-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. Radha Krishna"






చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హగ్డే, నివేత పేతురాజ్, టబు, నవదీప్, శుశాంత్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ
విడుదల తేది: 12.01.2020





Songs List:




ఓ మై గాడ్ డాడీ పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: రాహుల్ స్పిల్గున్జ్, రాహుల్ నంబయార్, రోల్ రిడ, బ్లాజ్జే, లేడీ కాష్

నా స్టొరీ చెప్పలేను నా బాదకంతు లేదు
ఈ డాడిలందరెండుకిట్ల పీక్కుతింటున్నారు
మాట విన్నిపిచుకోరు అసల అర్ధం చేసుకోరు
ఆలోచిస్తుంటే నానా పేరు రాలుతుంది నా హెయిర్ 
వంద రూపాయల ఇయ్య మంటే మనమేమైన రిచ్ ఆ 
అన్ని క్లాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా
ఆలుకుంటూ ఏడ్చుకుంటూ నేను బైటికొచ్చ
అందరింట్లో same సీన ఏమంటా చిచ్చా
పల్లవి:
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Don't be So Hardy That will Make me Saddy(2)

మేర నాం బంటు గాని పేరుకి కొత్త నేనింటు
చర్సౌబీస్ దాడి తో చేసానే ఫైట్ డే అండ్ నైట్ ఊ 
ఓఓఓఓఓఓఓఓ అమ్మకి మొగుడు ఓఓఓఓఓఓఓఓ నానైనాడు
వర్షాన్ని ఓ చిట్టి బాటిల్ లో నిపలేవు సంతోషాన్ని కుట్టి నువ్వు యునిఫారం వెయ్యలేవు 
స్వేచ్చకేమో షార్ట్ కట్ కనిపెట్టలేదు ఒట్టు కాదంటే నన్ను తిట్టు లేదా నా జట్టు కట్టు 
అడివేమో బ్యాక్ యార్డ్ లో పెట్టలేవు మచ్చా పావురాన్ని పేపర్ వెయిట్ చెయ్యలేవు పిచ్చి
వాల్కనో తో చలిమంటే వెయ్యలేవు చిచ్చా బ్లాంక్ చెక్ నా మరి చెప్పి మరి వచ్చా

Hey, He isn't Always Right! Spy Daddy Spy Daddy!
Hey, He isn't Always Right! Spy Daddy Spy Daddy!
Spy Daddy Spy Daddy ! Spy Daddy Spy Daddy ! 

సన్ అఫ్ వాల్మీకి అంటే కేర్ అఫ్ కష్టాలున్నటే
ఈ ఇంట్లో నవ్వలంటే తానోస్ చిటికేయ్యాలంతే
ఓఓఓఓఓఓఓఓ మమ్మీ మొగుడు ఓఓఓఓఓఓఓఓ డమ్మి గాడు
 
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Don't be So Hardy That will Make me Saddy(6) 



సామజవరగమన పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల సీత రాం శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్

పల్లవి:
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

చరణం: 1
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా...

విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..

అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా...

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు




బుట్ట బొమ్మ పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగ్గయ్య శాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్
 
పల్లవి:
ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్ట లేదు గని అమ్మో
నీ లవ్ అనేది Bubble Gum అంటుకునాదంటే పోదు నమ్ము 
ముందు నుంచి అందరాన్నమాటే గాని మల్లి అంటున్ననే అమ్మో 
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ ఆపలేవు నన్ను నమ్ము

ఎట్టాగా అనే ఎదురు చూపు కి తగినట్టుగా నువ్వు బదుకు చేబితివే
ఓరి దేవుడా ఇదేన్ధనెంత లోపటే పిలడా అంట దగరై నన్ను చేరదీస్తివే

బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టు కుంటివేవే
జిన్దగికే అట్ట బొమ్మై జంట కట్టుకున్టివే
బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టు కుంటివేవే
జిన్దగికే అట్ట బొమ్మై జంట కట్టుకున్టివే

మల్టీప్లెక్స్ లో ని ఆడియన్స్ లాగ మౌనగ్గున్న గని అమ్మో
లోన దందనక జరిగిందే నమ్ము దిమ్మ దిరిగినాడే మైండ్ సిమ్

