Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mani Ratnam"
Ponniyin Selvan: II (2023)



చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నటీనటులు: విక్రమ, ఐశ్వర్యా రాయ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా లక్ష్మి , శోభిత ధూళిపాల 
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్ 
విడుదల తేది: 28.04.2023



Songs List:



ఆగనందే పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: శక్తిశ్రీ గోపాలన్ 

ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే… మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే… మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే

నది నడకలే పదగతి సరిచేసే
గిరి పెదవులు పెదవుల తడి పీల్చే
గొడుగులవలె తరువులు నిలిచే
కుసుమపు కొన చినుకులు విడిచే

నను కని పెంచే సొగసుల తలమా
నను నడిపించే అంతఃపురమా
కొలనుల నగవే పలుకనుకొనుమా
నవనవలాడే నువు నా గరిమా

నిను తలవగనే ఎద ఎగిరినదే
నిను తడమగనే మది మురిసినదే
నిన్నానుకునే పవలించెదనే మైమరచెదనే

ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే… మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే… మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే



వీరా రాజా వీర పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, బెన్నీ దయాల్, నబీలమాన్ 

కళ్ళార చూద్దాం
చోళ ఖడ్గ సంచారం సంహారం
ఓ సొగసరి పూవా
పూమాలే శుభమని వేయవే

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా శిఖరం స్పృశించైర

మార రాకుమారా చోరా చిత్త చోర
రా రా ఏలుకోర
కరవాల మీవేళ కనులెర్రజెయ్యంగ
భుజబలము ఈవేళ భూతలము మోయంగ
ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ
వీర రాజా వీర శూర ధీర శూరా

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

సుడిగాడ్పులా అడుగేయరా
సర సర సర సర
శరమే తనువే తాకగా
చర చర చర చర
చెలరేగాలి వేగంగా

మగసిరి కండచూసి
కడలికి చెమట పోయు
పదునగు కత్తి చూసి
నింగికి నిదుర రాదు

రగతము పొంగి పారీ
నదులకు రంగు మారు
తెగిపడు తలలు అన్ని
అలలకు అన్నమౌను

పులివలె దూకుతుంటే
జగములు జింకలౌను
నిన్నిక పొగడమంటే
భాషకు స్వాస ఆగు

విధిగా తెగించైర
విధినే వదించైర
విలయం దరించైర
విజయం వరించైర

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార… ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా… శిఖరం స్పృశించైర

మార రాకుమారా… చోరా చిత్త చోర
ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ
వీర రాజా వీర వీర రాజా వీర
శూర ధీర శూరా వీరా




శివోహం పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఆది శంకర 
గానం: సత్య ప్రకాష్, Dr.నారాయణన్, శ్రీకాంత్ హరిహరన్, నివాస్, అరవింద్ శ్రీనివాస్, శన్బాగరాజ్, TS అయ్యప్పన్

శివోహం




మిన్నంచుల వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిచరణ్

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే

ఏ దరి వెతికెదనే నెచ్చెలీ
నిన్నెట కాంచెదనే
నిత్య నిశీధి ఇది
చీకటి సూన్యమే మిగిలినదే

చిత్ర నయనమది
చక్కని చక్కెర పలుకులేవీ
సుందరహాసమేది
కావేరి నురగల పరుగులేవీ

మంచుమబ్బులవలే ప్రేమగా
తడిమిన చేతులెవీ
గోరు వెచ్చ కాంతుల వేకువై
వెలిగిన చూపులేవీ

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

ఆరని జ్వలనమయే
హృదయం తీరని నరకమయే
ప్రాణం శిధిలమయే సమయం
చలనము లేనిదయే

నిప్పుల ఉప్పెనలో
నన్నిలా ముంచితివెందులకే
నేరము చెయ్యక
ఏ శిక్షలో వగచితి నీ కొరకే

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే




ప్రార్థనలు వినుమా పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిరీష భాగవతుల 

ప్రార్థనలు వినుమా
మా ఊపిరి వేణువు గీతికలో
మనోరథాన్ని కనుమా

నీలిమేఘం నీ దేహం అయితే
మెరుపుల జ్యోతులు
మనసు ముంగిళ్లలో
ప్రసిరించాలి ప్రసిరించాలి

నీ కరుణే అనవరతం
మధురామృత దారై
మాపై కురవాలి

పాడు తలపులు
తలపడు క్షణమున
పిడుగులా రావాలి
కడతేర్చి పోవాలి



అలుపే లేదే పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిరీష భాగవాతుల, హరిప్రియ, దీప్తి, సురేష్ 

అలుపే లేదే 

Palli Balakrishna Friday, May 26, 2023
Donga Donga (1993)





చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
నటీనటులు: ప్రశాంత్, ఆనంద్, హీరా రాజగోపాల్ , అను అగర్వాల్ 
దర్శకత్వం: మణిరత్నం 
నిర్మాతలు: డి.సుదాకర రాజు, డి. అరుణ 
విడుదల తేది: 13.11.1993



Songs List:



కొత్త బంగారు లోకం పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  మనో , చిత్ర 

కొత్త బంగారు లోకం 





ఆకతాయి ఒక్కడంట పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  జి.వి.ప్రకాష్ కుమార్ 

ఆకతాయి ఒక్కడంట



కొంచం నీరు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  అనుపమ 

కొంచం నీరు 




వీర బొబ్బిలి పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  చిత్ర ,  ఉన్ని మీనన్ , మనో  

వీర బొబ్బిలి 



కనులు కనులను పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ
గానం:  మనో 

పల్లవి :
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

చరణం : 1
వాగులై ఉరికితే వయసు కులుకే అని అర్ధం
కడలియె పొంగితే నిండు పున్నమేనని అర్ధం
ఈడు పకపక నవ్విందంటే ఊహు అని దానర్ధం
అందగత్తెకు అమై్మపుడితే ఊరికత్తని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం

చరణం : 2
పడవలె నదులకు బంధుకోటి అని అర్ధం
చినుకులె వానకు బోసినవ్వులే అని అర్ధం
వెల్లవేస్తే చీకటికి అది వేకువౌనని అర్ధం
ఎగిరితే నువు ఎముకలిరిస్తే
విజయమని దానర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం



యేటిలోన చాపలంట పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ  
గానం:  శ్రీనివాస్, సురేష్ పీటర్స్ 

యేటిలోన  చాపలంట




సీతాలు నువ్వే లేక పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం:  షాహుల్ హమ్మీద్

సీతాలు  నువ్వే లేక 




తీ తీ తీయని పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగ  (1993)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం:  సుజాత మోహన్ 

తీ తీ తీయని 

Palli Balakrishna Thursday, July 22, 2021
Bombay (1995)



చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 10.03.1995



Songs List:



అది అరబీ కదలందం పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: రెమో ఫెర్నాండేజ్, స్వర్ణలత 

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్లడిగానే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

విప్పారే తామరవే రూపాంత కన్నాలే
నీ పట్టు రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

చీరె వచ్చి ముందు జారే మోజులకు ఆహా ఎంత సుఖమో
పైలా పచ్చి పసి వేలే తగిలినప్పుడు ఆహా ఎంత ఇహమో
చిత్రాంగి చిలక రాత్రి పగలనక ముక్తాయించే నడుమో
అందం దాని మతమంటే లేని విధమయ్యో దివియ పదమో
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుకు కన్నా కన్నె తీరా
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

విప్పారే తామరవే రూపాంత కన్నాలే
నీ పట్టు రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హే హే హమ్మా

ఏదో సరసమిది ఎంతో విరహమిది మొత్తం మీదో చిలకో
తాపం మంచమెక్కి దీపం కొండా ఎక్కి కంట్లో వెలిగే మనస్సు
ఫనా పులుత మీద భూమి విడత పొంగి తల్లో సెగలు పెరిగే
కామం కరిగిపోయే కళ్ళే నిదరబోయే కానీ మనసు బెనికే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుకు కౌగిళ్లడిగానే

హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హే హమ్మా హమ్మా హే హే హమ్మా హమ్మా హమ్మో
హే హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హే హమ్మా హమ్మా
హమ్మా




కన్నానులే కలయికలు పాట సాహిత్యం

 


చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, ఏ.ఆర్.రెహమాన్ & కోరస్ 

మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

ఊరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం...
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం...
రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగే దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్
గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్

జలజలా జలజల జక్కములాడె 
జోడి వేటాడి
విల విల విల విల వెన్నెలలాడి 
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాట లాడింది నాలో

ఎంత మైమరపో 
ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే
ఎడబాటనుకో 
ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
కన్నానులే...





