Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sundarlal Nahata"
Ramachilaka (1978)



చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.జానకి, యస్.పి.బాలు 
నటీనటులు: వాణిశ్రీ, రంగనాథ్, చంద్రమోహన్, ఫటాఫట్ జయలక్ష్మి 
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు 
నిర్మాత: సుందర్ లాల్ నహతా
విడుదల తేది: 09.09.1978



Songs List:



రామచిలకా పెళ్ళికొడుకెవరే పాట సాహిత్యం

 
చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు

రామచిలకా పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళిరాదు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులాంటి వయసు ఎల్లువైన వగసు
ఎన్నెలంత ఎటిపాలై ఎదురీదేనా
తుమ్మెదెవరో....
తుమ్మెదెవరో....రాకముందే తుళ్ళిపడిన కన్నేపువ్వా 
ఈడుకోరే తోడులేక  కుములుతున్న ప్రేమమొలక

గొంతులోని పిలుపు గుండెలోని వలపు 
తీగాతెగిన రాగమల్లె మూగబోయేనా 
గోరువంకా...
గోరువంకా... దారివంకా ఎన్నెలంతా తెల్లవారే 
పూతలోనే రాలిపోయే పులకరింత ఎందుకింక 





నా మామయ్య.... వస్తాడంట.. పాట సాహిత్యం

 
చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.జానకి

లలిలాలిలాలో...(3)

నా మామయ్య.... వస్తాడంట..
మామయ్య వస్తాడంట....
మనసిచ్చి పోతాడంట....
మరదల్ని మెచ్చి మరుమల్లె గుచ్చి
ముద్దిచ్చి పోతాడంట
ఆ మొద్దర్లు పోయేదెట్టా
నా బుగ్గలే ఎరుపెక్కెనే
ముగ్గేసిన నునుసిగ్గుతో మొగ్గేసిన తొలి సిగ్గులో

గోరువంకా దారివంకా కోరుకున్న జంటకోసం
ఆశలెన్నో అల్లుకున్న అంతలోనే ఇంతటలు.....

పడుచోడు నవ్వాడంటే
పగలంతా ఎన్నెల్లంటా....
వలపల్లె వచ్చి మరదల్లె ముంచి వాటేసుకుంటాడంట
ఆణ్ణి పైటేసుకుంటానంట

కల్లోకివచ్చి కన్నుకొట్టాడే కన్నెగుండెల్లో చిచ్చుపెట్టాడే
గుండెల్లో నాకు ఎండల్లు కాసే
కన్నుల్లో నేడు ఎన్నెల్లు కురిసె వన్నెల్లు తడిసే
మేనెల్ల మెరిసే
పరువాలే పందిళ్ళంట - కవ్వించే కౌగిళ్ళంట
మురిసింది ఒళ్ళు ఆ మూడుముళ్ళు ఎన్నాళ్ళకేస్తాడంట
ఇంకెన్నాళ్ళ కొస్తాడంట

కళ్యాణవేక సన్నాయి మోగ
కన్నె అందాలే కట్నాలు కాగ
మనసిచ్చినోడు మనువాడగానే
గోరింక నీడ ఈ చిలకమ్మ పాడే చిలకమ్మా పాడే
ఇంటల్లుడౌతాడంట ఇంక నాయిల్లు వాడేనంట
మదిలోని వారు గదిలోకి వస్తే
కన్నీరు గావాలంట... అదే ....పన్నీరై పోవాలంట




అమ్మీ అమ్మన్నలాలో పాట సాహిత్యం

 
చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల & బృందం

అక్కమ్మ, చుక్కమ్మ, పెద్దక్క, చిన్నక్క,
రంగమ్మ మంగమ్మ పెళ్ళి పేరంటానికి రండి 
సువ్వీ.... సున్వీ.... సువ్వీ .... సువ్వీ చుట్టాల సురధి
పెళ్ళి పందిరి మంది సందడి రండీ చేరండీ
అమ్మీ అమ్మన్నలాలో అంతరారండీ
పెళ్ళీ పేరంటమండీ మళ్ళీ కాదండి
మాఘమాసం మంచి మహూర్తం మాయింటి కళ్యాణం
పద్మావతీ వెంకటేశ్వరుల పెళ్ళి రోగం
ఇల్లు ఆలికితే పండుగకాదు నల్లులు తిర్చండి
రంగవల్లులు తీర్చండి
పెళ్ళి పనులకు పిలుపులుండవు చేతులు కలపండి
అంగా చేతులు కలపండి

దంచే పడతుల వంపు సొంపూ
విసిరే నెలదుల విరుపూ మెరుపూ
కన్నెల కిలకల గాజులు గలగల
పసిపాటలకే పల్లవుందీ

రాజనాల ధాన్యాలు
విందు భోజకాలకు నాణ్యాలు
దంపి గుండిగం నింపండి
వండి వార్చడం మనవంతండీ
చిత్రాన్నాలూ పరమాన్నాలూ
కరకరలాడే గారెలు బూరెలు
వద్దంటున్నా వడ్డించండి
మారు వడ్డనకు మళ్ళీరండి 

మగువ జన్మకు మంగళసూత్రం
మాయని తీయని వరమండీ
ఏడు జన్మల అనుబంధానికి ఏడు అడుగులు నడవాలండీ
మూడు పువ్వులు ఆరుకాయలై
నూరేళ్లు వర్దిలండి....