రాజుల కాలం కాదు రధము గుర్రం లేవు అద్దం ముందర నాతొ నేను యుద్ధం చేస్తాంటే
గాజుల చేతులు చాపి దగ్గరికొచ్చిన నువ్వు  చెంపల్లో చిటికేసి చక్కరవత్తిని చేసావే 
చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా  తుఫాన్ తేస్తివే 
మాటగా ఓ మల్లె పువ్వునడిగితే మూటగా పూలతోటగా పైనోచ్చి పడితివే
బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టు కుంటివేవే
జిన్దగికే అట్ట బొమ్మై జంట కట్టుకున్టివే
వేలినిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే
కాలికింది పువ్వు నేను నేత్తినేటు కుంటివే

ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్ట లేదు గని అమ్మో
నీ లవ్ అనేది Bubble Gum అంటుకునాదంటే పోదు నమ్ము 
ముందు నుంచి అందరాన్నమాటే గాని మల్లి అంటున్ననే అమ్మో 
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ ఆపలేవు నన్ను నమ్ము




రాములో రాములా పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లి సత్యవతి

హేయ్ బ్రదర్ ఆపమ్మా
ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం...

బంటు గానికి ట్వెంటీ టు
బస్తీ మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర కట్టుకొని
చిల్డ్ బీరు మెరిసినట్లు
పొట్లంగట్టిన బిర్యానీ
బొట్టు బిల్ల వెట్టినట్లు
బంగ్లా మీద నిల్పోనుందిరో సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ

పల్లవి:
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)

చరణం: 1
హెయ్! తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తా వే
ఎర్రగ పండిన ఋధలు రెండు
యాది కొస్తాయే.
అరె ఫువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలో దూరి
లొల్లే చేస్తావే

అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు
జల్లుమంటాందే

చరణం: 2
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడింటు
పట్టనట్లే తిరుగుతున్నవే ఓ సందామాన
పక్కకు పోయి తొంగిజూస్తవే
ఎం టెక్కురా మావ,

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (5)





సిత్తరాల సిరపడు పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: విజయ్ కుమార్ భల్ల 
గానం: సూర్రన్న, సాకేత్ కొమండురి

సితారాల సిరపడు సిత్తరాల సిరపడు పట్టు పట్టినాడ ఒగ్గానే ఒగ్గాడు
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గసేని ఉడుం పట్టు ఒగ్గాడు

బుగాతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే బుగాతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే 
కొమ్ములుడదీసి మరి పీపలూదినాడురో...

జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొమ్పంటే జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొమ్పంటే
దేయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు

అమ్మోరి జాతరలో ఒంటి తల రావనాడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావనాడు 
గుంట లెంట పడితేనే గుడ్డి గుండా సేసినాడు... గుంట లెంట పడితేనే గుడ్డి గుండా సేసినాడు

పొన్నూరు వస్తాడు దమ్ముంటే రమ్మంటే పొన్నూరు వస్తాడు దమ్ముంటే రమ్మంటే
రోమ్ముమీదోకటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు రోమ్ముమీదోకటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
పది మంది నాగాలేని పది మూరల సోరసేప పది మంది నాగాలేని పది మూరల సోరసేప
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకోత్తుకోచినాడు ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకోత్తుకోచినాడు

సాముసేసి కందతోటి దేనికైనా గట్టి పోటి సాముసేసి కందతోటి దేనికైనా గట్టి పోటి
అడుగుగేసినాడు అదిరెను అవతలోడు...
 
సితారాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల 
ఊరుసివర సితారాల సిరపడు
గండుపిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ ఎనక పడ్డ పోకిరోల్లనిరగాదంతే సక్కనమ్మ ఎనక పడ్డ పోకిరోల్లనిరగాదంతే
సకనమ్మ కళ్ళలో ఎలా ఎలా సుక్కలోచ్చే సకనమ్మ కళ్ళలో ఎలా ఎలా సుక్కలోచ్చే



అల వైకంఠ పురంలో పాట సాహిత్యం





చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: ప్రియా సిస్టర్స్ , శ్రీకృష్ణ

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల
మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల
పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు
విహ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై…

అల వైకుంఠపురములో అడుగుమోపింది పాశమే
విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చెనే

అల వైకుంఠపురములో బంటుగా చేరే బంధమే
అలై పొంగేటి కళ్ళలో కులాస తీసుకొచ్చేనే

గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమే
దిష్ఠి తీసింది దీవెనై ఘన ఖూస్మాన్డమే

భుజము మార్చింది భువనమే బరువు మోయంగ బంధమే
స్వాగతించింది చిత్రమై రవి సింధూరమే

వైకుంఠపురములో - ల ల ల లాలా
వైకుంఠపురములో - ల ల ల లాలా
ల ల ల ల ల లాలా



*********  Thanks For Watching  *********




  

