Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Suresh Krishna"
Auto Driver (1998)


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, సుజాత
నటీనటులు: నాగార్జున, దీప్తి బట్నాగర్, సిమ్రాన్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: డి. శివ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 24.04.1998

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

కోరి కనక పడితే ఈ చీర తప్పు కాద
వద్దు మొర్రొ అంటె ఈ ముద్దె ముల్లు అవదా
ముల్లు పెట్టి మోగని ఈ సన్నయీ
ఎక్కిల్లు పెట్టి యెగసి పడకె పువ్వాయీ

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

తమరి వయసు పాతికా
తక్కువేమి కాదుగా
తమరి జతను వెతకవేంది నాయక
పడుచు తనపు ఓపికా
ఓపగలవ గోపికా
గడుచుతనపు మడత పేచి వెయ్యకా
అరె చూస్త కాదంటె సతాయిస్తా
సరే వస్త జాగర్త సొగసు కాస్త
అందాలన్ని కందాలని తొందరపడ్డవే
అటొ ఇటొ అవ్తాయేమొ అమీ తుమీ లడాయితో

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

అసలు కొసరు తెలియకా
కొసరుతుంది తియ్యగా
పగటి కలల పసితనాల కోరికా
ఒకటి ఒకటి కలపకా
ఒకటి అయ్యె కూడికా
తెలియనతంత లేత మొగ్గ కానుగా
హమ్మొ ఐతే నువ్వంత మహ ముదురా
అలా అంటె నేనుండను నీ ఎదరా
ఉడుక్కనే తలుక్కంటె నాకు మక్కువా
వొల్లొ వచ్చి పడ్డననే హడావిడి బడాయిలా

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అరె అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

కోరి కనక పడితే ఈ చీర తప్పు కాద
వద్దు మొర్రొ అంటె ఈ ముద్దె ముల్లు అవదా
ముల్లు పెట్టి మోగని ఈ సన్నయీ
ఎక్కిల్లు పెట్టి యెగసి పడకె పువ్వాయీ



*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , సుజాత

అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణి ఏం వరమీయ్ మంటావే
అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే

ఎన్నో విన్నను నీ గురించి వచ్చను వల్లుమరచి
సర్లే నీవైనం ఆలకించి అవ్నంట ఆదరించి

అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే

పెదవేలె పదవిస్త మహరాజా రారా
పరువాలే చదివిస్తా రవితేజా లేరా
నుంపెక్కి సింగారం మెరిసిందే బాలా
నడుమెక్కి నయగారం వేసిందే వీలా
సిగ్గంత జడిచేలా జతకట్టి జోకొట్టి పోవేలా
నిట్టుర్పు ఎగసేలా నీవలనా జాబిల్లి జవరాలా
ముత్యాల చమటల్లో ముస్తాబే కరిగేలా
ముద్దడె పద్దతిలో నా సాటె నువ్వే

యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే
అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే

మొటిమల్లొ మోహాలే ముదిరే ఈ వేలా
చిటికల్లో అణిగేల అదిమేస్తె చాలా
అది కూడ అడగాల రసలీల లోలా
సుఖమంటె తెలిసేలా రగలాలి జ్వాలా
చూపుల్లొ సురకత్తి తగిలితే ఆగేన సుకుమారం
ఈడంత ఉడుకెత్తి అడిగితే ఇంకేంటి అనుమానం
ఊపెక్కె ఉపకారం కైపెక్కె అపచారం
కానిచ్చె కౌగిలిలో తీర్చేద్దం హాయీ

అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే
అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే

ఎన్నో విన్నను నీ గురించి వచ్చను వల్లుమరచి
సర్లే నీవైనం ఆలకించి అవ్నంట ఆదరించి


*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ , సుజాత

చందమామ చందమామ సింగారాల చందమామ
చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నెలతో

ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగి నేల తాళాలేసే మేళాలెన్నాడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో ఓ ఓ ఓ

చందమామ చందమామ సింగారాల చందమామ

కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు
తెల్ల ముగ్గు వేసుకుంటానే
గీకైకంతా రేగేమంతా చేస్తే ఉంటా
నిన్నే జంట చేసుకుంటాలె
ఊరించేటి అందాలన్నీ ఆ
ఊరించేటి అందాలన్నీ ఆరేశాక ఆరా తీశా
చీకట్లోని చిన్నుండాలా చిత్రాలెన్నో దాచాలే
గుడిసైనా చాలే మనసుంటే
గుడికన్నా పదిలం కలిసుంటే
దాయి దాయి దాయి దాటిపోనీకు రేయి

చందమామ చందమామ సింగారాల చందమామ

తుళ్ళి పాడే గోదారల్లే ఏరు నీరు
నీవు నేనై పొంగి పోదామా
చుక్క కళ్ళ నీలాకాశం
జాబిలమ్మ జాడే ఉండే పున్నమైపొదా
మల్లె గాలి పాడె లాలి అ అ
మల్లె గాలి పాడె లాలి
గిల్లి గింత పెట్టె వేళ
సన్నజాజి సయ్యాటల్లో కన్నె మోజు చూశాలే
చెలికాడా నీడై నిలుచుంటా
జవరాలా అవుతా నీ జంట
చేయి చేయి చేయి దాటిపోనీకు హాయి
చందమామ చందమామ సింగారాల చందమామ
చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగి నేల తాళాలేసే మేళాలెన్నాడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో


*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుజాత

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా

సోకొ సొమ్మొ తాకిందిరా
అది షాకో గీకో కొట్టిందిరా
వొంటికే తాకినా వల్లె జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో
వొంటికే తాకినా వల్లె జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
సోకొ సొమ్మొ తాకిందిరా
అది షాకో గీకో కొట్టిందిరా

కిర్రు బిర్రు గున్న కుర్ర దాన
అడుగడుకు నీ వెనకే వేసుకోనా...హేయ్
కస్సు బుస్సు మన్న కల్ల వాడ
నీ చూపుల్లొ అందాలు దాచుకోనా
గింక ఒనుకు పుట్టిందే జంకే కాల్లలోనా
ఇంకా ఏమి పుట్టునో నీ డంఖా మోతలోనా
కసి కసి ఊసులూ కలవరీ ఆసులూ
కరిగిన షేపులు నరాలకే ఊపులూ

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
సోకొ సొమ్మొ తాకిందిరా
అది షాకో గీకో కొట్టిందిరా

రెచ్చి రెచ్చి పోకు అందగాడ
రేయన పగలనక చిందులోనా
ఓయ్...పిస్త పిస్త గున్న పిల్ల దానా
నీ పిలుపులకే ఒలపులతో రెచ్చిపోనా
ఒల్లొ పడ్డ ఓకె నా వొల్లె ఇస్త నీకే
యల్లొ పూల బుగ్గ మాయల్లొ పడ్డ నేడే
మరిగిన వయసులో మనోహరి వరసలు
తెరచిన తలుపులు తెనాలికే పిలుపులూ

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
చూపో చుక్కో పొడిచిందిరా
అది షేపొ రూపో మార్చిందిరా
పైటతో చుట్టినా ప్యాకేజిల్లో
చాటుగ తాకిన షాటెజుల్లో
అరె అరె వొంటికే తాకినా వల్లె జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో


*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుజాత, స్వర్ణలత

మామ మజరే మాయ బజారే
మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే
షేకు షేకు రాక్ రాక్ ఊపుల్లో
గ్రీకు వీర రాకుమార చూపుల్లో
జలసాల జగడపు రగడల సొగసురి తగవులలో
నువ్వె నా సొంతం గురువ గురువ గురువ గురువ గురువా
నాదే నీ అందం మగువ బిగువ i love you అనవా

మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే

విరిసాను పువ్వల్లే మెరిసాను రవ్వల్లే
దివ్వల్లె ఉంటాను నీ ఇంట చోటిస్తే
రవ్వంటె రాయేలె,దివ్వంటె వేడెలే
చాలించు నీ పోసు చలి మంట చూపమ్మా
జాబిల్లినిస్తాను జాగార వేలల్లో
పక్కేసుకుంటాను నీ పాలపుంతల్లో
తళుక్కుమంటు తరుముతా
ఉలుక్కుమటే ఉరుముతా
ఉడుక్కుపోతె ఉరుకుతా
ఇరుక్కుపోయాగా
హమేష చొరవ చొరవ చొరవ చొరవ దడైతె దరువా
హమాష తడవా తడవా తడవా ఇదేమి గొడవా

మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే

అందిస్త నా వల్లు అందాల హరివిల్లు
నా సత్త వర్నాల వయ్యరి కావిల్లు
కాటెస్తె నీ కల్లు వాటెస్త నీ వొల్లు
నే దోచుకుంటాను శ్రుంగార దోసిల్లు
చుక్కెత్తుకుంటాను నీ చూపు సందిల్లో
నీ చుక్క ఎదురైతె చిక్కంట ప్రేమల్లో
వయ్యరమంత మరచిరా
మయూరమల్లె నడచిరా
వరించమంటు అడుగుతా
ఒయె భరించలేనంటా
మడు నా మెరుపో విరుపో పిలుపుకు నొగ్గొ గురువా
మెరీనా అదివొ రధొవి సతివో అతుక్కొ జతగా

మామ మజరే మాయ బజారే
మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే
షేకు షేకు రాక్ రాక్ ఊపుల్లో
గ్రీకు వీర రాకుమార చూపుల్లో
జలసాల జగడపు రగడల సొగసురి తగవులలో
నువ్వె నా సొంతం గురువ గురువ గురువ గురువ గురువా
నాదే నీ అందం మగువ బిగువ i love you అనవా

థనాన తలుకొ బెలుకొ కులుకుక లుక్కొ గురుడా
హైరాన పడకె పడకె చెడకె ప్రయాస పడకే


Palli Balakrishna Monday, January 8, 2018
Idi Maa Ashokgadi Love Story (2002)


చిత్రం: ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం: ఆనంద్ మిలింద్
సాహిత్యం: వేటూరి
గానం: అభిజిత్ , సాధనా సర్గమ్
నటీనటులు: శివబాలాజీ, కంచి కౌల్, శ్వేతా అగర్వాల్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాతలు: హరీష్ తవాని, ఆకాష్ ఖురాన్
విడుదల తేది: 2002

