Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Yuvan Shankar Raja"
Gangs of Godavari (2023)



చిత్రం: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (2023)
సంగీతం: యావన్ శంకర్ రాజా 
నటీనటులు: విశ్వక్ సేన్, నేహ శెట్టి , అంజలి 
దర్శకత్వం: కృష్ణ చైతన్య 
నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య 
విడుదల తేది: 08.12.2023



Songs List:



సుట్టంలా సూసి పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (2023)
సంగీతం: యావన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రీ హర్ష 
గానం: అనురాగ్ కులకర్ణి 

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా

ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్ని
పూసగుచ్చేలా

ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే సాలులే ఇలా
సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా..!

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

Palli Balakrishna Sunday, October 8, 2023
Samanyudu (2022)



చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: విశాల్, డింపుల్ హయాతి
దర్శకత్వం: సరవనన్ 
నిర్మాత: విశాల్
విడుదల తేది: 2022



Songs List:



మత్తెక్కించే కళ్ళే పాట సాహిత్యం

 
చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రీమణి 
గానం: యువన్ శంకర్ రాజా 

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
నేనేం చెయ్యాలి

నీతో అడుగే పడితే
నాలో ఒంటరితనమొక సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి
కల నిజమే చేద్దాం పదవే

కనుసైగ తోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

ఉదయాన్నే హాయిగా
ఒళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని
నన్నే నిన్ను గిల్లుకుని

ఎటు పక్క నేనున్నా
నాతో నిన్నే పక్కన చూసి
ఏం చక్కని జంటని చెప్పి
లోకం కుళ్ళి చావని

ప్రాణం విడువని జతగా
మన ప్రేమ ప్రయాణం మొదలవ్వని
కాలం మరువని కధగా
మన ప్రేమని చరితే చదివేయ్ని

నీ బుగ్గల్లోని సిగ్గే
చీకట్లో వెన్నెల
అది అడిగే తీయని ముద్దే
నా పెదవికి వెన్నెల

కనుసైగతోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
ఏం చెయ్యాలి

Palli Balakrishna Wednesday, January 19, 2022
1945 (2022)



చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: రాణా  దగ్గుబాటి, రెజీనా కసండ్రా
దర్శకత్వం: సత్య శివ 
నిర్మాత: ఎస్.యన్.రాజరాజన్
విడుదల తేది: 07.01.2022



Songs List:



అల్లరి చేసే కల పాట సాహిత్యం

 
చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హరిచరణ్ , ప్రియా మాలి 

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

వెల్లువలాంటి ప్రాణమే
వేచి వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా
నిన్ను ఏదోలా
అయితే అదేదో
ఈ క్షణం లోనే చేరితే పోలా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

నెమ్మదిగా నెమ్మదిగా
ముసురులా కమ్మినదే
మైకమేదో మరుపు నేర్చేలా

ఆఆ ఆ, నమ్ముదుగా నమ్మవుగా
మేమేదో రమ్మందిగా
నేను నీతో కనులు కలుపుతూ
ఆదమరిచేనా

పెదవిపైన పెదవిలా
హాయిగా పవళించగా
ఎదలలోనా కదలనే
మౌనమే తెలపాలిగా
అవధులన్నీ చెరిపివేసే
ప్రేమసాక్షంగా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

Palli Balakrishna Sunday, January 9, 2022
Chakra (2021)
చిత్రం: చక్ర (2021)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిన్మయి శ్రీపాద, ప్రార్థన ఇంద్రజిత్
నటీనటులు: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: యం. యస్. ఆనందన్
నిర్మాత: విశాల్
విడుదల తేది: 19.02.2021







అమ్మ నువ్వంటే నాకు ప్రాణం
అమ్మ నీతోనే నాకు లోకం
నీతోనే నేనుంటా నీ రాణినంట
నీలో కనిపించేది నా రూపేనమ్మా

నీ చేతుల్లో నా చేయుంటే ఎంత సుఖం
నువ్ లేకుండా ఉండలేనే నేను క్షణం
నన్ను నడిపించేవి నీ మాటలే
దారి చూపించేవి నీ చూపులే

