Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Yarllagada Surendra"
Iddaru Iddare (1990)


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగార్జున , నాగేశ్వరరావు, రమ్యకృష్ణ , కె.ఆర్.విజయ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: అక్కినేని వెంకట్ , యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 05.09.1990

ఓరి దేవుడో  ఇది ఏమిమాయరో
అదో రకం అయోమయం
ఓరి కాముడో ఇది ఏమి హాయిరో
సుఖాసుఖం ప్రతీ క్షణం
లో  లో ఏదో... అయిందయో...
ప్రేమో... ఏమో...

ఆడ గాలిని అడగాలి వెంటనే
అటో ఇటో తెగించనా
ఈడు గోలని అనచాలి వెంటనే
పెదాలతో బిగించనా
ఏకాంతంలో... ఎకా ఎకీ...
జై జై లో లో...

ఆడు యవ్వనం బరువైన ఈ క్షణం
ఎలా మరి భరించడం
ఓరి దేవుడో  ఇది ఏమిమాయరో
అదో రకం అయోమయం


*******   *******  *******


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
వీదుల్లొ విస్కి కొట్టి నిన్నేలుకుంటా
మాటల్తొ మస్క కొట్టి నే జారుకుంటా
దాచేసుకోకె బుల్లి తట్ట బుట్టా
లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా

పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
సందుల్లొ గిల్లి కజ్జ నే పెట్టుకుంటా
చూపుల్తొ చుమ్మ కొట్టి నేనాడుకుంటా
దోచేసుకుంటె యెట్ట తట్ట బుట్ట
పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా

పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా

టీనేజి టింకర్లు వేసుతుందీ నా ముద్దు..ఉమ్మా
మ్యారేజి సంకెల్లు వేస్తుందా ఆ ముద్దు
తొలి ముద్దు...తొలి ముద్దు
ట్రై చేస్తా...ట్రై చేస్తా
ప్రేమాటా కొత్తంటా పెల్లాటే పాతంటా
ఒక్కీసు పిట్ట నీకే కిస్స్ ఏ కొట్టా

లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
వీదుల్లొ విస్కి కొట్టి నిన్నేలుకుంటా
చూపుల్తొ చుమ్మ కొట్టి నేనాడుకుంటా
దాచేసుకోకె బుల్లి తట్ట బుట్టా
లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా

కాలేజి లెక్చర్లు దంచేద్దం ఈ ప్రేమా
స్వీటెజి స్టిక్కర్లు అంటించే నా ప్రేమా
లక్కుంటె పట్టెస్తా...లక్కుంటె పట్టెస్తా
నా గువ్వ గూడెక్కె నా రాజే వేడెక్కె
నా గూడు నీ నైసు గుడ్డె పెట్ట

పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
సందుల్లొ గిల్లి కజ్జ నే పెట్టుకుంటా
మాటల్తొ మస్క కొట్టి నే జారుకుంటా
దోచేసుకుంటె యెట్ట తట్ట బుట్ట
పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా


*******   *******  *******


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం
జవ్వనలో జాగ్రఫీలు జానలలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు రొమాన్సులో రహస్యాలు
తెలిపె వలపె విరిసె వయసిది కద

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం
జవ్వనలో జాగ్రఫీలు జానలలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు రొమాన్సులో రహస్యాలు
తెలిపె వలపె విరిసె వయసిది కద

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం

టట చెప్పర సోదర ప్రతి క్లాసుకీ
దుట్య్ వెయ్యర వీదిలొ చెలి వేటకీ
వీలు చూసి గాలమేసి ఈల కొట్టు
సందు చూసి సిగ చేసి సైటు కొట్టు
ప్రేమ సిక్ష వేడుకుంటు జోల కొట్టు
జాలి చూసి చేరమంటు గోల పెట్టు
పరాభవం యెదురైనా పరాజం అనుకోకు
పరిక్షలే ఫైల్ అయినా నిరాసలో పడిపోకు
సరిగా వినరా బ్రదరు తొలి సిలబసు

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం

సాయం కాలం పార్కులే నీ క్లాసురూం
బేబి హాబి జాబిత నీ పుస్తకం
పాపకెన్ని పరికినీలొ లెక్క పెట్టు
వాల్లకొచ్చు కుక్కపిల్ల జట్టుకట్టు
ఆమెగారి ఈసడింపు ఓర్చుకుంటు
అడ్డమైన చాకిరీలు చేసి పెట్టు
ఇలా ఇలా గడిచాకా తపొఫలం పెరిగాకా
లికించరా ఓ లేఖ ఫలించురా నీ కాక
బదులె దొరికె వరకు కద నడపర

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం
జవ్వనలో జాగ్రఫీలు జానలలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు రొమాన్సులో రహస్యాలు
తెలిపె వలపె విరిసె వయసిది కద

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం


*******   *******  *******


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.ఓయ్.బాలు

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
స్వాగతం చెబుతున్నా
నేనె పసివాడ్నై నీ నీడ చేరుకున్నా

జీవితాన ప్రతి పాటం చేదె అనుకున్నా
తియ్యనైన మమతల రుచి నేడే చూస్తున్నా
అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
వందనం చేస్తున్నా
నేనె గురుదక్షినగా అంకితం అవుతున్నా

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా

ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రు రుణం తీర్చి
చల్లరిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి
తోడైన నీ ముందు ఓడానా గెలిచానా

ఒకేతండ్రి నుంచి రెండు జన్మలందుకున్న
తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్న

