Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sangeetha"
Jathagadu (1981)



చిత్రం: జతగాడు (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: కృష్ణ, జయప్రధ, సంగీత 
డైలాగ్స్: జంధ్యాల 
దర్శకత్వం: బి.సుబ్బారావు
నిర్మాత: పి.వి.కృష్ణ ప్రసాద్ 
విడుదల తేది: 18.19.1981

Palli Balakrishna Sunday, January 21, 2024
Masooda (2022)



చిత్రం: మసూధ (2022)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ 
దర్శకత్వం: సాయి కిరణ్ 
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క 
విడుదల తేది: 18.11.2022



Songs List:



దాచి దాచి పాట సాహిత్యం

 
చిత్రం: మసూధ (2022)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: చైతన్య పింగళి 
గానం: సిద్ శ్రీరామ్

అంతేలేని ఆకాశానా
గమ్యం అంటూ ఉండేదేనా
ఎగరాలనే, ఏ ఏ ఆరాటమా
అలిసొస్తే వాలే చోటే లేక

దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో… గొంతు లోపలా
వేళ కాని వేళలో ఇలా
నువు కూయబోతే గాయమవ్వదా?

ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
ప్రతి మలుపు దాటే వేళా
సందేహాలేవో తరుముతున్నా
కనుల వెనకే… కలలు వదిలి
పరుగులేనా..!

క్షణక్షణమో కధ అని
నీ కొంగంచు వదలని
అలిగిన ఒక పాపాయిలా
పారాడుతూనే

ఆ నింగి నీలిమా
మేఘాల కీర్తన
దూకింద కళ్ళల్లో ఇలా

దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో గొంతు లోపలా
వేళ కాని వేళలో ఇలా ఆ ఆ
నువు కూయబోతే గాయమవ్వదా




చుక్కలని తాకే పాట సాహిత్యం

 
చిత్రం: మసూధ (2022)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్ 
గానం: అభయ్ జోద్పుర్కర్

చుక్కలని తాకే 

Palli Balakrishna Thursday, December 15, 2022
Srimati Kalyanam (2010)



చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
నటీనటులు: వడ్డే నవీన్, సంగీత 
దర్శకత్వం: శివాల్ 
నిర్మాత: బాను కిరణ్ 
విడుదల తేది: 02.04.2010



Songs List:



అరె అరె ఆజారే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ 
గానం: తడరాజు, దివిజ కార్తీక్ 

అరె అరె ఆజారే



మనసులోని మాటలే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: తడరాజు
గానం: తడరాజు, దివిజ కార్తీక్ 

మనసులోని మాటలే 



చలి చలి గా ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: డైరెక్టర్ శివాల్ 
గానం: సునీత 

చలి చలి గా ఉంది 




మోడల్ గర్ల్స్ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: తడరాజు

మోడల్ గర్ల్స్ 



మేఘమే నువ్వైతే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: కార్తీక్, దివిజ కార్తీక్ 

మేఘమే నువ్వైతే 



అనకాపల్లి అందగత్తెని పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: మాలతి, సాయి కార్తీక్ 

అనకాపల్లి అందగత్తెని 



రాయమ్మ రాయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: డైరెక్టర్ శివాల్ 
గానం: తడరాజు, దివిజ కార్తీక్ 

రాయమ్మ రాయమ్మ 


Palli Balakrishna Thursday, August 11, 2022
Nenu Pelliki Ready (2003)

చిత్రం: నేను పెళ్ళికి రెడీ (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: శ్రీకాంత్, లయ, అనిత,
మాటలు: సతీశ్ వేగేశ్న
దర్శకత్వం: వెంకీ
నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ్
విడుదల తేది: 14.11. 2003







చిత్రం: నేను పెళ్ళికి రెడీ (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కర భట్ల రవికుమార్
గానం: హరిహరన్ 

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
మనసు కొమ్మ పై కోయిలమ్మ వై
వచ్చి వాలితే చాలు చాలు చాలు

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు

అవమానాలు ఎన్నెదురైన నువ్వుంటే చాలు
బహుమానాలు అక్కరలేదు నువ్వుంటే చాలు
కొండా కోన దాటొస్తాను నువ్వుంటే చాలు
మండుటెండలో నడిచొస్తాను నువ్వుంటే చాలు
నువ్వు నీడలాగా మారి నా తోడు వుంటే చాలు
నీ కౌగిలింతలో నేను మంచు లాగా
కరిగిపొతే చాలు చాలు చాలు

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు

ఎవ్వరినైన ఎదిరిస్తాను నువ్వుంటే చాలు
ఎక్కడికైన ఎగిరొస్తాను నువ్వుంటే చాలు
ఎన్నటికైన కరుణిస్తావ అవునంటే చాలు
ఈ క్షణమే నే మరణిస్తాను ఊ అంటే చాలు
చీరుగాలి లాగా మారి నను తాకుతుంటే చాలు
నీ లేత బుగ్గ పై నేను సిగ్గు లా
మారి పొతే చాలు చాలు చాలు