చిరునవ్వై ఒదిగుంటా నీ ఒడిలో నేనమ్మా
చీకట్లో దీపంలా నా దరికొచ్చావమ్మా
నువ్వే నా నేస్తం నా ప్రాణం అమ్మ
నే చూడలేనే నీ కళ్ళల్లో చెమ్మ
రెక్కలు వచ్చాయే నా మనసుకు ఈనాడు
నేనే నువ్వైపోతానమ్మా ఓ నాడు

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆఆ ఆఆ ఆఆ ఓఓ


Palli Balakrishna Sunday, March 21, 2021
NGK (2019)
చిత్రం: NGK (2019)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: సూర్య , సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: సెల్వ రాఘవన్
నిర్మాతలు: ఎస్. ఆర్. ప్రభు, ఎస్. ఆర్. ప్రకాశ్ బాబు
విడుదల తేది: 31.05.2019







చిత్రం: NGK (2019)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్ శ్రీరామ్, హేమాంబిక

ప్రేమా ప్రేమా

ఓ ప్రేమా ఓ ప్రేమా

ప్రేమా సుడిగాలై నువ్వే ఉంటే 
చిరుగాలై చేరనా
నిశిలాగా నువ్వే ఉంటే 
నిను నీడై తాకనా
నదిలాగా నువ్వే ఉంటే 
చినుకై నే చిందనా

అడిగా బదులడిగా 
నీ అడుగై నడిచే మార్గం చూపుమా చూపుమా
పిలిచా నిను పిలిచా 
నీ కలలో నిలిచే మంత్రం చెప్పుమా చెప్పుమా

ప్రియమేఘం కురిసే వేళ 
పుడమెంత అందమో
మరుమల్లి మందారాల 
చెలిమెంత అందమో
ఎగసే అలలెగసే నీ ప్రేమలొ అందం 
ఎదనే లాగెనే లాగెనే

గుండెల్లొ నిండే మోహం 
శ్వాసల్లొ ధూపం వేసే
చుట్టూర పొగలై కమ్మెనే
గుట్టంత తెలిపేనే

తలుపులు వదలని యోచన
పెరిగెను మనసున యాతన
ప్రాయము చేసే ప్రార్ధన
పరుగున వచ్చే మోహన

ఓ చైత్రమాసాన మేఘమే చిందేను వర్షం
కోనల్లోన మోగదా భూపాళ రాగం

ప్రేమా ఓ ప్రేమా
మన నీడల రంగులు నేడే కలిసెనే కలిసెనే
చెలిమే మన చెలిమే ఒక అడుగై పెరిగి 
అఖిలం ఐనదే ఐనదే
ఓ అనురాగం పాడాలంటే మౌనం సంగీతమే
అనుబంధం చూపాలంటే సరిపోదె జన్మమే




Palli Balakrishna Friday, February 19, 2021
Sikindar (2014)
చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: సూర్య, సమంతా
దర్శకత్వం: ఎన్. లింగుస్వామి
నిర్మాతలు: సిద్దార్థ్ రాయ్ కపూర్, ఎన్. సుభాష్ చంద్రబోస్
విడుదల తేది: 15.08.2014







చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రాకెందు మౌళి
గానం: దీపక్, హరిచరణ్, యువన్ శంకర్ రాజా

నేనే  కాని నేనై  ఉండగా నీ  చూపే తాకి  
ప్రాణమే మరు జన్మే  పొందగా
ఎన్నో మార్పులు  రానె వచ్చెగా
అవి మారే కొద్ది  అణువణుల్లో నువ్వే కొత్తగా 

ఎందుకో...  ఇంతలో...
ఎందుకో  ఇంతలో  అంతటి వింతలే
ప్రేమ  మయమే మహిమే మహిలో నిండేలే

తను చిలిపిగ నగవులు చిలికితే 
తుది చనువుల చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే 
యద కదలిక  కుదురిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ

నేనేె కాని నేనై  ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా
ఓ ఎన్నో మార్పులు రానె వచ్చెగా
అవి మారే కొద్ది అణువణుల్లో నువ్వే కొత్తగా 

