Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Madhu Bala"
Ganesh (1998)

చిత్రం: గణేష్ (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో , సుజాత
నటీనటులు: వెంకటేష్ , రంభ , మధుబాల
మాటలు (డైలాగ్స్): పరుచూరి బ్రదర్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తిరుపతి స్వామి
నిర్మాత: డి.సురేష్ బాబు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
సినిమాటోగ్రఫీ: కె.రవీంద్ర బాబు
విడుదల తేది: 19.06.1998

హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
చక్కరకన్నా స్వీటు చిల్లీ కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్
ఎండలకన్నా హాట్ వెన్నెలకన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేట్
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు

హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా

ప్రతీ ఊరిలో ప్రతీ బ్యాంక్ లో లబించేది క్యాష్
ప్రతీ జంటలో ప్రతీ బుగ్గలో చలించేది కిస్
సిరా పెన్నుతో భలే నీటుగా లభించేది పద్దు
చెర్రీ పెదవితో మరీ హాట్ గా రచించేది ముద్దు
కంటికే కలలే రాని జీవితం నిస్సారం
గంటకో ముద్దే లేని ప్రేమలే అనవసరం
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు

హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా

పదం మారినా రిథం మారినా పాట ఒక్కటేగా
కథే మారినా కలర్ మారినా ముద్దు ఒక్కటేగా
ప్రేమ పక్షులు ఇచ్చు పుచ్చుకొను ఆస్తి ముద్దులేగా
ప్రేమ యాత్రలకు కస్సు బస్సులకు మందు కిస్సులేగా
దేవతల యవ్వన సూత్రం కడలిలో యవ్వనమా
ప్రేమికుల నవ్వుకు మూలం ఘాఢమగు చుంబనము
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు

హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
చక్కరకన్నా స్వీటు చిల్లీ కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్
ఎండలకన్నా హాట్ వెన్నెలకన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేట్
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు


Palli Balakrishna Monday, March 19, 2018
Mr. Romeo (1996)

చిత్రం: Mr. రోమియో (1996)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత, సుజాత
నటీనటులు: ప్రభుదేవా, మధుబాల, శిల్పా శెట్టి
దర్శకత్వం: కె.యస్.రవి
నిర్మాత: ఎ. యమ్.రత్నం
విడుదల తేది: 10.11.1996

మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే
మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే
కన్ను కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలొ నీ వన్నె చిన్నెలే నన్ను దోచ్చుకున్నవి
కన్ను కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్ను దోచ్చుకున్నవి

మద్దెలదరువు వొడిలోన పలికినది
సొగసమ్మ నవ్వినది యెదేవో అడిగినది
ముద్దుల గొడవై కౌగిళ్ళరేగినది తొలి తపన మోజు ఇదే కోరికై కొసరినది
తీయెగ మారే స్నేహం తేనెల పాటై నేనె నువ్వై
యెదలో నీ కదిలింది నీ దీపం చెదరంది ఈ బంధం

మన్మధలీలే మదిలోన విరిసినదీ మగతోడు వెతికింది పైటంచు పరచినది
ఆశలు తీరే ఏకాంత వెళ ఇది ఈ కాంత పిలిచినది హ్రుదయాలు కలిపినది
ఈ అనురాగం ప్రాణం నాకు ప్రాణం జీవితాంతం
మధుబాలా మన్ను మిన్ను ఒకటైన చెదిరేదిగాదీ స్వప్నం

Palli Balakrishna Saturday, September 23, 2017
Aavesham (1994)



చిత్రం : ఆవేశం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
నటీనటులు: రాజశేఖర్, నగ్మా , మధుబాల
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యన్.రామలింగేస్వరరావు
విడుదల తేది: 01.01.1994



Songs List:



ముద్దొయమ్మ ముద్దు పాట సాహిత్యం

 
చిత్రం : ఆవేశం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
సాహిత్యం:  వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు 
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు
సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు
తొలకరి తేనెల తియ్యని విందులు
హాయ్... హాయ్... హాయ్...హాయ్

ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు 
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు

చరణం: 1
చక్కిలిగిలిగా ఓ ముద్దు
చక్కర చిలికె ఓ ముద్దు
చెక్కిలమ్మకు చెంపలో ముద్దు ఓయ్
మద్దెల మోత ఓ ముద్దు
నిద్దర చంపే ఓ ముద్దు
రేతిరమ్మకు జాబిల్లే ముద్దు
వన్నె చిన్నె దిద్దు వలంగి పిట్ట ముద్దు
ఓలమ్మో ఎంత గోడవో 
లేత సందే పొద్దు జారేటి పైట సర్దు
ఓయబ్బో ఏమి దరువో
మనుగడలో మరు మల్లెల మీగడ
హాయ్...హాయ్...హాయ్...హాయ్

ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు 
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు

చరణం: 2
ప్రేమకు లిపిగా ఓ ముద్దు
పెదవుల తడిగా ఓ ముద్దు
నచ్చినమ్మకు నవ్వే నా ముద్దు ఓయ్
ఊపిరి ఉలిగా ఓ ముద్దు
చూపుల చలిగా ఓ ముద్దు
పూలకొమ్మకు పూవ్వంటే ముద్దు
వాలే కన్నుగొట్టి కన్నుల్లో కాట్టుకెట్టే
చీకట్లో ఎంత చొరవో
మల్లె ఇల్లు వేసి వెన్నెల్లో వెన్న తీసె
పైటేస్తే ఎంత పరువో 
మణువులకే ఇది మన్మధ పోకడ
హాయ్...హాయ్...హాయ్...హాయ్

ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు 
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు
సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు
తొలకరి తేనెల తియ్యని విందులు
హాయ్... హాయ్... హాయ్...హాయ్

ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు 
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు




అమ్మో వాన పాట సాహిత్యం

 
చిత్రం : ఆవేశం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
సాహిత్యం:  వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అమ్మో వాన 



లాలించే తల్లి పాట సాహిత్యం

 
చిత్రం : ఆవేశం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు

లాలించే తల్లి




లవ్ లవ్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం : ఆవేశం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
సాహిత్యం:  వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

లవ్ లవ్ లవ్ 



నిన్నేమడగను పాట సాహిత్యం

 
చిత్రం : ఆవేశం (1997 )
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, చిత్ర

నిన్నేమడగను ఎట్టా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఎట్టా చెప్పను
తెరచాటు తరిఫీదు కానిమ్మని
అయితే పోరి చూపై రాదారి
పడతా  ప్యారి పని   
కానీ చోరి కసిగా ఓ సారి నీదే చిన్నారి
అమ్మడు బీ రెడీ తట్టుకో తాకిడి
చీకటింటి చిలిపి గారడీ

నిన్నేమడగను ఎట్టా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఎట్టా చెప్పను
తెరచాటు తరిఫీదు కానిమ్మని

చరణం: 1
పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి
పరవలేదన్నారు పెద్దవాళ్లు

కోరస్: ఎస్ బాసు కిస్ బాసు

సావిట్లో ఒకసారి సందిట్లో ఒకసారి
చలికాగాలన్నారు చిన్నవాళ్లు

కోరస్: ఎస్ బేబీ కిస్ బేబీ

కొక్కోరో బంగారు కోడి
ముద్దెడితే ముదిరింది వేడి 
పిల్లగో చూసా నీ నాడీ అదిరింది కన్నె బాడీ
గుట్టుగా దోపిడీ చెయ్యనా గుమ్మడి
తాళలేను తీపిరాపిడి ఓయ్ ఓయ్ 

నిన్నేమడగను ఎట్టా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఎట్టా చెప్పను
తెరచాటు తరిఫీదు కానిమ్మని

చరణం: 2
సరిగంగా స్నానలా సవరింపు యోగాలా
వేళాయెనన్నాది చందమామా

కోరస్: ఎస్ బేబీ కిస్ బేబీ

చప్పట్లు మడితాళం దుప్పట్ల తడిమేళం
పెట్టించమన్నాది కలువ భామా

కోరస్: ఎస్ బాసు వెయ్యు డోసు 

ఎక్కడో కుట్టింది చీమ ఉప్పెనలా ఉబికింది ప్రేమా
అక్కడే గుప్పిస్తా భామా పెదవులతో తేనె చుమ్మ
అమ్మని జిమ్మడా హత్తుకో పిల్లడా
అంటుతోంది పాల మిగడా

నిన్నేమడగను ఎట్ట ఎట్టా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఎట్ట ఎట్టా చెప్పను
తెరచాటు తరిఫీదు కానిమ్మని

Palli Balakrishna Monday, August 14, 2017
Roja (1992)




చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: అరవింద్ స్వామి, మధుబాల
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: కె.బాలచందర్
విడుదల తేది: 15.08.1992



Songs List:



చిన్ని చిన్ని ఆశ పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మిన్మిని

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకును అశా

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశా
జాబిలిని తాకి ముద్దులిడ అశా
వెన్నెలకు తోడై ఆడుకును ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