Palli Balakrishna Tuesday, October 15, 2019



చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నటీనటులు: జూ. ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఇషా రెబ్బ , నవీన్ చంద్ర, జగపతి బాబు 
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
విడుదల తేది: 11.10.2018



Songs List:



అనగనగనగా అరవిందట పాట సాహిత్యం

 
చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: అర్మాన్ మాలిక్

పల్లవి:
చీకటిలాంటి పగటి పూట కత్తుల్లాంటి పూలతోట
జరిగిందొక్క వింతవేట పులిపై పడిన లేడి కధ వింటారా
హే జాబిలీ రాని రాతిరంతా జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంత గుండెల్లోకి దూరి అది చూస్తారా

చుట్టూ ఎవ్వరు లేరూ... సాయం ఎవ్వరు రారూ...
చుట్టూ ఎవ్వరు లేరూ సాయం ఎవ్వరు రారూ 
నా పై నేనే ప్రకటిస్తున్న ఇదేమి పోరూ...

అనగనగనగా అరవిందట తన పేరు 
అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరూ...
అరెరెరే...  అటుచూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు 
అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరు.....

ఏ... ప్రతినిమిషం తన వెంట పడిగాపులే పడుతుంటా 
ఒకసారి కూడా చూడకుందే క్రీగంటా...
ఏమున్నదో తన చెంత ఇంకెవరికి లేనంత 
ఐస్కాంతమల్లె లాగుతుంది నన్ను చూస్తూనే ఆకాంత

తను ఎంత  చేరువనున్న... అద్దంలో ఉండే ప్రతిబింబం 
అందునా అంత మాయల ఉంది అయినా హాయిగా  ఉంది 
బ్రమల ఉన్న బానే ఉండే ఇదేమి తీరు

మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...
మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...

అనగనగనగా అరవిందట తన పేరు 
అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరూ...
అరెరెరే...  అటుచూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు 
అన్యాయం కదా ఇది అనరు ఎవ్వరు.....

మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...
మనవే వినవె అరవింద! సర్లే అనవే కనువిందా!
మనకి మనకి రాసుందే కాదంటే సరిపోతుందా...




పెనిమీటీ పాట సాహిత్యం

 
చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కాలభైరవ

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా..
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా

చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి

గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ  (2)

చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి

గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ  (2)

పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని

సూసీ సూడక.. సులకన సేయకు..
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ
తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ

నరగోస తాకే కామందువే
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో

యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా..
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా



ఏడ బొయ్యాడో.. పాట సాహిత్యం

 
చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, పెంచల్ దాస్
గానం: నిఖితా శ్రీవల్లి, కైలాష్ ఖేర్, పెంచల్ దాస్

పల్లవి:
ఏ కోనలో కూడినాడో
ఏ కొమ్మలో చేరినాడో..
ఏ ఊరికో.. ఏ వాడికో
ఏడ బొయ్యాడో..

రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో..
సింతలేని లోకం.. సూడబోయి నాడో..

చరణం: 
చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి
గరికపచ్చా.. నేలపైనే..
సీమ కచ్చా.. వేటు వేస్తే..
రాలిపోయినాడో..
రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

కట్టెలే సుట్టాలు.. కాదు మన తల్లి
అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట..
కాలవగట్టూనా.. నీ కాళ్లు కాలంగా..

కాకి శోకమున్ బోతిమే..
కాకి శోకమున్ బోతిమే..

నరక స్వర్గా అవధి దాటి..
వెన్నామాపులు దాటీ..
విధియందు రారానీ..
తదియందు రారానీ..
నట్టింట ఇస్తర్లు..
నాణ్యముగా పరిపించీ..
నీ వారు చింతా పొయ్యేరూ..
నీ వారు దు:ఖ పొయ్యేరూ..

మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు
రెక్కలు తొడిగేదెవరని..
ఇంకని చెపలు పారే శోకం..
తూకం వేసేదెవరని..
కత్తుల అంచున.. ఎండిన నెత్తురు
కడిగే అత్తరు ఎక్కడని..
ఊపిరాడనీ.. గుండెకు గాలిని..
కబలం ఇచ్చేదెవ్వరనీ..
చుక్కేలేని నింగీ..
ప్రశ్నించిందా... వంగీ..