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
మనసు కొమ్మ పై కోయిలమ్మ వై
వచ్చి వాలితే చాలు చాలు చాలు

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు



Palli Balakrishna Sunday, February 21, 2021
Sarileru Neekevvaru (2020)




చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు: మహేష్ బాబు, రష్మిక మందన్న
దర్శకత్వం: అనీల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు, మహేష్ బాబు, అనీల్ సుంకర
విడుదల తేది: 11.01.2020



Songs List:



మైండ్ బ్లాకు.. పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్
గానం: బ్లెజ్, రనీనా రెడ్డి

ఎప్పుడూ ప్యాంటేసే వాడు...
ఇప్పుడు లుంగీ కట్టాడు... వావ్
ఎప్పుడూ షర్టేసే వాడు... వావ్
ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా
చేతికేమో మల్లెపూలు కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు
ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్

బాబూ నువ్ సెప్సు.. ఏంటీ
ఆన్ని కొట్టమని డప్పు.. హూమ్ నువ్ కొట్టరా
మూన్ వాకు.. మూన్ వాకు..
పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకు
అర్త్ క్వేకు.. అర్త్ క్వేకు..
పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్ క్వేకు
నీ లిప్పు లోన ఉంది కప్పు కేకు..కేకు...
మాటలోనా ఉంది మిల్క్ షేక్.. షేకు.
సోకులోనా ఉంది కొత్తస్టాకు  స్టాక్
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
నువ్ హాట్ హాట్ గున్న పూత రేకు.. రేకు.
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు
మనసునెర్రజేసే తమలపాకు...పాకు
అమ్మా అమ్మా హబ్బ హబ్బా

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు

బాబూ నువ్ సూపియ్. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ.. హుమ్ నువ్ ఊదరా
నువ్ ఉండరా
నువ్వు చీరకట్టుకుంటే... జారుతుందే గుండె
ఓరకంట చూపే.. భగ్గుమంటు మండే.
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందో
నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే

అట్టా నువ్ చూస్తుంటే.. నా వొళ్లంతా
గిలిగింత పుడతాందే
నీ కళ్లలోన ఉంది.. కళ్లు ముంత.. ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంత.. పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు

బాబూ తూ బోలే... క్యారే
ఆన్నీ దంచమనీ ఢోలే.. హుమ్ నువ్
దంచెహే
హా.. బాబూ ఇటు సూడూ.. ఏంటీ
ఆన్నీ పెంచమను స్పీడూ.. హుమ్ నువ్
పెంచరా
నీ ముద్దు ముట్టకుండా... ముద్ద ఎక్కదంట హగ్గు అందకుండా నిద్దరట్టదంటా
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా
నీ టచ్ లో కరెంటే నన్ను గుచ్చెనంటా
మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా
అయితే నిన్ను టచ్ చేస్తా... నిన్ను ఏదేదో
మైకంలో ముంచేస్తా.

నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
నీ నడుములోన ఉంది పూల నావా నావా...
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు




సూర్యుడివో చంద్రుడివో పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బి. పరాక్

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల 
ఆనందమాయే హొయ్యా

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల 
చిరునవ్వు చేరే హొయ్యా

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

విశ్వమంతా ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో
సాటివారికై నీ వంతుగా
ఉద్యమించు కృషివో

మా అందరిలో ఒకడైన మనిషివో

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల 
ఆనందమాయే హొయ్యా

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల 
చిరునవ్వు చేరే హొయ్యా

గుండె లోతులో గాయం
నువ్వు తాకితే మాయం
మండువేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం

పొలమారే ఆశల కోసం 
పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా 
నేనున్నానన్నావు
అడగందే అక్కర తీర్చే 
నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

దేవుడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో గొప్ప మనసు తనై
ఉంటాడు నీకు లాగా

ఏ లోక కల్యాణాన్ని ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు నిండారా పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జయహో అన్నది

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల 
ఆనందమాయే హొయ్యా

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల 
చిరునవ్వు చేరే హొయ్యా



He is So Cute పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మధు ప్రియ

అబ్బబ్బబ్బబ్బ.. అబ్బాయెంతో ముద్దుగున్నాడే
కోరస్: ముద్దుగున్నాడే ముద్దుగున్నాడే
ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే
కోరస్: ఎత్తుగున్నాడే ఎత్తుగున్నాడే
అల్లాద్దిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా
అల్లాడించాడే ఓరకంటా
పిల్లాడి బుగ్గ షిమ్లా యాపిల్ లాంటిదంటా
దొరకాలే గాని కొరికి తింటా
చూపుల్లో దాచినాడే ఎదో తూటా 
నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome.