పూవ్వులా నేనే నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేకా చిందులేయ్యాలీ
వేడుకలలోనా తేలిపోవాలీ
తూరుపూ రేఖా వెలుగు కావాలీ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకును ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

చేనులో నేనే పైరు కావాలి
కొలనులో నేనే అలను కావాలి
నింగి హరివిళ్ళూ వంచి చూడాలీ
మంచుతెరలోనే నిదురపోవాలీ
చైత్ర మాసం లో చినుకు కావాలీ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశా
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకును ఆశ
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ





నాగమణి నాగమణి పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: చిత్ర

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు 
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు 

నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు 
ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు 
హత్తుకున్న ఆడ మగ మొత్తుకునే ముద్దు సద్దు 
వూగుతున్న పట్టె మంచం ఊసులడు కిర్రు సద్దు 
కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు 

చరణం: 1 
చీర చెంగు మాటున పాల పొంగు సుడులు 
అందగాడి చూపులో అంతులేని ఊహలు 
ముద్దులేసే ముద్దర జారుకుంది నిద్దర 
గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే 
ఒళ్ళే తూలేనులే అహ కళ్ళే సోలేనులే 
ఆశే పక్కేసేనే అహ సిగ్గే సిందేసెనే 

నాగమణి నాగమణి....

చరణం: 2 
కట్టుకున్న వాడే సిటికనేలు పట్టే 
వేలు పట్టగానే వేడి సద్దు చేసే 
కమ్మనైన రాతిరంత మోజు మొగ్గలేసే 
కన్నెపిల్ల గాజులన్ని సందడేమో చేసే 
కోకే కేకేసేనే అహ రైకె రంకేసేనే 
తూలే నీ కళ్ళలో అహ స్వర్గం కనిపించెనే 

నాగమణి నాగమణి.......




నా చెలి రోజావే పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, సుజాత

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంట
నీవు లేకపోతే బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు

చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు




పరువం వానగా పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, సుజాత

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివే నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివీ నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే



వినరా వినరా పాట సాహిత్యం

 
చిత్రం: రోజా (1992)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మనో

వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా
వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా
నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పినా
నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా

వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా

తరం మారిన గుణమొక్కటే
స్వరం మారిన నీతొక్కటే
మతం మారిన పలుకొక్కటే
విల్లు మారిన గురి ఒక్కటే
దిశ మారిన వెలుగొక్కటే
లయ మారిన శ్రుతి ఒక్కటే
అరె ఇండియా అది ఒక్కటే లేరా

ఏలా ఏలా నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
ఏలా ఏలా నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా
ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా
ఏలా ఏలా నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా

నవభారతం మనదేనురా
ఇది సమతతో రుజువాయెరా
మన ప్రార్థమే విలువాయెరా
నీ జాతికై వెలిసిందిరా
ఉపఖండమై వెలిగిందిరా
నిశిరాలనే మరిపించెరా
ఈ మట్టియే మన కలిమిరా లేరా

Palli Balakrishna Tuesday, August 1, 2017
Gentleman (1993)



చిత్రం: జెంటిల్‌మెన్ (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నటీనటులు: అర్జున్, మధుబాల
దర్శకత్వం: శంకర్
నిర్మాత: ఏ.యమ్.రత్నం
విడుదల తేది: 30.07.1993



Songs List:



కొంటెగాణ్ణి కట్టుకో పాట సాహిత్యం

 
చిత్రం: జెంటిల్‌మెన్ (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, జానకి

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో 
కోటి వన్నెలున్నదాన 
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో 
వాలు కళ్ళ పిల్లదాన 
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు 
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు 

చరణం: 1 
అందరిని దోచే దొంగ నేనేలే 
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే(2) 
చిన్నారి మైనా చిన్నదానా 
నే గాలం వేసానంటే పడి తీరాలెవరైనా 
బంగారమంటి సింగారం నీదే 
అందం సొంతమైతే లేనిదేదీ లేదే 

చరణం: 2 
కొనచూపుతోనే వేసావు బాణం 
రేపావు నాలో నిలువెల్లా దాహం 
కొరగాని వాడితో మనువు మధురం 
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం 
చిగురాకు పరువం చెలరేగే అందం 
నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట





చికుబుకు చికుబుకు రైలే పాట సాహిత్యం

 
చిత్రం: జెంటిల్‌మెన్ (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: సురేష్ పీటర్స్, జి.వి.ప్రకాష్ కుమార్