ఏ కోనల్లో.. కూలినాడో..
ఏ కొమ్మల్లో చేరినాడో..
రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

హరోం.. హరీ.. నీ కుమారులిచ్చిన
భక్ష భోజనములు..

రాగికానులు.. ఇరం విడిచి పరం జేరిన
వారి పెద్దలకు.. పేరంటాలకు..
మోక్షాదిఫలము శుభోజయము..
పద్నాలుగు తరాల వారికి
మోక్షాదిఫలము కల్గును
శుభోజయము.. శుభోజయము.





రెడ్డి ఇక్కడ సూడు పాట సాహిత్యం

 
చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: మోహన భోగరాజ్

రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలవా జోడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు కురసా రైకల తాడు
సరసాకు పిలిసి కట్టు పసిడి పుస్తెల తాడు

వేట కత్తికి మీసం పెడితే నాకు లాగే ఉంటాది
పూల బోతికి ఓని చుడితే నీకు మల్లె ఉంటాది
నువ్వు నేను జోడి కడితే సీమకె సెగ పుడతాది
ఆల్రెడీ నేన్ రెడీ అంటానే నా తాకిడి
మోజుగా మోతగా కూసిందే కోడి
షర్ట్ గుండి ఫట్ అనేలా చేసేయ్ హడావిడి

ఏటా వాలు సూపుల్తోన గెలకమాకె సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క ఎలగని సాంబ్రాణి కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలవా జోడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు

రాజా సారంగుడంటే అచ్చంగా వీడే
రంగారా సింగమల్లే దూకాడు చూడే
దూకాడు చూడే

అందమంతా గంధకమై రాజేస్తాందే  రాపిడి
హే సూరేకారం సూపులతో ముట్టిస్తా వేడి
సిసలైన బొండు మల్లె పూల రాయలోరి బండి
పెటాకు పచ్చ జెండా చూసి ఆనకట్ట గండి

ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది
టాప్ గా ఉన్న కదా చెప్పుకో ఇబ్బంది
నుదుట బొట్టున చెమట బొట్టై వేసేయ్ తడి ముడి

ఏటా వాలు సూపుల్తోనే గెలకమాక్ సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క ఎలగని సాంబ్రాణి కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలవా జోడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు కురసా రైకల తాడు
సరసాకు పిలిసి కట్టు పసిడి పుస్తెల తాడు



ఊరికి ఉత్తరాన పాట సాహిత్యం

 
చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: మోహన భోగరాజ్

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ

నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి..
గుండెలవిసి పోయె గదమ్మా 

సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మా
సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి...
సింధూరం బొట్టు పెట్టమ్మా 

కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కొలిసీ నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి...
కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా

నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా




ఊరికి ఉత్తరాన పాట సాహిత్యం

 
చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: పెంచల్ దాస్

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ

నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి..
గుండెలవిసి పోయె గదమ్మా 

సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మా
సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి...
సింధూరం బొట్టు పెట్టమ్మా 

కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కొలిసీ నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి...
కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా

నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా

Palli Balakrishna Saturday, December 1, 2018



చిత్రం: అ. ఆ.. (2016)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: నితిన్ , సమంత
దర్శకత్వం: త్రివిక్రమ శ్రీనివాస్
నిర్మాత: యస్.రాధా కృష్ణ
విడుదల తేది: 02.06.2016



Songs List:



యయా... ముగ్గులూ ముంగిళ్ళూ పాట సాహిత్యం

 
చిత్రం: అ. ఆ..(2016)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అభయ్ జోద్పుర్కర్, అంజనా సౌమ్య, సాయిశివాని, చిత్ర

హే..రామ్ములగా బుగ్గలవాడా
బురుజుగోడ నిబ్బరాలా కండలవాడా
రాజాంపేటా లాకుల కాడా
కలుసుకుంట కాసులపేరు పట్టకరారా
అల్లాబక్షు అత్తరు దెచ్చా
కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చా
రంగమెల్లే రైలుబండి రయ్యిమంది
పెట్టేబేడా పట్టుకొచ్చా

నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం
వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం
మౌనంగా... ధ్యానంలో ఉందీ.. మాగాణం..

చిట్టి వడ్రంగి పిట్టల టిక్కూ టిక్కూ
కొమ్మ రెమ్మల్లో మైనాల కుక్కూ కుక్కూ
ఇదిపల్లెకి తెలిసిన మెలొడీయా...
యా... య్యా... యా... య్యా...
యా...య్యా... యా... య్యా...