ఉరికే చిలకా వేచి ఉంటాను పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, చిత్ర

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ





కుచ్చి కుచ్చి కూనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్ , స్వర్ణలత , GV ప్రకాష్ కుమార్ , శారద 

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె
కోడి కూడా సద్దుచేసే
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

హయ్య హయ్య హయ్య
హయ్య హయ్య హైయాయ
హయ్య హయ్య హయ్య
హయ్య హయ్య హైయాయ

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె
కోడి కూడా సద్దుచేసే
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట

ఆట నెమలికి మెరుపు సుఖం
గాన కోకిలకు పిలుపు సుఖం
చెట్టు వేరుకు పాదు సుఖం
హే అమ్మడను పిలుపు సుఖం
రాకుమారుడి గెలుపు సుఖం
చంటి కడుపుకి పాలు సుఖం
మొగుడు శ్రీమతి అలకలలో
ముద్దుకన్ను ముడుపు సుఖం

రేయి పగలు పన్నిటిలో ఉన్న
రాదు మీనుకి చలి కాలం
అల్లిబిల్లిగా లాలిస్తుంటే
గారాల పూబాల కోరేది సరసం

బుజ్జి బుజ్జి పాపానివ్వు
పోకిరాట వేశమొద్దు హ హ హ హ
బుజ్జికి బుజ్జికి పాపానివ్వు
పోకిరాట వేశమొద్దు
వేడెక్కే అందాలు పెట్టు
వేధిస్తే నా మీదే ఒట్టు

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

హయ్య హయ్య హైహయ్య
హయ్య హయ్య హాయ్
హయ్య హయ్య హైహయ్య
హయ్య హయ్య హాయ్
హయ్య హయ్య హయ్య హయ్య
హయ్య హయ్యయ్యయ్యయ్య
హయ్య హయ్య హయ్య హయ్య
హయ్య హయ్యయ్యయ్యయ్య

చిరుత రెక్కలే పక్షివిలే
చిటికె వెలుగులే దివ్వివిలే
తోడు నీడ ఇక నీవేలే
తరగని పుణ్యమిదే
కనువు తోటివే తపనలులే
ఉరుము తోటివే మెరుపులులే
ఉన్న తోడు ఇక నీవేలే
విలువలు తెలియవులే

భూమి తిరగడం నిలబడితే
భువిని తాళమే మారదులే
మగని ఆదరణ కరువైతే
ఇల్లాలి ప్రేమంతా వేసంగి పాలే

పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగా
పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగా
బుద్దిగుంటే మంచిదంట
దూరాలు కోరింది జంట

కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా




పూలకుంది కొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: పల్లవి, శుభ , అనుపమ, నోయెల్ జేమ్స్, శ్రీనివాస్, సుజాతా మోహన్ 

పూలకుంది కొమ్మ పాటకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నెల డీడిక్కి నీకు నాకు ఈడిక్కి
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తెర మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తెర మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల

పున్నాగ పూలకెలా దిగులు
మిన్నేటి పక్షికేది కంటి జల్లు
జాబిలెన్నడు రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దు పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
మేఘాలు గాయపడితే మేరుపల్లె నవ్వుకుంటాయి
కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
మేఘాలు గాయపడితే మేరుపల్లె నవ్వుకుంటాయి
ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతి మాత బేధాలు లేవన్నాయ్

మౌనం లోని గానం
ప్రాణం లోని బంధం
ఎగరేయ్ రెక్కలు గట్టి ఎదనింకా తారల్లోకి
ఎగరేయ్ రెక్కలు గట్టి ఎదనింకా తారల్లోకి
విజయం కోరే వీరం చిందిస్తుందా రఖ్తం
అనురాగం నీలో ఉండే ఆకాశం నీకు మొక్కు

గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
మౌనం లోని గానం
ప్రాణం లోని బంధం
విజయం కోరే వీరం రఖ్తం కోసాంచదా

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
నీలో నేనే ఉన్న రూప్ తెర మస్తాన
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
నీలో నేనే ఉన్న రూప్ తెర మస్తాన




మతమేల గతమేల పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: సుజాతా మోహన్ , 

మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం…

కన్నీట కడగాలి… కులమన్న పాపం…
మత రక్త సిందూరం… వర్ణాలు అరుణం…
గాయాల నీ తల్లికీ…
కన్నా…! జో లాలి పాడాలిరా…

సరిహద్దులే దాటు ఆ గాలిలా… ప్రసవించనీ ప్రేమనే హాయిగా
నదులన్నీ కలిసేటి కడలింటిలో… తారల్లు విరిసేది గగనాలలో
కలలోకి జారేను ఈ రాత్రులే… వెలిగించి నవ్యోదయం

మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశము… ఇల మీదనే స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యము… సాధించరా సంఘమై…

ఒక మాట… ఒక బాట… ఒక ప్రాణమై..
సాగాలిరా ఏకమై…





ఇదు మాతృభూమి పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం:  చిత్ర, శంకర్ మహదేవన్ ,   సుజాతా మోహన్ , నోయెల్ జేమ్స్, శ్రీనివాస్, శివనేషణ్ , గంగా శ్రీనివాసన్, రేణుకా, అనురాధ శ్రీరాం 

ఇదు మాతృభూమి

Palli Balakrishna Wednesday, October 4, 2017
Kadali (2013)


చిత్రం: కడలి (2013)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి
గానం: విజయ్ యేసుదాస్
నటీనటులు: అర్జున్ సార్జా, గౌతమ్ కార్తిక్, అరవింద్ స్వామి, తులసి నయర్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 01.02.2013

చిట్టి జాబిలీ..ఓ జాబిలీ..
గగనవీధి కాచు దేవుడూ
ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నవిరో...
నువ్ కూడా ఒంటరిగా వున్నావురో...
సాగిపో బిడ్డా
సాగి నువు ఆకాశం అందుకో బిడ్డా

చిట్టి జాబిలీ..ఓ జాబిలీ..
గగనవీధి కాచు దేవుడూ
ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నవిరో...
నువ్ కూడా ఒంటరిగా వున్నావురో...
సాగిపో బిడ్డా
సాగి నువు ఆకాశం అందుకో బిడ్డా

మనిషే తలిస్తే జరుగుతుందే
మనసులోనే వెలుగుండె
నాటిన విత్తే చెమట చిందాకే
నెలే తాళం తీయునులే
సాగిపో బిడ్డా
సాగి నువు ఆకాశం అందుకో బిడ్డా

దృశ్యం తోచును కన్నుల నుంచే
దేశం తోచును కదనం నుంచే
శ్లోకం తోచును శోకం నుంచే
జ్ఞానం తోచును ఓటమి నుంచే
సూరీడే ధిగితే నవ్వుతుందే దీపం
నావలె కుంగితే చిరు కొమ్మే వూతం
చిట్టి జాబిలీ..ఓ జాబిలీ..
సాగిపో బిడ్డా
సాగి నువు ఆకాశం అందుకో బిడ్డా

కూలిన మాను తొడుగునా చివురు
కుమిలే మనసుకు తోడిక ఎవరు
పుడమిని తెరువు నిధులను కోసారు
పూలను తెరువు తేనులు జారు

కూలిన మాను తొడుగునా చివురు
కుమిలే మనసుకు తోడిక ఎవరు
పుడమిని తెరువు నిధులను కోసారు
పూలను తెరువు తేనులు జారు
నాదాలను తెరువు తుళ్లు పైరు
నమ్మకమేగ రేపుకు పీరు
నాదాలను తెరువు తుళ్లు పైరు
నమ్మకమేగ రేపుకు పీరు

చిట్టి జాబిలీ..ఓ జాబిలీ..
అదో అదో...ఓ జాబిలీ..


********   *********   ********


చిత్రం: కడలి (2013)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి
గానం: శక్తి శ్రీ గోపాలన్

గుంజుకున్నా నిన్నే ఎదలోకే ...
ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే
తేనె చూపే చల్లావు నా పై చింధేలా
తాళనంటుంధీ మనసే నీరు పడ్డ అద్ధంలా
కొత్త మణిహరం కుడి సేతి గడియారం
పెద్ద పులినైనా అనిచే అధికారం
నీవెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే...
ఇంక ఆది మొదలు నా మనసే తలవంచే ఎరగదుగా
గోడుగంచై నేడు మదే నిక్కుతోందిగా

గుంజుకున్నా నిన్నే ఏధాలోకే...
ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే
గువ్వే ముసుగేసిందే.. రావేకేకునికిందే
పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే
రాఛ కురుపున్నోలే నిదరోయే వేలలోన
ఆశా కురుపోచ్చి అదే అరనిమిషం నిదరోదే ....
గుంజుకున్నా....