చికుబుకు చికుబుకు రైలే 
అదిరినది నీ స్టైలే 
చక్కనైన చిక్కనైన ఫిగరే 
ఇది ఓకే అంటే గుబులే 
దీని చూపుకు లేదు హే భాష 
కళ్ళలోనే ఉంది నిషా 
ఈ హొయలే చూస్తే జన ఘోష 
కొంగు తగిలితే కలుగును శోష 

చరణం: 1 
అహ సైకిలెక్కి మేమొస్తుంటే 
మీరు మోటర్ బైకులే చూస్తారు 
అహ మోటర్ బైకులో మేమొస్తే 
మీరు మారుతీలు వెతికేరు 
అహ జీన్స్ పాంట్సులో మేమొస్తే 
మేరు బాగి పాంట్సుకై చూస్తారు 
అహ బాగి పాంట్సుతో మేమొస్తే 
మీరు పంచలొంక చూస్తారు 
మీకు ఏమి కావాలో మాకు అర్ధం కాలేదే 
పూలబాణాలేసామే పిచ్చివాళ్లైపోయామే 

చరణం: 2 
మాకాటపాటలో అలుపొచ్చే 
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చె 
మా మతులు చెదిరి తల మెరుపొచ్చె 
రాదులే వయసు మళ్ళి 
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు 
రేపిచ్చుకోవాలి కట్నాలు 
అవి లేక జరగవు పెళ్ళిళ్ళు 
ఎందుకీ గోల మీకు 
మీరు ఇప్పుడే లవ్ చేస్తే 
మూడు ముళ్ళు పడనిస్తే 
కన్న వాళ్ళకి అది మేలు 
చిన్నవాళ్ళకు హ్యాపీలు 




నా ఇంటి ముందున్న పాట సాహిత్యం

 
చిత్రం: జెంటిల్‌మెన్ (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, సుజాత

నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే
నువ్వేనా ప్రాణమే

చరణం: 1 
నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట
మనసార చేరే వేళ మౌనాలే తగదంట
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట
వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట
ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనో
ఈడే సద్దు చెసెనో

నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో 
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే
నేనే నీ ప్రాణమే

చరణం: 2 
గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను
ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి
మ్ హుమ్ మ్ పరవశమే




మావేలే మావేలే పాట సాహిత్యం

 
చిత్రం: జెంటిల్‌మెన్ (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మినీ మినీ

మావేలే మావేలే పరువాలు మావేలే 
మీవేలే మీవేలే పంతాలు మీవేలే 
మజాలే మజాలే చెయ్యాలి మజాలే 
ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు 
అరె వా మావయ్య... 

చరణం: 1 
పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు 
చెప్పొద్దు చెప్పొద్దు ఆ మాటలు చెప్పొద్దు 
చిలకే ఎగిరొస్తే విదిలించి పోవొద్దు 
రావద్దు రావద్దు మళ్ళి మళ్ళి రావద్దు 
పూచే పూలన్నీ పూజలకే వాడద్దు 
పడుచుకి పూవందం మరిచిపోవద్దు 
లక్షలు అడిగేనా లగ్నం అడిగేనా 
ముహూర్తం పెట్టించు రేపో మాపో 

చరణం: 2 
పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు 
పెట్టొద్దు పెట్టొద్దు కొత్త రూలు పెట్టొద్దు 
కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దు 
పాడొద్దు పాడొద్దు హద్దు మీరి పడొద్దు 
చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే 
దొరికి దొరకనట్టు జారిపోవద్దు 
పగ్గం వెయ్యొద్దు పరువాలకికముందు 
అనుభవించాలి నేడే నేడే 



ముదినేపల్లి పాట సాహిత్యం

 
చిత్రం: జెంటిల్‌మెన్ (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గాడి శుభ

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
బుట్ట మీద బుట్టపెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లే నడిచావే
నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టుచేసి
నన్నీడ పిలిచేనే

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి
పల్లి పల్లి ముదినేపల్లి

కాటుక కళ్ల వాడల్లో
కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా
ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ని
చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట
మనసు ఉంటే చాలంటా
పగలు రేయి... నీతో ఉంటా
ఉన్నావంటే... అది తప్పంట
కలిసి వస్తే వెన్నెలమాసం
చెయ్యలి జాగారం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే
 
తమలపాకు తడిలోన
పండెనే నీ నోరంటా
నోటి పంట కాదంటా
పాడిపంట చూడంటా 
నాకు నువ్వే తోడుంటే
సంబరాలే నట్టింట
ఆశపడిన మావయ్యది
అందమైన మనసంట 
అందం చందం నీకే సొంతం
వెన్నోల్లోనే యేస్తా మంచం 
పైరగాలుల పందిరిలోన
కరిగిపోదాం మనం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే

Palli Balakrishna Saturday, July 29, 2017
Allari Priyudu (1993)




చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 19.03.1993



Songs List:



చెప్పకనే చెబుతున్నవి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే...చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటె
మోహపు తెరలిక తొలిగేనా హహా హహా
చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె
ఆశల అల్లరి అణిగేనా హహా హహా
పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా
ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే
చెప్పకనే... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా హహా హహా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడు మలుపులు తెలిసెననీ హహా హహా
తెల్లారనీకే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని



ఏం పిల్లది పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏం పిల్లది ఎంత మాటన్నది
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
బాగున్నది కోడె ఈడన్నది...
ఈడందుకే వీధి పాలైనది...
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది

మువ్వాకు మువ్వాకు మువ్వాకు మువ్వ మువ్వ మువ్వ మువ్వ మువ్వ మువ్వాకు
లవ్వాకు లవ్వాకు లవ్వాకు లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వాకు

శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది
ఇనుకోని ఆరాటం ఇబ్బంది ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
ఎదలోనే ఓ మంట పుడుతుంది పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది
చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది

ముద్దాకు ముద్దాకు ముద్దాకు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దాకు
సిగ్గాకు సిగ్గాకు సిగ్గాకు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గాకు

సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు
ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాల జంపాల కధలోనే ఉ కొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
మల్లి కావాలన్నా మనసు వున్నది

వామ్మో  ఏం పిల్లది ఎంత మాటన్నది...
బాగున్నది కోడె ఈడన్నది...
సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది




ప్రణయమా నీపేరేమిటి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్. పి. బాలు

ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం: 1
ప్రేమ కవితా గానమా నా ప్రాణమున్నది శ్రుతి లేక
గేయమే ఎద గాయమైనది వలపు చితిని రగిలించగా
తీగచాటున రాగమా ఈ దేహమున్నది జత లేక
దాహమారని స్నేహమై ఎద శిథిల శిశిరమై మారగా
ఓ హృదయమా... ఇది సాధ్యమా...
రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన
రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం: 2
ప్రేమసాగర మధనమే జరిగింది గుండెలో ఈవేళ
రాగమన్నది త్యాగమైనది చివరికెవరికీ అమృతం
తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ
అశ్రుధారలే అక్షరాలుగా అనువదించెనా జీవితం
ఓ ప్రాణమా... ఇది న్యాయమా...
రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా
రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా




అందమా నీ పేరేమిటి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధురా నగరమా కృష్ణా సాగర కెరటమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం: 1
ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
సంగీతమా... నీ నింగిలో...
విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా
తెలుపుమా నీ ఊరేమిటి పరువమా

చరణం: 2
భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా
ఓ కావ్యమా... నీ తోటలో...
నవరస పోషణె గాలిగా నవ్విన పూలే మాలగా
పూజకే సాధ్యమా తెలుపుమా

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా




ఉత్తరాల ఊర్వశి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెలా
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
గీత గోవిందుడు వీనుల విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాఘుమా ఘుమాలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ

చరణం: 1
పువ్వులెన్నో విచ్చినట్టుగా చెలీ నవ్వగానే నచ్చినావులే
చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చూసుకోరా పట్టి కౌగిలి
ఖవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసి
జగడమొకటి సాగిందోయమ్మో
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే మాలగా
దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసిన

ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెలా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ

చరణం: 2
సమ్ముఖాన రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా అదే అందగత్తె గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నో కవ్విస్తుంటే 
హృదయమొకటి పుట్టిందోయమ్మా
సరాగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటే 
పరువమొకటి వచ్చే వాంఛలా
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడి
జుంటి తేనెమత్తులోన కొంటె వేణువూదినా
గీత గోవిందుడు వీనుల విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాఘుమా ఘుమాలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ

ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెలా
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా



అహో ఒక మనసుకు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూస్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు
అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం: 1
మాటా పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది
కమ్మని తలుపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది...
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది
శ్రుతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది...
రుతువుల రంగులు మార్చేది
కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది
తనే కదా వారధి క్షణాలకే సారథి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం: 2
చూపులకెన్నడు దొరకనిది రంగూరూపూ లేని మది
రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది...
వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళ గల నిండుమది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది...
చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే
అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు



రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు పాటవు నువ్వా వా వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా

చరణం: 1
చక్కదనానికి చెక్కిలి గింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నే పువ్వా
వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వా పొద్దే నువ్వా
గుందె చాటు ప్రేమలెన్నో పోటు మీద చాటుతున్న రోజ పువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా...
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా

చరణం: 2
ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే
పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా
ఝానె నువ్వ జజి నువ్వ
గుప్పు మన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజ పువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా...
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు పాటవునువ్వా వావా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా

Palli Balakrishna Thursday, July 27, 2017
Chilakkottudu (1997)


చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ , మధుబాల, గౌతమి, కస్తూరి, ఇంద్రజ
దర్శకత్వం: ఇ. వి. వి. సత్యన్నారాయణ
నిర్మాత: యమ్.బాలాజీ నాగలింగం
విడుదల తేది: 1997

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
ఓ... ఓ ఓ ఓ ఓ ఓ...
మదిలో దాహాలు మధువే కోరేను
పెదవే అందించుమా

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
ఓ... ఓ ఓ ఓ ఓ ఓ...
మదిలో దాహాలు మధువే కోరేను
పెదవే అందించుమా

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా

చిటపట చినుకుగ చేరేదా
మిల మిల కుళుకులు మీటేదా
తడిసిన తళుకును తాకేదా
ఆపకే ఓ పై ఎద
తొలి తొలి తహా తహా చూపేదా
తెలియని తపనలు చెప్పేదా
నిలువున ముడిపడి పోయేదా
కమ్ముకుపో తుమ్మెద
మడి తాళం తీసేయ్ రాధా ఓ...
తడి తాళం వేసేయ్ రాదా ఓ...
హొయ్ తకతై సయ్యాట
అడిగే ఈ పూట ఒకటై పోదాం పద

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా

చిలిపిగ చిదిమెట నీ చూపు
కలగక కసిగల ఓ కైపు
ఎగబడి తడమకు కాసేపు
అబ్బా చాల్లేవయ్యా
బరువుగ పెరిగిన నీ రూపు
మగ జత ఎరగని ఆ షేపు
కరువుగ జరిగెను నా వైపు
ఆజా చెప్పేయమ్మో
అది మాటల్తో చెప్పాలా ఓ...
మరి మోమాటం చూపాలా ఓ...
ఎదుటే ఉన్నాను ఇదిగో అన్నాను
ఇంకేం కావాలయ్యో

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
ఓ... ఓ ఓ ఓ ఓ ఓ...
ఓ మదిలో దాహాలు మధువే కోరేను
పెదవే అందించుమా




**********   **********   ***********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

అందవే అందమా అంది అందాల
గంధాలు అందించు ఆనందమా
అంతలో ఆత్రమ ప్రేమ వల వేసి
ఒడి చేరి వలపించె ఉల్లాసమా
అందుకో పాట అందని పైట
ఆపవా ఆట అల్లరి వేట
అంచక్క ఇంచక్క ఎంచక్క
సయ్యాట సాగాలి రావే నా శ్వేత

అంతలో ఆత్రమ ప్రేమ వల వేసి
ఒడి చేరి వలపించె ఉల్లాసమా

కొంటె చూపు గుచ్చావంటే
ఇంటి మేకు సెంటై పోతా
కౌగిలించు కున్నావంటే
ఒంటి మీద షర్టైపోతా
షేపు చుస్తే వీపే కాదది ఐరోప
కిస్సు కొట్టకుంటే తప్పే ఓ పాపా
జట్టుకట్టి ఎట్టగొట్ట పట్టావయ్యో నా గుట్టు
పట్టినాక ప్రాణాలైన పెట్టేసేయ్నా తాకట్టు
మత్తుకమ్ముకున్నాదయ్యో
తస్సాదియ్య ఓ మైనరు

అందవే అందమా అంది అందాల
గంధాలు అందించు ఆనందమా

చెంత చేరి జల్సా రాయ
చెయ్యమాకు ఏదో మాయ
ఘాటు ప్రేమ పుట్టే వేళ
నాటు ముద్దె నందామయ్య
కొత్తగా ఉందోయబ్బా కోలాటం
కమ్మగా చూపించేయ్రో కైలాసం
ఏమి చాన్సు కొట్టారమ్మో
తస్సాదియ్య టైలర్స్
కళ్ళుతిరిగి పడ్డారేమో
తీసేవేళ కొలతల్స్
క్లోజు షాట్ తీశావంటే
క్లోజై పోనా ఓ దేవద