పని పమగ పస పని పమగ పస
లాలల లల్లా లాలల లల్లా
నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా
కన్ను చిటికేస్తే కౌగిళికి వస్తా
చెలి వస్తావా చలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా దిల్ దేదియా
నీకు మనసిస్తా మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా
మురాలిస్తావా వరాలిస్తావా
ఈ ప్రియా నీదయా దిల్ దేదియా
నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా

నే ఆగలేకా...నీ దారి కాస్తా
నా ప్రేమ లేఖా..నీ పేర రాస్తా
వేసంగి ఎండలో నా నీడ నీ జతా
సీతంగి మంచులో నీ తోడు కోరుతా
నీనుకీ నేనుకీ మారదీ కథ

నీకు మనసిస్తా మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా
చెలి వస్తావా చలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా దిల్ దేదియా
నీకు మనసిస్తా మాట కలిపేస్తా

కాలాలు దాటే...కలలు పండిస్తా
పన్నీరు మీదా...పూల పడవేస్తా
పున్నాగ పూలతో సన్నాయి పాడుతా
వెన్నెల్ల తోటలో నా రేయి పంచుతా
జన్మకీ ప్రేమకీ ఒక్కటే కథ

నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా
కన్నె వయసిస్తా కౌగిలికి వస్తా
మురాలిస్తావా చలాయిస్తావా
ఈ ప్రియా నీ దయా దిల్ దేదియా



*******  ********  ********


చిత్రం: ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం: ఆనంద్ మిలింద్
సాహిత్యం: వేటూరి
గానం:

మళ్ళీ జన్మిస్తా మళ్ళీ జన్మిస్తా
నువ్వు నేను ఏకం అయ్యే దాకా మళ్ళీ జన్మిస్తా
మళ్ళీ ప్రేమిస్తా మిళ్ళి ప్రేమిస్తా
నీకై పుట్టి నిన్నే చేరే వరకు నిన్నే ప్రేమిస్తా
ఓహో ప్రియా ఈ ముధూదయంలో ఇదేలె నా బాసా
ప్రియా ప్రియా నీ సమాగమంలో ఇదేలె నా ఆశా
మళ్ళీ జన్మిస్తాఆఆ

నీ శ్వాసలో ఊపిరాడాలి నాకు ఒత్తిళ్ళలో పాపలా
నీ పాపలా ఊయలూగాలి నేను కౌగిళ్ళలో ప్రేమలా
స్నేహమల్లే సాగిపోయే దాహమేదో రేగే నాలో
చిన్ని చిన్ని ఆశలు నావి ప్రియా ప్రియా ప్రియా

మళ్ళీ జన్మిస్తాఆఆ

మా అమ్మవై రూపం ఇవ్వాలి నాకు నా కంటికే చూపుగా
ఏ జన్మకూ తోడు కావాలి నువ్వు చుక్కానిలా చుక్కలా
బంధమేదో పెరిగే వేళా బ్రతుకు తరిగే ఈ వేళ
నాడు నేడు ప్రేమవు నీవె ప్రియా ప్రియా ప్రియా

మళ్ళీ జన్మిస్తా మళ్ళీ జన్మిస్తా
నువ్వు నేను ఏకం అయ్యే దాకా మళ్ళీ జన్మిస్తా
ఓహో ప్రియా ఈ ముధూదయంలో ఇదేలె నా బాసా
ప్రియా ప్రియా నీ సమాగమంలో ఇదేలె నా ఆశా
మళ్ళీ జన్మిస్తా మళ్ళీ జన్మిస్తా
నువ్వు నేను ఏకం అయ్యే దాకా మళ్ళీ జన్మిస్తా


*******  ********  ********


చిత్రం: ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం: ఆనంద్ మిలింద్
సాహిత్యం: వేటూరి
గానం: సౌమ్య

చలిచలిగా ముసిరిందేదో అనుభవం
తొలకరిగా నీతో జరిగే పరిచయం
కనులలో జాబులు చదివిన చూపులు
తొలిప్రేమో ఏమో ఏమో
చలిచలిగా ముసిరిందేదో అనుభవం
తొలకరిగా నీతో జరిగే పరిచయం
కనులలో జాబులు చదివిన చూపులు
తొలిప్రేమో ఏమో ఏమో

మనసులో గానము మనకిలా మౌనము
కలుసుకోవాలని కలలో పోరాటము
గుసగుసలు ఎన్నెన్నో కునుకులిక నో నో నో
నీకోసం నన నన నన నాకోసం
అల్లరి చేసె ఆశలైనా అందాలన్ని అందిరాకున్నా

చలిచలిగా ముసిరిందేదో అనుభవం
తొలకరిగా నీతో జరిగే పరిచయం
కనులలో జాబులు చదివిన చూపులు
తొలిప్రేమో ఏమో ఏమో

మాటలే పొదుపులు మనసుకే అదుపులు
పట్టులో విడుపులు పడుచు ముస్తాబులు
కదలడు సూరీడు కదలికలు రానీడు
ఈ ధ్యానం తొలివలపు ఆహ్వానం
వేసవిగాలి వేణువూదే ఊపిరి కూడ జలధరింతేలే