ఎంగిలి పడనే లేదే , అంగిలి తడవనె లేదే
ఆరేడు నల్లై ఆకలి ఊసే లేదే ..
పేద ఎదనే దాటి ఎదే పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడిచేసే నోరేదే
హో గుంజుకున్నా నిన్ను ఎదలోకే...

గుంజుకున్నా నిన్నే ఎదలోకే...

ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే...


********   *********   ********


చిత్రం: కడలి (2013)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి
గానం: ఆర్యన్ దినేష్ కనగరత్నం, చిన్మయి, తన్విషా

తొలి వెలుగుల తలుపులు తెరవగా
విధినికమార్చగా వారములు కొసరాగ రా

ఇది కలకాదు నిజమనీ ఒకపరి
కన్నుల్ని చూసింకా చెప్పగా రా రా
తెలుగుల పుడమిని ఎలాగా జనియిచ్చా
జెండాలేగరేయ్య జనిఇంచినారా
కొత్త జగతి ననచ తలచు
కలియుగ శకునీ ఆపు నువ్ వూదు

మగిడీ...మగిడీ.

నీకు తెలుసా నే నిన్ను తలుస్తా
నువ్ నన్ను మారుస్తవ్ నే కొడతా
నువ్ నవ్వుతావ్ నువ్ దేశాధిన్మారి
నేం నీ ధిమ్మరి నే విడుపు
నువ్ పొడుపు నే మగిడీరా
నువ్ సర్పం

రౌడీ నువ్ రాక్కమ్మా
హేయ్ రావే నా మంగమ్మ
హేయ్ వాగోద్ధె రత్తమ్మా
రా.....
చ...
మా...
నువ్...
రా...
చ...
వ...
నువ్...
రా...

మగిడీ...మగిడీ. మగిడీ



********   *********   ********


చిత్రం: కడలి (2013)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి
గానం: చెన్నై చొరలే

నీ వల్లనే నా యీ ఉనికే
నీ వల్లనే నా యీ ఉనికే
మమతే నీవులే

మము నిత్యం ఏలె రూపం మళ్లీ కన్నాం
ఆయువుకాలం మొత్తం నీదంటున్నాం
నా నరమున్న పొంగేను నీ మమతల పెనుసంద్రం
మళ్లీ నువ్ ముందు నిలవగా
నీవె ఆహారమంగా నీవె ఆలోచననగా
తలచాం మైమరిచామ్
నువ్ నిండీ మది విరిసె నేడు ఏసయా
మళ్లీ నిను దర్శించాం
నీ పధం స్పరిచించాం
నీకే నమీ అందించినాం
నువ్ భూమీ గాలీ నింగీ నీరానంలే
క్రోధం దూరం చేసే దైవంలే
నీ ఆహారమంగా నీవె ఆలోచననగా
తలచాం మైమరిచామ్
నువ్ నిండీ మది విరిసె నేడు ఏసయా
మళ్లీ నిను దర్శించాం
నీ పధం స్పరిచించాం
నీకే నమీ అందించినాం
కన్నీరు నింపే నా యెదలొ శోకం
నీపేరే వింటే పూవై పూసిందే
మము నిత్యం ఏలె రూపం మళ్లీ కన్నాం
ఆయువుకాలం మొత్తం నీదంటున్నాం
నా నరమున్న పొంగేను నీ మమతల పెనుసంద్రం
మళ్లీ నువ్ ముందు నిలవగా
పూసే పూల వర్ణం నీవేలే
వేరై కాచే జీవం నీవేలే
నీవె ఆహారంగా నీవె ఆలోచనగా
తలచాం మైమరిచామ్
నువ్ నిండీ మది విరిసె నేడు ఏసయా
మళ్లీ నిను దర్శించాం
నీ పధం స్పరిచించాం
నీకే నమీ అందించినాం
మమతే నీవులే
మమతే నీవులే..మమతే నీవులే
మమతే నీవులే

మము నిత్యం ఏలె రూపం మళ్లీ కన్నాం
ఆయువుకాలం మొత్తం నీదంటున్నాం
నా నరమున్న పొంగేను నీ మమతల పెనుసంద్రం
మళ్లీ నువ్ ముందు నిలవగా
నీవె ఆహారమంగా నీవె ఆలోచననగా
తలచాం మైమరిచామ్
నువ్ నిండీ మది విరిసె నేడు ఏసయా
మళ్లీ నిను దర్శించాం
నీ పధం స్పరిచించాం
నీకే నమీ అందించినాం


********   *********   ********


చిత్రం: కడలి (2013)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి
గానం: అభయ్ జోద్పుర్కార్

పచ్చని తోట
పసరుల తావి
నిశీధి మౌనం
నీ ప్రేమగానం
పౌర్ణమి రేయీ...పొగమంచి అడవి...
ఒంటరిగా వెళ్లే నీతోటి పయనము
ఇది మాత్రం చాలు..
ఇది మాత్రమే..
నాకింకా చాలు..
నువ్వు మాత్రమే..
ఇది మాత్రం చాలు..
ఇది మాత్రమే..
నాకింకా చాలు..
నువ్వు మాత్రమే..

పచ్చని తోట
పసరుల తావి
నిశీధి మౌనం
నీ ప్రేమగానం

కొలనుల నీటిలో..తడిసే కొంగలు..
విదిలించు రెక్కల జల్లే అందమే
ముక్కోపం విడిచి..నీ కొంగు తీసి..
నా మేను తుడిచే నిన్నల్లుకొనా
ఇది మాత్రం చాలు..
ఇది మాత్రమే..
నాకింకా చాలు..
నువ్వు మాత్రమే..
ఇది మాత్రం చాలు..
ఇది మాత్రమే..
నాకింకా చాలు..
నువ్వు మాత్రమే..

మాణులు ఒణికే..మంచుకు తడిసీ
నెత్తురు నిలిచే చలికే జడిసీ
ఉష్ణం కోరెలే..వయసీ చోటే
ఒకటే దుప్పటిలో ఇరువురం ఉంటే..
ఇది మాత్రం చాలు..
ఇది మాత్రమే..
నాకింకా చాలు..
నువ్వు మాత్రమే..
ఇది మాత్రం చాలు..
ఇది మాత్రమే..
నాకింకా చాలు..
నువ్వు మాత్రమే..

పచ్చని తోట
పసరుల తావి
నిశీధి మౌనం
నీ ప్రేమగానం
పౌర్ణమి రేయీ...పొగమంచి అడవి...
ఒంటరిగా వెళ్లే నీతోటి పయనము
ఇది మాత్రం చాలు...
ఇది మాత్రమే...
నాకింకా చాలు...
నువ్వు మాత్రమే...


********   *********   ********


చిత్రం: కడలి (2013)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి
గానం: మరియా రో విన్సెంట్, సిద్ శ్రీరామ్

మనసే తెరిచేశావే
యాడనుంచి నీవొచ్చావే
యాడికే... యాడికే...
నన్ను తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
రావాలి నీతో పాటే
యాడికే రాను నీతో పాటే

ముళ్ళో పువ్వో పోయే దారేదైనా
నిన్నే నమ్మి వచ్చానే
అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ
నీవెంటే వస్తున్నానే

ముళ్ళో పువ్వో పోయే దారేదైనా
నిన్నే నమ్మి వచ్చానే
అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ
నీవెంటే వస్తున్నానే
యాడికే... యాడికే...
నన్ను తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
రావాలి నీతో పాటే
యాడికే రాను నీతో పాటే

యాడికే...యాడికే...
తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే...యాడికే...
తీస్కేళ్తావ్ నీతో పాటే

చేపకేమో రెక్కలన్‌టించి
నేర్పుతున్నావే ఎగిరేదెట్టాగో
నింగీపైకిసిరి...ఇన్నాళ్లు యాడున్నావే
యాడికే...యాడికే...
తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే...యాడికే...
తీస్కేళ్తావ్ నీతో పాటే