కళ్యాణ వేళ సన్నాయి మోగ పాట సాహిత్యం

 
చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.జానకి 

కళ్యాణ వేళ సన్నాయి మోగ
కన్నె అందాలే కట్నాలు కాగ
మనసిచ్చినోడు మనువాడగానే
గోరింక నీడ ఈ చిలకమ్మ పాడే చిలకమ్మ పాడే
ఇంటల్లుడౌతాడంట
ఇంక నా యిల్లు వాడేనంట
మదిలోనివాడు గదిలోకి వస్తే
కన్నీరు రావాలంట, అదే
పన్నీరు పోవాలంట



రామచిలక పెళ్ళికొడుకెవరే పాట సాహిత్యం

 
చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.జానకి 

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచిరోజు మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులాంటి వయసు ఎల్లువైన మనసు 
ఎన్నెలంటి  వన్నెచూసి  ఎవరొస్తారో...
తుళ్ళిపడకే.....
తుళ్ళిపడకే... కన్నెపువ్వా  తుమ్మెదెవరో రాకముందే 
ఈడుకోరే తోడుకోసం  గూడు వెతికే కన్మెనె మొలక 

ఊరుదాటే చూపు చూపు దాటే పిలుపు 
ఆరుబయట అందమంతా ఆరబోసేనే 
గోరువంక...
గోరువంక దారివంక కోరుకున్న జంటకోసం 
ఆశలెన్నో  అల్లుకున్న అంతలోనే ఇంట ఉలుకా 




గూడు చీకటి గువ్వ ఎన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.జానకి 

గూడు చీకటి గువ్వ ఎన్నెలా
గుండెలు గువ్వలగూళ్లు
ఈ గుండెలుగువ్వల గూర్లు
గోదారొడ్డున కలిసిన చేతులు
కట్టిన పిచ్చుక గూళ్లు
అవి కట్టని దేవుడిగుళ్లు
మద్దులు ముప్పైనాళ్లు
ఆశలు అరవై ఏళ్లు
కలలుగనే కన్నులతోనా ఎన్నెల కొన్నాళ్లు
ఆ కలలే కరిగి ఎన్నెలచెరిగి వచ్చే కన్నీళ్లు
ఏళ్లూ కోళ్లూ ఏడ్చే కళ్ళకు నవ్వే ఆనవాళ్లు
ఎత్తే జన్మలు ఏడు
వేసే ముళ్ళే మూడు
పుష్వలకైనా నవ్వులు నేర్పేవాడే నాతోడు
ఈ చల్లని చెలిమి తియ్యని కలిమి నాదే ఏనాడు
చీకటి గూడు వలపులమోడు నవ్వే ఈనాడు ...


Palli Balakrishna Tuesday, January 2, 2024
Sati Anasuya (1971)



చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
నటీనటులు: జమున, శారద, కాంతారావు, శోభన్ బాబు, రాజాబాబు, సత్యన్నారాయణ, ప్రభాకర్ రెడ్డి 
మాటలు: సముద్రాల జూనియర్
దర్శకత్వం: బి. ఎ. సుబ్బారావు
బ్యానర్: శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్
నిర్మాత: సుందర్లాల్ నహత
విడుదల తేది: 10.06.1971



Songs List:



ఆహా ఏమందు ఆ దైవలీల పాట సాహిత్యం

 
నారదుని పాట-1

చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు 

ఆహా ఏమందు ఆ దైవలీల
ఊహాతీతము కాదా॥
వరములు కురిసే కరుణాంతరంగ
కలుషములన్నీ కడిగే గంగ
పాప పిశాచాల పొలాయెనౌరా ||ఆహా||



సర్వకళలకు వేదముల్ శాస్త్రములకు పాట సాహిత్యం

 
సరస్వతి పద్యం-1

చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: సముద్రాల(జూ)
గానం: సుమిత్ర

సర్వకళలకు వేదముల్ శాస్త్రములకు
అఖిల నాదాల కాధారమైన నేను
సరసి జాసను కూరిమి సఖియనేని
భస్మమైపోవుగాక ఈ పాపచయము



అష్టసిరుల నేలు యజమానురాలను పాట సాహిత్యం

 
లక్ష్మి పద్యం -2

రచన: సముద్రాల (జూ)
పాడినవారు: విజయలక్ష్మి

అష్టసిరుల నేలు యజమానురాలను
హరియురంబు నందు వరలు చెలిని
నేను పరమ సాధ్వి నైనచో ఈ గంగ
విగత సకల దోషయగునుగాక!




