఏడు కొండలవాడి కథా తల్లీ నువు చెప్పేది బాగుందమ్మా కానీ కానీ
పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు
నాతో పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు
వడ్డీ కాసుల వాడా వెంకటరమణా గోవిందా గోవింద
కొండ మీద నేను మరి కొండ కింద ఎవరో ... నువ్వు అడగవయ్యా
నడిరేయి దాటగానే దిగి వచ్చేదెవరో దిగి వచ్చేదెవరో
అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో

చరణం: 2
త్రేతాయుగమున నేను ఆ శ్రీరామచంద్రుడిని
ఐనా సీతాపతి అనే పిలిచారండి మిమ్ము పిలిచారండి
నరకాసుర వధ చేసిన కృష్ణుడిని తెలుసా
సత్యభామని విల్లంబులు తెల్లంబుగ పట్టిన సత్యభామని వీరభామని
భామగారి నోరు భలే జోరు జోరు మొగుడిని దానమిచ్చినారు మొగసాలకెక్కినారు
ఆ తులాభారం అదో తలభారం ... భలే మంచి చౌక బేరము
సవతి చెంత కాళ్ళ బేరము
అయ్యా దొరగారి పరువు తులసీ దళం బరువు
సత్యం సత్యం పునః సత్యం
శ్రీ మద్ రమా రమణ గోవిందో హరిః*******   *******   *******


చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
mummy పోయి daddy వచ్చే ఢాం ఢాం ఢాం
పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఇదే కొత్త kingdom ఢాం

చరణం: 1
అంట్లు తోమే ఆడది gents కు లోకువ చూడు
గాజులు తొడిగే శ్రీమతి పోజులు చెల్లవు నేడు
butler పని నే చేసినా hitler నేనని తెలుసా
ఆలుమగల యాత్రలో upper berth నే పరిచా
సమాన హక్కులంటే ఆ సమాధి లోపలంట
మగాడి నీడలోనే స్త్రీలకి ఉగాది ఉన్నదంట
భీముడల్లె వంట ఇంట కాముడల్లె పడకటింట
ఆడవాళ్లనేలుకొని కోడెగాడు ఎందుకంట ఢాం ఢాం ఢాం

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
mummy పోయి dummy వచ్చే ఢాం ఢాం ఢాం
ఏయ్ mummy పోయి daddy వచ్చే ఢాం ఢాం ఢాం
పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఇదే కొత్త kingdom ఢాం*********   *********  *********


చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి

చరణం: 1
నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే
నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే
నెలతప్పిన నెలత తనకు పరువన్నాడే
నేడు నెలబాలుని చేతికిస్తే బరువన్నాడే
ముంగురులను చూసి నాడు మురిసిపోయాడే
ఆ కురులకు విరులివ్వడమే మరిచిపోయాడే
ప్రేమించు season లో పెద్ద మాటలు పెళ్ళయ్యాక plate ఫిరాయింపులు
మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు
మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి

చరణం: 2
మాటల్తో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నాడే
కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే
వాలు తాకితే మోమున కాలు విరుగునన్నాడే
కవ్వించుకున్నాడే కౌగిలి కోసం ఆ కాస్తా తీరాకా మొదటికే మోసం
మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు

మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి

తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టే
సతి మదిలో నన్నెలగిడు పురుషుడు కలుగుట
తొలి జన్మము నోమభయము తోయజనేత్రా
తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు
వ్రతములు సలిపిన సతులకు గతి కలదా ఇలలో కలదో లేదో

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0