నీ కన్నుల్నే అద్ధం లా చేసి
నా సిగ్గుల్నే ఆరెసావే
నాలోని దుమ్ముధూళి దులిపి
వెల్ల వేస్తున్నావే ఎదకె
యాడికే...యాడికే...
తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే...యాడికే...
తీస్కేళ్తావ్ నీతో పాటే

ఓ...భూమినుంచి స్వర్గానికే
ఓ...వానవిళ్ళు నిచ్చేనేసావే
మనసు దారాన్నే లాగుతున్నావే నువ్
స్వర్గం వీడి భూమికొస్తే
తూరుపింత సూరీడే వస్తే
కను తెరిచి చూసేలోగా
చెరిగి పోతా వేమో..
యాడికే..యాడికే..
తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
తీస్కేళ్తావ్ నీతో పాటే



********   *********   ********


చిత్రం: కడలి (2013)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి
గానం: ఎ. ఆర్.రెహమాన

ఏమ్మా సీలా సంద్రం
ఉన్నదంతా ఇస్తా ఉంది
ఔమ్మా సీలా అది
అలాలెగిసి నవ్వేస్తాంది

ఏమ్మా సీలా సంద్రం
ఉన్నదంతా ఇస్తా ఉంది
ఔమ్మా సీలా అది
అలాలెగిసి నవ్వేస్తాంది

ఏలె జెల్లె సిక్కిందే
మనసుసెన్ పిల్లె వొచ్చిందే
హేయ్ ఎసెయ్ వరం కురిపించే

ఏలె జెల్లె సిక్కిందే
మనసుసెన్ పిల్లె వొచ్చిందే
హేయ్ ఎసెయ్ వరం కురిపించే
ఊఊఊ...
ఒలెయ్ ఇయ్యాలేయ్ ..తెప్పలన్నీ తోయ్యాలేయ్
గండూమీనె వల్లో పట్టి మొయ్యాలేయ్

ఏలె జెల్లె సిక్కిందే
మనసుసెన్ పిల్లె వొచ్చిందే
హేయ్ ఎసెయ్ వరం కురిపించే

ఏరో ఏరో సాపేస్తేయ్ అయ్యో
ఆవాలగా వాసన ఆరా తీసి
రాదా జెల్లెయ్ నీ జెల్లెయ్
గూబలేనే కల్లిమ్మంటూ అడిగెస్తాడే
రొయ్యల్నే రొయ్యల్నే
మీసంకూడా అడిగెస్తాడే
పులి ఏసం కట్టి
రాదా.. జెల్లెయ్.. రాదా

ఏలె జెల్లె సిక్కిందే
మనసుసెన్ పిల్లె వొచ్చిందే
హేయ్ ఎసెయ్ వరం కురిపించే
ఊఊఊ...
ఒలెయ్ ఇయ్యాలేయ్ ..తెప్పలన్నీ తోయ్యాలేయ్
గండూమీనె వల్లో పట్టి మొయ్యాలేయ్

హేయ్....
రెప రెప రెప రెప గాలికి వూగె
తెరాసాపే నిత్తేం నీ పేరెయ్ పాడుదేయ్
సర సర సర సర సరెనీ
మెదాలని మనసును వొరిసి
మేలిపెట్టి తియ్యకు ఉసురే
నినులాగే వాలాలను వొడుపుగా
విసిరానేయ్.. నేయ్ వేచానెయ్
నా కన్నుల్లో వోత్తులు వేసుకు
తి గరిల చూస్తున్నానెయ్
నువ్ కాదన్నావా
యాదేయ్ యాదేయ్ పోతాడీ తోమా?
ఒంటి అలనెక్కి వూగిసలాడేయ్
నావై నీ తలపుల్లో ఏకాకల్లే వూగుతున్నా
ఊవూ ఓర చూపుల్తోటి నవాలెవా?

ఏలె జెల్లె సిక్కిందే
మనసుసెన్ పిల్లె వొచ్చిందే
హేయ్ ఎసెయ్ వరం కురిపించే
ఒలెయ్ ఇయ్యాలేయ్ ..తెప్పలన్నీ తోయ్యాలేయ్
గండూమీనె వల్లో పట్టి మొయ్యాలేయ్

నువ్ పట్టపగలే నను సుట్టుముడుతూ
ఇట్ట తరుముతుందే తల తిరిగుతొండే
నీ సూపూ తాకే నా దిమ్మతిరిగే
ఈ పిత్త పరిగే నేడు నాకుదొరికే..నాకుదొరికే
లచ్చలు మించే నీ మచ్చలు మొత్తం
నే ఎంచగా చూస్తే కంటి నిద్దుర జారే
నా శీతమేరిగి నువ్ మొత్తమిచ్చావ్
నా తల్లి వోడిలా నన్ను చేరదీశావ్ చేరదీశావ్

ఏమ్మా సీలా సంద్రం
ఉన్నదంతా ఇస్తా ఉంది
ఔమ్మా సీలా అది
అలాలెగిసి నవ్వేస్తాంది

ఏలె జెల్లె సిక్కిందే
మనసుసెన్ పిల్లె వొచ్చిందే
హేయ్ ఎసెయ్ వరం కురిపించే
ఊవూ ఒలే తేవాలే
ఏలాం యెయ్యను తేవాలే
సాగే మేఘం కురిసే సేపలు తేవాలే
ఊవూ ఒలే తేవాలే
ఏలాం యెయ్యను తేవాలే
సాగే మేఘం కురిసే సేపలు తేవాలే
ఒలెయ్ ఇయ్యాలేయ్ ..తెప్పలన్నీ తోయ్యాలేయ్
గండూమీనె వల్లో పట్టి మొయ్యాలేయ్
ఒలెయ్ ఇయ్యాలేయ్ ..తెప్పలన్నీ తోయ్యాలేయ్
గండూమీనె వల్లో పట్టి మొయ్యాలేయ్
ఒలెయ్ ఇయ్యాలేయ్ ..తెప్పలన్నీ తోయ్యాలేయ్
గండూమీనె వల్లో పట్టి మొయ్యాలేయ్
ఒలెయ్ ఇయ్యాలేయ్ ..తెప్పలన్నీ తోయ్యాలేయ్
గండూమీనె వల్లో పట్టి మొయ్యాలేయ్

Palli Balakrishna Thursday, September 21, 2017
Merupu Kalalu (1997)



చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ 
నటీనటులు: అరవింద్ స్వామి, ప్రభుదేవా, కాజోల్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాణం: ఏవియం ప్రొడక్షన్స్
విడుదల తేది: 14.01.1997



Songs List:



ఓ వాన పడితే పాట సాహిత్యం

 
చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం: వేటూరి
గానం: సుజాత, మలేసియా వాసుదేవన్

ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి 
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి 
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి 
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి 
కోయిలకే కుక్కూక్కు ఎదహోరే కాంభోజి 
సంగీతమంటేనే హాయి హాయి 
నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి 
గీతాలు వింటుంటేనే పుట్టే హాయి 
జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి 
సాగింది నాలో స స రి గ మ ప ద ని స రి 

ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి 
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి 

చరణం: 1 
రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో 
టిక్ టిక్ అంటాది గోడల్లో 
దూరపయనంలో రైలు పరుగుల్లో 
చుక్ చుక్ గీతాలే చలో 
సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక 
మధుర సంగీత సుధ 
పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే 
హాయి మమతరాగాలు కదా 

ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి 
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి 

చరణం: 2 
నీలారం అడుగుల్లో అల్లార్చే రెక్కల్లో 
ఫట్ ఫట్ సంగీతాలే విను 
గోవుల్ల చిందులలో కొలువున్న మాలచ్చి 
ఎట్టా పాడిందో విను 
సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక 
జీవన సంగీత సుధ 
వర్షించే వానజల్లు వర్ణాలన్నీ గానాలేలే 
ధరణి చిటికేసే విను

ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి 
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి 
కోయిలకే కుహూ కుహూ ఎదహోరే కాంభోజి 
సంగీతమంటేనే హాయి హాయి 
నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి 
గీతాలు వింటుంటేనే పుట్టే హాయి 
జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి 
సాగింది నాలో స స రి గ మ ప ని స రి 

ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి 
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి 




మచిలీపట్నం మామిడి చిగురులో  పాట సాహిత్యం

 
చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, శ్రీనివాస్

ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 
మచిలీపట్నం మామిడి చిగురులో 
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట 
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా 
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి 
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 
మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పోకాల పోరి ఒకతి 
కోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా.. 
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం 
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం 
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 