అష్ట సిద్ధులకధిదేవి నైతి నేని పాట సాహిత్యం

 
పార్వతీ పద్యం-3

రచన: సముద్రాల (జూ)
పాడినవారు: వనంత

అష్ట సిద్ధులకధిదేవి నైతి నేని
అఖిల లోకైక మాత నేనైతి నేని
అమర సాధ్వుల కారాధ్యనైతినేని
ఈ పిశాచగణము నశియించుగాక !




పతి సేవయె నాటికి జీవాధారము పాట సాహిత్యం

 
అససూయ పాట - 2

రచన: సముద్రాల (జూ)
పాడినవారు: పి. సుశీల

పతి సేవయె నాటికి జీవాధారము గాదా
సతికిలలో దైవము వేరేకలదా నాధుడే కాదా

చరణం: 1
పతిపదయుగమే మంగళకరము
పతిపదధూళియె శోభాకరము
పతియే సతి సౌభాగ్యము
పతిపదజలమే గంగాజలము
సతి తొలిజేసిన పూజాఫలము
పతియే సతికి లోకము
సతికిలలో దైవము వేరేకలదా నాధుడేకాదా
||పతిసేవయే||

చరణం: 2
పతి భుజియించిన శేషాహారము
అతివల పాలిట అమృతసారము
పతియే సతికి ప్రాణము
స్వామి సేవే ముక్తికి త్రోవ
సంసారాంబుథి దాటే నావ ....
సతికి పతియే మోక్షము
నతికిలలో దైవము వేరేకలదా నాధుడే కాదా
॥పతి సేవయే||



సకలావనినే నడిపినవారే పాట సాహిత్యం

 
నారదుని పాట-3

పాడినవారు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
రచన: డా. నారాయణ రెడ్డి

సకలావనినే నడిపినవారే
సతులను తమలో నిలిపినవారే
భార్యావశులము కాదన్నారే
నారదయాగం నడిపేది వారే॥
ఆహా ఏమందు ఆ దైవలీల
ఊహాతీతముకాదా ||



గంగాథరాయ గరుడధ్వజ వందితాయ పాట సాహిత్యం

 

అత్రి శ్లోకం - 4

పాడినవారు : పి. బి. శ్రీనివాస్

గంగాథరాయ గరుడధ్వజ వందితాయ
గండస్ఫుర ద్భుజగ మండల మండితాయ
గంథర్వ కిన్నర సుగీత గుణాత్మకాయ
హాలాస్య మథ్య నిలయాయ నమశ్శివాయ




ఓ చెలీ! అందాల వేళలో ఆనంద డోలలో పాట సాహిత్యం

 
నర్మద పాట.4

పాడినవారు: ఎస్. జానకి & బృందం
రచన : డా. నారాయణరెడ్డి

ఓ చెలీ! అందాల వేళలో ఆనంద డోలలో
అలవోలె తేలగా రావే ఓ చెలీ ॥
మందారం మాకందం మరుమల్లి మాలతి
మనసారా పిలిచెను లేవే
||ఓ చెలీ ||

చరణం: 1
ఆటో సుమబాల ఘుమ ఘుమలాడింది
ఇటో భ్రమరంబు ఝుమ్మని పాడింది
ఇదే రసానంద మౌనేమో
వసంతానుభవమేమో
వనమంతా నవ్వెనే
పరువం పరవశించెనే

చరణం: 2
మరులూరించే మలయసమీరం
కెరటాల ఉయ్యాల లూగెనే
చిలిపిగ సాగెనే జిలుగుపైట లాగెనే
నీల గగనమ్ము మిలమిలా మెరిసింది
నేడు జగమంతా మయూరమై కులికింది.
ఈ తెలియరాని అనుభూతి
తేనె లొలుకు నవగీతి
ఏనాడూ ఎరుగనే




నటనమే చూడరా పాట సాహిత్యం

 
రంభ నృత్యగానం - 5

రచన: ఆరుద్ర
పాడినవారు ఎస్. జానకి

నటనమే చూడరా
నా విలాసమంతా నీదేరా
ఓరచూపుల మనోజ్ఞ భావం
దోరవయసు మరాళనృత్యం
నగవు వగలు నవీన నాట్యం
లతాంగిశోభ నితాంతలాస్యమే ॥నటనమే ॥
రమణి హొయలే రసాల నిలయం
సుదతి సొగసే సుఖాల శిఖరం
వధువై మధువై వరించు పరువం
లభించె వలపు తరింపచేయరా ॥నటనమే ॥