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా

పగలే గడిచింది పదమర పిలిచింది
వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను
కాచుకున్న కాల రాత్రి గెలుచేసులు ఏమిటో
కాటుక నది ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
రాతిరి కరిగిందీ తూరుపు దొరికిందీ
కల్లు తెరిచి ఇపుడిపుడె ఉదయిస్తున్ననూ
అచ్చమైన స్వచ్చమైన తెలుపంటె యేమిటో
మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను

ఇన్నాల్ల మన దూరం ఇద్దరికి కూడ
ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా
పాటలు ఏమైనా నీతి ఒక్కటె నాన్న
చీకట్లు చీల్చడమే ఆయుదమేదైనా


Palli Balakrishna Wednesday, October 11, 2017
Gaayam (1993)



చిత్రం: గాయం (1993)
సంగీతం: శ్రీ  కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: జగపతి బాబు, రేవతి
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 22.04.1993



Songs List:



నైజాం పోరి పాట సాహిత్యం

 
చిత్రం: గాయం (1993)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర, ఈశ్వర్

ఆ... ఆ... ఆ...
పాడనా గోపాలా కమ్మగా
కైపే కమ్మగా కళ్ళే వాలగా
ఊపనా ఉయ్యాల మెల్లగా
చల్ల చల్లగా ఒల్లే తేలగా
అరే గిదేం షురు చేసినావమ్మ
ఇయలరేపు ఎవడింతడు
పాటపాడితే కిక్ ఉండాలే

నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
బాగుంది భయ్ జర లాగింది భాయ్ 
దిమాక్ పాయె దిల్ దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతమంటే 
పత్త లేక పారిపోయెరో

జింగారే జీగిచాక జింగిచాక (6)

పైటను చూడగానే పైత్యమొస్తదా 
పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేమి మీద మీదా
పైలా పచ్చీసు ఈడు గమ్మునుంటదా
మన్ను తిన్న పాము లెక్క ఊరుకుంటే పరువు పోదా
పబ్లిక్ చూస్తరన్న ఖాతరుండదా
ఇజ్జత్ పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా
ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా
ఊర్కేనే ఉండమంటే మంచి మోకా జారిపోదా
ఆ హ హా...
వామ్మో వద్దమ్మో కిక్కు ఊపు అరె ఉండాలమ్మో
గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా

జింగారే జీగిచాక జింగిచాక (2)

యాద్గిరి గుట్ట కాడ ఎదురు పడ్డది
తు తేరి అంటూ నన్ను గుస్సా చేసి కస్సుమంది
ఒంటరి ఆడపిల్ల అంత లోకువా
తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకు లేరా
అక్కలు సెల్లెల్లు అందరుండినా
సక్కని సుక్క లాటి ఆళి తక్కువాయె మళ్ళ

కమ్ డౌన్ బేబీ డోంట్ షై
వై డోంట్ యు టేక్ మీ ఆన్ ఎ డేట్ విత్ యు
ఓ మై లవ్... మై డార్లింగ్... యాహ్

ఎ ఎ ఏ ఏందయ్యో 
ఏంటా స్పీడు లేదా బ్రేకు
అరె ఆట పాట సాగాలంట ఫికర్ దేనికంట

నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
బాగుంది భయ్ జర లాగింది భాయ్ 
దిమాక్ పాయె దిల్ దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతమంటే 
పత్త లేక పారిపోయెరో

జింగారే జీగిచాక జింగిచాక (2)





నిగ్గదీసి అడుగు పాట సాహిత్యం

 
చిత్రం: గాయం (1995) 
సంగీతం: శ్రీ  కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఎస్.పి.బాలు

(నవంబర్ 30, 2021 న చేంబోలు సీతారామశాస్త్రి గారు  స్వర్గస్తులయ్యారు, ఈ సందర్భంగా ఈ పాటని గుర్తుచేసుకుంటూ,    కాస్త ప్రశ్నించినట్టుగా అనిపించినా ఇరవైఐదు ఏళ్ళ క్రితం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నేటికీ వర్తిస్తుంది. సంవత్సరాలు గడచిపోతున్నాయే  కానీ పరిస్థితులు మారట్లేదు. సమాజం ఉన్న పరిస్థితిని స్పష్టంగా కళ్ళముందు నిలిపే ఈ పాట చాలా మందికి  ఇష్టం. ఈ పాటని సిరివెన్నెల గారిపై చిత్రీకరించాలనుకోవడం ఒక మంచి ఆలోచన,  కవి ఆవేశాన్ని మరింత ప్రభావవంతంగా నేరుగా ప్రేక్షకులకు చేరవేయగలిగాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ
ఎస్.పి.  బాలు గారి గళం నుండి ఆవేశం తో పాడిన ఈ పాట ఎన్ని తరాలైన ప్రశ్నిస్తుంది మనల్ని.)

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం



అలుపన్నది ఉందా పాట సాహిత్యం

 
చిత్రం: గాయం (1993)
సంగీతం: శ్రీ  కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

అలుపన్నది ఉందా 
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు 
లల లల లలలలా...

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు

చరణం: 1
నా కోసమే చినుకై కరిగి
ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు
బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు 
లల లల లలలలా...

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు

చరణం: 2
నీ చూపులే తడిపే వరకు
ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు
ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల
తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లల లల లలలలా...

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లల లలలలా...

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు




స్వరాజ్యం ఎందుకని పాట సాహిత్యం

 
Song Details



చెలిమీద పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default