చరణం: 1 
తందానా తందానా తాకి మరి తందానా 
ఏ తాళం వాయించాడే 
తందానా తందానా పాట వరస తందానా 
ఏ రాగం పాడిస్తాడే 
సిరి వలపో మతిమరుపో అది హాయిలే 
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే 
తందానా తందానా కన్నె ప్రేమ తందానా 
వచ్చిపోయె వసంతాలే 
మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం 
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం 
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 

మచిలీపట్నం మామిడి చిగురులో 
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట 
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా 
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి 

చరణం: 2 
తందానా తందానా ఊసుకనుల తందానా 
ఊరించే తెట్టు తేవె 
తందానా తందానా పాటకొక తందానా 
చెవి నిండా గుమ్మత్తేలే 
వయసులలో వరసలలో తెలియందిదే 
మనసుపడే మౌన సుఖమే విరహానిదే 
తందానా తందానా మేఘరాగం తందానా 
వచ్చె వచ్చె వానజల్లే 
మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం 
తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం 
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 
మచిలీపట్నం మామిడి చిగురులో 
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 
మా చిలక మా చిలక మా చిలక... 
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా 




అపరంజి మదనుడి పాట సాహిత్యం

 
చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం: వేటూరి
గానం: అనూరాధ శ్రీరామ్

పల్లవి: 
అపరంజి మదనుడి అనువైన సఖుడులే అతడేమి అందగాడే 
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే 
వినువీదిలోవుంటే సూర్యుదేవోడునే ఇలమీద వోదిగినాడే 
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు సిశుపాలుడొచ్చినాడే 
అపరంజి మదనుడే అనువైన సఖుదులే అతడేమి అందగాడే 
పోరాట భూమినే పూదోట కోనగా పులకింప జేసినాడే 

చరణం:1 
కల్యారి మలనేలు కలికి ముత్యపు రాయి కన్న దిక్కతడులేవే 
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే 
ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇల బాలుడొచ్చినాడే 
ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై 

చరణం:2 
అపరంజి మదనుడి అనువైన సఖుడులే అతడేమి అందగాడే 
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే 
అపరంజి మదనుడి అనువైన సఖుడులే అతడేమి అందగాడే 
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే





తల్లో తామర పాట సాహిత్యం

 
చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, శుభ

తల్లో తామర మడిచే ఓ చిలకా 
అట్టిట్టాయను వనమే ఓ తళుకా 
వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం 
ఇది చిత్రం పిల్ల నీ వల్లే 
తల్లో తామర మడిచే ఓ చిలకా 
అట్టిట్టాయను వనమే ఓ తళుకా 
వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం 
ఇది చిత్రం పిల్ల నీ వల్లే 
తల్లో తామర మడిచే ఓ చిలకా 
తల్లో తామర మడిచే అహ మడిచే ఓ చిలకా1 


చరణం: 1
చలాకి చిలకా చిరాకు సోకూ తేనేలె 
నా కంఠం వరకు ఆశలు వచ్చే వేళాయె 
వెర్రెక్కి నీ కనుచూపులు కావా ప్రేమంటే 
నీ నల్లని కురులా నట్టడవుల్లో మాయం నేనైపోయానే 
ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కోత్తగా 
ఎదను మూత పేట్టుకున్న ఆశలింక మాసేనా 
జోడించవా ఒళ్ళేంచక్కా 

తల్లో తామర మడిచే ఓ చిలకా 
అట్టిట్టాయను వనమే ఓ తళుకా 

చరణం: 2 
పరువం వచ్చినపోటు తుమ్మేదల వైశాఖం 
గలప కప్పలు జతకే చేరే ఆషాఢం 
ఎడారి కోయిల పేంటిని వేతికే గంధారం 
విరాలిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం 
మతం తోలిగిన పిల్లా అదెంతదో నీ ఆశ 
నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ 
ఇదేసుమా కౌగిళి భాష 

తల్లో తామర మడిచే ఓ చిలకా 
అట్టిట్టాయను వనమే ఓ తళుకా 
వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం 
ఇది చిత్రం పిల్ల నీ వల్లే 
తల్లో తామర మడిచే 
అట్టిట్టాయను వనమే 
తల్లో తామర మడిచే 
అట్టిట్టాయను వనమే రా 



స్ట్రాబెర్రి కన్నె... పాట సాహిత్యం

 
చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం: వేటూరి
గానం: మనో, స్వర్ణలత

పల్లవి: 
స్ట్రాబెర్రి కన్నె.... ఊర్వశి వాన్నే... 
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన 
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా 
వెండి కంచం జోడు 
బెంజ్ AC కారు 
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల 
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా 
ఉడుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల 

ఏంట్రా రియాక్షనే లేదు 
Volume పెంచాలేమో 
స్ట్రాబెర్రి కన్నె.... ఊర్వశి వాన్నే... 
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన 
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా 
వెండి కంచం జోడు 
బెంజ్ AC కారు 
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల 
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా 
ఉడుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల 

చరణం: 1 
నీ ఆడతనం వేలతనం ఇప్పుడు మరుగై 
నీ కల్పనలే అద్భుతమై నిప్పులు చెరిగే 
ముగించావే... పైత్యం... 
ఫలించనీ ... వైద్యం 
పాత పైత్యం పిచితనం రెండు చెల్లి 
నీది వైద్యం వెర్రితనం నాడే చెల్లి 
ముందు తరతరాలెవ్వరు మూడలు కాదే 
నాలోన గొడవేదింక 
అతని సేవలో ఎప్పుడు లాభం లేదు 
మనిషి సేవలే చేసినా తప్పేం లేదు 
నేను ఎన్నడు భూమికి భారం కాను 
నా బాటలో నరకం లేదు 
నిన్న కలలే కన్నా 
నేడు కలిసే కన్నా 
నాడు తాళితో చితికైన జత కాలేను 
ముందు మాల యోగం వెనక సంకెల బంధం 
ఇంకా గజిబిజి కళ్యాణం దోవే రద్దు 
అయ్యో పెళ్లొద్దంట రూట్ మార్చు 

చరణం: 2 
కన్నె కళ్ళు ఎన్నో కలలు 
ఈ చెక్కిళ్ళు ఎంత ఇష్టం 
తల్లో పోసిన తామర నేత్రం 
ఏం పెదవి అది ఏం పెదవి 
చెర్రి పండు వంటి చిన్ని పెదవి 

నోసే కొంచెం ఓవర్ సైజు 
ఇట్స్ ఓకే ప్లాస్టిక్ సర్జరీ చేయిద్దాం 

ఎవరి ముక్కు ఎవరి పాలు చేసి పెట్టినదెవరో 
ఉన్న మెదడు తమకు నిండు సున్నా చేసినదేవరో 
ఎవరివో... పురుషుడో... 
మంకీయా... మనిషియా 




వెన్నెలవే వెన్నెలవే .. పాట సాహిత్యం

 
చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, సాధనాసర్గమ్

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే  హేయ్..
వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే  హేయ్..

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే 
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఇది సరసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సయ్యన్న మందారం
ఇది సరసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సయ్యన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే
చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా... పిల్లా...
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా
పాడేను కుసుమాలు పచ్చాగడ్డి మీనా
ఏ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే 
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
 
ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా 
ఇది గిల్లీ గిల్లీ వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ

పిల్లా... పిల్లా...
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
ఆ వయసే రసాల విందైతే  ప్రేమల్లే ప్రేమించు 

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే 
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగాపంపిస్తా

Palli Balakrishna Tuesday, August 22, 2017
Cheliya (2017)


చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హ్రిద్యా గట్టాని, తన్వి షాహ్
నటీనటులు: కార్తీ, అధితి రావ్ హైదరి
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 07.04.2017

కలలో కలవో ఇలలో చెలివో
ఎదలో ఎగిసే అలవో
మాట వినకా...
మాటు వెనుకా  ఉన్నావే
కంట పడవా నా జంట పడవా

నా కాలి నడకా దాని వెనక
నీలాగ రాక వేరేగ లేదింక

ఓ నువ్వచ్చేదాక
ఆగ లేక నేనే రానా ఉప్పెనలాగ
ఓ చెయ్యందిస్తా ఓ నేన్ వస్తున్నాగా
వెళ్లిపోకే అందకుండా
వెతకాలన్నా  వీళ్ళేకుండా

కలలో కలవో ఇలలో చెలివో
ఎదలో ఎగిసే అలవో
మాట వినకా...
మాటు వెనుకా  ఉన్నావే
కంట పడవా నా జంట పడవా

నీతో ఏదో చెబుతుందంటా
గుండె గుబులేవిటో కొంటె కబురేవిటో
కాస్త చెవినేసుకో అసలేంటో అల్లరి
అదేదో తగునా తగదో
ఇదిలా ఇపుడే మదిలో కలలో
విడిపోవద్దే ముగిసే కధలాగా
కలిసే ఉందాం కాలం కడ దాకా


********   *********   ********


చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అభయ్ జోధ్ పూర్, అర్జున్ చండీ,  చిన్మయి

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే

అల్లై అల్లై అల్లై అల్లై
నా చిట్టి చిలక జట్టై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
ఏమంత అలక చాల్లే అల్లై

నిను వెతికే నా కేకలకు
మౌనమే బదులైందే
మౌనములో నీ మాటిదని మనసే పోల్చుకుందే
లాలన చేసే వేలే లేని
పంతం ఒడిలో పలకవటే

అల్లై అల్లై అల్లై అల్లై
పుప్పొడి తునక గాలై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
పన్నీటి చినుకా జల్లై అల్లై

హో...