ముల్లోకములకు కన్నతల్లులు పాట సాహిత్యం

 
నారద పాట - 6

రచన: డా. సి. నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ముల్లోకములకు కన్నతల్లులు
మునులకు సురలకు కల్పవల్లులు
తగని అసూయకు తలపడినారే
ఎంతెంతవారైన ఇంతే అయారే
ఆహా ఏమందు అదైవలీల
ఊహాతీతము కాదా ॥




ప్రభూ దయానిధే పాట సాహిత్యం

 
అనసూయ పాట - 7

పాడినవారు: పి. సుశీల
రచన : కొసరాజు

ప్రభూ దయానిధే
దివ్యతేజా! ఓ నాగరాజా! జయశుభ చరితా
ఫణికుల జాతా! మమ్ముబ్రోవవా!
విశ్వహితా భయరహితా వినవే మా మొరా!
ఓ నాగరాజా!

చరణం: 1
నాగులచవితికి మరువక నీకూ
పాలు పోయుదుము కాదా -
పాలు పోయుదుము కాదా
మధుర మధురమగు పాయసముల
వేద్యము నిత్తుము కాదా!
నీ పూజ సేయుదుము కాదా!
పాలను పోసే పడతిని కానా
జాలిని చూపవు న్యాయమేనా నీ కిది ధర్మమేనా
విషంగ్రక్క చూచేవా-నాపతి ప్రాణం తీసేవా
పసుపు కుంకుమ నిల్పి కాపాడవా
ఓ నాగదేవతా!

చరణం: 2
మహావిష్ణుపానుపు వే-శివుని మెడలోనిహారము వే
భువిచేమోడ్పులం దెద వే-ఇటు సేయంగ నీకగునే
యుగము లెమారినా
జగములెమారిన
దైవముగా నిను ధ్యానింతుమూ
నిను పూజింతుమూ
దయలేదా! మామీదా! గుణభరితా
ఓ నాగదేవతా!



ఆలయమేలా అర్చనలేలా పాట సాహిత్యం

 
నర్మద పాట 8

చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా

ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా
ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా

ఆ దైవము నిజముగ ఉంటే
అడుగడుగున తానై ఉంటే 
గుడులేల, యాత్రలేలా?

పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా

పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం 
మదిలోన వెలిగే అందం గమనించునా
పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం 
మదిలోన వెలిగే అందం గమనించునా

ఈ లోకులతో పనియేమి
పలుగాకులు ఏమంటేమీ
నా స్వామి తోడురాగా 

పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా




ఎద్దుల బండీ-మొద్దులబండీ పాట సాహిత్యం

 
యుగళగీతం - 9

సుఖానంద్ & చంప 

రచన: కొసరాజు 
పాడినవారు : ఎల్. ఆర్. ఈశ్వరి, యస్.పి.బాలు 

ఎద్దుల బండీ-మొద్దులబండీ
కదలదు యీనాటు బండీ! |
చల్లంగ లాగు అంగేసి సాగూ
అలుపొస్తే అక్కణ్ణి ఆగూ॥
కూర్చున్నదానికి నీకేమి తెలుసు
నిల్చొని లాగే నాగోడూ

గుండ్రాయిలాగా ఉన్నావు బాగా
ఒక పట్టు పట్టేసి చూడూ
అప్పళంగాదూ దప్పళంగాదూ
తెడ్డేసి తిప్పటం కాదూ
ముప్పూట తింటావు-మొనగాడినంటావు
యీ కాస్త పని కోపలేవు ॥ ఎద్దుల
గప్పాలు చాలించి గంతేసిదిగివచ్చి
దమ్ముంటే ఒక చెయ్యి వెయ్యి

నేనొస్తె నీకెంతొ అవమానమయ్యేను
ఆదిగూడ నీ చేత్తో వెయ్యి
నాకర్మ కాలింది_యీరాత రాసింది
ఇంకేమి చెయ్యాలినేనూ
ప్రాణాలు బిగబట్టి - బలమంతచూ పెట్టు
పైనుండితోను నేనూ... హర్ హర్
||ఎద్దులబండీ||





నర్మద పద్యం - 4 పాట సాహిత్యం

 
నర్మద పద్యం - 5

రచన: డా. నారాయణరెడ్డి 
పాడినవారు పి. సుశీల

దాహమున ప్రాణనాధుని తనువుతూ లె
కాలవశమున నేనిట కూలిపోతి
పార్వతీనాథ! నాకింక పతిని కొలుచు
భాగ్యమందించి మమ్ము కాపాడవయ్య !