చలిచలిగా ముసిరిందేదో అనుభవం
తొలకరిగా నీతో జరిగే పరిచయం
కనులలో జాబులు చదివిన చూపులు
తొలిప్రేమో ఏమో ఏమో తొలిప్రేమో ఏమో ఏమో


*******  ********  ********


చిత్రం: ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం: ఆనంద్ మిలింద్
సాహిత్యం: వేటూరి
గానం: అభిజిత్ , సాధనా సర్గమ్

సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్
వచ్చే వానజల్లు నన్ను గిచ్చే రమ్మని
నచ్చే నిన్ను నాకే ఇచ్చె జోడీ కమ్మని
పూసే పూలనడిగా గుమ్మ తేనె తెమ్మని
వాలే తుమ్మెదల్లే వచ్చి పోవా ఝుమ్మనీ
సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్

కంటికి నిదరే రాకముందే తుంటరి కలలో చూసుకుంటా నిన్నే
ఒంటిగ రగిలే వయసులోన జంటను వెతికే కౌగిళింత నేనే
పరువాన రేగినా జడివాన ఆగునా
గొడవేల యాతన ఒడిలోకి చేరనా
హ హా హ హా

సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్

ఈదురు గాలి ఈడకొస్తే వెన్నెల కాస్త ఏడిపిస్తే వానా
కిన్నెరసాని కిలుకుమంటే కన్నెల రాశి కులుకుతుంటే వీణా
విరజాజి సందులో విరివాన చిందులో
పొరపాటు పొందులో తెరచాటు విందులు
హ హా హ హా

నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్
సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
వచ్చే వానజల్లు నన్ను గిచ్చే రమ్మని
నచ్చే నిన్ను నాకే ఇచ్చె జోడీ కమ్మని
పూసే పూలనడిగా గుమ్మ తేనె తెమ్మని
వాలే తుమ్మెదల్లే వచ్చి పోవా ఝుమ్మనీ


*******  ********  ********


చిత్రం: ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం: ఆనంద్ మిలింద్
సాహిత్యం: వేటూరి
గానం: అభిజిత్

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో హుషారాలనేరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు
వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ

మేఘాల సందేశమూ ఆ ప్రేమ విరిజల్లులే
స్వప్నాల సంకేతమూ ఎదలోని హరివిల్లులే
మైనాన సంగీతమూ ఈ పూల గంధాలులే
ప్రతిరోజు సాయంత్రమూ నీ వేడి నిట్టూర్పులే
అది శోకమో ఒక శ్లోకమో ఈ లోకమే ప్రేమెలే

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ

ప్రేమించే నా కళ్ళకూ నిదురన్నదే రాదులే
ప్రేమించే నా వాళ్ళకూ ఏ ఆకలి లేదులే
ఊహల్లో విహరింపులూ ఉయ్యాల పవళింపులూ
వెన్నెల్ల వేధింపులూ వెచ్చంగ లాలింపులూ
అది యోగమో అనురాగమో పురివిప్పు ఈ ప్రేమలో

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో హుషారాలనేరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు


Palli Balakrishna Friday, November 17, 2017
Baba (2002)


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: సాధన సర్గం
నటీనటులు: రజినీకాంత్ , మనీషా కొయిరాలా
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: రజినీకాంత్
విడుదల తేది: 15.08.2002

పల్లవి:
బాబా నీకు మొక్కుతా
నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా
బాబా ఓ పువ్విస్తా
ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా
తుళ్ళెనె గిల్లెనె నుదిటిపై నీ కురులు
గడ్డమె అడ్దమోయ్ శాంతంగ మారాలోయ్
కాస్త నువ్ మారితే సూరీడై వెలుగుదువోయి
గిచ్చొద్దే గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే
నువ్ మారమంటె మారిపోడీ బాబా బాబా
నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె
తగువేదీ రాదంటానే ఆహా హా హా

చరణం: 1
బాబా నిన్నే బావా అంటే
బాబోయ్ నన్నొదిలెయ్ అంటూ
పరుగేలా
పులకించు వేళ మొలకెత్తు వలపే
బాగుంది బాగుంది బాబా
పులకించు వేళ మొలకెత్తు వలపే
బాగుంది బాగుంది బాబా
పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత
ఈ మోహం ఈ మైకం నాకో వింత
ప్రేమల్ని పంచావంటె బాబా ఒక పిల్లాడే
కొమ్ముల్ని విసిరావంటె....

చరణం: 2
బాబా వాకిట వాలాలంటూ వేవేల
జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో
నీ రంగు మల్లె నారంగు మారే
వరమివ్వ గలవా బాబా
నీ రంగు మల్లె నారంగు మారే
వరమివ్వ గలవా బాబా
మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు
ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా
రంగంటే రంగా ఇది వరం వల్ల వచ్చిందిది
నా తల్లి ఇచ్చిందిది ఆహాహాహా


*********  *********  *********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
బాబా...బాబా....
బాబా... కో: సినిమా సినిమా
బాబా... కో:  ఆటేరా
బాబా... కో: సినిమా సినిమా
బాబా...

టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి (2)
జీవితమె కో:సినిమా సినిమా
మూడే మూడు కో:గంటలు లే
మూడే మూడు కో: గంటలు అంటే
మూడే మూడు కో: ప్రాయాలే
శిశువు ప్రాయం ఒకటి
పడుచు ప్రాయం రెండు
ముసలి ప్రాయం మూడు వినరా

మూడుదశలు ముగియ మునుపే
ముల్లోకాలు గెలవరా

టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి

చరణం: 1
పిల్లల తెల్లని మనసు అ:
అది దైవం వెలిసే మనసు
పున్నమి చంద్రుని ఎగిరి పట్టి
బంతులాడేటి వయసు
బలంపెంచి భయము తుంచి
భవితనెంచి ఎదగరా
తల్లి నీడై మెదులు పెద్దపులివై కదులు
బుద్ధి ఎరిగి మసలూ.....
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు ఓకే

చరణం: 2
అల్లరి చేసే వయసు
అది యవ్వనానికే సొగసు
చెట్టు సైతం చీరకట్టి
తాకి చూసే మనసు
ఉద్యోగాలు కోరి రావు
కోరి నువ్వే తరలిపో
నువ్వు కోరే ప్రేమ
ప్రేమ కాదోయ్ రామ
ప్రేమకర్ధం చెప్పనా
కో: స్వచ్చమైన ప్రేమ అంటే కోరివచ్చు ప్రేమరో

చరణం: 3
వృద్ధుల వంగిన వయసు
అది సిద్ధిని పొందే వయసు
నెమ్మది కోరే వయసు
కుటుంబ భారం మరచిపోయి
కోర్కె విడిచి బ్రతకవోయ్
మౌనమందే నిలచి
ధ్యానమంతా తరచి
విధికి తలనే వంచి
కో: వెలుగుతున్న యువతరాన్ని
వెన్నుతట్టి నిలిచిప


**********  **********  **********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత

పల్లవి:
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
సంతోషి సంతోషి సంతోషి
నువ్వు సంతోషంలో తేలే సన్యాసి
సంతోషి సంతోషి సంతోషి నీ
సంతోషి నీతోటి సహవాసి
పట్టీ పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా
తామరు ఆకుల్లో నీరల్లె నువ్వు
అంటీ అంటక ఉండు

చరణం: 1
వాసన అందం వాడితె అంతం
పువుల చందం మనుషు ల జన్మం
భువిలో మనకు శాశ్వతమేదీ
పవళింపు వరకు స్వతంత్రమేదీ
విషయం చెబితె అతనిది సోది
విషమం పేరే రాజకీయ వాది
అందులో ఏమున్నది అది ఓ పదవుల వ్యాధి
మనిషికి కాలు చెయ్యే మరవని నేస్తాలయ్యే
సంద్రాలపై నూనె బిందువుమల్లె
నువ్వు అంటీ అంటక వుండు

చరణం: 2
గాలమ్మా గాలమ్మా నా చెలినికిదీ తెలుపమ్మా
కన్నీరే కన్నీరు నా మనసే చదువమ్మా
మాయల్లే చాయల్లే కన్నె వలపు
ఏ నాడు మారదులే
ప్రాణంలో ప్రాణంగా ఉన్న సొగసు
వసివాడి పోనిదిలే
గాలమ్మా గాలమ్మా
నా చెలునికిదీ తెలుపమ్మా
పట్టీ పట్టనట్టుగా
పట్టే రస పట్టుగా
ఉండీ లేనట్టుగా
వచ్చే లేటెస్టుగా
తామర ఆకుల్లో నీరల్లె నువ్
అంటీ అంటక ఉండు
తామర ఆకుల్లోనీరల్లె
నువ్ నాతో జంటగా వుండు
సంతోషి సంతోషి సంతోషి నువ్వు
నా జంటై వెంటొస్తే సంసారి
సంతోషి సంతోషి సంతోషి నువ్వు
తాకేస్తే అవుతాలే నీ దాసి
పట్టీ పట్టనట్టుగా ఉండి లేనట్టుగా
తామర ఆకుల్లో నీరల్లే
నువ్ అంటీ అంటక వుండు....
తామర ఆకుల్లో నీరల్లే
నువ్ నాతో జంటగ వుండు


********   ********   ********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: పి.జయచంద్రన్

పల్లవి:
రాజ్యమా సన్యాసమా భోగమా లేక యోగమా
జ్నానియా అజ్నానియా ఎవరురా ఇతడు ఎవరురా
అంబరం దాటిన అతిశయం బాబా జాతకం
అంబరం దాటిన అతిశయం బాబా జాతకం
ప్రశ్నలా బతికెలే మౌనమై వెలిగెలే

రాజ్యమా సన్యాసమా భోగమా లేక యోగమా
జ్నానియా అజ్నానియా ఎవరురా ఇతడు ఎవరురా

చరణం: 1
కొడుకులు లేని ఒడిలోకి వెలుగై వచ్చిన రాజాయే
వాసనలెన్నో పంచుటకు దైవమిచ్చిన రోజాయే
కీర్తికి బదులు భుజములపై మూటలెన్నో మోశాడు
విధి ఇది విధి ఇది అని తలచి చెమట నోడ్చి బతికాడు
ఏ వృత్తిలోనైనా తప్పులేదు అంటాడు
పనిమాని కూర్చుంటే ముప్పువుంది అంటాడు
పెరిగినా తరిగినా ఎన్నడూ తొణకడు
అతిశయం ఎంతో అతిశయం అతిశయం బాబా జాతకం