యయా... ముగ్గులూ ముంగిళ్ళూ
యయా... ప్రేమలూ నట్టిళ్ళూ
యయా... చూడగా చాలేనా రెండే కళ్ళు
యయా... పువ్వులూ పుప్పొళ్ళూ
యయా... పంటలూ నూర్పిళ్లూ
యయా... పండగలు తిరణాళ్లూ
ఈ పచ్చిగాలి జోలలూ నచ్చనోళ్లు లేరట

కళ్ళాపి చల్లాలి రాయేందె రంగమ్మా
కవ్వాలు తిప్పాలి కానియ్యె గంగమ్మా
కావిళ్లు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మా
పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా
యాయా... యాయా... యాయా... యాయా...
యాయా... యాయా... యాయా... యాయా...

కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా
కోపాల గోపాల అలకేలరా
చీకటి వేళకి నీ పంచన
చేరని మనసిది శమించునా
వెన్నని మన్నని దొసములెన్నను
చెల్లాట చాలించరా
అల్లరి చేష్టల దండించనా
అక్కున జేరిచి లాలించనా
నెమ్మది చెదిరిన అమ్మను
చూడగ బిరాన రారా దొరా
కోపాల గోపాల కోపాల గోపాల
కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా





రంగ్ దే.. పాట సాహిత్యం

 
చిత్రం: అ...ఆ...(2016)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాహుల్ నంబియర్, రమ్యా బెహ్రా , సాయి శివాణి

నలుపు తెలుపున కాటుక కళ్ళకు..
రంగు రంగు కలనిచ్చిందెవ్వరు..
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ..
నిదుర మరచినా రెప్పల జంటకు..
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు..
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ..

నా వసంతం నీకు సొంతం..
నా సమస్తం నీదే కదా నేస్తం..
నా ప్రపంచం పొడవు మొత్తం..
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం..

రంగ్ దే రే రంగ్ దే రే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే..
రంగ్ దే రే రంగ్ దే రే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే ..
రంగ్ దే రే రంగ్ దే రే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే..

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే..
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి..
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ..

మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి..
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ..

నా వసంతం నీకు సొంతం..
నా సమస్తం నీదే కదా నేస్తం..
నా ప్రపంచం పొడవు మొత్తం..
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం...

నీలిమేఘం నెమలి పింఛం..
రెంటికీ లేదు ఏమంత దూరం..
ఒకటి హృదయం ఒకటి ప్రాణం..
వాటినేనాడు విడదీయలేం..

హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే ...

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే..
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి..
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ..
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి..
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ..

రామ బాణం సీత ప్రాణం..
జన్మలెన్నైనా నీతో ప్రయాణం ..
రాధ ప్రాయం మురళి గేయం..

జంట నువ్వుంటే బృందావనం ..

హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే..
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే ...

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే..
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి..
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ..
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి..
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ..



అనసూయ కోసం పాట సాహిత్యం

 
చిత్రం: అ. ఆ.. (2016)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: కార్తిక్

మీరేమో బంగారు ఆల్మోస్టిది అమ్మోరు
అయ్యబాబో ఏంటి సారూ
ఆదాయం జస్ట్ ఆరు ఖర్చేమో పదహారు
మెంటేనెన్సు కష్టం బ్రదరూ

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ
రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ

అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా
ఎదిగే ఏ దేశం తననే పోషించడమీజీనా
శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా
మన పరువుకోసం మొయ్యాలిక నిండా మునిగైన
హా లేదేంటి నీకు కనికరమా
నాలాంటివాడు మోయతరమా
నువ్వేసే బిల్లు పిడుగమ్మా
కాదమ్మా వల్ల కాదమ్మా
హే నీకేమో నేను హీరోషిమా
నీ దాడి తట్టుకొలేనమ్మా
ఇంత పగ అవసరమా
చుక్కల్నే చూపించకమ్మా

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ
రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ

ఔటింగని క్యాంపింగని ప్రతిరోజూ ఎదో న్యూసెన్సు
ఏవెరెస్టుకి యమ రెస్టుకి ఈ పిల్లే గా ఒక రిఫెరన్స్
అనసూయ కి అనకొండ కి రెండేగా లెటర్స్ డిఫరెన్స్
ఏ... నరులకి తెలియని నరకపు తలుపుకి
తాళం ఇదే ఇదే ఇదే ఇదే ఇదే
ఎద్దే ఎక్కిన యముడికి ఏజెంట్ ఇదే ఇదే ఇదే ఇదే ఇదే ఇదే
కరెంట్ కూడా కొట్టనంత షాక్ నువ్వు
ఓ రాక్షసి సునామికే బినామి నువ్వు
మా ఊరికే మూడో ప్రపంచ వార్ నువ్వు
వేదిస్తా... వెందుకే