రతీ మన్మథుల గానం-10 పాట సాహిత్యం

 
రతీ మన్మథుల గానం-10

రచన : దాశరధి
పాడినవారు: ఎస్. జానకి, పి. బి. శ్రీనివాస్

ఓ చెలీ విడువలేనే నీ కౌగిలి
సొగసైన నీలి నింగీలో
తొంగిచూచె జాబిలి 
తలపు ఉయ్యాల లూగాలిరారా
గెలుపు మనదేర ఈ రేయిలో
కలసి ఆటలాడి పాటపాడే వేళలో
నేడు వనిలోన విరిసిన వాసంతశోభల

ఓ! మదన నవమోహనా ॥
తనువు పులకింప జేసేనురా
ఓ! మదన నపమోహనా!
మధువులు చిందెడ్ నీ చూపులే
నా మనసు దోచుకొనేలే....

తపసికైనను తాపంరేపే మోహం నింపే
నీ రూపం ఎంత అపురూపము
పంచశరా మదనా
సుకుమారా! నవమోహనా,
వెల్లువై ఇలకు దూకే తెలి వెన్నెల
చెలరేగి కూయు కోయిల
నీకు నాకు తోడుగా
జంటగా వలపు పంటగా
చెరకు వింటితో
పూలబాణం వేయాలిలే ॥



హిమగిరి మందిరా గిరిజా సుందరా పాట సాహిత్యం

 
అనసూయ పాట - 11

రచన : డా. నారాయణరెడ్డి
పాడినవారు: పి. సుశీల

సాకీ: హే ప్రభో !
గరళమ్ము మ్రింగి లోకములనే కాపాడి
ధరణిపై దయబూని సురగంగ విడనాడి
ప్రమధుల కొలువులో పరవశించేవా
తాండవార్భటిలోన తనువు మరిచేవా॥

పల్లవి:
హిమగిరి మందిరా గిరిజా సుందరా
కరుణా సాగరా మొరవిన రారా॥

చరణం: 1
భుజంగ భూషణా అనంగభీషణా
కరాళ జ్వాల లెగిసెరా
కావగరారా! ప్రభో శంకరా

చరణం: 2
పతి సేవయే జీవనమై నిలిచిన నేను
పలు నిందలతో గుండెపగిలి కుందితి నేడు
జటాచ్ఛటాధరా
జగద్భయంకరా
దురంత మాపి వేయరా
పరుగునరారా! ప్రభో ఈశ్వరా





నర్మద - పాటు 12 పాట సాహిత్యం

 
నర్మద - పాటు 12

రచన :డా. నారాయణ రెడ్డి
పాడినవారు: పి.సుశీల 

దినకరా జయకరా
పావనరూపా జీవనదాతా ॥

చరణం: 1
ప్రధమకిరణం సోకిననాడే
ప్రాణవల్లభుని పొందితిగాదా
మంగళ కరములు నీ కిరణమ్ములు
మాంగల్యమునే హరియించునా దినకరా

చరణం: 2
లోకములన్నీ వెలుగించుదేవా
నా కనువెలుగే తొలగించేవా
కరుణా సింధూ కమలబంధూ
ఉదయించకుమా ఓ సూర్యదేవా !
చండకిరణ బ్రహ్మాండ కటోహోద్దండ తమో
హరణా
సకలచరాచర నిఖిల జగజ్జన చైతన్యోద్ధరణా
ద్వాదశాదిత్య రూపా రోదసీ కుహర దీపా,
ఉదయించకుమా ఉదయించకుమా ॥




నారదుని పాట - 13 పాట సాహిత్యం

 
నారదుని పాట - 13

రచన : డా. నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ముద్దుల భార్యల ముచ్చటతీర
మువ్వురుమూర్తులు ఒకటైనారా
భార్యావశులో భక్తాధీనులో
విదితము సేయగ వెళుతున్నారా
ఆహా ఏమందు ఆ దేవలీల
ఊహాతీతము కాదా



త్రిమూర్తుల గానం - 14 పాట సాహిత్యం

 
త్రిమూర్తుల గానం - 14

రచన : డా. నారాయణరెడ్డి
పాడినవారు:పి. బి. శ్రీనివాస్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జయదేవ్

మంచి మనసును మించిన దైవం
మహిలో కలదా నరుడా ఇది
మరువకురా పామరుడా||

ముక్కు మూసుకొని నీటమునిగినా
మోక్ష సంపద దొరకదురా
చిత్తశుద్ధి లోపించిన పూజలు
చేసిన ఫలితం చిక్కద రా
దేవుని నామము లెన్నైనా దీ
వించే దైవం ఒక టేరా ॥
మంచి మనసును
తోటి మనిషినే అంటరాదని
గీటు గీసుకొని ఉన్నావా
కులమతాలనే కోటలు కట్టే
కుమ్ములాడుకుంటున్నావా
అందరు దేవుని సంతతియేనని
అసలు సత్యమే మరిచేవా




అనసూయ : పదం 5 పాట సాహిత్యం

 
అనసూయ : పదం 6

రచన :సముద్రాల (జూ)
పాడినవారు: పి. సుశీల

పతియే దైవంబుగా నెంచు పడతినేని
స్వామి పదసేవ మరువని సాధ్వినేని
నన్ను అవమాన మొనరింపనున్న మునులు.
ఈక్షణమునందె పాపలయ్యెదరు గాక !