చరణం: 2
దేవుడు లేడని ప్రతిపూటా బోధించాడు నాస్తికత
భౌతికవాదం మదిలోన పూసిందేలా ఆస్తికత
నుదుట విభూధిని దిద్దుకుని వస్తున్నాడు ఈ జ్నాని
ఆశ్చర్యమాశ్చర్యంగా వుండే
అయ్యా డయ్యె రాముడే
తన తల్లి ప్రేమకే తలవంచె నీబాబా
హృదయాన ఏనాడు పసివాడు ఈ బాబా
వేదనే కోరిన పెన్నిధై వెలిగెలే


**********  **********  **********


చిత్రం: బాబా (2002)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: కార్తిక్

పల్లవి:
మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం
శక్తినివ్వు.... శక్తినివ్వు....
దేవా.... దేవా...
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే

రేణువు నీవే స్ధాణువు నీవే
జులుమునణచుటకు
భువిని గెలుచుటకు శక్తినివ్వు
నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వు

చరణం: 1
మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వు
తలపొగరు సిగపట్టు కీర్తించు శక్తినివ్వు
తన ఇంటి చీకటిని తోలగించేశక్తినివ్వు
కాలాన్ని జ్వాలల్ని చేధించే శక్తినివ్వు
నామాటతో ఊరు మారేటి శక్తినివ్వు

చరణం: 2
బిగిపట్టు పట్టాక సడలించబోను
ముందడుగు వేశాక వెనుకాడబోను
ననునమ్ము తమ్ముళ్ళని వంచించబోను
ఓనిచ్చెనై నిలుచుండి నే మోసబోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నే బ్రతికేది నీ కొరకె విడిచి పోనేపోను
మద్దెలను మిద్దెలను నే కోరుకోను
కాలాల హద్దులను నే మించబోను
దేవా...దేవా...

Palli Balakrishna Thursday, September 21, 2017
Astram (2006)


చిత్రం: అస్త్రం  (2006)
సంగీతం: యస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: ఆనంతు , రాజేష్
నటీనటులు: మంచు విష్ణు, అనుష్క శెట్టి, షరఫ్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: రాజు హార్వాని
విడుదల తేది: 23.06.2006

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
this is my love this is my love ఇదో కథలే ఇదో జతలే
ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

కలవరమొక వరమనుకో కలలను కంటు
ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటు
నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది అప్పుడే కదా ప్రేమా చప్పుడైనది
వలపే సోకని నాడు ఎడారే గుండె చూడు
ముళ్ళని చూడకు నేడు గులాబి పూలకు
this is my love this is my love ఇదే కథలే ఇలా మొదలే
ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

నిదురెరగని తనువులతో నిలువని పరుగు
మగువుల తడి పెదవులతో పిలువని పిలుపు
మడుటెండలా తాకే పండు వెన్నెల కొండ వాగులా మారే ఎండమావిలా
కనులే మూయను నేను జపిస్తూ ప్రేమ రూపం
కవితే రాయను నేను లిఖిస్తా నీ స్వరూపం
this is my love this is my love ప్రతి యదలో ఇదో కథలే
ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
this is my love this is my love ఇదో కథలే ఇదో జతలే

Palli Balakrishna Thursday, September 14, 2017
Prema (1989)



చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వెంకటేష్ , రేవతి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 12.01.1989



Songs List:



ప్రియతమా నా హృదయమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం
గానం: యస్. పి. బాలు

ప్రియతమా నా హృదయమా 
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే  ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా

ప్రియతమా నా హృదయమా 
ప్రేమకే ప్రతి రూపమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి 
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి 
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై 
శృతిలయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను 
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా

ప్రియతమా నా హృదయమా 
ప్రేమకే ప్రతి రూపమా

నీ పెదవి పైన వెలుగారనీకు 
నీకనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు 
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా 
మహాసాగరాలే నినుమింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు 
పది జన్మలైనా ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా

ప్రియతమా నా హృదయమా 
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే  ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా

ప్రియతమా నా హృదయమా 
ప్రేమకే ప్రతి రూపమా
ప్రియతమా నా హృదయమా 
ప్రేమకే ప్రతి రూపమా





ఈనాడే ఏదో అయ్యింది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ... ఓ... ఓ... ఓ...
ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది
అందాలా లోకం రమ్మంది

ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగంది

నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది
నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది
ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ అదినా సొమ్మన్నదీ
పరువాలు మీటి... న న న న న
సెలయేటీ తోటి... న న న న న
పాడాలి నేడు... న న న న న
కావాలి తోడు... న న న న న న న న న న...

ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగంది

సూర్యుని మాపి చంద్రుని ఆపి
వెన్నెల రోజంత కాచింది
సూర్యుని మాపి చంద్రుని ఆపి
వెన్నెల రోజంత కాచింది

పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ
ఎదలోని ఆశ... న న న న న
ఎదగాలి బాసై... న న న న న
కలవాలి నీవు... న న న న న
కరగాలి నేను... న న న న న న న న న న...

ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది
అందాలా లోకం రమ్మంది

ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగంది




యూ ఆర్ మై హీరో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, చిత్ర

యూ ఆర్ మై హీరో





ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా 
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా 
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము ప్రేమ జ్ఞానయోగము

మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ..

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా 
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా 
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటి పెళ్లయింది చాల్లే

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

ఇవ్వు ఇవ్వు.... ఆహాహాహా... 
ఒక్క ముద్దు... ఊహూహూ...

ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే..

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా 
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా 
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు 
ఇవ్వలేంది అడగవద్దు
ఆ.. ఇవ్వు ఇవ్వు.. ఆహాహాహా.. 
ఒక్క ముద్దు.. ఊహూహూ..




ఎక్కడ ఎక్కడ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.శైలజ

ఎక్కడ ఎక్కడ



ఐ యాం సారీ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

ఐ యాం సారీ




వంటరి వాడిని నేను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

వంటరి వాడిని నేను

Palli Balakrishna Thursday, July 27, 2017
Baashha (1995)


చిత్రం: బాషా (1995)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి (All Songs)
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రజనీకాంత్, నగ్మా
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: ఆర్.యమ్. వీరప్పన్
విడుదల తేది: 12.01.1995

అదిరే.. అదిరే..
నీ నడకల స్టైలదిరే - అదిరే
నీ నవ్వుల కైపదిరే అదిరే
నీ మాటల తీరదిరే అదిరే
నీ చూపుకు ఎదఅదిరే

అదిరే.. అదిరే..
ఓ కన్నె ఎదే దోచుకున్న నీ ఫోజు అదిరే
ఆ పోజు చూసినాక జారుపైట అదిరే
అదిరే అదిరే

శీఘ్రమేవ గుడ్ బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు
నీ అల్లరి వయసే నేనొదలను పిల్లా
నన్నల్లుకు పోకా ఇక తప్పదు పిల్లా
కసి కత్తెరలేసే నీ అత్తరు పైట
చలి ఒత్తిడి కోరే తొలి వలపుల ఆట
మల్లెల లాహిరి మన్మధ చాకిరి అనువుగ కోరినది
తీయని తిమ్మిరి తేనెల చిమ్మిలి అరుదుగ అడిగినది
ముద్దు పెట్టారాదా హద్దు దాటరాదా

అదిరే.. అదిరే..
హా... నీ నడకల స్టైలదిరే - అదిరే
నీ నవ్వుల కైపదిరే అదిరే
నీ మాటల తీరదిరే అదిరే
నీ చూపుకు ఎదఅదిరే
అదిరే.. అదిరే..

నీ చూపులలోనా కసి తుమ్మెదలాడే
సెగ రేపిన ఈడే బిగి కౌగిలి కోరే
నీ మోహన దాహం నా మోవిని చేరే
ఆ వలపుల మంత్రం చలిచెమ్మలు కోరే
పెర పెరలాడే పెదవుల రాగం మధువులు కోరెనమ్మ
వయసుకు వయసే వచ్చిన వేళ మనసిక ఆగదమ్మ
పులకరింత నదిలో జలకమాడుదామా

అదిరే.. అదిరే..
ఓ నీ కులుకు నడకదిరే -  అదిరే
నీ మొలక నడుమదిరే అదిరే
వరదంటీ వయసదిరే అదిరే
పాలుగారు బుగ్గదిరే..
అదిరే.. అదిరే..
ఓ జాజిపూల మోజు పంచె అందమంత అదిరే
ఆగలేక రేగుతున్న నీ పరువం అదిరే
అదిరే అదిరే అదిరే అదిరే

Palli Balakrishna Monday, July 24, 2017
Master (1997)



చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
నటీనటులు: చిరంజీవి, సాక్షి శివానంద్, రోషిణి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 02.10.1997



Songs List:



తమ్ముడు అరె తమ్ముడు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిరంజీవి

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు

మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు
థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే

మీరింత బాగా పాడగలరని మేమస్సలనుకోలేదు మాస్టర్
ఇంతవరకు నేనెప్పుడూ పాడలేడోయ్ ఇదే ఫస్ట్ టైం
సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్
ఆ మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది చేశానంతే
మాస్టర్ ఈ పాటకి మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది
డాన్సేగా చాలా బాగుంటుంది చేయండి
హే... మేము కాదు మాస్టర్ మీరు
నేను డాన్సా నో నో నో
ప్లీజ్ సర్ ప్లీజ్
ఓకే ఓకే హేయ్...

వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు
ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ
మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు
అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ
ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ
హా ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు
ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే

లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్గా సాగుతున్న మహా నవలరా ప్యారు
ఆ స్టోరీ కొట్టదు బోరు
కా గుణింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు
హా కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు
అమ్మడు ఓయ్ అమ్మడు లబ్బుడబ్బు హార్ట్ బీట్ లవ్వులవ్వు అన్నదంటే
హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు





ఇంటిలోకి వెల్కమంటు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, సౌమ్య

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు
అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

శిస్యురాల చారుశీల శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిరస్తు
అక్షరాల దీక్ష బూని లవ్ లోని లెసెన్స్ నేను అలకిస్తు
అందంతో పరీక్ష ఇప్పుడు అర్ధాంగి ప్రమోషనెప్పుడు
ఫలితం రానున్నది పరువం ఔనన్నది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

పోర్టికోలో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమాయె
పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాకు బోర్డులో లిఖించలేని ఆకళాయే
వల్లించేయ్ వయస్సు వాచకం
చెల్లించేయ్ వయ్యారి వేతనం
గురువా లెటెందుకు
లఘువై రా ముందుకూ

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు
అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు




BSC అయినాగాని పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, కృష్ణరాజ్, చంద్రబోస్, మురళీధర్

గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే

BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా

డాడీ జేబులో డబ్బులు తీసి దాబా కెళ్ళొచ్చు
మమ్మీ పర్సును మాయం చేసి మూవీ చూడొచ్చు
బెడ్ రూమ్ నిండా పోస్టర్లెన్నో అతికించ వచ్చు
వాటిని చూస్తూ వందల ఏళ్ళు బ్రతికేయ వచ్చు
తోచిందేదో తప్పైనా చేసేయొచ్చు
తమ్ముడుకేమో యమ నీతులు బోదించొచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

పీలగ ఉన్న పిల్లను నువ్వు పిన్ని అనవచ్చు
బొద్దుగ ఉన్న భామను నువ్వు భామ్మా అనవచ్చు
ఎత్తుగ ఉంటె అత్తా అంటూ వరసే కలపొచ్చు
పొట్టిగ పాపా అంటే పాప్కార్నివ్వొచ్చు
అందంగుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోవచ్చు
పెళ్లి అంటే నువు ప్లేటే తిప్పేయొచ్చు

హే స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

హే BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
అరె రరెరే రరెరే...

ఆనందంగా ఎన్నికలల్లో పోటీచేయొచ్చు
అవతలవాడి బ్యానర్ మీద పేడే కొట్టొచ్చు
కొత్తగ వచ్చిన ఫ్యాషన్లన్నీ ఫాలో కావచ్చు
కోతికి మనకు తేడా లేదని తేల్చేయ వచ్చు
మంత్రులు పొతే సంతాపం  తెలిపేయొచ్చు
ఆతరువాత హాలిడే మనకే వచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

ముప్పై మార్కులు వస్తే నువ్వు ఓకే అనవచ్చు
నలభై గాని వచ్చాయంటే షాకే తినవచ్చు
ఏబై వస్తే ప్లేబాయ్ లాగా ఫోజే కొట్టొచ్చు
అరవై వస్తే ఆలిండియానే అమ్మేయవచ్చు
డెబ్భై వస్తే నువు అబ్బుర పడిపోవచ్చు
డౌటే లేక హార్ట్ ఫెయిలైపోనువచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా





తిలోత్తమా ప్రియ వయ్యారమా పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, సుజాత

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా...

చరణం: 1
పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ 
ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే

తిలోత్తమా సుఖ వసంతమా

చరణం: 2
కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
ఏ రాహువైనా ఆషాఢమైనా 
ఈ బహుబంధాన్ని విడదీయునా
నీ మాటలే వేదమంత్రం
చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది




బావున్నార బాగున్నార పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, సౌమ్య

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
ఆ బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో...
అమ్మో అమ్మమ్మమ్మో...

ఆ బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా

చిన్ని ముద్దు ఇమ్మంటారా ఛి పో వద్దు పొమ్మంటారా
చుమ్మా అంటు చెంతకొస్తే కొమ్మమీద కూర్చుంటారా
మాట మాట పెంచేశారా మంచి చెడ్డా మానేశారా
గోటితోటి పోయేదాన్ని గూటిదాకా లాగేశారా
వరసలు కలిపి మరదలు ఒడికే వేంచేస్తారా మనసారా
బూరెల్లాంటి బుగ్గలు రెండు బొంచేస్తాలే కడుపార
ఆపై రతి మహరాజల్లే మత్తుల్లో ముంచేస్తారా
అమ్మో అమ్మమ్మమ్మో...
అమ్మో చిన్నమ్మమ్మో...

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బాగున్నార బాగున్నార  బావగారు బాగున్నారా

పిల్లా అంటు లాలిస్తారా పెళ్ళాం పోస్ట్ ఇప్పిస్తారా
లిల్లిపూల మంచం మీద పిల్లో నాకు పంచిస్తారా
వేళా పాలా లేదంటారా వేలాకోళం కాదంటారా
చాటుమాటు పాఠాలన్ని నోటితోటి చెప్పిస్తారా
ఆలుమగలం అయిపోతాంలే అడిగిందిచ్చే సుకుమారా
నోరే జారితే పరవాలేదు కాలే జారకు యువతారా
జరిగే కళ్యాణం దాకా జాగారం చెయ్ మంటారా
అమ్మో అమ్మమ్మమ్మో...
అమ్మో చిన్నమ్మమ్మో...

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో...
అమ్మో అమ్మమ్మమ్మో...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default