కనుల కల ఎదురైతే కునుకిక కుదురేదీ
కల, నిజం,యుగం, క్షణం, నీ  జంటగా ఓ వింతట
చుపులకు కనబడని రేపటిని  చదివే మది
ఊహలోకం, నా ముందర  కొరిందిలే ఎ  తొందర
హద్దు పొద్దు లేని వలపునే పంచనా
చొరవ చూపు వేళ నిన్ను నే మించనా
నిన్ను నే మించనా
ని స్వాసే  నాలో ఉసురై ఉంచెనా

తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ

మనసు పొరలొ మాటే పలికినది పాటే
నిరంతరం  నీ ధ్యానమే ఇహం పరం నీ కోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నీ తోటే
ఏ జన్శకీ  నీ తొడునే  వీడానులే అత్యాసగా
నీకు తేలుపలేని  తలపులే వేలులే
నీవు చెంత నుంటే మౌనమే మేలులే
మౌనమే మేలులే 
ఈ తహ తహ తీర్చగ  ప్రేమే చేప్పవా 

తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ



Palli Balakrishna
Maari 2 (2018)


చిత్రం: మారి 2 (2018)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: ధనుష్, సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్ కుమార్
దర్శకత్వం: బాలాజీ మోహన్
నిర్మాత: ధనుష్
విడుదల తేది: 21.12.2018







చిత్రం: మారి 2 (2018)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: సామ్రాట్
గానం: ఎమ్. ఎమ్. మానసి, ధనుష్

హే నా నాటుకోడివే నా క్యూట్ జోడివే
నీ బుజ్జి పప్పి నే టేక్  మీ టేక్  మీ

హే నీ చిలక ముక్కే 
నా గుండెకి హుక్కే
నువ్ కేకో కేకే టాక్ మీ టాక్ మీ
హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాల మజా 
హే మాస్ మారాణి నా ఆకాశవాణి 
నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ

రా మనం లాంగ్ డ్రైవే పోదాం 
ఊర మాసు స్టెప్పే వేద్దాం 
నువ్వే  లే  నా  రౌడీ  బేబీ

రా యు అర్ మై ఓన్లీ గర్ల్ ఫ్రెండు
నా  గుండె  నీకు  దిండు
ఉయ్  విల్ మాక్  అస్  న్యూ  ట్రెండు  బేబీ

పోదాం వేద్దాం రౌడీ బేబీ
గర్లు ఫ్రెండు నీ దిండు ట్రెండు బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ

నిన్నెలే   నే   కోరింది
నా  రూటంత నీ  వల్లే  మారింది
హే  ఈడొచ్చి  మంచి  మూడొచ్చి
ఈ  మారి  కె  ఎక్కిందే  నీ  పిచ్చి

ఒకటై  కలిసి  ఉందామా ఒడిలోకొస్తే  హంగామ
రావే  నాటీ  రాణి నా  నింబు  పాణి
చీకట్లో  పని అరేయ్  చేద్దాంలే  చిన్ని
నా  సోకులా  ఖైదీ నువ్  చెప్పొక  తేది
సొగసంతా  నీది అడ్డు  లేదంట  ఏది

ఏ  రౌడీ  బేబీ , హే  రౌడీ  బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ

హే  నీ  నాటుకోడినే నీ  క్యూట్  జోడి  నే
న  బుజ్జి   పప్పి నే టేక్  మీ  టేక్  మీ
హే  నా  చిలక  ముక్కే నీ  గుండెకి  హుక్కే
నువ్  కేకో  కేకే టాక్  మీ  టాక్  మీ

హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాలా మజా 
హే మాస్ మారాణి నా ఆకాశవాణి 
నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ

రా మనం లాంగ్ డ్రైవే పోదాం 
ఊర మాసు స్టెప్పే వేద్దాం 
నువ్వే  లే  నా  రౌడీ  బేబీ

రా  యు  అర్  మై  ఓన్లీ  గర్ల్  ఫ్రెండు
నా  గుండె  నీకు  దిండు
ఉయ్ విల్  మాక్  అస్  న్యూ  ట్రెండు  బేబీ

రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ 
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ


Palli Balakrishna

Most Recent

Default