నాదదుని పాట - 15 పాట సాహిత్యం

 
నాదదుని పాట - 15

రచన: డా|| నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పసితన మెరుగని పరమమూర్తులే
పసితన మేమిటో చవిచూసినారా
పతిసేవనలో బ్రతుకును గడిపే
సతి మహిమను చాట సమకట్టినారా
ఆహా ఏమందు ఆదైవలీల
ఊహా తీతము కాదా ॥



ఎన్ని జన్మల ఎన్ని నోముల పాట సాహిత్యం

 
అనసూయ పాట - 16

రచన: డా॥ నారాయణరెడ్డి
పాడినవారు: పి. సుశీల & బృందం

ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూరులె
చంటి పాపలు కాగా । మా
యింట వూయల లూగ !!
లాలీ | లాలీ
బృందం : లాలీ | లాలీ
నొసటి వ్రాతలు వ్రాసి వ్రాసీ
విసిగినావో నిదురపో

బృందం : బ్రహ్మయ్య తాతా నిదురపో
అసుర కోటుల దునిమి దునిమి
అలసినావో నిదురపో
బృందం : నారయ్య నాన్నా నిదురపో
ప్రళయ తాండవమాడి ఆడీ
సొలసినావో నిదురపో
బృందం: శివయ్య బాబూ నిదురపో
లలిత కళలకు నిలయమైన
వాణియే నాకోడలాయె
బృందం: లాలీ జయలాలీ

లాలితముగా సిరులనొసగే
లక్ష్మియే నా కోడలాయె
బృందం: లాలీ శుభలాలీ
పతిని కొలిచిన భాగ్యమేమో
పార్వతియె నా కోడలాయె
బృందం: లాలీ ప్రియలాలీ 

Palli Balakrishna Friday, November 17, 2023
Chesina Basalu (1980)



చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, మురళీమహన్ 
దర్శకత్వం: కె. యస్. అర్. దాస్ 
నిర్మాతలు: సుందర్ లాల్ నాహతా, శ్రీకాంత్ నహతా 
విడుదల తేది: 04.07.1980



Songs List:



చేయి చేయి కలుపుకొని పాట సాహిత్యం

 
చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

చేయి చేయి కలుపుకొని




కలిసే మనసుల తొలిగీతం పాట సాహిత్యం

 
చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

కలిసే మనసుల తొలిగీతం 



ఏమిస్తే ప్రేమిస్తావు పాట సాహిత్యం

 
చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

ఏమిస్తే ప్రేమిస్తావు 





జీవితం అన్న మాట పాట సాహిత్యం

 
చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, వి. రామక్రిష్ణ, పి. సుశీల 

జీవితం అన్న మాట 



హే మనసా నీకు తెలుసా పాట సాహిత్యం

 
చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు

హే మనసా నీకు తెలుసా 



జీవితం అన్న మాట (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు

జీవితం అన్న మాట 




రేపటిమాట మనకెందుకు పాట సాహిత్యం

 
చిత్రం: చేసిన భాసలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు

రేపటిమాట మనకెందుకు

Palli Balakrishna Saturday, July 9, 2022
Girija Kalyanam (1981)



చిత్రం: గిరిజా కళ్యాణం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి, మైలవరపు గోపి 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు, వాణీ జయరాం, యస్.పి. శైలజ 
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద , సుమలత, సుహాసిని, రంగనాథ్ 
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
నిర్మాత: సుందరలాల్ నహతా
విడుదల తేది: 16.10.1981



Songs List:



యవ్వనమే పాట సాహిత్యం

 
చిత్రం: గిరిజా కళ్యాణం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

యవ్వనమే 



డిస్కో నా రాజా పాట సాహిత్యం

 
చిత్రం: గిరిజా కళ్యాణం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: వాణీ జయరాం

డిస్కో నా రాజా 



కౌగిలి ఇది తొలికౌగిలి పాట సాహిత్యం

 

చిత్రం: గిరిజా కళ్యాణం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, యస్.పి. శైలజ 

కౌగిలి ఇది తొలికౌగిలి 




ఎర్రగున్న బర్రగున్న పాట సాహిత్యం

 
చిత్రం: గిరిజా కళ్యాణం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు

ఎర్రగున్న బర్రగున్న

Palli Balakrishna Friday, April 15, 2022
Sati Anasuya (1957)