అందవే అందమా అంది అందాల
గంధాలు అందించు ఆనందమా
అంతలో ఆత్రమ ప్రేమ వల వేసి
ఒడి చేరి వలపించె ఉల్లాసమా
ఓ అందుకో పాట అందని పైట
ఆపవా ఆట అల్లరి వేట
అంచక్క ఇంచక్క ఎంచక్క
సయ్యాట సాగాలి రావే నా శ్వేత




*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో
వయసే దాచేసుకుంది దాహం
మనసే దోచేసుకుంది మొహం
సొగసే పంచేసుకుంది తాపం
తెలిసే పెంచేసుకుంది మైకం
సరసాల వేళాయెరో...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో

ప్రియతమ ప్రియ మధురమ
పలుకుమ చెలి పరువమ
అలా అలా మనం చేరువై ఒకే జంటగా
ప్రణయమ సుధా సారమ
పిలుపుతో ఎదే తెలుపుమ
పెదాలపై పదం రాసుకో మహా ముద్దుగ
చలి వేసి గిలి గిలి గిలి గిలి  గింతల్లో వింతల్లో
నిలువెల్ల చుర చుర చురకల చూపుల్లో కైపుల్లో
నీ చెంగు వెంటా నే చేరుకుంటా
నా ముద్దు పంట పండించుకుంట ట...
మెళికే లాగింది కన్నె భామ
మొలకే వేసింది కొత్త ప్రేమ
కమ్మేసుకో మోహామా...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో

నరవరా మహా చొరవరా
ఎదలలో ఏదో గొడవరా
చాలకిగ భలే పెత్తనం చలాయించుకో
మిళ మిళా మిణుక్ మెరుపులా
తళ తళా తళుక్ తారలా
గులాబిలా చెలి సొంపులే
ఘుమాయింపులే
మది నిండా మధురిమ రిమ రిమ ప్రేమల్లో ఊహల్లో
కదిలిస్తే తకదిమి దిమి దిమి వేగంలో తాళంలో
రమ్మంటే రానా నీదాన్ని కానా
రప్పించుకుంటా రంగేళి జాణ రావే రావే...
కడితే కౌగిల్లు కట్టుకోరా
పడితే పంతాలు పట్టు చాల
నీ హద్దు దాటేసుకో...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో
వయసే దాచేసుకుంది దాహం
మనసే దోచేసుకుంది మొహం
సొగసే పంచేసుకుంది తాపం
తెలిసే పెంచేసుకుంది మైకం
సరసాల వేళాయెరో...



*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా
పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా
కుర్ర కుమారం కూకుంటె నేరం
కుర్ర కుమారం కూకుంటె నేరం
తొంగుంటె ఎట్టాగబ్బయ్యా యా యా

పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా

ఒప్పుకోమ్మా - తప్పులేమ్మా
బుగ్గలిమ్మా - సిగ్గులేమ్మా
పదవే చాటుకు పడుచుదాన
పెదవే కానుకగా
కమ్మని ఒడి ఆ కాముని గుడి
గంటల సడి మా జంటకు పడి
మగువ సొగసు పొగడి

ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా

తెల్లచీర - మాయనివ్వు
మల్లె చెండు - పెట్టనివ్వు
సలహా చెప్పకు సందెగాలికి సరసాలాడమని
విచ్చలవిడి నే ముచ్చట పడి
పెంచకు తడి దాటించకు దడి
మనవి మగని కబలి

ఆ...ఆ...ఆ...
ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా
పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా
కుర్ర కుమారం కూకుంటె నేరం
కుర్ర కుమారం కూకుంటె నేరం
తొంగుంటె ఎట్టాగబ్బయ్యా యా యా




*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే

ఓ ఓ ఓ... - ఓ ఓ ఓ...
ఆ... - ఆ...

కొంచమైన తాళలేక పొంచివున్న ఆశలన్ని
కంచె దాటున కసి పెంచి రేగునా
మించిపోయి అంచుదాటె తెంచలేని హాయినంత
పంచిపెట్టన రుచి పెంచి ఇవ్వనా
ఆ పొద్దు ఈ పొద్దు ఆపద్దు నీ ముద్దు
దూరంగ పోవద్దు భామ
ఆలశ్యమేవద్దు ఏమాత్రమాగొద్దు
ఈ హద్దులే వద్దు కామ
రావే...సొగసరి మరి మరి విరిసిన తొలి విరి
నీకే నేను కుదిరి అదిరి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే

ఆకుచాటు సోకులన్ని రేకువిప్పు వన్నెలన్ని
అందజేయనా జత పొందు చేరనా
ఓ ఓ ఓ ఓ
గోరువెచ్చనైనా తేనే దోరముద్దు లోనే పంచి
చెంత చేరనా మరి కొంత కోరనా
జడ్లోన పూలన్ని పక్కల్లో రాలేటి
రాత్రిళ్ళకై నేను వేచా
కల్లోన ఓ కామ కల్లోలమే రేగి
కల్లారగ నేడు చూశా
ఏదో తెలియని అలజడి కలిగిన అలికిడి
నాలో కలలు కదలి మెదలి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ



*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

నచ్చాడే రౌడి పిల్లడు
వద్దన్నా ఒళ్ళో పడతడు
భలేవాడులే గుంటడు
ఆహా ఆహా ఆహా
చిలక్కొట్టుడే అంటడు
ఆహొ ఆహొ ఆహొ
రావే చుక్క రేగే తిక్క
లాగించేద్దాం చెమ్మా చెక్క
ప్రేమ యాత్రలో

నచ్చాడే రౌడి పిల్లడు
వద్దన్నా ఒళ్ళో పడతడు

వయసే వెర్రెత్తి పోయే అదో ఊహతో
నడుమే అల్లాడిపోయే అదే ఆశతో
ఆకులాంటి అందమిచ్చుకో
అందంగా హత్తుకున్న కొత్త మత్తులో
సోకు మల్లె రైక విప్పుకో చిత్రంగ
జివ్వుమన్న సిగ్గు మొగ్గులో
వసివాడని పసి అందమ
కసి జోల పాడనా

నచ్చాడే రౌడి పిల్లడు
వద్దన్నా ఒళ్ళో పడతడు
హ హహ హహ హహా

తడితే తపించిపోదా పసిడి పై ఎదా
పడితే కాటేసి పోదా పడుచు తుమ్మెద
పంటిగాటు ఓపనన్నాదోయ్ వయ్యారం
పచ్చి పాయసాల విందులో
రెచ్చిపోయి చూప మన్నదే ప్రతాపం
కెవ్వు మన్న గువ్వ గూటిలో
పడలేనురా విడలేనురా
ఒడి బాధ తీర్చరా

జగజగజ - నచ్చాడే రౌడి పిల్లడు
జగజగజ - వద్దన్నా ఒళ్ళో పడతడు
భలేవాడులే గుంటడు
ఆహా - ఆహా - ఆహా
చిలక్కొట్టుడే అంటడు
ఆహొ - ఒహొ - ఆహొ
రావే చుక్క రేగే తిక్క
లాగించేద్దాం చెమ్మా చెక్క
ప్రేమ యాత్రలో




*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర

బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
అరె బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
తడితే థిళ్ళాన పడితే ఒళ్లోన తడిలో తందానా
లక్కుకు చిక్కిన చక్కని లవ్వరు కనక వెనక పడరో
కసెక్కే స్ట్రక్చరు కలర్ ఫుల్ పిక్చరు
మసాల మిక్చరు మడోన్నా కల్చరు

అరె బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు

హో లైలా లాంటి చిన్నది
లవ్ లవ్ అంటు ఉన్నది
నీలో ఊసే విన్నది
తోడై ఉంటానన్నది
పైటే చుస్తే భలేగ ఉంది
ఆపై అందం ఎలాగ ఉందో
చూడాలంటు తాపం రేగింది
నీతో ఉంటే మజాగ ఉంది
నీలో ఏదో మహత్తు ఉంది
నన్నే నీకే ముడేసి పెట్టింది
మెల్లగా మొత్తంగా ఒళ్ళో కొచ్చే చల్లగా
అంతట్లోనే అంతాతోచే యమా యమా యమగా

అరె బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు

హో చోటే ఇస్తే చాలట
ఆటే సాగిస్తాడట
చాటే చూస్తే మేలట
దాటే వేసే కైపట
మత్తెక్కించే మగాడు వస్తే
చిత్తే చేసి చిరాకు చేస్తే
మొత్తంగానే లవ్వాడేశానే
హాలీవుడ్లో అడుగే వేస్తే
బాలీవుడ్లో పిలుపే వస్తే
నంబర్ వన్ నువ్వే అవుతావే
చాలని అంటాన సందిట్లోనే చేరనా
నే రమ్మంటుంటే ఆగేదుందా సర్రంటు నే రానా

బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
తడితే థిళ్ళాన పడితే ఒళ్లోన తడిలో తందానా
లక్కుకు చిక్కిన చక్కని లవ్వరు కనక వెనక పడరో
కసెక్కే స్ట్రక్చరు కలర్ ఫుల్ పిక్చరు
మసాల మిక్చరు మడోన్నా కల్చరు


Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default