Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. A. Rajkumar"
Leela Mahal Center (2004)



చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, సదా 
దర్శకత్వం: దేవి ప్రసాద్ 
నిర్మాత: సి. హెచ్. యస్. మోహన్ 
విడుదల తేది: 04.12.2004



Songs List:



బాలమణమ్మో బాలమణమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శంకర్ మహదేవన్, మాలతి

బాలమణమ్మో బాలమణమ్మో
లీలామహల్ వెనుక నీతో చాలా పనమ్మో



చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి. బాలు 

చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా 
తోటకెల్లావా పండు తెచ్చావా
ఉయ్యాలా జంపాల నిన్నెవరు ఊపాలా



ఆ తుమ్మెద రెక్కలనడుగు పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: E.S. మూర్తి 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...
చలి వెచ్చని కౌగిలినడుగు
నులి వెచ్చని ఆశలనడుగు
ఇంకెన్నల్లో ఈ దూరం అన్నవి...
నీ ఒకే చూపు తాకి, నా ఎదే తెలిపోయి
ఏటో వెళ్ళేనే ప్రియతమా...
ఇటె వచ్చేనా ప్రాణమా

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి....

చరణం: 1
ఏదారుండి ఎదలో నువ్వు ప్రేమ జల్లువై కురిసావు
ఎలా శిలను ప్రేమించావు చెలియా చెప్పవా
గులాబీల ముల్లును చూసి అదేదాని గుణమనుకుంటే
అమృతాలు పంచె మనసు మళ్ళీ దొరుకునా
ఇలా పూల తోటను విడిచీ రాళ్లదారినీ
ఎలా చేరగలవో నడిచీ ప్రేమ గూటిని
ఒకే పిలుపు చాలనులే ప్రాణాలే పోయిన నా మనసే ఆగునా
ప్రాణాలే పోయినా  నా మనసే ఆగునా

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...

చరణం: 2
మనసులేని కాలం మనకు విధించింది ఈ ఎడబాటు
నవ్వుతూనే చూపించాలి లోకం తీరుని
రమ్మంటేనే పండగ రాదు ప్రతి రాత్రి పున్నమి కాదు
వలె వేసి రప్పించాలి వాసంతాలని
ఒకే మాట ఒకటే గమ్యం ప్రేమ జంటకీ
ప్రపంచాన్ని ఓడించాలి గెలుపు భాదనీ
విధే వచ్చి తలవంచాలి ప్రేమ నిజమనీ.. నీకెదురే లేదని
ప్రేమే నిజమని, నీకెదురే లేదని

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...
చలి వెచ్చని కౌగిలినడుగు
నులి వెచ్చని ఆశలనడుగు
ఇంకెన్నాల్లో ఈ దూరం అన్నవి....
నీ ఒకే చూపు తాకీ ఎదేతేలిపోయి
ఏటో వెళ్ళేనే ప్రియతమా...
ఇటె వచ్చేనా ప్రాణమా....





ఓ హంపీ బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సాయి శ్రీ హర్ష 
గానం: హరిహరన్, సుజాత 

ఓ హంపీ బొమ్మ ఎల్లోర గుమ్మా కల్లార్పలేనమ్మా



చిట్టీ చిలకమ్మా (Bit) పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: దీపిక 

చిట్టీ చిలకమ్మా (Bit)



సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: కె.యస్.చిత్ర 

సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ
ఆనందం పొంగాలి ఆడుతూ పాడుతూ 




పరమ పావని పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: కల్పన 

పరమ పావని 

Palli Balakrishna Tuesday, August 2, 2022
Kalasi Naduddam (2001)





చిత్రం: కలిసి నడుద్దాం (2001)
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 29.06.2001



Songs List:



ఒక్క సారి క్రిందికి రా పాట సాహిత్యం

 
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: హరిహరన్, సుజాత 

ఒక్క సారి క్రిందికి రా 




కాంచారే కాంచారే పాట సాహిత్యం

 
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: హరిహరన్, సుజాత 

కాంచారే కాంచారే




హల్లో లేడి.. సూపర్ జోడి పాట సాహిత్యం

 
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: శ్రీరాం, సునీత, కృష్ణరాజు, సుప్రజా 

హల్లో లేడి.. సూపర్ జోడి 




యేనాటి సరసమిది.. పాట సాహిత్యం

 
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

యేనాటి సరసమిది..ఎన్నాళ్ళ సమరమిది
కలహాలు విరహాలేనా కాపురం?
ఓనాటి ఇష్ట సఖి..ఈనాటి కష్ట సుఖి
పంతాలు పట్టింప్పులకా జీవితం?
పురుషా పురుషా ఆడది అలుసా?
అభిమానాం నీ సొత్తా?
అవమానాం తన వంతా?

