Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Roja (1992)





చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: అరవింద్ స్వామి, మధుబాల
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: కె.బాలచందర్
విడుదల తేది: 15.08.1992



Songs List:



చిన్ని చిన్ని ఆశ పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మిన్మిని

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకును అశా

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశా
జాబిలిని తాకి ముద్దులిడ అశా
వెన్నెలకు తోడై ఆడుకును ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

పూవ్వులా నేనే నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేకా చిందులేయ్యాలీ
వేడుకలలోనా తేలిపోవాలీ
తూరుపూ రేఖా వెలుగు కావాలీ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకును ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

చేనులో నేనే పైరు కావాలి
కొలనులో నేనే అలను కావాలి
నింగి హరివిళ్ళూ వంచి చూడాలీ
మంచుతెరలోనే నిదురపోవాలీ
చైత్ర మాసం లో చినుకు కావాలీ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశా
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకును ఆశ
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ





నాగమణి నాగమణి పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: చిత్ర

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు 
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు 

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు 
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు 
హత్తుకున్న ఆడ మగ మొత్తుకునే ముద్దు సద్దు 
వూగుతున్న పట్టె మంచం ఊసులడు కిర్రు సద్దు 
కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు 

చరణం: 1 
చీర చెంగు మాటున పాల పొంగు సుడులు 
అందగాడి చూపులో అంతులేని ఊహలు 
ముద్దులేసే ముద్దర జారుకుంది నిద్దర 
గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే 
ఒళ్ళే తూలేనులే అహ కళ్ళే సోలేనులే 
ఆశే పక్కేసేనే అహ సిగ్గే సిందేసెనే 

నాగమణి నాగమణి....

చరణం: 2 
కట్టుకున్న వాడే సిటికనేలు పట్టే 
వేలు పట్టగానే వేడి సద్దు చేసే 
కమ్మనైన రాతిరంత మోజు మొగ్గలేసే 
కన్నెపిల్ల గాజులన్ని సందడేమో చేసే 
కోకే కేకేసేనే అహ రైకె రంకేసేనే 
తూలే నీ కళ్ళలో అహ స్వర్గం కనిపించెనే 

నాగమణి నాగమణి.......




నా చెలి రోజావే పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, సుజాత

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంట
నీవు లేకపోతే బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు

చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు




పరువం వానగా పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, సుజాత

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివే నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివీ నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే



వినరా వినరా పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మనో

వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా
వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా
నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పినా
నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా

వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా

తరం మారిన గుణమొక్కటే
స్వరం మారిన నీతొక్కటే
మతం మారిన పలుకొక్కటే
విల్లు మారిన గురి ఒక్కటే
దిశ మారిన వెలుగొక్కటే
లయ మారిన శ్రుతి ఒక్కటే
అరె ఇండియా అది ఒక్కటే లేరా

ఏలా ఏలా నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
ఏలా ఏలా నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా
ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా
ఏలా ఏలా నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా

నవభారతం మనదేనురా
ఇది సమతతో రుజువాయెరా
మన ప్రార్థమే విలువాయెరా
నీ జాతికై వెలిసిందిరా
ఉపఖండమై వెలిగిందిరా
నిశిరాలనే మరిపించెరా
ఈ మట్టియే మన కలిమిరా లేరా

Most Recent

Default