చిత్రం: సతీ అనసూయ (1957)
సంగీతం: ఘంటసాల 
నటీనటులు: యన్. టి.రామారావు, అంజలీ దేవి, జమున
మాటలు: సముద్రాల జూనియర్
దర్శకత్వం: కె.బి.నాగభూషణం
బ్యానర్: రాజ్యశ్రీ ప్రొడక్షన్స్ 
నిర్మాత: సుందర్లాల్ నహత
విడుదల తేది: 27.10.1957

Palli Balakrishna Thursday, March 4, 2021
Sabhash Ramudu (1959)



చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జమునారాణి
నటీనటులు: యన్. టి. రామారావు, దేవిక
దర్శకత్వం: సి. యస్. రావు
నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, టి.అశ్వద్నారాయణ
విడుదల తేది: 10.09.1959



Songs List:



హల్లో డార్లింగ్ మాట్లాడవా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జమునారాణి

పల్లవి:
హల్లో డార్లింగ్ మాట్లాడవా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్
దరికొస్తే గొడవ
మాటామంతీ మనకెందుకోయ్
సరిసరిలే నిర్వాకం తెలిసింది పోవోయ్

చరణం: 1
మన ప్రేమ మరిచేవా కనికరం లేదా
కనికరం మమకారం అనకింక నాతో
ఏమే చిలుకా ఇంకా అలుకా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్
దరికొస్తే గొడవ 

చరణం: 2
దయగంటే మొరవింటే
నీ పాదాల పడతా
మనలోన మనకేమి తలవంపే చిలుకా
దండాల్ పెడతా సెల్యూట్ కొడతా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్
దరికొస్తే గొడవా 

చరణం: 3
పదిమంది ఇది వింటే
పరువా మరియాదా
పదిలేస్తా ఒట్టేస్తా ఇదిగో నీ మీదా
ఐతే సరిలే....
రైట్ పదవే...
మనసొకటే మాటొకటే
మనజీవాలొకటే (2)




జయమ్ము నిశ్చయమ్మురా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల & కోరస్

పల్లవి:
అహహా.. ఆహహ.. ఆహహా
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

చరణం: 1
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏరోజుకైన సత్యమే జయించి తీరును... జయించి తీరును
కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును...  సుఖాలు దక్కును

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

చరణం: 2
విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి
విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి
విశాల దృష్టి తప్పకుండ బోధించాలి... బోధించాలి
పెద్దలను గౌరవించి పూజించాలి... పూజించాలి

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా




జయమ్ము నిశ్చయమ్మురా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల, ఘంటసాల, సరోజిని 

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును... సుఖాలు దక్కును
ఈ లోకమందు సోమరులై ఉండకూడదు...  ఉండకూడదు
పవిత్రమైన ఆశయాన మరువకూడదు... మరువకూడదు

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా...  బ్రోవుము దేవా
కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దైవా... నడుపుము దేవా
బీదసాదలాదరించు బుద్ది నొసగుమా... శక్తి నొసగుమా



జాబిల్లి వెలుంగులో పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: కె.రాణి

సాకి:
జాబిల్లి వెలుంగులో
కాళిందిచెంత 
గోవిందు ఉంటానని
రాడాయె వింత

నన్నెడబాయని మన్నన చేయమని
మిన్నక ఇంతలోనే ఈ పంచనా
రాధ క్షమియించు నాయి త సృతి మించునా
నందకిశోరుడే యిలా చేయునా
వెన్నెల రేయికదా కన్నుల పండువుగా
హాస విలాసమేదో చూపించరా
మురళి వాయించరా_ముద్దు చెల్లించరా
జాగు సేయకురా- తాళజాలరా



రేయి మించేనోయి రాజా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: పి.సుశీల 

పల్లవి:
రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా ఆ...
హాయిగ నిదురించరా

రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా ఆ...
హాయిగ నిదురించరా

చరణం: 1
వెల్లివిరిసి వెన్నెళ్లు కాచి
వెల్లివిరిసి వెన్నెళ్లు కాచి
చల్లన్ని చిరుగాలి మెల్లంగ వీచి 
స్వప్నాలలోన స్వర్గాలు కంటూ
స్వర్గాలలో దేవగానాలు వింటూ
హాయిగా నీవింక నిదురించవోయి

రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా ఆ...
హాయిగ నిదురించరా

చరణం: 2
చీకటి వెంట వెలుగే రాదా 
కష్టసుఖాలు అంతే కాదా
చీకటి వెంట వెలుగే రాదా 
కష్టసుఖాలు అంతే కాదా
చింతా వంతా నీకేలనోయి  
అంతా జయమౌను శాంతించవోయి
హాయిగ నీవింక నిదురించరోయి 

రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా ఆ...
హాయిగ నిదురించరా... హాయిగ నిదురించరా




కలకల విరిసి జగాలే పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, పి.సుశీల  

పల్లవి:
కలకల విరిసి జగాలే పులకించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే

వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే 

చరణం: 1
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
అలరుల తోటా ..అందాల బాట
హాయిగ పాడే కోయిల పాట.. కోయిల పాట..
తెలియని కోరికలేవో కలిగించెనే...

కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే...

చరణం: 2
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
చల్లని గాలి ...మెల్లగ వీచే ..
హృదయము దూసి ...మనసే దోచే..మనసే దోచే...
మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే

కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....

చరణం: 3
ఓ..ఓ...ఓ..ఓ...ఓ..ఓ...
చెలి చూపులలో అనురాగాలు..
నిజమేనా అని అనుమానాలు...అనుమానాలు..
సందేహలేలా హృదయాలే మన సాక్షులు...

కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....



జయమ్ము నిశ్చయమ్మురా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

గాఢాంధకారమలముకున్న భీతిచెందకు
సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు... సాగుముందుకు
నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు… క్రుంగదీయకు

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్
జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్... పోరి గెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్...  నిల్వబెట్టవోయ్

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా

జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా




ఓ చందమామ ఇటు చూడరా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: కె.రాణి

ఓ చందమామ ఇటు చూడరా మాటాడరా
ఓ చిన్న దానా నిను వలచినదానరా

పున్నమరేయి వెన్నెల హాయి
కన్నె కలువ కనుసన్న చేసెరా
అందరాని ఆకాశమందునా
ఎందుకురా దోబూచులాడెదవు

చుక్కలమీద మక్కువ నీకు
చక్కలిగింతలు మా కెందుకులే
చందమామ రానేల నీవిటు
చాలు చాలు పోవోయి తొందరగ
అటు చూడరా మాటాడజాల నటుచూడరా

కారుమబ్బు నిను కబళించుటకై
తెరలు తెరలుగా చనుదెంచెనురా
పొంచి రాహు పగబూనివటగా
తలంచె నెరింగి తొంగిపో




ఓదేవా మొరవినవా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: పి.లీల 

ఓదేవా మొరవినవా
మీద దయగనవా
అలలు పొంగే సాగరాన తీరమేలేదా
కారుచీకటి జీవితాన దీపమేలేదా
నేర మెరుగని దీన జనులకు దారియేలేదా
జానకి సతి జంట బాసీ వనమునందు
తిరుగులాడిన నాటిగాధ మరచిపోయితివా
చలము మానీ చరణ మొసగి పలుక వాదేవా



ఆశలే అలలాగా ఊగెనే సరదాగా పాట సాహిత్యం

 
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం: ఘంటసాల

ఆశలే అలలాగా ఊగెనే సరదాగా
ఓడలాగా జీవితమంతా ఆడేముగా
యవ్వనంబను గాలిలో యెదురు వలపుల తేరులో
ఆలుమగలూ జతగా మురిపెముగా సుఖింతురుగా
మాటే మరచీ పోయేరుగా
జీవితమూ కడతీరెలే దేశముతో పనిలేదులే
సొగసు వయను మరలా రావిటులా ముసలితనమే మేలా
లం పోకడ చూడగ యెంలో వితౌనిలా

తుపానులోని పడవవలె ఊపివేయును కష్టములే
తనువు ధనమూ స్థిరమా ఇది నిజమా
సుఖము శాశ్వతమా
బ్రహ్మ వాసిన వ్రాతా తెలియా సామాన్యమా



వన్నెలు కురిసే చిన్నదిరా పాట సాహిత్యం

 
చిత్రం:  శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం: జమునారాణి

వన్నెలు కురిసే చిన్నదిరా యిది నిన్నే వలచెను రా
యిక చేయీచేయీ కలిపావంటే హాయేను రా

నీరొట్టె నేతిలో పడుతుందిరా
నిలువునా కధ రక్తి కడుతుందిరా అందుక నే
కోరిక ఉంటే వారేవా 
కోరిక ఉంటే - వారేవా - ఖుషీ దీర్చుకోరా
వడిలో ఉన్నా ముద్దులగుమ్మను వదిలి పెట్టుకోబోకురా

జరిగిపోయిన రోజు తిరిగి రాదోయీ
రేపు సంగతి నీవు మరచిపోవోయీ - అందుక నే
కంటికి నచ్చిన నవ్వుల రాణీ ఒంటిగ చిక్కెనురా
కళ్లు మూసుకొని కానకపోతే చెప్పకుండ దౌడేయురా

Palli Balakrishna Thursday, February 4, 2021

Most Recent

Default