ఆడది మనిషే కాదా?
ఆమెది మనసేగా
సమ భావం నీకుంటే...ఆమె నీ మనిషేగా
ఏ ఎండమావులలో ఒంటరిగానే ఎదురీత
నిన్నడిగి రాసాడా బ్రహ్మ నీ తలరత
తరిగెనేమో సంస్కారం
తిరగబడెను సంసారం
శయనేషు రంభలట, బోజ్యేషు మాతలట
కరనేషు మంత్రులు మాత్రం కారట

నింగిలో తారల కోసం శ్రీవారి పోరాటం
ఇంటిలో వెన్నెల కోసం శ్రీమతికి ఆరాటం
ఏ సవాలు ఎదురైనా నీ శక్తికదే ఉరిపిరి రాయి
ఓనమాలు దిద్దుకు చూడు ఒద్దికలో ఉన్నది హాయి
చెప్పలేని అనురాగాం
చెయ్యమంటే ఈ త్యాగం
హక్కున్న శ్రీమతిగా..?  పార్వతిగా
కార్యేషు దాసివి ఇకపై కావుగా



జిల్ జిల్ జిల్ జిల్ పాట సాహిత్యం

 
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , స్వర్ణలత 

జిల్ జిల్ జిల్ జిల్ 



అటు ఇటు చూడకే దోర వయసా పాట సాహిత్యం

 
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అటు ఇటు చూడకే దోర వయసా


Palli Balakrishna Friday, July 23, 2021
Deevinchandi (2001)
>




చిత్రం: దీవించండి (2001)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: శ్రీకాంత్, రాశి, మాళవిక
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 23.03.2001



Songs List:



ఓరి బ్రహ్మచారి పాట సాహిత్యం

 
చిత్రం: దీవించండి (2001)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: 
గానం: సుక్విందర్ సింగ్ , ఎస్. ఎ. రాజ్ కుమార్


ఓరి బ్రహ్మచారి




పరువాల పావురమా పాట సాహిత్యం

 
చిత్రం: దీవించండి (2001)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు,చిత్ర

పరువాల పావురమా 
పైటున్న పసితనమా
వందేళ్ళ నా వరమా 
అందాల నందనమా
నీ నవ్వులే నావెన్నెలా
నా ఊపిరే నీ ఊయలా

ఏనోము నోచినదమ్మా 
నీ ప్రేమ పొందిన జన్మా
నీ నీడగా నడిపించుమా 
నా ప్రాణమై మురిపించుమా

పరువాల పావురమా 
పైటున్న పసితనమా
నీ నవ్వులే నావెన్నెలా

నువ్వొచాకనే తొలిసారిగా
ఉగాదొచ్చి వాలింది నా వాకిటా
మనని చూడగా కనువిందుగా
మానింట్లోనె ఉంటుంది ప్రతీ పండుగా
ఏదో మాయగా ఉంది ఈ వింత సంతోషం
ఎంతో తియ్యగా ఉన్నది ఈ కొత్త సంసారం
ఏకాకి యాత్రలో ఏకైక బంధమా

నీకోసమే నేనున్నదీ
నా జీవితం నీదైనదీ

వందేళ్ళ నా వరమా 
అందాల నందనమా
నా ఊపిరే నీ ఊయలా

నిజంగా ఇదీ కలకాదుగా
కలైపోయి ఏనాడు వెళిపోదుగా
ఇలా నువ్వు నా జతచేరగా
కలే నిజమైందేమో అనిపించదా
మెడలో తాళిగా వాలెగా కోటి పుణ్యలు
వడిలో పాపగా ఉండిపో నిండు నూరేళ్ళు
మా అమ్మ పంపినా స్వర్గల దీవెనా

నీ రుపమై కనిపించెనా
నా కుంకుమై కరునించెనా

పరువాల పావురమా 
పైటున్న పసితనమా
వందేళ్ళ నా వరమా 
అందాల నందనమా
నీ నవ్వులే నావెన్నెలా 
నా ఊపిరే నీ ఊయలా