ముడిపడి పోయాం ఒక్కటిగా విడివడి పోలేక
కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికికా
పదునుగ నాటే మన్మధ బాణం
నేరం ఏమి కాదు కదే

అల్లై అల్లై అల్లై అల్లై
నా జత గువ్వా జట్టై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
నా చిరునవ్వా జల్లై అల్లై


********   *********   ********


చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎ. ఆర్. రెహమాన్, టిప్పు, నిఖిత గాంధి

మొరెతుకొచ్చింది బూరెతి వుదింది
ఊరంత మోగింది డివ్విట్టం
జొరెట్టి గిచ్చింది గోలెంతొ పెంచింది
లొలోన మా మంచి ముహుర్తం (X2)

ఇంకెన్నాల్ల పాటు దాస్తావు గాని
అగ్గంటి ఆ గుట్టుని
నే జాగర్త చెస్తాగ
నా చేతికిచ్చేసి చల్లారిపొ రమని
నన్నల్లుకుంటె గాని వల్ల కాదు అంది
నీ ఇబ్బంది

అంటుకొ మక్కువగా వచ్చి
ఆదుకొ అక్కున లాలించి
అందుకె లేత సొకులన్ని
ఆకు వక్క చేసి
తాంబూలం అందించని

కల్లతొ ఒల్లంతా నమిలి
చూపు యెర్రబారిందె నెమలి
ఒంపులన్ని గాలిస్తూ
ఎటు వెల్లిందంటె నెనేం చెప్పేది
కల్యాని.. బాగుందె నీ కొంటె బాని

మొరెతుకొచ్చింది బూరెతి వుదింది
ఊరంత మోగింది డివ్విట్టం
జొరెట్టి గిచ్చింది గోలెంతొ పెంచింది
లొలోన మా మంచి ముహుర్తం (X2)

నెగ్గలేని యుధం ఇదని
ఒధనకొవు గదా
ఆష పడ్డ అలసటలొ
గెలుపు వుంది కద

సరె-లెమ్మని ఇలా రమ్మని
ఎదొ కమ్మని తిమ్మిరి
చూదె అమ్మాది

యెవెట్టుకొచింది యవెట్టుకొచింది
చిన్నారి అందాల సంధొహం

పూలెట్టుకొచింది పాలట్టుకొచింది

ఎంటింక నీకున్న సంధెహం

వా కొరిక్కి కారెక్కి
నీ వెంట పడ్డదె ఎట్టాగె దానాపుట
నిను ఆరార కొరుక్కు తినందె
ఆ తిక్క తీరనె తీరాదట

నీ గాలొచి నా చెవి
లొలాక్కుతొ చెప్పె ఆ మాటా

కొప్పులొ బుట్టెదు పూలెట్టి
తప్పుకొ లెనట్టు ఆకట్టి
చెప్పుకొ వీల్లెన్ని అక్కర
పెంచావె పెట్టా ఎం చెయనె అకట

పక్కనె వున్నదె సుకుమారం
పట్టుకొ మన్నదె మగమారం
తట్టుకొ మనక ఇట్టె చప్పున చిక్కి
తప్పించు ఈ ధూరం

కల్యని.. బాగుందె నీ కొంటె బాని

(యెవెట్టుకొచింది యవట్టుకొచింది
చిన్నారి అందాల సంధొహం
పూలెట్టుకొచింది పాలట్టుకొచింది
ఎంటింకా నీకున్న సంధెహం (X3))

కల్యని.. బాగుందె నీ కొంటె బాని
కల్యని.. బాగుందె నీ కొంటె బాని


********   *********   ********


చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: షాశా తిరుపతి

మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మైమరుపా ఆ ఆ ఆ

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే
చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా

సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా
ఈ మంచు ఆమనిలో
కుహుహూ అనవా

మైమరుపా మెరుపా నిన్నిలా నదడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే
చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు
ఏతోవంటు తననే అడుగు
తరిమే చొరవా ఏమంటుందొ
కొండా కోనంలొ ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో
ఇది కల కాదులే నేలా నీకూ

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే
చలిలో పడదా
అల్లరిగ నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా

సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా

సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా


********   *********   ********

చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అర్జున్ చండీ, హరిచరన్, జోనిత గాంధి

చిటికెలు వినవే, బేబీ…
కిలకిలమనవే, బేబీ…
అకటా ఏమననే, నిను చూసి కాస్త మతిచెడెనే…
జాలైనా చూపలేవా, బింకమా బిడియమా?
ఓ లలనా నీ వలన ఇలా పిచ్చిపట్టి తిరుగుతున్నా,
ఈ నేరం నీదేనంటే
నిందిస్తున్నాననుకుంటావా…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

ఆశకొద్దీ అడిగానే అనుకోవే, ఆ టెక్కెందుకే?
పిడివాదం మాని పోనీలే అంటే, పోయేదేముందే?
వెతకగనే కలిసొచ్చే వేళ
పిలిచిందే బాలా, సందేహించాలా?
మరుగెందుకే…
తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ నీ నీ నీ నీ…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

కలిసొచ్చే వేళ పిలిచిందే బాల
సందేహించాల మరుగెందుకే
తగువేలని తెర దాటని
దరి చేరని నీ

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

Palli Balakrishna Sunday, August 20, 2017
Nayakudu (1987)


చిత్రం: నాయకుడు (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: కమల్ హాసన్, శరణ్య, కార్తీక
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: ముక్త శ్రీనివాసన్, ముక్త. వి.రామస్వామి, జి. వెంకటేశ్వరన్
విడుదల తేది: 21.10.1987

నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమా
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు
ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు
ఎవరు కొట్టారు
కనులా నీరు రానీకు
కానీ పయనం కడ వరకూ
కదిలే కాలం ఆగేను
కథగా నీతో సాగేను

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు
నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు (2)
కనులా నీరు రానీకు
కానీ పయనం కడ వరకూ
కదిలే కాలం ఆగేను
కథగా నీతో సాగేను



*******  *******   ******


చిత్రం: నాయకుడు (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ / వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, శైలజ

హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్
హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్
మసకేళ చూడు.. నీకుంది తోడు
రాచిలక అందం.. రాతిరికే సొంతం

చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది.. హొయ్యా హొయ్..
అది ఏందది హొయ్

చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి.. తజుం తజుం తజుం
అరె...చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి.. తజుం తజుం తజుం
మోజులమాటున కసికసిగా ముద్దుల దొంతరివ్వాలి
వెచ్చని వన్నెల చాటున నే ముచ్చటలాడుకోవాలి
నువ్వాడాలి.. నే పాడాలి.. పడవూగాలి హొయ్

చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్

కోకా రైకా గుసగుసలాడేనే.. తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే.. తజుం తజుం తజుం
అహ కోకా రైకా గుసగుసలాడేనే.. తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే.. తజుం తజుం తజుం
నీలో ఒదిగి నిలువెల్లా.. అల్లుకుపోతా సిలకమ్మ
గూటికి సేరే గువ్వల్లే.. ఒడిలో వాలవె చిట్టెమ్మ
నువ్వాడాలి.. నే పాడాలి.. పడవూగాలి హొయ్

చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
మసకేళ చూడు.. నీకుంది తోడు హోయ్
రాసిలక అందం.. రాతిరికే సొంతం

చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్....

హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..


Palli Balakrishna Wednesday, August 16, 2017
Gharshana (1988)


చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: వాణి జయరాం
నటీనటులు: ప్రభు, కార్తిక్ , అమల, నిరోషా
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: సి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, పి.ఆర్.ప్రసాద్
విడుదల తేది: 15.04.1988

కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

చరణం: 1
ఆకులపై రాలు... ఆ... ఆ... ఆ.....
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించినా
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించినా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం...
నీవు నాకు వేద నాదం... ఆ... ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

చరణం: 2
కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేవిఁటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం... ఆ... ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే



*******   *******   *******



చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు , చిత్ర

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

చరణం: 1
పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన జాబిలి
మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం
మల్లె పూల బంధమీవు ఓ’చెలి
అంతులేనిది ఈ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
అంతులేనిది ఈ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే
నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
మెరిసే మల్లెల లోకం చిందే చల్లని గానం

చరణం: 2
తీయనైన ఆశలన్ని నీ వరం
తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం
భావ రాగ భాష్యమే ఈ జీవితం
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె
నూరేళ్ళు నీతో సాగాలి నేనే
నీ గుండెల్లోన నిండాలి నేనే
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే



*******   *******   *******



చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: చిత్ర

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

చరణం: 1
ఉడికించే చిలకమ్మా నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే
మోజుల్లోన చిన్నదీ నీవే తాను అన్నదీ
కలలే విందు చేసెనే
నీతో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

చరణం: 2
ఈ వీణా మీటేది నీవేనంటా
నా తలపూ నా వలపూ నీదేనంటా
పరువాలా పరదాలూ తీసేపూటా
కలవాలీ కరగాలీ నీలోనంటా
పలికించాలి స్వాగతం
పండించాలి జీవితం
నీకూ నాకు ఈ క్షణం
కానిరాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఈ వేళకు సరసకు

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం



*******   *******   *******


చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ
కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

చరణం: 1
ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటి
లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి
ఆడి పాడేనులే అంతు చూసేనులే
చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
చీకు చింత లేదు ఇరుగు పొరుగు లేదు
ఉన్నది ఒకటే ఉల్లాసమే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

చరణం: 2
రైక కోక రెండు లేవు అయినా అందం ఉంది
మనసు మంచి రెండు లేవు అయినా మర్మం ఉంది
కళలూగించెలే కధలూరించెలే
కళ్ళు వల వేసెనే ఒళ్ళు మరిచేనులే
వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
రచ్చకు ఎక్కే రాచిలకలే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి
నాకే తోడు......
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ
కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ


*******   *******   *******


చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: వాణి జయరాం

రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే
ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ
పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ
లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా
మైకం సాగనీ దాహం తీరనీ
రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే

చరణం: 1
మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయనే
నేడు పువ్వాయెనే ఓడుకల్లాడినే
సందేల వయసెందుకో చిందులేస్తున్నవీ
అందాల సొగసే నినూ అందుకోమన్నదీ
క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నదీ చిన్..నదీ
రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే

చరణం: 2
ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో
వేడి పరువాలలో పండగే చేసుకో
నా చూపులో ఉన్నవీ కొత్త కవ్వింతలూ
నా నవ్వులో ఉన్నవీ కోటి కేరింతలూ
ఇవే ఇవే ఈ వేళా సుఖాల పూల వేడుకా వే..డుకా

రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే
ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ
పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ
లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా
మైకం సాగనీ దాహం తీరనీ
రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే

Palli Balakrishna
Anjali (1990)



చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: రఘువరన్ , రేవతి, బేబి షామిలి, మాస్టర్ తరుణ్ , ప్రభు
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 03.12.1990  (తెలుగులో)



Songs List:



పాటకు పాట పాట సాహిత్యం

 
చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, చిత్ర

సంథింగ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్
పాటకు పాట - సంథింగ్ సంథింగ్
మాటకు మాట - సంథింగ్ సంథింగ్




మేడపైన చూడమంట పాట సాహిత్యం

 
చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: కౌసల్య, లలిత, శుభశ్రీ, ఆర్. ప్రసన్న, షర్మిల, జమ, ఆర్. సులోచన, బి. పద్మ, ఆర్. సుచిత్ర, ఆర్. మహాలక్ష్మి, ఎస్. ఎన్. హేమా మాలిని, ఆర్. కల్పన

మేడపైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట



అంజలి అంజలి పాట సాహిత్యం

 
చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.జానకి

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపులా నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే
ఆమని శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

ఆకాశం సృష్టించినా దేవుడు గుర్తుండు రీతి
ఈ ఇలకే నిన్నువొక వరముగ ఇచ్చాడమ్మ
తల్లి నీపై వేదాలే పన్నీరే వెదజల్లేను
పూచే వసంత కోయిలలే నీకే జోలలు పాడేను
నడకలోన ఒక పూలతవే - నీవే
నవ్వులోన ఒక మల్లికవే - నీవే
అందచందాల చిన్నారి - నీవే
లోకమే మెచ్చు పొన్నారి
నీవేగ మాకు దేవత
నీలాల అంబరాల తారక

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

పూవల్లే నీ కళ్ళతో పలికే సింగారి నీవే
హంసవలే మాతోయిక ఆడే బుజ్జాయివే
వినువీథుల్లో విహరించే వెన్నెలపాప అంజలివే
అమ్మ చల్లని ఒడిలోన ఆడే పాడే అంజలివే
నడచివచ్చు ఒక బొమ్మవటా - నీవే
మెరిసిపోవు ఒక మెరుపువటా - నీవే
చిందులాడు ఒక సిరివంటా - నీవే
చిలకరించు విరి తేనెవటా
తరంగమల్లే ఆడవా స్వరాలకోటి నీవు పంచవా

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపులా నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే
ఆమని శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి COME ON
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి యాహూ





వేగం వేగం యోగం పాట సాహిత్యం

 
చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: 

వేగం వేగం యోగం



రాత్రివేళ రాక్షసి గోల పాట సాహిత్యం

 
చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి. బాలు & కోరస్

రాత్రివేళ రాక్షసి గోల



గగనం మనకు పాట సాహిత్యం

 
చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: కార్తిక్ రాజా & కోరస్

గగనం మనకు




చందమామ రాతిరేల కదిలెనే పాట సాహిత్యం

 
చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.జానకి & కోరస్

చందమామ రాతిరేల కదిలెనే

Palli Balakrishna Saturday, August 12, 2017
OK Bangaram (2015)

చిత్రం: ఓకే బంగారం (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఏ. ఆర్.రెహమాన్, కార్తిక్, శాశా తిరుపతి
నటీనటులు: దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 17.04.2015

మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా
జస్ట్ లైక్ దట్
మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా

మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి (2)
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి

వీలుకాదేమో - జస్ట్ లైక్ దట్
ఆశ తగదేమో - జస్ట్ లైక్ దట్

మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా
ని ని ని ని ని ని ని నీక్కూడా తెలుసేమో

వీలుకాదేమో - జస్ట్ లైక్ దట్
ఆశ తగదేమో - జస్ట్ లైక్ దట్

ఇలాంటి వేళలో పంతానికేం పని
తెగించి అల్లుకో ఉన్నాను రమ్మని
మేఘాల గాలిలో పైకి తూగిపో
ఎల్లలన్ని దాటవా గాలి వేగమా

మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా

సడిలేని మాటతో కబురులు చెప్పవా
తడిలేని వనలలో తలంటు పొయ్యవా
స్నేహాల వాగులో దాహాలు తీర్చుకో
మోహల ఊహలో దేహాలు దేనికో

M- మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
F -మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
M&F మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
F- మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా



*********   *********   **********



చిత్రం: ఓకే బంగారం (2015)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శాశా తిరుపతి , సత్యప్రకాష్

విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
కొన్నాళ్లుగా ఏదో నీలో ఉన్నదీ...
విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
ఏదో అడగనా ఏదైనా అడగనా

ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన

ఏదో.. ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే
చిన్న చిన్న సరదాలు
చిన్న దాని చిన్న చిన్న సంశయాలు
విన్నవించు ఆశలు పలికిన సరిగమలో..ఓ..ఓ..

ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగనా...
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి సడిలోన
తకధిమి కదలిక
తకధిమి తికమక కవళిక
తదుపరి తకధిమి తెలుపని తరుణంలో

ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా



Palli Balakrishna Friday, August 11, 2017
Amrutha (2002)



చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: మాధవన్ , సిమ్రాన్, కీర్తన పార్థిబన్, జె. డి.చక్రవర్తి, నందిత దాస్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: జి. శ్రీనివాసన్
విడుదల తేది: 14.02.2002



చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, బలరాం

పల్లవి:
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

చరణం: 1
తల్లి నేలని పల్లె సీమని విడ తరమా తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
కదిలే నదులారా కలలే అలలౌనా
జననీ... జన్మ భూమి స్వర్గాదపి గరీయసి
కన్నీటి తెరలలో తల్లి నేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయెనో

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

చరణం: 2
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే
పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురు మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే.. మిగిలుంటే ఒడిలో తలదాచవా
తలపే అల్పం తపనే అధికం
బరువెక్కిన హృదయం మోసుకునే పోతున్నా...

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..





చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఏ.ఆర్.రెహమాన్

పల్లవి:
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా

చరణం: 1
గాలి పాటలా సడి వాన జావళీ
అది మౌనంలా దూరం అవునా
వేళ మాటలే వివరించలేనిది
తడి కన్నుల్ల అర్ధం అవునా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా -  విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా -  తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా

చరణం: 2
లేత పాపలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావా సిరుల వెన్నెలా
వీర భూమిలో సమరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా -  విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా -  తపనగా





చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్

పల్లవి:
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే

చరణం: 1
ఎదకు సొంతం లే  ఎదురు మాటవు లే
కలికి వెన్నెలలే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని
స్వాతి వానని చిన్న పిడుగని
ప్రాణమైనది పిదప కానిది
ప్రాణమైనది పిదప కానిది
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో...

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే

చరణం: 2
సిరుల దీపం నీవే  కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని
ఇంటి వెలుగని కంటి నీడని
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నేనెత్తి పెంచిన శోకంలా...

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా



Palli Balakrishna Saturday, August 5, 2017
Yuva (2004)




చిత్రం: యువ (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: సూర్యా , మాధవన్ , సిద్దార్ధ్ , ఇషా డియోల్ , మీరా జాస్మిన్, త్రిష
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 21.05.2004



Songs List:



Hey Goodbye Priya.! పాట సాహిత్యం

 
చిత్రం: యువ (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, సునీతా సారధి, లక్కీ అలి, కార్తీక్

Hey Goodbye Priya.! (2)

కళ్ళలో కల్మషం
ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధు విషం
స్పర్శలో మధు విషం
నేన కానోయి నా వశం
నీవేవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలి చూపే పొరపాటో
నీవేవరో నేనెవరో 

దొంగ చూపుతో యద దోచుకున్నావు
సొట్ట బుగ్గలో నను దాచుకున్నావు
మెత్తగా వచ్చి మనసు దోచి
నను చంపేయమంటా
నీవేవరో నేనెవరో

ఆకుపై చినుకులా అంటనీ తేమల
కలవకు ఊహలా బ్రతకని నన్నిలా 

నీవేవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలి చూపే పొరపాటో
నీవేవరో నేనెవరో

Hey Goodbye Priya

అడ్డ దారిలొ నీ దారి కాశాను 
దారి తప్పినా నే తేలి చూసాను 
తొలగి పొతివంటె తంటయే లేదు
ఇది పనిలేని పాట
నీవేవరో నేనెవరో




సంకురాత్రి కోడి పాట సాహిత్యం

 
చిత్రం: యువ (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: మధుశ్రీ , ఏ.ఆర్.రెహమాన్

సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా

చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో
నువ్వు రెండు మూరలా పానుపెయ్యరా
జగడం వచ్చెనా తాకవొద్దయ్యా

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యాయా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా

ఆకు వక్క వేసినా నోరుపండదేమి
ఒక పంటి కాటుకే ఎర్రనౌను సామీ
స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి
వీధి అరుగుమీదే దోచుకున్న వలపూ
వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు

మేడ మిద్దెలేలా చెట్టు నీడ మేలూ
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలూ
ముక్కెర్ల వెలుగులో రేయి తెలవారూ
చప్ప ముద్దుపెడితే వొళ్ళు మండిపోదా
సాహసాలు చేస్తే చల్లపడిపోనా



Dol Dol పాట సాహిత్యం

 
చిత్రం: యువ (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: Blaaze
గానం: Blaaze, Shahin Badar (Ethnic Vocals)

Dol Dol




వచ్చిందా మేఘం పాట సాహిత్యం

 
చిత్రం: యువ (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: అద్నాన్ సామి, సుజాత

ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు 
ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా

వచ్చిందా మేఘం రానీ పుట్టిందా వేడి పోనీ
తెచ్చిందా జల్లు తేనీ మనమేం చేస్తాం
వచ్చిందా దారి రానీ అదిపోయే చోటికి పోనీ
మలుపొస్తే మారను దారి మనమేం చేస్తాం

విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా

మనమేం చేస్తాం మనమేం చేస్తాం
మనమేం చేస్తాం మనమేం చేస్తాం

రాళ్ళను కూడా పూజిస్తారు 
అవి దార్లో ఉంటే ఏరేస్తారు
దారప్పోగు నాజూకైనా పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతుచిక్కే అర్దం చేసుకో విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్ 
సరేలే నీకు నాకు ఎవరున్నారు

విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని
తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని
మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం

కడలింటా కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు
పువ్వుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్ని
ఏ కొందరి అడుగుజాడలో నేల మీదా అచ్చవుతాయి
ఈ నీడలా చీకటి పడిన ఆ జాడలో చెరిగిపోవోయి

ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు 
ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని
తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని
మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా





దేహం తిరి పాట సాహిత్యం

 
చిత్రం: యువ (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఏ.ఆర్.రెహమాన్, సునితా సారథి, తన్వి

ఫనా.... ఫనా....
ఫనా.....ఫనా.....

దేహం తిరి వెలుగన్నది
చెలిమే
జీవంనదీ ఎద నీరథీ
నెనరే

పుటకే పాపం కడుగు అమృతం
చెలిమే
హృదయం శిల శిలలో శిల్పం
చెలిమే

దేహం తిరి వెలుగన్నది

ఫనా.... ఫనా....

తాకుతాం తగులుతాం 
పరుస్తాం స్మరిస్తాం 
వొదులుకోం

తాకుతాం తగులుతాం
పరుస్తాం స్మరిస్తాం
చెదిరిపోం

జన్మాంకురం కాసే ఫలం
లోకం ద్వైతం కాంక్షే అద్వైతం
సర్వం శూన్యం శేషం ప్రేమ
మనిషి మాయం చెలిమి అమరం
లోకానికి కాంతిధార ఒకటే ఒకటే
ప్రతి ఉదయానికి వేకువైన వెలుగూ ఒకటే



జనగణ మన పాట సాహిత్యం

 
చిత్రం: యువ (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఏ.ఆర్.రెహమాన్, కార్తీక్

జనగణ మన
జన మొర విన
కల నిజమయ్యె
కాలం ఇదే

వెలుగే బాటగా
మలలే మెట్లుగా
పగలే పొడిగాగ
చక్ చక్ చక్ చక్ చక్ పుట్ సల్

ఇకపై ఇకపై విరచిద్దాం
విధినే మార్చే ఒక చట్టం

ఆయుధమిదే
అహమిక వధే
దివిటీ ఇదే
చెడుగుకు చితే
ఇరులే తొలగించు

ఈ నిరుపేదల
ఆకలికేకలు ముగించు
బరితెగించు
అరె స్వాహాల దాహాల
ద్రోహాల వ్యూహాలు ఛేదించు

కారడవుల సుడిగాలి మనం
కాలికి తొడుగులు ఎందుకులే
తిరగబడే యువశక్తి మనం
ఆయుధమెందుకు విసిరేసేయ్

అదురే విడు
గురితో నడు
భేదం విడు
గెలు ఇప్పుడు
లేరా పోరాడు

మలుపుల జారబడి నదివలె పరువిడి
శ్రమించూ శ్రమ ఫలించు
అరె విజయాల వీధుల్లో
నీ వీరసైన్యాలు నిలిస్తే

సజ్జనులంతా వొదిగుంటే
నక్కలు రాజ్యాలేల్తుంటే
ఎదురే తిరుగును యువ జనత
ఎదురే తిరుగును భూమాత


Palli Balakrishna

Most Recent

Default