చిత్రం: కురూప్ (2021) సంగీతం: శుశిన్ శ్యామ్ నటినటులు: ధుల్కర్ సల్మాన్, శోభిత దులిపాల దర్శకత్వం: శ్రీనాథ్ రాజేంద్ర నిర్మాతలు: ధుల్కర్ సల్మాన్, విసాక్ సుబ్రహ్మణ్యం విడుదల తేది: 12.11.2021
Songs List:
ఇది పరవశమో పాట సాహిత్యం
చిత్రం: కురూప్ (2021) సంగీతం: శుశిన్ శ్యామ్ సాహిత్యం: భువనచంద్ర గానం: హరిప్రియ ఇది పరవశమో… తొలి కలవరమో ఎద మలుపులలో… మెదిలిన స్వరమో ఎద వణికినది… నిను పిలిచినది నిను తలువగనే మదువొలికినది అణువణువున ఓ అలజడి కలిగే ఒక విరహములో వెచ్చంగా ఒదిగి అణువే సంద్రమైనది ప్రియ సఖుడా క్షీరసాగరమేగా అనురాగం కసికసి తనువుల ప్రియరాగం నిండు యవ్వనమేగా ఒక యోదం వయసులు కలబడు సుఖభోగం ప్రియుడా ప్రియుడ ప్రియతమా సఖుడా కలలో ఇలలో నిను విడగలనా సొగసుల భారం పెరిగినదోయి సమరమే సఖుడా ప్రియమోయి ఇది పరవశమో… తొలి కలవరమో ఎద మలుపులలో… మెదిలిన స్వరమో అణువణువున ఓ, హ్మ్ హ్మ్… అలజడి కలిగే, హ్మ్ హ్మ్ ఒక విరహములో వెచ్చంగా ఒదిగి అణువే సంద్రమైనది ప్రియ సఖుడా
డింగరి డింగాలే పాట సాహిత్యం
చిత్రం: కురూప్ (2021) సంగీతం: సులైమాన్ కక్కొదన్ సాహిత్యం: భువనచంద్ర గానం: దీపక్ బ్లూ డింగరి డింగాలే అమ్మాడి… డింగరి డింగాలే మధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే డింగరి డింగాలే అమ్మాడి… డింగరి డింగాలే మధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే పక్కింట్లో ఉన్న రంగేళి బొమ్మ కొంచం వాటేస్తే… పెట్టెయ్నా చుమ్మా బెల్ బాటమ్ ప్యాంటు వేసి హై హీల్స్ షూస్ తొడిగి చేపమల్లె జారుద్ది గుమ్మా రావే రావే రావే నా వంక రావే రావే ఇయ్ వే ఇయ్ వే ఓ గిఫ్టు ఇయ్ వే ఇయ్ వే మోజుపడ్డ కుర్రదాని పోజులో ఒక మజా ఉందే… ముద్దు గుమ్మ కళ్ళు మూసి నిన్నే నేను తలవగా అరె నువ్వే నా కలల తలుపు తీశావంట బ్రెడ్డుకి వెన్నపూసే మిస్సమ్మ నువ్వు లేకుంటే ఆకలి లేదే బ్రెడ్డుకి వెన్నపూసే మిస్సమ్మ నువ్వు లేకుంటే ఆకలి లేదే నీకోసం ప్రేమ ప్రేమ ఒక సంద్రాన్నే ఈదొస్తానే సై అంటే భామ భామ మత్స యంత్రాన్నే కొట్టేస్తానే రావే రావే రావే నా వంక రావే రావే ఇయ్ వే ఇయ్ వే ఓ గిఫ్టు ఇయ్ వే ఇయ్ వే రావే రావే రావే నా వంక రావే రావే ఇయ్ వే ఇయ్ వే ఓ గిఫ్టు ఇయ్ వే ఇయ్ వే
అనువైనకాలం పాట సాహిత్యం
చిత్రం: కురూప్ (2021) సంగీతం: శుశిన్ శ్యామ్ సాహిత్యం: భువనచంద్ర గానం: సుర్ముఖి రామన్ అనువైనకాలం
సింహపు జూలుని పట్టి పాట సాహిత్యం
చిత్రం: కురూప్ (2021) సంగీతం: లియో టామ్ సాహిత్యం: భువనచంద్ర గానం: షెన్బగరాజ్ సింహపు జూలుని పట్టి ఆకాశ తీరం దాటి గాలుల ఒడిలో తేలి కాలపు కన్నులు మూసే ఓ ఓ, అతడంతర్వాహిని అంతర్వాహిని ఆగని నిలువని ఆట అడుగడుగునో వేట ఊహకందడే పూట అతడే సిసలైన అంతర్వాహిని సింహపు జూలుని పట్టి ఆకాశ తీరం దాటి గాలుల ఒడిలో తేలి కాలపు కన్నులు మూసే అతడంతర్వాహిని అంతర్వాహిని
దారేలేకున్నా పాట సాహిత్యం
చిత్రం: కురూప్ (2021) సంగీతం: శుశిన్ శ్యామ్ సాహిత్యం: భువనచంద్ర గానం: షెన్బగరాజ్ దారేలేకున్నా
Kurup (2021)
Palli Balakrishna
Monday, November 1, 2021