ఏనోము నోచినదమ్మా 
నీ ప్రేమ పొందిన జన్మా
నీ నీడగా నడిపించుమా
నా ప్రాణమై మురిపించుమా




సంధ్యారాగంలో పాట సాహిత్యం

 
చిత్రం: దీవించండి (2001)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: 
గానం: హరిణి

సంధ్యారాగంలో





వెలుగులు నింపే పాట సాహిత్యం

 
చిత్రం: దీవించండి (2001)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: 
గానం: రాజేష్ 

వెలుగులు నింపే



చిలకమ్మా చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దీవించండి (2001)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, మహలక్ష్మి ఐయ్యర్

చిలకమ్మా చిలకమ్మా 




అమ్మమ్మో చలిగా ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: దీవించండి (2001)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: 
గానం: సుఖ్విందర్ సింగ్ , మహలక్ష్మి ఐయ్యర్

అమ్మమ్మో చలిగా ఉంది 

Palli Balakrishna Tuesday, July 20, 2021
Nee Premakai (2002)




చిత్రం: నీ ప్రేమకై (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: వినీత్, అబ్బాస్, లయ, సోనియా అగర్వాల్
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: దగ్గుబాటి రామానాయుడు
విడుదల తేది: 01.03.2002



Songs List:



వెండి మబ్బుల పల్లకిలో పాట సాహిత్యం

 
చిత్రం: నీ ప్రేమకై (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సామవేదం షణ్ముక శర్మ 
గానం: రాజేష్, చిత్ర 

వెండి మబ్బుల పల్లకిలో 




కలలు కన్నా నీకై పాట సాహిత్యం

 
చిత్రం: నీ ప్రేమకై (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: కులశేఖర్
గానం: సంజయ్, శ్రీలేఖ పార్ధసారధి

కలలు కన్నా నీకై 




ఓ..ప్రేమా..స్వాగతం... పాట సాహిత్యం

 
చిత్రం: నీ ప్రేమకై (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రాజేష్, చిత్ర 

పల్లవి:
ఓ..ప్రేమా..స్వాగతం...నీతోనే జీవితం..
ఓ..ప్రేమా..స్వాగతం...నీతోనే జీవితం..

అతిథి లాగా వచ్చేసావూ...
మనసు నాకు ఇచ్చేసావూ..
ఇలా..నన్ను వీడకా..వుంటేచాలూ..తోడుగా...
నన్నే..నీవు చేరగ...నింగినేల వేడుకా.....

ఓ..ప్రేమా.....

చరణం: 1
ఇన్నాళ్ళుగా..లేదేమరీ...ఈరోజే ఏమైనదీ...
నా గుండేపై నీ సంతకం ఎలాగా..చేరినదీ...
ఇంతేమరీ నీవన్నదీ...వెన్నెల్లో గోదావరీ..

అంతేమరీ ప్రేమన్నదీ ..చిత్రాలే చేసినదీ..
నీ చూపే తాకెనుగా..వెలుగుల
తొలి పున్నమిలా..
నీ చూపే తాకెనుగా..వెలుగుల తొలి పున్నమిలా
పల్లవించు ప్రా..యం అందించమంది సా..యం

ఓ..ప్రేమా స్వాగతం...
మది నీకే అంకితం...

చరణం: 2
నీ రాకనే కోరందిలే..నూరేళ్ళ నా జీవితం..
ఊరించక అందంచవా..లేలేత నీ అధరం..
వాసంతమే..నాసొంతమా..అంటుంది నీ పరిచయం

నీద్యాసలో..వున్నానుగా
నీతలపే అతి మదురం...
జేగంటే మోగెనుగా..శుభమస్తను దీవెనగా
జేగంటే మోగెనుగా..శుభమస్తను దీవెనగా
హాయీ...రాగమేదో..మనసంత నిండిపోగా..

ఓ..ప్రేమా స్వాగతం...
మది నీకే అంకితం...

ఓ..ప్రేమా..స్వాగతం...నీతోనే జీవితం..

అతిథి లాగా వచ్చేసావూ...

మనసు నాకు ఇచ్చేసావూ..
ఇలా..నన్ను వీడకా..వుంటేచాలూ..తోడుగా...
నన్నే..నీవు చేరగ...నింగినేల వేడుకా.....