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ
రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ





మమ్మీ రిటర్న్స్ పాట సాహిత్యం

 
చిత్రం: అ...ఆ...(2016)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రావణభార్గవి

అ ఆ ల్లోనే అం ఆః లా... అర్ధరాత్రి మోగే అల్లారంలా
ఆరంభంలో ఇంటర్వెల్లా ఆనందంలో అంతరాయమా
అమ్మంటేనే ఆటంబాంబా అయ్యో రామా పేలుతోందా పిల్లా
హెయిరుపిన్నే ముల్లయ్యిందా చిల్లడిందా చిట్టితలా
జెయింట్ వీలు ఎద గిర గిర గిర గిర గుండెలోన సుడి తిరిగిందే
ఉన్నపాటుగా నర నర నరమున తౌజండ్ వాట్స్ పవరేదో పాకిందే

హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  ఓ గాడ్ వాట్ టు డు
హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  పద పద పరుగిడు

హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  ఓ గాడ్ వాట్ టు డు
హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  పద పద పరుగిడు

కాలమే కదలదే తరిమినా మొండికేస్తోందే
దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే
ఇంతలోనె ఎంత తేడా రైజయ్యిందే గుండెదడ
అమ్మ ఆదిశక్తి నీడా... ఆ... భయపెడుతోందే
స్పీడో మీటర్ ముల్లు సర సర సర సర రేంజు దాటి రెచ్చిపోతోందే
టాపులేచే టెన్షన్ రయ్యి రయ్యి రయ్యిమని
యాక్సిలరేటర్ పైనే ఎక్కి కూర్చుందే

హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  ఓ గాడ్ వాట్ టు డు
హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  పద పద పరుగిడు

హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  ఓ గాడ్ వాట్ టు డు
హే... మమ్మీ రిటర్న్స్  హో... మమ్మీ రిటర్న్స్
యో...మమ్మీ రిటర్న్స్  పద పద పరుగిడు




ఎళ్ళిపోకె శ్యామలా పాట సాహిత్యం

 
చిత్రం: అ...ఆ...(2016)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్

నువ్వు పక్కనుంటే బాగుంటాదే...
నీ పక్కనుంటే బాగుంటాదే...
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట వెళ్ళిపోతే
ఎక్కడో కలుక్కుమంటాదే

ఎళ్ళిపోకె శ్యామలా ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సలా ఊపిరాడదంట లోపలా ఎళ్ళిపోకె శ్యామలా
ఎక్కి ఎక్కి ఏడవ లేదే... ఎదవ మగ పుటకా
గుండె పెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక
ఎళ్ళిపోకె శ్యామలా హే ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సల ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకె శ్యామలా

హ్మ్ నరం లేని నాలిక నిన్ను ఎలిపొమ్మని పంపిందాయె
రథం లేని గుర్రం లాగా బతుకే చతికిలబడిపోయే
నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే
స్విచ్చేస్తే ఎలిగేదా ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లే నీ ప్రేమె ఉన్నదే
ప్రాణాన్నే పటకారేసీ పట్టేసీ నీతో పట్టుకు పోమాకే
గెలిచేసి నన్నొదిలేసి సీకటైన కోటలాగా సెయ్యమాకే
నువ్ ఎళ్ళిపోకే శ్యామలా నువ్ ఎళ్ళమాకె శ్యామలా
ఏమీ బాగాలేదే లోపలా నువ్ ఎళ్ళిపోకె ఎళ్ళిపోకె
ఎళ్ళిపోకే శ్యామలా...

మనసుకంటుకున్నదో మల్లెపూల సెంటు మరక
మరిచిపోదమంటె గుర్తుకొస్త ఉందా నిప్పు సురక
ఏటి సెయ్యనోరి సైదులు
గుండెలోన గుచ్చిపోయినాది సూదులు
నానేటి సెయ్యనోరి సైదులు
గుండెల్లోన గుచ్చిపోయినాది సూదులు
ఎళ్ళిపోకె శ్యామలా అట్ట ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సలా ఊపిరాడదంట లోపలా

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default