అబ్బబ్బబ్బబ్బ

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome. 

కోడినిట్టా తన్నుకెల్లే గద్దల్లె 
చేపనిట్టా ఎత్తు కెళ్లే కొంగల్లె 
సొత్తు నిట్టా కొల్లగొట్టే దొంగల్లె 
దొంగ లాంటి వీన్నే దాచెయ్యాలి లే 
వీడు పక్కనుంటేచాలు నన్నేచూసి 
ఆడజాతి కళ్ళనిండా ఫుల్ జలసీ 
మాటల్లో దాచినాడే ఆటంబాంబ్ మూట 
నాకొంప కూల్చినాడే టా టా టా టా

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome.

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome. 

కోరస్: 
వీరి వీరి గుమ్మడిపండు వీరి మొగుడెవరే    
బుగ్గలు రెండు జామపండు లాగఉన్న వీడే 

పొద్దునొస్తే ముద్దు కాపీ ఇస్తాలే 
లుంచుకొస్తే హుగ్గుమీల్స్ పెడతాలే 
రాతిరొస్తే బెడ్డుమీద, ఇదిగో అమ్మాయి  ( కోరస్ ) 
అబ్బా బ్రెడ్డుజాము డిన్నర్ తినిపిస్తానులే

చీరలొద్దు నగలువద్దు అమ్మా నాకు 
వీడి పిల్లలకు అమ్మ నవ్వాలే
మగవాడి అందమీద లేదే ఒకపాట 
వీడి ముందు అందం కూడా టా టా టా టా

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome. 

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome. 

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome. 

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome.



సరిలేరు నీకెవ్వరు పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవిశ్రీ ప్రసాద్
గానం: శంకర్ మహదేవన్

భగభగమండే నిప్పుల వర్షమొచ్చినా
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు

పెలపెలమంటూ మంచు తుపాను వచ్చినా
వెనుకడుగేలేదంటూ దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ
తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు
మారణాయుధాలు ఎన్నెదురైనా 
ప్రాణాన్ని ఎదురుపంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడు

సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారూ
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు



డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: లవిత. ఎమ్. లోబో, నకాష్ అజీజ్

హలో...!
ఆజ్ రాత్ మేరే ఘర్ మెయిన్, పార్టీ హై! 
తు ఆజా నా,

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ (3)

డాంగ్ డాంగ్ డాంగ్, డాంగ్ 
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ - ఆజా నా (3)

హే! ఆజ్ రాత్ మేరే ఘర్ మెయిన్, పార్టీ హై 
తు ఆజా నా, తు ఆజా నా

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,

హే! ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై 
తు ఆజా నా,  జరూర్ అజా నా,
 
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్

DJ దించుతా - ఓహ్! 
సౌండ్ పెంచుత - అబ్బా
బేస్ దంచూత - ఆది, 
రచ్చ లేపేద్దామ్

జోరుగుంటదా - హూ
జోషుగుంటదా - ఫుల్
జోలీగుంటదా - పక్కా
ఐతే వచ్చేస్తాం

లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్ 
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ (2)

ఏక్ టీన్ చార్
గెట్ అన్ ద డాన్స్ ఫ్లోర్‌
ఇంచ్-ఇంచ్ ఇరగదీద్దామ్ క్రేజీ తీన్ మార్
బాజీ హై ఫన్ గిటార్ నాషే మే ఫుల్ షికార్
తేరే మేరే బీచ్ మే పుట్టిండి వైల్డ్‌ ఫైర్

డిమ్ లైట్ లో డిస్కో బీట్ తో,
మోతా మోగని మొత్తం ఈ నైట్
బుజ్జి పెగ్స్ తో బాడీ హగ్స్ తో
పట్టు తప్పని పార్టీ క్లైమేట్

లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్ 
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్

వన్ మోర్ టైమ్

వాట్ ఎ స్కిన్ టోన్
నచ్చావే గ్లామర్ క్వీన్
నిన్ను చుసి దిల్ మే గిర్రుమంది
రొమాంటిక్ డ్రోన్

వాట్ ఎ క్యూట్ సీన్ నీతో పాటు నేను
నువ్ పక్కనున్న కిక్కే చాలు అదే చంద్రయాన్

ఓహ్ క్యా తేరి అదా, పారడైజ్ దా,
రబ్ నే తుజే ఐసా బనా దియా రే,
ఆ గయా మాజా అందుకే కదా,
మే భీ ఫిదా హోగయీ రే

లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్ 
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్  (4)

Palli Balakrishna Sunday, January 12, 2020
Nakili Manishi (1980)



చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి, బాజీరావు, యల్. ఆర్. అంజలి
నటీనటులు: చిరంజీవి, సంగీత
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాత: యారగుడిపాటి వరధారావు
విడుదల తేది: 01.08.1980



Songs List:



ఇటు మూగ ఆశ పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి, బాజీరావు

ఇటు మూగ ఆశ అటు మృత్యు ఘోష



తమలపాకులాంటి దాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యల్. ఆర్. అంజలి

తమలపాకులాంటి దాన్ని 




బొమ్మా బొరుసా రావా పురుషా పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

బొమ్మా బొరుసా రావా పురుషా 




భలే భలే భలే భలే నరసింహస్వామినిరా పాట సాహిత్యం

 
చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు

భలే భలే భలే భలే నరసింహస్వామినిరా 

Palli Balakrishna Monday, January 28, 2019
Sankranti (2005)




చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
నటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్ , శివబాలజి, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత, 
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: ఆర్. బి.చౌదరి
విడుదల తేది: 18.02.2005



Songs List:



ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: ఉదిత్ నారాయణ్, సదన సర్గం 

ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన 





అందాల శ్రీమతికి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: హరిహరన్, శ్రేయా ఘోషల్

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు
నీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

చిరుగాలికి ఏదో పాపం సందేహం
మనవెంటే ఉంటూ మన కబుర్లు వింటుంది
ఏంటో ఈ కాలం నిలబడదే నిమషం
నీవెళ్లి రానా అని పరుగులు తీస్తోంది
వినలేదా మల్లెలు కోసం పలికే ఆ తుమ్మెద రాగం
వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇపుడే కొంచం
అదే సుమా నీకు నాకు వేసెను తియ్యని బంధం
ఆ కథలే మరిచిపోనులే ఊరించే జ్ఞాపకాలులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

పొద్దెరగని ప్రణయం కోరింది హృదయం
నీ లేత పెదవే ఉసికొలిపే ఈ సమయం
హద్దెరగని సరసం తగదన్నది ప్రాయం
శృతి మించిపోతే రుచిలేనిది శృంగారం
విరజాజుల పరుగులకైనా కరునిస్తావని అనుకున్నా
అలకన్నది క్షణమైనా మురిపిస్తే వశమై పోనా
వేల వేల చుక్కల్లోన జాబిల్లివి నువ్వేనమ్మా
జాబిలికే వెలుగు సూర్యుడే
నువు లేని బ్రతుకు శూన్యమే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు




అడే పాడే పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: కార్తీక్, చిత్ర 


అడే పాడే 



ఆశ ఆశగా పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 


ఆశ ఆశగా 



చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: శంకర్ మహదేవన్ , సుజాత

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం - హేయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం 

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

మోజు పిట్ట కన్నె కొట్టు మోజు తీరా ముద్దె పెట్టు 
చెమ్మచెక్క ఆటాడిస్తాలే 
మాటలింక కట్టే పెట్టు కాట్టేస్తే కందేటట్టు 
వేటగాడి ఊపే చూస్తాలే 
దేదె చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లడిస్తాలే 
రా రా రాజా నేనే నీ రోజా ఉ అంటే వొళ్ళోకోస్తాలే... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం హొయ్ 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

హే ప ప ప పాలపిట్టా పైటే పట్టు వద్దంటే నీమీదోట్టు
వరసంగా పిండే ఇస్తాలే లే లే
గిలి గిలిగా విన్నెటట్టు కౌగిట్లో జున్నే పెట్టు 
జజ్జన్నక జమ ఇస్తాలే 
హె.హె తయ్య రయ్య అరే తస్సదియ్య 
వాటంగా ఒళ్ళొకోస్తాలే... 
హే... రావే పిల్ల నా తుగో జిల్లా 
వయ్యారం తాళం తీస్తాలే 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం హోయ్... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం




డోలి డోలి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: శంకర్ మహదేవన్, ఎస్.ఎ. రాజ్ కుమార్, చిత్ర, కల్పన 

డోలి డోలి



(పెళ్లి పాట - I) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

పెళ్లి పాట - I




చక్కని మా అన్నయ్యకు (పెళ్లి పాట - II) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ 
వచ్చింది ఇంటికి తన జంట గూటికి 
చిరినవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ 
నిలుచుంది వాకిట ఈ మందార మాలిక 
సిరివెన్నెలంటి చెలిమిని బాగుపంచగా 
నెలవంక ఇలకు చేయనా చిన్న వదినగా 
పొంగే ఆనందం తెచ్చే సంతోషం 
మాలోగిలి నిండెనే 
వధువే బంగారం వరుడే తనసర్వం 
ఇది నూరేళ్ళ బంధమే

Palli Balakrishna Monday, March 19, 2018

Most Recent

Default