ఓ..ప్రేమా

ఓ..ప్రేమా
ఓ..ప్రేమా

ఓ..ప్రేమా




కోటి తారలా పాట సాహిత్యం

 
చిత్రం: నీ ప్రేమకై (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: కులశేఖర్
గానం: రాజేష్, ఉష 

కోటి తారలా



మనసన్నదే లేదు పాట సాహిత్యం

 
చిత్రం: నీ ప్రేమకై (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: కలువ కృష్ణ సాయి 
గానం: యస్.పి.బాలు 

మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు
పైనుండి పాలించు ఓ దైవమా
విధి రాత ఎదకోత నీ నైజమా
ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మ
ఇది నీకు తుదిలేని చదరంగమా

నీ ప్రాణమే చెలిగా భావించి నీవు
నీ గుండెలో తనను కొలువుంచినావు

ఆ ప్రేమనే తెలుసుకోలేని తాను
ఎంచేతనో తుదకు బలి చేసే నిన్ను
లోకాన నిజమైన ప్రేమన్నది
చూసేందుకే జాడ కరువైనది
నీ ప్రేమ నిజమైతే నెగ్గేది నీవే
ఈ మాట ఇకపైన నమ్మాలి నువ్వే
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు

స్నేహానికే విలువ మారింది నేడు
నీ మంచికి జరిగే ఎనలేని కీడు

ద్రోహానికే కలదు లోకాన పేరు
స్వార్థానిదే గెలుపు ఇది నేటి తీరు
కన్నీట బరువైన నీ కళ్ళతో
ఈ మౌన పోరాటమెన్నాళ్ళులే
నీదన్నదేనాడు చేజారిపోదు
లేదంటే అది నీకు దక్కేది కాదు
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు
పైనుండి పాలించు ఓ దైవమా
విధి రాత ఎదకోత నీ నైజమా
ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మ
ఇది నీకు తుదిలేని చదరంగమా



మందాకినీ మందాకిని పాట సాహిత్యం

 
చిత్రం: నీ ప్రేమకై (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భువనచంద్ర 
గానం: రాజేష్, చిత్ర 

మందాకినీ మందాకిని

Palli Balakrishna Saturday, June 26, 2021
Gorintaku (2008)


చిత్రం: గోరింటాకు (2008)
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
నటీనటులు: రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరాజాస్మిన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
విడుదల తేది: 2008

Palli Balakrishna Saturday, March 16, 2019
Preminche Manasu (1999)


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
నటీనటులు: వడ్డే నవీన్, కీర్తి రెడ్డి, రవితేజ
దర్శకత్వం: ఆదినారాయణ
నిర్మాత:
విడుదల తేది: 17.09.1999



ఎవరే చెలి నువ్వెవరే



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో


మాలోని  మాట పాట ఆట



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర


నీకు తెలుసు కథ



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్


నీ చూపు చలమ్మ



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం:


మై డియర్ మై డియర్



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం:


ముంబై మినుకు బంగారు షేక్




Palli Balakrishna Wednesday, February 13, 2019
Rayudu (1998)


చిత్రం: రాయుడు (1998)
సంగీతం:  ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం:
గానం: కె.జె. యేసుదాస్
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య (ప్రత్యేక పాత్రలో), రచన, ప్రత్యూష
దర్శకత్వం: రవిరాజ పినిశెట్టి
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 1998

ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
కళక్కురా జీవితాన హాయనీ
లోకంలో బంధాలే మాయనీ

ఊయలలో ఊపింది ఉగిసలాడే బ్రతుకనీ
వీపున జో కొట్టింది ముందు చూపు ఉండాలనీ
చందమామ వస్తాడని తహ తహలే రేపింది
రాయిలాంటి సంగంలో గుండె గట్టి పరచాలని
అమ్మ వేదం అర్థమాయే
ఉన్న బ్రమలే తొలగి పోయే

ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట

లాలపోసి మసి బొగ్గును నుదిట మీద పూసిందీ
పాడు దిస్టి నీ పై పడుతుందని కాదు
చల్లనైన తల్లిలోన తత్వమొకటి దాగుంది
మనిషికింక తుదిమజిలీ మరుభూమి మసియేనని
వచ్చి పోయే... జన్మలైన
చచ్చి పోనీ... ఆశ నాది

ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
కొల్కిరా జీవితాన హాయనీ
లోకంలో బంధాలే మాయనీ


Palli Balakrishna Tuesday, February 12, 2019

Most Recent

Default